అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.
పుష్ప రీ లోడెడ్..
తాజాగా పుష్ప-2 మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతోన్న పుష్ప-2 మూవీకి అదనంగా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయనున్నారు. ఈ అప్డేట్ వర్షన్ సంక్రాంతి కానుకగా ఈనెల 11 నుంచి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 రీ లోడెడ్ పేరుతో మరిన్నీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్‌ట్రా ఫైరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పొంగల్‌కు మరోసారి పుష్ప-2 లేటేస్ట్ వర్షన్ చూసి ఎంజాయ్ చేయండి.
పుష్ప టీమ్ తన ట్వీట్‌లో రాస్తూ..' "పుష్ప2: ది రూల్’ 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో రీలోడెడ్ వెర్షన్ సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి మూవీ ప్రదర్శితమయ్యే థియేటర్స్‌లో చూడవచ్చు. వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా" అని పోస్ట్ చేశారు.
ఆ రికార్డ్ కోసమేనా..
అయితే ఇప్పటికే వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న పుష్ప-2 చిత్రానికి 20 నిమిషాల సీన్స్ అదనంగా జోడించడం చూస్తే ఆ క్రేజీ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ఈ ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది.
తాజాగా మరో 20 నిమిషాల నిడివి గల సీన్స్ యాడ్స్ చేయడం దంగల్ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకే మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ రావడం ఈ సినిమాకు మరో ప్లస్ కానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 వసూళ్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పుష్పరాజ్.. దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
పెరగనున్న రన్‌టైమ్..
ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్స్‌గా పుష్ప-2 రన్ టైమ్ మరింత పెరగనుంది. ఈ నిడివికి అదనంగా మరో 20 నిమిషాలతో కలిపి 3 గంటల 40 నిమిషాలకు పైగా ఉండనుంది.
#Pushpa2TheRule RELOADED VERSION with 20 minutes of added footage will play in cinemas from 11th January 💥💥
The WILDFIRE gets extra FIERY 🔥#Pushpa2Reloaded ❤️🔥#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp… pic.twitter.com/ek3gRsOaVi— Pushpa (@PushpaMovie) January 7, 2025
Comments
Please login to add a commentAdd a comment