బుట్టబొమ్మ’ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనిఖా సురేంద్రన్.. మలయాళంలో కుట్టి నయన్‌గా చాలా ఫేమస్. ప్రేక్షకులు ఇప్పుడు ఆ పేరును మరచిపోయేలా తనకంటూ ఓ యూనిక్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది. అదే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది.. ఇలా.. స్టయిల్ అనేది ఒక పర్సనల్ చాయిస్. ఎవరి స్టయిల్ వారికి ఉంటుంది. ఎక్కువ స్కిన్ షో చేయకుండా.. కంఫర్ట్ దుస్తులతో కనిపించడం నా స్టయిల్ అని అంటోంది అనికా సురేంద్రన్
ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి..
ఆధునిక మహిళ అభిరుచి, అవసరాలను గమనించి వాటికనుగుణమైన డిజైనర్ వేర్‌ను రూపొందించేందుకు ఏర్పడిన బ్రాండే ‘ఏఆర్ సిగ్నేచర్’. బెంగళూరుకు చెందిన అనూష రెజి ప్రారంభించిన ఈ బ్రాండ్.. స్టయిల్ అండ్ సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం సెలబ్రిటీలకు వారి డిజైన్స్ అందిచడమే కాకుండా, దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు అందుకుంటోంది. ధరలు మోస్తారు రేంజ్‌లో ఉంటాయి. కేవలం ఆన్‌లైన్‌లో ఆర్టర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ అనిఖా సురేంద్రన్ ధరించిన ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి ధర రూ. 1,56,000
జోయ్ అలుక్కాస్..
కేరళలో.. 1956లో అలుక్కా జోసెఫ్ వర్గీస్.. చిన్న దుకాణంతో ఆభరణాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. నేడు అది కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో ఈ సంస్థది 67 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతర ం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రముఖ నగరాలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా పదకొండు దేశాల్లో సుమారు 150 బ్రాంచీలు ఉన్నాయి. ఐతే జోయ్ అలుక్కాస్ బ్రాండ్ ధర మాత్రం ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment