అందం అంటే ఆత్మవిశ్వాసం | Beauty is self confidence | Sakshi
Sakshi News home page

అందం అంటే ఆత్మవిశ్వాసం

Published Thu, May 31 2018 12:56 AM | Last Updated on Tue, Oct 9 2018 5:00 PM

Beauty is self confidence - Sakshi

అదితీరావ్‌ హైదరీ

‘‘అందంగా ఉన్నామని ఎప్పుడూ గర్వపడొద్దు. మీరు చేసే వర్క్‌ని చూసి గర్వపడండి’’ అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ అదితీరావ్‌ హైదరీ. మణిరత్నం తీసిన ‘చెలియా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ ‘సమ్మోహనం’తో మరోసారి తెలుగు తెరపై మెరవనున్నారు. నిజమైన అందం గురించి అదితీ మాట్లాడుతూ– ‘‘ఎప్పుడూ అందం చూసి గర్వపడొద్దు.

అందం మన సొంతంగా వచ్చింది కాదు. అది కేవలం మన తల్లిదండ్రుల జీన్స్‌ మాత్రమే. మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే.. మనం చేసిన వర్క్‌ లేదా చేస్తున్న వర్క్‌ గురించే. కొన్నిసార్లు అందంగా కనిపించే వాళ్లు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. ఇన్‌ఫ్యాక్ట్‌ బోరింగ్‌గా, ధైర్యం లేకుండా, స్పిరిట్‌ లేకుండా ఉండేవాళ్లు కూడా ఉంటారు. నా వరకైతే సెన్సిటీవ్‌గా ఉండి ఆర్ట్స్‌ మీద విపరీతమైన ఇష్టమున్న వాళ్లను ఇష్టపడతాను. నా దృష్టిలో కేవలం స్కిన్‌టోన్‌ తెల్లగా ఉండటం అందం కాదు. లోపల కాన్ఫిడెంట్‌గా ఉండటమే నిజమైన అందం’’ అని పేర్కొన్నారామె.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement