
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఊర్రూతలూగించిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా'. పుష్ప చిత్రంలోని ఈ సాంగ్‌లో హీరోయిన్ సమంత తన డ్యాన్స్, గ్లామర్‌తో అదరగొట్టేసింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప-2లోనూ ఇలాంటి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ తీసుకొచ్చారు. కిస్సిక్ పేరుతో వచ్చిన ఐటమ్ సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు.
తాజాగా ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను పుష్ప టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. 'దెబ్బలు పడతాయిరో రాజా' అంటూ ఐటమ్ సాంగ్‌తో శ్రీలీల అలరించింది. కాగా.. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. సుభాషిణి ఆలపించారు.
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్పరాజ్..
ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. రిలీజ్ రోజున మొదలైన వసూళ్లు ఊచకోత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కలెక్షన్స్ పరంగా ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రెండు వేల కోట్ల మార్కును చేరుకునే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment