‘చిరు’ సమ్మోహనం | Chiranjeevi Releasing Sammohanam Movie Teaser | Sakshi
Sakshi News home page

‘చిరు’ సమ్మోహనం

Published Mon, Apr 30 2018 3:38 PM | Last Updated on Mon, Apr 30 2018 5:43 PM

Chiranjeevi Releasing Sammohanam Movie Teaser - Sakshi

చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ తేడా లేకుండా పిలిస్తే పలుకుతా అన్నట్లు... ఎవరు పిలిచినా వచ్చి తన సపోర్టును ఇస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ మధ్య చాలా సినిమా ఫంక్షన్లకు హాజరైన చిరు తాజాగా సుధీర్‌ బాబు నటిస్తున్న ‘సమ్మోహనం’ సినిమా టీజర్‌ను చిరంజీవి రేపు ( మే 1) విడుదల చేయనున్నారు. 

ఇలా తన వంతు సహాయాన్ని చిరు చేస్తున్నారు. ఆయన కూడా ఇలాంటి వాటికి రావడానికి శ్రద్ధ చూపిస్తున్నట్లు సమాచారం. తను హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక పెద్ద హీరోను తన సినిమా ఫంక్షన్‌కు పిలిస్తే రాలేదని...అప్పుడు చాలా బాధపడ్డానని... ఆ బాధేంటో తనకు తెలుసునని, ఒక పెద్ద హీరో ఇలా వచ్చి  ప్రమోట్‌ చేస్తే ఆ సినిమాకు బూస్ట్‌ను ఇచ్చినట్టు అవుతుందని ఇటీవలే హాజరైన ఓ ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి చెప్పారు.

సమ్మోహనం సినిమా టీజర్‌ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్‌ కానుంది. సరైన హిట్ లేక సతమతమవుతున్నసుధీర్‌ బాబు ఈ సినిమాతో ఎలాగైన విజయం సాధించాలనుకుంటున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా..శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు. సుధీర్‌బాబుకు జంటగా అదితి రావు నటిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement