Pushpa 2 Review
-
పుష్ప ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించే న్యూస్.. సంక్రాంతికి రీ లోడ్..!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.పుష్ప రీ లోడెడ్..తాజాగా పుష్ప-2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతోన్న పుష్ప-2 మూవీకి అదనంగా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయనున్నారు. ఈ అప్డేట్ వర్షన్ సంక్రాంతి కానుకగా ఈనెల 11 నుంచి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 రీ లోడెడ్ పేరుతో మరిన్నీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫైరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పొంగల్‌కు మరోసారి పుష్ప-2 లేటేస్ట్ వర్షన్ చూసి ఎంజాయ్ చేయండి.పుష్ప టీమ్ తన ట్వీట్లో రాస్తూ..' "పుష్ప2: ది రూల్’ 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో రీలోడెడ్ వెర్షన్ సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి మూవీ ప్రదర్శితమయ్యే థియేటర్స్‌లో చూడవచ్చు. వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా" అని పోస్ట్ చేశారు.ఆ రికార్డ్ కోసమేనా..అయితే ఇప్పటికే వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న పుష్ప-2 చిత్రానికి 20 నిమిషాల సీన్స్ అదనంగా జోడించడం చూస్తే ఆ క్రేజీ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ఈ ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధమైంది.ఇప్పటికే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది.తాజాగా మరో 20 నిమిషాల నిడివి గల సీన్స్ యాడ్స్ చేయడం దంగల్ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకే మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ రావడం ఈ సినిమాకు మరో ప్లస్ కానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 వసూళ్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పుష్పరాజ్.. దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.పెరగనున్న రన్‌టైమ్..ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్స్గా పుష్ప-2 రన్ టైమ్ మరింత పెరగనుంది. ఈ నిడివికి అదనంగా మరో 20 నిమిషాలతో కలిపి 3 గంటల 40 నిమిషాలకు పైగా ఉండనుంది. #Pushpa2TheRule RELOADED VERSION with 20 minutes of added footage will play in cinemas from 11th January 💥💥The WILDFIRE gets extra FIERY 🔥#Pushpa2Reloaded ❤️🔥#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp… pic.twitter.com/ek3gRsOaVi— Pushpa (@PushpaMovie) January 7, 2025 -
ఆస్కార్ కు ట్రై చేద్దాం అంటున్న అల్లు అర్జున్
-
అల్లు అర్జున్ కు ఎలాన్ మస్క్ స్పెషల్ గిఫ్ట్..
-
పుష్ప-2 ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్.. శ్రీలీల షాకింగ్ డిసిషన్!
ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది.అయితే కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)శ్రీలీల షాకింగ్ నిర్ణయం..అయితే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కావడన్నే పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.అయితే తనపై ఐటమ్ సాంగ్ హీరోయిన్గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఏదేమైనా కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. -
పుష్ప 2 దెబ్బకి అన్ని రికార్డ్స్ బ్రేక్
-
పుష్ప 2 రికార్డుల విధ్వంసం..
-
'అలాంటివి ఇక వద్దు'.. వారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వైరలవుతోన్న పుష్ప చిత్రంలోని ఫేక్ డైలాగ్స్‌పై చిత్రబృందం స్పందించింది. నెట్టింట వైరలవుతోన్న ఫేక్ డైలాగ్స్ సృష్టించేవారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పైరసీ వీడియోలు, సంబంధిత లింక్స్ కనిపిస్తే తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు మెయిల్‌తో పాటు ఫోన్ నంబర్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇలాంటి వాటిని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది.మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్లో ప్రస్తావిస్తూ..' ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోండి. లేకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.' అని పోస్ట్ చేశారు. దీంతో ఎవరైనా సరే ఫేక్ డైలాగ్స్, వీడియోస్ పోస్ట్ చేసి చిక్కుల్లో పడొద్దు. అలాంటి పైరసీ వీడియోలు కానీ, లింక్స్ కనిపిస్తే వెంటనే వివరాలు పంపితే దాన్ని అడ్డుకుంటామని పేర్కొంది. ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం…— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 Any unauthorized videos or spoilers of the movie #Pushpa2 can be reported immediately to the Anti Piracy Control Room @AntipiracySWe will bring them down immediately.claims@antipiracysolutions.orgWhatsapp: 8978650014— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 -
ట్వీట్ పెట్టినందుకు నాగబాబు గారికి థాంక్స్
-
ఎవరూ తీసుకోనంత పారితోషకం బన్నీ తీసుకున్నాడా..?
-
101 సంవత్సరాల భారత సినీ చరిత్రను బన్నీ తిరగరాశాడా..?
-
Pushpa 2: అల్లు అర్జున్ కి ఈసారి ఆస్కార్ పక్కా
-
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పుష్పరాజ్ పూనకం
-
పుష్ప 2 కలెక్షన్స్ సునామి.!
-
కనుమరుగవుతున్న గంగమ్మ జాతర పుష్పాతో మళ్లీ తెరపైకి
-
అప్పుడు ఫైర్.. ఇప్పుడు వైల్డ్ ఫైర్
-
పుష్పగాడి జాతర.. స్నేహితుడు శిల్పా రవిచంద్ర ప్రశంసలు
బాక్సాఫీస్ వద్ద 'పుష్ప'గాడి రూల్ ప్రారంభమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'పుష్ప2' సినిమా తాజాగా విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులోని యాక్షన్ సీన్స్‌తో పాటు డ్యాన్స్‌లలో ఆయన దుమ్మురేపారని సోషల్‌మీడియాలో మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అద్భుతమంటూ బన్నీని మెచ్చుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి పుష్ప సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: Pushpa 2 Movie Review బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?)హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప సినిమాను శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి చూశారు. అనంతరం ఆయన మీడియాతో ఇలా మాట్లాడారు. 'పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మరో స్థాయికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా పుష్ప నిలుస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా జాతర ఎపిసోడ్ నచ్చింది. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్ స్టార్ తన నట విశ్వరూపంతో గూస్బంప్స్ తెప్పిస్తారు. ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.'అని ఆయన అన్నారు.అల్లు అర్జున్,శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఇద్దరూ చాలా మంచి స్నేహితులని తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఆయనకు మద్ధతుగా నంద్యాలకు బన్నీ వెళ్లారు. స్నేహం కోసం తాను ఎప్పుడూ నిలబడుతానని బన్నీ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తాజాగా తన కుటుంబంతో పాటు శిల్పా రవి సంధ్య థియేటర్‌కు వెళ్లారు. బన్నీ ఫ్యామిలీతో కలిసి ఆయన సినిమా చూశారు. -
పుష్ప రాజ్ వసూళ్ల వేట
-
Pushpa 2: సుకుమార్ అందరికి ఇచ్చిపడేసాడు..
-
Pushpa 2 రియల్ వ్యూ
-
పుష్ప రాజ్ రూలింగ్ స్టార్..
-
పుష్ప-2 పబ్లిక్ టాక్
-
Watch Live: పుష్ప 2 మూవీ పబ్లిక్ టాక్
-
Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ
టైటిల్: పుష్ప 2: ది రూల్నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్రచన-దర్శకత్వం: సుకుమార్సంగీతం: దేవీశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: డిసెంబర్ 5, 2024అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.‘పుష్ప 2’ కథేంటంటే..?ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్‌తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్‌ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్‌కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్‌లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్‌ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్‌ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్‌కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్