Sammohanam
-
‘సమ్మెహనం’ నటుడు మృతి
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన సమ్మెహనం సినిమాలో అదితి రావ్ హైదరీ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మరణం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమిత్ మృతి పట్ల సమ్మెహనం యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్ర అమిత్ మరణించినట్టుగా ట్వీట్ చేసిన సుధీర్ బాబు ఓ మంచి యువ నటుడ్ని కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోయిన్ అదితి రావ్ హైదరీ, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణలు కూడా అమిత్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. హిందీలో పంక్, ఆలాప్ లాంటి సినిమాల్లో నటించాడు అమిత్. అయితే అమిత్ మృతికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. I am unable to believe it. Amit Purohith, one of the gentlest, well- behaved and hugely talented actors I have worked with. And such a generous man!!! Amith, I will miss you, man. I was thinking of casting you again soon😓😓 May you Rest In Peace, Brother🙏🙏 pic.twitter.com/4h2Wx00Kdt — Mohan Indraganti (@mokris_1772) 10 July 2019 Saddened by the death news of Amit Purohit. He played Amit Malhotra (Sameera's Ex Boyfriend) in Sammohanam. Very friendly guy & always gave 100 % for every shot. Another young and good actor left us too early. May his soul find peace. pic.twitter.com/uEh0bVBV87 — Sudheer Babu (@isudheerbabu) 10 July 2019 Rest in peace Amit Purohit, Prayers and healing to the family... a kind gentle hardworking person gone to soon. thank you for your invaluable presence in #sammohanam #GoneTooSoon 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 — Aditi Rao Hydari (@aditiraohydari) 11 July 2019 -
నానికి జోడిగా అదితి!
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాల రిలీజ్‌కు ముందే మరో సినిమాను కూడా ఫైనల్ చేశారు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మెహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా అదితి రావ్ హైదరిని హీరోయిన్గా తీసుకున్నారట. గత చిత్రం సమ్మెహనంలో హీరోయిన్గా నటించిన అదితిని ఈ సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు ఇంద్రగంటి. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
కనెక్ట్ అవుతారు
‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రం తర్వాత సుధీర్‌బాబు నటించిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఇందులో నభా నటేశ్ కథానాయిక. ఆర్.ఎస్.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తూ సుధీర్‌బాబు నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్.ఎస్. నాయుడు మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన వస్తోంది. మా టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్‌కి అందరూ కనెక్ట్ అవుతారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా చిత్రం ప్రీ–ప్రమోషనల్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆర్.ఎస్.నాయుడు చాలా మంచి కథ, స్క్రీన్‌ప్లేతో సినిమా రూపొందించాడు. ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రం తర్వాత, నా సొంత బ్యానర్లో నిర్మిస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సాయి వరుణ్. -
స్త్రీలోక సంచారం
గర్భిణులలో రక్తహీనత ఎక్కువగా ఉంటోందని ఇటీవలి ఒక సర్వేలో వెల్లడైన నేపథ్యంలో రక్తహీనతపై గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటైన ఒక సదస్సులో.. పొట్టు తియ్యని ధాన్యంతో చేసిన పల్చటి, మృదువైన ఆహారాన్ని.. చిన్నప్పటి నుంచే (మొదటి ఆరు నెలలు తల్లి పాలు పట్టించాక.. ఆ తర్వాతి నుంచీ) శిశువులకు అలవాటు చేస్తే పెద్దయ్యాక రక్తలేమి ఏర్పడే అవకాశాలు తక్కువవుతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పాల్గొన్నవారిలో గైనకాలజిస్టులు, ఆబ్‌స్టెట్రీషియన్‌లు, హెమటాలజిస్టులు, పీడియాట్రీషియన్లు, సాధారణ వైద్యులతో పాటు పోషకాహార నిపుణులు కూడా ఉన్నారు. సైమోన్ అనే 93 వృద్ధురాలిని ఆమె పుట్టినరోజు అయ్యీ కాగానే, పోలీసులు ఇంటికొచ్చి మరీ అరెస్టు చేసి తీసుకెళ్లిన ఘటన యు.ఎస్.లోని మేన్ రాష్ట్రంలో జరిగింది. టీవీలో వచ్చే ‘కాప్స్’ సీరియల్‌కు ఇన్స్పైర్ అయిన తన తల్లి సైమోన్.. అరెస్టు అయితే ఎలా ఉంటుందో అనుభూతి చెందాలని ఉందని, అలాంటి అనుభూతిని తనకు పుట్టిన రోజు కానుకగా ఇవ్వమని అడగడంతో తనే పోలీసులకు చెప్పి, వారి సహృదయ పూర్వకమైన సహాకారంతో ఆమెను అరెస్టు చేయించానని సైమోన్ కూతురు యాన్ డ్యూమంట్ తెలిపారు! ఒరిజినల్ తెలుగు చిత్రం ‘సమ్మోహనం’తో ఈ ఏడాదే టాలీవుడ్లోకి ప్రవేశించిన బాలీవుడ్ నటి అదితీరావ్ హైదరీ ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో పుట్టి, ఢిల్లీలో చదివి, సినిమాల కోసం ముంబై వచ్చిన ఈ గాయని (మొదట గాయనే) తనకు హైదరాబాద్ అంటే ఎంత ఇష్టమో చెబుతూ, తనకిక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు హోమ్లీగా ఉంటుందని అన్నారు. -
సమ్మోహన తార
అదితిరావు హైదరి. ఈ పేరును చాలాసార్లు వినేవుంటారు. ఒక శుక్రవారం వచ్చి సూపర్‌హిట్ అయిన సినిమాలో అద్భుతంగా నటించిందని విని ఉంటారు. అదే రోజు సాయంత్రం టీవీలో వచ్చే ఏదో ప్రోగ్రామ్‌లో ‘ఓ.. చెలి తార..’ అంటూ ఒక పాట పాడుతూ కనిపిస్తే ఆ గొంతుకి ముగ్ధులైపోయి ఉంటారు. ఆ తర్వాత రోజో, ఇంకెప్పుడో యూట్యూబ్‌లో ఒక డ్యాన్స్ వీడియోలో ‘ఎంత అందంగా డ్యాన్స్ చేస్తోందో కదా!’ అని చూస్తూ ఉండిపోయి ఉంటారు. అన్నిసార్లూ కనిపించిన ఆ అందమైన ముఖం పేరు అదితి రావు హైదరి. టాలీవుడ్, బాలీవుడ్లో కొత్త సెన్సేషన్. మల్టీ టాలెంటెడ్ అదితి గురించి కొన్ని విషయాలు... బాలీవుడ్ టు టాలీవుడ్... బాలీవుడ్లో హీరోయిన్గా అక్కడక్కడా మెరుస్తూ వచ్చిన అదితి కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పిన సినిమా ‘చెలియా’. ఇండియన్ సినిమా లెజెండరీ డైరెక్టర్స్‌లో ఒకరైన మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో అదితి, తన అందం, నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తాజాగా ‘సమ్మోహనం’ సినిమాతో పెద్ద హిట్ కొట్టి తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. సమ్మోహనం తర్వాత అదితికి వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘నవాబ్’ సినిమాలోనూ అదితి కనిపించనుంది. భరతనాట్యం చేసిందంటే... ఫిదా! అదితిరావుకు చిన్నప్పట్నుంచే డ్యాన్స్ అంటే పిచ్చి. పదకొండేళ్లకే గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని భరతనాట్యం డ్యాన్సర్‌గా తన కెరీర్ మొదలుపెట్టేసింది. కొన్ని సినిమాలకు పనిచేసింది. ఆ సమయంలోనే అదితికి యాడ్ ఫిల్మ్స్‌లో, ఫీచర్ ఫిల్మ్స్‌లో చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలైంది. అవి పెద్ద పెద్ద అవకాశాలుగా మారాయి. 2010 తర్వాత ఏకంగా హీరోయిన్ అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ఆమె మెల్లిగా హీరోయిన్గా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్తోంది. పాట ఇంకో ఎత్తు.. అదితి యాక్టింగ్, డ్యాన్స్ ఒక ఎల్తైతే ఆమె పాట ఇంకో ఎత్తు. అదితి తల్లి విద్యారావు పాపులర్ క్లాసికల్ సింగర్. ఆమె నుంచి నేర్చుకున్న విద్యే అదితిని సింగర్‌గానూ మార్చింది. తాను నటించిన సినిమాల్లోనే కొన్ని పాటలు పాడింది అదితి. కొన్ని స్టేజ్ షోలలో కూడా అదితి పాడిన పాటలకు యూట్యూబ్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. హైదరాబాదీ! అదితిరావు ఇటు తల్లి తరపు నుంచి, అటు తండ్రి తరపు నుంచీ రాయల్ ఫ్యామిలీ. తండ్రి ఎహ్సాన్ హైదరి. తల్లి విద్యారావు. ఇద్దరివీ రాయల్ ఫ్యామిలీస్. వేర్వేరు మతాలు. అదితిరావు మన హైద్రాబాద్‌లోనే పుట్టింది. తెలుగుంటి అమ్మాయే. చిన్న వయసులోనే అదితి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తల్లి విద్యారావుతో ఎక్కువగా ఢిల్లీలో పెరిగింది అదితి. తండ్రి పేరులోని హైదరి, తల్లి పేరులోని రావు రెండూ కలిసేలా తన పేరును ‘అదితిరావు హైదరి’గా మార్చుకుంది. పర్సనల్ పర్సనల్.. 31 ఏళ్ల అదితిరావు, ఇరవైల్లో ఉన్నప్పుడే టెలివిజన్ నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడటానికి అదితి ఎప్పుడూ పెద్దగా ఇష్టపడలేదు. 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సత్యదీప్ నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నట్టు తెలిపింది. -
సితారలు దిగి వచ్చిన వేళ...!
సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సమ్మోహనం’. జూన్‌లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. చిన్నపిల్లల సృజనాత్మకత పెరుగుదల కోసం సుధీర్‌బాబు ఈ సినిమాలో ‘తారలు దిగి వచ్చిన వేళ’ పుస్తకాన్ని రాస్తారు. ఈ పుస్తకాన్ని ప్రచురించే ‘అనగనగా’ సంస్థ అధిపతిగా ఉన్న తనికెళ్ల భరణి కంటెంట్‌ను చదు వుతారు. ఈ సీన్ సినిమాలో హైలైట్. నిజంగా కూడా ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకు రావాలనుకున్నారు. ముందుగా ఈ పుస్తకాన్ని నటుడు చిరంజీవికి చిత్రబృందం అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. చిల్డ్రన్ కామిక్ నేపథ్యంలో రూపొందిన ఈ పుస్తకం తొలి కాపీని శుక్రవారం మహేశ్ బాబు కుమార్తె సితారకు చిత్రబృందం ఇచ్చింది. శుక్రవారం సితార పుట్టినరోజు. ‘‘సితార’లు దిగివచ్చిన వేళ.. మార్కెట్లోకి ఈ బుక్ రిలీజైంది. సితారకు జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ సితార ఆ బుక్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సుధీర్‌బాబు. ‘‘సమ్మోహనం’ టీమ్ తరఫున సితారకు ఆరవ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ కథను తనికెళ్ల భరణిగారు చదివిన విధానం, దానికి ప్రముఖ చిత్రకారుడు పీయస్ చారిగారు వేసిన అద్భుతమైన బొమ్మలు, ‘సమ్మోహనం’ సినిమా క్లైమాక్స్‌లోని నటన, సంగీతం.. అన్నీ కుదిరాయి. ఈ కథ, బొమ్మలూ చిన్న పిల్లలకీ, పెద్దలకీ బాగా నచ్చుతాయనే నమ్మకంతో పుస్తకంగా అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఇంద్రగంటి. -
ఆమె నటనకు ఇంప్రెస్ అయ్యా : రాజమౌళి
హైదరాబాద్ : దర్శక దిగ్గజం ఎస్ఎస్. రాజమౌళి రెండు సినిమాలపై ప్రశంసల జల్లులు కురిపించారు. అందులో ఒకటి సమ్మోహనం కాగా, మరో మూవీ నేడు విడుదలైన ఈనగరానికి ఏమైంది. ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సమ్మోహనం మూవీని కాస్త ఆలస్యంగా చూశాను. కానీ ఇంప్రెస్ అయ్యాను. సుధీర్ బాబు, అదితి రావు హైదరీ నటన ఆకట్టుకుంది. సీనియర్ నటుడు నరేష్ అద్భుతంగా చేశారు. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్ అని రాజమౌళి ట్వీట్ చేశారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన సమ్మోహనం మూవీకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. పెళ్లి చూపులు మూవీతో టాలీవుడ్లో తనదైన ట్రెండ్ సృష్టించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చూసి తరుణ్‌ను రాజమౌళి మెచ్చుకున్నారు. మంచి కామెడీ ఉంది. మూవీ యూనిట్‌కు అభినంనలు అంటూ’ మరో ట్వీట్ చేశారు రాజమౌళి. Watched #Sammohanam little late... Quite impressed with @aditiraohydari‘s performance. @isudheerbabu is good too. @ItsActorNaresh garu is hilarious. Belated Congratulations to the team... 😊 — rajamouli ss (@ssrajamouli) 29 June 2018 Tharun Bhascker does it again. A ‘Sukoon’ film with lots of laughter. Hearty Congrstulations to team #EeNagaranikiEmaindi... — rajamouli ss (@ssrajamouli) 29 June 2018 -
ఆ అలవాటు నాకు లేదు..
తమిళసినిమా: ఆడవారి మాటలకు అర్థాలేవేరులే అన్నారో మహాకవి. ఇది చాలా మంది విషయంలో నిజమని అనిపించకమానదు. నటి అదితిరావునే తీసుకుంటే మణిరత్నం దర్శకత్వంలో కార్తీతో రొమాన్స్ చేసిన జాణకు ఆ చిత్రం నిరాశ పరిచినా ప్రచారం మాత్రం బోలెడు వచ్చేసింది. మణిరత్నంను పొగడ్తల్లో ముంచేయడం లాంటి భేటీలతో ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసిన అదితిరావు మరోసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. కాగా తాజాగా గ్లామరస్ ఫొటోలను, ఈత దుస్తులు ధరించిన ఫొటోలను తరచూ ఇంటర్నెట్లో విడుదల చేస్తూ నెటిజన్లకు మంచి పని చెబుతోంది. కొంత విమర్శలను పోగేసుకుంటోందనుకోండి. అవకాశాల కోసమేనా ఈ ట్రిక్స్ అన్న ప్రశ్నలను లైట్‌గా తీసుకుంటోంది. అలాంటి వాటిని పట్టించుకోకపోవడంతో పాటు అసలు తనకు గ్లామరస్ దుస్తులు నప్పవని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. ఈ అమ్మడు ఏంమంటోందో చూద్దాం. నా దుస్తులను నేనే ఎంపిక చేసుకుంటాను. హద్దులు మీరిన గ్లామర్ దుస్తులు నా శరీరాకృతికి నప్పవు. నిజం చెప్పాలంటే ధరించే దుస్తులను చూసి మనుషులను విలువ కట్టే విధానం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. నా కుటుంబం, స్నేహితులను దృష్టిలో పెట్టుకునే దుస్తులను ఎంపిక చేసుకుని ధరిస్తాను. ఇక కెరీర్ గురంచి చెప్పాలంటే ఈ ఏడాది తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చాను.అదే విధంగా తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నాను. ఏకకాలంలో ఎక్కువ చిత్రాలు చేసే అలవాటు నాకు లేదు. సినిమాలో నా పయనం నిదానంగానే ఉంటుంది. కాబట్టి నా మార్కెట్ తగ్గింది. అందుకే అవకాశాలు రాబట్టుకోవడానికి గ్లామరస్ చిత్రాలను విడుదల చేస్తున్నాను అని భావించనక్కర్లేదు. ఇక్కడ నేనింకా సాధించాల్సింది చాలా ఉంది అని నటి అదితిరావు అంటోంది. అయినా అంటారు గానీ ఆడవారి మాటలకు అర్థాలే వేరు కదా! నిజాలు చెబుతారా? అంగీకరిస్తారా? -
ఈ సినిమా మహేశ్‌కి నన్ను దగ్గర చేసింది
‘‘సమ్మోహనం’ కథని 2012లో రాసుకుని కొందరికి వినిపించాను. శివలెంక కృష్ణప్రసాద్‌గారు మాత్రం కథ వినగానే సినిమా చేస్తానన్నారు. అంతే కాకుండా నాపై, కథపై నమ్మకంతో ఈరోజు వరకూ ఆయన సినిమా చూడలేదు’’ అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఆయన దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈనెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘పెళ్ళిచూపులు’ సినిమాలో ఓ సన్నివేశం చూసి, ఆ ఇన్స్పిరేషన్తో ‘సమ్మోహనం’ కథను తయారు చేసుకున్నాను. సుధీర్‌బాబు చాలెంజింగ్‌గా నటించారు. నా కథ వినగానే సినిమా చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఒప్పుకున్నాడు. కెమెరామెన్ విందా నా మనసులో ఏముందో అది తెర మీద చూపిస్తారు. మా మధ్య మంచి అనుబంధం ఉంది’’ అన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా చేస్తున్నాడు కదా! వీడేంటో? అని సామాన్యులు దూరంగా ఉండిపోయారు. అలాంటి వాళ్లకు నన్ను దగ్గర చేసిన చిత్రం ‘సమ్మోహనం’. ఇప్పటివరకూ నన్ను ‘ప్రేమకథా చిత్రమ్’ సుధీర్‌బాబు అని పిలిచేవారు. ఇకపై ‘సమ్మోహనం’ సుధీర్‌బాబు అంటారు. మహేశ్ బావగా నాకు దగ్గరే కానీ.. యాక్టర్‌గా కాస్త గ్యాప్ ఉండేదనిపించేది. ఈ సినిమా ఓ యాక్టర్‌గా నన్ను తనకు దగ్గర చేసింది. షూటింగ్లో నరేశ్‌గారిని నిజమైన నాన్నగానే భావించా. ఇంద్రగంటిగారు భాషను ప్రేమించేంతలా భార్యను కూడా ప్రేమించరు’’ అన్నారు. ‘‘కథ విన్న రోజు నుంచి ‘సమ్మోహనం’ గొప్ప హిట్ అవుతుందని చెప్పా.. అన్నట్టుగానే అయ్యింది. జంధ్యాలగారికి రీప్లేస్మెంట్ ఉండదు. ఆయనలాగే ఇంద్రగంటిగారికి కూడా రీప్లేస్మెంట్ లేదు’’ అన్నారు నటుడు నరేశ్. ‘‘సమ్మోహనం’ లాంటి మంచి సినిమాను నేను చేయడానికి కారణమైన సుధీర్‌బాబు, మోహనకృష్ణకు థ్యాంక్స్’’ అన్నారు శివలెంక కృష్ణ ప్రసాద్. సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నటుడు తనికెళ్ల భరణి, నటి పవిత్రా లోకేశ్, దర్శకుడు తరుణ్ భాస్కర్, కెమెరామెన్ పి.జి.విందా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి పాల్గొన్నారు. -
నా మాట నిజమైంది
‘ఇంద్రగంటిగారు నాకు ‘సమ్మోహనం’ కథ చెప్పినప్పుడే సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అప్పుడే చెప్పా. నా మాట నిజమైంది. సుధీర్‌బాబు కెరీర్లోనే ఈ సినిమా ది బెస్ట్ అవుతుందని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పా. నేను అన్నట్లుగానే జరిగింది’’ అని నటుడు నరేశ్ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ సినిమా ఈనెల 15న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో తండ్రిగా నటించిన నరేశ్ మాట్లాడుతూ– ‘‘అన్ని చిత్ర పరిశ్రమలు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. పెద్ద డైరెక్టర్స్‌తో పాటు చిన్న డైరెక్టర్స్ ఆరోగ్యకరమైన, మంచి సినిమాలు చేస్తున్నారు. సినిమాను సినిమాగా తీస్తే సక్సెస్ కావు. సామాన్య ప్రేక్షకుడి దృష్టితో తీయాలని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా. నటుడిగా ఎస్.వి.రంగారావుగారిని, కమల్‌హాసన్‌గారిని ఇష్టపడుతుంటాను. అందుకే నా కెరీర్ బిగినింగ్ నుంచి విలక్షణమైన పాత్రలు చేస్తున్నా’’ అన్నారు. -
తారలు దిగి వచ్చిన వేళ
‘సమ్మోహనం’ సినిమా చూసినవారందరికీ ‘తారలు దిగి వచ్చిన వేళ..’ పుస్తకం గుర్తుండే ఉంటుంది. సుధీర్ బాబు గీసిన బొమ్మలతో ఈ పుస్తకాన్ని సినిమాలో హీరోయిన్ అదితీరావ్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడీ ‘తారలు దిగి వచ్చిన వేళ..’ పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా రిలీజ్ చేయించారు చిత్రబృందం. సుధీర్ బాబు, అదితీరావ్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా టీజర్‌ను రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పటానికి చిరంజీవిని కలిశారు చిత్రబృందం. ఈ సందర్భంగా ‘తారలు దిగి వచ్చిన వేళ..’ బుక్ రిలీజ్ చేశారు చిరంజీవి. ‘‘సమ్మోహనం’ చిత్రం గుర్తుగా ఈ పుస్తకాన్ని మార్కెట్లో రిలీజ్ చేస్తే బావుంటుందని భావించాం. ఈ కథల పుస్తకాన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. -
సమ్మోహన కావ్యం
-
‘సమ్మోహనం’ మూవీ రివ్యూ
టైటిల్ : సమ్మోహనం జానర్ : ఎమోషనల్ లవ్ డ్రామా తారాగణం : సుధీర్ బాబు, అదితి రావు హైదరీ, నరేష్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, హరితేజ సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ స్టార్ ఇమేజ్ను కాకుండా కథా బలాన్ని నమ్ముకొని సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచమ్మా, జెంటిల్మన్, అమీతుమీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మోహనకృష్ణ ఈ సారి సమ్మోహన పరిచే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు హీరోగా అదితిరావు హైదరీని హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సమ్మోహనం నిజంగానే సమ్మోహన పరిచిందా..? మోహనకృష్ణ మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారా..? లవర్ బాయ్‌గా సుధీర్ బాబు ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ ; ఆర్.విజయ్ కుమార్ అలియాస్ విజ్జు (సుధీర్ బాబు) అందరు అబ్బాయిల్లా గర్ల్ ఫ్రెండ్స్, సినిమాలు అంటూ తిరగటం ఇష్టం లేని కుర్రాడు. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు బొమ్మలతొ చిన్నపిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. ఎలాగైన ‘అనగనగా పబ్లికేషన్స్’ ద్వారా తన బొమ్మల పుస్తకాన్ని విడుదల చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు. సర్వేష్(సీనియర్ నరేష్), విజ్జు తండ్రి సినిమాల మీద ఇష్టంతో వాలెంటరీ రిటైర్మెంట్‌తీసుకొని మరి సినిమా ప్రయాత్నాలు చేస్తుంటాడు. తన ఇంట్లో షూటింగ్ చేసుకోనిస్తే వేషం ఇస్తానని చెప్పటంతో ఓ సినిమా షూటింగ్‌కు ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తాడు సర్వేష్. ఆ సినిమాలో హీరోయిన్ సమీరా రాథోడ్ (అదితి రావు హైదరీ). షూటింగ్ ప్రారంభమైన తరువాత తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సమీరాకు విజ్జు కోచింగ్ ఇస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. షూటింగ్ తరువాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి (సాక్షి రివ్యూస్) తన ప్రేమ విషయం చెపుతాడు. కానీ సమీరా తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పటంతో విజ్జు సమీరా మీద కోపం పెంచుకుంటాడు. అలా దూరమైన సమీరా, విజ్జులు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? అసలు సమీరా, విజ్జు అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయ్ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో మంచి పరిణతి కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో అదితి రావు హైదరీ జీవించారు. స్టార్ ఇమేజ్, ప్రేమ, వేదింపుల మధ్య నలిగిపోయే అమ్మాయిగా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా చూపించారు. హీరో తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. హీరో తల్లి పాత్రలో పవిత్రా లోకేష్ హుందాగా కనిపించారు.(సాక్షి రివ్యూస్) ముఖ్యంగా సుధీర్ బాబు, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. హీరో ఫ్రెండ్స్‌గా రాహుల్ రామకృష్ణ, అభయ్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రలో తనికెళ్ల భరణి, హరితేజ, నందు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ ; సమ్మోహనం అనే టైటిల్‌తోనే ఆకట్టుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కథా కథనాలతో నిజంగానే సమ్మోహనపరిచారు. ప్రేమకథకు బలమైన ఎమోషన్స్, కామెడీని జోడించి మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ముఖ్యంగా తొలి భాగంలో హీరో ఇంట్లో షూటింగ్ సమయంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా వాళ్ల మీద వేసిన పంచ్‌లు బాగా పేలాయి. ప్రేమకథ మొదలైన తరువాత కథనంలో కాస్త వేగం తగ్గింది. ఆ లోటును సంగీత దర్శకుడు వివేక్ సాగర్ తన మెలోడియస్ మ్యూజిక్‌తో కవర్ చేశాడు. (సాక్షి రివ్యూస్) ప్రతీ పాట కథలో భాగంగా వస్తూ అలరిస్తుంది. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ డైలాగ్స్. చాలా సందర్భాల్లో డైలాగ్స్ మన జీవితాల నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తాయి, ఆలోచింపచేస్తాయి. పీజీ విందా సినిమాటోగ్రఫి సినిమాకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ ఆర్టిస్ట్స్ నటన డైలాగ్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : నెమ్మదిగా సాగే కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మేకప్ వెనక మనసు ఉంటుంది
‘‘ఒకరోజు ఇంద్రగంటిగారు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ సినిమా గురించి చెప్పారు. పెద్దలు కథ చెబుతుంటే చిన్న పిల్లలు ఆసక్తిగా వింటారు కదా. అంత క్రమశిక్షణతో నేను కథ విన్నాను. చాలా నచ్చింది. నా వద్ద డేట్స్ లేకున్నా అడ్జెస్ట్ చేసి, ఈ సినిమా చేశా’’ అని అదితీరావు హైదరీ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీ చెప్పిన విశేషాలు. ► మణిరత్నం ‘కాట్రు వెలియిడై’ (చెలియా) సినిమా ద్వారా దక్షిణాదికి పరిచయమయ్యాను. తెలుగులో ‘సమ్మోహనం’ నా తొలి చిత్రం. కథ నచ్చితేనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నా. దక్షిణాదిలో మణిరత్నంగారితో సినిమా చేయాలన్నది నా కల. ‘కాట్రు వెలియిడై’తో అది నెరవేరింది. ఇప్పుడు ఆయనతో రెండో సినిమా కూడా చేస్తున్నాను. తెలుగులో శేఖర్ కమ్ముల, తమిళంలో మిస్కిన్, గౌతమ్‌మీనన్ వంటి దర్శకులతో పనిచేయాలనుకుంటున్నా. ► వాళ్లవి కాని ఎమోషన్స్‌ని మనసులోకి తెచ్చుకుని ప్రేక్షకులను రంజింపజేయడానికి హీరోయిన్లు కృషి చేస్తారు. దాన్ని అభినందించాలి. అంతేగానీ హీరోయిన్లంటే కేవలం రక్తం, మాంసం ముద్దగా చూడకూడదు. మేం స్క్రీన్ మీద మేకప్‌తో కనిపిస్తాం. దాని వెనక ఉన్న మనసును చూడాలి. అందరూ మనలాంటి అమ్మాయిలే అనుకోవాలి. నేనైతే స్త్రీ, పురుషులు సమానమే అనుకుంటా. మావాళ్లు అలాగే పెంచారు. ► ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పడం కాదు. నన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నేను హైదరాబాదీనే అని చెప్పుకుంటా. అలా చెప్పుకోవడానికి గర్వపడతాను. ఇంట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడమని మా తాత చెప్పేవారు. కానీ నేను వినలేదు. ‘సమ్మోహనం’ కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ► ‘సమ్మోహనం’ షూటింగ్లో అందరూ బాగా చూసుకోవడంతో అలసిపోయినట్టు అనిపించలేదు. ఈ సినిమా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో లవ్‌స్టోరీ స్పెషాలిటీ తెరమీదే చూడాలి. ‘చెలియా’ సినిమా తెలుగులో సరిగ్గా ఆడలేదేమో కానీ, తమిళంలో బాగా ఆడింది. నేను అంత త్వరగా నెగటివ్ విషయాల గురించి ఆలోచించను. ► సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నాను. ఉదయాన్నే రోప్ వర్క్స్ నేర్చుకుంటున్నా. రాత్రి మణిరత్నం సినిమా షూటింగ్లో పాల్గొంటున్నా. నేను బాగా కష్టపడతాను. ఎదుటివారిని గౌరవిస్తాను. నన్ను గౌరవించాలనుకుంటాను. మనకి ఎవరో వచ్చి గౌరవాలు ఇవ్వరు. ముందు మనల్ని మనం గౌరవించుకుంటే, ఎదుటివాళ్లు కూడా గౌరవిస్తారని నమ్ముతా. -
మహేశ్‌తో సినిమా ఉంటుంది
‘‘నా తొలి సినిమా ‘ఎస్ఎంఎస్’ రిలీజ్‌కి ఓ వారం ముందు ఇంద్రగంటిగారితో ఓ సినిమా చేద్దామనుకున్నా. ఓ ప్రొడక్షన్ హౌస్‌తో సైన్ కూడా అయింది. కానీ టేకాఫ్ కాలేదు. అవసరాల శ్రీనివాస్ కథతో ఇంద్రగంటిగారు డైరెక్ట్ చేసేట్టు అనుకున్నారు. ఆ సినిమానే ‘ఊహలు గుసగుసలాడే’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. ఆయన హీరోగా, అదితీరావు హైదరీ హీరోయిన్గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు... ∙ఇంద్రగంటిగారు ఒకరోజు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ స్క్రిప్ట్ వినమన్నారు. నచ్చింది, చేశా. ఈ చిత్రంలో నా పేరు విజయ్. చిల్డ్రన్స్ బుక్స్ ఇల్లస్ట్రేటర్‌గా కనిపిస్తాను. విజయ్‌కి సినిమా ఇండస్ట్రీ మీద, స్టార్స్ మీద కొన్ని అభిప్రాయాలుంటాయి. అదితీరావు ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా నటించారు. మేమిద్దరం ఎలా కనెక్ట్ అయ్యామన్నదే ఈ సినిమా. నా పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది. ఓ కామన్ ఆడియన్ డౌట్స్‌ని ఆన్‌స్క్రీన్‌పై డిస్కస్ చేస్తున్నట్టు ఉంటుంది. ∙ఇంద్రగంటిగారు తెరకెక్కించిన ప్రాపర్ లవ్‌స్టోరీ ‘అంతకు ముందు ఆ తర్వాత’. కానీ, ‘సమ్మోహనం’ వంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ ఆయన ఇప్పటిదాకా చేయలేదు. ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదు. ‘ఏమాయ చేసావె’ కూడా వేరు.‘సమ్మోహనం’లో ఫన్, రొమాన్స్ ఉంటుంది. ఈ చిత్రంలో హరీశ్ శంకర్, అవసరాల శ్రీనివాస్, తరుణ్ భాస్కర్‌గారు మాత్రమే గెస్ట్ రోల్స్ చేశారు. హీరోలెవరూ చేయలేదు. ∙ఈ సినిమా సెట్స్‌కి ఫ్రెండ్స్‌ని పిలిచేవాణ్ణి. ఇంద్రగంటిగారి సినిమాల్లో యాక్టరే కింగ్. యాక్టర్ కూర్చోవచ్చు. నిలబడొచ్చు. యాక్టర్ మంచి మూడ్‌లో ఉంటే దాన్ని గమనించి ఇంద్రగంటిగారు సినిమా చేస్తారు. అంతేగానీ కెమెరాను సెట్ చేసుకుని ‘యాక్టర్‌ని పిలవండయ్యా’ అని చెప్పరు. . శివలెంక కృష్ణప్రసాద్‌గారు చూడ్డానికి తెల్లగా ఉంటారు. అంతే స్వచ్ఛంగానూ ఉంటారు. భవిష్యత్తులోనూ ఆయనతో సినిమా చేయాలని ఉంది. బాలీవుడ్ నటులు షూట్లో ప్రొనౌన్స్ కూడా సరిగా చేయలేరు. కానీ, అదితీ చాలా స్పష్టంగా తెలుగు నేర్చుకుని వచ్చేది. డబ్బింగ్ కూడా చెప్పింది. ∙మన చుట్టూ చాలామంది ప్రతిభావంతులున్నారు. కొరియోగ్రాఫర్లు, పాటలు రాసేవాళ్లు, నటీనటులు... ఎంతో టాలెంట్ ఉండి కూడా ఇక్కడ అవకాశాల కోసం తిరగలేక వెళ్లిపోయిన వాళ్లున్నారు. నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే బావుంటుందనిపించి చేశా. చాలా మంది వచ్చి కలుస్తూనే ఉన్నారు. ∙ప్రవీణ్ సత్తార్గారి దర్శకత్వంలో చేయనున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. నా తర్వాతి సినిమా మా సంస్థలోనే ఉంటుంది. ఆర్.ఎస్.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తున్నా. మా బ్యానర్లో మహేశ్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. మంచి కథ ఉంటే ఇంద్రగంటిగారి దర్శకత్వంలో మహేశ్‌తో సినిమా చేస్తే చాలా బావుంటుంది’’ అంటున్న సుధీర్‌తో ‘మీ వాయిస్‌లో మెచ్యూరిటీ కనిపిస్తోంది’ అంటే.. ‘‘వాయిస్ ఎక్సర్సైజ్లు చేస్తున్నా. మానేస్తే మళ్లీ పీలగా మారిపోతుంది’’ అన్నారు నవ్వేస్తూ. -
సుధీర్ సొంతంగా నిలబడటం హ్యాపీ
‘‘సుధీర్ నా ఫంక్షన్స్‌కి వచ్చి స్పీచ్‌లు ఇరగదీస్తుంటాడు. తన ఫంక్షన్లో మాత్రం సైలెంట్ అయిపోతున్నాడు. ‘సమ్మోహనం’ ఫంక్షన్ చూస్తుంటే ఒక సూపర్ హిట్ వైబ్ కనిపిస్తోంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూనిట్’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘నరేశ్‌గారు ఎప్పుడూ అంత ఎగై్జటెడ్‌గా లేరు. ‘సమ్మోహనం’ ఈ ఇయర్ వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అవుతుందని చెప్పడంతో నిజంగా చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నే ‘దిల్’ రాజుగారు కూడా చెప్పారు. సినిమాపై చాలా మంచి రిపోర్ట్స్ క్యారీ అవుతున్నాయని. సుధీర్ గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మా అందరి పనుల్లో మేం బిజీగా ఉంటాం. సుధీర్‌ని ఎప్పుడూ ఏ విధంగా సపోర్ట్ చేయలేదు. ఇలా ఆడియో ఫంక్షన్స్‌కి రావడం తప్ప. తను సొంతంగా నిలబడుతున్నందుకు చాలా హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్ సుధీర్. మోహనకృష్ణగారి ‘అష్టా చమ్మా, జెంటిల్మన్’ సినిమాలు చూశా. చాలా బాగా నచ్చాయి. ‘అష్టా చమ్మా’ నా ఫేవరెట్ ఫిల్మ్. అంటే.. నా పేరు వాడారని కాదు. నిజంగా ఆ సినిమా నాకు బాగా నచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి అదితీకి స్వాగతం పలుకుతున్నా. ‘భరత్ అనే నేను’ తర్వాత మిమ్మల్నందర్నీ (అభిమానులు) ఇప్పుడే కలవటం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు, అభిమానం ఇలాగే ఉండాలి. సుధీర్ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘2008లో ఒక రోజు నేను రైలులో వెళ్తుంటే ఓ చిన్నపాప ‘పోకిరి’ సినిమా డైలాగ్‌లు చెబుతోంది. అప్పుడు నాకు ‘అష్టా చమ్మా’ మూవీ ఐడియా వచ్చింది. కథ రాస్తున్నప్పుడు సినిమాలో మహేశ్‌బాబుగారి ఫుటేజ్ ఏమైనా వాడదామా? అన్నారు. నేను పేరు చాలు అన్నాను. ఆ పేరులో మత్తు, మ్యాజిక్, వైబ్రేషన్స్ ఉన్నాయి. విజయవాడలో ‘అష్టా చమ్మా’ ప్రీమియర్‌లో ‘మహేశ్‌గారితో ఎప్పుడు సినిమా చేస్తారు’ అని మహేశ్ అభిమాని అడిగారు. ఆల్రెడీ చేసేశాను. ‘అష్టా చమ్మా’ అంతా మహేశ్గారిదే అని చెప్పాను. నేను చాలా ఇష్టపడి, నా హృదయానికి దగ్గరగా రాసుకుని తీసిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రం కేవలం సుధీర్‌బాబు మాత్రమే చేయగలడని సినిమా చూసిన తర్వాత అందరూ అంటారు’’ అన్నారు. ‘‘ఈ పండుగకి మహేశ్‌బాబుగారు రావడం చాలా ఆనందంగా ఉంది. యూనిట్ అంతా కలసి ఒక మంచి సినిమా చేశాం. చాలా మంచి పేరొస్తుంది. పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. ఎందుకంటే ఇది నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ అనిపించింది. ఈ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఈ ఫంక్షన్‌కి రాకముందు వరకూ ఓ చిన్న భయం ఉండేది. ‘సమ్మోహనం’ మంచి సినిమా, ప్రేక్షకులకు రీచ్ అవుతుందా? లేదా? అని. ఎప్పుడైతే మహేశ్ ఓ కొత్త గెటప్‌తో ఈ ఫంక్షన్‌కి వస్తున్నాడని తెలిసిందో అప్పుడు చాలామంది ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. ఎంతోమంది టీవీల్లో చూస్తారు. ఇప్పుడు చూడకపోయినా యూట్యూబ్‌లో చూస్తారు. చూసేటప్పుడు ‘సమ్మోహనం’ గురించి వింటారు. టీజర్, ట్రైలర్ చూస్తారు. వాళ్లకి నచ్చుతుంది. తర్వాత సినిమా కూడా చూస్తారనే నమ్మకం వచ్చింది. ఇక్కడికి వచ్చినందుకు మహేశ్‌కి థ్యాంక్స్. ఇంద్రగంటిగారి నుంచి చాలా నేర్చుకున్నా. కానీ, నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో మాటలు రావడం లేదు. ‘సమ్మోహనం’ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘సమ్మోహనం’ నా తొలి తెలుగు సినిమా. సుధీర్ అమేజింగ్ కో–స్టార్. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అదితీరావ్ హైదరీ. తనికెళ్ల భరణి మాట్లాడుతూ – ‘‘గ్రహణం’ సినిమా నుంచి ‘సమ్మోహనం’ వరకూ మా మోహనకృష్ణ ఎదుగుదల కంగారు లేకుండా స్థిమితంగా హాయిగా ఉంది. ఇవాళ తెలుగు సినిమా రూట్ మారుతోంది. కొత్త చిత్రాలను విపరీతంగా ఎంకరేజ్ చేసి, చిన్న సినిమాలకు కొత్త ఊపిరి పోస్తున్నారు నూతన దర్శకులు. శివలెంకగారు ‘ఆదిత్య 369’ నుంచి నాకు పరిచయం. కమిటెడ్ ప్రొడ్యూసర్ ఆయన. ఇంద్రగంటి షూటింగ్‌కి ఎప్పుడెళ్లినా మన ఇంటికి మళ్లీ మనం వెళ్లినట్లుంటుంది. ఈసారి పెద్ద సినిమా, ఎక్కువ రోజులు ఉండే సినిమా తీయాలని కోరుతున్నా’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మరో వారంలో మన 25వ సినిమా (మహేశ్‌బాబు) మొదలవుతుంది. ‘అష్టాచమ్మా, జెంటిల్మన్’ వంటి ఎన్నో మంచి సినిమాలను మోహనకృష్ణగారు మనకు అందించారు. హీరోయిన్ని ఓ కుర్రాడు ప్రేమిస్తే ఏంటన్న కథాంశంతో ‘సమ్మోహనం’ తీశారు. ఈ కథకి ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు. సినిమా చాలా బాగుందని పోస్ట్ ప్రొడక్షన్లోనే రిపోర్ట్స్ వస్తున్నాయి. దర్శక–నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సుధీర్‌కి ఇంకో హిట్ రాబోతోంది’’ అన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన టైటిల్స్‌లో ‘సమ్మోహనం’ ఒకటి. ఒక లవ్‌స్టోరీకి ఇంతకంటే మంచి టైటిల్ పెట్టలేమేమో? ఇంద్రగంటిగారు తీసిన చిత్రాల్లో ఈ సినిమా పెద్ద స్థాయిలో హిట్ అవుతుందనుకుంటున్నా. ట్రైలర్ చూశా. లుకింగ్ వెరీ ఫ్రెష్. సుధీర్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘మనకున్న మంచి రచయిత–దర్శకుల్లో వన్నాఫ్ ది ఫైనెస్ట్ ఇంద్రగంటిగారు. సార్.. నేను మీ పనికి ఫ్యాన్‌ని. ఈ ఫంక్షన్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాలో నేనూ పార్ట్ అయ్యాను. సుధీర్ ఇటీవల నిర్మాతగా మారారు. ఇప్పుడు ప్రొడక్షన్ ఎందుకు? అన్నాను. ‘ఇక్కడ సంపాదించింది ఇక్కడే పెట్టాలి కదా భయ్యా’ అన్నాడు. ఆ మాటకి హ్యాట్సాఫ్ సుధీర్. డైరెక్టర్స్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు నటించే వ్యక్తి మహేశ్‌గారు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు’’ అన్నారు. కెమెరామేన్ పి.జి.విందా, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, తరుణ్ భాస్కర్, నిర్మాత అచ్చిరెడ్డి, నటులు నరేశ్, కాదంబరి కిరణ్, రాహుల్ రామకృష్ణ, నటి పవిత్రా లోకేశ్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
‘అందుకే చైతూ సినిమా పక్కన పెట్టేశాం’
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్ లాంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇటీవల జెంటిల్మన్ సినిమాతో తన కెరీర్లోనూ బిగెస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నారు. తరువాత అమీతుమీ సినిమాతో మరో మంచి విజయం అందుకున్న మోహనకృష్ణ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకన్నా ముందే నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉన్నా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. జెంటిల్మన్ సక్సెస్ తరువాత మోహనకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనబరిచారు. సాయి కొర్రపాటి నిర్మాతగా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను ప్రకటించారు. అయితే పూర్తి యాక్షన్ కథాంశంగా కావటంతో అప్పటికే నాగచైతన్య యాక్షన్ జానర్లో సవ్యసాచి సినిమాకు ఓకె చెప్పటంతో మోహనకృష్ణ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారట. ఈ విషయాన్ని సమ్మోహనం ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు వెల్లడించారు. త్వరలోనే మరో మంచి కథతో నాగచైతన్య హీరోగా సినిమా చేస్తానని చెప్పారు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్ బాబు, అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సమ్మోహనం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెళ్లగానే రెడ్ కార్పెట్ వేస్తారనుకోను
‘‘నేను హీరోని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయను. కథ పూర్తయ్యాక హీరోగా ఎవరు సరిపోతారా అని ఆలోచిస్తాను’’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఆయన దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంద్రగంటి పంచుకున్న విశేషాలు... ► స్టార్ హీరోలకు కథలు చెబుతున్నా. వారి మైండ్‌సెట్ తెలుసుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారనుకోవడంలో అర్థం లేదు. వాళ్లను కలవగానే నాకు రెడ్ కార్పెట్ వేస్తారనుకోను. స్టార్స్‌తో సినిమా చేస్తే ఆ మజా వేరు. ఎక్కువమందికి రీచ్ అవుతుంది. ► ఈ చిత్రంలో నరేశ్గారిది సుధీర్ తండ్రి పాత్ర. సినిమా గొప్ప కళ అనే భావనలో ఉంటాడు నరేశ్. చిన్న పిల్లల ఇల్లస్ట్రేటర్ పాత్ర సుధీర్‌ది. తనకు సినిమా వాళ్లంటే పెద్దగా ఇష్టం ఉండదు. వీరి మధ్య జరిగే సంఘర్షణలో అమ్మాయి పాత్ర ఎలా ఎంటర్ అయ్యిందన్నదే కథ. నరేశ్‌గారి పాత్రకు తొలుత రావు రమేశ్, తనికెళ్ల భరణిగార్లను అనుకున్నా. సుధీర్ పాత్రకు ముందు విజయ్ దేవరకొండ, నానీని అనుకున్నా. ► సినిమా గురించి తృణీకార భావనతో (గడ్డిపోచలాగా తీసిపడేయడం) మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఇందులో సినిమా రంగం గురించి చెడుగా చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. ఈ చిత్రం చూశాక ఇండస్ట్రీలో మంచి వారున్నారనే ఆలోచన రావాలి. ► ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ కలుసుకునే బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉంటుంది. అనుహ్యమైన పరిస్థితుల్లో వారు ఎలా ప్రేమించుకున్నారు? ఎలా విడిపోయారు? మళ్లీ ఎలా కలుసుకున్నారనే దాన్ని ఎంటర్టైనింగ్ వేలో చక్కగా చెప్పాం. ► రామ్‌చరణ్‌లాంటి హీరో ‘రంగస్థలం’లో చెవిటివాడి పాత్రలో మెప్పించడం గొప్ప విషయం. ‘మహానటి’లో స్టార్ హీరోలు లేకున్నా గొప్ప విజయం అందుకుంది. ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని చేరుకోవడానికి మనమే ఆలస్యం చేస్తున్నాం. ► ఆడవాళ్లను చులకనగా చూపించకూడదు. హీరోయిజమ్‌ను ఎలివేట్ చేయాలని హీరోయిన్ని దద్దమ్మను చేయనక్కర్లేదు. ‘రంగస్థలం’లో సమంత, ‘మహానటి’లో కీర్తీసురేశ్ పాత్రలు ఎంత బావుంటాయి. మనం సినిమా సరిగ్గా తీయకుంటే అర్థం కాదు. ► వరుసగా ‘జెంటిల్మెన్, అమీతుమీ, సమ్మోహనం’ చిత్రాలు చేశా. కాస్త రెస్ట్ తీసుకుని తదుపరి సినిమాలు చేయాలనుకుంటున్నా. నెక్ట్స్ సినిమా కథ తయారు చేసుకోవాలంటే నాకు కనీసం ఏడాది పడుతుంది. -
సమ్మోహనం సెన్సార్ పూర్తి
ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలంటే ఫ్యామిలీ అంతా హాయిగా కూర్చొని చూడొచ్చు. సుదీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నింటికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమాలోని మాటలు, పాటలు, లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వినోదం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 15న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల కత్తెరకు ఎలాంటి పని చెప్పకుండా.. ఈ సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్‌ను పొందింది. జూన్ 10న జరుగుబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్‌బాబుకు జోడీగా అదితి రావు హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వివేక్‌సాగర్ సంగీతాన్ని అందించారు. It's clean U for #Sammohanam #SammohanamOnJune15th https://t.co/fBG7BSsMqX — Sudheer Babu (@isudheerbabu) June 7, 2018 -
కుటుంబంతో హాయిగా నవ్వుకోవచ్చు
‘‘ఓ హీరోయిన్ నిజ జీవితంలోనూ ఓ సాధారణ యువకుడితో ప్రేమలో పడటం చాలా సందర్భాల్లో జరిగాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమకథలుంటాయి. ‘సీతామాలక్ష్మి, రంగీలా, శివరంజని’ సినిమాలు ఇదే నేపథ్యంలో వచ్చాయి. మా ‘సమ్మోహనం’ సినిమా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘పెయింటింగ్ వేసే ఓ సాధారణ మధ్య తరగతి యువకునికి సినిమా వాళ్లంటే కొంత చిన్నచూపు ఉంటుంది. అలాంటి యువకుడికి ఓ స్టార్ హీరోయిన్ ఎలా పరిచయమైంది? వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఎలాంటి మజిలీ చేరుకుందన్నదే ‘సమ్మోహనం’ కథ. ఇంద్రగంటితో 2016లో ‘జెంటిల్మన్’ సినిమా చేశా. సరిగ్గా రెండేళ్ల తర్వాత ‘సమ్మోహనం’ చేశా. గత ఏడాది ఆయన నాకు ‘సమ్మోహనం’ కథ చెప్పారు. కుటుంబంతో హాయిగా నవ్వుకుని చూసే ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఇది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కథకు తగ్గట్టే ఇంద్రగంటి ‘సమ్మోహనం’ టైటిల్ పెట్టారు. ఓసారి పనిచేసిన దర్శకుడితో మరో సినిమా చేయాలంటే మొహమాటపడేవాణ్ణి. ఇంద్రగంటితో వరుసగా రెండు సినిమాలు చేశాను. నాతో వరుసగా మరో సినిమా చేద్దామనే ప్రపోజల్ కూడా ఆయనదే. ఈ పాత్రకు అదితీరావు హైదరీ బావుంటుందని ఇంద్రగంటి చెప్పారు. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. నెక్ట్స్ ఎవరితో అనేది ఇంకా అనుకోలేదు’’ అన్నారు. -
మహేష్ కొత్త లుక్ ఎప్పుడంటే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్నేళ్ల కెరీర్లో లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. అందుకే తన 25వ సినిమాలో కొత్త లుక్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే లుక్ విషయంలో మహేష్ కసరత్తులు చేస్తున్నాడు. అయితే మహేష్ కొత్త లుక్ త్వరలోనే రివీల్ కానుందన్న టాక్ వినిపిస్తోంది. జూన్ పదిన జరగనున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మహేష్ పాల్గొననున్నారట. అంతేకాదు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సమ్మెహనం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా మహేష్ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో మహేష్ కొత్త లుక్ చూసేందుకు అభిమానులు జూన్ 10 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కొత్త సినిమా పనుల్లో బిజీ కానున్నారు. -
నాన్‌వెజ్ మీల్స్ మాతోనే మొదలైంది
మావయ్యా... మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకేది ఇష్టం?... అల్లుడు సుధీర్‌బాబు మామగారు కృష్ణ ముందుంచిన ప్రశ్న ఇది. ఇంతకీ అల్లుడు ఎందుకు జర్నలిస్ట్‌గా మారారు? అంటే.. ఆయన నటించిన ‘సమ్మోహనం’ చిత్రం ట్రైలర్‌ను కృష్ణ విడుదల చేశారు. గురువారం సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘సమ్మోహనం’ ట్రైలర్‌ను దర్శక– నిర్మాతలు మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్‌లు కృష్ణతో రిలీజ్ చేయించి, కొన్ని ప్రశ్నలడిగారు. ఆ చిన్న చిట్ చాట్ ఈ విధంగా.... ఇంద్రగంటి: ‘సమ్మోహనం’ అనగానే మీకు ఏవైనా జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? కృష్ణ: ‘సమ్మోహనం’ టైటిల్ ఇప్పటివరకూ ఎవరూ పెట్టలేదు. అచ్చ తెలుగు టైటిల్స్ బాగుంటాయి. మేం తీసిన సినిమాలన్నిటికీ తెలుగు టైటిల్స్ పెట్టామే కానీ, వేరే భాషవి పెట్టలేదు. ‘మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, ప్రజారాజ్యం, ఈనాడు... ఇలా అన్నీ తెలుగు మాటలతోనే పెట్టాం. సుధీర్: మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన లవ్ స్టోరీ? కృష్ణ: ‘పండంటి కాపురం’లో రొమాంటిక్ అంశాలు చాలా ఉంటాయి. ప్రజలకు బాగా నచ్చింది. విడుదల చేసిన 37 సెంటర్లలోనూ వంద రోజులాడింది. 14 సెంటర్లలో 25 వారాలు ఆడింది. సుధీర్: మహేశ్ పుట్టినరోజుని చిన్నప్పుడు ఎలా చేసేవారు? కృష్ణ: మద్రాసులో చాలా బాగా చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ అయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడం మానేశాడు. అభిమానులు చేస్తున్నారు. శివలెంక: మీ సంస్థ ఎంతోమందికి భోజనం పెట్టింది.. అప్పట్లో పద్మాలయాలో భోజనం చేయని వాళ్లు ఉండేవారు కాదు. కృష్ణ: మేం ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మద్రాసులో లంచ్ అంటే సాంబార్ సాదమ్, తయిర్ సాదమ్ (పెరుగు అన్నం) అని పెట్టేవారు. కానీ, మా కంపెనీ పెట్టినప్పుడు ‘అగ్నిపరీక్ష’ నుంచే నాన్ వెజిటేరియన్‌తో ఫుల్లుగా భోజనం పెట్టడం అలవాటు చేశాం. ఆ తర్వాత మిగిలినవాళ్లు కూడా పెట్టారు. సుధీర్: ఇటీవల ‘మహానటి’ వచ్చింది కదా.. మీ బయోపిక్ వస్తే హీరో ఎవరో తెలుసు. ఎవరు దర్శకత్వం చేస్తే బావుంటుంది? కృష్ణ: పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూనే ఉంది. ఎప్పుడో తీయబోయే సినిమాకు ఇప్పుడే ఎలా చెప్పగలం.. -
సమ్మోహనం ట్రైలర్ రిలీజ్
-
‘మన రేటింగ్ కోసం పొర్లుదండాలు పెట్టాలిరా..!’
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్‌ను లాంచ్ చేయించారు. చిరును ఇంటర్వ్యూ చేసి మెగా అభిమానులను అట్రాక్ట్ చేశాడు సుధీర్‌బాబు. సమ్మోహనం టీజర్‌ను చాలా కొత్తగా, గ్రాండ్ లొకేషన్స్‌లో చూపించేసరికి ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. నేడు (గురువారం) సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సమ్మోహనం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. కామెడీ, ప్రేమ, ఎమోషన్స్‌తో కూడుకున్న ఈ ట్రైలర్లో సుధీర్‌బాబు, హీరోయిన్ అదితీ రావు అందంగా కనిపించారు. ట్రైలర్లోనే సినిమా కథేంటో రివీల్ చేసినట్టుగా కనిపిస్తోంది. వివేక్ సాగర్ సంగీతమందించగా.. ఇంద్రగంటి మోషనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
అందం అంటే ఆత్మవిశ్వాసం
‘‘అందంగా ఉన్నామని ఎప్పుడూ గర్వపడొద్దు. మీరు చేసే వర్క్‌ని చూసి గర్వపడండి’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ అదితీరావ్ హైదరీ. మణిరత్నం తీసిన ‘చెలియా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ ‘సమ్మోహనం’తో మరోసారి తెలుగు తెరపై మెరవనున్నారు. నిజమైన అందం గురించి అదితీ మాట్లాడుతూ– ‘‘ఎప్పుడూ అందం చూసి గర్వపడొద్దు. అందం మన సొంతంగా వచ్చింది కాదు. అది కేవలం మన తల్లిదండ్రుల జీన్స్ మాత్రమే. మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే.. మనం చేసిన వర్క్ లేదా చేస్తున్న వర్క్ గురించే. కొన్నిసార్లు అందంగా కనిపించే వాళ్లు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ బోరింగ్‌గా, ధైర్యం లేకుండా, స్పిరిట్ లేకుండా ఉండేవాళ్లు కూడా ఉంటారు. నా వరకైతే సెన్సిటీవ్‌గా ఉండి ఆర్ట్స్ మీద విపరీతమైన ఇష్టమున్న వాళ్లను ఇష్టపడతాను. నా దృష్టిలో కేవలం స్కిన్‌టోన్ తెల్లగా ఉండటం అందం కాదు. లోపల కాన్ఫిడెంట్‌గా ఉండటమే నిజమైన అందం’’ అని పేర్కొన్నారామె.