joy alukkas
-
బ్రిటన్ పార్లమెంటేరియన్లకు ‘స్ప్రెడింగ్ జాయ్’
లండన్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయ్ అలుక్కాస్ తన స్వీయ జీవిత చరిత్ర ‘స్ప్రెడింగ్ జాయ్’ను బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులకు అందజేశారు. బ్రిటిష్ సౌత్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ కామర్స్ (బీఎస్ఐసీసీ) లండన్‌లోని గ్రిమాండ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మారి్టన్ డే, వీరేంద్ర శర్మ, స్టీఫెన్ టిమ్స్ సహా బరోనెస్ ఉడ్డీన్లకు తన ఆత్మకథను బహూకరించారు. బ్రిటిష్ పార్లమెంటేరియన్స్కు నా కథను తెలియజేయటం ఎంతో సంతోషాన్ని ఇచి్చందని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోయ్ అలుక్కాస్ ఈ సందర్భంగా అన్నారు. కాగా ఇటీవల తన ఆత్మ కథను భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా జోయ్ అలుక్కాస్ అందజేశారు. -
జోయాలుక్కాస్‌కు అవార్డులు
‘ద రిటైల్ జ్యువెలర్ గ్రూప్’ ముంబైలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సినీ నటులు సన్యా మల్హోత్రా, జోయా అఫ్రాజ్ల చేతుల మీద ‘బెస్ట్ డిజిటల్/సోషల్ మీడియా మార్కెటింగ్ ఆఫ్ ది ఇయర్, నేషనల్ రిటైల్ చైన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు అందుకుంటున్న జోయాలుక్కాస్ సంస్థ సీఎండీ జాయ్ అలుక్కాస్. -
ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో జాయ్ అలుక్కాస్
కొచ్చి: ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితాలో జోయాలుక్కాస్ కంపెనీ చైర్మన్ జాయ్ అలుక్కాస్ 50వ స్థానం దక్కించుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక జ్యువెలర్‌గా ఖ్యాతి గడించారు. జ్యువెలరీ రంగంలో పెను మార్పులు తీసుకురావడంలో జాయ్ అలుక్కాస్ కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంక్షోభం(2008), కరోనా మహమ్మారి(2020) వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించి వ్యాపారాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్‌లెట్‌ను చెన్నైలో ప్రారంభించడం, ప్రోత్సాహంగా రోల్స్ రాయిస్ కార్లను బహుమతిగా ఇవ్వడం, రష్యా తూర్పు భాగం ప్రాంతాల కొత్త మార్కెట్లలో ప్రవేశించడం వంటి విన్నూత ఆలోచనలతో జోయాలుక్కాస్ను ‘వరల్డ్స్ పేవరెట్ జ్యువెలర్’ గా జోయాలుక్కాస్ సంస్థగా తీర్చిద్దిద్దారు. -
జోయాలుక్కాస్ చైర్మన్‌కు ప్రత్యేక పురస్కారం
హైదరాబాద్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ ప్రపంచ జ్యువెలరీ సమాఖ్య నుంచి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. వర్డల్ జ్యువెలరీ కానె్ఫడరేషన్(సీఐబీజేఓ) జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ 2023 కార్యక్రమంలో సంస్థ ఎండీ జాన్ పాల్ అలుక్కాస్.. చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు. సప్లై చైన్‌లో నైతిక పద్ధతులు, సుస్థిరతలకు సాటిలేని కృషిని వరల్డ్ జ్యువెలరీ కాన్ఫెడరేషన్ గుర్తించింది. ‘‘ఈ గుర్తింపును మా సంస్థలో ప్రతి ఒక్క సభ్యునితో భాగస్వామ్యం చేస్తున్నాను’’ అని జాయ్‌అలుక్కాస్ తెలిపారు. -
‘బుట్టబొమ్మ’ వేసుకున్న లంగావోణీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బుట్టబొమ్మ’ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనిఖా సురేంద్రన్.. మలయాళంలో కుట్టి నయన్‌గా చాలా ఫేమస్. ప్రేక్షకులు ఇప్పుడు ఆ పేరును మరచిపోయేలా తనకంటూ ఓ యూనిక్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది. అదే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది.. ఇలా.. స్టయిల్ అనేది ఒక పర్సనల్ చాయిస్. ఎవరి స్టయిల్ వారికి ఉంటుంది. ఎక్కువ స్కిన్ షో చేయకుండా.. కంఫర్ట్ దుస్తులతో కనిపించడం నా స్టయిల్ అని అంటోంది అనికా సురేంద్రన్ ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి.. ఆధునిక మహిళ అభిరుచి, అవసరాలను గమనించి వాటికనుగుణమైన డిజైనర్ వేర్‌ను రూపొందించేందుకు ఏర్పడిన బ్రాండే ‘ఏఆర్ సిగ్నేచర్’. బెంగళూరుకు చెందిన అనూష రెజి ప్రారంభించిన ఈ బ్రాండ్.. స్టయిల్ అండ్ సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం సెలబ్రిటీలకు వారి డిజైన్స్ అందిచడమే కాకుండా, దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు అందుకుంటోంది. ధరలు మోస్తారు రేంజ్లో ఉంటాయి. కేవలం ఆన్లైన్లో ఆర్టర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ అనిఖా సురేంద్రన్ ధరించిన ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి ధర రూ. 1,56,000 జోయ్ అలుక్కాస్.. కేరళలో.. 1956లో అలుక్కా జోసెఫ్ వర్గీస్.. చిన్న దుకాణంతో ఆభరణాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. నేడు అది కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో ఈ సంస్థది 67 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతర ం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రముఖ నగరాలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా పదకొండు దేశాల్లో సుమారు 150 బ్రాంచీలు ఉన్నాయి. ఐతే జోయ్ అలుక్కాస్ బ్రాండ్ ధర మాత్రం ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. నేటి నుంచి(14వ తేదీ) ప్రారంభమై ఈ నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ అద్భుతమైన ఆఫర్‌ను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ ఎండీ జాయ్ అలుక్కాస్ కోరారు. -
జోయ్ అలుక్కాస్కు భారీ షాక్: కోట్ల ఆస్తులు స్వాధీనం
న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్కు భారీ షాక్ తగిలింది. ఐదు రోజుల వరుస సోదాల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.305.84 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఈడీ శుక్రవారం ఆరోపించింది. (ఇదీ చదవండి: షాకింగ్: 8500 మందిని తొలగించనున్న టెలికాం దిగ్గజం) అటాచ్ చేసిన ఆస్తులలో రూ. 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంకు ఖాతాలు, రూ. 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువైన జోయల్లుకాస్ షేర్లను కూడా ఈడీ సీజ్ చేసింది. హవాలా మార్గాల ద్వారా భారతదేశం నుండి దుబాయ్‌కి భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ తర్వాత 100 శాతం జాయ్ అలుక్కాస్ వర్గీస్‌కు చెందిన జోయల్లుకాస్ జ్యువెలరీ LLC, దుబాయ్‌లో పెట్టుబడి పెట్టింది. రూ. 2,300 కోట్ల ఐపీవో ఉపసంహరించుకున్న మరునాడే వరుస సోదాలు చేపట్టిన అధికారులు భారీ మొత్తంలో ఆస్తులను సీజ్ చేయడం గమనార్హం. (StudentVisa అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్!) కాగా దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల జోయ్ అలుక్కాస్కు దేశవ్యాప్తంగా 68 శాఖలున్నాయి. జ్యూయలరీ బిజినెస్‌లో దేశంలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో బాగా పాపులర్ అయింది. అయితే 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్టు కోసం విదేశాలకు హవాలా రూపంలో రూ. 300 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జోయ్ అలుక్కాస్ అధినేత అధికార నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
సీఎం జగన్‌ను కలిసిన జోయాలుక్కాస్ చైర్మన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ అలుక్కాస్ వర్గిస్ జాయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా వర్గిస్ జాయ్‌తో స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్.. జోయాలుక్కాస్ చైర్మన్‌కు వివరించారు. ఈ సమావేశంలో జోయాలుక్కాస్ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్‌లు సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు భేష్! -
జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్ దీపావళి సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 24 వరకు ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది. -
జోయాలుక్కాస్ ఆఫర్ పొడిగింపు
ఆంధ్రా/తెలంగాణ: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ‘అతుల్యమైన ఫ్లాట్ 50%’ ఆఫర్‌ను మార్చి 27 వరకు పొడిగించింది. కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ జాయ్ అలూక్కాస్ చెప్పారు. అతుల్యమైన ఫ్లాట్ 50%తో మజూరీ ఛార్జీల విషయంలో మార్కెట్లో అత్యంత పోటీ ధరల్ని తీసుకొచ్చామన్నారు. పరిమిత కాల ఆఫర్‌ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ ఆఫర్‌కు అదనంగా కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఏడాది ఉచిత బీమా, జీవిత కాల ఉచిత నిర్వహణ, పసిడి మారి్పడి ఆఫర్లను పొందవచ్చన్నారు. -
16 కిలోల బంగారు, అరకిలో వజ్రాలు చోరీ.. అనుమానాస్పద ప్రాంతంలో..
సాక్షి, వేలూరు: వేలూరు –కాట్పాడి రోడ్డులోని జోస్ అలుక్కాస్ బంగారు దుకాణంలో ఈనెల 16వ తేదీన దుండగులు గోడకు రంధ్రం చేసి దుకాణంలోని 16 కిలోల బంగారు నగలు, అర్ధకిలో వజ్రాలు చోరీ చేశారు. చోరీ ఘటన పూర్తిగా సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో వీటిపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా నలుగురు డీఎస్పీలతో కూడిన ఎనిమిది బృందాలు ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టారు. అదే విధంగా కాట్పాడి రోడ్డులో అక్కడక్కడ దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చదవండి: (జూనియర్ ఆర్టిస్ట్ మానస మృతి.. అంత్యక్రియలకు డబ్బులు లేవు..) ఆ సమయంలో చోరీ జరిగిన సమయంలో సంబంధం లేని ప్రాంతంలో ఓ ఆటో నిలిచి ఉండడాన్ని పోలీసులు కెమెరాల్లో గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో సంబంధం లేని ప్రాంతంలో ఆటో ఎందుకు నిలిచి ఉందని పోలీసులు ప్రశ్నించారు. చోరీ జరిగిన దుకాణం పక్కనే ఒక విశ్రాంతి గది ఉండటం, అందులో అనేక మంది కార్మికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడంతో కార్మికుల వద్ద విచారణ చేపట్టారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) అదే విధంగా 25 మంది కార్మికులు వేలి ముద్రలు, ఫొటోలు, ఆధార్ కార్డులను సేకరించి విచారణ చేపట్టగా అందులో వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని కుచ్చిపాళ్యంకు చెందిన టీకారామన్(28) నిందితుడిగా తెలిసింది. దీంతో ఇతన్ని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. చోరీ చేసిన 16 కిలోల బంగారం, వజ్రాలను ఎక్కడ దాచి పెట్టాడనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. -
వరల్డ్ టాప్–100 లగ్జరీ బ్రాండ్లు.. చోటు దక్కించుకున్న ఇండియన్ బ్రాండ్స్ ఇవే
న్యూఢిల్లీ: ప్రపంచంలో విలాసవంతమైన టాప్–100 బ్రాండ్లలో భారత్ నుంచి ఐదింటికి చోటు లభించింది. టైటాన్ మూడు స్థానాలు పైకి ఎగిసి 22వ ర్యాంకులోకి వచ్చింది. అంతేకాదు అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న అగ్రగామి 20 లగ్జరీ ఉత్పత్తుల కంపెనీల్లోనూ చోటు సంపాదించుకుంది. జెమ్స్ అండ్ జ్యుయల్లరీ టాప్–100 విలాసవంత ఉత్పత్తుల్లో భారత్ నుంచి కల్యాణ్ జ్యుయలర్స్, జోయలుక్కాస్, పీసీ జ్యుయలర్స్, త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ ఉన్నాయి. ఇవన్నీ జ్యుయలరీ కంపెనీలే కావడం గమనార్హం. భారత్‌కు సంబంధించి ధోరణి గతేడాది మాదిరే ఉందని, జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగం తాజా ఎడిషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించినట్టు.. ఈ నివేదికను రూపొందించిన డెలాయిట్ తెలిపింది. తొలిసారి త్రిభువన్దాస్.. టాప్ –100 లగ్జరీ ఉత్పత్తుల జాబితాలోకి త్రిభువన్దాస్ భీమ్జీ జవేరి తొలిసారిగా చోటు సంపాదించుకుంది. టాప్–10 బ్రాండ్లు యూరోప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతం (ఈఎంఈఏ) నుంచే ఉన్నాయి. టాప్–100లో 80కు పైగా కంపెనీల విక్రయాలు 2019–20లో (2020వ సంవత్సరం) తక్కువగా ఉన్నాయని.. కరోనా ప్రబావం వీటిపై పడినట్టు డెలాయిట్ తెలిపింది. అయినప్పటికీ సగానికి పైగా కంపెనీలు లాభాలను నమోదు చేశాయని పేర్కొంది. చదవండి: ఆదిత్య బిర్లా చేతికి రీబాక్! నెక్ట్స్ ఏం జరగబోతుంది? -
జాయ్ అలుక్కాస్ బంపర్ ఆఫర్
సాక్షి, సిటీబ్యూరో: మీ పాత బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా నగదు ఇచ్చేందుకు జాయ్ అలుక్కాస్ షోరూమ్ సరికొత్త ఆఫర్‌ను పసిడి ప్రియుల ముందుకు తీసుకొచ్చింది. అలాగే పాత బంగారు ఆభరణాలను అత్యధిక విలువకు సరికొత్త బంగారం ఆభరణాల డిజైన్‌తో మార్చే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే జాయ్ అలుక్కాస్.కామ్ వెబ్సైట్లో ప్రత్యేకమైన కలెక్షన్లు అందుబాటులో ఉంచామని, తమకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. వినియోగదారులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న తేదీ అమలులో ఉన్న ధర, కొనుగోలు చేసినప్పడు ఉన్న ధర...రెండింటిలో ఏదీ తక్కువగా ఉంటే దాని ప్రకారం ధర చెల్లించవచ్చని తెలిపారు. -
పాత బంగారంపై జోయ్ అలుక్కాస్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘జోయ్ అలుక్కాస్’.. హాల్ మార్క్ కలిగిన పాత బంగారాన్ని గరిష్టవిలువకు మార్పిడి చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త బంగారాన్ని మార్చుకోవడం.. లేదంటే, తక్షణ క్యాష్ ఇస్తున్నట్లు వివరించింది. కోవిడ్–19 వైరస్ దృష్ట్యా తమ అన్ని షోరూంలను ప్రభుత్వం, ఆరోగ్య విభాగం ఇచ్చిన సూచనల మేరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని, కేవలం 10 శాతం మొత్తానికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు వివరించింది. -
ఆ వార్తలు నిజం కాదు: జోయాలుక్కాస్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ సీఎండీ జాయ్ అలూక్కాస్ క్షేమంగా ఉన్నారని ఆ గ్రూప్ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రచారమవుతోన్న తప్పుడు వార్తలను ఖండించింది. దుబాయ్‌లో మరణించిన ఒక వ్యాపారి పేరు సంస్థ సీఎండీ పేరుకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో పొరపాటున అసత్య కథనాలను పలు వార్తా సంస్థలు ప్రచారం చేశాయని వెల్లడించింది. మరణించిన వ్యాపారి పేరు జాయ్ అరక్కల్ అని, ఆయనకు జాయ్ అలూక్కాస్కు సంబంధం లేదని స్పష్టంచేసింది. -
ఏఎస్‌రావునగర్‌లో కాజోల్ సందడి
-
సందడి చేసిన కాజోల్
ఏఎస్‌రావునగర్: మనసుకు నచ్చే ఆభరణాలను తయారుచేసే జోయాలుక్కాస్ సంస్థ తన నూతన షోరూమ్‌ను ఏఎస్‌రావునగర్‌లో బుధవారం ప్రారంభించింది. జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ సినీ నటి కాజోల్ దేవగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. జోయాలుక్కాస్ ద్వారా ఆత్మీయ కలయిక గొప్ప మధురానుభూతిని ఇచ్చిందన్నారు. జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయాలుక్కాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం తమకు ఎంతో ప్రత్యేకమైందన్నారు. జోయాలుక్కాస్ షో రూమ్‌ను ప్రారంభిస్తున్న కాజోల్ దేవగన్, చిత్రంలో జోయాలుక్కాస్, జోళి జోయాలుక్కాస్ వినియోగదారుల సహకారం, నిరంతర ప్రోత్సాహం వల్లే ఇంతటిస్థాయికి చేరుకున్నామన్నారు. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 200 షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతులు అందజేస్తామన్నారు. ఈ ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వినియోగదారులు వినియోగించుకోవచ్చన్నారు. దీంతోపాటు అభరణాల ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జోయ్ అలుక్కాస్ డైరక్టర్ జోళి జోయ్ అలుక్కాస్, రీజనల్ మేనేజర్ రాబిన్టాంబీ, డీజీఎం పీడీ. ఫ్రాన్సస్స్, బ్రాంచ్ మేనేజర్ జీన్స్, అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ జీవై సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్‌ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. -
జోయలుక్కాస్‌పై దేశవ్యాప్తంగా ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయలుక్కాస్‌కు ఆదాయ పన్నుశాఖ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఐడీ సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారులు దాడి చేశారు. హైదరాబాద్, కేరళ, బెంగళూరు,ముంబై తదితర నగరాల్లో ఏకకాలంలో షాపులు మూసివేసి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ సోదాలు ప్రారంభించగా, షాపులు మూసేసి మరీ అధికారులు సోదాలు చేపట్టారు. తమిళనాడుతో పాటు అనేక రాష్ట్రాల్లో జ్యూయలరీ చైన్ జోయలుక్కాస్‌కు చెందిన షోరూంలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికి 4 లాకర్లు, 20 దస్తావేజులు, అధికారికంగా రూ.4 కోట్లు, 60 లక్షల విలువైన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీనియర్ ఆదాయపు పన్ను అధికారి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కాగా గల్ఫ్ దేశాలలో స్థాపించబడిన జ్యూయలరీ మేజర్ జోయలుక్కాస్ గ్రూపు ఒమన్, బహ్రెయిన్, ఇండియా, యూకే సహా 11 దేశాలలో 130 షోరూంలను నిర్వహిస్తోంది. -
జోయాలుక్కాస్ను భారీగా విస్తరిస్తున్నాం
సంస్థ చైర్మన్ జోయ్ ఆలుక్కాస్ వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ జ్యువెలరీ వ్యాపారంలో జోయాలుక్కాస్ విజయవంతం ముందుకు వెళ్తుందని జోయాలుక్కాస్ చైర్మన్ అండ్ ఎండీ జోయ్ ఆలుక్కాస్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని జోయాలుక్కాస్ షోరూమ్‌లు వ్యాపారంలో అంచనాలకు మించి పోయాయని తెలిపారు. అందుకే మరో పెద్ద జోయాలుక్కాస్ షోరూమ్‌ను తాజాగా పంజాగుట్టలో ప్రారంభించామన్నారు. శనివారం జోయాలుక్కాస్ షోరూమ్ ప్రారంభం అనంతరం ఆయన సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు... 121వ షోరూమ్ ఇది... ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే జోయాలుక్కాస్ షోరూమ్‌లు 120 వరకు ఉన్నాయి. పంజాగుట్టలో ప్రారంభమైన దానితో కలిపితే 121వది. మా సంస్థల్లో ఎక్కడ షోరూమ్ ప్రారంభించినా అక్కడి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణలో కలిసి 18 జ్యూయలరీ షోరూమ్‌లు ఉన్నాయి. ప్రతి ఏడాది 12 నుంచి 18 షోరూమ్‌లు ఓపెన్ చేస్తున్నాం. 11 దేశాల్లో ఉన్న మా సంస్థల్లో 99% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నాం. 2015-16కు 14 షోరూమ్‌లు, 2016-17లో 8 నుంచి 9 షోరూమ్‌లు ప్రారంభించనున్నాం. ఇప్పటికి దేశవ్యాప్తంగా 65 షోరూమ్స్ ఉన్నాయి. జిల్లాలకూ... 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 200 జోయాలుక్కాస్ షోరూమ్‌లు ప్రారంభించటం ధ్యేయం. అంతేకాదు జిల్లాలకు కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటి లాగా ప్రజలు ఆదరించి, అభిమానిస్తే విస్తరణ సులభతరం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మా టర్న్వర్ రెండు బిలియన్ డాలర్లు. అందులో ఇక్కడ రూ. 6 వేల కోట్లు టర్నోవర్ ఉంది. పంజాగుట్ట లాంటి షోరూమ్‌ల్లో రూ. 150 కోట్ల విలువైన స్టాక్ ఉంటోంది. ఇక్కడ జ్యువెలరీ వ్యాపార వృద్ధి 5 నుంచి 6 శాతం ఉంది. అది కాస్తా 12 నుంచి 15 శాతం పెరగాల్సివుంది. ఐపీవో ప్రణాళిక... విస్తరణ కోసం మార్కెట్ ద్వారా నిధులు సమీకరించేందుకు తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేయాలన్న ప్రణాళిక వుంది. జ్యువెలరీతో సహా పలు ఇతర వ్యాపారాలు కూడా మేము చేస్తున్నాం. జోయాలుక్కాస్ వ్యాపారాలు భారత్‌తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, బెహ్రెయిన్, ఒమన్, కువైట్, కతార్, సింగపూర్, మలేషియా, లండన్లలో నడుస్తున్నాయి. మా వ్యాపారాల్లో జ్యువెలరీ, ద్రవ్య మార్పిడి, ఫ్యాషన్, టెక్స్ టైల్స్, లగ్జరీ విమానాలు, మాల్స్, రియాల్టీలు ఉన్నాయి. జోయాలుక్కాస్ ప్రపంచ వ్యాప్తంగా 7,000 మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించింది. -
‘రేసుగుర్రం’ కాదు..రెక్కలగుర్రం ఎక్కినంత సంతోషంగా ఉంది..
మీ అభిమానం చూస్తుంటే.. ‘రేసుగుర్రం’ కాదు..రెక్కలగుర్రం ఎక్కినంత సంతోషంగా ఉంది..రాజమండ్రిలో శుక్రవారం ‘జాయ్ అలుక్కాస్’ షోరూమ్‌ను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా తనను చూసేందుకు పోటీపడ్డ అభిమానులకు అభివాదం చేస్తున్న హీరో అల్లు అర్జున్. జాయ్ అలుక్కాస్ షోరూం ప్రారంభం ప్రముఖ వజ్రాభరణాల వ్యాపార సంస్థ జాయ్ అలుక్కాస్ కొత్త షోరూంను రాజమండ్రిలో శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. శ్యామలా సెంటర్లో ఈ షోరూం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత తిరుపతిలో ఉదయం 10.30 గంటలకు జాయ్ అలుక్కాస్ నూతన షోరూంను ప్రారంభించిన అనంతరం 2.30 గంటలకు విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంగుండా రాజమండ్రి చేరుకుని ఓ హొటల్లో విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి షోరూంకు చేరుకున్నారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించిన బన్నీ..అనంతరం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తితో కలిసి దీపారాధన చేశారు. ఆతర్వాత షోరూంలో నగల ప్రదర్శనను వీక్షించారు. కోనుగోలు చేసేందుకు వచ్చిన వారికి నగలు అందించారు. అనంతరం బయట తన కోసం ఎదరు చూస్తున్న అభిమానులను ఉద్దేశించి అర్జున్ మాట్లాడారు. అలుక్కాస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. షోరూం ప్రారంభోత్సవానికి రాజమండ్రి వచ్చే భాగ్యాన్ని కలుగచేసిన సంస్థ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగర మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ ప్రముఖ వజ్రాభరణాల సంస్థ రాజమండ్రిలో వ్యాపార విభాగాన్ని ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. సంస్థ నిర్వాహక ప్రముఖులు పాల్గొన్నారు. - సాక్షి, రాజమండ్రి నాకు కొడుకు పుట్టాడు సాక్షి, రాజమండ్రి : ‘నాకు మొన్ననే కొడుకు పుట్టాడు. వాడి ఫొటోలు తొందర్లో నే మీకోసం రిలీజ్ చేస్తా’ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుత్రోత్సాహాన్ని రాజమండ్రిలో అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ వజ్రాభరణాల విక్రయ సంస్థ జాయ్ అలుక్కాస్ షోరూంను రాజమండ్రిలో ప్రారంభించేందుకు వచ్చిన అర్జున్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శ్యామలా సెంటర్లో షోరూం ప్రారంభం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి అర్జున్ తన అభిమానులతో మాట్లాడారు. అభిమానులను చూసి ‘దేవుడా’ అంటూ రేసుగుర్రం డైలాగు చెప్పడంతో జనం కేరింతలు కొట్టారు. స్టెప్పులు వేయాలంటూ కేకలు వేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమా త్వరలో మీముందుకు రాబోతోందని వెల్లడించారు. తన రేసుగుర్రం గురువారంతో వంద రోజులు పూర్తిచేసుకుందని, అంతటి ఘన విజయాన్ని అందచేసిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. తన పట్ల రాజమండ్రి ప్రజలు ఎప్పుడూ ప్రత్యేక అభిమానం చూపుతారన్నారు.. తనకు కూడా రాజమండ్రి అంటే అభిమానం ఎక్కువని అన్నారు. తాను జాయ్ అలుక్కాస్ షోరూంలను చాలా చోట్ల ప్రారంభించానని, రాజమండ్రిలో వచ్చిన జనం ఎక్కడా చూడలేదని బన్ని ముచ్చట పడిపోయారు. -
అల్లు అర్జున్ వచ్చాడంటే..
-
బన్నీకి ఊపిరాడలేదు
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో స్టైలిష్ హీరో అల్లు అర్జున్ శుక్రవారం హల్చల్ చేశారు. ప్రముఖ జ్యూవెల్లరీ షాపు జాయ్ అలుకాస్ శాఖను అర్జున్ ప్రారంభించారు. అర్జున్ను చూసేందుకు అధిక సంఖ్యలో ఆయన అభిమానులు షాపు వద్దకు తరలివచ్చారు. ఆ క్రమంలో అల్లు అర్జున్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దాంతో హీరో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి అభిమానుల మధ్య ఉన్న అల్లు అర్జున్ ను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర తోపులాట జరిగింది. ఓ దశలో మహిళ కానిస్టేబులు పద్మ కిందపడిపోయారు. దాంతో ఆమెకు గాయాలయ్యాయి. పోలీసులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులు అల్లు అభిమానులపై లాఠీచార్జ్ చేశారు.