Joy Alukkas Chairman Meets Ap CM YS Jagan, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన జోయాలుక్కాస్‌ సంస్థ చైర్మన్‌ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్‌

Published Fri, Jan 20 2023 5:59 PM | Last Updated on Fri, Jan 20 2023 6:23 PM

Joy Alukkas Chairman Met Ap CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: దేశంలో ప్రముఖ నగల వ్యాపార  సంస్థ అయిన జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్‌.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. 

రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా వర్గిస్‌ జాయ్‌తో స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన వివరించారు. 

సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్‌.. జోయాలుక్కాస్‌ చైర్మన్‌కు వివరించారు. ఈ సమావేశంలో జోయాలుక్కాస్‌ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కంది రవిశంకర్‌లు సైతం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు భేష్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement