Aditirao Hydari
-
మిసెస్& మిస్టర్ అదు-సిద్ధు: డిజైనర్ దుస్తుల్లో సింపుల్‌గా ఎంత సక్కగున్నారో!
చిరకాల ప్రేమికులు అదితి రావ్ హైదరి, సిద్దార్థ్ సూర్యనారాయణ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మిసెస్ అండ్ మిస్టర్ అదు-సిద్ధు ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. నూతన దంపతులుగా, పెళ్లి దుస్తుల్లో బట్టల్లో చాలా అందంగా కనిపించారు. ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తుల్లో స్పెషల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త పెళ్లికూతురి గెటప్‌లో అదితి రావ్ హైదరీ లేత గోధుమరంగు , గోల్డెన్ లెహంగాలో మెరిసిపోయింది. ఈ లెహంగా ఆమెకు రాయల్ లుక్ తెచ్చి పెట్టింది. లెహంగాకు బంగారు రంగు చారల బ్లౌజ్‌ను, అందమైన చున్నీని జత చేసింది. భారీ అలంకారాలు లేకుండా సింపుల్‌గా అదితి పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఒక చౌకర్, చెవిపోగులు, గాజులులతోపాటు భారీ మెహందీ హడావుడి లేకుండా, కాళ్లకు చేతులతో అర్థ చంద్రాకారంలో పారాణితో మెరిసింది. అటు సిద్ధార్థకూడా సింపుల్ స్టయిల్‌నే ఎంచుకున్నాడు. వైట్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తాలో,కొల్హాపురి చెప్పులతో దక్షిణాది పెళ్లికొడుకులా ఆకట్టుకున్నాడు. -
కేన్స్‌లో మెరిసిన హైదరాబాదీ బ్యూటీ
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక్కసారి అయినా ఆ రెడ్ కార్పెట్‌పై నడవాలని ప్రతి హీరోయిన్‌కు కోరిక ఉంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు, డిజైనర్లు కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే తాజాగా అదితిరావు హైదరి మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితిరావు హైదరి కేన్స్ రెడ్ కార్పెట్‌పై అదిరిపోయే లుక్‌లో కనిపించింది. హాఫ్ షోల్డర్ వైట్ అండ్ బ్లాక్ ఔట్ఫిట్తో ఆమె సందడి చేశారు. ప్యాషన్ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ వేడుకల్లో ఇప్పటికే ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ లాంటి తారలు తళుక్కున మెరిసి ఆకర్షించారు. వైట్ అండ్ బ్లాక్ ఔట్ఫిట్తో ఆ రెడ్ కార్పెట్‌పై అదితిరావు హైదరి నడుస్తుంటే అక్కడ కెమెరామెన్లతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన హీరామండి వెబ్ సిరీస్ మంచి టాక్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతుంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో ఆమె గూడఛారిగా మెప్పించింది. -
సిద్దార్థ్- అదితి ఎంగేజ్మెంట్ జరిగింది ఈ గుడిలోనే!
-
డేటింగ్ రూమర్స్.. శర్వానంద్ ఎంగేజ్మెంట్లో జంటగా సిద్ధార్థ్, అదితి!
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, వెకేషన్స్‌కి వెళ్లడి, సినిమా ఈవెంట్స్‌కి కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇంత వరకు డేటింగ్ రూమర్స్‌పై ఈజంట క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు జంటగా ఓ యంగ్ హీరో నిశ్చితార్థం వేడుక సందడి చేశారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో నేడు శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. చదవండి: డాడీ నా వల్ల కావడం లేదు.. ప్లీజ్ తిరిగి రా: రీతూ చౌదరి ఆవేదన ఈ వేడుకలో రామ్ చరణ్, నాగార్జునతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు సతీసమేతంగా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే హీరో సిద్ధార్థ్ కూడా తన రూమార్డ్ గర్ల్‌ఫ్రెండ్ అదితి రావ్ హైదరితో కలిసి హజరయ్యాడు. ఈ కొత్త జంటతో వీరిద్దరు తీసుకున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీరి డేటింగ్ రూమర్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. కాగా ఇండస్ట్రీలో సిద్ధార్థ్, శర్వానంద్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. శర్వా, సిద్ధార్థ్‌ల కాంబినేషన్లో సముంద్రం అనే మూవీ రాగా అందులో అదితి హీరోయిన్గా నటించింది. చదవండి: ఘనంగా శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు -
సిద్ధార్థ్, అదితి రావు మధ్య ఏముందో?.. శర్వానంద్ కామెంట్స్ వైరల్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. ఇటీవల ఈ షోలో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్‌లు పాల్గొని సందడి చేశారు. ఈ షోలో హీరో శర్వానంద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన వార్తలపై శర్వానంద్ స్పందించారు. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు శర్వానంద్ నవ్వుతూ సమాధానలిచ్చారు. మీరు సాధారణంగా హీరోయిన్లను ఎలా ఎంపికచేసుకుంటారు అని అడగ్గా.. ఆ విషయంలో నేను చేసేదేం లేదు. అంతా డైరెక్టర్లు చెప్పింది చేయడం తప్ప. నాకు ప్రత్యేకంగా ఎంపిక అంటూ లేదు' అంటూ సమాధానమిచ్చారు. మరీ అదితి రావు సంగతేంటీ? అని బాలయ్య ప్రశ్నించగా.. 'ఆమె మహాసముద్రంలో సిద్ధార్థ్‌కి జోడీగా నటించింది.. కానీ నాకు జోడీగా నటించలేదు అని అన్నారు. దానికి బాలయ్య ‘నిజ జీవితంలో కూడా సిద్ధార్థ్‌కి జంటగా మారిందా?’ అని శర్వానంద్‌ను మళ్లీ అడిగాడు. (చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్) దీనికి శర్వానంద్ బదులిస్తూ.. ' ఏమో నాకేం తెలియదు, సిద్ధార్థ్ బయట ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అతను సోషల్ మీడియాలో ‘స్వీట్ హార్ట్’ అంటూ ఓ పిక్ పోస్ట్ చేశాడు. కానీ అది నాకు అర్థం కాలేదు.' అని అన్నారు. కాగా.. సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, శర్వానంద్ కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు సిద్ధార్థ్, అదితిరావు హైదరీ జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్‌పై ఈ జంట స్పందించలేదు. ఇటీవల అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ వైరలైంది. (చదవండి: ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్రూమ్కు వెళ్లి ఏడ్చేదాన్ని: అదితి రావు) -
Mahasamudram: స్నేహితుడు మంచోడైనా.. చెడ్డోడైనా వదలొద్దు
‘‘సినిమాలు విడదలైనప్పుడు యాక్టర్స్‌కు ప్రేక్షకులు మార్కులు వేస్తారు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారా? అని ఆసక్తికరంగా చూస్తున్నాం. అలాగే ఇమేజ్ అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఈ చిత్రదర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాలో నాకో కొత్త ఇమేజ్‌ని క్రియేట్ చేశాడు’’ అన్నారు సిద్ధార్థ్. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఇందులో అతిదీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘అర్జున్ పాత్రలో శర్వా, విజయ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా బరువు మోసిన శర్వా జ్వరం కారణంగా ఇక్కడికి రాలేకపోయాడు. ‘మహాసముద్రం’ ఒక అద్భుతమైన సినిమా. గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమా’’ అని అన్నారు. ‘‘కొన్ని స్టోరీలకు హీరోలను వెతుక్కోవాల్సిన పనిలేదు. కథే హీరోలను వెతుక్కుంటుందంటారు. అదృష్టం కొద్దీ ఈ సినిమా శర్వా, సిద్ధార్థ్‌ల దగ్గర ఆగింది. మన స్నేహితుడు మంచోడైనా, చెడ్డోడైనా వదలొద్దన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఫీమెల్ సెంట్రిక్ కథల్లో నటించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది’’ అన్నారు అదితీరావ్ హైదరీ. ‘‘ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లో అజయ్ భూపతికి ఉన్న నమ్మకం ఇప్పుడు మా అందరిలోనూ ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. -
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్‌గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్‌గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్‌పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్‌గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్‌గారు. సినిమాలు తీసేది థియేటర్స్‌లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాజీ భర్త పోస్టుపై హీరోయిన్ కామెంట్, పోస్టు వైరల్
‘సమ్మోహనం’ మూవీలో తన అందం, అభియనంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ అదితీరావు హైదరీ తాజాగా వార్తల్లో నిలిచారు. తన మాజీ భర్త పోస్టుకు ఆమె పెట్టిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎనిమిదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్న ఆమె తాజాగా మాజీ భర్త ఇన్‌స్టా పోస్టుపై స్పందించడంతో అది కాస్తా చర్చనీయాంశంగా మారింది. కాగా అదితీ మాజీ భర్త సత్యదీప్ మిశ్రా తన పెట్ డాగ్‌తో సరదాగా ఆడుకుంటు సోఫాలో వాలిన ఫొటోను షేర్ చేశాడు. దానికి అదితీ ‘ఊఫ్..’ అంటూ క్రేజీగా షాట్ కామెంట్‌తో స్పందించింది. అది చూసి నెటిజన్లు ఆమె కామెంట్‌పై తమదైన శైలిలో చర్చించుకుంటున్నారు. కాగా ఆదితీరావు హైదరీ 2009లో బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత మనస్పర్థలతో 2013లో భర్తతో విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం సత్యదీప్ తన సహానటి, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాసాబా గుప్తాతో రిలేషన్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తుండగా... అదితీ మాత్రం సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోంది. చివరగా నాని ‘వీ’ సినిమాలో నటించిన అదితీ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న మహా సముద్రంలో కథానాయిగా కనిపించనుంది. View this post on Instagram A post shared by Satyadeep Misra (@instasattu) -
అలల కంటే మొండివాడిని.. మరి మీరూ?!
‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల శర్వానంద్, హీరో సిద్దార్థ్‌లతో మల్లీస్టార్ చిత్రం ‘మహాసముద్రం’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థీమ్ పోస్టర్‌ను హీరో శర్వానంద్ దీపావళి సందర్భంగా విడుదల చేశాడు. ఎకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ థీమ్ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ... ‘సముద్రం అంతా లోతు, అలల కంటే మొండివాడిని.. అంటూ తన సహా నటులైన సిద్దార్థ్‌తో పాటు హీరోయిన్స్ అదితి రావ్, అను ఇమ్మాన్యూమేల్‌లను ట్యాగ్ చేసి మరీ మీరు ఎవరూ అని ప్రశ్నించాడు. అంతేగాక దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలను ట్యాగ్ చేసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: షేక్ చేస్తున్న శర్వానంద్ ‘భలేగుంది బాలా’ సాంగ్) I'm stubborn than the waves, deep as the seas! @aditiraohydari @Actor_Siddharth @ItsAnuEmmanuel Who are you? #MahaSamudram #ThemePoster 🌊 #HappyDiwali 🪔@DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/MGHfjfaFb8 — Sharwanand (@ImSharwanand) November 14, 2020 కాగా అజయ్ భూపతి మొదటిసారిగా దర్శకత్వం వహించిన రొమాంటిక్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్‌బ్లస్టర్ హిట్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రటి ఆకాశం, సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిడ్జికి అవతలవైపు ఓ వ్యక్తి పరుగులు తీస్తూ, ఇవతల బ్రిడ్జిపై ఇద్దరూ మనుషులు గన్‌పై నిలుచున్నట్లుగా ఉండి పరుగెడుతున్న వ్యక్తి వైపు గురిపెడుతున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక పొస్టర్‌కు కింద ‘అమితమైన ప్రేమ’ అనే ట్యాగ్ లైన్ ఉండటం చూసి ‘సముద్రం’ రోమాంటిక్, థ్రీల్లర్ నేపథ్యంలో సాగనుందని, దర్శకుడు ఈ సినిమాను ఓరెంజ్‌లో చూపించబోతున్నాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక దాదాపు ఏడేళ్ల తర్వాత ‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్థ్ తెలుగు రీఎంట్రీ ఇవ్వడంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటోంది. (చదవండి: టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి) -
ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’..
‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఈ నెల నుంచి పని చేయబోతున్నాను.. చెప్పినట్లుగానే నేను తిరిగి వస్తున్నాను. ఒక గొప్ప టీమ్‌తో, గొప్ప సహనటీనటులతో పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధార్థ్. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు
‘‘ఈ లాక్డౌన్లో తెలుగు నేర్చుకుంటున్నాను. అలాగే ఈ ఆరు నెలలు సహనంతో ఎలా ఉండాలి? దయగా ఎలా ఉండాలి? అనేది నేర్పించాయి’’ అంటున్నారు అదితీ రావ్ హైదరీ. శుక్రవారం రాత్రి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘వి’ చిత్రంలో ఆమె ఒక హీరోయిన్గా నటించారు. నాని విలన్‌గా, సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఆదివారం అదితీ రావ్ హైదరీ మీడియాతో మాట్లాడుతూ – ‘‘వి’ సినిమాలో నానీతో నా ప్రేమకథ చాలా ఉద్వేగంగా ఉంటుంది. సినిమాకు హార్ట్ లాంటి పాత్రలో నటించటం చాలా ఆనందంగా ఉంది. సినిమాలోని నా పాత్ర నిడివి తక్కువగా ఉండటం గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఓ సినిమాలో ఎన్ని నిమిషాలు కనబడ్డాం అనేది ముఖ్యం కాదు.. ఆ పాత్రలో ఎంత బాగా నటించాం? దానికి ఎంత పేరొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇంద్రగంటి మోహనకృష్ణగారే నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయటం బావుంటుంది. ఆయన సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడే విధానం కొత్తగా ఉంటుంది. ‘వి’ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూద్దామనుకున్నాను. అది మిస్సయ్యాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిజిటల్లో రిలీజ్ చేయాలన్నది మంచి నిర్ణయమే. ప్రస్తుతం నేను బాలీవుడ్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. మేం ఉంటున్న కార్వ్యాన్స్ను గంటకోసారి శానిటైజ్ చేయడంతో పాటు షూటింగ్ టైమ్‌లో తక్కువ మంది సెట్లో ఉండేటట్లు ప్లా¯Œ చేశారు. ప్రస్తుతం నా చేతిలో మూడు హిందీ సినిమాలు, రెండు తమిళ్ సినిమాలు, ఒక తెలుగు సినిమా.. మొత్తం ఆరు సినిమాలు ఉన్నాయి’’ అన్నారు. -
నాని.. 'వి' సినిమా రివ్యూ
టైటిల్: వి జానర్: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తారాగణం: నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు దర్శకుడు: ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత: దిల్ రాజు సంగీతం: అమిత్ త్రివేది నేపథ్య సంగీతం: థమన్ సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: 5-9-2020, అమెజాన్ ప్రైమ్ 'అష్టా చమ్మా' చిత్రంతో హీరో నాని ప్రస్థానం మొదలైంది. తొలి చిత్రంతోనే నానికి బంపర్ హిట్‌ను అందించారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే అనూహ్యంగా మళ్లీ ఆయన డైరెక్షన్లోనే నాని 25వ సినిమా చేయడం విశేషం. ఇక ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలకే మొగ్గు చూపే నాని ఈ సారి ప్రతినాయక పాత్రలో కనిపించడంతో 'వి' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 5న) అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. లాక్డౌన్ తర్వాత ఓటీటీలో విడుదలైన భారీ తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో యంగ్ హీరో సుధీర్‌బాబు, విలన్ ఛాయలున్న పాత్రలో నాని ప్రేక్షకులను మెప్పించారా? లేదా? ఈ ఇద్దరిలో చివరికి ఎవరు హీరో అయ్యారో చూసేద్దాం... కథ: డీసీపీ ఆదిత్య(సుధీర్ బాబు) దమ్మున్మ పోలీసాఫీసర్. గ్యాలంటరీ మెడల్ సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయనకు అత్యంత కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్ విష్ణు(నాని) దమ్ముంటే తననాపమని సవాలు విసురుతాడు. అతని డిపార్ట్మెంట్లోని ఓ పోలీసును ఆయన ఇంట్లోనే హత్య చేస్తాడు. ఆ తరువాత ఒక్కొక్కరిని రకరకాలుగా చంపుతూ నెక్స్ట్ ఏంటి? అనేది క్లూ ఇస్తాడు. ఈ క్లూ తెలుసుకోగలిగితే నేరస్థుడిని పట్టుకోవచ్చని డీసీపీ తన ప్రేయసి అపూర్వ (నివేదా థామస్) సాయం కోరతాడు. కానీ చివరికి అతని మెదడులోనే మెరుపులాంటి ఆలోచన చేరి అతనే పజిల్ విప్పుతాడు. వెంటనే నేరస్థుడిని, అదే నానిని పట్టుకునేందుకు పరుగెత్తుతాడు. కానీ విలన్ అంత వీక్ కాదు.. చిక్కినట్లే చిక్కి తప్పించుకుని మళ్లీ హత్యలు చేస్తుంటాడు. అసలు వీ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? డీసీపీ ఆదిత్యకు ఎందుకు చాలెంజ్ విసిరాడు? ఆదిత్య కిల్లర్‌ను పట్టుకున్నాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే! (చదవండి: నేను హ్యాపీ అని ‘దిల్’రాజు అన్నారు) విశ్లేషణ: సుధీర్‌బాబు ఎంట్రీ సీన్‌తోనే పోలీస్‌గా పర్ఫెక్ట్గా సూటయ్యారనిపిస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ హత్యతో కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు మోహనకృష్ణ. హంతకుడు ఎంతో సులువుగా ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్లడం, అతడి కోసం డీసీపీ గాలించడం వంటి సన్నివేశాలతోనే ఫస్టాఫ్ నడుస్తుంది. డీసీపీకి హంతకుడు కనిపించి, తప్పించుకోవడంతో ప్రథమార్థం ముగుస్తుంది. ద్వితీయార్థం మరింత రక్తికట్టిస్తారనుకుంటే అలా జరగలేదు. ఇక్కడ కథనం నెమ్మదించింది. హత్యల వెనక కారణాన్ని తెలుసుకునేందుకు డీసీపీ ప్రయత్నాలు మొదలు పెడతాడు. (చదవండి: పెంగ్విన్ మూవీ రివ్యూ) అలా విష్ణు ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది.. ఇక్కడ సస్పెన్స్ రివీల్ కావడంతో సినిమా అంత ఆసక్తిగా సాగదు. ఇక హంతకుడి ఒప్పందం ప్రకారం అతడిని పట్టుకోనందుకు డీసీపీ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత క్లైమాక్స్‌లో వస్తుంది అసలు ట్విస్ట్. హత్యల వెనక కారణాన్ని హంతకుడే తెలియజేస్తాడు. కానీ ఈ తరహా కారణాలు చాలా సినిమాల్లో కనిపించాయి. అయితే అన్ని మెడల్స్ సాధించి, పెద్ద పేరు గడించిన డీసీపీ.. నేరస్థుడు క్లూ వదిలినా పట్టుకోలేకపోవడం కొంత లాజిక్‌గా అనిపించదు. దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉన్నా కథనం అంత బలంగా లేదు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కాబట్టి కామెడీ చొప్పించే ప్రయత్నం చేయలేదు. కాకపోతే సీరియల్ కిల్లర్‌గా భయపెట్టిన నాని అక్కడక్కడా చిలిపి నానిగా కనిపించారు. ప్రతినాయక పాత్రలోనూ నాని సులువుగా నటించారు. హత్యలు చేసేటప్పుడు వచ్చే డైలాగులు బాగున్నాయి. చివరి రెండు హత్యలు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. నవలా రచయితగా, డీసీపీ ఆదిత్య ప్రేయసిగా అపూర్వ పాత్రలో నివేదా థామస్ రాణించారు. కథకు మూలమైన సాహెబ్ పాత్రలో అదితిరావు హైదరి బాగా నటించారు. మిగతావారు తమ పాత్రలకు న్యాయం చేశారు. కొన్నిచోట్ల వచ్చే సంగీతం 'రాక్షసుడు' థీమ్ మ్యూజిక్‌ను గుర్తు చేస్తుంది. పాటలు పర్వాలేదు. పి.జి. విందా సినిమాటోగ్రఫీకి తిరుగులేదు. (చదవండి: ‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!) ప్లస్: నాని, సుధీర్‌బాబుల నటన ఫస్టాఫ్ మైనస్: కథనం బలహీనంగా ఉండటం సెకండాఫ్ నెమ్మదించడం ఒక్కమాటలో: ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవలేదు. -
ఆ గేమ్‌లోకి వెళ్లను
నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నివేదా థామస్ చెప్పిన విశేషాలు. ► నిజానికి ఈ సినిమాని థియేటర్ రిలీజ్ కోసం తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనందరం పక్కనే ఉన్న షాప్‌కి వెళ్లటానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారని గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల సరైన నిర్ణయమే. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ► ‘వి’ సినిమా చేయడం వెనక నా స్వార్థం కూడా ఉంది. నా పాత్ర నచ్చడం, నానీతో మూడోసారి సినిమా చేయడం, ఇంద్రగంటి సార్‌తో రెండో సినిమా, ‘దిల్’ రాజుగారి బేనర్లో కంటిన్యూస్‌గా సినిమాలు చేయడం.. ఇవన్నీ నేను ‘వి’ చేయడానికి కారణాలు. ఈ సినిమాలో నా పాత్ర పేరు అపూర్వ. తను క్రైమ్ థ్రిల్లర్స్ రాసే నవలా రచయిత. ఇప్పటివరకు నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. ► స్వతహాగా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీతో చాలారోజులు ఇంట్లో స్పెండ్ చేశాను. 17 ఏళ్లుగా మా నాన్న దుబాయ్‌లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడన్నా అలా వచ్చి ఇలా వెళ్లేవారు. కానీ ఆరు నెలలుగా ఆయనతో బెస్ట్ టైమ్ గడుపుతున్నాను. ఈ లాక్డౌన్లో ఎంతోమంది కొత్త దర్శకులు చెప్పిన కథలు విన్నాను. ప్రతి కథ ఒక కొత్త అనుభూతినిచ్చింది. కానీ ఫైనల్‌గా నాకు సూట్ అయ్యేవే ఎన్నుకుంటాను. ► వెబ్ సిరీస్‌లో నటించాలనుకోలేదు. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తానేమో. ప్రస్తుతానికి నేను మంచి పొజిషన్లో ఉన్నాను. స్టార్డ్డమ్ అంటూ నంబర్ గేమ్‌లోకి రావటం నాకిష్టంలేదు. నేను ఆ బాక్స్‌లో ఉండను. స్టార్డమ్ కంటే కూడా ‘ఈ అమ్మాయి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది’ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. -
హద్దులుదాటిన ప్రేమకథ
జాన్ అబ్రహాం, అదితీరావు హైదరీ తాత–నానమ్మ పాత్రల్లో కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న లుక్ ఈ పాత్రలకు సంబంధించినదే. మరి.. ఫొటోలో యంగ్‌గా కనిపిస్తున్నారు కదా అనుకుంటున్నారా? ఆ సీక్రెట్ త్వరలో చెబుతారట. ప్రస్తుతానికి ఈ లుక్స్‌ని విడుదల చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ఈ ఇద్దరి నటీనటుల పాత్రలు వస్తాయట. అర్జున్‌కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్ ఓ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సరిహద్దులు దాటిన ప్రేమకథతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. నిఖిల్ అద్వాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్‌కపూర్ నానమ్మ, తాతయ్యల పాత్రల్లో అదితి, జాన్ అబ్రహాం కనిపిస్తారట. -
వి ఇంటికి వస్తోంది
‘‘పన్నెండేళ్లుగా నా కోసం మీరు థియేటర్‌కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీకు ధన్యవాదాలు చెప్పేందుకు మీ ఇంటికే వస్తున్నాను. మీ స్పందన తెలుసుకోవాలనే ఉత్సుకతతో పాటు.. ‘వి’ సినిమా రిలీజ్ విషయంలో కొంచెం నెర్వస్‌గానూ అనిపిస్తోంది’’అంటూ హీరో నాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సుధీర్‌బాబు, నాని, నివేదా థామస్, అదితీ రావ్ హైదరి ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వి’. ‘దిల్’రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా థియేటర్లో విడుదలవుతుందా? ఓటీటీలోనా? అనే సందిగ్ధం చాలా రోజులుగా ఉండేది. అయితే ‘వి’ సినిమా సెప్టెంబరు 5న ఓటీటీలోనే (అమెజాన్ ప్రైమ్) విడుదల కానున్నట్లు నాని స్పష్టం చేశారు. తన సోషల్ మీడియాలో నాని ఓ లేఖను షేర్ చేశారు.. దాని సారాంశం ఇలా... ‘‘నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం డిజిటల్ ఫార్మెట్లో విడుదలవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలా డిజిటల్ ఫార్మెట్లో విడుదల కావడం నాకు గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం (అభిమానులను ఉద్దేశించి). థియేటర్లు తెరుచుకోగానే ‘టక్ జగదీశ్’ సినిమాతో సిద్ధంగా ఉంటా.. ఒట్టు’’ అని నాని పేర్కొన్నారు. -
ఉగాదికి రెడీ
నానీతో ‘అష్మాచమ్మా, జెంటిల్మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి వారిద్దరి కలయికలో తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘వి’. అదితీరావు హైదరీ, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేష¯Œ ్స పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నారు. నాని 25వ చిత్రం ‘వి’. ఇందులో నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్నారు. ఆయన బారి నుంచి అందర్నీ కాపాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. ఇటీవల వీరిద్దరి పాత్రల లుక్స్‌ను విడివిడిగా విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. సుధీర్‌బాబు స్టైలిష్ లుక్‌తో కనబడుతుంటే.. నాని మెలితిప్పిన మీసాలతో రగ్డ్ లుక్‌లో కనబడుతున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, నేపథ్య సంగీతం: తమన్, కెమెరా: పి.జి.విందా. -
ఇద్దరు అందాల భామలతో ‘సైకో’
సాక్షి, తమిళ సినిమా : ఇద్దరు అందాలభామలతో కలిసి ఆడిపాడేందుకు ‘సైకో’ సిద్ధమవుతున్నడు. ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో దర్శకుడు మిష్కిన్ ‘సైకో’ తెరకెక్కిస్తుండగా.. దీనికి మేస్ట్రా ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఉదయనిధికి జోడీగా ఇద్దరు నటించబోతున్నారు. మణిరత్నం కంపెనీ హీరోయిన్గా ముద్రపడిన అదితిరావ్ హైదరి, సంచలన నటి నిత్యామీనన్‌లే ఉదయనిధితో రొమాన్స్ చేయనున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు మిష్కిన్. ఇటీవల తుప్పరివాలన్ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ మధ్య పిశాచి అనే థ్రిల్లర్ కథను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించారు. సవరకత్తి అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇతివృత్తంతో సినిమా రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా సైకో అంటూ భయ పెట్టడానికి మిష్కిన్ రెడీ అవుతున్నారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్ జంటగా అదితిరావ్ హైదరి, నిత్యామీనన్‌ను ఎంచుకున్నారు. మరో దర్శకుడు రామ్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ. శ్రీరామ్, ఇళయరాజా పనితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుళ్‌మొళి మాణిక్యం నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ సాధారణ చిత్రాలకు భిన్నంగా మంచి క్లాసికల్ చిత్రాలు చేయడంలో దర్శకుడు మిష్కిన్ దిట్ట అన్నారు. అదే సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలన్నది తెలిసిన దర్శకుడాయన అని పేర్కొన్నారు. సైకో చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత అరుణ్మొళి మాణిక్యం తెలిపారు. చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని చెప్పారు. -
బట్టీ పట్టేస్తా...
‘‘స్కూల్లో కొన్నిసార్లు ఫార్ములాస్‌తో ఇబ్బంది పడుతుంటాం. కొన్నిసార్లు గట్టెక్కడానికి బట్టీ పట్టేసి ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవ్వకుండా బయటపడుతుంటాం. ప్రస్తుతం నేను అదే టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నాను’’ అంటున్నారు అదితీరావ్ హైదరీ. పరభాష హీరోయిన్లు తెలుగులో నటించినప్పుడు డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఈ సవాల్‌ని ఎలా ఎదుర్కొన్నారు? అని అదితీని అడగ్గా – ‘‘యాక్టర్‌గా చాలెంజ్లని ప్రేమిస్తాను. నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటకు తీసుకెళ్లే ఏ పనైనా ఇష్టమే. కొత్త భాషలని త్వరగా నేర్చుకోవడం కొంచెం ఇబ్బందే. యాక్చువల్లీ ఎంత పెద్ద డైలాగ్స్ అయినా బట్టీ పట్టగలను. లిప్ సింక్‌తో ఇబ్బంది పడకుండా చూసుకోగలను. ప్రస్తుతానికి డబ్బింగ్ కూడా చెప్పుకోగలుగుతున్నాను. త్వరలోనే అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటాను’’ అన్నారు. అదితీ నటించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న రిలీజ్ కానుంది. -
వరుణ్, అదితి ఫొటో షూట్ డైరీస్
-
అంతరిక్షంలో వరుణ్, అదితి..!
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. స్పేస్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్న ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్‌తో కలిసి దిగిన ఫొటోను షూట్ డైరీస్ అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు అదితి. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి హాలీవుడ్ మూవీ జీరో గ్రావిటీ ఇన్సిపిరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. -
నవాబ్... ప్యాకప్
లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’ సినిమాకు సెర్బియాలో ప్యాకప్ చెప్పారు దర్శకుడు మణిరత్నం. అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితీరావ్ హైదరీ ముఖ్యతారలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘చెక్క చివంద వానమ్’. లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో ‘నవాబ్’గా రిలీజ్ చేయనున్నారు. సెర్బియా షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. శింబు మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటానికి సెర్బియా వెళ్లింది చిత్రబృందం. శింబు పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో సినిమా మొత్తం పూర్తయింది. దాంతో ప్యాకప్ చెప్పారు మణిరత్నం. ఈ సినిమాలో అరవింద స్వామి, శింబు, విజయ్‌సేతుపతి అన్నదమ్ములుగా కనిపించనున్నారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ అవనున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: సంతోష్ శివన్. -
అందం అంటే ఆత్మవిశ్వాసం
‘‘అందంగా ఉన్నామని ఎప్పుడూ గర్వపడొద్దు. మీరు చేసే వర్క్‌ని చూసి గర్వపడండి’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ అదితీరావ్ హైదరీ. మణిరత్నం తీసిన ‘చెలియా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ ‘సమ్మోహనం’తో మరోసారి తెలుగు తెరపై మెరవనున్నారు. నిజమైన అందం గురించి అదితీ మాట్లాడుతూ– ‘‘ఎప్పుడూ అందం చూసి గర్వపడొద్దు. అందం మన సొంతంగా వచ్చింది కాదు. అది కేవలం మన తల్లిదండ్రుల జీన్స్ మాత్రమే. మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే.. మనం చేసిన వర్క్ లేదా చేస్తున్న వర్క్ గురించే. కొన్నిసార్లు అందంగా కనిపించే వాళ్లు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ బోరింగ్‌గా, ధైర్యం లేకుండా, స్పిరిట్ లేకుండా ఉండేవాళ్లు కూడా ఉంటారు. నా వరకైతే సెన్సిటీవ్‌గా ఉండి ఆర్ట్స్ మీద విపరీతమైన ఇష్టమున్న వాళ్లను ఇష్టపడతాను. నా దృష్టిలో కేవలం స్కిన్‌టోన్ తెల్లగా ఉండటం అందం కాదు. లోపల కాన్ఫిడెంట్‌గా ఉండటమే నిజమైన అందం’’ అని పేర్కొన్నారామె. -
ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్
...అని తమిళ నటుడు విజయ్ సేతుపతి అంటున్నారు. మరి.. ఆ అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఎంటో ‘నవాబ్’ సినిమాలో చూడాల్సిందే. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్, అదితీరావ్ హైదరీలు ముఖ్య తారలుగా రూపొందుతోన్న సినిమా ‘చెక్కా చివంద వానమ్’. తెలుగులో ‘నవాబ్’. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను అబుదాబిలో షూట్ చేశారట. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ‘‘మణిరత్నంగారితో వర్క్ చేయడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. కల నిజమైనట్లుంది. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ ‘నవాబ్’’ అన్నారు విజయ్ సేతుపతి. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో తన పాత్ర గురించి విజయ్ మాట్లాడుతూ –‘‘కార్తీక్‌పై నాకు నమ్మకం ఉంది. ఇంకా స్క్రిప్ట్ వినలేదు. రజనీసార్‌తో నటించబోతున్నందుకు హ్యాపీ’’ అన్నారు. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా’ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.