
తమిళం నేర్చుకోమ్మా!
మణిరత్నం సినిమాలో నటించే అవకాశం అంటే మాటలు కాదు. అందుకే ఆయన అవకాశం ఇస్తే, ఎగిరి గంతేస్తారు. పర్ఫెక్షన్ కోసం ఆయన ఏం చేయమంటే అది చేసేస్తారు. ఇప్పుడు అదితీ రావ్ హైదరి అలానే చేస్తున్నారు. కార్తీ, అదితీరావ్ జంటగా తమిళ, తెలుగు భాషల్లో మణిరత్నం ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. హైదరాబాద్‌లో పుట్టిన అదితీరావ్ ఈ సినిమా కోసం తమిళం నేర్చుకుంటున్నారు. డైలాగ్స్ అర్థం చేసుకుని చెబితే సీన్‌కి ఇంకా అందం వస్తుందని మణిరత్నం అన్నారట. అందుకే అదితి తమిళం నేర్చుకునే పనిలో పడ్డారు. త్వరలో ఈ షూటింగ్ ఆరంభం కానుంది.