'అలాంటివి ఇక వద్దు'.. వారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్! | Pushpa 2 The Rule Makers Strong Warning Over Circulating Fake Dialogues In Social Media, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: 'సొంత క్రియేటీవిటి వద్దు'.. వారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Published Fri, Dec 6 2024 9:25 PM | Last Updated on Fri, Dec 6 2024 10:04 PM

Pushpa 2 The Rule Makers Strong Warning This Tupe Of People

సోషల్ మీడియాలో వైరలవుతోన్న పుష్ప చిత్రంలోని ఫేక్ డైలాగ్స్‌పై చిత్రబృందం స్పందించింది. నెట్టింట వైరలవుతోన్న ఫేక్ డైలాగ్స్‌ సృష్టించేవారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పైరసీ వీడియోలు, సంబంధిత లింక్స్‌ కనిపిస్తే తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు మెయిల్‌తో పాటు ఫోన్‌ నంబర్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇలాంటి వాటిని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది.

మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్‌లో ప్రస్తావిస్తూ..' ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోండి. లేకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.' అని పోస్ట్ చేశారు. దీంతో ఎవరైనా సరే ఫేక్ డైలాగ్స్, వీడియోస్ పోస్ట్‌ చేసి చిక్కుల్లో పడొద్దు. అలాంటి పైరసీ వీడియోలు కానీ, లింక్స్‌ కనిపిస్తే వెంటనే  వివరాలు పంపితే దాన్ని అడ్డుకుంటామని పేర్కొంది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement