dialogues
-
'అలాంటివి ఇక వద్దు'.. వారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వైరలవుతోన్న పుష్ప చిత్రంలోని ఫేక్ డైలాగ్స్‌పై చిత్రబృందం స్పందించింది. నెట్టింట వైరలవుతోన్న ఫేక్ డైలాగ్స్ సృష్టించేవారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పైరసీ వీడియోలు, సంబంధిత లింక్స్ కనిపిస్తే తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు మెయిల్‌తో పాటు ఫోన్ నంబర్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇలాంటి వాటిని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది.మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్లో ప్రస్తావిస్తూ..' ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోండి. లేకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.' అని పోస్ట్ చేశారు. దీంతో ఎవరైనా సరే ఫేక్ డైలాగ్స్, వీడియోస్ పోస్ట్ చేసి చిక్కుల్లో పడొద్దు. అలాంటి పైరసీ వీడియోలు కానీ, లింక్స్ కనిపిస్తే వెంటనే వివరాలు పంపితే దాన్ని అడ్డుకుంటామని పేర్కొంది. ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం…— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 Any unauthorized videos or spoilers of the movie #Pushpa2 can be reported immediately to the Anti Piracy Control Room @AntipiracySWe will bring them down immediately.claims@antipiracysolutions.orgWhatsapp: 8978650014— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 -
‘భారత్‌తో మొండి వైఖరి మార్చుకోండి’
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు తను వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ హితవు పలికారు. మొండిగా వ్యవహరించటం మానేసి.. దేశ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొటంలో పొరుగుదేశం భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నారు. అయితే ఇటీవల మహ్మద్ మొయిజ్జు భారత్ విషయంలో సర్వం మార్చి.. భారత్ తమకు ఎప్పటి నుంచి సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని పేర్కొన్న విషయంలో తెలిసిందే. భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. అయితే దానిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కల్పిలచాలని మాల్దీవుల కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మద్ సోలిహ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. మాలెలో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మహమ్మద్ సోలిహ్ మాట్లాడారు. బాకాయిపడ్డ రుణంలో ఉపశమనం కల్పించాలని అధ్యక్షుడు మొయిజ్జు భారత్‌ను కోరినట్లు తాను మీడియాలో చేశానని తెలిపారు. భారత్‌తో బాకిపడ్డ మొత్తం కంటే చైనాతో బాకిపడ్డ రుణం ఎక్కువని అన్నారు. ‘పొరుగు దేశాలు సాయం చేస్తాయని నేను విశ్వసిస్తున్నా. మనం మొండితనం వదిలి, చర్చలు జరపాలి. దేశంలోని అన్ని పార్టీలు సహకరిస్తాయి. అధ్యక్షుడు మొయిజ్జు ఎట్టిపరిస్థితుల్లో మొండితనంతో వెనకడుగు వేయోద్దు. ప్రభుత్వానికి ఇప్పడు దేశం ఎదుర్కొంటున్న పరిస్థితి అర్థం అయినట్లు తెలుస్తోంది’ అని మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సోలిహ్ తెలిపారు. తమ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న అధ్యక్షుడు మొయిజ్జు గతేడాది మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత్ సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
ప్రభాస్ సలార్.. ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు.. ఎందుకంటే?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ చేసే పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్ సైతం ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ వీడియో నెట్టింట వైరలవుతోంది. సలార్ మూవీ రన్‌టైమ్ 2 గంటల 55 నిమిషాలు కాగా.. అందులో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ దాదాపుగా 5 నుంచి 6 నిమిషాల వరకు ఉండవచ్చు. కానీ అవే డైలాగ్స్ కాస్తా స్పీడ్ వర్షన్లో చూస్తే కేవలం 2 నిమిషాల 33 సెకన్స్ మాత్రమే ఉన్నాయి. దాదాపు మూడు గంటల సినిమాలో కేవలం రెండున్నర నిమిషాలే హీరో డైలాగ్స్ ఉండడం ప్రశాంత్ నీల్ ఘనతే అని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు కమర్షియల్ సినిమాలో ఇదొక అద్భుతమైన ప్రయోగమని నీల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Prabhas has dialogues for 2 minutes and 33 seconds in the entire movie of #Salaar which has a runtime of 2 hours and 55 minutes. Can also be called as an experiment in commercial cinema! Neel. Take a bow! 👏 pic.twitter.com/EBH3Cq4F9e — idlebrain jeevi (@idlebrainjeevi) January 21, 2024 -
వేటాడే సత్యభామ
‘సత్యా.. ఈ కేసు నీ చేతుల్లో లేదు (ప్రకాశ్‌రాజ్).. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ (కాజల్ అగర్వాల్)’ అనే డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘సత్యభామ’ టీజర్. పోలీసాఫీసర్ సత్యభామ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ఇది. ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. శుక్రవారం ‘సత్యభామ’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘సార్.. ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంది. వేటాడాలి (కాజల్ అగర్వాల్)’, ‘ఆ అమ్మాయి చావుకు మీరే కారణం అంటున్నారు. ఈ కేసును మీరు వదిలేసినట్లేనా? (విలేకర్లు).. నెవర్ (కాజల్)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
'అందుకే ఆయనను మాటల మాంత్రికుడు అంటారు'
టాలీవుడ్ డైరెక్టర్స్‌లో ఆయన స్టైలే వేరు. ఆయన పేరు వింటే చాలు సినిమాల్లోని డైలాగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. అందరిలా కేవలం డైరెక్షన్ చేయడమే కాదు.. కథ, మాటల రచయితగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో కొత్త ట్రెండ్ చేసిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమాల్లో పాత్రల కంటే.. ఆయన రాసిన మాటలు, డైలాగ్స్ మాత్రమే మనకు గుర్తుంటాయి. జంధ్యాల, ముళ్లపూడి లాంటి మహానుభావుల్లాగే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఉందని నిరూపించాడు. తన సినిమాల్లో తన పంచ్ డైలాగ్‌లతో నిజ జీవితంలోని సంఘటలను సున్నితంగా తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనకే సొంతం. రచయితగా మొదలైన సినీ ప్రస్థానం.. స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన తీరు చూస్తే ఆయనేంటో అర్థమవుతుంది. అంతలా టాలీవుడ్లో తన డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తోన్న ఆ లెజెండరీ డైరెక్టర్ ఎవరో కాదు.. మన త్రివిక్రమ్ శ్రీనివాసుడే. నువ్వే నువ్వే చిత్రం నుంచి ఇప్పటి గుంటూరు కారం వరకు ఆయన ప్రయాణం మరిచిపోలేని జ్ఞాపకం. 1971 నవంబరు 7 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన ఆకెళ్ల నాగ శ్రీనివాస్.. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌గా పేరు సంపాదించారు. స్వయంవరం సినిమాతో రచయితగా త్రివిక్రమ్ జర్నీ మొదలైంది. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు కథ, మాటల రచయితగా పనిచేశారు. అయితే తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మహేశ్ బాబుతో తీసిన అతడు సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవ లాంటి హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో గుంటూరు కారం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. నవంబర్ 7న మాటల మాంత్రికుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన కలం నుంచి దూసుకొచ్చిన టాప్ టెన్ డైలాగ్స్ గురించి తెలుసుకుందాం. త్రివిక్రమ్ టాప్ డైలాగ్స్ 1. సన్ ఆఫ్ సత్యమూర్తి - 'మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి... కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్' 2. జులాయి - 'మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు.. మనకి రాని పని ట్రై చేయకూడదు' 3. జులాయి - 'లాజిక్‌లు ఎవరు నమ్మరు.. అందరికి మ్యాజిక్లే కావాలి.. అందుకే మన దేశంలో సైంటిస్ట్‌ల కన్నా బాబాలే ఫేమస్' 4. నువ్వు నాకు నచ్చావ్ - 'మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి.. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.' 5. అల వైకుంఠపురములో- 'నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. కానీ చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది' 6. నువ్వే నువ్వే - 'సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు.. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు' 7. అరవింద సమేత వీరరాఘవ - 'పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?' 8. జల్సా - 'అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే.. మనం చేసే యుద్ధానికి అర్థమేముంది' 9. అత్తారింటికీ దారేది - 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు' 10. తీన్ మార్ - 'కారణం లేని కోపం.. గౌరవం లేని ప్రేమ.. బాధ్యత లేని యవ్వనం.. జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం' -
ఆ కిక్కే వేరు రా!
‘‘నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అక్కర్లేదు రా..! నేను చాలు..! ట్వంటీఫోర్ హవర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది.. నాది అని చెప్పుకోవడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే.. ప్చ్.. ఆ కిక్కే వేరు రా..!’’ అనే డైలాగ్స్‌తో కూడిన వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మోషన్ పోస్టర్. హీరోయిన్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ ప్రపంచం ప్రేమకథలతో నిండిపోయి ఉంది. కానీ ఈ ప్రేమ కథల్లో ఇప్పటివరకు ఎవరూ వినని, చూడనవి కూడా ఉన్నాయి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం అలాంటిదే’’ అని ట్వీట్ చేశారు రష్మికా మందన్నా. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
ద–పొలిటికల్–‘పుష్ప’! సినిమాలూ, రాజకీయ గుర్తులు.. తగ్గేదేలే
సినిమాలంటే అందరికీ ఆసక్తి కదా. మామూలు జనాలకు మరీ ఎక్కువ. అందుకే జనాలందరికీ సినిమా భాషలోనే తమ అర్జీలు చెప్పుకుంటే పరమ క్యాచీగా ఉంటుందనుకున్నాయి రాజకీయ పార్టీలు. బాడీ లాంగ్వేజీలోలాగా... తమనే గెలిపించాలంటూ ‘మూవీ లాంగ్వేజీ’లో పొలిటికల్ పార్టీలు విన్నవించుకోవాలని నిర్ణయించుకుంటే... ఆ వచ్చే అభ్యర్థనలకు ఊహారూపమే ఈ వాక్యాలు... ‘పుష్ప సినిమా చూశారుగా అందరూ. అందులోని పాటలో హీరో చెప్పు జారిపోలా. అచ్చం అలాగే జారింది మా అధికారం కూడా. అయితే హీరోగారి గూడ పైకి లేచి నిలబడింది చూశారా... ఈసారి అచ్చం మీరూ మమ్మల్ని పైకి లేపండి. గూడను కాదు... మా చేతిని. అదే... చేతి గుర్తును.’’ ‘ప్రజలారా... చేతిగుర్తు వారి మాటలు చెవిన పెట్టకండి. అసలు పుష్ప అంటే ఏమిటి? పువ్వు! దీని బట్టి తెలియడంల్యా.. ఎవరికి ఓటెయ్యాలో! పుష్పకు ఓటెయ్యండి. అంటే ‘పువ్వు గుర్తు’కు అని అర్థం. పువ్వు గుర్తు అంటే కమలం పార్టీ అని విజ్ఞులైన మీకు వేరే చెప్పాలా?’’ ‘ఈ పువ్వు గుర్తువారూ, ఆ చెయ్యి గుర్తు వారూ ఎలాంటివాళ్లు? ఆ సినిమాలోనే చూశారుగా. గంధం చెక్కల ఆచూకీ చెప్పేదాకా కారెక్కించి తిప్పుతారు. తీరా ఆచూకీ దొరికాక... హీరో కారెక్కబోతుంటే కార్లోంచి కాలు పక్కకు లాగేస్తారు. నాల్రూపాయలు పారేసి... షేర్ ఆటోలో రమ్మంటారు. ఓడనెక్కేదాక ఓడమల్లయ్యా... ఓడ దిగాక బోడ మల్లయ్య. ఇలాంటి పార్టీలకా మీ ఓటు? పాపం... హీరో అప్పటికప్పుడు కారు కొనాల్సి వచ్చింది. హీరో కొన్నదేమిటి? ‘కారు’! ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. అసలు మా కారు గుర్తుకు ఓటేస్తే... కృతజ్ఞతకొద్దీ ఎప్పుడూ కార్లోనే తిప్పుతాం. కారు దిగకండి... మమ్మల్నీ దించకండి. కారు స్పీడు విషయంలో మీరు తగ్గేదేల్యా... మమ్మల్ని తగ్గించేదే ల్యా’’ సినిమా అభ్యర్థనలు పూర్తయ్యాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ హెచ్చరించే కేన్సర్ క్యారెక్టర్ ‘ముఖేశ్’ఈసారి ఈ సినిమా యాడ్స్ అయ్యాక వచ్చాడు. అతడు చెప్పేదేమిటంటే... ‘‘అసలా మూవీ హీరోయే ఓ ఎర్రచందనం స్మగ్లర్. అతడు చేసేదే అడవుల్ని నరకడం. మీకు అర్థమవ్వడం కోసం ఎంతటి సినిమా ఉపమాలిచ్చినా సరే... ఈ నెగెటివ్ కేరెక్టర్ల పట్ల పాజిటివ్ కోణంలో కాకుండా అసలు కేరెక్టర్లను గుర్తెరిగి ఎంచుకోండి. ఐదేళ్ల పాటు హాయిగా మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి. -
సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు
నంది అవార్డు గ్రహీత, స్క్రిప్ట్ రైటర్ సత్యానంద్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సత్యానంద్ తన సినీ ప్రస్థానం ప్రారంభించి 50 పూర్తయిన సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన సేవలను కొనియాడుతూ ఫోటోలు పంచుకున్నారు. మెగాస్టార్ తన ట్విటర్లో రాస్తూ..' ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్‌గా ఉంటూ.. ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటార్ గా, ఒక గైడింగ్ ఫోర్స్‌గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని తన జీవన విధానంగా మలచుకున్న నిత్య సినీ విద్యార్ధి , తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.' అని రాసుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?) అంతే కాకుండా..' ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం , నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియరెస్ట్ సత్యానంద్ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను. మోర్ పవర్ టూ యూ' అంటూ ప్రశంసలు కురిపించారు. ట్వీట్‌తో పవన్ కల్యాణ్, నాగబాబుతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన సత్యానంద్.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది అగ్ర నటులతో పనిచేశారు. చిరంజీవి, శివాజీ గణేశన్, నందమూరి తారక రామారావు, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ సినిమాలకు సేవలందించారు. సత్యానంద్ దేవుడు చేసిన పెళ్లి(1974) సినిమాతో డైలాగ్ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత జ్యోతి (1976), అర్ధాంగి (1977), అమెరికా అల్లుడు(1985), క్షణ క్షణం(1991), అన్నయ్య(2000) లాంటి మరెన్నో చిత్రాలకు డైలాగ్స్ కూడా రాశారు. (ఇది చదవండి: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే) అంతే కాకుండా మోసగాడు(1980), గూండా (1984), యముడికి మొగుడు (1988), పెళ్లాం ఊరెళ్లితే (2003), సుభాష్ చంద్రబోస్ (2005) చిత్రాలకు సత్యానంద్ స్క్రిప్ట్‌లు రాశారు. సముద్రం(1999), ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి(2004), నచ్చావులే (2008), రారండోయ్ వేడుక చూద్దాం(2017) చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2 — Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023 -
అతని తెలివితేటలు అపారం!
హర్ష సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మెగా’. మిత్ర ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ, నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్నే కుదిపేసే రాజైన మనిషిది’, ‘అతని తెలివితేటలు అపారం’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. హర్ష సాయి మాట్లాడుతూ– ‘‘మంచి కథలు చెప్పడానికి ప్రస్తుతం ఉన్న పెద్ద మాధ్యమం సినిమా. నేను చిత్రాలను ఎంచుకోవడానకి ఇదే తొలి కారణం. అలాగే యువ ప్రతిభను ప్రోత్సహించాలనుకోవడం మరో కారణం’’ అన్నారు. హీరోయిన్ , నిర్మాత మిత్ర మాట్లాడుతూ– ‘‘చిన్న ఆలోచనగా మొదలైన ఈ ప్రాజెక్ట్ చాలా భారీ స్థాయికి వెళ్లింది. 2024లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వికాస్ బాడిసా, కెమెరా: కార్తీక్ పళని, సమర్పణ: కల్వకుంట్ల వంశీధర్‌రావు, సహ నిర్మాత: పడవల బాలచంద్ర. -
తేడాలొస్తే...
‘మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం’ అంటున్నారు విశ్వక్ సేన్.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ హీరోగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రంలోని డైలాగ్ ఇది. ఈ చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్‌ని ఖరారు చేసినట్లు ప్రకటించి, యూనిట్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్‌లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. ‘‘క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్ చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. నేహా శెట్టి కథానాయికగా, అంజలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది. -
ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి!
ప్రేమిస్తే ప్రాణమిస్తా.. ఈ మాట జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా సూటవుతుంది. సినిమాను ఎంతలా ప్రేమిస్తాడంటే దానికోసం ఏమైనా చేస్తాడు, ఎక్కడివరకైనా వెళ్తాడు. తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడు. అందుకే అతడికి ఈ రేంజ్లో ఫాలోయింగ్.. మాస్ ఫాలోయింగ్‌లో తారక్ తరువాతే ఎవరైనా అన్నంతగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆయన పేరు చెప్తే చాలు అభిమానులు పూనకంతో ఊగిపోతారు. ఆయన నోటి నుంచి డైలాగ్స్ వస్తే విజిల్స్ వేస్తూ రెచ్చిపోతారు! నేడు(మే 20న) తారక్ బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆయన సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగ్స్‌లో కొన్నింటిని ఓసారి చూసేద్దాం.. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ? ) ఆది అమ్మతోడు అడ్డంగా నరికేస్తా సాంబ నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావ్, ఈ సాంబతో పెట్టుకుంటే చచ్చిపోతావ్ సింహాద్రి పదిమంది చల్లగా ఉండటం కోసం నేను చావడానికైనా, చంపడానికైనా సిద్ధం యమదొంగ రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో.. చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది. బృందావనం సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్‌గా లవర్ బాయ్‌లా ఉన్నాడనుకుంటున్నావేమో.. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తెచ్చావనుకో.. రచ్చ రచ్చే! ఊసరవెల్లి కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా.. కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే.. సాలిడ్‌గా ఉంటుంది దమ్ము బతకండి.. బతకండి అంటే వినలేదు కదరా.. కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు చరిత్ర చరిత్ర అని నీలిగావు. గేటు దగ్గర మొదలుపెడితే గడప దగ్గరికి వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని పది నిమిషాలు పట్టలేదు నాకు. అదే, నేను ఓ గంట కాన్సంట్రేషన్ చేస్తే.. ఏమీ మిగలదు బాద్షా బాద్షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్‌గా ఉంటుంది. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే.. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది. భయపడేవాడు బానిస- భయపెట్టేవాడు బాద్షా టెంపర్ ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. అదే దయాగాడి దండయాత్ర నా పేరు దయ, నాకు లేనిదే అది! ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుంది. యూజర్ నేమ్ దయ, పాస్వర్డ్ పోలీస్. దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా.. జనతా గ్యారేజ్ బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఎ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.. ఇవి మాత్రమే కాకుండా ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట? ఎంత మాట?..., రేయనక, పగలనక, ఎండనక, వాననకా.., ఆఫ్ట్రాల్ కాదు సర్... ఇలా గుక్క తిప్పకుండా చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ మరెన్నో ఉన్నాయి. మరి తారక్ డైలాగ్స్‌లో మీకు ఏది ఇష్టమో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. -
మల్లరెడ్డి డైలాగ్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
-
అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ సినిమాలకు డైలాగ్స్ రాసా..
-
Year End 2022: ఈ పంచ్ డైలాగ్స్‌పై ఓ లుక్కేయండి
2022 ఎండ్ అవుతోంది... ఈ ఎండింగ్ హ్యాపీకి దారి తీయాలంటూ 2023కి వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నాం. ఈ ఇయర్ ఎండింగ్‌ని కొన్ని పంచ్ డైలాగ్స్‌తో ఎండ్ చేద్దాం. 2022లో రిలీజైన చిత్రాల్లో పాపులర్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని పంచ్ డైలాగ్స్, లవ్ డైలాగ్స్, కామెడీ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ ఈ విధంగా ... బంగార్రాజు: ఏంటే ఈ మనుషులు.. బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలీదేంటే వీళ్లకి.. పోతేనే తెలుస్తుందా? నాకు తెలుసే దాని విలువ.. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చస్తారు.. బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలు.. పోయాక ఏం మిగులుతుందే.. ఫొటోలు తప్ప. గుడ్ లక్ సఖి: గోలీ రాజు ఏంటి గోలీ రాజు? స్టేజి మీద నా పేరు రామారావు.. నువ్వు రామారావు అయితే నేను సావిత్రి. ఆర్ఆర్ఆర్: తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోణ్ణి ఏసుకుంటూ పోవాలే ♦ భీమ్... ఈ నక్కల వేట ఎంత సేపు. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా? ఖిలాడి: ఎప్పుడూ ఒకే టీమ్‌కి ఆడటానికి నేషనల్ ప్లేయర్‌ని కాదు.. ఐపీఎల్ ప్లేయర్. ఎవడెక్కువ పాడుకుంటే వాడికే ఆడతాను. డీజే టిల్లు: ఇంట్లో ఒక శవాన్ని, బిల్డింగ్‌లో సీసీ టీవీ కెమెరాల్ని పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను మొహానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసినా చూడు అట్లుంటది మనతోని ముచ్చట. సన్ ఆఫ్ ఇండియా: నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని.. నేను కసక్ అంటే మీరందరూ ఫసక్. ఆడవాళ్ళు మీకు జోహార్లు: వీకెండ్ అంటే ఏం ఉంటుందండి.. తాగటం, తినడం, తొంగోవడం.. అలా అందరిలా కాకుండా అంతర్వేది, అన్నవరం వెళ్లొద్దామనుకుంటున్నానండి. రాధేశ్యామ్: ఏంట్రా.. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?, ఆడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైపు కాదు. ఆచార్య: పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో? ♦ ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది.. ధర్మస్థలి అధర్మస్థలి కాకూడదు. సర్కారువారి పాట: మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోవద్దు. ♦ దీనికున్న అలవాట్లకి, దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని. ఎఫ్3: వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ ♦ వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ మేజర్: టైమ్‌కి మనం వెళ్లకపోవడం వల్ల ఒక్క ప్రాణం కోల్పోయినా కూడా లైఫ్‌లో నన్ను నేను సోల్జర్ అనుకోలేను సర్. పక్కా కమర్షియల్: సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా.. విలన్. ది వారియర్: ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. థ్యాంక్యూ: లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేది లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడికొచ్చాను. బింబిసార: బింబిసారుడు అంటే మరణ శాసనం.. ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే. సీతారామం: చూడండీ... అడ్రస్ దొరికింది కదా అని వచ్చేస్తారేమో? అంత సాహసం మాత్రం చేయకండే! కార్తికేయ 2: శక్తి, సామర్థ్యాలతో పాటు బుద్ధి, గుణం వల్లే రాముడు, శివుడు, శ్రీకృష్ణుడు దేవుళ్లయ్యారు. లైగర్: లోపాలు అందరికీ ఉంటాయి. నీకు నత్తి ఉంది అంటున్నారు కదా. రేపు నీ మాట కూడా అందరికీ పాట లెక్క వినపడతది.. వినపడేటట్టు చేయాలి. గాడ్‌ఫాదర్: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, నా నుంచి రాజకీయం దూరం కాలేదు. జిన్నా: నమ్మకం లేని ప్రేమ.. కర్రల్లేని టెంటు నిలబడవు రేణుకా. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: అన్యాయంగా బెదిరించేవాడికన్నా న్యాయం కోసం ఎదిరించేవాడే బలమైనవాడు. హిట్ ది సెకండ్ కేస్: అవతలి టీమ్ వీక్ అని మన గోల్ కీపర్‌కి రెస్ట్ ఇవ్వలేం కదా సర్. ధమాకా: నేను వెనకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చినవాణ్ణి కాదురోయ్.. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసినవాణ్ణి. 18 పేజెస్: ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించాం అంటే ఆన్సర్ ఉండకూడదు. -
కృష్ణ డైలాగ్ తో అదరగొట్టిన Jr కృష్ణ
-
ముందే స్క్రిప్ట్ ఇస్తే నటులు ఇంకా బాగా చేస్తారు: చిరంజీవి
-
టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు..
Chiranjeevi Shocking Comments On Tollywood Directors: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేసిన చిరంజీవి టాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ నటన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అమీర్‌లా తమకు చేయాలని ఉన్నా పలు పరిధుల వల్ల తాము చేయలేకపోతున్నామని చిరు చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి పరిధుల గురించి ఈ కార్యక్రమంలో చిరంజీవి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ డైరెక్టర్లకు చురకలు అంటించారు. ''కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్లో అప్పటికప్పుడు డైలాగ్‌లు ఇస్తున్నారు. ఇది నటులను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది. స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలి. స్క్రిప్ట్ గురించి మిగతా టెక్నిషియన్స్‌కు ముందుగానే తెలిస్తే వారు పనిచేసే విధానం వేరు. దానికి వచ్చే ఫలితం వేరేలా ఉంటుంది. ఆ ఫలితం సినిమాపై చూపిస్తుంది. చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ఏమైపోయిందంటే.. సినిమాలో ప్రధాన హీరోకు సీన్స్ తెలుసేమో గానీ, అప్పుడే వచ్చిన కమెడియన్స్‌కు గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు మాత్రం తెలియదు. అప్పటికప్పుడు ఆ డైలాగ్‌లు చెప్పి చేయించడంతో ఇన్వాల్వ్మెంట్ అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. ముందుగా డైలాగ్‌లు ఇవి అని చెప్పాలి. ఆ డైలాగ్‌లు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. గదిలో రౌండ్టేబుల్పై కూర్చొని ఆ సీన్లు అనుకుని వాళ్లు గనుక చేయగలిగితే తర్వాత సెట్స్‌కు వెళ్లాక నా డైలాగ్ ఏంటని.. అది ఎలా గుర్తుంచుకోవాలని.. డైలాగ్ గుర్తుపెట్టుకోవండపై మనసు పెట్టక్కర్లేదు. అప్పుడు కేవలం నటనపైనే మనసు పెడితే చాలు. అది రావాలి. ఇదే వారు చేసేది (అమీర్ ఖాన్ గురించి)'' అని చిరంజీవి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. -
కేజీఎఫ్ 2 ట్రైలర్: ‘వైలెన్స్.. వైలెన్స్..’ ఈ డైలాగ్ రాసింది ఆ స్టార్ హీరోనే
కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్-2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్14న విడుదల కానున్న నేపథ్యంలో మార్చి 27 ఆదివారం కేజీఎఫ్ 2 ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ విడుదల అయితే ఇప్పుడ ఈ ట్రైలర్ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది. ఇందులో రాఖీ భాయ్ డైలాగ్స్ ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. చదవండి: రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఈటీ మూవీ, స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే ట్రైలర్ ప్రారంభంలో యశ్ ‘వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్.. వైలెన్స్ లైక్స్ మీ’ అంటూ చెప్పిన ఈ పవర్ ఫుల్ డైలాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యశ్ గురించిన ఆసక్తిర విషయం చెప్పాడు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఈ మూవీకి ఓ స్టార్ హీరో కొన్ని డైలాగ్స్ రాశాడంటూ సీక్రెట్ రివీల్ చేశాడు. ఆయన ఎవరో కాదని కేజీఎఫ్ స్టార్ యశ్ అని చెప్పాడు. ప్రస్తుతం ఎంతో మందిని ఆకట్టుకుంటూ వైరల్‌గా మారిన ‘వైలెన్స్’ డైలాగ్ స్వయంగా యశ్(రాఖీ భాయ్) రాశాడంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇది తెలిసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చదవండి: ఇప్పటికీ తగ్గని పుష్ప మేనియా, ఆ పాటకు అమెరికా అమ్మాయిల స్టెప్పులు ఇది మాత్రమే కాదు.. మూవీ కొసం యశ్ మరిన్ని డైలాగ్స్ కూడా రాసినట్లు ప్రశాంత్ వర్మ తెలిపాడు. కాగా ఈ ట్రైలర్ విడుదలైన 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్ వ్యూస్ రాగా.. తెలుగులో 20M, హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8M వ్యూస్ వచ్చాయి. 'రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు' అంటూ మేకర్స్ బుధవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
పుష్ప మేకర్స్ సరికొత్త విధానం.. డైలాగ్ జ్యూక్ బాక్స్ విడుదల
Pushpa Movie Dialogue Jukebox Released: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబొలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'పుష్ప: ది రైజ్'. గతేడాది డిసెంబర్ 17న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 330 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. వసూళ్ల కలెక్షన్లను పక్కన పెడితే పుష్ప మేనియా కూడా విపరీతంగా పాపులర్ అయింది. పుష్ప క్యారెక్టర్‌లోని బన్నీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినిమాలోని డైలాగులు, పాటలు అన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో పుష్ప క్యారెక్టర్‌ను అనుకరిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ప్రత్యేక వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అవి ఎంతో ట్రెండ్ కూడా అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం 'పుష్ప: ది రూల్' చిత్రీకరణ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈలోపు ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇదివరకూ సినిమా పాటల జ్యూక్ బాక్స్‌ను రిలీజ్ చేసేవారు. ఇప్పుడు సరికొత్త విధానానిని నాంది పలుకుతూ పుష్ప డైలాగ్ జ్యూక్ బాక్స్‌ను విడుదల చేశారు మేకర్స్. పుష్ప మూవీలో అల్లు అర్జున్ పలికిన కొన్ని పాపులర్ డైలాగ్‌లతో ఈ జ్యూక్ బాక్స్ ఉంది. ఈ వీడియో సుమారు 21 నిమిషాల నిడివితో ఉంది. ఈ డైలాగ్ జ్యూక్ బాక్స్‌కు మంచి స్పందన వస్తోంది. మరి ఈ విధానాన్ని భవిష్యత్తులో దర్శకనిర్మాతలు అనుసరిస్తారేమో చూడాలి. -
83 చిత్రంలోని రణ్వీర్ సింగ్ యాసను ఇమిటేట్ చేసిన దీపికా.. ఫన్నీ వీడియో వైరల్
Deepika Padukone Imitates Ranveer Singh Dialogue From 83 Movie: ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ మూడ్‌లో ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు తమదైన శైలిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. తమకు ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతున్నారు. కాగా బాలీవుడ్ పాపులర్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె కూడా న్యూ ఇయర్ వెకేషన్లో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి శుక్రవారం డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసుకున్నాడు రణ్వీర్ సింగ్. ఇటీవల విడుదలైన రణ్వీర్ సింగ్ 83 చిత్రం ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అందులో కపిల్ దేవ్ పాత్రలో అలరించిన రణ్వీర్ సింగ్ అద్భుత నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. సినిమాలో 'వరల్డ్ కప్ గెలవడానికి వచ్చాం' అని రణ్వీర్ సింగ్ చెప్పే డైలాగ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్‌ను అదే రణ్వీర్ యాసలో ఇమిటేట్ చేసింది దీపికా. క్యూట్‌గా ఇమిటేట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 'హావింగ్ ఫన్ బేబీ' అని రణ్వీర్ అడగ్గా.. 'వీ హియర్ టు ఎంజాయ్.. వాట్ ఎల్స్ వి హియర్ ఫర్ (మేము ఇక్కడికి వచ్చిందే ఎంజాయ్ చేయడానికి. ఇక్కడికి ఇంకా దేనికి వచ్చాం)' అని రణ్వీర్ యాసలో దీపికా అనడం నవ్వు తెప్పిస్తోంది. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) రణ్వీర్-దీపికా జంట వెకేషన్ కోసం మాల్దీవులు వెళ్లినట్లు సమాచారం. వీరు బయలుదేరే ముందు ముంబై విమానాశ్రయంలో తళుక్కుమన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో వచ్చిన 83 సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఇందులో కపిల్ దేవ్ భార్య రూమీ భాటియ పాత్రలో దీపికా పదుకొణె నటించింది. -
HBD Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్ర..భాస్ ఈ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో హుషారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంగా అమ్మాయిల గుండెల్లో గుబులు రేపుతున్న డార్లింగ్. 42 ఏళ్లు నిండినా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లెపుడు అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. మాస్.. అయినా క్లాస్ అయినా. స్టెప్ అయినా... ఫైట్ అయినా ప్రభాస్ కనిపిస్తే... థియేటర్లలో సీటీల మోత మోగాల్సిందే. అదీ ప్రభాస్ అంటే.. ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపిన పవర్ ఫుల్ పంచ్ డైలాగులు మీకోసం.. (Freida Pinto: అవును..నా డ్రీమ్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!) (Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్’కు హ్యాపీ బర్త్‌డే) ‘‘టిప్పర్ లారీ వెల్లి స్కూటర్ని గుడ్డేస్తే ఎలా ఉంటదో తెల్సా? అలా ఉంటది నేను గుద్దితే ’’ ‘‘వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైన అధికారం కోసం ఎగబడితే..’’ ‘‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!’’ ‘‘ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా !’’ ‘‘నువ్వు నా వూరు రావాలంటే స్కెచ్ వేసి రావాలి ... అదే నేను నీ వూరు రావాలంటే హ్యాంగర్ కి ఉన్న చొక్కా వేసుకుంటే చాలు రా!’’ ‘‘వీలైతే ప్రేమించండి..పొయ్యేదేముంది మహా ఐతే తిరిగి ప్రేమిస్తారు’’ ‘‘నాకు అమ్మాయిలు అన్నా, సెల్ ఫోన్ లు అన్నా ఇష్టం ఉండవు, సెల్ ఫోన్ లో మెసేజ్ లు ఎక్కువ, అమ్మాయిల్లో డౌట్స్ ఎక్కువ, ఇవి మనకు సెట్ కావు" "నాకు రామాయణం,మహాభారతం గురించి తెలియదు. అందులో ఉండే యుద్దాల గురించి తెలుసు. రండి కుమ్మేసుకుందాం.." "సైలెంట్ కు, వైలెంట్ కు మధ్య బుల్లెట్ ఉంటుంది, నేను బుల్లెట్ ను కాదు మిస్సైల్ ని.." "నా హైట్ 6 ఫీట్ 2 ఇంచెస్, నా బలువు 100 ఫీట్స్ చూస్తావా, మా అమ్మ నన్ను ముద్దుగా ఈఫిల్ టవర్ అని పిలుస్తుంది. ఈఫిల్ టవర్ ని ప్రీగా చూసుకో పర్లేదు, కానీ నా బలువు చూడాలంటే నీ ప్రాణం ఇవ్వాలి.." "ఒక్కడు ఎదురు తిరిగితే తిరుగుబాటు.... అదే వంద మంది ఎదురు తిరిగితే అది పోరాటం" "చరిత్రలో నిలిచిపోయిన ఏ పోరాటం అయినా, వెనక ఉన్న వంద మంది గురించి చెప్పుకోలేదు... ముందుండి నడిపించిన ఒక్కడిని గురించి మాట్లాడుకున్నారు" ‘‘నేనెవర్నీ.. నాతో వచ్చెదెవరు నాతో చచ్చేదెవరు -
‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్
సాక్షి,ముంబై: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాల కాలంలో విడుదలైన ఈ మూవీలో ముఖ్యమైన సన్నివేశాలు, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర నటన, ఉద్వేగ సన్నిశాల డైలాగ్స్‌తో యువ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జయహో అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ‘‘ఒక్కసారి సైనికుడిగా ఉంటే ఇక జీవితాతం అతడు సైనికుడే’’ ‘‘అయితే జెండా చేత బూని వస్తా.. లేదంటే త్రివర్ణ పతాకం చుట్టుకొని వస్తా.. కచ్చితంగా తిరిగి రావడం మాత్రం ఖాయం.’’ సహచరుడిని కోల్పోయిన తరుణంలో నీళ్లు నిండిన కళ్లతో కెప్టెన్ బాత్రా తన తోటి జవాన్లతో ఇలా అంటాడు.. "ఏ వార్ బడీ కుత్తీ ఛీజ్ హై యార్" యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటూ నినదిస్తాడు. చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్న విక్రమ్ భాత్రా యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటాడు. సాధారణ పౌరుడి జీవితంలో అనుకున్నది సాధించడం వేరు...కానీ ఒక సైనికుడిగా దేశ రక్షణ పోరాటంలో నిర్దేశిత మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్వేగపూరిత సన్నిశంలో ఈ డైలాగ్ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. దీంతోపాటు ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందన్నట్టుగా కెప్టెన్ విక్రమ్ బాత్రా అతని స్నేహితురాలు డింపుల్ చీమా అందించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్నికూడా షేర్షా బాగా హైలైట్ చేసింది. వీరి పెళ్లికి డింపుల్ తండ్రి అడ్డుపడ్డ సన్నివేశం, ఆర్మీలో చేరాలనే బాత్రా కల కోసం అందించిన ప్రోత్సాహంతోపాటు, ఆమె తెగువకు, ప్రేమకు సెల్యూట్ చేస్తుందీ సినిమా. నరనరాన దేశభక్తిని నింపుకున్న వీరజవాన్ విక్రమ్ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర ఫుల్మార్క్లు కొట్టేయగా, విక్రమ్ ప్రేయసి డింపుల్ క్యారెక్టర్లో కియారా అద్వానీ అటు అందంతో ఆకట్టుకోవడంతోపాటు ఇటు తెగువ, ధైర్యం ఉన్న మహిళగా అభినయంలోనూ జీవించింది. అలాగే కెప్టెన్ సంజీవ్‌గా శివ్ పండిట్, మేజర్ అజయ్ సింగ్‌గా నికితిన్ ధీర్, విక్రమ్ స్నేహితుడు సన్నీ పాత్రలో సాహిల్ వైద్ ఇలా అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. -
ఆ ‘అగ్ని’ రాజేసిన ఆవేశం ఇప్పటికీ చల్లారలేదు
‘‘ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్లు లేరీ నాటకంలో’’.. తెలుగు సినీ చరిత్రలో కలకలం గుర్తుండిపోయే డైలాగ్ ఇది. ‘ప్రస్థానం’ ద్వారా ఈ ఆణిముత్యం లాంటి డైలాగ్‌ను అందించిన క్రెడిట్ సగం దర్శకుడు దేవకట్టాది అయితే.. తన నటనతో, కంఠంతో పవర్‌ఫుల్‌గా ఆ డైలాగ్‌ను ప్రజెంట్ చేసి మిగిలిన సగభాగం క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నటుడు సాయి కుమార్. డైలాగ్ కింగ్‌గా, అంతకు మించి విలక్షణ నటుడిగా తెలుగు, కన్నడ ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటూ వస్తున్నాడాయన. ఇవాళ ఆయన 61వ పుట్టినరోజు.. పుడిపెద్ది సాయి కుమార్..1960 జులై 27న జన్మించాడు. తండ్రి డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటుడు పీజే శర్మ సొంతూరు విజయనగరం, తల్లి నటి జ్యోతి బెంగళూరువాసి. చెన్నైలో ఎంఫిల్ విద్య పూర్తి చేసుకున్నాక.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆవైపు ఆకర్షితుడయ్యాడు సాయి కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా డబ్బింగ్ సినిమాలకు పని చేసిన ఆయన.. పెద్దయ్యాక కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కొనసాగాడు. 1977లో ‘స్నేహం’ ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు. స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణ.. పవర్ఫుల్ టోన్ కావడంతో బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆయనకు గుర్తింపు దక్కింది. మధ్య మధ్యలో చిన్నాచితకా పాత్రలు చేసినప్పటికీ..పూర్తిస్థాయి నటుడి గుర్తింపుదక్కలేదు. అలాంటి టైంలో.. అగ్ని.. ఆ... ఏం జరిగిందో ఏమోగానీ.. డబ్బింగ్ కోసం కొందరు హీరోలు వేరే వాళ్ల వాయిస్ అరువు తెచ్చుకోవడం, మరో వైపు హీరో-ఆర్టిస్ట్‌గా అవకాశాలు పల్చబడడంతో సాయి కుమార్ ఢీలా పడిపోయాడు. సరిగ్గా ఆ టైంలో థ్రిల్లర్ మంజు డైరెక్షన్లో వచ్చిన ‘పోలీస్ స్టోరీ’ సాయి కుమార్ సినీ ‘జీవితాన్ని’ నిలబెట్టింది. కన్నడ నటుడు కుమార్ గోవింద్ చేయాల్సిన ఆ సినిమా అనుకోకుండా సాయి కుమార్ దగ్గరికి వెళ్లడం.. ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 1996లో కన్నడనాట ‘పోలీస్ స్టోరీ’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆవేశం ఉన్న పోలీసాఫీసర్ అగ్ని పాత్రలో కలకాలం గుర్తుండిపోయే అమోఘమైన నటన అందించాడాయన. ‘సత్యా.. ధర్మా.. అమ్మా..’ అంటూ ఎమోషనల్‌గా చెప్పే డైలాగులు, విలన్లను ఉద్దేశించి ‘ ఏయ్ లబ్బే’ అంటూ ఊగిపోతూ చెప్పే పవర్ఫుల్ పంచ్ డైలాగులు ఇప్పటికీ జనాల చెవులో మారుమోగుతుంటాయి. ఆ సినిమాతో కన్నడనాట స్టార్ హీరోగా ఆయనకంటూ ఓ గుర్తింపు దక్కింది. నటనా ప్రస్థానం కన్నడలో హీరోగా ఫేడవుట్ అయ్యాక.. తిరిగి టాలీవుడ్లో, మధ్య మధ్యలో కన్నడ, తమిళంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు సాయి కుమార్. 2002 తర్వాత సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘సామాన్యుడు’ రూపంలో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకుగానూ బెస్ట్ విలన్‌గా టాలీవుడ్లో తొలి నంది అవార్డును అందుకున్నారు ఆయన. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లోక్‌నాథ్ నాయుడు రోల్ రూపంలో మరిచిపోలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు బెస్ట్ సపోర్టింగ్ నటుడిగా రెండో నందిని అందించింది. ఆపై ‘అయ్యారే, ఎవడు, పటాస్, సరైనోడు, సుప్రీం, జనతా గ్యారేజ్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, మహర్షి.. ఇలా కమర్షియల్ డ్రామాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో కన్నడనాట ‘రంగితరంగ’ ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టింది. వెండితెరపైనే కాదు.. ‘కట్ చేస్తే’ బుల్లితెరపై కూడా హోస్టింగ్‌తో మెప్పిస్తూ వస్తున్నారాయన. వాయిస్‌తో మ్యాజిక్ సుమన్, రాజశేఖర్ల కెరీర్‌కు సాయి కుమార్ అందించిన గొంతుక ఒక ‘పుష్అప్’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషా, పెదరాయుడు ద్వారా రజినీకాంత్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది కూడా ఈయన గొంతే. ఇక బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్‌కు ‘ఖుధా గవా’(1992) ‘కొండవీటి సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ కాగా.. అందులో బిగ్‌బీకి వాయిస్ఓవర్ అందించాడు సాయి కుమార్. మోహన్‌లాల్, మమ్మూటీ, మనోజ్ జయన్, అర్జున్ సార్జా, విష్ణువర్ధన్ పోలీస్ రోల్స్‌కిగానూ సురేష్ గోపీ, విజయ్‌కాంత్ లాంటి వాళ్లకు తన పవర్ఫుల్ వాయిస్ అందించి.. ఆయా నటులను తెలుగు ఆడియొన్స్‌కు దగ్గరయ్యేలా చేశాడు డైలాగ్ కింగ్ సాయి కుమార్. -సాక్షి, వెబ్‌డెస్క్ -
పవన్‌కు త్రివిక్రమ్ మాట సాయం
గతేడాది విడుదలైన అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ జోష్‌లో ఉన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి కలెక్షన్లను కురిపించింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు బిజీగా ఉన్నారు ఆయన. డైరెక్షన్‌తోపాటు మాటల రచయితగా త్రివిక్రమ్‌కు పెట్టింది పేరు. ఆయన రాసే డైలాగులు సినిమా విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. త్రివిక్రమ్ మాటలు అంతా పవర్‌ఫుల్‌గా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా పవన్ కల్యాణ్ నటించబోయే తదుపరి చిత్రానికి త్రివిక్రమ్ మాట సాయం చేయనున్నారు. మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: స్క్రిప్ట్ చదివే నిర్మాతలు ఇద్దరే అంటున్న త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మల్టిస్టారర్ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిన్‌ప్లే, డైలాగులు రాయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సితార బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక పవన్ సినిమాకు మాటల మాంత్రికుడు డైలాగులు అందించనుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా గతంలో పవన్ కల్యాణ్ నటించిన తీన్మార్ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు అందించిన విషయం తెలిసందే. ప్రస్తుతం పవన్ నటించిన వకీల్‌సాబ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాల అనంతరం రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. చదవండి: పవన్ కొత్త సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. -
నిద్ర లేపి అడిగినా చెప్పేస్తా!
చిన్నప్పుడు స్కూల్లో సమాధానాలు అందరం బట్టీ పడుతుంటాం. ఆ సమాధానాలు ఎంతలా గుర్తుంటాయంటే నిద్ర లేపి అడిగినా టక్కున చెప్పేంత. ఆలియా కూడా ‘ఆర్ఆర్ఆర్’ డైలాగులను ఇలానే గుర్తుపెట్టుకున్నారట. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు ఆలియా. ఈ షూటింగ్ గురించి ఆలియా మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ నాకో కొత్త అనుభవం. నాకు తెలుగు రాదు. అందుకే షూటింగ్లో జాయిన్ అయ్యే ముందే డైలాగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. సుమారు ఏడాదిన్నరగా ఈ డైలాగ్స్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంతలా అంటే నిద్రలో లేపి అడిగినా చెప్పేసేంత. రాజ మౌళి దర్శకత్వంలో నటించడం ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. కోవిడ్ లేకపోతే పెళ్లి: హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నామని రణ్‌బీర్ పేర్కొన్నారు. -
మెగాస్టార్‌ను సర్ప్రైజ్ చేసిన సంహిత
చిన్నపిల్లలు ఏది చేసినా ముద్దుగానే ఉంటుంది. అలాంటిది వాళ్లు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తే ఇంకెంత చూడముచ్చటగా ఉంటుందో.. అందులోనూ సెలబ్రిటీల పిల్లలు చేసే ఏ వీడియో అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కుమార్తె సంహిత తన కళను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచింది. రుద్రమదేవి సినిమాలోని డైలాగ్‌ను గాంభీర్యం తగ్గకుండా హావభావాలు ఒలికిస్తూ, అక్షరం పొల్లుపోకుండా చెప్పింది. డైలాగ్ చెప్పే తీరు, ఆ దర్పం, యాక్షన్ చూసి మెగాస్టార్ సర్ప్రైజ్ అయ్యారు. ముద్దుముద్దుగా డైలాగ్ చెప్పిన మనవరాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "1990లో సుష్మిత, 2020లో సంహిత పరంపర కొనసాగుతోంది. అచ్చంగా తల్లిలాగే కూతురు" అంటూ చిరు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: సన్యాసిలా ఆలోచించగలనా?) ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మెగాస్టార్ మనవరాలా.. మజాకా! అంటూ సంహితను తెగ పొగిడేస్తున్నారు. కాగా చిరంజీవి ఈ మధ్యే సినీ పరిశ్రమలో అడుగు పెట్టి 42 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా "ఆచార్య" సినిమా షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏప్రిల్‌కు పూర్తవుతుంది. అనంతరం వీవీ నాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ (మలయాళం) రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ (తమిళం) రీమేక్‌లో నటించనున్నారు. (చదవండి: 'ఆచార్య' కథ వివాదంపై చిత్రయూనిట్ క్లారిటీ) View this post on Instagram చిన్నారుల అభిరుచిని తల్లి తండ్రులు ప్రోత్సహిస్తే, అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. #D/O Sushmitakonidela #Samhita @sushmitakonidela A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on Oct 8, 2020 at 5:02am PDT -
హాలీవుడ్ సినిమాకు మురుగదాస్ డైలాగ్స్!
సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమా సంభాషణలు రాసేందుకు అంగీకరించాడు. తన సినిమాలకు కథ, డైలాగ్స్ తానే రాసుకునే ఈ స్టార్ డైరెక్టర్ ఇతర దర్శకుల సినిమాలకు ఇంతవరకు ఎప్పుడూ పనిచేయలేదు. అయితే ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కోరిక మేరకు డైలాగ్స్ రాసేందుకు అంగీకరించారట. సూపర్ హిట్ అడ్వంచర్ మూవీ సిరీస్ అవెంజర్స్ నుంచి కొత్త సినిమా ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ రాబోతోంది. ఈ సినిమాను భారత్‌లోనూ భారీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న నిర్మాతలు డబ్బింగ్ డైలాగ్స్ రాసేందుకు పలువురు ప్రముఖులను సంప్రదించారు. ఈ సినిమా తమిళ వర్షన్‌కు డైలాగ్స్ రాసేందుకు మురుగదాస్ అంగీకరించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉన్న మురుగదాస్ డైలాగ్స్ రాస్తుండటంతో అవెంజర్స్ ఎండ్ గేమ్‌కు సౌత్‌లో మంచి హైప్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
ఇంకేమి సేయవలరా డింగరీ!
కాశీమజిలీ కథల్లో నుంచి పుట్టుకొచ్చిన కమ్మని కథ ఇది.నాటక రూపంలోనే కాదు చలనచిత్రంగా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.పింగళి వారి డైలాగులు పటాసుల్లా పేలాయి.కాలాలకతీతంగా కనుల విందు, వీనుల విందు చేస్తున్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం... మాంత్రికుడు పెద్ద గొంతుతో అరుస్తున్నాడు...‘‘ఆమ్ అహమ్... అష్టభైరవిని కట్టా. కామ్ కహామ్.... కాలభైరవిని కట్టా...తాం తదనమ్ తంటామారిని గెంటా... ఇక మంత్రబలం చూపించే మనోబలం చూపించే...’’ బెల్లం చుట్టూ ఈగల్లా జనం పోగయ్యారు.‘‘జనమూ.... జనమూ... నేపాళమాంత్రికునికి వందనాలు అనండి. డింగిళ్లు అనండి’’ జనాల్ని చూస్తూ అరిచాడు మాంత్రికుడి అసిస్టెంట్ డింగరి.‘‘వందనాలు... వందనాలు’’ అని అరిచారు జనాలు.‘‘యువకులంతా ముందుకు రండి.... యువతులంతా ముందుకు రండి’’ అంటూ యువతీ యువకులను ముందువరసలోకి తెచ్చిన మాంత్రికుడు వృద్ధులు, వయసు మళ్లిన వాళ్లపై నిర్లక్ష్యపు చూపు విసిరి...‘‘నడుములు వంగిన నాయకులంతా గడబిడ సేయక వెనక ఉండండి’’ అని ఆదేశించినంత పని చేశాడు. ఆ తరువాత...‘‘అరేయ్ డింగరీ’’ అని అరిచాడు.‘‘ఏం గురూ’’ అని దగ్గరకు వచ్చాడు అసిస్టెంటు.‘‘జనం కోరేది మనం సేయడమా? మనం చేసేది జనం చూడటమా? ఏరా డింగరి’’ పొడవాటి గెడ్డాన్ని నిమురుకుంటూ అడిగాడు మాంత్రికుడు.‘‘మన కన్నే మన చెవే మన మాటే మన జనం. జనమంతా నేనే. మనం కోరతాం. మీరు సేయండి... గాగీ గూగీ మోటా టీటూ వీళ్లందరికీ టోపీలు పెట్టండి’’ అని జనాలను చూపిస్తూ అడిగాడు డింగరి.‘బోలెడంత ఆశ్చర్యం! ‘‘ఇంకేమీ సేయవలరా డింగరీ’’ అడిగాడు మాంత్రికుడు. నేల మీద ఉన్న రాయిని చూపిస్తూ...‘‘రాతిని కోతి చేయండి గురువు గారు’’ అడిగాడు అసిస్టెంటు.‘‘హాంఫట్’’ అంటూ అలాగే చేశాడు మాంత్రికుడు.మళ్లీ బోలెడంత ఆశ్చర్యం.రాతి కోతిగా మారిందిఅంతమాత్రాన చిలిపివాడైన డింగరి ఊరుకుంటాడా!‘‘కోతిని నాతిని చేయండి’’ అని అడిగాడు.మాంత్రికుడు ‘హాంఫట్’ అన్నాడో లేదో కోతి కాస్తా అందమైన యువతిగా మారింది. ‘‘మహాజనానికి మరదలు పిల్లా... గలగలలాడే గజ్జెల కోడి’’ అని ఆ యువతిని చిలిపిగా చూశాడు మాంత్రికుడు. ఈ చూపుల బాణం సోకి కాలికి గజ్జె కట్టింది ఆ యువతి...‘వగలోయ్ వగలోయ్తళుకు బెళుకుల వగలోయ్’ అనిపాడుతూ నృత్యం చేసి జనాల మనసులను కిలోలకొద్దీ దోచుకుంది.ఈలోపే ఎవరో వస్తున్న అలికిడి వినిపించి. జరగండి.. జరగండి... అనే మాటలు వినిపిస్తున్నాయి.వచ్చింది ఎవరో కాదు.... సాక్షాత్తు రాణిగారి తమ్ముడు.ఈ తమ్ముడుంగారు మాంత్రికుడి వైపు కోపంగా చూస్తూ, చేతిలోని కత్తి అటూ ఇటూ తిప్పుతూ...‘‘ఏయ్ ఎవడివయ్యా నువ్వు?’’ అని ఆరా తీశాడు.‘‘నేపాళమాంత్రికుడు’’ అని అరిచాడు మాంత్రికుడి అసిస్టెంటు.‘‘నేపాళమంత్రికుడా! తప్పు తప్పు... భూపాళం పగిలేను. ప్రమాదం. పన్ను ఇచ్చుకోండి’’ అనే డైలాగుతో తనకు రాబోయే కష్టాలు,కన్నీళ్లను మేళతాళాలతో ఆహ్వానించాడు రాణిగారి తమ్ముడు.మాంత్రికుడుగారు గుర్రుమన్నాడు.‘‘ఎవడ్రా వీడు?’’ అని కూడా అన్నాడు.‘‘రాణిగారి తమ్ముడుగారండీ’’ జనంలో నుంచి ఎవరో చెప్పారు.‘‘మాకు ఎవరైనా ఒకటే’’ అని ఆ యువకిశోరాన్ని తీసిపారేస్తూ ‘హాంఫట్’ అని అరిచాడు. అంతే!తమ్ముడుంగారి నెత్తి మీద కిరీటంతో పాటు... మూతి మీద మీసం కూడా ఎటో ఎగిరిపోయింది. ఆడరూపం వచ్చేసింది‘భామలారా ఓ యమ్మలారా... తాళలేనే నే తాళలేనే’ అని విచిత్రమైన గొంతుతో గెంతులు కూడా వేశాడు... సారీ వేసింది. చేసిన తప్పు తెలుసుకున్న తమ్ముడుంగారు–మాంత్రికుడి కాళ్ల మీద పడి...‘‘మాంత్రికుడోయ్... మాంత్రికుడోయ్.... నన్ను రక్షించండి రక్షించండి’’ అని వేడుకున్నాడు.‘‘బుద్ధి కలిగి ఉంటావురా’’ అంటూ తమ్ముడుంగారిని చూస్తూ కన్నెర్ర చేశాడు మాంత్రికుడు. ‘‘ఉంటాను బాబు ఉంటాను. నన్ను మామూలు వీరుడ్ని చేయండి’’ సారీ చెబుతూనే... వీరుడ్ని చేయమని వరం అడిగాడు.‘‘విద్యలు వినోదాలు కాదురా... వివేకం కలిగి ఉండాలి’’ మీసం మెలేస్తూ ఉపదేశించాడు మాంత్రికుడు.తమ్ముడుంగారికి మళ్లీ మూమూలు రూపం వచ్చేసింది. ‘హమ్మయ్య’ అనుకున్నాడు నూటొక్క సారి!మాంత్రికుడు డింగరిని పిలిచి...‘‘ఒరేయ్ డింగరి, మహాజనం మన భక్తులు.ఇదిగో అక్షయఘటం. ఎవరికి ఏది కావాలో కోరుకోమను’’ అరిచాడు.ఒక వృద్ధుడు అరటిపండు అడిగాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అక్షయఘటంలో నుంచి అరటిపండు వచ్చింది. ఒకావిడ కుంకుమభరిణఅడిగింది. అలాగే వచ్చేసింది. పండ్లు అడిగిన వాడికి పండ్లు, వరహాలు అడిగిన వాడికి వరహాలు వచ్చాయి. అడిగిన వారికి అడిగినంత.తోటరాముడిలో అంతులేని ఆశ్చర్యం.తాను ఏ ఆశయ సాధన కోసం అయితే ఇంటి నుంచి బయలుదేరాడో ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే మాంత్రికుడి చేతిలో ఉన్న అక్షయఘటం తన చేతిలో ఉంటే చాలు అని అనుకున్నాడో లేదో, దాన్ని మాంత్రికుడి చేతి నుంచి లాక్కొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు తోటరాముడు. -
బట్టీ పట్టేస్తా...
‘‘స్కూల్లో కొన్నిసార్లు ఫార్ములాస్‌తో ఇబ్బంది పడుతుంటాం. కొన్నిసార్లు గట్టెక్కడానికి బట్టీ పట్టేసి ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవ్వకుండా బయటపడుతుంటాం. ప్రస్తుతం నేను అదే టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నాను’’ అంటున్నారు అదితీరావ్ హైదరీ. పరభాష హీరోయిన్లు తెలుగులో నటించినప్పుడు డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఈ సవాల్‌ని ఎలా ఎదుర్కొన్నారు? అని అదితీని అడగ్గా – ‘‘యాక్టర్‌గా చాలెంజ్లని ప్రేమిస్తాను. నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటకు తీసుకెళ్లే ఏ పనైనా ఇష్టమే. కొత్త భాషలని త్వరగా నేర్చుకోవడం కొంచెం ఇబ్బందే. యాక్చువల్లీ ఎంత పెద్ద డైలాగ్స్ అయినా బట్టీ పట్టగలను. లిప్ సింక్‌తో ఇబ్బంది పడకుండా చూసుకోగలను. ప్రస్తుతానికి డబ్బింగ్ కూడా చెప్పుకోగలుగుతున్నాను. త్వరలోనే అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటాను’’ అన్నారు. అదితీ నటించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న రిలీజ్ కానుంది. -
షారుఖ్ డైలాగ్స్‌తో అలరించిన కొల్కతా నైట్‌రైడర్స్
-
సింహం సింగిల్‌గా వస్తుంది..!
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించటంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమిళనాడు రాజకీయ ముఖచిత్రమే మారిపోనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను, రాజకీయ పక్షాలను ఊరించిన సూపర్‌స్టార్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో వెండితెర మీద రజనీకి నీరాజనాలు పట్టిన జనం రాజకీయాల్లోనూ ఆదరిస్తారా అన్న చర్చ మొదలైంది. రజనీ అంటేనే స్టైల్. ఆయన బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్ డెలివరీకి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. రజనీ కూడా తన సినిమాల్లో రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన పంచ్ డైలాగ్‌లను బాగానే పేల్చారు. మరి ఆ పంచ్ డైలాగ్స్ ఇప్పుడు పని చేస్తాయా.. వెండితెర మీద కాసులు కురిపించిన.. రజనీ మార్క్ డైలాగ్స్ ఓటర్లను ప్రభావితం చేస్తాయా..? ఈ సందర్భంగా అభిమానులను ఉర్రూతలూంగించిన రజనీ పంచ్ డైలాగ్స్ ను ఓసారి గుర్తు చేసుకుందాం.. కష్టపడందే ఏదీ రాదు.. కష్టపడుకుండా వచ్చింది ఏదీ ఉండదు నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే ఒక పిరికివాడితో యుద్ధం చేయటం నాకు.. మానిక్ భాషాకి నచ్చదు దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు నాయకుడికి బంధం, బంధుత్వం ఒక్కటే.. ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు నా దారి... రహదారి అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు ధనం అంతా నీ దగ్గరే ఉంటే మనఃశాంతి ఎలా ఉంటది.. ఏదో నీకు కావల్సినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనఃశాంతి దక్కుతుంది నాన్న పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత పుట్టుకతో వచ్చింది.. ఎన్నటికీ పోదు పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు.. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లరు.. ఇంకా దేనికయ్యా నీదీ నాదీ అనే స్వార్థం -
ఖైదీనంబర్ 150కి మాటలు రాయడం నా అదృష్టం
మాటల రచయిత, డైరక్టర్ తిరుమల వేమారెడ్డి ఎమ్మిగనూరురూరల్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్ 150కు మాటలు, డైలాగ్్స రాసే అవకాశం లభించడం తన అదృష్టమని రైటర్ తిరుమల వేమారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆయన బంధువుల గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేమారెడ్డి మాట్లాడారు. తనది మంత్రాలయం మండలం కల్లుదేకుంట గ్రామమని చెప్పారు. తండ్రి తిమ్మారెడ్డి, తల్లి సరోజమ్మల ప్రోత్సాహంతోనే తాను సినీఫీల్డ్‌లో రచయితగా, డైరెక్టర్‌గా రాణిస్తున్నట్లు వెల్లడించారు. మొదట్లో రచయిత పోసాని మురళీకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత స్నేహితులు, శివయ్య, మనసిచ్చిచూడు, హనుమాన్ జంక్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, రచ్చ, ధ్రువ తదితర సినిమాలకు రైటర్‌గా పనిచేశానన్నారు. వీవీ వినాయక్ తీసిని ‘దిల్’ సినిమాకు మాటలు రాయడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందనా్నరు. దర్శకుడిగా ‘చెక్కిలిగింత’ సినిమా తీసినట్లు చెప్పారు. తండ్రి తెచ్చి ఇచ్చిన నవలలు, పుస్తకాలు తన ఎదుగుదలకు దోహదపడ్డాయన్నారు. -
డై..లాగి కొడితే...
సినిమా : మగధీర రచన: ఎం. రత్నం దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి భారతదేశాన్నంతటినీ తానొక్కడే పరిపాలించాలని ఇతర రాజ్యాలపై దండయాత్ర చే సే షేర్‌ఖాన్ (శ్రీహరి) ఉదయ్‌ఘడ్ రాజ్యంపై దండెత్తేందుకు సైన్యంతో సిద్ధంగా ఉంటాడు. ఉదయ్‌ఘడ్ సుభిక్షంగా ఉండాలని యువరాణి మిత్రవిందతో (కాజల్ అగర్వాల్) భైరవకోనలో కాల భైరవునికి అభిషేకం చే యించే పనిలో ఉంటాడు కాలభైరవ (రామ్‌చరణ్). మిత్రవింద తనకు దక్కదని షేర్‌ఖాన్‌తో చేతులు కలిపి భైరవకోన వద్దకు వెళతాడు రణదేవ్ బిల్లా (దేవ్‌గిల్). నా మనుషుల్ని వందమందిని పంపిస్తా.. యువరాణి ఒంటిమీద చేయి పడకుండా ఆపు. ఈ రాజ్యాన్నీ, యువరాణిని నీకే అప్ప చెబుతా అంటాడు షేర్‌ఖాన్. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకుని పంపించ మని చెబుతాడు భైరవ. వాళ్లను చూస్తేనే నువు చస్తావురా అని షేర్ ఖాన్ హెచ్చరిస్తాడు. లెక్క ఎక్కువైనా ఫర్వాలేదు తక్కువ కాకుండా చూస్కో అని బదులిస్తాడు భైరవ. వందలో ఒక్కడు మిగిలినా నువు ఓడినట్టేరా అని షేర్‌ఖాన్ అంటే.. ‘ఒక్కొక్కర్ని కాదు షేర్‌ఖాన్.. వందమందిని ఒకేసారి రమ్మను’ అంటాడు భైరవ. లక్షలాదికి నచ్చిన డైలాగ్ ఇది. -
డై..లాగి కొడితే....
సినిమా : ఇంద్ర రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: బి.గోపాల్ వీరశంకర్ రెడ్డి (ముఖేష్ రిషి) చిన్న కొడుకును లారీ ప్రమాదం నుంచి ఇంద్రసేనా రెడ్డి (చిరంజీవి) కాపాడతాడు. ‘పగోడు పెట్టిన ప్రాణ భిక్షతో బ్రతికే బిడ్డ నాకొద్దు’ అంటూ వీరశంకర్ రెడ్డి తన కొడుకుని కత్తితో పొడిచి చంపి, శవాన్ని ఇంద్రన్నకు పంపిస్తాడు. ఆ బాలుడి శవాన్ని వీరశంకర్ రెడ్డి ఇంటికి తీసుకొస్తాడు ఇంద్రసేనా రెడ్డి. ఆ ఇంటి గుమ్మం ముందే పూడ్పించి, తులసి మొక్క నాటుతాడు. ‘చూడమ్మా.. నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప.. ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది. ప్రతిరోజు నీళ్లు పోసి పెంచు. పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు నీకు గుర్తుకు రావాలి. అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి’ అని వీరశంకర్ రెడ్డి భార్యకు చెప్పి వెళుతుండగా, వీరశంకర్ రెడ్డి ఆ మొక్కను పీకేయబోతాడు. అప్పుడు ‘వీరశంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అంటూ ఇంద్రసేనా రెడ్డి వార్నింగ్ ఇస్తాడు. ఆ డైలాగ్ తెగ పాపులర్ అయింది. -
ఫ్లయిట్లో డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య
హీరో బాలకృష్ణకు పౌరాణిక పాత్రలు అంటే చాలా మక్కువ. అందులోనూ తండ్రి ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలంటే బాలయ్యకు చాలా ఇష్టం. పలు సందర్భాల్లో బాలకృష్ణ ఆయా పౌరాణిక సినిమాల్లోని భారీ డైలాగ్స్ అవలీలగా చెప్పి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కూడా. తాజాగా విమాన ప్రయాణంలో ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన ఎవర్ గ్రీన్ ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని ఓ ప్రయాణికుడు తన ట్యాబ్ లో వీక్షిస్తున్నాడు. కాగా అదే ఫ్లయిట్లో బాలయ్య కూడా ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆయన సీటు దగ్గరకు వెళ్లి...అందులోని డైలాగ్స్ కొన్ని చెప్పాలంటూ విజ్ఞప్తి చేశాడు. దాన్ని తాను రికార్డు చేసుకుంటానని రిక్వెస్ట్ చేయడంతో... ఇక బాలయ్య... డైలాగ్స్‌తో అదురగొట్టారు. దాంతో ఉబ్బితబ్బిబ్బు అయిన ఆ యువకుడు బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ సన్నివేశం మొత్తాన్ని ఆ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూడండి మరి... -
ఫ్లయిట్లో డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య
-
రైట్ యాక్షన్?!
సినిమా సూపర్ డూపర్ హిట్. హీరో ఏం చేశాడ్రా.. అభిమానులు సంబరపడిపోయారు. డెరైక్టర్ ఏం తీశాడ్రా... ఓవరాల్‌గా ఆడియన్స్ అభినందించేశారు. ప్రొడ్యూసర్ బాగానే ఖర్చు పెట్టాడబ్బా.. బొమ్మ రిచ్‌గా ఉంది.. సినీ లవర్స్ అందరూ ప్రశంసించేశారు. హిట్ తాలూకు క్రెడిట్ ముందు హీరోకీ.. ఆ తర్వాత దర్శకుడికీ.. తీసిన నిర్మాతకీ దక్కేసింది. మరి.. రాసిన రచయితకు? అందుకేనేమో కొంతమంది రైటర్లు డెరైక్టర్లు అవుతున్నారు.. యాక్షన్ చెబుతున్నారు. ‘సినిమా రచయితలు ఇప్పుడు చాలా అరుదైన మొక్కల్లాంటివాళ్లు. వాళ్లను కాపాడుకోవాలి’ ఇది ఓ దర్శకుడు అన్న మాట. ‘ఫలానా సినిమాకు దర్శకుడెవరో అందరికీ తెలుస్తుంది. కాని డైలాగులు ఎవరు రాశారో ఎవరికీ తెలియడం లేదు?’ ఇది ఒక రచయిత నిరసన. ఈ రెండు స్టేట్మెంట్లు తెలుగు సినిమా రచనారంగపు వర్తమాన స్థితికి అద్దం పడుతున్నాయి. ‘రెండు సినిమాలు రాయి. ఆ తర్వాత డెరైక్టర్‌గా స్థిరపడు’... అనే సూత్రాన్ని ప్రస్తుత తెలుగు సినిమా రచయితలు పాటిస్తున్నారు. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస విజయాల తర్వాత ఇటీవలి కాలంలో కొరటాల శివ, బాబీ, అనిల్ రావిపూడి తదితరులు దర్శకులుగా మారడం, మరికొందరు మారుతుండటంతో వర్థమాన రచయితలు వీరిని మోడల్‌గా తీసుకొని పెన్ను పక్కన పెట్టి మెగాఫోన్ చేతపట్టేందుకు ఉత్సాహపడుతుండటం వల్ల ప్రస్తుతం రచయితల కొరత ఏర్పడుతోంది. మరోవైపు రచయితలుగా కొనసాగాలని ఉన్నా గుర్తింపు పట్ల అసంతృప్తితో, అవమానాల పట్ల ఏహ్యతతో దీని కంటే దర్శకుడిగా ఉండటమే మేలు అనుకోవడం వల్ల కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రచయితలు లేక దిక్కులు చూస్తూ ఉంది. కథ- మాటలు... రేటెంత? గొప్ప కథ దొరికితే చిరంజీవి 150వ సినిమాకి కోటి రూపాయలు కూడా ఇవ్వొచ్చు, తప్పు లేదని రామ్‌చరణ్ ఒక సందర్భంలో అన్నారు. 150వ సినిమాకే అంత పారితోషికం ఎందుకు ఇవ్వాలి...? ఏ పెద్ద సినిమాకి అయినా ఒక మంచి కథకు కోటి రూపాయలు ఎందుకు ఇవ్వకూడదు? అనేది కొందరి ప్రశ్న. నలభై యాభై కోట్ల బడ్జెట్‌తో ఒక పెద్ద సినిమా తీస్తున్నప్పుడు కోటి రూపాయలు రచయితకు ఇవ్వకూడదా? అనే ప్రశ్నకు ఇవ్వకూడదని చాలా మంది నిర్మాతలు సమాధానం చెప్తారు. దీని వల్ల ఎంత కష్టపడి ఎంత బాగా రాసినా ఓ మోస్తరు పేరున్న రచయితకు ఐదు నుంచి పది లక్షలు కూడా దక్కడం లేదన్నది ఒక చేదు వాస్తవం. మహా మహా కొమ్ములు తిరిగిన రచయితలు ఖాళీగా ఉండటం ఎందుకులే? అని ఐదు లక్షలకు ఒక స్క్రిప్ట్ అందిస్తుంటే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చిన రచయితలు ఎంత మంచి కథ రాసినా పది ఇరవై లక్షలు అడగడానికి జంకుతున్నారు. ఒకవేళ అడిగినా పెద్ద రచయితలను చూపించి వారికే అంతివ్వడం లేదని నిర్మాతలు చెబుతున్నారు. 25 వేలు... 50 వేలు... 2 లక్షలు... ఇండస్ట్రీలో రచయితల పారితోషికాలు ఎంతో డిమాండ్ ఉంటే తప్ప పెరగవు. సూపర్ హిట్ సినిమా ఇచ్చిన రచయిత మాత్రమే తను ఒక అంకె చెప్పి రాబట్టుకోగలడు. మిగిలినవా రికి అది దుస్సాధ్యం. ‘ఒక పెద్ద నిర్మాత నన్ను తన సినిమాకు ఒక వెర్షన్ రాయమన్నారు. 25 వేలు అడ్వాన్సు... పూర్తయ్యాక మరో ఇరవై అయిదు వేలు ఇస్తామన్నారు’ అని ఒక రచయిత తెలియచేశాడు. సాధారణంగా ఇప్పుడు చాలా మంది వర్థమాన రచయితలకు అడ్వాన్సుగా మహా అయితే లక్ష, స్క్రిప్ట్ పూర్తయ్యాక మరో లక్ష ఇస్తున్నారు. ఇందుకు ఆరునెలలు సినిమాతో పాటు ట్రావెల్ చేయాల్సి వస్తోంది. అంటే నెలకు ముప్పై వేల జీతం కూడా గిట్టుబాటు కావడం లేదన్న మాట. డెరైక్టర్ల పారితోషికం... సినిమా అనేది డెరైక్టర్ మీడియానే అయినా అది పుట్టేది కాగితం మీదే. రచయిత దానిని పేపర్ మీద రాయాలి. సింగిల్ లైన్, ట్రీట్మెంట్, డైలాగ్ వెర్షన్, అడిషనల్ డైలాగ్స్, లొకేషన్ ఇంప్రవైజేషన్... ఇవన్నీ ఒక సినిమా కోసం రచయిత చేసి పెట్టాల్సిన పనులు. ఒక సినిమాకు ఒక రచయిత అని కట్టుబడితే ఇది చాలా పెద్ద పనే. దీనికి వస్తున్న పారితోషికం మాత్రం చిన్నది. మరోవైపు దర్శకుడు కోటి రూపాయల నుంచి ఎనిమిది కోట్లు మరీ పెద్ద దర్శకుడైతే పదిహేను కోట్ల వరకూ తీసుకునే పరిస్థితి ఇండస్ట్రీలో ఉంది. మనం రాసిన దానిని తీసి అతను అంత సంపాదిస్తే మనమే తీసుకుని అంత డబ్బు సంపాదించవచ్చు కదా అనేది రచయితలకు దర్శకులుగా మారడానికి ఊతంగా పని చేస్తోంది. సృజనాత్మక విభేదాలు... రచయిత ఊహించినది లేదా రాసినది తెర మీద వేరేగా కనిపించినా తాను ఆశించినట్టుగా కనిపించకపోయినా రచయిత తీవ్ర అసంతృప్తికి లోనవడం సహజం. నా స్క్రిప్ట్‌ను నేను డెరైక్ట్ చేసుకుంటే ఈ బాధ ఉండేది కాదనుకునే అవకాశం ఉంది. ‘కొందరు డెరైక్టర్లు రచయితకు ఎక్కడ పేరొస్తుందో అని డైలాగును డల్ చేస్తారు. లేదా సీన్‌నే షార్ట్ చేస్తారు. ఇది మాకు చేస్తున్న అన్యాయమే’ అని ఒక పేరున్న రచయిత వాపోయారు. ఆడియో ఫంక్షన్లలో వేదిక మీదకు పిలవకపోవడం, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, టైటిల్స్‌లో అన్యాయం ఇవ్వన్నీ రచయితలను నిస్పృహకు గురి చేస్తున్నాయి. ఏం చేయాలి? రచయితలను విశ్వాసంలోకి తీసుకోవడం, ఒక సినిమాకు ఇద్దరు ముగ్గురిచే రాయించాలనుకున్నా ఆ సంగతి పారదర్శకంగా ఉంచి పని చేయించుకోవడం, పని- పని రోజులను బట్టి న్యాయమైన పారితోషికం ఇవ్వడం, క్రెడిట్స్‌లో గౌరవపూర్వకమైన భాగం ఇవ్వడం, ప్రమోషన్లో రచయితలను భాగం చేయడం, అన్నింటి కంటే మించి సినిమా అనేది అందరి కష్టంతో తయారయ్యే ప్రాడక్ట్ అని ప్రేక్షకులకు తెలియచేసేలా టెక్నిషియన్లను ప్రమోట్ చేయడం ఈ పరిస్థితికి కనీసం ఉపశమనం కావచ్చు. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మొత్తం మీరే చేశారు... ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్నా - బొమ్మరిల్లు ‘బొమ్మరిల్లు’ మాత్రమే కాదు.. ఊపిరి, క్షణం వంటి పలు హిట్ సినిమాలకు డైలాగులతో ప్రాణం పోసిన అబ్బూరి రవి ఏమంటున్నారంటే... ‘ప్రేక్షకుడు ఓ సినిమా చూస్తున్నప్పుడు ఈ డైలాగ్ బాగుంది. రాసిందెవరు? అనడిగితే మన ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కినట్లే. ఇక్కడ ఎవరూ ఎవర్నీ ఆపలేరు. ఎవరూ ఎవర్నీ దాచలేరు. ఎదుటి వ్యక్తి మనకు గుర్తింపు ఇస్తున్నారా? లేదా? అని ఆలోచిస్తే డిజప్పాయింట్ అవుతారు. ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో నాకు లభించిన గుర్తింపుకి హ్యాపీగా ఉన్నాను. వచ్చే ఏడాది దర్శకుడిగా మారబోతున్నా. ఎవరికో ఏదో చూపించాలని కాదు. నా కోసమే నేను దర్శకుడిగా మారుతున్నా. - అబ్బూరి రవి కట్టప్పా... వీళ్ల తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగేయ్ - బాహుబలి ‘బాహుబలి’ సినిమాకు మంచి పేరొచ్చింది. మరి, డైలాగ్ రైటర్స్ సీహెచ్ విజయ్‌కుమార్, అజయ్‌కుమార్‌లకు సక్సెస్ క్రెడిట్ దక్కిందా? వారి మాటల్లోనే.. ‘ప్రేక్షకులకు మేము తెలియదంతే. పబ్లిసిటీ కూడా చేసుకోలేదు. శ్రమ దోపీడి అనేది ప్రతి రంగంలోనూ ఉంటుంది. కొందరి రచయితల శ్రమను దోచుకున్నారేమో? మా (బాహుబలి) దర్శక-నిర్మాతలు చాలా మర్యాదగా చూసుకున్నారు. రచయితలు దర్శకులుగా మారడం వెనుక ఎవరి అభిప్రాయలు వారివి. ఇక్కడ చెప్పేదేంటంటే నన్ను నేను నిరూపించుకోవడానికే ఇండస్ట్రీకి వచ్చాను. ఎవరో గుర్తింపు ఇస్తారని ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా నువ్వేంటో నిరూపించుకో అనేది నా సిద్ధాంతం. త్వరలో హీరోగా, దర్శకుడిగా మారబోతున్నాను. - అజయ్‌కుమార్ ‘రాజమౌళిగారు అవకాశం ఇచ్చినప్పుడు నేను రాయగలనా? లేదా? అని సందేహపడుతుంటే.. ఆయనే ప్రోత్సహించారు. 17 ఏళ్ల నుంచి ఆయనతో పరిచయముంది. నాకు కోలీవుడ్, శాండిల్వుడ్ల నుంచి భారీ బడ్జెట్ మూవీ అవకాశాలు వస్తున్నాయంటే కారణం ‘బాహుబలి’ మూవీనే. తమ శ్రమకు తగిన గుర్తింపు రాలేదని బాధపడేవాళ్లు వాళ్ల ప్రయత్నాల్లో లోపం ఉందేమో చూసుకుంటే మంచిది’ - సీహెచ్ విజయ్‌కుమార్ నువ్వొక వెర్షన్... నేనొక వెర్షన్! తెలుగు సినిమాల్లో రచయితల మధ్య ఐకమత్యం లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమా? ఒకే రచయితకు ఎక్కువ పారితోషికం ఇచ్చి స్క్రిప్ట్ రాయించుకుని అది నచ్చక భంగపడటం కంటే ఎక్కువ మంది రచయితలకు తక్కువ పారితోషికం ఇచ్చి ఎక్కువ వెర్షన్లు రాయించుకుని వాటన్నింటి నుంచి సినిమాను రాబట్టుకోవడం మేలు అనే ధోరణి సినిమాల్లో బలపడింది. ఇది కొన్నిసార్లు ఉపయోగపడినా ఇదే సినిమాను వేరొకరు రాస్తున్నారు అన్న భావన రచయితను డీలా పడేస్తుంది. రోలింగ్ టైటిల్స్ రాజకీయం... దర్శకుడి చెప్పుచేతుల్లో ఉండే సినిమా ఇతరులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా పోయేలా చేయగలదు. దీనికి తార్కాణం టైటిల్స్. ఏ సినిమాకైనా దాని తారాగణం, సాంకేతిక నిపుణులు టైటిల్స్‌లోనే ప్రేక్షకులకు తెలుస్తారు. కొందరు దర్శకులు వేరొకరికి పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఈ టైటిల్స్‌ను జెట్ స్పీడు తో లాగించేస్తున్నారు. దీని వల్ల రచయిత కార్డు అసలు పడిందా లేదా? పడితే ఎవరు రాశారు అనేది తెలిసే లోపే ఆ కార్డు జారుకుని రచయితకు కడుపు మండే లా చేస్తోంది. ఇక మరీ అన్యాయంగా కొందరు దర్శకులు రచయితలను రోలింగ్ టైటిల్స్‌లో పడేస్తున్నారు. కవిగారూ అనే గౌరవం ఏది? సినిమాల్లో రచయితను కవిగారు అని పిలవడం పూర్వం ఆనవాయితీగా ఉండేది. సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, పింగళి నాగేంద్రరావు, ఆరుద్ర, శ్రీశ్రీ తదితరులంతా సెట్లోకి వచ్చిన వెంటనే ‘కవిగారు’ అని గౌరవం పొందేవారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి మహామహులు కూడా సినిమా రచనలో కొండవీటి వెంకటకవి, డి.వి.నరసరాజు, ముళ్లపూడి వెంకటరమణ వంటి వారిని గౌరవించారు. అయితే రైటర్స్‌గా స్టార్ స్టేటస్‌ను అనుభవించినవారిలో జంధ్యాల, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌లను చెప్పుకోవచ్చు. కాని రాను రాను ఈ పరిస్థితి మారింది. 2000 సం॥తర్వాత దర్శకుడే మాటల రచయితగా మారడంతో మాటల రచయితకు ఒక ఉనికి లేని పరస్థితి ఏర్పడింది. తేజ, దశరథ్, శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, సుకుమార్ తదితరులు తమ సినిమాల డైలాగులు తామే రాసుకోవడం ట్రెండ్‌గా మారింది. దీని కొనసాగింపుగా శ్రీకాంత్ అడ్డాల, దేవా కట్టా, మోహనకృష్ణ ఇంద్రగంటి, తాజాగా అవసరాల శ్రీనివాస్ వంటి వారు తమ సినిమాలకు తామే డైలాగులు రాసుకుంటున్నారు. దీని వల్ల రాసుకునే దర్శకుడు ఉంటే రచయితగా ఎవరైనా పర్వాలేదు అనే భావం ఏర్పడింది. ‘రెడీ’, ‘కింగ్’, ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘బాద్షా’ వంటి పలు హిట్ సినిమాలకు గోపీమోహన్ కథ అందించారు. కోన వెంకట్‌తో కలసి పలు సినిమాలకు పనిచేశారు. ‘సరైనోడు’ కథా చర్చల్లో పాలు పంచుకున్నారు. ఆయన ఏమంటారంటే... ‘దర్శకుడు-రచయిత మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద పని చేస్తుంటారు. నాకు ఇప్పటివరకూ ఏ ఇబ్బందీ ఎదురు కాలేదు. నిజానికి.. దర్శకుణ్ణి కావాలని ఇండస్ట్రీకి వచ్చా. యాధృశ్చికంగా రైటర్‌నయ్యా. డైలాగ్ రైటర్స్‌కి కాస్త ఎక్కువ అవకాశాలుంటాయి. స్టోరీ రైటర్స్‌కి తక్కువే. కమర్షియల్ దర్శకులు మాత్రమే స్టోరీ రైటర్స్ నుంచి కథలు తీసుకుంటున్నారు. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల.. మెజారిటీ అగ్ర దర్శకుల్లో చాలా మంది తమ కథలను తామే రాసుకుంటున్నారు. నా క్రియేటివ్ థాట్స్‌ను ఆవిష్కరించాలని దర్శకుణ్ణి అవుతున్నా’. - గోపీమోహన్ ఊసరవెల్లి, కిక్, ఎవడు, టెంపర్, రేసుగుర్రం తదితర చిత్రాలకు రచయితగా చేసిన వక్కంతం వంశీ ఏమంటున్నారంటే... ‘కథతో సినిమా పూర్తయ్యాక సినిమాకు సంబంధించి అనేక ప్రెస్మీట్లు, ఆడియో ఫంక్షన్లు జరుగుతుంటాయి. హీరో ఎవరో, దర్శకుడెవరో, సంగీత దర్శకుడెవరో అందరికీ తెలుస్తుంది. ఒక్క రచయిత తప్ప. ‘ఆడియో ఫంక్షన్లో నీ పేరు చెప్పటం మర్చిపోయాను. సారీ’ అంటారు. ఓ నవ్వు నవ్వి ఊరుకొంటాం. ఈలోపు సినిమా రిలీజు అవుతుంది. చూస్తే సగం కథ మనది ఉండదు. ఇదేంటని అడిగితే హీరో ఇలాగే కావాలన్నాడంటారు. సినిమా హిట్ అయితే హీరో దగ్గర కథ అంతా నాదే.. ఏదో మొదటి నుండి మనతో తిరుగుతున్నాడు కదా అని క్రెడిట్ ఇచ్చాం అంటారు సదరు డెరైక్టర్. అందరికీ ఇవే రీజన్స్ అని నేను అనను. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఏది ఏమైనా మన వర్క్ గురించి నలుగురు మాట్లాడాలి అనుకొంటున్నాను. అందుకే, అతి త్వరలో మెగా ఫోన్ పట్టుకొంటున్నాను. - వక్కంతం వంశీ -
తడాఖా చూపించిన తాప్సీ!
తాప్సీ అందంగా ఉంటారు.. బాగా నటిస్తారు.. చక్కగా మాట్లాడతారు... ఇది అందరికీ తెలిసిన విషయమే. తల్చుకుంటే ఈ బ్యూటీ డైలాగ్స్ కూడా రాయగలరు. ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఆమె ఓ సినిమాకి సంభాషణలు రాశారు. హిందీ చిత్రం ‘తడ్కా’లో ఆ డైలాగ్స్‌ని వినొచ్చు. ఇంతకీ ఇప్పుడు ఈవిడగారు రచయిత్రిగా మారడానికి కారణం ఏంటనే విషయంలోకి వస్తే... తెలుగు, కన్నడ భాషల్లో ప్రకాశ్‌రాజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం గుర్తుంది కదా! ఈ చిత్రాన్ని హిందీలో ‘తడ్కా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ప్రకాశ్‌రాజ్, శ్రీయ ఓ జంట కాగా, యువ జంటగా తాప్సీ, అలీ ఫాజల్ నటిస్తున్నారు. ‘మీ పాత్రలకు మీరే డైలాగ్స్ రాసుకోండి’ అని తాప్సీ, ఫాజల్కి ప్రకాశ్‌రాజ్ స్వేచ్ఛ ఇచ్చారట. ఆ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ - ‘‘ఏ ఆర్టిస్ట్ అయినా పాత్రను పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ పాత్ర ఏం మాట్లాడితే బాగుంటుందో వాళ్లకు తెలుస్తుందని ప్రకాశ్ సార్ అన్నారు. అప్పుడు ఆ ఆర్టిస్ట్ తాను చేసే పాత్ర మాట్లాడే డైలాగ్స్‌ని తానే రాసుకుంటే సహజత్వానికి దగ్గరగా ఉంటుందని కూడా ఆయన అన్నారు. అందుకే మా డైలాగ్స్ మేమే రాసుకున్నాం’’ అన్నారు. తాప్సీ, అలీ సొంతంగా డైలాగ్స్ రాయడంవల్ల ఓ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లే ఉందనీ, సినిమాటిక్‌గా లేదనీ చిత్రబృందం అంటోంది. మొత్తం మీద ‘తడ్కా’ సెట్లో రైటర్స్‌గా తమ తడాఖా ఏంటో తాప్సీ, అలీ చూపించేశారన్నమాట. -
తమిళం నేర్చుకోమ్మా!
మణిరత్నం సినిమాలో నటించే అవకాశం అంటే మాటలు కాదు. అందుకే ఆయన అవకాశం ఇస్తే, ఎగిరి గంతేస్తారు. పర్ఫెక్షన్ కోసం ఆయన ఏం చేయమంటే అది చేసేస్తారు. ఇప్పుడు అదితీ రావ్ హైదరి అలానే చేస్తున్నారు. కార్తీ, అదితీరావ్ జంటగా తమిళ, తెలుగు భాషల్లో మణిరత్నం ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. హైదరాబాద్‌లో పుట్టిన అదితీరావ్ ఈ సినిమా కోసం తమిళం నేర్చుకుంటున్నారు. డైలాగ్స్ అర్థం చేసుకుని చెబితే సీన్‌కి ఇంకా అందం వస్తుందని మణిరత్నం అన్నారట. అందుకే అదితి తమిళం నేర్చుకునే పనిలో పడ్డారు. త్వరలో ఈ షూటింగ్ ఆరంభం కానుంది. -
స్వీట్లకే మాటలొస్తే..!
ఫెస్టివల్ ఫీస్ట్ మిఠాయిలే పంచ్ డైలాగులు చెబితే! తమ స్వభావాన్ని విడమరచుకుంటూ ఉంటే!! మన తెలుగు హీరోల్లాగే అవీ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటే!!! ఆ స్వీట్ల తీరుని బట్టి వాటి డైలాగుల హోరిది. ఫ్రూట్ పంచ్లాగే స్వీట్ ‘ఫన్’చ్లివి... సున్నుండ : ఎవ్వర్ని తింటే గబుక్కున నోరు తెరచి మాట్లాడటం చేత కాదో... వాడే రా ఉండ... సున్నుండ. కొబ్బరిలడ్డు: తురిమేసిన నన్ను నమిలేయాలని చూడకు. నేను గానీ నాలుకెక్కి తరమడం మొదలుపెడితే... మిగతా రుచులు తెలియడానికి ఎన్ని గంటలు పడుతుందో నాకే తెలియదు. పూతరేకు : ఒక్క కొరుకుతో ఎలాగోలా కంప్లీటవ్వడానికి నేను పంటికిందికి రాలేదు... పన్ను దిగుతూ ఉన్న కొద్దీ తెలుస్తుందిరా ఫన్నూ. పొంగల్ : ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా. పండగకు మన పేరు పెట్టారా లేదా! విలన్: ‘‘ఎవడ్రానువ్వు?’’ సేమ్యాపాయసం: ‘‘పాయసమ్... ఒక్క నిమిషం టైమిస్తే వేగిపోతా... రెండు నిమిషాల్లో పాకం గిన్నెలో పడిపోతా. మూడో నిమిషానికి చెంచాలోంచి, నోట్లోకి స్మూత్‌గా దిగిపోతా. నాలాంటివాడితో ఇంతసేపు స్పెండ్ చేస్తే గిన్నెలో మిగలను కూడా మిగలను. నాలాంటివాడు ఎదురైతే ఎంత త్వరగా తినేయాలో అని చూడాల్రా. ఇంతసేపు టైమిస్తే చల్లబడి రుచితప్పుతా’’ కాజూ కట్లీ : ఎవరు కనబడితే ఠక్కున కొరికేస్తారో, ఎవరు చేతికొస్తే ఇతరులతో షేర్ చేసుకోడానికి వెనకాడతారో, ఎవ్వర్ని రుచిచూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందో... అదేనమ్మా... కాజూ కట్లీ! కజ్జికాయ: ఇష్టమైతే తిను కష్టమైతే మానేయ్. అంతేగానీ కొబ్బరికోరు మాత్రం తిని, పూరీ పోర్షన్ వదిలెయ్యకు అత్తా. వదిలేయకు. బూందీలడ్డూ : దీనిక్కొంచెం టేస్టుంది. దాంతో మహా ఫీస్టుంది. జాంగ్రీ : ఒక్కొక్కసారి కాదు టేస్ట్బడ్! వంద సార్లు తిను. వంద మార్లు రుచి చూడు. ఒక్కసారైనా నా రుచిని నువ్వు నెమరేసుకోకపోతే నేను ‘శత అంచు రౌండ్ల’ వంశానికి చెందిన మిఠాయినే కాదు. - యాసీన్ బొమ్మలు: అన్వర్ -
అంతకుమించి నటించలేనని వాళ్లకి అనిపించిందేమో - తాప్సీ
‘‘తెలుగు భాష మీద ఉన్నంత పట్టు నాకు తమిళం మీద లేదు. అయినా నా డైలాగ్స్ స్థానంలో ఏ.బీ,సీ,డీ, వన్ టూ త్రీలు చెప్పను. వాటి అర్థాలు తెలుసుకుని సంభాషణలు చెప్తాను.’’ అని కథానాయిక తాప్సీ చె ప్పారు.తను పనిచేసిన దర్శకుల గురించి తాప్సీ చెబుతూ-‘‘ ప్రతి దర్శకునికి ఓ స్టైల్ ఉంటుంది. అందుకే వాళ్లు చెప్పింది తు.చ తప్పకుండా పాటిస్తా. ఇంకా చెప్పాలంటే నా బ్రెయిన్‌ను స్విచ్చాఫ్ చేసేస్తాను. ఇప్పటికీ ఒక్కో సీన్ కోసం చాలా టేక్స్ తీసుకుంటాను. నటనలో నేను ప్రత్యేకంగా శిక్షణ ఏమి తీసుకోలేదు కాబట్టి, నా దర్శకుల నుంచి ఎంత నేర్చుకోవాలో అంత నేర్చేసుకుంటాను. ప్రస్తుతం సుజిత్ సర్కార్ దర్శకత్వంలో ‘ఆగ్రా కీ దబ్రా’ చిత్రం కోసం ఉర్దూ భాష కూడా నేర్చుసుకుంటున్నాను. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లు అంగీకరించేటప్పుడు ఇలాంటి కసరత్తులు తప్పనిసరిగా చేయాల్సిందే’’ అని అన్నారు. తెలుగు చిత్రాల్లో ఎందుకు నటించడంలేదన్న ప్రశ్నకు బదులిస్తూ ‘‘తెలుగులో ఇది వరకు నేను చేసిన పాత్రల తరహాలోనే అవకాశాలు వస్తున్నాయి. కొత్త పాత్రలు రావడం లేదు. అంతకుమించి నేను నటించలేనని వాళ్లకి అనిపించి ఉండచ్చు’’ అని చెప్పారు. -
దుమారం రేపుతున్న పవన్‌కల్యాణ్ డైలాగ్స్!
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన తాజా చిత్రం 'గోపాల గోపాల'లో జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్స్ దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాలో అదిరిపోయే డైలాగులున్నాయి. దైవత్వం నిండిన పాత్రలో పవన్ పేల్చిన మాటల తూటాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. పచ్చదళానికి గూబ గుయ్యమనిపిస్తున్నాయి. కొన్ని డైలాగ్స్ తమ మనో భావాలు దెబ్బతీసే విధంగా వున్నాయని తెలుగు తమ్ముళ్లు మధనపడుతున్నారు. ఈ చిత్రం పొలిటికల్ సెటైర్‌గా మారిపోయినట్లు కొందరు అంటున్నారు. పవన్‌కళ్యాణ్ చూపులతో దైవత్వాన్ని ప్రదర్శిస్తూనే మాటలతో మంట పెట్టాడని సైకిల్ శ్రేణులు లోలోపల గింజుకుంటున్నట్లు సమాచారం. ఈ డైలాగ్స్ చంద్రబాబు నాయుడుకి వర్తిస్తాయా? మరెవరికి వర్తిస్తాయి? అని సినిమా చూసిన ప్రేక్షకులు కొందరు ప్రశ్నించారు. పవన్ డైలాగులు టీడీపీ నేతల్లో సెగలు రేపుతున్నాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో పంచ్ ఇస్తోందని పరోక్షంగా చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చారని అంటున్నారు. * నమ్మించేవాడు నాయకుడు కాదు-నడిపించేవాడు నాయకుడు. * గెలిచేవాడు నాయకుడు కాదు-గెలిపించేవాడు నాయకుడు. ఈ డైలాగులు టీడీపీ శ్రేణులను మరీ ఇబ్బందిపెడుతున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుపును ఈ డైలాగ్స్ ప్రశ్నస్తున్నట్లు ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికల్లో పవన్ వల్లే టీడీపీ గెలిచిందని, పవనే లేకపోతే టీడీపీ గెలిచేది కాదనే అర్థంలో డైలాగ్స్ ఉన్నాయని అంటున్నారు. కొందరు పవన్ అభిమానులు అదే మాట చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ డైలాగ్స్‌పై టీడీపీ కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కొకరు ఒక్కోరకంగా స్పందించారు. అతనిని(పవన్) చూసి ఓటేశారనుకోవడం దురదృష్టకరం అని ఓ ప్రేక్షకుడు అన్నారు. పవన్ కల్యాణ్ తన శక్తిని నిరూపించారని, గత ఎన్నికలలో టీడీపిని అధికారంలోకి తీసుకువచ్చారని మరో ప్రేక్షకుడు చెప్పారు. చంద్రబాబు స్వయం కృషి వల్ల అధికారంలోకి వచ్చారని, ఎవరినో చూసి ఆయనకు ఓటువేయవలసిన అవసరంలేదని రాజమండ్రికి చెందిన ఓ ప్రేక్షకురాలు అన్నారు. మరికొన్ని రాజకీయ డైలాగ్స్: *కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా *సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు * దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని ఈ డైలాగ్స్‌ను దృష్టిలోపెట్టుకొని పవన్ అభిమానులు ఎవరికి తోచినవిధంగా వారు విశ్లేషిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఇటీవలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీని ముందుండి గెలిపిస్తారంటూ పవన్ అభిమానులు హుషారెత్తిపోతున్నారు. నాయకుడు ఎలా ఉండాలో పేర్కొంటూ పవన్ చెప్పిన డైలాగ్ అతని అంతరార్థాన్ని సూచిస్తోందని అభిమానులే పేర్కొంటున్నారు. తాను నమ్మించి మోసం చేసే వాడిని కాదని, నడిపించి గెలిపించే తత్వం తనదని పవన్ నర్మగర్భంగా చెప్పారని విశ్లేషిస్తున్నారు. -
పొలిటికల్ పంచ్‌ల.. గోపాలుడు..!!
-
దటీజ్ మోహన్‌బాబు
‘దానవీరశూరకర్ణ’ చిత్రానికి పోటీగా విడుదలైన ‘కురుక్షేత్రం’(1977) చిత్రాన్ని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తిలకించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఆ చిత్రం ఎన్టీఆర్‌కి నచ్చింది. ముఖ్యంగా ఆ చిత్రంలో శిశుపాలుడు పాత్ర పోషించిన కుర్రాడైతే బాగా నచ్చేశాడు. ‘ఈ శిశుపాలుడెవరో కానీ.. భవిష్యత్తులో గొప్పవాడవుతాడు’ అని జోస్యం చెప్పారు ఎన్టీఆర్. మహానటుని ప్రశంసలు పొందిన ఆ నటుడు - డా.మోహన్‌బాబు. 1980లో ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా విడుదలైంది. బంపర్ హిట్. డైలాగుల కేసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడైపోయాయి. తొలిసారి ఎన్టీఆర్ డైలాగులతో పాటు మోహన్‌బాబు డైలాగుల గురించి కూడా మాట్లాడుకోవడం మొదలైంది. ‘మా వంటవాడు భారతీయుడు... మా తోటవాడు భారతీయుడు... మా పనివాడు భారతీయుడు..’ అంటూ బ్రిటీష్ దొరగా మోహన్‌బాబు పలికిన డైలాగులు పిల్లల నోళ్లలో విపరీతంగా నానాయి. తన జోస్యం త్వరగా నిజమైనందుకు ఎన్టీఆర్ కూడా ఎంతో సంతోషించారు. ‘కొండవీటిసింహం’(1981)లో ఎన్టీఆర్, మోహన్‌బాబు తండ్రీ కొడుకులుగా నటించారు. ఆ సినిమా విడుదలై ముప్ఫై ఏళ్లు దాటుతున్నా... ఇప్పటికీ వారి పాత్రలనూ, ఆ సన్నివేశాలనూ ప్రేక్షకులు మర్చిపోలేరు. ‘కొండవీటి సింహం’ టైమ్‌కి నటునిగా మోహన్‌బాబు వయసు ఏడేళ్లు. అయినా సరే... ఆయనలో ఎక్కడా ‘మహానటుని ముందు నటిస్తున్నాను’ అనే భయం కనిపించదు. నిరూపించుకోవాలనే కసి కనిపిస్తుంది. దటీజ్ మోహన్‌బాబు. ప్రతినాయకునిగా మోహన్‌బాబుది ఓ చరిత్ర. కొత్త కొత్త ఊతపదాలను సృష్టించి సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికారాయన. సినిమాల విజయాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు కూడా కీలక భూమికలు పోషించేవంటే అతిశయోక్తికాదు. గోరంతదీపం, శివరంజని, పదహారేళ్ల వయసు, దేవత, తాండ్రపాపారాయుడు, శ్రీనివాసకల్యాణం, వారసుడొచ్చాడు, బ్రహ్మపుత్రుడు, ఖైదీనంబర్ 786, కొదమసింహం, కొడుకు దిద్దిన కాపురం... తదితర చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఇక హీరో మోహన్‌బాబు గురించి నేటి తరానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఫలానా తరహా పాత్రలు పోషించడంలో మోహన్‌బాబు దిట్ట’ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే... ఏ తరహా పాత్రనైనా అమోఘంగా పోషించగల దిట్ట ఆయన. పౌరాణిక, జానపద, చరిత్రాత్మక, సాంఘిక, కౌబాయ్... ఇలా అన్ని తరహా పాత్రల్లోనూ నటించిన ఘనత ఆయనది. నటునిగానే కాదు... నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా.. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయకేతనం ఎగుర వేసిన ప్రతిభాశాలి ఆయన. మోహన్‌బాబు నట ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికి 39 ఏళ్లు పూర్తిచేసుకుని, 40వ పడిలోకి ప్రవేశించారు. ‘స్వర్గం-నరకం’(1975) చిత్రంతో ఆయన హీరోగా తెరంగేట్రం చేశారు. ఇప్పటికీ అడపాదడపా నటిస్తూనే ఉన్నారు. త్వరలో ‘యమలీల-2’తో యమధర్మరాజుగా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. -
లవ్లీ ఎఫెక్షన్
హావభావాలు... గిలిగింతలు పెడతాయి. డైలాగులు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నవ్వుల రారాజు... ఢిల్లీ రాజు... ఎవరికి తోచినట్టు వారు ప్రేమగా పిలుచుకొంటారతడిని.రంగస్థలంసై ఉన్నా... వెండి తెరపై మెరిసినా... బుల్లి తెరపై ఇంట కనిపించినా... హాస్యపు జల్లులు కురుస్తాయి. సుతిమెత్తని కామెడీతో... మదిమదినీ మురిపిస్తున్న హాస్యనటుడు రాకేష్బేడీ. సినిమాలు, టీవీ నటుడిగా బిజీగా ఉన్నా...తనను నిలబెట్టిన రంగస్థలాన్ని మాత్రం ఆయన ఇప్పటికీ వదల్లేదు. నాటకాల్లో నటిస్తూ... అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన రాకేష్ ఇటీవల ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్లో భాగంగానగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’తో ఆయన ‘చిట్‌చాట్’... రుచికరమైన ఆహారం... మాట్లాడే భాష... ప్రజల స్నేహపూర్వక స్వభావం... హైదరాబాద్ నగరంలో నాకు బాగా నచ్చే అంశాలివి. ఇక్కడి వారు హిందీ, ఇంగ్లిష్ మాట్లాడే తీరు బాగుంటుంది. వారి మాటల్లో లవ్లీ ఎఫెక్షన్ కనిపిస్తుంది. అందుకే ఈ సిటీ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినా వదులుకోను. సిటీజనులు నన్నో గొప్ప నటుడిలా చూస్తున్నారు. వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రేక్షక దేవుళ్లకు కోటి దండాలు. తొలి సారి... తొలిసారి హైదరాబాద్‌కు ‘ఏక్ దూజే కేలియే’ హిందీ చిత్రం షూటింగ్ కోసం వచ్చా. ఇక అక్కడి నుంచి వస్తూనే ఉన్నా. 1979తో సహాయనటుడుగా సినీ కేరీర్ ప్రారంభించా. ఎన్నో టీవీ సీరియల్స్ చేశా. 150పై బడి సినిమాల్లో నటించాను. రంగస్థలం మీద ప్రదర్శనలైతే లేక్కే లేదు. యువత నటన వైపు... నేటి తరంలో క్రియేటివిటీ చాలా ఎక్కువ. చూస్తే చాలు... ఏదైనా చేసేసే టైపు. శ్రమను నమ్ముకుని పట్టుదలగా ముందుకు సాగితే అవకాశాలు వాతంటవే మన తలుపు తడతాయి. ఇప్పుడు ఒక విషయం గురించిన సమాచారం కావాలంటే... నెట్లో కావల్సినంత సమాచారం చిటికెలో దొరుకుతుంది. టాలెంట్‌ను ప్రదర్శించుకోవడానికి బోలెడన్ని ప్రసార మాధ్యమాలు. నటుడిగా రాణించాలంటే సెల్ఫ్ డిసిప్ల్లిన్, నిరంతర అధ్యయనం ఉండాలి. -
డైలాగ్ రైటర్‌గా కమల్‌హాసన్
‘సకలకళావల్లభన్’ అనే బిరుదుకు సార్థకతను తెచ్చిన వ్యక్తి కమల్‌హాసన్. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు.. ఆయన తరంలో కానీ, నేటి తరంలో కానీ ఎవరూ లేరన్నది నిజం. అభినయం పరంగానే కాకుండా, దర్శకునిగా, కథకునిగా, గాయకునిగా, నృత్యకారునిగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, నిర్మాతగా... పలు రంగాల్లో ప్రజ్ఞను చాటిన కళాకారుడు కమల్. ప్రస్తుతం ఆయన ‘ఉత్తమవిలన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో.. దర్శకుడు లింగుస్వామితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కమల్ సంభాషణలు కూడా అందించడం విశేషం. తొలుత క్రేజీ మోహన్‌తో సంభాషణలు రాయించాలనుకున్నారాయన. అయితే.. కథ తనదే కాబట్టి తానే స్వయంగా సంభాషణలు రాస్తే బావుంటుందని కమల్ భావించడంతో కొంత విరామం తర్వాత ఆయన కలం చేతబట్టారట. ఓ సీనియర్ సూపర్‌స్టార్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ అభినయం ప్రేక్షకుల్ని తన్మయత్వానికి లోను చేస్తుందని చెన్నయ్ టాక్. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: గిబ్రన్. -
సీఎం కిరణ్‌వన్నీ ఉత్తి డైలాగులేనా?