
‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఈ నెల నుంచి పని చేయబోతున్నాను.. చెప్పినట్లుగానే నేను తిరిగి వస్తున్నాను. ఒక గొప్ప టీమ్‌తో, గొప్ప సహనటీనటులతో పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధార్థ్. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment