Anika
-
ఓనం స్పెషల్.. చీరకట్టులో మలయాళ బ్యూటీస్!
కేరళలో 'ఓనం' పండగ సెలబ్రేషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాలామంది మలయాళ హీరోయిన్లు.. చీరకట్టులో కనువిందు చేశారు. కల్యాణి ప్రియదర్శన్, హనీరోజ్, మమతా మోహన్ దాస్, అనికా సురేంద్రన్, గౌరి కిషన్, మిర్నా మేనన్ ఇలా అందరూ సోషల్ మీడియాలో పద్ధతిగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఆ ఫొటోలని మీరు ఓసారి చూసేయండి. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) Wishing everyone a vibrant, joyful, and absolutely magical #Onam ❤️ May your homes be filled with love, laughter, and the mouthwatering aroma of a grand Sadya!#HappyOnam #OnamAshamsakal pic.twitter.com/TGlrBqPdso — Parvati (@paro_nair) August 29, 2023 Happy Onam 🤗♥️🤓 pic.twitter.com/wdHoH4ZX7q — Varsha Bollamma (@VarshaBollamma) August 29, 2023 View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
హద్దులు దాటేస్తున్న యువ హీరోయిన్.. అలాంటి సీన్స్‌లోనూ!
ప్రస్తుతం దేనికైనా పబ్లిసిటీ చాలా ముఖ్యం. సినిమా రంగంలోని వారికి ఇది బాగా తెలుసు. అందుకే స్టార్ హీరో హీరోయిన్ల నుంచి అప్‌కమింగ్ యాక్టర్స్ వరకు దీనికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. హీరోయిన్లు అయితే తమ గ్లామరస్ ఫొటోలని ట్విట్టర్, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యువ హీరోయిన్ అనిక సురేంద్రన్ ఈ విషయంలో హద్దులు దాటేస్తుందనే చెప్పాలి. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) 2010లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిక.. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో అజిత్ 'విశ్వాసం' సినిమాలో బాలనటిగా తెగ ఫేమస్ అయిపోయింది. అలాంటిది ఈ మధ్యే హీరోయిన్గా మారింది. తెలుగులో 'బుట్టబొమ్మ' చిత్రంలో కథానాయకిగా చేసింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అనికకు గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే పబ్లిసిటీపై దృష్టి పెట్టిన ఈ చిన్నది.. సోషల్ మీడియాని తెగ వాడేస్తోంది. శృతి మించిన అందాలని చూపిస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. అయినా ఫలితం దక్కట్లేదు. తమిళంలో హీరోయిన్గా ఇంకా బోణీ కొట్టలేదు. మలయాళంలో 'ఓ మై డార్లింగ్' చిత్రంలో నటించింది. ఇందులో లిప్‌లాక్ సీన్లో నటించి షాకిచ్చింది. కథ డిమాండ్ మేరకే అలా యాక్ట్ చేశానని సమర్థించుకుంటోంది. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) (ఇదీ చదవండి: ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!) -
‘బుట్టబొమ్మ’ వేసుకున్న లంగావోణీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బుట్టబొమ్మ’ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనిఖా సురేంద్రన్.. మలయాళంలో కుట్టి నయన్‌గా చాలా ఫేమస్. ప్రేక్షకులు ఇప్పుడు ఆ పేరును మరచిపోయేలా తనకంటూ ఓ యూనిక్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది. అదే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది.. ఇలా.. స్టయిల్ అనేది ఒక పర్సనల్ చాయిస్. ఎవరి స్టయిల్ వారికి ఉంటుంది. ఎక్కువ స్కిన్ షో చేయకుండా.. కంఫర్ట్ దుస్తులతో కనిపించడం నా స్టయిల్ అని అంటోంది అనికా సురేంద్రన్ ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి.. ఆధునిక మహిళ అభిరుచి, అవసరాలను గమనించి వాటికనుగుణమైన డిజైనర్ వేర్‌ను రూపొందించేందుకు ఏర్పడిన బ్రాండే ‘ఏఆర్ సిగ్నేచర్’. బెంగళూరుకు చెందిన అనూష రెజి ప్రారంభించిన ఈ బ్రాండ్.. స్టయిల్ అండ్ సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం సెలబ్రిటీలకు వారి డిజైన్స్ అందిచడమే కాకుండా, దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు అందుకుంటోంది. ధరలు మోస్తారు రేంజ్లో ఉంటాయి. కేవలం ఆన్లైన్లో ఆర్టర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ అనిఖా సురేంద్రన్ ధరించిన ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి ధర రూ. 1,56,000 జోయ్ అలుక్కాస్.. కేరళలో.. 1956లో అలుక్కా జోసెఫ్ వర్గీస్.. చిన్న దుకాణంతో ఆభరణాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. నేడు అది కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో ఈ సంస్థది 67 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతర ం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రముఖ నగరాలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా పదకొండు దేశాల్లో సుమారు 150 బ్రాంచీలు ఉన్నాయి. ఐతే జోయ్ అలుక్కాస్ బ్రాండ్ ధర మాత్రం ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి..
సాధారణ అమ్మాయిల నుంచి నటీమణుల వరకు ప్రియుడి వేధింపులకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ప్రియుడి చేతిలో మృతి చెందిన శ్రద్ధా వాకర్ నుంచి బాయ్‌ఫ్రెండ్ చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న నటి ఫ్లోరా సైనీ(అలియాస్ ఆశ) ఘటనలే ఇందుకు ఉదహరణ. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆశ ఇటీవల ఓ ఇంటర్య్వూలో బాయ్‌ఫ్రెండ్ వల్ల చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ తాజాగా మరో నటి బాయ్‌ఫ్రెండ్ బాధితురాలుగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన బాయ్‌ఫ్రెండ్ చిత్రహింసలకు గురి చేశాడంటూ ప్రముఖ తమిళ నటి అనిఖా విక్రమన్ సోషల్ మీడియా వేదికగా నోరు విప్పింది. ఈ సందర్భంగా తన రిలేషన్ తాలూకు అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు, నోట్ షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనిఖా శరీరమంత గాయాలతో, ముఖం, కళ్లు కందిపోయి కనిపించింది. ఆ ఫొటోలన్నింటిని ఆమె షేర్ చేస్తూ తన బాయ్‌ఫ్రెండ్ వల్ల ప్రాణహానీ ఉందని, తనని.. తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని తెలిపింది. ‘గతంలో అనూప్ పిల్లై అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అది నాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశాడు. అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ఇంత ఇబ్బంది పెట్టిననా అతడిలో అసలు మార్పే లేదు. ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉన్నాడు’ అని పేర్కొంది. అయితే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనిఖా పేర్కొంది. చదవండి: భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్.. వీడియో, ఫొటోలు వైరల్ అలాగే మరో పోస్ట్‌లో ‘మొదటి సారి కొట్టినపుడు.. నా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగాడు. అందుకే వదిలేశా. రెండోసారి కూడా అదే రిపీట్ అయ్యింది. ఒళ్లంతా కమిలేలా కొట్టాడు. ఇక భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ పోలీసులకు డబ్బులు ఇచ్చి తన వైపు తిప్పుకున్నాడు. మొదట మేమిద్దరం ఫ్రెండ్స్‌గా ఉన్నాము. రిలేషన్షిప్లో ఉన్నపుడు తరచుగా అతడు నా ఫోన్‌ను చెక్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవటానికి వెళ్లాడు. నేను ఆ దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావంటూ ఎద్దేవా చేస్తూ వెకిలిగా నవ్వాడు’ అంటూ నటి ఆవేదన వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Anicka Vijayi Vikramman (@anickavikramman) -
ఓటీటీలోకి ‘రాంగ్ స్వైప్’
డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో 'మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్ పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశ భరిత వినోదాత్మక చిత్రం ‘రాంగ్ స్వైప్’. క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే... ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ నవంబర్ 1న ఓటీటీ ‘ఊర్వశి’లో విడుదల కానుంది. స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్... సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతోపాటు... ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ... ‘లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అన్నీ తానే అయి ముందుండి నడిపించారు. మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన ‘రాంగ్ స్వైప్’ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు’అన్నారు. -
నటికి ప్రేమ లేఖ, చచ్చిపోతానని బెదిరింపులు!
తమ కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నందుకు నటీనటులు గర్వంగా ఫీల్ అవుతారు. కానీ కొన్నిసార్లు వారి మితిమీరిన అభిమానం వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. నటి అనికా సురేంద్రన్‌కు ఎదురైన ఈ సంఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. విశ్వాసం సినిమాలో స్టార్ హీరో అజిత్ కూతురుగా నటించి మెప్పించింది అనికా. ఓ మలయాళ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్గా పరిచయం అవుతోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఓ ప్రశ్నను సంధించాడు. నీ వీరాభిమాని నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసి, పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తే నువ్వేం చేస్తావు? అని ప్రశ్నించాడు. దీనికి అనికా స్పందిస్తూ అది నిజంగానే తన జీవితంలో జరిగిందని చెప్పుకొచ్చింది. ఈమెయిల్ ద్వారా ఓ వ్యక్తి తనకు ప్రేమలేఖ పంపి, బెదిరించాడని తెలిపింది. ఆ సమయంలో తను ఎంతగానో భయాందోళనకు గురయ్యానని పేర్కొంది. కానీ తర్వాత అతడు అలాంటిదేమీ చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నానంది. Aww poor @anikhaoffl_ 🥺♥️ sorry you had to deal with it. Hope you're better 🥺♥️♥️♥️ pic.twitter.com/H8EUijfPkW — Anbu (@Mysteri13472103) May 22, 2021 చదవండి: హీరోయిన్ లవ్ ఎఫైర్.. అడ్డొచ్చిన తమ్ముడిని ముక్కలుగా నరికి.. -
గోల్ఫ్ దుర్గమ్మ
ఒక ఉత్సాహం.. ఒక నిరుత్సాహం. ‘తొలి ఇండియన్’ గా ఉత్సాహం. ఫైనల్స్‌కు చేరనందుకు నిరుత్సాహం. పదహారేళ్ల అణికకు.. ఒకే ఈవెంట్లో రెండు అనుభవాలు. పేరులో దుర్గమ్మ ఉంది. పేరు తెచ్చుకునే ప్రావీణ్యం ఉంది. ముందుముందు ఆట చాలా ఉంది. దిగులు పడకు ఛాంపియన్! పదహారేళ్ల నోయిడా అమ్మాయి అణికా వర్మ కాలిఫోర్నియాలోని ‘గ్రానైట్ బే హై స్కూల్’లో చదువుతోంది. స్కూల్ ప్రాంగణంలో ఉన్నంత వరకు ఆమె పేరు గురించి ఎవరికీ రాని ఒక ప్రశ్న, స్కూల్ అయ్యాక ఆమె ఒకసారి గోల్ఫ్ కోర్సులోకి అడుగు పెట్టాక తప్పనిసరిగా వచ్చేస్తుంది! ‘‘వావ్.. అనికా! అనీకా సోరెన్స్టామ్ పేరు పెట్టారా నీకు మీ అమ్మానాన్న’’ అని గోల్ఫ్ కోర్సులో ఒక్కరైనా అడగకుండా ఉండరు. ఆమె కోచ్ నోవా మాంట్గొమరీ అయితే మొదటే ఆ ప్రశ్న అడిగారు. అందుకు సమంజమైన కారణమే ఉంది. 48 ఏళ్ల అనీకా సోరెన్స్టామ్ జగత్ప్రసిద్ధ స్వీడిష్ గోల్ఫ్ క్రీడాకారిణి. ఆమె పేరులోని ‘అనీకా’ నే, అంతటి ప్లేయర్ కావాలని అణికకు కూడా పెట్టారని ఎవరైనా అనుకోవడం సహజమే. ఆ ప్రశ్నకు నవ్వుతుంది అణిక. ‘‘అలా అనేం కాదు. అణిక అంటే దుర్గామాత. స్త్రీ శక్తి. ఆ పేరునే నాకు పెట్టారు’’ అని చెబుతుంది. ఇప్పుడీ ‘దుర్గమ్మ’ గోల్ఫ్‌లో తన శక్తిని చాటి 125 ఏళ్ల చరిత్ర గల ‘యు.ఎస్. ఉమెన్స్ అమెచ్యూర్ చాంపియన్‌షిప్’ కు ఆడిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. బుధవారం మేరిలాండ్, రాక్విల్లోని ‘ఉడ్మౌంట్ కంట్రీ క్లబ్’ తరఫున ఆడిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఒక్క షాట్ తేడాతో ఓడిపోయినప్పటికీ, ‘ఆడటం’ అన్నది అణికను విజేతగా నిలబెట్టింది. అసలు అణిక కోసమే ఈ ‘తొలి’ అనే గుర్తింపు ఎదురు చూస్తున్నట్లుగా ఉందనుకోవాలి! 2016లో అప్పటికి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్న అదితి అశోక్ ‘ఉమెన్ అమెచ్యూర్’ లో ఆడేందుకు అర్హత సాధించినప్పటికీ, ‘హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్’ను ఎంచుకుని, అక్కడ విజేతగా నిలిచింది. అప్పటి నుంచీ ఏ మహిళా ఇండియన్ గోల్ఫర్ కూడా యు.ఎస్. అమెచ్యూర్ వరకు రాలేదు. ఈ ఆగస్టు 3న జరిగిన టూ–స్ట్రోక్ ప్లే రౌండ్‌తో అణిక ఆ గుర్తింపును సాధించింది. 9న ఫైనల్స్. అయితే అంతవరకు వెళ్లలేకపోవడాన్ని వైఫల్యం అని కాకుండా, ఆమె ఎంతవరకు వెళ్లిందో అంతవరకే విజయంగా చూడాలి. అణిక గత ఏడాదే ‘హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్’తో తొలిసారి వార్తల్లోకి వచ్చింది. అప్పుడు ఆమె వయసు 15. హీరో ఉమెన్స్ అనేది యేటా జరిగే ‘లేడీస్ యూరోపియన్ టూర్’ ఈవెంట్. ఆ ఈవెంట్లో అణిక బెస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా ఐదో స్థానంలో నిలిచింది. ఇరవై దేశాల క్రీడాకారిణులలో ఐదో స్థానం అంటే చిన్న సంగతేమీ కాదు. కూతురిలోని గోల్ఫ్ టాలెంట్‌ని గడప దాటించాలని అనుకున్న అణిక తండ్రి తన కుటుంబాన్ని నోయిడా నుంచి కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకి మార్చేశారు. అణిక తల్లిదండ్రుల ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటాయి. ఆయన సొనేల్. ఆమె పేరు సోనాల్. ఆట సరంజామా ఉండే గోల్ఫ్ కార్ట్‌లో కూతుర్ని కూర్చోబెట్టుకుని సొనేల్ స్వయంగా తనే గోల్ఫ్ కోర్సులో డ్రైవ్ చేస్తుంటారు. అంత ముద్దు కూతురంటే. గోల్ఫ్ కార్ట్‌లో తండ్రి పక్కన అణిక -
దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్
నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’.గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇప్పటికే విడుదలైన క్వీన్ ఫస్ట్ లుక్, టీజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ‘క్వీన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల 44 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ అద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ పేరు శక్తి శేషాద్రి. జయలలిత స్కూల్ డేస్ నుంచి మొదలు సినీ, రాజకీయ విషయాలను ఈ ట్రైలర్లో జోడించారు. ఇక జయలలిత చిన్న నాటి పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ ఆకట్టుకుంది. డిసెంబర్ 14న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. ఇక ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా.. దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా తలైవి ఫస్ట్ లుక్‌పై జయలలిత అభిమానులతో పాటు సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. (తలైవి ఫస్ట్ లుక్ రిలీజ్) -
‘స్వయంవద’ ఫస్ట్ లుక్ లాంచ్
ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మీ చలన చిత్ర పతాకంపై వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న సినిమా స్వయంవద. ఈ సినిమాను ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘స్వయంవద సినిమా టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో సినిమా కూడా అంతే పవర్ ఫుల్ గా వుంటుందనుకుంటున్నాను. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.ఆల్ ది బేస్ట్ స్వయంవద చిత్ర యూనిట్’ అన్నారు. చిత్ర దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ.. ‘స్వయం వద’ సినిమా ఫస్ట్ లుక్ ను మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. స్వయంవద అనేది సంస్కృత పదం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. తన గురించి తానే సర్వస్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఇందులో హీరోయిన్ అనికా రావు మొత్తం 6 గెటప్స్ లో కనిపిస్తుంది. హీరో ఆదిత్య అల్లూరి కొత్తవాడైనా చక్కగా నటించాడు. అందరికీ నచ్చే విధంగా కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించాం. టెక్నికల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది’ అన్నారు. నిర్మాత రాజా దూర్వాసుల మాట్లాడుతూ.... సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.టీజర్ ను ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తాము.సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్ తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
‘స్వయంవద’ టైటిల్ ఆవిష్కరణ
ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మి చలన చిత్ర పతాకంపై తెరకెక్కుతున్న సినిమా స్వయంవద. ఈ సినిమాను వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖ సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సీనియర్ దర్శకుడు అల్లాణి శ్రీధర్ ‘స్వయంవద’ చిత్ర టైటిల్‌ను, లోగోను ఎ.వి.ఏ సుబ్బారావు, టైటిల్ మోషన్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ, ‘వివేక్ మంచి రైటర్ అని అతికొద్ది మందికే తెలుసు. ఆయన నాతో కలిసి పనిచేసినప్పుడే నాకు విషయం అర్ధమైంది. యువత ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడింది? అన్నదే ఈ సినిమా కథ. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వివేక్ గురువుకు తగ్గ శిష్యుడని టైటిల్‌ను బట్టే తెలుస్తోంది. ఇదో డిఫరెంట్ మూవీ. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. చిత్ర దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ, ‘స్వయంవద అనేది సంస్కృత పదం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. తన గురించి తానే ఓ సర్వస్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఇందులో హీరోయిన్ మొత్తం 6 గెటప్స్‌లో కనిపిస్తుంది. హీరో కూడా చక్కగా నటించాడు. టెక్నికల్ గాను సినిమా హైలైట్‌గా ఉంటుంది. ఒక పాట షూటింగ్ మినహా అంతా పూర్తయింద’న్నారు. -
200 ఏళ్ల క్రితం కథతో...
కౌశిక్ అంగారిక హీరోగా నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో వియాన్ జీ, గీతా కౌశిక్ నిర్మించిన సినిమా ‘దమయంతి’. అర్చనా సింగ్, రవళి, అనిక, ఆగస్టీన్ కీలక పాత్రలు చేశారు. హీరో కౌశిక్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా మారాడు. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. 200 ఏళ్ల కిందటి సబ్జెక్ట్‌ను వర్తమాన కాలానికి లింక్ చేసి సినిమా చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్. టీజర్, ట్రైలర్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘శిష్యునిగా నన్ను ఆదరించినందుకు భరద్వాజ్‌గారికి ధన్యవాదాలు. నల చక్రవర్తి భార్యనే దమయంతి. కానీ ఆ తరహా కథ కాదు. పొయెటిక్ స్పర్శతోపాటు థ్రిల్లింగ్ మిళితమై ఉన్న సినిమా ఇది. టీమ్ అందరు బాగా సహకరించారు. నటించినవారందరికీ సమప్రాధాన్యం ఉంది. కథ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్. ‘‘డైరెక్టర్‌ను నమ్మి ఈ సినిమా చేశాను. ఈ సినిమా క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మ్యూజిక్ బాగా వచ్చింది. వచ్చే నెలలో ఆడియోను రిలీజ్ చేస్తాం. సినిమా అందరికీ నచ్చి తీరుతుంది’’ అన్నారు కౌశిక్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఈ చిత్ర నిర్మాత గీతకౌశిక్. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్. ఆత్రేయ. -
మైండ్ గేమ్
‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్ మే పడిపోయానే, ది ఎండ్’.. వంటి చిత్రాలు తెరకెక్కించిన రవి చావలి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లాండ్) ముఖ్య తారలు. యు అండ్ ఐ– ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. బలరామ్ మాట్లాడుతూ– ‘‘జస్టిస్ ఈజ్ ఇన్ యాక్షన్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. ‘సూపర్ స్కెచ్’ టైటిల్ కథకు చక్కగా సరిపోతుంది. తొలి కాపీ సిద్ధమైంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. రవి చావలి కెరీర్లో మరో హిట్ చిత్రం ఖాయం. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, కార్తీక్ కొడకండ్ల సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
పడవలో పాటల వేడుక!
అది చెన్నయ్‌లో గల ఓడ రేవు. అక్కడున్న పడవల్లో ఓ పడవ కొత్త శోభను సంతరించుకుంది. దానికి కారణం ‘నాన్దాన్డా’ సినిమా. శర్వానంద్, అనైక జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దేవి శ్రీదేవి సతీష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఆడియో వేడుకను వినూత్నంగా జరపాలనుకున్న నిర్మాత ఓ పడవను బుక్ చేశారు. అందులో జరిగిన ఈ వేడుకలో భారతీరాజా, థాను, ఆర్బీ చౌదరి, ఆర్కే సెల్వమణి, విక్రమన్, అతుల్ మిశ్రా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వందేళ్ల భారత సినీ చరిత్రలో పడవలో ఆడియో వేడుక జరగడం నాకు తెలిసి ఇదే మొదటిసారి అని, తమిళంలో రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం అని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. ఇదొక క్రైమ్ స్టోరీ అని, ఈ చిత్రంలో కొత్త తరహా క్రిమినల్ని చూపించానని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. ఈ వేడుకలో శర్వానంద్, అనైకలతో పాటు పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రూపొందుతోంది.