shocking decission
-
పుష్ప-2 ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్.. శ్రీలీల షాకింగ్ డిసిషన్!
ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది.అయితే కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)శ్రీలీల షాకింగ్ నిర్ణయం..అయితే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కావడన్నే పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.అయితే తనపై ఐటమ్ సాంగ్ హీరోయిన్గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఏదేమైనా కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. -
పాకిస్తాన్ కు షాక్...పంతం నెగ్గించుకున్న బీసీసీఐ
-
బెన్ స్టోక్స్ మరో షాకింగ్ నిర్ణయం.. తలపట్టుకుంటున్న CSK
-
వివేక్ దారెటు..?
సాక్షి, భూపాలపల్లి: టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్‌కు దక్కకపోవడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు ఆయనకే సీటు వరిస్తుందని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అభ్యర్థి పేరు మారడం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలోని కాటారం, మహదేవాపూర్, మల్హర్, పలిమెల, మహాముత్తారం మండలాలు పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. కాగా ఇన్నాళ్లుగా వివేక్‌కే సీటు పక్కా అనుకున్న వారికి చివరిలో షాక్ తగిలింది. వివేక్‌ను కాదని కొత్తగా వచ్చిన బోర్లకుంట వెంకటేష్ నేతకు టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లాలో కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వివేక్ దారి ఎటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దశాబ్దాలుగా చుట్టూ పక్కల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎవరుండాలని నిర్ణయించిన వెంకటస్వామి కుటుంబానికి ప్రస్తుతం టికెట్ రాలేదనే వార్తలు వాట్సాప్, ఫేస్బుక్లో చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే కొంప ముంచాయా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే వివేక్ టికెట్ దక్కకపోవడానికి కారణంగా తెలుస్తోంది. వివేక్ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని పలువురు ఎమ్మెల్యేలు గతంలో బహిరంగంగానే విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ చెన్నూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. తన అన్న గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మంచిర్యాల, చెన్నూ ర్, బెల్లంపల్లి, ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శించినట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచనల మేరకే టీఆర్ఎస్ పెద్దలు వివేక్‌కు పెద్దపల్లి ఎంపీ సీటు నిరాకరించినట్లు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా వచ్చాడు.. అలా పట్టాడు.. కొత్తగా పార్టీలో చేరిన బోర్లకుంట వెంకటేష్ నేతకు పెద్దపల్లి టికెట్ వరించింది. వెంకటేష్ నేత గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. జిల్లాను ఆనుకుని ఉన్న చెన్నూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచాడు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున బాల్క సుమన్ పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక దశలో బాల్క సుమన్‌కు వెంకటేష్ నేత గట్టిపోటీని ఇచ్చారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసిన వీరిద్దరు ప్రస్తుతం టీఆర్ఎస్ గెలుపు కోసం కలిసి పని చేస్తున్నారు. ఇటీవలే స్వయంగా బాల్క సుమన్ దగ్గర ఉండి వెంకటేష్ నేతను టీఆర్ఎస్లో చేర్పించారు. దీంతో చివరి నిమిషం దాకా వివేక్‌కే అనుకున్న టికెట్ వెంకటేష్ నేత తలుపు తట్టింది. కాగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న వివేక్ అనుకూలవర్గం టీఆర్ఎస్కు సహకరిస్తుందా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. త్వరలో బీజేపీలో వివేక్ చేరుతారంటూ జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి. -
నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు!
కుటుంబ సభ్యుల నమ్మకం * వారిపై భారత ప్రభుత్వం నిఘా.. నేతాజీ రహస్య ఫైళ్ల బహిర్గతంతో వెలుగులోకి * ఫైళ్లను బయటపెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. కోల్‌కతా: సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోలేదా? ఆ ఏడాది తర్వాత కొన్నేళ్లు ఆయన జీవించే ఉన్నాడా? ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ప్రశ్నలకు నేతాజీ రహస్య ఫైళ్లు అవుననే జవాబు చెబుతున్నాయి! నేతాజీ ‘అదృశ్యం’ తర్వాత ఆయన కుటుంబ సభ్యులపై భారత ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలూ నిజమేనంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన 64 రహస్య ఫైళ్లను శుక్రవారం బహిర్గతం చేసింది. వాటిలోని వివరాల ప్రకారం.. * నేతాజీ 1945 తర్వాత బతికే ఉన్నట్లు ఆయన అన్న శరత్చంద్ర బోస్ కొడుకు ఎస్కే బోస్ రాసిన ఉత్తరం ఓ ఫైల్లో ఉంది. ఆయన 1949 డిసెంబర్ 12న లండన్ నుంచి కోల్‌కతాలోని తన తండ్రికి రాసిన లేఖలో ఈమేరకు పేర్కొన్నారు. ‘నేతాజీ రేడియోలో మాట్లాడనున్నట్లు నాకు సమాచారం అందింది. ఆయన ఎప్పుడు మాట్లాడతారో పెకింగ్ రేడియో తెలిపింది. హాంకాంగ్ ఆఫీసు ఆ ప్రసంగాన్ని వినడానికి ప్రయత్నించింది కానీ, ఏమీ వినపడలేదు’ అని రాశారు. ప్రభుత్వ ఆదేశాలపై ఈ లేఖను కోల్‌కతా పోలీసు నిఘా వర్గాలు మధ్యలో అడ్డుకున్నాయి. * శరత్ బోస్‌కు స్విట్జర్లాండ్ పాత్రికేయురాలు లిల్లీ అబెగ్ 1949 నవంబర్ 1రాసిన లేఖలో ‘సుభాష్ పెకింగ్లో ఉన్నట్లు యునెటైడ్ ప్రెస్ తెలిపింది’ అని తెలిపారు. శరత్ అదే ఏడాది డిసెంబర్ 28న అబెగ్కు రాసిన లేఖలో.. ‘నా సోదరుడు(సుభాష్) జీవించే ఉన్నట్లు మీకు 1946లో జపాన్ వర్గాలు చెప్పి ఉంటే నా నమ్మకం మరింత బలపడినట్లే’ అని పేర్కొన్నారు. శరత్ రాసిన, అందుకున్న ఉత్తరాలను ఆయన నివసించిన కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్డు పోస్టాఫీసులో, నగరంలోని జనరల్ పోస్టాఫీసులో అడ్డుకుని తనిఖీ చేశారు. * ఫైళ్లను పరిశీలించిన నేతాజీ కుటుంబ సభ్యుడు చంద్రబోస్ తెలిపిన ప్రకారం.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన ఫైల్లో కవరు మాత్రమే ఉంది. అందులో పత్రాలు గల్లంతయ్యాయి.కేంద్రం దగ్గరి ఫైళ్లనూ బయటపెట్టాలి: మమత నేతాజీకి సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగం, ప్రభుత్వ లాకర్లలో ఉన్న 64 రహస్య ఫైళ్లను శుక్రవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీస్ మ్యూజియంలో బహిర్గతం చేశారు. 12,744 పేజీలున్న ఈ ఫైళ్లను నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో బయటపెట్టారు. ఫైళ్ల డీవీడీలను నగర పోలీస్ కమిషనర్ ఎస్కే పురకాయస్థ నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేశారు. నేతాజీకి సంబంధించి కేంద్ర వద్ద ఉన్న ఫైళ్లనూ బయటపెట్టాలని మమత డిమాండ్ చేశారు. నేతాజీ కుటుంబ సభ్యులూ ఈ డిమాండ్ చేశారు. ఫైళ్ల బహిర్గతం వల్ల విదేశాలతో సంబంధాలు దెబ్బతినవా అని మమతను విలేకర్లు అడగ్గా, మనది స్వతంత్ర దేశం అని అన్నారు. తర్వాత ట్విటర్లో స్పందిస్తూ.. ‘ఇది చారిత్రకదినం. కేంద్రం వద్ద కూడా 130 ఫైళ్లు ఉన్నాయి. వాటిని బయటపెడితే నిజం తెలుస్తుంది. నిజాన్ని తొక్కిపెట్టలేరు’ అని అన్నారు. ప్రస్తుతం మ్యూజియంలో ప్రదర్శిస్తున్న ఫైళ్లను సోమవారం ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. కాగా, తమ కుటుంబంపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నేతాజీ కుటుంబసభ్యుడు చంద్రబోస్ ప్రశ్నించారు. తన తండ్రి అమియ నాథ్ బోస్పై నిఘా కోసం 14 మంది అధికారులను నియమించినట్లు ఓ ఫైల్లో ఉందన్నారు. నేతాజీ సన్నిహితులై నకాంగ్రెస్ నేతలపై, నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ అధికారులపైనా నిఘా ఉంచారన్నారు. మరోపక్క.. తమ వద్ద ఉన్న ఫైళ్లను ఎప్పుడు బయటపెడతామో చెప్పడం కష్టమని కేంద్రం పేర్కొంది. -
'ఇంతకీ ఆ ఫైళ్లలో ఉన్నది రహస్యాలేనా?'
ఇప్పుడు జాతీయ మీడియాతో సహా పలు రాష్ట్రాల మీడియాలో ఒకటే చర్చ. సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన 64 ఫైళ్లలో ఎలాంటి వివరాలు ఉన్నాయో అని. ఈ ఫైళ్ల ద్వారా యావత్ భారత ప్రజానీకానికి నేతాజీ మరణంపై ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయా అంటే మరోసారి ఆలోచించుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ అలా నివృత్తే అయితే.. ఒక్క జాతీయ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా బెంగాల్ వాకిట్లో వచ్చివాలేది. ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగస్తులు, విద్యావేత్తల, విద్యార్థుల నుంచి స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రత్యక్షంగా తెలిసి ఉన్న సామాన్య ప్రజానీకం కూడా టీవీలకు అతుక్కుపోయి ఉండేంది. ఎందుకంటే నేతాజీ మరణం ఇప్పటికీ ఓ ఆసక్తి.. ఓ మలుపు.. ఓ సంచలనం.. అన్నింటికిమించి ప్రస్తుతం ఓ రహస్యం. అసలు నేతాజీ ఎలా మరణించారు? దేశంలో చాలా మందిని వేధించే ప్రశ్న ఇదే. దశాబ్దాలుగా ఇది రహస్యంగా ఉండిపోయింది. నేతాజీ మరణానికి ముందు, మరణం తర్వాత పరిణామాలు.... నేతాజీ కుటుంబీకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయనే అంశాలు దశాబ్దాలుగా నిగూఢ పత్రాల్లో దాగుండి పోయాయి. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టాలంటూ కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా చాలా మంది ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. విదేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనే సాకులతో నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టలేదు. ఇక జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఒకే రకంగా వ్యవహరించాయి. అధికారంలోకి రాకముందు బోస్ ఫైళ్లను బయటపెట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ.. పాలనా పగ్గాలు చేతబట్టగానే మాట మార్చింది. బీజేపీ కూడా మరోసారి అదే పల్లవిని ఎత్తుకుంది. ఈ నేపథ్యంలో... బోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలు బయటకు రావడం కష్టమేమో అనుకుంటున్న సమయంలో ఫైర్ బ్రాండ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫైళ్లను బహిర్గతం చేశారు. చెప్పినట్లుగానే కోల్‌కతాలో ఉన్న పోలీస్ మ్యూజియంలో నేతాజీ ఫైళ్లను అందుబాటులో ఉంచారు. అయితే, వాటికి నిజంగా రహస్యపత్రాలనే గుర్తింపు ఇవ్వొచ్చా అనే విషయం మాత్రం ఆ దస్త్రాల్లో ఏముందనే విషయం తెలిస్తే తప్ప నిర్ణయానికి రాలేము. ఇంతకీ నేతాజీ ఎప్పుడు మరణించారు..? తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలోనే బోస్ మరణించారనే వార్త నిజమేనా..? 1947 తర్వాత కూడా బోస్ బతికే ఉన్నారా? ఇవన్నీ ప్రజలను వేధించే ప్రశ్నలే. తైవాన్ ప్రమాదంలో బోస్ చనిపోలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారనే వాదన బలంగా ఉంది. 1964 వరకు బోస్ బతికే ఉన్నారని, మారువేషంలో సంచరిస్తూ దేశంలోకి అడుగుపెట్టారని బోస్ మద్ధతుదారులు చెప్పేమాట. ఈ వాదనకు అమెరికా రహస్య పత్రం బలం చేకూరుస్తోంది. జాతి పిత మహాత్మాగాంధీ చనిపోక ముందు కూడా బోస్ మరణ వార్తను నమ్మలేదు. బోస్ చనిపోయారని తాను అనుకోవడం లేదని, ఆయన బతికే ఉన్నారని చెప్పారు. తాను ప్రస్తుతం రష్యాలో ఉన్నానని, భారత్‌కు రావాలనుకుంటున్నానని ఓ లేఖను కూడా నాడు నెహ్రూకు బోస్ లేఖ రాశారని, ఆ లేఖ గురించి తెలిసిన తర్వాతే గాంధీ మహాత్ముడు ఆయన మరణించలేదని వ్యాఖ్యానించినట్లు కూడా తెలిసింది. ఇక, నేతాజీకి సంబంధించి1960లో అమెరికా నిఘా వర్గాలు తయారు చేసిన పత్రాల ప్రకారం....1964 ఫిబ్రవరిలో నేతాజీ భారత్‌లోకి అడుగ పెట్టారు. రష్యా నుంచి చైనా మీదుగా ప్రయాణించి భారత్ చేరుకున్నారని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. ఆ సమయానికి నేతాజీ 67 ఏళ్ల వయసు ఉంటుందని నిఘా వర్గాల అంచనా. ఈ వివరాలు కూడా బెంగాల్ సర్కారు విడుదల చేసిన పత్రాల్లో ఉంటాయని తెలుస్తోంది. నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉద్వేగంగా స్పందించారు. ఇది చారిత్రక ఘట్టమని ఆమె అభివర్ణించారు