Sharvanand
-
Manamey X Review: ‘మనమే’ టాక్ ఎలా ఉందంటే..
శర్వానంద్, కృతీశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉంది? శర్వా ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్)లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండిఎక్స్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎమోషన్స్‌తో పాటు ఫన్ కూడా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. #Manamey #SharwanandLead pair is the main positive for the film 🎥 Colourful good first half 😍Ekkuva fun ekkuva emotion 🥰Cinematography is top notch 🔥🔥@SriramAdittya gaaru mii taking super sir 💥💥On to the second half 👍 pic.twitter.com/kO7WODCvjN — Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) June 7, 2024 కృతీ-శర్వాల జంట ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్. ఫస్టాఫ్ కలర్ఫుల్గా ఉంది.ఫన్‌తో పాటు ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీరామ్ ఆదిత్య టేకింగ్ సూపర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.Just watched the film #Manamey and I have to say lengthy emotional film.Rating: 2.8/5Positives: SharwanandKid ActorComedy Music Emotion Negatives:Krithi Shetty To Many SongsLaggedSlow Narration CGIDirection Overall decent entertainer to watch with family this… pic.twitter.com/edwQFwsOta— Movie Buff (@itsurmoviebuff) June 7, 2024 ఇప్పుడే సినిమా చూశాను. ఎమోషనల్ లెన్తీ ఫిల్మ్. శర్వా,కృతీ, కిడ్స్ కామెడీతో పాటు మ్యూజిక్, ఎమోషన్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎక్కువ పాటలు, స్లో నెరేషన్ సినిమాకు మైనస్ అంటూ 2.8/5 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్#Manamey1st half: Intro, Comedy scenes👍, Some emotional scenes 👍, Interval Is Good, cinematography Excellent🔥Good 1st half2nd half: Slow paced screenplay, emotional scenes are okay, Dragged In Many scenes, Climax is OkayGood 2nd halfOverall: HIT / 3/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) June 7, 2024ఫస్టాఫ్‌లో ఎమోషనల్ సీన్స్, కామెడీ బాగుంది. ఇంటెర్వల్ సీన్ గుడ్, సినిమాటోగ్రఫీ బాగుంది. సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపించింది అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Manamey is an inferior movie that tries to fall into the feel good family/love drama template. The 1st half is watchable with some light hearted comedy that somewhat works. However, the 2nd half goes on endlessly without any impactful scenes. The emotional connect needed for…— Venky Reviews (@venkyreviews) June 7, 2024#Manamey is an inferior movie that tries to fall into the feel good family/love drama template. The 1st half is watchable with some light hearted comedy that somewhat works. However, the 2nd half goes on endlessly without any impactful scenes. The emotional connect needed for…— Venky Reviews (@venkyreviews) June 7, 2024#Manamey Movie Review Rating: ⭐️⭐️⭐️#Sharwanand looks #Charming in the film. With decent acting #KrithiShetty impressed with her performance. #Kid acting thopOverall a good feel good family drama🎥#SriramAdittya cinematography is top notch📷💥#Pitapuram lo success meet fix pic.twitter.com/54KspGvkjy— Daily info -999 (@karthik34156235) June 7, 2024Average first half…. Quality is good seems costly making, few comedy scenes here and there but missing emotional connection.. @ImSharwanand is perfect scenes with little boy are good #Manamey— Rakita (@Perthist_) June 6, 2024 -
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ -రక్షితారెడ్డి జూన్ 3న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కాగా, శర్వానంద్ ఫ్యామిలీ రేపు (జూన్ 9న) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనుంది. (ఇదీ చదవండి: ‘చిరు లీక్స్’.. సంగీత్‌లో మెగాస్టార్ స్టెప్పులు) ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శర్వానంద్ కలిశారు. రిసెప్షన్‌కు రావాలని ఆయనకు ఆహ్వానం అందించారు. శర్వానంద్ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని తెలిసిందే. ఇకపోతే ఈ హీరో సినిమాల విషయానికి వస్తే.. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో రాశీఖన్నా లీడ్ రోల్లో నటిస్తుంది. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?) -
Kanam Movie: సైన్స్ ఫిక్షన్‌గా అక్కినేని అమల 'కణం'.. రిలీజ్ అప్పుడే!
Akkineni Amala Kanam Movie Release Date Out: వైవిధ్య భరిత కథా చిత్రాల నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్. ఈ సంస్థ అధినేతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'కణం'. నటి అమల అక్కినేని, శర్వానంద్, రీతూవర్మ, నాజర్, సతీష్, రమేష్ తిలక్, ఎమ్మెస్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. దీనికి సుజిత్ సరాంగ్ ఛాయాగ్రహణం, జాక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఇది వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంగళవారం (ఆగస్టు 9) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని, గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన చిత్రంలోని అమ్మ పాటకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ద్విభాషా చిత్రంగా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమిళంలో 'కణం' పేరుతోనూ, తెలుగులో 'ఒకే ఒక జీవితం' పేరుతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తామన్నారు. చదవండి: కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ -
అమెరికాలో 300 స్క్రీన్లలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, శర్వానంద్ జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. మహిళలు ఎక్కువగా ఉండే ఉమ్మడి కుటుంబంలో వారసుడిగా ఒకే మగాడు ఉంటే అతనిపై వారి ఆప్యాయతలు, అనురాగాలు ఎలా వుంటాయనే పాయింట్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం రూపొందిందని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈనెల 4న శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి బుధవారం (మార్చి 2) మీడియా సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు. డేట్స్ వల్ల ఆలస్యమైంది `పడి పడి లేచె మనసు` తర్వాత చక్కటి ఫ్యామిలీ సినిమా చేయాలనుకున్నాం. ఆ సమయంలో కిశోర్ దగ్గర కథ ఉందని తెలిసి విన్నాం. మేం ఏదైతే అనుకుంటున్నామో అదే ఈ కథ అనిపించింది. వెంటనే సినిమాను ప్రారంభించాలనుకున్నాం. కానీ రష్మిక, ఖుష్బూ, రాధిక డేట్స్ వల్ల ఆరు నెలలు ఆలస్యమయింది. అందరికీ కనెక్ట్ అవుతాయి ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు కథ కాబట్టి నాకు బాగా నచ్చింది. పది మంది మహిళలు ఉన్న కుటుంబంలో ఒకే మగాడు ఉంటే అతనిపై ఉన్న ప్రేమతో అతనికి తెలీకుండా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు బాగా చూపించాం. ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పగలను. మా సినిమా పాయింట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబసభ్యులతో ఉన్నట్లు అనిపించింది ఒకరకంగా ఇంతమంది నటీనటులతో సినిమా చేయడం సాహసమే అని చెప్పాలి. ఇంతమంది సీనియర్స్‌తో చేస్తానని అనుకోలేదు. నా కుటుంబసభ్యులతోనే ఉన్నట్లు అనిపించింది. కిశోర్ తిరుమల వినోదంతోపాటు కుటుంబ విలువలను బాగా ఎలివేట్ చేస్తాడు. కిశోర్ అనుకున్న సమయంలో పూర్తి చేయగలడు. అందుకే నటీనటులు డేట్స్ కుదిరాక చేయగలిగాం. కొవిడ్ టైంలోనూ నటీనటుల ప్రోత్సాహంతో పూర్తి చేయగలిగాం. మన పని మనం నిక్కచ్చిగా చేసుకోవాలి శర్వానంద్‌తో ఇది రెండో సినిమా. తను నిర్మాతగా కాకుండా సోదరిడిలా ట్రీట్ చేశాడు. పడిపడి లేచె మనసు అనుకున్నంతగా ఆడలేదు. అందుకే అప్పటినుంచి మంచి సినిమా ఉంటే చేద్దామని అనుకున్నాం. సినిమా సక్సెస్ కాకపోయినా బెటర్‌మెంట్‌గా చేయాలని మరో సినిమా చేశాం. ఏదైనా మన పని మనం నిక్కచ్చిగా చేసుకోవాలి. నిర్మాణంలో పలు విషయాలను నేర్చుకుని ముందుకు సాగుతున్నాను. నేను సినిమారంగంలోకి ఇష్టంతోనే వచ్చాను. యు.ఎస్‌లో ఐటీ కంపెనీ ఉండేది. కుమార్తె పుట్టాక ఇండియా వచ్చేశాం. ఎర్నేని నవీన్, 14 రీల్స్ వారు అంతా స్నేహితులే. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్.. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం కొవిడ్ తర్వాత కుటుంబాలను థియేటర్‌కు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బామ్మలు, తల్లిదండ్రులు ఉంటారు. నా కుటుంబంలోనూ ఇటువంటి వారున్నారు. నేనూ కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా చూశాక ప్రతివారూ ఎక్కడోచోట కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ డ్రామాతో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు వినోదాన్ని పండిస్తాయి. ఇక సత్య, వెన్నెల కిశోర్, ప్రదీప్ రావత్ పాత్రలు మరింత ఎంటర్టైన్ చేస్తాయి. మంచి సినిమా చేయడమే నా కల ఈ చిత్ర కథ రాజమండ్రిలో జరిగేది. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన అన్నవరం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో షూట్ చేశాం. ఇంతకుముందు `పడిపడి..` సినిమాను రూ. 33 కోట్లతో తీశాం. ఆ తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నా. మరో మంచి సినిమా తీయాలనే ముందడుగు వేస్తున్నా. అందుకే వరుసగా నాలుగు సినిమాలను తీయగలుగుతున్నా. ప్రొడక్షన్ పరంగా శ్రీకాంత్ సహకారం ఎంతో ఉంది. నిర్మాతగా డ్రీమ్ అనేవి వుంటాయి. మంచి సినిమా చేయడమే ప్రస్తుతం ముందున్నది. రష్మికను కథ ప్రకారమే తీసుకున్నాం నేను చేయబోయే సినిమాలు ఒక్కోటి ఒక్కో భిన్నమైన కథలతో రూపొందుతున్నాయి. రవితేజతో `రామారావు ఆన్ డ్యూటీ` సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్ నేపథ్యంలో సాగుతుంది. రానా `విరాటపర్వం` 1945 నక్సల్స్ బ్యాక్‌డ్రాప్, నాని దసరా చిత్రం వినూత్నమైన అంశం. గోదావరిఖని బ్యాక్‌డ్రాప్ కథ. సెట్ కూడా వేస్తున్నాం. రష్మికను కథ ప్రకారం ఆమె బాగుంటుందని ఎంపిక చేశాం. దేవీశ్రీ ప్రసాద్ నాలుగు పాటలు అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. ఆదరణ పొందాయి. ఐదో పాట కూడా ఉంది. అది నేరుగా సినిమాలో చూస్తే మరింత బాగుంటుంది. సినిమాను అమెరికాలో 300 స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణలోనూ ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అని ముగించారు. -
ఈ టైమ్‌లో ఇలాంటి సినిమా చేయడం సూపర్బ్: రష్మిక మందన్నా
హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారు. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది రష్మిక మందన్నా. అప్పుడు సంతోషపడ్డాను.. ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఆ పాత్రలకు ఎవరెవరిని అనుకుంటున్నారో చెప్పాక సంతోషపడ్డాను. ఈ సినిమా ప్రధానంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా ఎలాగైనా చేయాలని అనిపించింది. డైలాగ్ ప్రధానంగా సాగే పాత్రలే.. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య. ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు. సినిమా నిండా ఆడవాళ్లమే ఉంటాం కాబట్టి సెట్ లో మగవాళ్లంతా మమ్మల్ని చూసి ..వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అంటూ ఇబ్బంది పడేవారు. ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్నీ డైలాగ్ ప్రధానంగా సాగుతుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. అవన్నీ మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లు సహజంగా ఉంటాయి. చాలా సరదాగా ఉండేది.. దర్శకుడు కిషోర్ తిరుమలతో పనిచేయడం చాలా సరదాగా ఉండేది. ఆయనకు దైవభక్తి ఎక్కువ. మాల వేసుకునేవారు. ఏం కోరుకున్నారు సార్ అని అడిగితే.. ఇంతమంది మహిళలతో సినిమా చేస్తున్నాను కదా అన్నీ సవ్యంగా జరగాలని కోరుకున్నా అని నవ్వుతూ చెప్పేవారు. అలా ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ నవ్వుకునేవాళ్లం. సినిమా విషయంలో చాలా స్ఫష్టత ఉన్న దర్శకుడాయన. కిషోర్ తిరుమల మహిళలకు ఎంత విలువ ఇస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. కమర్షియల్ సినిమాలు, హీరోయిజం ఉన్న సినిమాలు వస్తున్న ఈ టైమ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సినిమా చేయడం సూపర్బ్. శర్వా ఇంటి నుంచి ఫుడ్ తెచ్చేవాడు.. శర్వానంద్ తో కలిసి నటించడం హ్యాపీ. నేను పుష్ప సెట్ లో నుంచి ఆడవాళ్లు..షూట్ కు వచ్చినప్పుడు చాలా రికాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే పిక్నిక్ లా అనిపించేది. ఇంటి నుంచి శర్వా ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఒక ఫ్యామిలీలా అంతా కలిసి ట్రావెల్ చేశాం. శర్వాను మిగతా ఆడవాళ్లు ఈ సినిమాలో ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను. అంతమంది మహిళల మధ్య ఆయన ఎలా వ్యవహరించారు అనేది సినిమాలో చూడాలి. చాలా ఫన్ గా ఉంటుంది. అది మర్చిపోలేని అనుభవం.. ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వాళ్లు అప్పటిదాకా మనతో నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు. షాట్ రెడీ అనగానే ఆశ్చర్యపోయేలా మారిపోతారు. ఆ క్యారెక్టర్ లోకి వెళ్తారు. సెట్ లో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలన్నీ వాళ్లను చూసి నేర్చుకున్నా. నేను ఉన్నందుకే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని ఉర్వశి గారు అనడం నామీదున్న ప్రేమతోనే. మళ్లీ చేయాలని ఉంది శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ కు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మళ్లీ ఈ సంస్థలో వర్క్ చేయాలని ఉంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్. దేవి టాలెంట్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ఆల్బమ్ లోని అన్ని పాటలు హిట్ చేశాడు. ఆర్ఆర్ కూడా సినిమాను బాగా ఎలివేట్ చేస్తుంది. వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కీర్తి, సాయిపల్లవి ఉండటం ఎంతో హ్యాపీ అనిపించింది. వాళ్లను చూస్తుంటే మహిళా శక్తిని చూసినట్లు ఉంది. కీర్తి, పల్లవి వాళ్ల వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. నాకు వాళ్లను చూస్తే ఆనందంగా ఉంటుంది. నా తదుపరి సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా. -
ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్లతోపాటు సూపర్ గెస్ట్
Adavallu Meeku Joharlu Movie Prerelease Event: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, శర్వానంద్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను మొదటగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించి తర్వాత మార్చి 4కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ప్రిరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్లు కీర్తి సురేష్, సాయి పల్లవి ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రకటించింది. అయితే టైటిల్‌కు తగినట్లు మహిళల గొప్పతనాన్ని చాటేందుకే ఇద్దరు ప్రముఖ హీరోయిన్లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆద్యంతో వినోదాత్మకంగా, కుటుంబంతో కలిసి చూడగలిగే సినిమా అని చెబుతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. #AadavalluMeekuJohaarlu grand Pre Release Event on 27th FEB 💥 Blockbuster Director @aryasukku garu, The most talented & fan favourites @KeerthyOfficial & @Sai_Pallavi92 will grace the event. #AMJOnMarch4th@ImSharwanand @iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @LahariMusic pic.twitter.com/P3YJVmtYVn — SLV Cinemas On Duty (@SLVCinemasOffl) February 25, 2022 -
ఫిబ్రవరి 25న ఎవరు వస్తున్నారు ?
-
‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
థియేటర్లకు రప్పించే సినిమా ఇది
‘‘శతమానం భవతి’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ‘మహానుభావుడు’ వంటి ఎంటర్టైనర్ చిత్రాల తర్వాత నేను చేసిన ఆ తరహా చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చిరునవ్వుతో, మంచి సినిమా చూశాం అనే అనుభూతితో బయటికొస్తారు. ఈ సినిమాలో రాధిక, ఖుష్బూగార్లతో నటించడం ఆనందంగా ఉంది’’ అని శర్వానంద్ అన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నేను అనుకున్నంత బాగా రావడానికి కారణమైన శర్వానంద్, రష్మిక, ఖుష్బూ, రాధికగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఫుల్ ఎంటర్టైనింగ్గా తెరకెక్కిన చిత్రమిది.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు రష్మికా మందన్న. ‘‘కరోనా తర్వాత కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’’ అన్నారు నటి రాధికా శరత్‌కుమార్. ‘‘కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి ఖుష్బూ సుందర్. నిర్మాత సుధాకర్, నటీమణులు ఝాన్సీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ సారంగ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
'ఆడవాళ్లు మీకు జోహార్లు' నుంచి లేటెస్ట్ అప్డేట్
Aadavallu Meeku Johaarlu Title Song To Be Released: యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25నప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని వచ్చేనెల4న, సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇక ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు -
'ఆడవాళ్లు మీకు జోహార్లు' విడుదల ఎప్పుడంటే ?
Sharvanand Aadavallu Meku Joharlu Movie 2022 Release In February: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతుంది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో సినిమా ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కింటి కుర్రాడి పాత్రలో నటిస్తుండగా, రష్మిక పాత్ర మంచి అనుభూతిని ఇస్తుందని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను టైటిల్ తెలియజేసేలా ఉంది. ఖుష్బు, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్‌లు అందించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. #AadavalluMeekuJohaarlu Releasing in Theaters on February 25 💥💥#AMJOnFEB25 @iamRashmika @DirKishoreOffl @realradikaa @khushsundar #Urvashi @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/Z8I7ssvapf — Sharwanand (@ImSharwanand) January 28, 2022 -
అలా సిద్ధమయ్యాకే సినిమా చేస్తా: హీరో శర్వానంద్
Sharvanand Interesting Comments In Lakshya Pre Release Function: యంగ్ హీరో నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. క్రీడా నేపథ్యంతో వస్తోన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం (డిసెంబర్ 5) జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపించద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ 'క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ జోనర్లో వచ్చిన సినిమాలు ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోంది. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస్తా. అఖండ విజయం సీజన్‌కు మంచి సంకేతం. నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలి. బాలీవుడ్‌కు కూడా వెళ్లిపోవాలి.' అని తెలిపారు. లక్ష్య సినిమా చేస్తూ ఎంతో నేర్చుకున్న అని హీరో నాగశౌర్య అన్నారు. ఏ సమస్య వచ్చినా సరే నిర్మాతలు తనకోసం నిలబడ్డారని తెలిపారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త, అందులోనే విజయం ఉందన్నారు. భారతీయ క్రీడా సినిమాల్లో నిలిచిపోయే మరో చిత్రం 'లక్ష్య' కావాలని కోరుకుంటున్నా అని పుల్లెల గోపించంద్ అన్నారు. 'నా తొలి సినిమా సుబ్రమణ్యపురం. తర్వాత సునీల్ నారంగ్ నన్ను పిలిచి ఈ అవకాశమిచ్చారు. ఏడున్నర గంటలు కథ విని ఈ సినిమా చేశారు నాగశౌర్య. సినిమా అనేది కళారూపం. దానికి ఆక్సిజన్ థియేటర్ వ్యవస్థ. ఆ ఆక్సిజన్ అందజేసే వ్యక్తి నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్.' అని లక్ష్య చిత్రం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'హెల్తీవే రెస్టారెంట్'ను ప్రారంభించిన శర్వానంద్, బాబీ
Sharvanand And Director Bobby Inaugurated A Restaurant: బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో హైదరాబాదీల కోసం సరికొత్త రుచులు రుచిచూపించేందుకు 'హెల్తీవే రెస్టారెంట్ బై ఆర్యన్' పేరుతో హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్‌ను హీరో శర్వానంద్, డైరెక్టర్ బాబీ, నటి హిమజా ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ వ్యవస్థాపకులు స్వప్నిక, ఆర్యన్, బాలు, జితేందర్. రెస్టారెంట్లో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. ఆరోగ్యం, బరువు అవసరాలకు అనుగుణంగా వివిధ ఆహార ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ప్రతీ వారం ఎప్పటికప్పుడు కొత్త మెనూతోపాటు ఫుడ్ డెలీవర్ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. సుమారు 20 ఏళ్ల అనుభవం గల చెఫ్ వండిన వంటకాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని వ్యవస్థాపకులు తెలిపారు. శ్రద్ధ, నిబద్ధత గల సిబ్బందితో మంచి అనుభూతి చెందుతారన్నారు. పోషకాహార నిపుణులు, వృత్తిపరమైన చెఫ్‌లు ఉంటారన్నారు. వారు ఒకరికొకరు కలిసి పని చేస్తారని, కస్టమర్ల జీవక్రియ మార్పులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శర్వానంద్ ఇటీవలే 'మహా సముద్రం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'ఒకే ఒక జీవితం' చిత్రాల్లో నటించనున్నారు. -
Mahasamudram: స్నేహితుడు మంచోడైనా.. చెడ్డోడైనా వదలొద్దు
‘‘సినిమాలు విడదలైనప్పుడు యాక్టర్స్‌కు ప్రేక్షకులు మార్కులు వేస్తారు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారా? అని ఆసక్తికరంగా చూస్తున్నాం. అలాగే ఇమేజ్ అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఈ చిత్రదర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాలో నాకో కొత్త ఇమేజ్‌ని క్రియేట్ చేశాడు’’ అన్నారు సిద్ధార్థ్. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఇందులో అతిదీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘అర్జున్ పాత్రలో శర్వా, విజయ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా బరువు మోసిన శర్వా జ్వరం కారణంగా ఇక్కడికి రాలేకపోయాడు. ‘మహాసముద్రం’ ఒక అద్భుతమైన సినిమా. గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమా’’ అని అన్నారు. ‘‘కొన్ని స్టోరీలకు హీరోలను వెతుక్కోవాల్సిన పనిలేదు. కథే హీరోలను వెతుక్కుంటుందంటారు. అదృష్టం కొద్దీ ఈ సినిమా శర్వా, సిద్ధార్థ్‌ల దగ్గర ఆగింది. మన స్నేహితుడు మంచోడైనా, చెడ్డోడైనా వదలొద్దన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఫీమెల్ సెంట్రిక్ కథల్లో నటించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది’’ అన్నారు అదితీరావ్ హైదరీ. ‘‘ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లో అజయ్ భూపతికి ఉన్న నమ్మకం ఇప్పుడు మా అందరిలోనూ ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. -
మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్‌గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్‌గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్‌పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్‌గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్‌గారు. సినిమాలు తీసేది థియేటర్స్‌లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Maha Samudram: గన్ పట్టిన సిద్దు.. కోపోద్రోక్తుడైన శర్వా
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. థియేటర్స్‌లో విడుదల అయ్యేందుకు ఈ చిత్రం రెడీ అవుతుంది. ఈ సందర్భంగా రానున్న కొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.మోషన్ పోస్టర్లో కనిపిస్తున్న ‘మహాసముద్రం’లోని ఇంటెన్స్ క్యారెక్టర్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇక ఫీరోసియస్‌గా కనిపిస్తున్న హీరోలు శర్వాందన్, సిద్దార్థ్‌ల లుక్స్, తాజా కొత్త పోస్టర్స్ అవుట్‌స్టాండింగ్‌గా ఉన్నాయి. సిద్దార్థ్ గన్ పట్టు కోవడం, శర్వానంద్ కోపోద్రోక్తుడై నడుచుకుంటూ రావడం మోషన్ పోస్టర్లో కనిపిస్తుంది. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ ఈ చిత్రంలోని క్యారెక్టర్స్‌కు ఇచ్చిన ఎలివేషన్స్ ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయేలా ఉంది. -
Maha Samudram: భయంకర పాత్రలో ‘కేజీఎఫ్’ గరుడ
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా - సిద్దార్ధ్ - అదితి - అనూ ఇమాన్యూయేల్ - జగపతిబాబు, రావు రమేశ్ ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది.తాజాగా ఈ చిత్రంలో కీలయ పాత్ర చేస్తున్న కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన ధనుంజయ్ అను విలన్ పాత్రని చేస్తున్నాడు. ఒక రాక్షస రాజులా కనిపించనునున్నాడు. ఈ సినిమాలో ఆయన మెయిన్ విలన్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. Introducing the Violent Man @GarudaRaam as #Dhanunjay 🔥 The 𝑩𝒂𝒅𝒂𝒔𝒔-𝑩𝒂𝒅𝒅𝒊𝒆 from #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @kishore_Atv @chaitanmusic @Cinemainmygenes @AKentsOfficial @SonyMusicSouth pic.twitter.com/FJpQGPdRxv — AK Entertainments (@AKentsOfficial) June 26, 2021 -
Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్.. ఫస్ట్‌లుక్ వైరల్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా - సిద్దార్ధ్ - అదితి - అనూ ఇమాన్యూయేల్ - జగపతిబాబు ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న రావు రమేశ్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఆయన పుట్టిన రోజు(మే 25)సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో రావు రమేశ్ టక్ చేసుకొని సీరియస్‌గా చూస్తున్నాడు. ఇందులో గూని బాబ్జీగా రావు రమేశ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. పేరుకు తగ్గట్టే ఆయన గూని తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. Wishing the Incredibly Versatile Actor #RaoRamesh garu a Very Happy Birthday! Introducing him as #GooniBabji from our #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @chaitanmusic @DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial @SonyMusicSouth pic.twitter.com/l0BBWyq6Ny — AK Entertainments (@AKentsOfficial) May 25, 2021 చదవండి: KGF Chapter 2: రావు రమేశ్ లుక్ వచ్చేసింది -
మంత్రి అవంతి శ్రీనివాస్‌ను కలిసిన శర్వానంద్
సింహాచలం(పెందుర్తి): సింహగిరిపై సోమవారం మహా సముద్రం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. హీరో శర్వానంద్, హీరోయిన్ అదితీరావు హైదరీ తదితరులపై ఆలయప్రాంగణంలోని ధ్వజస్తంభం, కల్యాణ మండపంలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు అజయ్‌భూపతి చిత్రీకరించారు. హీరో కుటుంబంతో సహా ఒక చిన్నపాపకు అక్షరాభ్యాసం చేసేందుకు ఆలయానికి వచ్చే సన్నివేశాలు, కల్యాణ మండపంలో ఒక స్వామీజీ ప్రవచన సనివేశాన్ని చిత్రీకరించారు. విశాఖలో మహా సముద్రం సినిమా షూటింగ్ 34 రోజుల పాటు చేశామని, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూర్చారన్నారు. మంత్రి ముత్తంశెట్టితో శర్వానంద్ చిట్‌చాట్.. సింహగిరికి సోమవారం వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును సినీ హీరో శర్వానంద్ కలిశారు. పరస్పరం నమస్కరించుకుని, ఒకరినొకరు ఆప్యాయంగాపలకరించుకున్నారు. అప్పన్నకు పూజలు.. : శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని హీరో శర్వానంద్ దర్శించుకున్నారు. కప్పస్తంభానికి మొక్కుకుని బేడా ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో స్వామికి అష్టోత్తం పూజ, గోదాదేవికి పూజలు జరిపారు. స్వామివారి ప్రసాదాన్ని శర్వానంద్‌కు దేవ స్థానం ఈవో ఎం.వి.సూర్యకళ అందజేశారు. లక్ష్మీనృసింహుడికి కిలో ముత్యాలు : శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి సినీ దర్శకుడు అజయ్‌భూపతి కిలో ముత్యాలను కానుకగా సమర్పించా రు. మహా సముద్రం సినిమాకు దర్శకత్వం వహి స్తున్న ఆయన అప్పన్నను దర్శించుకుని ఆలయ సూపరింటెండెంట్ బంగారునాయుడుకు ముత్యాలను అందజేశారు. చదవండి: కేరళలో ‘దృశ్యం 2’ కీలక సన్నివేశాలు -
ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’..
‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఈ నెల నుంచి పని చేయబోతున్నాను.. చెప్పినట్లుగానే నేను తిరిగి వస్తున్నాను. ఒక గొప్ప టీమ్‌తో, గొప్ప సహనటీనటులతో పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధార్థ్. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
మహా సముద్రంలో...
‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒక హీరోగా శర్వానంద్ పేరుని ఎప్పుడో ప్రకటించిన చిత్రబృందం తాజాగా మరో హీరోగా సిద్ధార్థ్ నటించబోతున్నట్లు తెలిపింది. చాలాకాలం తర్వాత సిద్ధార్థ్ చేస్తున్న డైరెక్ట్ తెలుగు చిత్రమిది. సిద్ధార్థ్ చివరిగా ‘గృహం’, ‘వదలడు’ అనే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సౖరైన స్క్రిప్ట్‌తో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇవ్వాలనుకున్న సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ కథ నచ్చటంతో ప్రాజక్ట్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతివారం ఓ ప్రకటన విడుదల చేస్తామని చిత్రబృందం తెలియజేసింది. -
గాయని శైలపుత్రీ దేవి
శ్రియ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గమనం’. లేడీ డైరెక్టర్ సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందింది. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వీఎస్ నిర్మించారు. ఈ చిత్రంలో గాయని శైలపుత్రీ దేవి అనే పాత్ర పోషిస్తోన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శర్వానంద్ ఆవిష్కరించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రియల్ లైఫ్ డ్రామాగా ‘గమనం’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన శ్రియ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: ఇళయరాజా, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్. -
మహాసముద్రంలో ఆ ముగ్గురు
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సంచలన విజయం సాధించారు దర్శకుడు అజయ్ భూపతి. ఆ చిత్రం తర్వాత ‘మహాసముద్రం’ అనే కథను తయారు చేసుకున్నారాయన. కథరీత్యా ఇందులో ఇద్దరు హీరోలు నటించాల్సి ఉంటుంది. కథ విని ఇద్దరు ప్రముఖ హీరోలు ఈ కథకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా షికారు చేశాయి. కారణమేదైనా ఆ హీరోలిద్దరూ ఈ సినిమా చేయడంలేదట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి హీరోలుగా శర్వానంద్, సిద్ధార్థ్ వచ్చారని సమాచారం. హీరోయిన్గా అదితీ రావ్ హైదరీని ఎంపిక చేశారని తెలిసింది. -
‘జాను’ మూవీ రివ్యూ
సినిమా : జాను నటీనటులు : శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, రఘుబాబు, తాగుబోతు రమేష్, శరణ్య దర్శకత్వం : సి.ప్రేమ్ కుమార్ నిర్మాత : దిల్ రాజు, శిరీష్ సంగీతం : గోవింద వసంత జానర్ : రొమాంటిక్ డ్రామా బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమిళ తెరపై సంచలనం సృష్టించిన క్లాసిక్ సినిమా ‘96’. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో కన్నడలో ‘99’ గా రీమేక్ అయింది. గణేష్, భావన జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమారే ఈ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈ 7వ తేదీన సినిమా థియేటర్ల తలుపు తట్టింది. మరి ‘96‘ మ్యాజిక్‌ను ‘జాను’ తెలుగు తెరపై కొనసాగించిందా? శర్వానంద్, సమంతల జంట భగ్న ప్రేమికులుగా ప్రేక్షకులను మెప్పించారా?.. లేదా?. కథ : కే.రామచంద్రన్(శర్వానంద్) ట్రావెల్ ఫొటోగ్రాఫర్. ఓ జర్నీలో చిన్నప్పుడు తను పుట్టి పెరిగిన ఊరికి వెళతాడు. అక్కడ ఒక్కొక్కటిగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. అలా తను చదువుకున్న స్కూల్ దగ్గరకు చేరుకుంటాడు. ఆ సమయంలోనే తొలిప్రేమ జ్ఞాపకాలు అతడి కళ్లముందు మెదులుతాయి. జానకీ దేవీ(సమంత)తో ప్రేమలో పడటం.. ఆమెతో గడిపిన మధుర క్షణాలు.. విడిపోవటం! అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత చోటుచేసుకునే కొన్ని పరిణామాలతో దాదాపు 17 సంవత్సరాల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీలో ఇద్దరూ కలుస్తారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారు? సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న ఓ ప్రేమ జంట మదిలో మెదిలే భావాలేంటి? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : ఓ మంచి కథకి భాషతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ‘ జాను’ సినిమాను ఓ రీమేక్‌లా కాకుండా తెలుగు నేటివిటీతో తెరకెక్కించాడు దర్శకుడు సి. ప్రేమ్ కుమార్. 96 సినిమా మ్యాజిక్ తెలుగు తెరపై కొనసాగిందని చెప్పొచ్చు. ప్రేమ కథలకు సోల్ అయిన ఎమోషన్స్ ఎక్కడా తక్కువ కాలేదు. తొలిప్రేమతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరి జీవితానికి ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనల్ని మనం తెరపైన చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇద్దరి మధ్యా చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. 96కు సంగీతం అందించిన గోవింద వసంత ఈ సినిమాకు కూడా పనిచేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గిలిగింతలు పెడుతుంది. మాతృకతో పోల్చినపుడు కొన్ని పాటలు కొద్దిగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ సీన్లతో నవ్వులు పూయిస్తే.. సెకండ్ హాఫ్ భగ్న ప్రేమికుల మధ్య బాధతో మన గుండెని బరువెక్కిస్తుంది. అశ్లీలతకు తావులేని ఓ బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రమ్ ‘జాను’ అని ఒక్కమాటలో చెప్పొచ్చు. నటీనటులు : ఎక్స్ప్రెషన్స్ క్వీన్ సమంత తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. భగ్న ప్రేమికుడిగా శర్వానంద్ నటన యాజ్ యూజువల్. ఉన్నది కొద్దిసేపే అయినా వెన్నెల కిషోర్, రఘుబాబు, తాగుబోతు రమేష్, శరణ్య నటన బాగుంది. శర్వానంద్, సమంతల చిన్నప్పటి పాత్రలుగా కనిపించిన సాయికుమార్, గౌరీ కిషన్ల నటనకూడా మనల్ని ఆకట్టుకుంటుంది. ప్లస్ పాయింట్స్ శర్వానంద్, సమంతల నటన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ కొన్ని పాటలు - బండారు వెంకటేశ్వర్లు, సాక్షి వెబ్‌డెస్క్ -
మై డియర్ శర్వా.. థాంక్యూ: అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ ‘అల వైకుంఠపురంలో’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వసూళ్లు మొదటి రోజు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ రోజురోజుకీ మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో వచ్చిన హ్యట్రిక్ మూవీ.. డుదలైన నాలుగు రోజుల్లో వంద కోట్లు రాబట్టి సంక్రాంతి పోరులో దూసుకుపోతుంది. అటు మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ధీటుగా కలెక్షన్లు సాదిస్తుంది. ఇక ఈ సినిమాతో బన్నీ అభిమానులకు తన యాక్టింగ్ పవర్ చూపించారు. ఇక సినిమాకు తమన్ సంగీతం అందించడం ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు.(అల వసూళ్లు ఇలా..) తాజాగా ఈ సినిమా చూసిన యంగ్ స్టార్ శర్వానంద్ మూవీపై స్పందించారు. ‘ఇప్పుడే అల వైకుంఠపురంలో సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లో బన్నీ తన నటనతో కుమ్మేశాడు. ఒక నటుడిగా ఈ సినిమా చూసి చాలా నేర్చుకున్నాను. కంగ్రాట్యూలేషన్స్ త్రివిక్రమ్ గారు, తమన్, చిన్నబాబు అలాగే చిత్ర యూనిట్’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇది చూసిన అల్లు అర్జున్ వెంటనే శర్వానాంద్ ట్వీట్‌కు బదులిచ్చారు. ‘‘మైడియర్ శర్వా... సినిమాను అభినందించినందుకు కృతజ్ఞతలు. సినిమాను, నా వర్క్స్‌ను ఇష్టపడ్డందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ రీట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే సినిమా బాగుందంటూ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ శ్రీనువైట్ల, అడవిశేషు, నిహారిక, సుశాంత్ ప్రశంసలు కురింపించిన విషయం తెలిసిందే. My dear Sharwa... thank you sooo much for the generous compliments . Soo glad you liked our movie and my work . Humbled . #Sharwanand #AlaVaikuntapurramuloo pic.twitter.com/OW4X56jqo3 — Allu Arjun (@alluarjun) January 16, 2020 -
గ్యాంగ్‌స్టర్ ఈజ్ కమింగ్
గ్యాంగ్‌స్టర్ ఎక్కడైనా చెప్పాపెట్టకుండా అటాక్ చేస్తాడు. కానీ ఈ గ్యాంగ్‌స్టర్ డేట్ చెప్పి మరీ వస్తున్నాను అంటున్నాడు. జూలై 6న థియేటర్స్‌లో రఫ్ ఆడిస్తానని చెబుతున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలు. ఇందులో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. యంగ్ లుక్‌లో ఒకటి, గ్యాంగ్‌స్టర్‌గా ఓల్డ్ లుక్ మరోటి. ఈ సినిమాను జూలై 6న రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు శర్వా‘96’ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. -
చెన్నై పక్కమ్ వాంగ
చెప్పాల్సిన కథలో రీచ్ ఎక్కువున్నప్పుడు బైలింగువల్ (ద్విభాషా చిత్రం) ప్లాన్ చేస్తారు హీరోలు. ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఉన్నారు శర్వానంద్. త్వరలోనే ఓ బైలింగువల్ చిత్రాన్ని పట్టాలెక్కించి చెన్నై టు హైదరాబాద్ ప్రయాణం చేస్తారట శర్వా. డ్రీమ్ వారియర్ బ్యానర్‌పై నిర్మాత యస్. ఆర్. ప్రభు తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. నూతన దర్శకుడు తయారు చేసిన ఈ కథలో హీరోగా నటించడానికి శర్వానంద్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం శర్వానంద్ ‘96’ రీమేక్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘96’ రీమేక్ తర్వాత ఈ ద్విభాషా చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆల్రెడీ తమిళంలో కొన్ని సినిమాలు చేసి తమిళ ప్రేక్షకులను పలకరించారు శర్వా. ‘గమ్యం’ తమిళ రీమేక్ ‘కాదల్ సుమ్మా ఇల్లై, నాళై నమదే, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, జేకే ఎనుమ్ నన్బన్ వాళ్కై’ అనే సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తమిళంలో చెన్నై పక్కమ్ వాంగ (చెన్నై వైపు రండి) అని పలు అవకాశాలు వచ్చినా శర్వా తెలుగు చిత్రాలకే పరిమితం అయ్యారు. ఈ సంగతి అలా ఉంచితే.. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా రిలీజ్‌కు రెడీగా అవుతోంది. -
బిజీ బిజీ
‘హలో’తో తెలుగు చిత్రపరిశ్రమకు హాయ్ చెప్పారు కల్యాణీ ప్రియదర్శన్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఈ ఏడాది కల్యాణి రెండుభాషల్లో నటించిన రెండేసి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె శర్వానంద్ సరసన సుధీర్ వర్మ సినిమాలో, సాయిధరమ్ తేజ్‌తో ‘చిత్రలహరి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళంలో దుల్కర్ సల్మాన్‌తో ‘వాన్’ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమా అంగీకరించి జోరు పెంచారు కల్యాణీ ప్రియదర్శన్. ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రాన్ని రూపొందించిన పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్నంది. ఇందులో హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్ నటించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించారు. తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలతో పాటు మలయాళంలో ఆమె తండ్రి ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘మరక్కార్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇందులో మోహన్‌లాల్ హీరో. కాగా, కళ్యాణి క్యారెక్టర్ షూట్ పూర్తయింది. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది. -
ఏమై పోతానే.. నువ్వంటూ లేకుంటే!
ప్రాణంగా ప్రేమించే అమ్మాయి హఠాత్తుగా కనిపించకపోతే, వెతికిన జాడ తెలియకపోతే అప్పుడా ప్రేమికుడు విరహంలోకి వెళ్లిపోతాడు. ఇటీవల శర్వానంద్ కూడా అలాగే వెళ్లిపోయి.. ‘‘ఏమైపోయావే నీవెంటే నేనుంటే.. ఏమైపోతానే.. నువ్వంటూ లేకుంటే’ అని పాడుకున్నారు. మరి.. ఆయన ప్రేమకథకు ఎలాంటి శుభం కార్డు పడింది? ఇంతకీ.. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిపోయింది? అనే ప్రశ్నలకు సమాధానం ఈ నెల 21న విడుదలయ్యే ‘పడిపడిలేచె మనసు’ సినిమాలో తెలుస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఆడియో జ్యూక్‌బాక్స్‌ను మార్కెట్లోకి నేరుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. హైదరాబాద్, నేపాల్, కోల్‌కతాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మురళీ శర్మ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, ప్రియా రామన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
మనసు పడి...
ప్రేయసిని చూడగానే శర్వానంద్ మనసు పడి పడి లేచిందట. ఆమె కోసం కోల్కత్తా, నేపాల్ మొత్తం తిరిగేసి ప్రేమ ప్రయాణం కూడా చేశారట. ఆ జర్నీ ఎలా ఉండబోతోందో కొంచెం రుచి చూపించబోతున్నాం అంటున్నారు శర్వానంద్. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను రేపు (అక్టోబర్ 10) విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘పడి పడి లేచె మనసు’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ కోల్కత్తా, నేపాల్ వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. శర్వానంద్, సాయి పల్లవి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్ర శేఖర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి. -
మనసు పడి..
ప్రేమలో పడితే మనసు గాల్లో తేలిపోతుందా? ఎంత బరువైనా తేలికగా అనిపిస్తుందా? ఇక్కడ ఫొటో చూస్తే అలానే అనిపిస్తోంది. ప్రేయసి బరువుని శర్వానంద్ ఎంత ఆనందంగా మోస్తున్నారో కదా! శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచే మనసు’లోని లేటెస్ట్ స్టిల్ ఇది. హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కలకత్తా సిటీ నేపథ్యంలో ఉంటుంది. సినిమా అవుట్‌పుట్‌పై చాలా హ్యాపీగా ఉన్నాం. శర్వానంద్ లుక్ కొత్తగా ఉంటుంది. నేపాల్‌లో జరిగే షెడ్యూల్‌కి సిద్ధమవుతున్నాం’’ అన్నారు. మురళీ శర్మ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి, అభిషేక్ మహర్షి, ప్రియ రామన్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి. -
రావా ఇలా...
విరాట్ కొండూరు హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘పరిచయం’. సిమ్రత్ కౌర్ కథానాయిక. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రియాజ్ నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండోపాట ‘రావా ఇలా...’ ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి శుక్రవారం విడుదల చేశారు. పాట చాలా బాగుందంటూ ఈ సందర్భంగా వారు చిత్రబృందాన్ని అభినందించారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల రిలీజ్ చేసిన తొలి పాట ‘ఏమైందో మనసా...’ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం నైజాం రైట్స్‌ను ఏషియన్ సంస్థ సొంతం చేసుకుంది. జూలై 20న విడుదల కానున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నరేష్ రానా. -
పడి పడి నవ్వుకుంటారు
శర్వానంద్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ వంటి సెన్సిబుల్ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో సునీల్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. తొలి షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్ జరుగుతోంది. సునీల్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు. నేటి నుంచి ఆయన షూటింగ్లో పాల్గొంటారు. శర్వానంద్, సాయి పల్లవి, సునీల్, ‘వెన్నెల’ కిశోర్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఇటీవల విడుదలైన శర్వానంద్, సాయి పల్లవిల ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన వచ్చింది’’ అన్నారు. సునీల్ ఉన్నారంటే కచ్చితంగా ప్రేక్షకులు పడి పడి నవ్వుకోవడం ఖాయం అని ఊహించవచ్చు. మురళీశర్మ, ప్రియా రామన్, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి. -
జూన్‌లో జాయినింగ్
జూన్ స్టార్టింగ్‌లో స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. కొత్త స్టూడెంట్స్ అందరూ స్కూల్లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంటారు. కాజల్ అగర్వాల్ కూడా కొత్త స్టూడెంట్‌లాగానే కొత్త సినిమా సెట్లోకి జాయిన్ అవుతారు. సుధీర్ వర్మ డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్, నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. శర్వానంద్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతుందట. ఇందులో ఆల్రెడీ ఒక హీరోయిన్గా ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ యాక్ట్ చేస్తున్నారు. మరో హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. జూన్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు కాజల్. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రంలో నటిస్తున్నారు కాజల్. -
కాశీపట్నంలో శర్వానంద్ సందడి
అనంతగిరి(అరకులోయ): మండలంలో కాశీపట్నం, తుమ్మనవలస మధ్యలో బంగారమ్మగుడి సమీపంలో అరకు,విశాఖ ప్రధాన రహదారిలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో కొన్ని సన్నివేశాలను శుక్రవారం చిత్రీకరించారు. చెక్‌పోస్టును ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీ చేస్తున్న సన్నివేశం, హీరో శర్వానంద్, అతని స్నేహితుల మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరించారు. శర్వానంద్, కల్యాణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కేశవ చిత్రం డైరెక్టరు నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కుతోంది. 1990 సంవత్సరానికి సంబంధించిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో జబర్దస్త్ మహేష్, ఆదర్శ్, రాజా తదితరులు నటిస్తున్నారు. -
ఈ సినిమా కొనాలనుకున్నా – శర్వానంద్
‘‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ చూడగానే మార్నింగ్ షో చూడాలనిపించింది. ఈ సినిమాను నేను కొనుక్కుంటే బావుంటుందనిపించి విజయ్‌కి కాల్ చేస్తే, అప్పటికే బిజినెస్ పూర్తయ్యింది. మంచి సినిమాను మిస్ చేసుకున్నానే అనిపిస్తోంది’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చాలామంది అడిగినా నటించలేదు. ఈ కథ నచ్చి, చేశా. హీరో తర్వాత అంత ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాదే’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ‘ఏంట్రా ఇదేదో నా స్టోరీలాగే ఉందే’ అనిపించింది. నా జీవితాన్ని ఎప్పుడైనా సినిమాగా చూసుకోవాలంటే ఈ చిత్రం చూసుకోవచ్చని చేశా. ఒక అమ్మాయి వెంటపడి ప్రేమ కోసం ఒప్పించేటప్పుడు.. జీవితం కోసం ఎంత ఒప్పించాలని చెప్పేదే ఈ సినిమా’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూడగానే పెద్ద హిట్ అవుతుందనే వైబ్రేషన్ కలిగింది. ‘ఆకలిరాజ్యం’ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ గుర్తుండిపోయింది. మరోసారి ఆ చిత్రాన్ని గుర్తుకు తెచ్చిన సినిమా ఇది’’ అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘ఇంటర్ చదివే రోజుల్లో నా ఫ్రెండ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాడు. అలాంటివాళ్ల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు. -
గ్యాంగ్‌స్టర్ లవర్!
హే.... అని ఎగిరి గంతేస్తున్నారు కల్యాణి ప్రియదర్శన్. ఎందుకంటే తను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఓ కోరిక నెరవేరిందట. ఏంటా కోరిక అనుకుంటున్నారా? గ్యాంగ్‌స్టర్ సినిమాలో నటించాలన్నది తన డ్రీమ్. ‘హలో’తో మంచి హిట్ అందుకున్నా ఒక్క సినిమా కూడా సైన్ చేయని కల్యాణి, తన నెక్స్›్ట సినిమాను అనౌన్స్ చేశారు. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్ డబుల్ యాక్షన్ చేయనున్నారు. ఒక పాత్రకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్‌ని ఎంపిక చేశారు చిత్రబృందం. ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘నేను ఎప్పటి నుంచో ఒక గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్‌లో న టించాలని అనుకునేదాన్ని. ఫైనల్‌గా సుధీర్‌వర్మ – శర్వానంద్ సినిమా ద్వారా ఆ కోరిక తీరిపోతోంది. ఇంత అమేజింగ్ టీమ్‌తో జాయిన్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు కల్యాణి. ‘‘ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్గా కల్యాణిని ఎంపిక చేశాం. మార్చి 3వ వారం నుంచి షూటింగ్ చేస్తాం’’ అని అన్నారు. ఇందులో శర్వానంద్ ఒక క్యారెక్టర్ కోసం 40 ఏళ్ల పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకు కెమేరా:దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్. -
నో వార్.. ఓన్లీ లవ్
... అంటున్నారు హీరో శర్వానంద్. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సైనికుడి పాత్రలో నటించనున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదట. బోర్డర్లో యుద్ధం చేసే సైనికుడి పాత్రలో కాదు.. ప్రేమ కోసం పోరాడే కుర్రాడి క్యారెక్టర్లో శర్వానంద్ నటిస్తున్నారు. శర్వా లుక్‌ను కొత్తగా డిజైన్ చేశారట హను రాఘవపూడి. ఈ లుక్ కోసం బరువులో ఢిపరెన్స్ చూపించేందు శర్వా కసరత్తులు చేశారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో స్టారై్టంది. శర్వానంద్, సాయి పల్లవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పడి పడి లేచే మనసు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు సంగీతం: విశాల్ శేఖర్, కెమెరా: జయకృష్ణ. -
తిరుపతిలో మహానుభావుడి సందడి
హాస్యభరితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా రూపొందించిన మహానుభావుడు చిత్రాన్ని ఆదరిస్తూ విజయాన్ని అందిస్తున్న అభిమానుల ఆదరణ మరువలేనిదని ఆ చిత్రం హీరో శర్వానంద్ అన్నారు. తిరుమలలో జరిగిన తన చెల్లెలు వివాహానికి విచ్చేసిన ఆయన మహానుభావుడు చిత్రం ప్రదర్శిస్తున్న పీజీఆర్ థియేటర్‌కు మంగళవారం విచ్చేశారు. ఆయనకు థియేటర్ అధినేత పాంట్రివేటి అభిషేక్‌రెడ్డి, అభిమానులు పూలమాలలో ఘనంగా స్వాగతం పలికారు. హీరో శర్వానంద్ అభిమానులతో కలిసి మహానుభావుడు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను నటించిన శతమానంభవతి, రాధ చిత్రాలను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఒకే బ్యానర్‌పై శతమానంభవతి, రాధ, మహానుభావుడు చిత్రాలు రావడం సంతోషకరమన్నారు. తాను నటించిన రాధ, మహానుభావుడు చిత్రాలు పీజీఆర్ థియేటర్లో ప్రదర్శించడంతోపాటు విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. థియేటర్ వద్ద అభిమాన హీరోను చూసేందుకు పలువురు ఎగబడ్డారు. హీరో శర్వానంద్ సెల్ఫీలుదిగి వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో యూవీ క్రియేషన్ డిస్ట్రిబ్యూటర్ జగదీష్ పాల్గొన్నారు. -
7లో 5 హిట్లు చిన్న విషయం కాదు! – ‘దిల్’ రాజు
‘‘ఆర్య’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా స్టార్ట్ అయిన వంశీ ఇప్పుడు నాతో సమానంగా విజయవంతమైన సినిమాలు చేస్తున్నాడు. ఏడు సినిమాల్లో ఐదు సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం చిన్న విషయం కాదు. ఎంత హార్డ్‌వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందో నాకు తెలుసు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ సెప్టెంబర్ 29న విడుదలై మంచి హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పన్నెండు, పదమూడేళ్లుగా శర్వానంద్ తెలుసు. హీరో సినిమాను మెయిన్‌గా రన్ చేయాలి. శర్వా ఆ బాధ్యత నిలబెట్టుకుంటున్నాడు. ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో మారుతి కథలు రాసుకుంటుంటాడు. తన సక్సెస్ ఫార్ములా అదే’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నేను ఎంజాయ్ చేస్తూ జరుపుకున్న పుట్టినరోజు ఇది. ‘మహానుభావుడు’ సక్సెస్ రూపంలో ప్రేక్షకులు నాకు గిఫ్ట్ ఇచ్చారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ, ఎస్కేయన్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మహానుభావుడు’ చేసినందుకు ఓ నటుడిగా చాలా హ్యాపీగా, సంతృప్తిగా ఉన్నా. ఇంత మంచి సినిమా నాదని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు శర్వానంద్. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మేఘన రోల్ ఇచ్చినందుకు మారుతిగారికి థ్యాంక్స్’’ అన్నారు మెహరీన్. -
అలా అనుకున్న రోజు దుకాణం కట్టేయాల్సిందే!
‘‘త్రివిక్రమ్‌గారి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో? శేఖర్ కమ్ములగారి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో? నేను తీసిన సినిమాను ప్రేక్షకులు చూసి ‘ఇది మారుతి సినిమా’ అన్నప్పుడు హ్యాపీగా ఫీలవుతాను. ఎందుకంటే... అదే మనకు గుర్తింపు. వంద మంది డైరెక్టర్లలో మనల్ని ప్రేక్షకులు గుర్తించగలిగితే అంతకు మించిన అదృష్టం ఉండదు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’... ఇలా వరుస విజయాలతో ‘క్లీన్ చిట్’ తెచ్చుకున్న మారుతి బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.. ► ఈ బర్త్‌డే స్పెషల్ ‘మహానుభావుడు’ సక్సెస్. ఈ సినిమాతో నా బాధ్యత మరింత పెరిగింది. ఒక మనిషిలో ఉన్న రెండు క్యారెక్టర్ల సంఘర్షణే ఈ సినిమా. ‘‘భలే భలే మగాడివోయ్’లో నానికి మతిమరుపు. ‘మహానుభావుడు’లో శర్వానంద్‌కి ఓసీడీ (అతిశుభ్రత). సినిమాల్లో మీ హీరోలకు ఏదో ఒక డిసార్డర్ పెట్టారు కదా.. రియల్ లైఫ్‌లో మీకేదైనా డిసార్డర్ ఉందా? అనడిగితే– ‘‘లేదు. ఆ రెండు సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ రియల్ లైఫ్‌లో నేను చూసినవే. నాకు ఒక్క ఐడియా వస్తే నా సన్నిహితులతో షేర్ చేసుకుంటా. వాళ్లందరూ బాగుందంటే... ప్రేక్షకులకు కూడా బాగుంటుందనిపించి తీస్తా’’ అన్నారు నవ్వుతూ. ► మారుతి అంటే... కొత్త కాన్సెప్ట్‌కు ఎంటర్టైన్మెంట్ జోడించి ఒక మంచి మాట చెబుతాడని నమ్మవచ్చు. కొంతమంది మాఫియా మూవీస్, కొందరు హారర్ మూవీస్ చేస్తారు. నేను నా జోనర్ (ఎంటర్టైన్మెంట్)లోనే వెళ్లాలనుకుంటున్నా. అయితే, వాటిని నెక్ట్స్ లెవల్లో తెరకెక్కించాలని ఉంది. ► నాకు కొత్తా పాతా, చిన్నా పెద్దా అనే తేడాలు లేవు. కథ కుదిరితే ఎవరితోనైనా సినిమా చేస్తాను. ముఖ్యంగా స్టార్స్ అందరితో సినిమాలు చేయాలని ఉంది. సీక్వెల్స్, రీమేక్ మూవీస్ చేయడానికి ఇష్టపడను. ► క్లీన్‌గా సినిమా తీయాలనుకుంటే తీయలేం. స్వతహాగా మనసులో ఉండాలి. నాలో ఒరిజనల్‌గా ఆ డైరెక్టరే ఉన్నాడు. వాడు ఇప్పుడు బయటకు వచ్చాడు... అంతే. ► టెక్నాలజీతో ఇవాళ లైఫ్ చాలా షార్ట్ అయిపోయింది. టీ20 మ్యాచ్‌లు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు వచ్చిన తర్వాత రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోడానికి ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపించకపోవచ్చు. వాళ్లను థియేటర్లో కూర్చోబెట్టగలిగే డైరెక్టర్లే సక్సెస్ అవుతున్నారు ► ప్రేక్షకుడు ఎక్కడో ఉండడు నాలోనే ఉంటాడని అనుకుంటాను. ప్రతి శుక్రవారం ఒక కామన్ ఆడియన్లానే నేను సినిమాలను ఎంజాయ్ చేస్తాను. నచ్చితే... బాగున్నాయని ట్వీట్ చేస్తా. సినిమాను సినిమాలానే చూస్తా. ‘అరే.. ఆ సీన్ బాగా తీశారు. మనం కూడా ఇంత బాగా తీయా’లని ఎగై్జట్ అవుతుంటా. ఆ ఎగై్జట్‌మెంట్ పోయి, మనం తీసిందే సినిమా అనుకున్న రోజు... దుకాణం కట్టేసుకుని, పార్కుల్లో కాలక్షేపం చేసుకోవాలి. ► నాగచైతన్యతో తీయబోయేది టీనేజ్ యంగ్ లవ్‌స్టోరీ మూవీ. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ప్రభాస్, బన్నీగార్లతో సినిమాలు చేయడం ఇష్టం. కథ కుదిరి, వారికి నచ్చితే తప్పకుండా చేస్తాను. ► ప్రొడక్షన్ విషయానికొస్తే... ప్రస్తుతం నిర్మిస్తున్న ‘లండన్‌బాబులు’ను నవంబర్‌లో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత రెండు సినిమాలు మొదలుపెడతాం. ఒక సినిమాకు కథ ఇచ్చాను. ఇంకో సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చాను. -
శర్వాకీ ఇతర హీరోలకీ తేడా అదే!
ఆనంద్ (శర్వానంద్) సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. క్లీన్‌గా ఉండకపోతే అతనికి నచ్చదు. క్యాప్ లేని పెన్ను చూస్తే తనే వెళ్లి క్యాప్ పెడతాడు. పక్కవాళ్ల బైక్‌కు బురద అంటితే క్లీన్ చేస్తానంటాడు. అంతెందుకు గర్ల్‌ఫ్రెండ్‌కు కిస్ చేయాలనుకున్నా బ్రెష్ చేశావా? అని అడిగే టైప్. హ్యాండ్స్‌కు గ్లౌజ్ వేసుకుంటాడు. అతనెందుకిలా ప్రవర్తిస్తున్నాడంటే అతనికి ఓసీడీ. ఆనంద్కి మేఘన (మెహరీన్) అంటే ఇష్టం. మేఘనకు కూడా ఇష్టమే. హ్యాండ్‌వాష్ చేసుకుంటేగానీ ఏదీ ముట్టని మనోడు ఆ అమ్మాయి చేయిపట్టుకుని ఏడడుగులు ఎలా నడిచాడన్నదే మహానుభావుడైన ఆనంద్ కథ. ‘‘హీరో అంటేనే స్పెషల్. నిజ జీవితంలో మనకన్నా వాళ్లు ఎప్పుడూ స్పెషలే. హీరో క్యారెక్టర్‌కు ఓసీడీ (అతిశుభ్రత) అనగానే, ఇది మలయాళ సినిమాకు రీమేక్ అని ఎలా అంటారు? ‘మహానుభావుడు’ చూశాక నిర్ణయిస్తే బెటర్’’ అని దర్శకుడు మారుతి అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా ఆయన దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ నేడు విడుదలవుతోంది. మారుతి మాట్లాడుతూ– ‘‘మనుషుల అలవాట్లు, గుణాల మీద చాలా కథలు రాసుకోవచ్చు. అలాంటి కథల్లో ‘మహానుభావుడు’ ఒకటి. నాలుగేళ్ల క్రితం ఈ కథ అనుకున్నా. అఖిల్‌కి సరిపోతుందని నాగార్జునగారికి చెప్పాను. నాకు చాలా మంది ఓసీడీ లక్షణాలున్నవారు తెలుసు. కొందరు చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. మరికొందరు అతి శుభ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఆయా లక్షణాలను బట్టి వాళ్లను వర్గీకరించవచ్చు. మిగిలిన హీరోలు ఆ పాత్రలను తమ స్టైల్‌కి తగ్గట్టు మార్చుకుని చేస్తారు. శర్వానంద్ మాత్రం పాత్రలోకి పరకాయప్రవేశం చేసి, చేస్తారు. ఇతర హీరోలకీ శర్వాకి తేడా అదే. ‘బాబు బంగారం’ చిత్రంలో వెంకీ పాత్రను అనుకున్న రీతిలో స్క్రీన్ మీదకు తీసుకురాలేకపోయాను. మిగిలిన విషయాల్లో అందరూ హ్యాపీ’’ అన్నారు. -
నా టైమ్ స్టార్టయ్యింది
‘‘ఏడాదిన్నరగా నా సినిమా రిలీజ్ కాలేదు. అనుకోకుండా స్మాల్ బ్రేక్ వచ్చింది. కానీ, నేను బిజీగానే ఉన్నాను. ఇప్పుడు నా టైమ్ స్టార్టయ్యింది. నేను నటించిన సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానన్న నమ్మకం ఉంది’’ అన్నారు కథానాయిక మెహరీన్. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘మహానుభావుడు’. ఎస్కేఎన్ సహ నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక మోహరీన్ చెప్పిన విశేషాలు... ⇒ వెరీ స్వీట్ మ్యూజికల్ లవ్‌స్టోరీ ఇది. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. విలేజ్ నుంచి వచ్చి ఐటీ కంపెనీలో వర్క్ చేసే మేఘన అనే క్యారెక్టర్లో నటించాను. ఫస్ట్‌హాఫ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో, సెకండాఫ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో చేసిన మహాలక్ష్మీ క్యారెక్టర్‌కి మేఘన క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ⇒ యూవీ క్రియేషన్స్ వంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో మారుతి గారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మారుతిగారు ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తారు. ⇒ ఈ సినిమాలో నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. ప్రజెంట్ తెలుగు మాట్లాడలేకపోయినా బాగా అర్థం చేసుకోగలను. శర్వా, మారుతిగారు నాకు లాంగ్వేజ్ పరంగా బాగా హెల్ప్ చేశారు. సినిమా యూనిట్ ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. ⇒ ఈ మధ్య నేనో సినిమా ఒప్పుకుని, తప్పుకున్నానని కొంతమంది అంటున్నారు. నిజానికి నేను ఏ ప్రాజెక్ట్ నుంచీ తప్పుకోలేదు. అవి కుదర్లేదంతే. కానీ, ఇప్పుడు ‘రాజా ది గ్రేట్’, ‘జవాన్’, ‘కేరాఫ్ సూర్య’ వంటి గుడ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నానని గర్వంగా చెప్పగలను. ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కాబోతున్నాయి. రెండు వారాలకోసారి మీరు హీరోయిన్ మెహరీన్‌ని స్రీన్‌పై చూస్తారు. కానీ, క్యారెక్టర్ పరంగా కొత్త మెహరీన్‌ను చూస్తారని కచ్చితంగా చెప్పగలను. ⇒ ‘మహానుభావుడు’ ఫస్ట్ డే షూట్లో శర్వాను కలిశాను. శర్వాది ఫ్రెండ్లీ నేచర్. చాలా నైస్ అండ్ స్వీట్ పర్సన్. హంబుల్‌గా ఉంటాడు. సెట్లో మేం ఈజీగా స్నేహితులమైపోయాం. ⇒ రవితేజగారు చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. రవితేజగారి దగ్గర రీ–స్టార్ట్ బటన్ ఉంది. ప్రతి సినిమాకు కొత్త నటుడిలా రీఛార్జ్ అవుతారు. ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన కో–స్టార్స్ అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. ⇒ తెలుగు చిత్రపరిశ్రమ నాకు మదర్ లాంటిది. సినిమా ఫేట్‌ను మనం నిర్ణయించలేం. క్యారెక్టర్ పరంగా ది బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వొచ్చు. ప్రతి సినిమాను నా ఫస్ట్ ఫిల్మ్‌లా ఫీలయ్యి చేస్తాను. బాలీవుడ్లో కొత్త అవకాశాలు వస్తే తప్పకుండా చెప్తాను. -
శర్వా మా ఇంటి హీరో – ప్రభాస్
‘శర్వా (శర్వానంద్) మా ఇంటి హీరో. తన యాటిట్యూడ్ సూపర్‌గా ఉంటుంది. భవిష్యత్‌లో శర్వా సూపర్‌స్టార్ అవుతాడు’’ అన్నారు ప్రభాస్. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘మహానుభావుడు’. ఎస్కెఎన్ సహనిర్మాత. మెహరీన్ కథానాయిక. తమన్ స్వరకర్త. ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘రన్ రాజా రన్’కి హీరోగా ఎవరు బాగుంటారనుకుంటున్నప్పుడు ‘శర్వా యాటిట్యూడ్ సూపర్‌గా ఉంటుంది. తనని తీసుకుందాం’ అని వంశీ అన్నాడు. శర్వా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. అదే శర్వాతో అంటే, ‘ట్రై చేస్తా. చూడండి. నచ్చకపోతే చెప్పండి’ అన్నాడు. ఆ యాటిట్యూడ్ మాకు నచ్చింది. శర్వాకు మేమందరం ఫ్యాన్స్ అయిపోయాం. ఆల్రేడీ హీరోగా చేసి, ‘నచ్చితే చూడండి’ అన్నాడు. ఆ రోజు నుంచి నాకు శర్వా బ్రదర్ అయిపోయాడు. మారుతి నిజంగా డాక్టర్. ఒక మనిషిని నవ్వించడం అంత ఈజీ కాదు. ‘ప్రేమక«థా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలకన్నా ‘మహానుభావుడు’ ఇంకా పెద్ద రేంజ్ హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను మహానుభావుడిని అయితే రియల్ లైఫ్‌లో మహానుభావుడు ప్రభాస్ అన్న. తను ఇక్కడికి వచ్చాడని ఇలా అనడంలేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ప్రభాస్ అన్నకు ప్రేమ ఇవ్వడం తప్ప ఇంకేమీ తెలీదు. నా సినిమా ఎప్పుడు రిలీజైనా నాకన్నా ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్నే. నేను ‘రన్ రాజా రన్’ చేసినప్పుడు ‘హిట్ కొట్టాంరా.. ఎంజాయ్ చెయ్’ అన్నాడు. పక్క వ్యక్తి పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో ప్రభాస్ ఫస్ట్ ఉంటాడు. మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు తనకు థ్యాంక్స్. మంచి సినిమా ఇచ్చినందుకు మారుతీగారికి థ్యాంక్స్. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రభాస్ వచ్చి ఈ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాకు శర్వానంద్ ప్రాణం పోశారు. శర్వా విశ్వరూపాన్ని థియేటర్లలో చూస్తారు. కొత్త శర్వాన్ని చూడబోతున్నారు. ‘భలే భలే మగాడివోయ్’లో నానీ యాక్షన్‌కి ఎంత ఎగై్జట్ అయ్యానో అంతకు డబుల్ ఎగై్జట్‌మెంట్ శర్వా నాకు ఇచ్చారు. నేను రాసుకున్న కథకు అందరూ ప్రాణం పోశారు. ఇలాంటి కాన్సెప్ట్స్ అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎమోషనల్ మూవీ. మంచి సినిమా తీయాడానికి కారణమైన యూవీ క్రియేషన్స్ వారికి రుణపడి ఉంటాను. ప్రభాస్‌గారు వచ్చినందుకు థ్యాంక్స్. ఆయనతో ఎప్పటికైనా సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘నేను ప్రభాస్ ఫ్యాన్‌ని. ఆయన లాంచ్ చేసిన నా లాస్ట్ ఆడియో ‘బృందావనం’. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఎంకరేజ్ చేస్తున్నారు. మారుతి వన్నాఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్. నా దగ్గర్నుంచి బాగా వర్క్స్ తీసుకున్నాడు. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
తేజస్వికి తల్లిగా...
సవాల్‌లా అనిపించే పాత్రలు స్వీకరించడం నిత్యామీనన్‌కి చాలా ఇష్టం. అందుకే, తల్లి పాత్ర పోషించడానికి పచ్చజెండా ఊపేశారు. ఏ మూడు, నాలుగేళ్ల బిడ్డకో తల్లయితే ఫర్వాలేదు. టీనేజ్ దాటిన అమ్మాయికి తల్లిగా చేస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కె.యస్. రామరావు నిర్మిస్తున్నారు. ఇందులో తేజస్వికి తల్లిగా నటిస్తున్నారు నిత్యా. వయసుకి మించిన ఈ పాత్రలో నిత్యా ఒదిగిపోతారని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి... సినిమా మొత్తం ఇదే పాత్రలో కనిపిస్తారా? లేక ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్‌గా కనిపిస్తారా? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించారు. ఈ చిత్రానికి ‘ప్రేమ వయసెప్పుడూ పదహారే’ని అనే టైటిల్‌ని ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. -
నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్
‘‘నా పదేళ్ల కల ఈ విజయం. నా కెరీర్‌కి ఇంతటి విజయాన్నిచ్చిన యు.వి. క్రియేషన్స్ సంస్థకు కృతజ్ఞతలు. ఈ సినిమా చూసిన వారందరూ నేను కామెడీ బాగా చేశానంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుజిత్‌కే దక్కుతుంది’’ అని శర్వానంద్ అన్నారు. ఆయన కథానాయకునిగా సుజిత్ దర్శకత్వంలో వంశీ-ప్రమోద్ కలిసి నిర్మించిన ‘రన్ రాజా రన్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకునిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు సుజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సమష్టి విజయమనీ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. దిల్ రాజు, అడివి శేషు కూడా మాట్లాడారు. -
సినిమా రివ్యూ: కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!!
కొత్త దర్శకులు, కొత్త తరం కథకులు వస్తున్నప్పుడు వెండితెర కొత్తగా వెలుగులీనే అవకాశం ఉంటుందని చిన్న ఆశ ఉంటుంది. వాళ్ళ సినిమా వస్తోందంటే, కొత్తదనం కోరుకొనేవారికి ఎదురుచూపులుంటాయి. లఘు చిత్రాల ద్వారా మొదలుపెట్టి ఫీచర్ ఫిల్మ్‌కు ఎదిగిన దర్శకుడు సుజీత్ ‘రన్ రాజా రన్’ విషయంలోనూ అదే జరిగింది. కథ ఏమిటంటే... రాజా (శర్వానంద్) ఓ కూరగాయల వ్యాపారి కొడుకు. నగర పోలీస్ కమిషనర్ దిలీప్ (సంపత్‌రాజ్) కూతురు ప్రియ (శీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. మరోపక్క నగరంలో వరుసగా జరుగుతున్న ప్రముఖుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఆ కిడ్నాప్‌ల గుట్టు ఛేదించడానికి కమిషనర్ కుస్తీ పడుతుంటాడు. అతని కూతుర్ని ప్రేమించానంటూ వెళ్ళిన హీరోకు కమిషనర్ ఓ కిడ్నాప్ డ్రామా పని అప్పజెపుతాడు. హీరోయిన్నే కిడ్నాప్ చేస్తాడు హీరో. ఆ తరువాత కథేమిటన్నది రకరకాల ట్విస్టుల మధ్య సాగే సినిమా. ఎక్కువగా వినోదాత్మక ఫక్కీలో నడపాలని దర్శకుడు బలవంతాన ప్రయత్నించిన ఈ సినిమాలో హీరో శర్వానంద్ చూడడానికి బాగున్నాడు. అయితే, కొన్నిచోట్ల హెయిర్‌స్టైల్‌లో, హావభావాల్లో తమిళ సూర్యను అనుసరించినట్లు అర్థమైపోతుంటుంది. ఇక, హీరోయిన్ శీరత్ కపూర్ కొత్తమ్మాయి. అభినయంతో పాటు అందమూ తక్కువే. అభినయం తక్కువైనా కథ రీత్యా అడివి శేషుది మరో ముఖ్యపాత్ర. కమిషనర్‌గా సంపత్‌రాజ్, హీరో తండ్రిగా వి. జయప్రకాశ్ అలవాటైన తమిళ ప్రాంతీయ సినీశైలిలో ఫరవాలేదనిపిస్తారు. ఎలా ఉందంటే... తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలనో ఏమో అక్కడి నటులనూ తీసుకున్నారు. వీలున్నప్పుడల్లా హాలులో రజనీకాంత్ నామస్మరణ వినిపిస్తుంది. తమిళ హీరో కార్తి తదితరుల పోస్టర్లూ కనిపిస్తాయి. తమిళ ఫక్కీ సినీ కథన ధోరణి సరేసరి. మది ఛాయాగ్రహణం, గిబ్రాన్ సంగీతం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బాగుంది. ఇప్పటికే పాపులరైన ‘అనగనగనగా అమ్మాయుందిరా’ పాట (రచన శ్రీమణి) చిత్రీకరణ, విలక్షణమైన గొంతు (గోల్డ్ దేవరాజ్)తో పాడించిన తీరు ఆకట్టుకుంటాయి. రామజోగయ్య రాసిన మెలోడీ ‘వద్దంటూనే’ గాయని చిన్మయి గొంతులో వినడానికీ, తెరపై చూడడానికీ బాగుంది. పాటల్లో గొంతులు కొత్తగా అనిపిస్తాయి. అక్కడక్కడ డైలాగ్స నవ్విస్తాయి. కాస్త...కాలక్షేపం! చాలా... కాలహరణం! ప్రథమార్ధం కాలహరణంగా నడిచే సినిమా, సెకండాఫ్‌లో ఫక్తు కాలక్షేపంగా ఫరవాలేదనిపిస్తుంది. కానీ, చివరకొచ్చేసరికి ఆ భావన కూడా బలంగా నిలబడదు. దర్శకుడి అనుభవ రాహిత్యం వల్లనో, లేక అది వినోదమని భ్రమపడడం వల్లనో ఏమో, కథకు అక్కరలేని సన్నివేశాలు కూడా సినిమాలోకి తరచూ చొచ్చుకు వచ్చేస్తుంటాయి. వాటిని స్క్రిప్టు దశలో కాకపోయినా, ఎడిటింగ్ టేబుల్ మీదైనా కత్తిరించుకోవాల్సింది. పోలీసు కమిషనర్, మంత్రి, ఎమ్మెల్యే - ఇలా అందరూ బఫూన్ల లాగా వ్యవహరిస్తారు. ప్రత్యర్థిని అడ్డుకొనేందుకు ఈ వీరశూరసేనులు చేసిందేమీ కనిపించదు. దాంతో, కథలో పాత్రల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణ ఏదీ లేకుండా పోయింది. చిత్ర నిర్మాణ విలువలు గణనీయంగానే ఉన్న సినిమా ఇది. రొమాంటిక్ కథగా మొదలై సమాంతరంగా సస్పెన్స్‌ను కొనసాగించి, చివరకొచ్చేసరికి రొటీన్ పగ- ప్రతీకారాల వ్యవహారంగా తేల్చేయడంతో ఈ కథ ఓ పట్టాన సంతృప్తినివ్వదు. కూరగాయలమ్మే వాడి కొడుకు ఇంత ఆధునికంగా ఉన్నాడేమిటి, ఫలానా పాత్ర ఫలానాలా ప్రవర్తిస్తోందేమిటి లాంటి సందేహాలొస్తాయి. చివరలో వాటన్నిటికీ లాజిక్‌లు చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. కొత్తదనం కోసం మరీ విపరీతమైన ట్విస్టులు పెట్టేస్తే ఇబ్బందేనని కథ, కథనం తేల్చేస్తాయి. వెరసి, బాగోగులు రెండూ ఉన్న ఈ చిత్రం జనాన్ని పరిగెత్తించేది ఎటువైపో? తారాగణం: శర్వానంద్, శీరత్ కపూర్, ఎడిటింగ్: మధు, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్ బలాలు: కథను వినూత్నంగా చెప్పాలన్న ప్రయత్నం శర్వానంద్ నటన కొత్తగా ధ్వనించే గిబ్రాన్ సంగీతం, గాయకుల గొంతు మది కెమేరా పనితనం, పాటల చిత్రీకరణ బలహీనతలు: సాగదీత కథనశైలి గందరగోళపెట్టే అతి ట్విస్టులు, ఆఖరికి రోలింగ్ టైటిల్స్‌లోనూ సా...గిన కథ ఆఖరుకు పగ, ప్రతీకారాల కథగా మిగలడం పాత్రలు ఎప్పుడుపడితే అప్పుడొచ్చి, వెళ్ళిపోతుండే సీన్లు మొద్దుబారిన ఎడిటింగ్ కత్తెర హీరోయిన్ - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ: రన్ రాజా రన్
నటీనటులు: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, జయప్రకాశ్, అడివి శేషు, విద్యుల్లేఖ రామన్, కోట శ్రీనివాసరావు తదితరులు. సంగీతం: జిబ్రాన్ కెమెరా: మధి నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి దర్శకత్వం: సుజిత్ ప్రస్థానం, జర్ని లాంటి చిత్రాలతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా దర్శకుడు సుజిత్ రూపొందించిన చిత్రం 'రన్ రాజా రన్'. కిడ్నాప్ డ్రామాకు ప్రేమ కథను జోడించి ఓ యూత్ ఫుల్ చిత్రంగా ప్రేక్షకులకు అందించిన 'రన్ రాజా రన్' ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. హైదరాబాద్ నగరంలో ప్రముఖులు మాస్క్ ల పెట్టుకుని ఓ ముఠా వరుస కిడ్నాప్ లు సంచలనం సృష్టిస్తుంటాయి. కిడ్నాప్ ముఠాను పట్టుకునేందుకు దిలీప్ (సంపత్ రాజ్) అనే పోలీస్ కమిషనర్ కు కేసును అప్పగిస్తారు. కథ అలా సాగతుండగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. చాలా మంది అమ్మాయిలతో లవ్ బ్రేక్ ఆప్ లతో విసిగిపోయిన రాజా హరిశ్చందప్రసాద్ (శర్వానంద్)తో పోలీస్ కమిషనర్ కూతురు ప్రియ (సీరత్ కపూర్) ప్రేమలో పడుతుంది. రాజా, ప్రియల ప్రేమ వ్యవహారం తనకు నచ్చకపోయినా పోలీస్ కమిషనర్ ఒప్పకున్నట్టు నటిస్తాడు. ప్రియ నుంచి దూరం చేయడానికి రాజాను కిడ్నాప్ డ్రామా ఆడాలని ఓ కండిషన్ పెడుతాడు. ప్రియ ప్రేమ కోసం రాజా ఒప్పుకున్నట్టు నటించినా అసలు కారణం మరోకటి అనేది ఈ చిత్రంలో ఓట్విస్ట్. కిడ్నాప్ డ్రామా ఆడేందుకు రాజా ఎందుకు ఒప్పుకున్నాడు? రాజా కిడ్నాప్ వ్యవహారం సఫలమైందా? పోలీస్ కమిషనర్ దిలీప్ కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారా? కిడ్నాప్ లకు పాల్పడుతున్నది ఎవరు? అనే పలు సందేహాలను ప్రేక్షకులు కల్పించి దర్శకుడు చెప్పిన సమాధానాలే 'రన్ రాజా రన్'. రాజా పాత్రలో శర్వానంద్ మంచి జోష్ ఉన్న యువకుడిగా కనిపించాడు. స్టైల్స్ తో శర్వానంద్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. స్టైల్స్ తోపాటు యాక్టింగ్ పరంగా కూడా మంచి ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోల పోటీలో శర్వానంద్ కు ఈ చిత్రం మరింత పేరు సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. ప్రియగా కనిపించిన సీరత్ కపూర్ అందంతోనూ, అభినయంతోనూ మెప్పించింది. సీరత్ కపూర్ అందచందాలు కనువిందు చేశాయనే చెప్పవచ్చు. గ్లామర్ తారగా సీరత్ కపూర్ రాణించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సీరత్ గ్లామర్ అదనపు ఆకర్షణ. పోలీస్ కమిషనర్ గా సంపత్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనించాడు. శర్వానంద్ తండ్రిగా జయప్రకాశ్ ది ఓ ముఖ్యమైన పాత్రే. సంపత్, జయప్రకాశ్ లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. కోట శ్రీనివాసరావు పాత్ర రొటీన్ గానే ఉంది. టెక్నికల్: మిర్చి చిత్రానికి ఫొటోగ్రఫినందించిన మధి మరోసారి తన సత్తాను చూపించాడు. ఈ చిత్రంలో మధి అందించిన ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శర్వానంద్, సీరత్ కపూర్ లను గ్లామర్ గా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ లోను కలర్స్ వినియోగించిన తీరు బాగుంది. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లను తెరకెక్కించిన విధానం 'రన్ రాజా రన్'కు హైలెట్ నిలుస్తాయని చెప్పవచ్చు. రాజ్ సుందరం అందించిన కోరియోగ్రఫీ పాటలకు మరింత ట్రేండిగా మార్చాయి. కిడ్నాప్ కథ బ్యాక్ డ్రాప్ గా 'రన్ రాజా రన్'ను ఓ అందమైన ప్రేమ కథగా మలచడంలో దర్శకుడు సుజీత్ కొంతమేరకు సఫలమయ్యాడనే చెప్పవచ్చు. అయితే కథనంలో వేగం మందగించడం కారణంగా మధ్య, మధ్యలో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసమే కథను సా...గదీశాడా అనే కోణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తెలుగు, తమిళ, హిందీ హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మాస్క్ లతో వెరైటీగా కిడ్నాప్ ముఠాను దర్శకుడు వెరైటీగా డిజైన్ చేసిన తీరు ప్రశంసనీయం. చిత్ర ఫస్టాఫ్, సెకండాఫ్ లో నిడివి ఎక్కువగా ఉండటం వలన కథలో వేగానికి కళ్లెం వేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. చిత్ర నిడివిని తగ్గించడానికి ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించింది. ప్రమోద్, కృష్ణారెడ్డిల నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి. -
ఆ గుళ్లోనే నా జీవితం మలుపు తిరిగింది
‘‘కమల్‌హాసన్‌తో పరిచయం నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది’’ అంటున్నారు సంగీత దర్శకుడు గిబ్రన్. ప్రస్తుతం ఆయన కమల్ ‘విశ్వరూపం-2’కు సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ హీరోగా ఆయన సంగీతం అందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారాయన. ‘విశ్వరూపం-2’ భారీ సీజీ వర్క్ ఉన్న సినిమా అనీ, అంతటి గొప్ప సినిమాకు సంగీతం అందించడం గర్వంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు. కమల్ ‘ఉత్తమ విలన్’ తర్వాతే ‘విశ్వరూపం-2’ విడుదల అవుతుందని గిబ్రన్ చెప్పారు. తాను స్వరాలందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం చాలా ఆసక్తికరంగా సాగే సినిమా అనీ, సంగీత దర్శకునిగా ఓ కొత్త అనుభూతిని ఈ సినిమా తనకు అందించిందని గిబ్రన్ అన్నారు. ‘‘సంగీత దర్శకుడు కాక ముందు నేను పియానో టీచర్ని. ఎంతో మంది పిల్లలకు పియోనో నేర్పిన అనుభవం నాది. సింగపూర్‌లో చదువుకున్నాను. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని చవిచూశాను. పులిహోర పోట్లాల కోసం గుడికెళ్లిన రోజులున్నాయి. ఆ గుళ్లోనే నా జీవితం మలుపుతిరిగింది. నా భార్య పరిచయమైంది అక్కడే. మా కలయిక స్నేహం నుంచి ప్రేమగా మారింది. తను విజయవాడ అమ్మాయి. సైంటిస్ట్. తన పరిచయం నాలో ఊహించని మార్పు తెచ్చింది. ఆమె తర్వాత నా జీవితంపై ప్రభావితం చేసిన మరో వ్యక్తి కమల్‌హాసన్‌గారు. ఆయన్ను కలవక ముందు కలిశాక నా జీవితాన్ని ఊహించుకుంటే... ఉద్వేగం కలుగుతుంది’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు గిబ్రన్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ అరడజను సినిమాల దాకా చేస్తున్నానని, సంగీత దర్శకునిగా కెరీర్ ఆశాజనకంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు. -
నేను చెప్పేదొకటే
నిత్యామీనన్‌కు పొగరెక్కువ. ఆమె దర్శక నిర్మాతలకు నిబంధనలు విధిస్తారు. నిర్మాతలను గౌరవించరు. అయితే మంచినటి. ఇది దక్షిణాదిలో నటి నిత్యామీనన్‌కు ఉన్న పేరు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే ఈ బ్యూటీ సొంతగడ్డపై అవకాశాలను కోల్పోయింది. అయితే టాలీవుడ్లో ఈమెకు సక్సెస్ఫుల్ నాయకి అనే పేరుంది. కోలీవుడ్‌లో ఇంతకుముందు వెప్పం, 180 చిత్రాల్లో నటించినా సక్సెస్ ఖాతాను ఓపెన్ చేయలేదు. తాజాగా నటిస్తున్న రెండు చిత్రాలపై ఈ బ్యూటీ కెరీర్ ఆధారపడి ఉంది. వాటిలో ఒకటి చేరన్ దర్శకత్వంలో శర్వానంద్‌కు జంటగా నటించిన జెకె ఎన్నుం నన్భనిన్ వాళ్కై, మరొకటి నటి శ్రీప్రియ రూపొందించిన మాలిని 22 పాళయం కోటై. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో నిత్యామీనన్ గ్లామర్‌కు గేట్లు తెరిచినట్లు ప్రచారం మొదలైంది. ఈ తరహా ప్రచారాన్ని నిత్యామీనన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కథానాయికలు అందాలారబోయాలి, డ్యూయెట్లు పాడాలి అని మాత్రమే ఊహించుకోవద్దని చురకలంటించారు. వాటిని దాటి తన లాంటి వారికి ప్రతిభ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే నటిస్తానన్నారు. పాటలకు పరిమితం అయ్యే గ్లామర్ పాత్రలో నటించేది లేదని ఖరాఖండిగా చెప్పారు. తన వద్దకు వచ్చే దర్శక, నిర్మాతలకి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతానన్నారు. ఎవరికైనా తాను చెప్పిది ఒకటేనని కథ, తన పాత్ర నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తానని నిత్యామీనన్ పేర్కొన్నారు. -
‘సత్య’కు పూర్తి భిన్నమిది - వర్మ
అండర్ వరల్డ్ నేపథ్యంలో పలు చిత్రాలు రూపొందించిన రామ్‌గోపాల్‌వర్మ ఇకనుంచీ ఈ నేపథ్యంలో సినిమాలు తియ్యనంటున్నారు. సో.. అండర్ వరల్డ్ నేపథ్యంలో ఆయన చేసిన చివరి చిత్రం ‘సత్య 2’ అని ఫిక్స్ అవ్వొచ్చు. ఒకవేళ వర్మ మనసు మార్చుకుంటే.. ఈ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రావచ్చేమో. ఆ విషయాలన్ని అలా ఉంచితే శర్వానంద్ హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సుమంత్‌కుమార్ నిర్మించిన ‘సత్య 2’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వర్మ మాట్లాడుతూ -‘‘ఇదో విభిన్న తరహా క్రైమ్ కథా చిత్రం. ‘సత్య’కీ ఈ సినిమాకీ చాలా వ్యత్యాసం ఉంటుంది. శర్వానంద్ చాలా బాగా యాక్ట్ చేశాడు’’ అని చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ సినిమాలు చేస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే. ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేసే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది. శర్వానంద్ విభిన్న తరహా సినిమాలు చేస్తుంటాడు. మంచి కథ కుదిరితే తనతో ఓ సినిమా తీయాలనుకుంటున్నా’’ అన్నారు. ఒక గొప్ప సినిమా చేశానని గర్వంగా ఉందని శర్వానంద్ చెప్పారు. ‘దిల్’ రాజు డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉందని సుమంత్‌కుమార్ అన్నారు. -
ఈ మాయ ఏమిటో!
‘ఏమిటో ఈ మాయ...’ ఈ మధురాక్షరాలు చెవిన పడగానే... పండు వెన్నెల్లో విహరిస్తున్న ఫీలింగ్. పింగళి వారి పెన్నా మజాకా. ఆ కలం నుంచి జాలువారిన ఎన్నో పదాలు సినిమా టైటిల్స్ అయిపోయాయి. అవ్వడమేకాదు... విజయాలను కూడా అందుకున్నాయి. ఆ సెంటిమెంట్‌నే నమ్ముకొని మరో సినిమా వచ్చేస్తోంది. అదే... ‘ఏమిటో ఈ మాయ’. శర్వానంద్, నిత్యామీనన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి చేరన్ దర్శకుడు. తమిళంలో ‘ఆటోగ్రాఫ్’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన చేరన్ ఈ సినిమాను యువతరం మెచ్చేలా తెరకెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మక స్రవంతి మూవీస్ పతాకంపై పి.రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలలో పాటల్ని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు రవికిషోర్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవి ప్రకాష్‌కుమార్, పాటలు: అనంత శ్రీరామ్, సమర్పణ: కృష్ణచైతన్య. -
నేను ఏ క్రిమినల్‌తో ఒక్కరోజూ డిన్నర్ చేయలేదు - రామ్‌గోపాల్‌వర్మ
‘‘ఇందులో నేను ఓ ప్రేమ గీతం పాడాను. దానికి కారణం ఒక్కటే. నాకు ప్రేమగీతం పాడాలని ఓ చిన్న కోరిక ఉంది. అది తీర్చుకోవడానికి పాడాను’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ఆయన దర్శకత్వంలో సుమంత్‌కుమార్‌రెడ్డి మెట్టు నిర్మించిన చిత్రం ‘సత్య-2’. శర్వానంద్ ఇందులో ప్రధాన పాత్రధారి. నితిన్ రైక్వార్, సంజయ్, దర్శన్, శ్రీ ఇషాక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియోసీడీని బోయపాటి శ్రీను, రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని పూరి జగన్నాథ్‌కి అందించారు. రామ్‌గోపాల్‌వర్మ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘‘సత్య’కి ‘సత్య-2’కి చాలా తేడా ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటారు. ఆ ఆలోచనకు సరైన రూపమే ‘సత్య-2’. శర్వానంద్ నేనేదో అవకాశమిచ్చినట్లు మాట్లాడాడు. నేను అవకాశాలివ్వను... తీసుకుంటాను. క్రిమినల్స్‌తో పరిచయం ఉండటం వల్లే ఇలాంటి సినిమాలు ఇంత రియలిస్టిక్‌గా తీయగలుగున్నానని చాలా మంది అభిప్రాయం. నిజానికి నేను ఏ క్రిమినల్‌తో ఒక్క రోజు కూడా డిన్నర్ చేయలేదు. నిజజీవితంలో జరిగే అనుభవాలే నా సినిమాల్లో కనిపిస్తాయి’’అని చెప్పారు. ఇంకా పూరిజగన్నాథ్, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, ఆర్పీ పట్నాయక్, కోన వెంకట్, సందీప్ కిషన్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఐజీ సీతారామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పడవలో పాటల వేడుక!
అది చెన్నయ్‌లో గల ఓడ రేవు. అక్కడున్న పడవల్లో ఓ పడవ కొత్త శోభను సంతరించుకుంది. దానికి కారణం ‘నాన్దాన్డా’ సినిమా. శర్వానంద్, అనైక జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దేవి శ్రీదేవి సతీష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఆడియో వేడుకను వినూత్నంగా జరపాలనుకున్న నిర్మాత ఓ పడవను బుక్ చేశారు. అందులో జరిగిన ఈ వేడుకలో భారతీరాజా, థాను, ఆర్బీ చౌదరి, ఆర్కే సెల్వమణి, విక్రమన్, అతుల్ మిశ్రా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వందేళ్ల భారత సినీ చరిత్రలో పడవలో ఆడియో వేడుక జరగడం నాకు తెలిసి ఇదే మొదటిసారి అని, తమిళంలో రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం అని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. ఇదొక క్రైమ్ స్టోరీ అని, ఈ చిత్రంలో కొత్త తరహా క్రిమినల్ని చూపించానని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. ఈ వేడుకలో శర్వానంద్, అనైకలతో పాటు పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రూపొందుతోంది.