ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది.
అయితే కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్‌గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.
(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)
శ్రీలీల షాకింగ్ నిర్ణయం..
అయితే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్‌హుడ్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కావడన్‌నే పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.
అయితే తనపై ఐటమ్ సాంగ్ హీరోయిన్‌గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఏదేమైనా కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment