సాహిత్యం ,సినిమా రెండూ బతికే ఉంటాయి..అంతే! | Sammohanam Teaser Was Released | Sakshi
Sakshi News home page

Published Tue, May 1 2018 8:06 PM | Last Updated on Tue, May 1 2018 8:06 PM

Sammohanam Teaser Was Released - Sakshi

సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన సుధీర్‌బాబు మొదట్నుంచీ కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సమ్మోహనం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్‌తోనే కొత్తదనాన్ని చూపించిన ఈ సినిమా.. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో సుదీర్‌బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్‌లో భాగంగా... ఈ సినిమా టీజర్‌ను నేటి సాయంత్రం( మే 1) మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్‌ చేయించారు. 

సినిమా, సాహిత్యం రెండూ బతికే ఉంటాయి అంతే...అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. ఈ సినిమా కొత్తగా ఉండబోతోందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ కూడా కొత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్‌లోని డైలాగ్‌లు, లొకేషన్లు అన్ని చూస్తే సినిమాను క్లాస్‌గా  తెరకెక్కించారని తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా..శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు. సుధీర్‌బాబుకు జంటగా అదితి రావు నటిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement