పడవలో పాటల వేడుక!
అది చెన్నయ్‌లో గల ఓడ రేవు. అక్కడున్న పడవల్లో ఓ పడవ కొత్త శోభను సంతరించుకుంది. దానికి కారణం ‘నాన్‌దాన్‌డా’ సినిమా. శర్వానంద్, అనైక జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దేవి శ్రీదేవి సతీష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఆడియో వేడుకను వినూత్నంగా జరపాలనుకున్న నిర్మాత ఓ పడవను బుక్ చేశారు.
అందులో జరిగిన ఈ వేడుకలో భారతీరాజా, థాను, ఆర్బీ చౌదరి, ఆర్కే సెల్వమణి, విక్రమన్, అతుల్ మిశ్రా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వందేళ్ల భారత సినీ చరిత్రలో పడవలో ఆడియో వేడుక జరగడం నాకు తెలిసి ఇదే మొదటిసారి అని, తమిళంలో రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం అని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు.
ఇదొక క్రైమ్ స్టోరీ అని, ఈ చిత్రంలో కొత్త తరహా క్రిమినల్‌ని చూపించానని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. ఈ వేడుకలో శర్వానంద్, అనైకలతో పాటు పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రూపొందుతోంది.