Aditi Rao
-
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. అగ్రతారలతో అరుదైన ఫోటోలు
-
ఒక తాత ప్రధానమంత్రి.. ఇంకో తాతా జమీందారు..!
-
అదితి-సిద్ధార్థ్ ఒక్కటైంది ఇక్కడే (చిత్రాలు)
-
ఐఫోన్ లాంఛ్ ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ కపుల్.. ఫోటోలు
-
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
-
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
-
Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్
-
కలర్‌ఫుల్ డ్రెస్‌లో అదితి రావు హైదరి..ఉత్తరాఖండ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
అలాంటి లుక్‌లో హన్సిక పోజులు... ఉత్తరాఖండ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్... కలర్‌ఫుల్ డ్రెస్‌లో అదితి రావు హైదరీ హోయలు... గ్రీన్ డ్రెస్‌లో ప్రియమణి లుక్స్.. బీచ్‌లో తేజస్విని గౌడ స్మైలీ లుక్స్.. ఎల్లో డ్రెస్‌లో ఫరియా అబ్దుల్లా పోజులు.. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
అనార్కలీ డ్రస్‌లో అదిరిపోతున్న అదితి రావ్..ధర తెలిస్తే షాకవ్వుతారు!
సింప్లిసిటే తన స్టయిల్ సిగ్నేచరేమో అన్నట్టు ఉంటుంది అదితి రావ్ హైదరీ. ట్రెడిషనల్.. వెస్టర్న్ ఏ వేర్ అయినా ఆమె అందాన్ని పెంచడం కాదు.. ఆమే ఆ కాస్ట్యూమ్స్‌కు కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది! అదీ అదితి ఫ్యాషన్‌ను క్యారీ చేసే పద్ధతి. ఆ అదృష్టాన్ని వరించిన బ్రాండ్స్‌లో ఒకట్రెండు ఇక్కడ.. ఢిల్లీ వింటేజ్ కో మనీష్ ఛాబ్డాను ప్రముఖ డిజైనర్ అనేకంటే సంప్రదాయ చేనేత పరిరక్షకుడు అనొచ్చేమో! ‘ఢిల్లీ వింటేజ్ కో’ బ్రాండ్‌ను ప్రారంభించి.. గత 23 ఏళ్లుగా దేశీ నేత కార్మికులతో పనిచేస్తూ అద్భుతమైన డిజైన్స్‌ను సృష్టిస్తున్నాడు. ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. అదితి ధరించే ఢిల్లీ వింటేజ్ కో బ్రాండ్ డ్రస్ ధర రూ.1,22,000/- సిల్వర్ స్టీక్ స్టోర్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యూలరీ.. ఈ బ్రాండ్ బాణి. ఇండియన్ సెలబ్రిటీలకు హాట్ ఫేవరేట్ ఇది. ఆన్లైన్లోనే కొనుగోలు చేయాలి. ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్స్ ఓపెన్ కాలేదు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. నా దృష్టిలో డ్రెస్‌కి ఫిట్టింగ్ అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాతే ఫ్యాబ్రిక్.. డిజైన్.. స్టయిల్ ఎట్సెట్రా! డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే అందం ఆటోమేటిగ్గా ఫిక్స్ అవుతుంది! అపరాజితా తూర్ టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ ఫుట్‌వేర్ బ్రాండ్స్‌లో అపరాజితా తూర్ ఫుట్‌వేర్ ఒకటి. ముంబైలో మెయిన్ ఆఫీస్ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో లభించే ఈ జూతీస్కి ఇండియాలో మంచి గిరాకీ ఉంది. క్యాజువల్ ఫుట్‌వేర్ క్కూడా అందాన్ని అద్దడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. అందుకే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. అదితి రావ్ ధరించిన ఫుట్ వేర్ బ్రాండ్ ధర రూ. 6,399/-. (చదవండి: 'నా సామిరంగ’ మూవీ హీరోయిన్ చుడిదార్‌లో లుక్ మాములుగా లేదుగా!) -
జైపూర్‌లో అదితిరావు, సిద్ధార్థ్ సందడి..
-
కొరియోగ్రఫీ మాత్రం వదలొద్దు – నాగచైతన్య
‘‘హే సినామిక’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా వేడుకకి రావడం గౌరవంగా భావిస్తున్నా. బృందా మాస్టర్ కొరియోగ్రఫీకి నేను పెద్ద ఫ్యాన్. మీరు సినిమాలను డైరెక్ట్ చేయండి.. కానీ కొరియోగ్రఫీ మాత్రం వదలొద్దు.. ప్లీజ్’’ అని హీరో నాగచైతన్య అన్నారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ హీరో హీరోయిన్లుగా బృందా మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హే సినామిక’. జియో, గ్లోబల్ వన్, వయాకామ్ 18 స్టూడియోస్‌పై నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘బృందా మాస్టర్‌గారు సినిమాని డైరెక్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. ‘మనం’ సినిమాలోని ‘కనులను తాకే..’ అనే మాంటేజ్ పాటకు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారామె. చెన్నైలో ఉన్నప్పటి నుంచే నాకు, దుల్కర్‌కి పరిచయం ఉంది. తను ప్రతి భాషలోనూ సినిమాలు చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘హే సినామిక’ నాకు చాలా ప్రత్యేకం. పాటల్లో రొమాన్స్, ఎమోషన్స్ ఎలా చేయాలో నాతో బాగా చేయించేవారు బృందామాస్టర్. ఆమె నాకు తల్లిలాంటిది. ‘హే సినామిక’ చూసి నవ్వుతారు, ఏడుస్తారు, డాన్స్ చేస్తారు’’ అన్నారు. ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో నేను డాన్స్ మాస్టర్‌గా ఉన్నానంటే కారణం నిర్మాతలు రామానాయుడుగారు, సురేశ్బాబుగారే. ‘హే సినామికా’ దర్శకురాలిగా నా తొలి చిత్రమైనా దుల్కర్ ఓకే చెప్పడం హ్యాపీ’’ అన్నారు బృందామాస్టర్. ‘‘హే సినామిక’ చూసి మీరందరూ తప్పకుండా నవ్వుతారు’’ అన్నారు అదితీరావ్ హైదరీ. నిర్మాత డి.సురేశ్ బాబు మాట్లాడుతూ–‘‘డాన్స్ మాస్టర్‌గా బృందాని చాలా రోజులుగా చూస్తున్నా. ఆమె సినిమాని డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘హే సినామికా’ బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నా డాన్స్‌లో గురు బృందామాస్టర్. నాతో డాన్స్ చేయించేందుకు ఆమె ఎంత కష్టపడిందంటే.. ఆమె కెరీర్లో చాలా కష్టమైన హీరో నేనే అయ్యుంటాను.. అందుకే నేను హీరోగా మానేశాను కూడా(నవ్వుతూ)’’ అన్నారు నటుడు జగపతిబాబు. ‘‘బృంద కొరియోగ్రఫీ చేస్తున్నారంటే మణిరత్నంలాంటి డైరెక్టర్ కూడా సెట్స్‌లో ఉండరు.. ఆమె ప్రతిభపై అంత నమ్మకం. ‘హే సినామిక’ ద్వారా విజువల్ ట్రీట్ ఇస్తున్నారామె’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. -
సోషల్ హల్చల్: నీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ..
♦ ఫొటో పిచ్చ పర్ఫెక్ట్గా వచ్చిందంటున్న పాయల్ రాజ్‌పుత్ ♦ ఫోనులో ఊసులాడుతున్న హెబ్బా పటేల్ ♦ ఓరకన్నుతో చంపేస్తోన్న 'డీ కంపెనీ' నటి నైనా గంగూలీ ♦ చమక్కుమని మెరుస్తోన్న కాజల్ ♦ ఫన్ టైమ్ అంటూ నాలుక బయటపెట్టిన శిల్పా శెట్టి ♦ నాజూకు సొగసుతో కైపెక్కిస్తోన్న కియారా అద్వానీ ♦ పచ్చని చెట్ల మధ్య పూల చీర కట్టుకున్న దియా మీర్జా ♦ మగత నిద్రలోకి జారుకున్నట్లు పోజిచ్చిన అదితి రావు హైదరీ ♦ పచ్చటి పైరు మీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్న వితికా శెరు ♦ రెడ్ డ్రెస్సులో ప్రియమణిని చూసి అనాల్సిందే.. షీ సో క్యూట్.. షీ సో హాట్.. ♦ గాల్లోకి చూస్తూ కుర్రకారులను ఊపిరాడనివ్వకుండా చేస్తున్న సంజీదా షైక్ View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda) -
ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయావు
కోయంబత్తూరు: షూటింగ్ సెట్స్‌లో గుండెపోటుతో కుప్పకూలిన మలయాళ దర్శకుడు నారానీపుజ షానవాస్(37) కన్నుమూశారు. కేరళలోని పాలక్కడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'గంధీరాజన్' సినిమా సెట్స్‌లో డిసెంబర్ 21న షానవాస్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని చిత్రయూనిట్ కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించింది. అక్కడ ఆయన పరిస్థితి మరింత విషమించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు బుధవారం వెల్లడించారు. ఏదైనా మిరాకిల్ జరిగి బతుకుతాడేమోనన్న ఆశతో అతడిని వెంటిలేటర్‌పైనే ఉంచినప్పటికీ అదే రోజు సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పలువురు సెబబ్రిటీలు ఆయన మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి:కూరగాయలమ్ముతున్న ప్రముఖ డైరెక్టర్) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) "ఆయన కథల్లాగే షాన్వాస్ కూడా ఎంతో మంచివారు, సున్నిత హృదయం కలవారు. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలి" అంటూ హీరోయిన్ అదితి రావు సోషల్ మీడియా వేదికగా దర్శకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నటుడు జయ సూర్య సెట్స్‌లో అతడితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. 'ఎన్నో కథలను చెప్పావు, మరెన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయావు..' అంటూ నిర్మాత విజయ్ బాబు ఫేస్బుక్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా నారానీపుజ షానవాస్ 2015లో 'కేరీ' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కొంత కాలం గ్యాప్ తర్వాత అదితిరావు హైదరీ, జయసూర్య, దేవ్ మోహన్ నటీనటులుగా 'సూఫియమ్ సుజాతయుమ్' చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. (చదవండి: కమెడియన్‌ను పెళ్లి చేసుకున్న నటి) View this post on Instagram A post shared by actor jayasurya (@actor_jayasurya) -
హీరోయిన్ అదితీ రావ్ హైదరీ క్యూట్ ఫోటోలు
-
ప్రాక్టీస్.. ప్రాక్టీస్
ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, అదితీ రావ్ హైదరి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా తొలి షెడ్యూల్ థాయ్‌ల్యాండ్‌లో జరిగింది. ‘జయం’ రవి, కార్తీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్‌ను ఆరంభించాలనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యేలోపు కథలోని పాత్రలకు తగ్గట్లుగా మౌల్డ్ అయ్యే పనిలో ఉన్నారు ఈ చిత్రంలోని నటీనటులు. ఇందులో భాగంగానే అదితీ రావ్ హైదరి కలరిపయట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇంటిపట్టునే ఉంటున్న అదితీ ఈ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్‌కే రోజులో ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారట. తన ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అదితీ రావ్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
నో చెప్పడంతో మూడు చిత్రాలు కోల్పోయాను : అధితిరావ్
తమిళసినిమా: మణిరత్నం హీరోయిన్‌కు అడ్జెస్ట్మెంట్ వేధింపులు తప్పలేదట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. మణిరత్నం కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి అధితిరావ్. ఇటీవల కూడా ఆయన దర్శకత్వంలో వహించిన సెక్క సివంద వానం చిత్రంలో ఈ బ్యూటీకి అవకాశం కల్పించారు. అలా గుర్తింపు తెచ్చుకున్న అధితిరావ్ తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో కలిసి ఒక నూతన చిత్రంలో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఇటీవల కాస్టింగ్ కౌచ్, ఇప్పుడు మీటు సంఘటనలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పుడు చాలా మంది తమకు జరిగిన లైంగికవేధింపుల సంఘటనల గురించి బయట ప్రపంచానికి చెప్పుకుని ఇన్నాళ్లూ తమ గుండెల్లో రగులుతున్న బడబాగ్నులను చల్లబరచుకుంటున్నారు. అదే విధంగా నటి అధితిరావ్ కూడా దీనిపై స్పందించి తనకు ఎదురైన సంఘటనలను వెల్లడించింది. అడ్జెస్ట్‌మెంట్‌కు నో చెప్పడంతో నేనూ మూడు చిత్రాల అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పిందో చూద్దాం. వారసుల కంటే సినీ నేపథ్యం లేని వారిని అవకాశాల కోసం పడక గది వేధింపులకు అధికంగా గురవుతున్నారని నేను చెప్పలేను గానీ, నా గురించి మాత్రం చెప్పగలను. కొత్తగా ఈ రంగానికి వచ్చే వారు లక్ష్యం దిశగా ముందుకెళ్లడం కష్టమే. అయితే అది అసాధ్యం కాదు. అందుకు ఉదాహరణ నేనే. అడ్జెస్ట్ కానందుకు అవకాశాలు తగ్గుతాయి. అయినా నా విధానాలను మార్చుకోలేదు. మొదట్లో చెడు అనుభవం ఎదురైంది. అడ్జెస్ట్‌మెంట్‌కు నో చెప్పడంతో మూడు చిత్రాల అవకాశాలను కోల్పోయాను. గౌరవంగా జీవించాలన్నది లక్ష్యంగా జీవిస్తున్నాను. నాకు గౌరవ మర్యాదలే ముఖ్యం. అందుకు అవకాశాలు పోయినా పర్వాలేదు. అదే విధంగా మహిళలకు సినిమా రంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ సరైన భద్రత లేదు. అన్ని రంగాల్లోనూ విభిన్న వ్యక్తులు ఉంటారు. కొందరు మర్యాదగా నడుచుకుంటే, మరి కొందరు మహిళపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎదగడం కష్టమే. ఇకపోతే నేనెందుకు ఇంకా నంబర్ ఒన్ హీరోయిన్ను కాలేదని చాలా మంది అడుగుతున్నారు. అందుకు నా వద్ద సరైన సమాధానం లేదు గానీ, నాకు లభిస్తున్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నాను. నేను కొందరు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించాను. దీంతో నంబర్‌వన్ నటిని కాలేకపోయానన్న బాధ ఏ కోశానా లేదు. కొందరు అధిక పారితోషాకం పొందడాన్ని విజయంగా భావిస్తారు. మరి కొందరు పలు అవార్డులను గెలుచుకోవడాన్ని సక్సెస్‌గా భావిస్తారు. ఇంకొందరు అధిక చిత్రాల్లో నటించడాన్ని విజయంగా భావిస్తారు. నేను మాత్రం ఒక పెద్ద దర్శకుడు నటించడానికి అవకాశం ఇస్తే గౌరవంగా భావిస్తాను. అదే నాకు విజయం అని అధితిరావ్ పేర్కొంది. -
సమ్మోహనం సెన్సార్ పూర్తి
ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలంటే ఫ్యామిలీ అంతా హాయిగా కూర్చొని చూడొచ్చు. సుదీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నింటికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమాలోని మాటలు, పాటలు, లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వినోదం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 15న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల కత్తెరకు ఎలాంటి పని చెప్పకుండా.. ఈ సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్‌ను పొందింది. జూన్ 10న జరుగుబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్‌బాబుకు జోడీగా అదితి రావు హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వివేక్‌సాగర్ సంగీతాన్ని అందించారు. It's clean U for #Sammohanam #SammohanamOnJune15th https://t.co/fBG7BSsMqX — Sudheer Babu (@isudheerbabu) June 7, 2018 -
సమ్మోహనం ట్రైలర్ రిలీజ్
-
‘మన రేటింగ్ కోసం పొర్లుదండాలు పెట్టాలిరా..!’
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్‌ను లాంచ్ చేయించారు. చిరును ఇంటర్వ్యూ చేసి మెగా అభిమానులను అట్రాక్ట్ చేశాడు సుధీర్‌బాబు. సమ్మోహనం టీజర్‌ను చాలా కొత్తగా, గ్రాండ్ లొకేషన్స్‌లో చూపించేసరికి ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. నేడు (గురువారం) సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సమ్మోహనం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. కామెడీ, ప్రేమ, ఎమోషన్స్‌తో కూడుకున్న ఈ ట్రైలర్లో సుధీర్‌బాబు, హీరోయిన్ అదితీ రావు అందంగా కనిపించారు. ట్రైలర్లోనే సినిమా కథేంటో రివీల్ చేసినట్టుగా కనిపిస్తోంది. వివేక్ సాగర్ సంగీతమందించగా.. ఇంద్రగంటి మోషనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
సుధీర్ బాబుకు ‘చిరు’ సహాయం
-
‘చిరు’ సమ్మోహనం
చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ తేడా లేకుండా పిలిస్తే పలుకుతా అన్నట్లు... ఎవరు పిలిచినా వచ్చి తన సపోర్టును ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య చాలా సినిమా ఫంక్షన్లకు హాజరైన చిరు తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ‘సమ్మోహనం’ సినిమా టీజర్‌ను చిరంజీవి రేపు ( మే 1) విడుదల చేయనున్నారు. ఇలా తన వంతు సహాయాన్ని చిరు చేస్తున్నారు. ఆయన కూడా ఇలాంటి వాటికి రావడానికి శ్రద్ధ చూపిస్తున్నట్లు సమాచారం. తను హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక పెద్ద హీరోను తన సినిమా ఫంక్షన్‌కు పిలిస్తే రాలేదని...అప్పుడు చాలా బాధపడ్డానని... ఆ బాధేంటో తనకు తెలుసునని, ఒక పెద్ద హీరో ఇలా వచ్చి ప్రమోట్ చేస్తే ఆ సినిమాకు బూస్ట్‌ను ఇచ్చినట్టు అవుతుందని ఇటీవలే హాజరైన ఓ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి చెప్పారు. సమ్మోహనం సినిమా టీజర్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ కానుంది. సరైన హిట్ లేక సతమతమవుతున్నసుధీర్ బాబు ఈ సినిమాతో ఎలాగైన విజయం సాధించాలనుకుంటున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా..శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు. సుధీర్‌బాబుకు జంటగా అదితి రావు నటిస్తోంది. -
వై పద్మావతి?!
‘పద్మావత్’ చిత్రంలో పద్మావతి కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ.. ఢిల్లీలో తన రాజ్యాన్ని వదిలేసి చిత్తోడ్‌ఘడ్ చేరుకుని అక్కడి ఎడారిలో గుడారం వేసుకుని కూర్చుంటాడు! ‘తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ కూర్చున్నా..’ అని 1978 నాటి ‘ఇంద్రధనస్సు’ సినిమాలో కృష్ణ పాడతాడు కదా, శారద కోసం.. అలా ఇక్కడ ఖిల్జీ.. పద్మావతి కోసం అలమటిస్తుంటాడు. అతడి కళ్లు చెమ్మగిల్లుతాయి కూడా. ‘ఏంటి అంతటివాడికి ఇంత ఖర్మ?’ అని అనిపిస్తుంది ప్రేక్షకులకు. ‘పద్మావతంత అపురూపమైన మానవ స్త్రీ ఈ భువిలో లేదని’.. నమ్మకద్రోహి అయిన చిత్తోడ్‌ఘడ్ రాజగురువు ఢిల్లీ వెళ్లి ఖిల్జీకి చెప్పి, అతడిని రెచ్చగొట్టడంతో ఆ మాయలో పడిపోతాడు ఖిల్జీ! అతడి భార్య మెహరున్నీసా కూడా అందాలరాశే. అంత అందాన్ని కళ్లెదుట పెట్టుకుని, వేరే రాజ్యపు స్త్రీ కోసం ఖిల్జీ పాకులాడటం కూడా ఆడియన్స్‌కి అతడిపై గౌరవాన్ని తగ్గిస్తుంది. సినిమా చూస్తున్నవారికి హాల్లోంచి ఒక మాట తప్పనిసరిగా వినిపిస్తుంది. ‘అరె.. ఈవిడ కూడా అందంగా ఉంది కదా. ఖిల్జీకి ఇదేం పోయేకాలం?’ అని! ఖిల్జీ భార్యగా అతిథి రావ్ హైదరీ నటించారు. నిజంగానే ఆమె దీపికా పదుకోన్‌కి దీటుగా ఉన్నారు. -
మణిరత్నంను ఆకట్టుకున్న అతిథి
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రాల్లో రిపీట్ అయిన కథానాయికలు చాలా తక్కువనే చెప్పాలి. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మాత్రమే ఇరువర్, గురు,రావణన్ చిత్రాల్లో నటించారు. తాజాగా మరో బాలీవుడ్ నటి అతిథిరావు దర్శకుడు మణిరత్నంను బాగా ఆకట్టకున్నారు. ఈ బ్యూటీని కార్తీకి జంటగా కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేశారు.ఆ చిత్రం విడుదలై ఇటు పరిశ్రమ వర్గాలలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ మిశ్రమ స్పందనను పొందినా, మణిరత్రం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన తాజా చిత్రానికి రెడీ అయిపోయారు. ఈ సారి తమిళం, తెలుగు భాషల్లో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో తాను దళపతి చిత్రం ద్వారా పరిచయం చేసి, రోజా, బొంబాయి చిత్రాలతో రొమాంటిక్ హీరోగా మార్చిన నటుడు అరవిందస్వామిని తాజా చిత్రంలో కథానాయకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. అదే విధంగా టాలీవుడ్ యువ స్టార్ నటుడు రామ్‌చరణ్‌ను మరో హీరోగా ఎంపిక చేసినట్లు టాక్ హల్చల్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు అతిథిరావునే ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాట్రువెలియిడై చిత్రంలో ఈ అమ్మడి అభినయం అంతగా మణిరత్నంకు నచ్చేయడంతో తన తాజా చిత్రంలోనూ ఈ భామనే నాయకిగా ఎంచుకున్నారని టాక్. మొత్తం మీద కోలీవుడ్‌లో అతి«థిరావు మరో అవకాశం కొట్టేసిందన్నమాట. -
రేపు తెరపైకి ఆరు చిత్రాలు
శుక్రవారం అరడజను చిత్రాలు తెరపైకి రానున్నాయి. వాటిలో మణిరత్నం, కార్తీల కాట్రువెలియిడై, చాయ, విరుదాచలం,సెంజిట్టాలే ఎన్ కాదల, 8 తట్టాక్కల్, జూలియుం 4 పేరుం చిత్రాలు ఉన్నాయి. దర్శకుడు మణిరత్నం తాజా సృష్టి కాట్రువెలియిడై. కార్తీ, బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీత మాత్రికుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు అందించారు. ఈ చిత్రం చెలియ పేరుతో తెలుగులోనూ ఏక కాలంలో తెరపైకి రానుంది. కశ్మీర్ ప్రాంతంలో అధిక భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ కాట్రు వెలియిడై. ఇకపోతే సోనియా అగర్వాల్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటించిన చిత్రం ఛాయ. ఈ చిత్రానికి వీఎస్.పళనివేల్ దర్శకుడు. నిజానికి ఈ చిత్రం గత నెలలోనే విడుదల కావలసి ఉంది. థియేటర్ల కొరత కారణంగా వాయిదా పడింది.మూడో చిత్రం విరుదాచలం. లక్ష్మీఅమ్మాళ్ ఫిలింస్ పతాకంపై పి.సెంథిల్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో విరుదగిరి, శ్వేత, సమీర నాయికానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని రతన్గణపతి నిర్వహించారు. ఈ చిత్రానికి శ్రీరామ్ సంగీతాన్ని అందించారు. నాలుగవ చిత్రం చెంజిటాళే ఎన్ కాదల. ఎస్బీ.ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై ఎస్.బాలసుబ్రయణియన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎళిల్దురై దర్శకుడు, కథానాయకుడు మధుమిల, అభినయ కథానాయికలుగా నటించారు. ఎఫ్.రాజ్‌భరత్ సంగీతం అందించిన ఇది విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరపైకి రానుంది. ఇక క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం 8 తోట్టాక్కల్. శ్రీగణేశ్ దర్శకత్వం వహించిన ఇందులో వెట్ట్రి, అపర్ణ బాలమురళి జంటగా నటించారు. ఆరవ చిత్రం జూలియుం 4 పేరుం. సువేదదేవి నిర్మించిన ఈ చిత్రానికి సతీశ్ దర్శకుడు. అమిధవన్, అల్యా మానస హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రఘు శ్రావణ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ఈ నెల 14న నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన పవర్‌పాండి, పి.వాసు దర్శకత్వంలో లారెన్స్, రితికాసింగ్ జంటగా నటించిన శివలింగ, ఆర్య నటించిన కడంబన్ వంటి భారీ చిత్రాలు విడుదల కావడం, అదే విధంగా 28వ తేదీన రాజమౌళి చిత్రం బాహుబలి–2 చిత్రం భారీ ఎత్తున్న విడుదలకు సిద్ధం కావడంతో చిన్న చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలను శుక్రవారం విడుదల చేయడానికి సిద్ధం అయ్యారన్నది గమనార్హం. -
నేను మణిరత్నంను కలిసుండకపోతే..
నేను దర్శకుడు మణిరత్నంను కలిసుండకపోతే ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు అని పేర్కొన్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ . సోమవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినిమాస్ థియేటర్లో జరిగిన కాట్రువెలియిడై చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రెహ్మాన్ పై విధంగా వ్యాఖ్యానించారు. మణిరత్నం తాజా చిత్రం కాట్రువెలియిడై. కార్తీ, అదితిరావు జంటగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతభాణీలు అందించారు. ఈ చిత్ర ఆడియోను ఆయన ఆవిష్కరించగా నటుడు సూర్య తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ తాను ఏఆర్.రెహ్మాన్ కలిసి 25 ఏళ్లుగా పని చేస్తున్నామన్నారు. ఏఆర్.రెహ్మాన్ తో కలిసి పని చేయడం ఎప్పుడూ ఒక కొత్త అనుభవమేనని పేర్కొన్నారు. కాట్రువెలియిడై భారతీయ విమానదళం నేపధ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలిపారు. తాను కార్తీను మూడు రోజుల క్రితం కలిసినప్పుడు షూటింగ్ సమీపంలో యుద్ధ విమాన అధికారులను చూసినప్పుడు లేచి నిలబడి వారికి గౌరవాన్ని ఇస్తానని అన్నారన్నారు. అలా వారి గౌరవాన్ని ఆవిష్కరించే చిత్రమే కాట్రు వెలియిడై అని పేర్కొన్నారు. ఏఆర్.రెహ్మాన్ మాట్లాడుతూ మణిరత్నం తనకు లభించిన వరప్రసాదం అన్నారు. తాను ఆయన్ను కలిసుండకపోతే ఈ స్థాయిలో ఉండేవాడినే కాదన్నారు. సూర్య మాట్లాడుతూ తాను, తన భార్య మణిరత్నంను చాలా కాలంగా అడగాలనుకుంటున్న ప్రశ్న ఆయన ఇప్పటికీ ఇంత అందమైన ప్రేమ కథా చిత్రాలను ఎలా తెరకెక్కించగలుగుతున్నారన్నారు. కార్తీ మాట్లాడుతూ తాను మణిరత్నం వద్ద మోస్ట్ అసిస్టెంట్‌గా ఉండి కథానాయకుడిని అయ్యానన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని, పనిలో ఇంత సిన్సియర్‌గా ఉంటున్నానంటే ఆయనే కారణం అన్నారు. మణిరత్నం తనను నటించమని ఈ చిత్ర స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనన్నారు. కాట్రువెలియిడై చిత్రం లో నటించడం ఒక మధురమైన అనుభవంగా కార్తీ పేర్కొన్నారు. ఈ చిత్రంతో తన కల నిజమైందని నటి అదితిరావు పేర్కొన్నారు.