investments to ap
-
దారి ఖర్చులు 'దండగ'!
సాక్షి, అమరావతి: దాదాపు ఆరు నెలల ముందే దావోస్ పర్యటనపై హడావుడి.. విమానం దిగకముందే జాతీయ మీడియాలో పబ్లిసిటీ.. వరుస భేటీలు.. తన పుట్టిన రోజును కూడా పట్టించుకోకుండా ఎముకలు కొరికే చలిలో ‘చినబాబు పాదయాత్ర’! అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ.. బిల్‌గేట్స్‌తో బాబు ఫొటోలంటూ ప్రచారం.. !!ఇవన్నీ చూస్తే సీఎం చంద్రబాబు బృందం విదేశాల నుంచి రూ.లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించిందనుకుంటారు! కనీసం కీలక ఒప్పందాలైనా కుదిరాయనుకుంటారు!! కానీ దావోస్ పర్యటనకు రూ.80 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించిన సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనుదిరిగారు. పారిశ్రామికవేత్తలను మెప్పించలేక తెల్లమొహం వేశారు! కూటమి సర్కారు పాలనలో ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని గమనించిన పారిశ్రామికవేత్తలు ఏ ఒక్కరూ ఎంవోయూలకు ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొహం చాటేశారు. సమావేశాలకు వారం ముందే జాతీయ మీడియాలో ప్రచారం, ఇంటర్వ్యూల కోసం రూ.కోట్లలో చెల్లించిన ప్రభుత్వ పెద్దలు తీరా అక్కడకు వెళ్లాక పెట్టుబడులు ఆకర్షించటాన్ని పక్కనపెట్టేసి స్వీయ ప్రచారంలో మునిగిపోయారు. ఐటీకి ఆద్యుడిని తానేనని, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారంటే తన ఘనతేనని చెప్పుకుని సీఎం చంద్రబాబు మురిసిపోయారు. దీంతో సింగడు అద్దంకి పోనూ పోయాడు.. రానూ వచ్చాడు.. అన్నట్లుగా ఆయన పర్యటన ముగిసింది. ‘ఇంత కష్టపడినందుకు బిల్‌గేట్స్‌తో ఫోటో మిగిలింది.. సంతోషం’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మనదేశం నుంచి అక్కడకు వెళ్లిన చిన్నాచితకా వ్యాపారులు బిల్స్‌గేట్, ఇతర ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో ఫోటోలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకున్నారు. కాకపోతే వారు సోషల్ మీడియాలో సొంత వాల్స్ మీద పోస్ట్ చేసుకుంటే.. సీఎం చంద్రబాబు ఫోటోలను ఐ అండ్ పీఆర్ అధికారులు అందరికీ పంపించి ప్రచారం చేయించారు.ఇతర రాష్ట్రాలకు లక్షల కోట్లు.. ఏపీకి శూన్యం..దావోస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. రిలయన్స్, ఎల్ అండ్ టీ, అమెజాన్, వర్థన్ లిథియం, జేఎస్‌డబ్ల్యూ, టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని, 1995 నుంచి దావోస్‌కు వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్‌గేట్స్‌తో సమావేశమై ఆ ఫోటోను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు, బిల్‌గేట్స్‌కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పత్రికలు బాకాలూదాయి.రాష్ట్రం గురించి చెప్పకుండా రాజకీయ ప్రసంగాలు..దావోస్ మ్యాన్‌గా తనకు తాను కీర్తించుకునే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు. రెడీ.. యాక్షన్.. కెమెరా అంటూ ఫోటోలు, వీడియోలతో ప్రచారం చేయడమే గానీ కనీసం కోటి రూపాయల పెట్టుబడిని తీసుకురాలేకపోయారు. తన తనయుడు, మంత్రి నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడం కోసం సీఎన్‌బీసీ, టీవీ 18, ఎన్డీటీవీ, బిజినెస్ టుడే లాంటి జాతీయ చానళ్లకు రూ.కోట్ల కొద్ది ప్రజాధనాన్ని వెచ్చించి ప్రచారం చేయించారు. అయితే లోకేష్ రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించడానికి బదులు రాజకీయ ప్రసంగాలు చేయడంతో పారిశ్రామికవేత్తలు విస్తుపోయారు. రాష్ట్రం వెనుకబడిపోయిందని, విద్యారంగం సర్వ నాశనం అయిందని, పునర్నిర్మాణ పనిలో ఉన్నామంటూ రాజకీయ దురుద్దేశాలతో ఏపీ పరువును అంతర్జాతీయ వేదికలపై దిగజార్చారు. దీన్ని గమనించిన పారిశ్రామికవేత్తలు ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. ఇక పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తాను వచ్చిన పని మర్చిపోయి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ఒకసారి.. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకపోతే మరో ఎలన్ మస్క్ అయ్యేవారని చాట్ జీపీటీ చెప్పిందంటూ వ్యాఖ్యలు చేయడంతో పారిశ్రామికవేత్తలు ముక్కున వేళ్లేసుకున్నారు.రూ.80 కోట్లకుపైగా ఖర్చు..తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022లో దావోస్ పర్యటనకు వెళ్లి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పిస్తే సీఎం చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా తీసుకురాలేకపోయారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాల కోసం పెవిలియన్, ప్రచార ఖర్చుల దగ్గర నుంచి ప్రయాణం, వసతి వరకు సుమారు రూ.80 కోట్లకుపైన వ్యయం చేస్తే దారి ఖర్చులు కూడా రాలేదని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు దక్కితే మనకు మాత్రం ఫోటోలు – వీడియోలే మిగిలాయని పేర్కొన్నారు. -
రూ.3,008 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ.. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్ అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పినర్స్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇవీ ప్రాజెక్టులు.. 1.డీపీ చాక్లెట్స్ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్‌తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇన్స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్‌కు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. 6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్‌పీఎస్ సీఈవో శ్రీధర్‌రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది. -
మరిన్ని పెట్టుబడుల కోసం విదేశాలకు..
సాక్షి, అమరావతి: మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో కూడిన బృందం ఈనెల 15 నుంచి 25 వరకు దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో పర్యటించనుంది. అక్కడ ప్రముఖ సంస్థలను సందర్శించి.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించనుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. మంత్రి బుగ్గన ఈ నెల 10న ఢిల్లీలో దక్షిణ కొరియా, వియత్నాం రాయబారులతో సమావేశమై పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఏపీ బృందం కొరియాలోని కియా పరిశ్రమను సందర్శించి ఏపీలోని యూనిట్‌ను మ రింతగా విస్తరించడానికి గల అవకాశాలను వివరిస్తా రు. శామ్సంగ్, దేసాంగ్ కార్పొరేషన్లతో పాటు కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ అండ్ ఫిష రీస్ టెక్నాలజీలను ఈ బృందం సందర్శించనుంది. విశాఖలో జరిగిన జీఐఎస్‌లో వియత్నాం ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా తాజా పర్యటనలో ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమవ్వనున్నారు. వియత్నాంలోని సౌత్ ఎకనామిక్ జోన్‌ను సందర్శించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడుతూ..పరిశ్రమలు, టెక్స్టై ల్స్, ఆక్వా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అక్కడ పాటిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. -
మరో 4 అడుగులు.. విశాఖ జీఐఎస్ ఒప్పందాల కార్యరూపం శరవేగంగా ..
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు మూడు జిల్లాల్లో రూ.1,425 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రాజెక్టులో ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించారు. క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమల శిలాఫలకాలను సీఎం జగన్ వర్చువల్‌గా ఆవిష్కరించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ విస్తరించిన యూనిట్లో వాణిజ్య కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఈ రోజు మూడు జిల్లాల్లో నాలుగు యూనిట్లకు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతోందని, వీటివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన మూడు ప్లాంట్లు త్వరలో నిర్మాణ కార్యకలాపాలను పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయన్నారు. ‘ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. 12 నెలల్లో క్రిబ్కో ఇథనాల్ ప్లాంట్ నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపు రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ ఏర్పాటవుతోంది. 12 నెలలలోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. రోజుకు 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో ఇక్కడ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్లాంట్ ద్వారా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణపట్నం వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన క్రిబ్కో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏడాదిన్నరలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ ఇదే నెల్లూరు జిల్లాలోనే విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ కూడా వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పుతున్న బయో ఇథనాల్ ప్లాంట్ వల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రూ.315 కోట్లతో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మన యువతకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు లభించనుండటం ఆనందదాయకం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీ తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీని స్థాపిస్తోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16 వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పుతోంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నా. 9 నెలల్లోనే మొదలైన గోద్రెజ్ ఆగ్రోవెట్ యూనిట్ ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి, 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్ ఆయిల్ (వంట నూనె) రిఫైనరీ ప్రాజెక్టును విస్తరిస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన 9 నెలల్లోనే యూనిట్ ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం. ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల ఏలూరు జిల్లా యువకులకు మరో 500 ఉద్యోగ అవకాశాలు లభించడం శుభపరిణామం. కంపెనీ యాజమాన్యానికి అభినందనలు. సర్వేపల్లిలో ‘క్రిబ్కో’ గ్రీన్ ఎనర్జీ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బయో ఇథనాల్ తయారీని చేపడుతోంది. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 4 వేల టన్నుల డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్ తయారవుతాయి. బియ్యం, మొక్కజొన్నతో ‘విశ్వసముద్ర బయో ఎనర్జీ’ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని స్థాపిస్తోంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారీ చేయనున్నారు. వరి సాగు చేసే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరం. మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టిలరీతోపాటు బై ప్రొడక్ట్‌గా డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్ తయారు కానున్నాయి. కాంటినెంటిల్ ఇన్స్టెంట్ కాఫీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ పుడ్ బెవెరేజెస్ కంపెనీ ఏర్పాటు కానుంది. ఏటా 16 వేల టన్నుల సొల్యుబుల్ ఇన్స్టెంట్ కాఫీ ఈ ప్లాంట్‌లో తయారవుతుంది. యూనిట్ విస్తరించిన ‘గోద్రెజ్ ఆగ్రోవెట్’ ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ రోజుకు 400 టన్నుల వంట నూనె తయారీ సామర్థ్యంతో విస్తరించిన యూనిట్, 200 టన్నుల సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్‌ను ప్రారంభించింది. -
Andhra Pradesh: పారిశ్రామిక దూకుడు!
సాక్షి, అమరావతి: పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్లతోపాటు 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం లాంటి అనుకూలతలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు, లాజిస్టిక్స్‌తో పాటు వివాద రహితంగా అభివృద్ధి చేసిన భూములను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రాయితీలతోపాటు మౌలిక వసతులపై అధికంగా దృష్టిసారించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సీఎం జగన్ కోవిడ్ సంక్షోభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో రూ.11,753 కోట్లతో ఆరు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు రూ.18,897 కోట్లతో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కోవిడ్ సమయంలో ఏకకాలంలో చేపట్టారు. అంతేకాకుండా విశాఖ, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల కోసం ప్రతిపాదనలు పంపారు. మరోవైపు కాకినాడ వద్ద రూ.1,000 కోట్లతో బల్క్‌డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటివల్ల అభివృద్ధి చేసిన 50,000 ఎకరాలు అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గనుంది. తద్వారా అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదగనున్నట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం ఈ స్థాయిలో వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని పేర్కొంటున్నాయి. కోవిడ్లోనే కొప్పర్తి నోడ్ రెడీ ఒకపక్క కోవిడ్ సంక్షోభం వెంటాడుతున్నా విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలోని కొప్పర్తి నోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అందుబాటులోకి తెచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అభిృవృద్ధి చేస్తోంది. ఇందులో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 3,053 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇదే కారిడార్‌లో భాగంగా నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడ్లను ఏడీబీ, నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ నిధులతో తొలిదశలో రూ.2,900 కోట్లతో అభివృద్ధి చేయగా రెండోదశలో రూ.1,633 కోట్లతో అభివృద్ధి పనులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఈనెల 23న ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒక్క కారిడార్ పరిధిలోనే 26,182 ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక చెన్నై–హైదరాబాద్ కారిడార్ కింద కృష్ణపట్నం వద్ద 11,096 ఎకరాల్లో క్రిస్ సిటీని, హైదరాబాద్ –బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద 9,305 ఎకారాలను అభివృద్ధి చేయనుంది. ఈ పారిశ్రామిక పార్కులకు అవసరమైన నీటి వసతికి సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ మొదలు పెట్టింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేగా భోగాపురంతోపాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వానికి భిన్నంగా.. టీడీపీ అధికారంలో ఉండగా తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు నెలన్నర ముందు ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముగించారు. ఇలాంటి వ్యవహారాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించడంతోపాటు ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ క్లోజర్) సమకూరిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణం మొదలు కాగా ఈనెల 22వతేదీన మచిలీపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఏపీ మారిటైమ్ బోర్డును నెలకొల్పడమే కాకుండా మూడు పోర్టులకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేశారు. 2022 జూలైలో పనులు ప్రారంభించిన రామాయపట్నం శరవేగంగా సాకారమవుతోంది. ఈ ఏడాది చివరినాటికల్లా తొలి ఓడను ఇక్కడకు రప్పించే లక్ష్యంతో ముందుకువెళుతున్నారు. 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పోర్టులకు అదనంగా 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లలో పనులు వేగంగా జరుగుతుండటంతో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. జువ్వలదిన్నె పనులు 86 శాతానికిపైగా పూర్తి కాగా నిజాంపట్నంలో 62 శాతం జరిగాయి. మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు 50 శాతం దాటాయి. ప్రైవేట్ రంగంలో నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల కోసం రూ.18,897 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ పోర్టులను ఆనుకుని భారీ పారిశ్రామిక నగరాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మాన వనరులను సమకూర్చడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం 192 స్కిల్ హబ్స్ ఏర్పాటుతోపాటు 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ దేశీయ ఇన్ఫ్రా రంగంపై ఏటా ప్రకటించే అవార్డుల్లో ఈసారి మనకు చోటు దక్కింది. దేశంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అత్యున్నత ప్రగతిని గుర్తిస్తూ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుండటంతో దిగ్గజ సంస్థలైన అదానీ, అంబానీ, మిట్టల్, బిర్లా, భంగర్, భజాంకా, సంఘ్వీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రాజెక్టŠస్ టుడే సర్వే వెల్లడించింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పోర్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సహజ వనరులను వినియోగించుకుంటూ మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రామాయపట్నం పోర్టుతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, మచిలీపట్నంతో కృష్ణా, ఎన్టీఆర్, మూలపేటతో శ్రీకాకుళం జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా 50,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాతే సీఎం జగన్ పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన మరుసటి రోజునుంచే పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్నది సీఎం ఆకాంక్ష. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి వ్యయం తగ్గించడమే లక్ష్యం పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. లాజిస్టిక్ వ్యయం తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేవిధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. యూరోప్‌లోని రోస్టర్ డ్యామ్, జపాన్‌లోని యకహోమా తరహాలో పోర్టు నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ఇన్లాండ్ వాటర్‌వేస్, గ్యాస్, రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటివల్ల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గుతుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంవోయూల కంటే ఎక్కువగా మూడు పారిశ్రామిక కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను ఏడీబీ, నికిడిక్ట్ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను ఏకకాలంలో నిర్మిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెంది రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న రూ.13.11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్, వీసీఎండీ ఏపీఐఐసీ, సీఈవో ఏపీ మారిటైమ్ బోర్డు. -
విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ డేటా సెంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డేటా సెంటర్, ఐటీ పార్కుల అభివృద్ధి కోసం అదానీ గ్రూపు రూ.21,844 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ ఐటీ పార్కు, స్కిల్ కాలేజీ, రిక్రియేషన్ సెంటర్లను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో కాపులుప్పాడ వద్ద ఎకరం కోటి రూపాయలు చొప్పున 190.29 ఎకరాలను కేటాయించింది. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 39,815 మందికి ఉపాధి లభించనుంది. తొలుత 130 ఎకరాల్లో 200 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఈ సంస్థ ఆ తర్వాత మరో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. దీంతో మరో 60.29 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపు విశాఖ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటుచేసింది. మే 3న అదానీ గ్రూపు అధికారుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డేటా సెంటర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఏడేళ్లలో 39,815 మందికి ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన ఆధారంగానే రాయితీలు, ప్రోత్సాహకాలను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీటీపీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఐదు దశల్లో ప్రాజెక్టును ఏడు సంవత్సరాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా 39,815 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని వీటిపీఎల్ సమర్పించిన ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొంది. తొలిదశ మూడేళ్ల కాలంలో కనీసం 40 మోగావాట్ల డేటా సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 30 శాతం మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. నాలుగేళ్లల్లో 50 శాతం మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఏడేళ్లలో పూర్తిగా అందరికీ ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 300 మోగావాట్ల డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 1,860 మందికి ఉపాధి లభించనుండగా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా 32,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. అలాగే, స్కిల్‌కాలేజీ, రిక్రియేషన్ సెంటర్స్ ద్వారా మరో 3,000 మంది వరకు ఉపాధి లభించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత కేటాయించిన 130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్‌కు, ఐటీ బిజినెస్ పార్కుకు 28 ఎకరాలు, స్కిల్ కేలాజీకి 11 ఎకరాలు, రిక్రియేషన్ సెంటర్‌కు 9 ఎకరాలను కేటాయించింది. -
పనులు ప్రారంభిస్తే అదనపు రాయితీలు
సాక్షి, అమరావతి: కేవలం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఒప్పందాలను త్వరగా వాస్తవరూపంలోకి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున్న ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల కోసం 2023–27 నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేకంగా ఎర్లీబర్డ్ ప్రాజెక్టŠస్ పేరుతో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సదస్సులో మొత్తం 386 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా వీటిద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు.. 6,07,383 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇంత భారీస్థాయిలో ఉపాధి లభించే అవకాశం ఉండటంతో ఈప్రాజెక్టులకు త్వరితగతిన అన్ని అనుమతులూ మంజూరు చేస్తూ పనులు మొదలుపెట్టేలా చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇప్పటికే 17 మంది సభ్యులతో ఒక మనాటరింగ్ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆర్నెలల్లో మొదలు పెడితే ప్రోత్సాహకాలు విశాఖ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తేదీ నుంచి ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎర్లీబర్డ్ కింద పలు ప్రోత్సాహకాలను నూతన పారిశ్రామిక విధానం–2023–27లో పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాలతో పాటు ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి అదనపు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్, 100 శాతం లాండ్ కన్వర్షన్ చార్జీల రీఎంబర్స్ చేయనున్నారు. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో వాటితో సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి స్థానిక ఉపాధితో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ప్రతిపాదించినట్లు పాలసీలో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులను ఈ పెట్టుబడుల ద్వారా వినియోగించుకోనున్నారు. మధ్య తరహా, లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పాలసీలో పేర్కొన్న రాయితీలకు అదనంగా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పాలసీలో వివరించారు. -
Global Investment Summit: విశాఖ ధగ ధగ
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధుల బృందం: రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా దేశ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు వేదికగా విశాఖ సిద్ధమైంది. పారిశ్రామిక అభివృద్ధికి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవికతకు దగ్గరగా జరగబోతున్న ఈ సదస్సు కోసం ప్రపంచ వాణిజ్యవేత్తలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. నేటి ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు 14 రంగాల్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం ► రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ► రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేస్తోంది. ► ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. ► సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్ అవుట్ బిజినెస్ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ సౌకర్యం కల్పించారు. ► సభా ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్ ఉంటాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన కార్యాలయ నమూనా, లేపాక్షి హస్త కళా ప్రదర్శన స్టాల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏరోస్పేస్, మారిటైమ్ బోర్డు, కియా మోటర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తదితర పరిశ్రమలకు చెందిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దారులన్నీ.. వైజాగ్ వైపే.. ► వేదికకు ఎదురుగా ఏయూకు చెందిన మరో 25 ఎకరాల మైదానాన్ని పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, కేంద్ర మంత్రులు 25కు పైగా ఛార్టర్డ్ ఫ్లైట్స్‌లో రానున్నారు. వాటికి విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తొలిరోజు రాతిర సాగరతీరం సమీపంలోని వుడాపార్క్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 500 డ్రోన్లతో లేజర్ ప్రదర్శన ద్వారా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం ముఖాముఖి తొలిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు 21 మంది కార్పొరేట్ ప్రముఖులు ప్రసంగించనున్నారు. 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను సీఎం కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం వైఎస్ జగన్.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, కేఎం బిర్లా, కరణ్ అదానీ, అర్జున్ ఒబెరాయ్, సంజీవ్ బజాజ్, ఎబర్‌హార్డ్, నవీన్ జిందాల్, సుమిత్ బిదానీ తదితరులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వారికి స్వయంగా వివరించనున్నారు. రెండో రోజు శనివారం ఉదయం 9.15 నుంచి 10.45 గంటల వరకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఉదయం ఎంవోయూల అనంతరం ముగింపు సమావేశంలో 10 మందికిపైగా కార్పొరేట్ ప్రముఖులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉత్పత్తికి సిద్ధమైన పలు యూనిట్లను ముఖ్యమంత్రి జీఐఎస్ వేదిక నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం సాక్షి, విశాఖపట్నం: ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు స్వాగతం పలికారు. అనంతరం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జీఐఎస్‌తో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (జీఐఎస్)తో రాష్ట్ర ముఖచిత్రం మారనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటివరకు 25 దేశాలకు చెందిన 7,500 మంది పారిశ్రామిక దిగ్గజాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, అదానీ, టాటా, బిర్లా, జీఎంసీ గ్రూపుల అధినేతలు కూడా హాజరుకానున్నారని వెల్లడించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సుతో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘమైన తీరప్రాంతం, విశాఖ వంటి ప్రశాంతమైన నగరం, అందుబాటులో ఉన్న యువత వంటి అంశాలు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా చేస్తాయని వివరించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ఏపీతో ఎంతో లాభం
సాక్షి, అమరావతి: విశాఖలో వచ్చే నెల 3, 4వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)–2023 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న వసతులు, పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇన్వెస్టర్లకు వివరించింది. ఏకంగా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు.. సహజ వనరులను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గనుందన్న విషయాన్ని జీఐఎస్‌లో ప్రధానంగా వివరించనుంది. మలేషియా, సింగపూర్ వంటి తూర్పు దేశాలకు ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత సమీపంగా ఉండటంతో తీర ప్రాంత వ్యాపార అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశాఖలో మేజర్ పోర్టుతో పాటు గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ క్యాపిటివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టుతో కలిపి మొత్తం ఆరు పోర్టులు నిర్వహణలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా సుమారు రూ.30,000 కోట్లతో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. రామయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పోర్టుల నిర్మాణం చేపట్టగా, కాకినాడ గేట్‌వే పోర్టు పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరో పోర్టు నిర్మాణం చేపడుతోంది. ఈ పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయడమే కాకుండా పోర్టు సమీపంలోనే పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఆరు ఎయిర్‌పోర్టులు.. గన్నవరం, విశాఖ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతిలకు అదనంగా భోగాపురం, రామాయపట్నం ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పూనుకుంది. తద్వారా వేగంగా ఎగుమతులు, దిగుమతులతో పాటు లాజిస్టిక్ వ్యయాలు భారీగా తగ్గనున్నాయి. చౌక ధరలకే వేల ఎకరాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత చౌకగా వేలాది ఎకరాల భూములు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఈ మూడు కారిడార్లలో పలు చోట్ల ప్రభుత్వం అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈ కారిడార్ల పరిధిలో 46,555 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలో అచ్యుతాపురం, నక్కపల్లి, కడప, చిత్తూరు నోడ్స్ను అభివృద్ధి చేస్తుండగా, చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద, బెంగళూరు–హైదరాబాద్ కారిడార్ పరిధిలో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన కడప నోడ్‌లో ఎకరం రూ.12 నుంచి రూ.15 లక్షలకే లభిస్తుందనే విషయాన్ని విశాఖ సమ్మిట్‌లో ప్రధానంగా వివరించనుంది. రంగాల వారీగా ప్రత్యేక పాలసీలు రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో 70 శాతం మంది యువతీ యువకులే. అమెరికాలో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 25 శాతం మంది తెలుగు మాట్లాడే వారే. ఈ లెక్కన పుష్కలంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతగా అందుబాటులో ఉన్నాయనేది స్పష్టమవుతోంది. దీనికి తోడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ప్రధానంగా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. 2021–22లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (జీఎస్డీపీ) 11.43 శాతం వృద్ధితో రూ.7,46,913 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 12.78 శాతం వృద్ధి నమోదైంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పరిపాలనను తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2023–28 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంతోపాటు వివిధ రంగాలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. లాజిస్టిక్ పాలసీ 2022–27, రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020–25, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ–22, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020–25, టూరిజం పాలసీ 2020–25, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021–26.. ఇలా అనేక పారిశ్రామిక పాలసీను ప్రవేశపెట్టింది. వీటన్నింటి దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా తగిన రాష్టమని విశాఖ సమ్మిట్‌లో ప్రభుత్వం వివరించనుంది. -
ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలంతా ఆసక్తి చూపారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు’కు సంబంధించి ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో 49 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. వారితోపాటు వివిధ దేశాల అంబాసిడర్లు, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్ ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్న విషయాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రతినిధులకు వివరించారని చెప్పారు. దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వారంతా సుముఖత వ్యక్తం చేశారన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. గతేడాదిలో ఏపీ 19 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించిందని తెలిపారు. నీతి ఆయోగ్ వంటి సంస్థ కూడా రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని అభినందించిందని సీఎం వైఎస్ జగన్ వివిధ దేశాల ప్రతినిధులకు వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలన్నదే ప్రభుత్వ విధానమని వెల్లడించారు. రాష్ట్రంలో 13 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివిధ దేశాల ప్రతినిధులకు వివరించామన్నారు. దేశం మొత్తం మీద 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉండగా.. ఇందులో మూడు కారిడార్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మనకు కలిసివచ్చే అంశమని తెలిపారు. ఇందులో 49 వేల ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశామన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తీసుకుంటున్న చర్యల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించామని చెప్పారు. తిరుపతిలో ఇప్పటికిప్పుడు వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి ఉన్న అవకాశాలు గురించి చెప్పగా వారు అందుకు ఆకర్షితులయ్యారని వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. విశాఖలో మార్చి 3, 4వ తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, అదే నెల 28, 29 తేదీల్లో జరిగే జీ–20 సదస్సులు రాష్ట్ర భవిష్యత్‌ను మార్చే వేదికలు కాబోతున్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకొచ్చినా మౌలిక సదుపాయాలతోపాటు అనుమతుల మంజూరులో ప్రభుత్వం సరళంగా వ్యవహరిస్తుందని చెప్పారు. లోకేశ్‌ను చూస్తే జాలేస్తోంది.. లోకేశ్‌ను చూస్తే తనకు జాలేస్తోందన్నారు. చంద్రబాబు తప్ప ఆయన కుటుంబ సభ్యులంతా లోకేష్‌ను నాయకుడిగా చూడాలనుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు మాత్రం ఈ ఆలోచన లేదని చెప్పారు. కొడుకును నాయకుడిగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఆయనకు ఉంటే.. లోకేశ్ చేపట్టిన పాదయాత్ర తొలి సభకైనా హాజరయ్యేవారన్నారు. అధికారం విషయంలో చంద్రబాబుకు కొడుకైనా, మామైనా ఒకటేనని తెలిపారు. పవన్ కల్యాణ్‌కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. ఏ రాజకీయ పార్టీ అధినాయకుడైనా తన పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలని భావిస్తారని, అలాగే అన్ని సీట్లకు పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని చెప్పారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం 25 నుంచి 30 సీట్లకు బేరం ఆడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాపులను చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. రాజు ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని.. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి రాజు అని, రాజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పాలన చేస్తే అదే రాజధాని అవుతుందన్నారు. దీనిపై చర్చ అవసరం లేదన్నారు. గతంలో రాజ్యసభలో కేంద్రం.. రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్రాలకే ఉంటుందని పేర్కొన్న విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయన్నారు. ప్రొసీజర్ ప్రకారమే ముఖ్యమంత్రి విశాఖకు వస్తారన్నారు. వివిధ శాఖల కార్యాలయాలకు భవనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు అది ఫోన్ ట్యాపింగో.. రికార్డింగో తేలాల్సి ఉందన్నారు. -
CM Jagan: పెట్టుబడులతో రండి
విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా. విశాఖలో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని మీ అందరినీ కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఏపీలో పరిశ్రమల స్థాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వివిధ దేశాల దౌత్యాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతోపాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్ సన్నాహక సదస్సుకు హాజరయ్యారు. అత్యుత్తమ సౌకర్యాలు ‘విశాఖపట్నంలో మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటులో మీకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. ఏ పారిశ్రామికవేత్తకైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని కూడా హామీ ఇస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రారంభోపన్యాసంతో పాటు సదస్సు చివరలో ఏపీలో పెట్టుబడులకు గల సానుకూలతలను సీఎం వివరించారు. ‘విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నా. విశాఖలో పెట్టుబడులకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సమ్మిట్‌కు హాజరు కావాలని మీ అందరినీ వ్యక్తిగతంగా కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి’ అని సీఎం జగన్ సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్, అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ అధికారులు జవహర్ రెడ్డి, కరికాలవలవన్, సృజన శరవేగంగా అనుమతులు.. చౌకగా సదుపాయాలు పరిశ్రమలకు అనుమతుల విషయంలో రాష్ట్రంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం అమలులో ఉందని సీఎం జగన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని, శరవేగంగా అనుమతులివ్వడం ద్వారా పారిశ్రామికవేత్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అనుకూలంగా ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీటి సదుపాయం లాంటివి దేశంలో మిగిలిన ప్రాంతాల సగటు కంటే చాలా తక్కువగా, సరసమైన ధరలకే అందిస్తున్నట్లు వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో ఏపీలో పుష్కలమైన వనరులు ఉన్నాయని, 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 14,680 మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు జరిగాయని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి ఏపీలో వివిధ రంగాల్లో ఉన్న అపార అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ రూపొందించిన వీడియోను సదస్సులో ప్రదర్శించారు. ఏపీలో అనుకూలతలు ఇవీ.. పెట్టుబడులకు ఆంధ్రపదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవని సన్నాహక సదస్సులో సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా అపార పెట్టుబడుల అవకాశాలను సోదాహరణంగా ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి మీరే (ప్రతినిధులు) ఇంతకుముందు చెప్పారని గుర్తు చేస్తూ పెట్టుబడులతో ముందుకొచ్చేవారికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలియచేశారు. 11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, అగ్రగామిగా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ దేశంలోనే నంబర్‌వన్ స్ధానంలో ఉంది. పరిశ్రమల స్ధాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తోనే నెంబర్‌వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. తద్వారా పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందో స్పష్టమవుతోంది. ► రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక వేత్తలకు ఏ స్ధాయిలో ప్రోత్సాహం ఇస్తున్నామో తెలియచేసేందుకు ఇదే నిదర్శనం. ► రాష్ట్రంలో 48 రకాల ఖనిజాల లభ్యత ఉంది. ఇవన్నీ వివిధ ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉన్నాయి. ► రాష్ట్రంలో పలు ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లున్నాయి. వీటిలో ప్రధానంగా టాయ్ క్లస్టర్లు, పుడ్ ప్రాసెసింగ్, టెక్ట్స్‌టైల్, సిమెంట్ క్లస్టర్లు, మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ► ఏపీ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. పరిపాలనపరమైన విషయాల్లో కూడా మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఏపీని మన రాష్టంగా భావించండి. ► అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూటర్ అవార్డు (పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్) ఈటీ–2022, బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఎనర్షియా అవార్డు– 2022, క్రాప్ అచీవర్ అండ్ లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్ 2022 రిపోర్ట్) తదితర అవార్డులు ఏపీకి లభించాయి. ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వెల్లడిస్తున్నాయి. -
సీఎం జగన్‌ను కలిసిన జోయాలుక్కాస్ చైర్మన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ అలుక్కాస్ వర్గిస్ జాయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా వర్గిస్ జాయ్‌తో స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్.. జోయాలుక్కాస్ చైర్మన్‌కు వివరించారు. ఈ సమావేశంలో జోయాలుక్కాస్ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్‌లు సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు భేష్! -
ఐటీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇన్ఫినిటీ వైజాగ్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంతోపాటు పలు ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రెండురోజుల ‘ఇన్ఫినిటీ వైజాగ్’ సదస్సు శుక్రవారం ప్రారంభం కానుంది. ఐటీ పెట్టుబడుల ప్రధాన ఆకర్షణగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాల వైపు ఐటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వైజాగ్‌లో ఉన్న మెరుగైన అవకాశాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ వర్చువల్‌గా ప్రారంభించే ఈ సదస్సులో రెండోరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొంటారు. సైయంట్ ఫౌండర్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ సదస్సుకు కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి అఖిలేష్‌కుమార్ శర్మ, ఎస్టీపీఐ డైరెక్టర్ అరవింద్‌కుమార్, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు, యూనికార్న్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. బాస్, టెక్‌మహీంద్రా, మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సైబర్ సెక్యూరిటీ, ఐశాట్ మొదలైన 20కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, ప్రయోజనాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ కోసరాజు శ్రీధర్ తెలిపారు. ఐటీ సంస్థలకు 21 అవార్డులు అందిస్తున్న ఎస్టీపీఐ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న ఐటీ కంపెనీలకు సదస్సు తొలిరోజు ఎస్టీపీఐ అవార్డులు ఇవ్వనుంది. ఐటీ రంగంలో అత్యుత్తుమ ఎగుమతులు నమోదు చేసిన కంపెనీ, అత్యధికమందికి ఉపాధి కల్పించిన కంపెనీ, అత్యధిక మహిళలకు ఉపాధి కల్పించిన సంస్థ, ఐటీ ఎమర్జింగ్ సిటీస్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ వంటి 21 విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. సరికొత్త ఆవిష్కరణలు నమోదు చేసిన స్టార్టప్‌కు రూ.లక్ష నగదు పురస్కారంతోపాటు అవార్డు, మెమెంటో ఇవ్వనుంది. ఐటీలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు.. భవిష్యత్తులో ఐటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీని నిలిపేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై రోడ్‌మ్యాప్ రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ 3.0 ఆవిష్కరణలు, డీప్‌టెక్ డొమైన్.. తదితర రంగాల్లో రాష్ట్ర ఐటీ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. దానికనగుణంగా ఈ సదస్సులో కార్యక్రమాలను రూపొందించారు. బిజినెస్ టూ బిజినెస్ (బీటూబీ) నెట్వర్కింగ్ అవకాశాలు సృష్టిసూ మల్టీ నేషనల్ కంపెనీలతో నెట్వర్క్ చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం మొదలైన అంశాలే ముఖ్య అజెండాగా సదస్సు నిర్వహిస్తున్నారు. తొలిరోజు శుక్రవారం ఐటీ, స్టార్టప్‌లపై దృష్టి సారించనున్నారు. రెండోరోజున ఐటీ ఆధారిత పరిశ్రమలు, బీపీవో కంపెనీలపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు పర్యావరణ భాగస్వాములుగా నాస్కామ్, టై ఏపీ చాప్టర్, ఏపీ ఛాంబర్స్, ఏపీ స్టార్టప్స్, ఏ–హబ్ వ్యవహరించనున్నాయి. వివిధ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కలిపి మొత్తం 12 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. చదవండి: 'బంగారు' బాటలో.. చిప్పగిరిలో మొదలైన పుత్తడి వెలికితీత -
AP: పెట్టుబడులపై ఫోకస్
సాక్షి, అమరావతి: కొత్తతరం ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. విశాఖ వేదికగా మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎస్), జీ20 దేశాల సదస్సులు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, పెట్టుబడులను ఆకర్షించడంపై అధికార యంత్రాంగంతో గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, మార్చి 28, 29 తేదీల్లో జీ 20 దేశాల సమావేశాలు విశాఖపట్నంలో జరగనున్నాయి. వాస్తవిక పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ (జీఐఎస్) సదస్సు సాగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా సదస్సులో కార్యక్రమాలను రూపొందించాలన్నారు. కొత్త తరహా ఇంధనాల తయారీతో పాటు ప్రపంచవ్యాప్తంగా నవతరం ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదికగా నిలవాలని, దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఊతం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ దేశాల్లో రోడ్ షోలను నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక పారిశ్రామిక వాడలు, నిర్వహణ తీరును పరిశీలించి అంతకంటే మెరుగ్గా అమలు చేసేలా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఆయా దేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ తీరును పరిశీలించి రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు లక్షల కోట్ల ఒప్పందాలు.. వచ్చింది వేల కోట్లే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. గత సర్కారు హయాంలో 2014 – 19 మధ్య రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగితే వాటిలో 10 శాతం కూడా సాకారం కాలేదని, అనామకులకు సూట్లూబూట్లూ తొడిగి ఒప్పందాలు చేసుకోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అప్పట్లో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చినట్లు వివరించారు. ఇప్పుడు 2019 – 22 మధ్య ఏడాదికి సగటున రూ.15,693 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.1,81,821 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం వీటి పనులు వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చడం ద్వారా 1,40,903 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. సుందర విశాఖ.. శాశ్వత సదుపాయాలు జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రహదారులు, ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డుల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. సుందరీకరణ పనులను కేవలం ఈ సమావేశాల కోసం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ఇటు ఆతిథ్యం.. అటు అవకాశాలు విశాఖ వేదికగా మార్చి 28, 29వ తేదీల్లో జీ 20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 250 మందికిపైగా విదేశీ ప్రతినిధులు, 100 మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వీటికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జీ 20 దేశాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున అతిథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అతిథులందరికీ చక్కటి ఆతిథ్యంతోపాటు రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా మంచి ఏర్పాట్లు చేయాలని, ఆయా చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జీ 20 దేశాల సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఇండస్ట్రీ వస్తుంటే ‘ఈనాడు’ ఏడుపు!
సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధి కల్పించేలా ఒక కొత్త పరిశ్రమ వస్తుంటే ‘ఈనాడు’కు ఏడుపు ముంచుకొస్తోంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ మైలేజీ ఇంకా పెరిగిపోతోందోనని ఆందోళన చెందుతోంది. ఉన్నవి లేనివి అన్నీ కలిపి.. టన్నులకొద్దీ బురదజల్లుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఏదైనా ఇండస్ట్రీ రాకపోతే ఏడవడం మామూలే అనుకుంటే.. ఎంతో మందికి ఉపకరించే పరిశ్రమ మన రాష్ట్రంలో వెలుస్తోందంటే ఎందుకు ఏడుస్తున్నట్లు? ఎవరి కోసం ఏడుస్తున్నట్లో ఇట్టే అర్థమవుతోంది. ఇండస్ట్రియల్ హబ్ పేరుతో షిర్డిసాయి ఎలక్ట్రికల్ అనుబంధ కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా రావూరు, చేవూరు గ్రామాల్లోని 4,827.04 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టేస్తోందని మంగళవారం ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కింది. షిర్డి సాయి ఏ విధంగా చిన్న సంస్థ? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ)కు అర్హత సాధించిన కంపెనీ. ఆర్థిక స్థితిగతులు, కంపెనీ పనితీరు, సామర్థ్యం చూశాకే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఇలాంటి కంపెనీని పట్టుకుని ‘ఈనాడు’ విషం కక్కడం దుర్మార్గం. కేవలం కడపకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చెందిన సంస్థ కావడమే పాపమైపోయింది. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను ఎంవీవీఎస్ మూర్తి ఆక్రమించినప్పుడు ఏనాడైనా ఈనాడు ఇలాంటి కథనం రాసిందా? ‘షిర్డిసాయికి 4,827 ఎకరాలు’ శీర్షికన ప్రచురించిన ఈనాడు కథనంలో అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : సీఎంకు సన్నిహితుడైన వ్యక్తికి చెందినది.. వాస్తవం : ఈ కంపెనీ కోసం ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు చాలా ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుతం పరిశ్రమల కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్న ప్రస్తుత వాతావరణంలో ఇలాంటి కంపెనీలు వస్తున్నాయంటే రెడ్ కార్పెట్ పరుస్తారు. అలాంటివేమీ అవసరం లేకుండానే వెనకబడ్డ రామాయపట్నం లాంటి ప్రాంతంలో కంపెనీ పెట్టడానికి ముందుకొచ్చింది. గతంలో కియా సంస్థకు ఇచ్చిన స్థాయిలో కూడా ఇండోసోల్‌కు రాయితీలు ఇవ్వలేదు. భూమి, కరెంట్, ఎస్జీఎస్టీ, మౌలిక సౌకర్యాల విషయంలోనూ కియా కంటే తక్కువ ప్రోత్సాహకాలే ఇచ్చారు. ఈ స్థాయిలో ఏ కంపెనీ వచ్చినా ఏ ప్రభుత్వమైనా సహకరిస్తుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుండటం. ఆరోపణ: హైదరాబాద్‌లో రిజిస్టరైన కంపెనీ వాస్తవం : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉండక్కర్లేదు. ఉదాహరణకు కియా పరిశ్రమనే తీసుకుంటే ఆ సంస్థ మన రాష్ట్రానికి చెందిందా? కియా కోసం యూనిట్ రూ.3 చొప్పున 100 శాతం విద్యుత్‌ను 20 ఏళ్ల పాటు ఇస్తుంది. ఇండోసోల్‌కు మాత్రం 7 సంవత్సరాల పాటు యూనిట్‌కు రూ.4.5 చొప్పున, ఆ తర్వాత 8 సంవత్సరాలకు యూనిట్‌కు రూ.4.5 చొప్పున 40% విద్యుత్‌ను మాత్రమే కేటాయించారు. సొంత విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు (క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను) స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం ఇండోసాల్ తన సొంత ఖర్చుతో 7.2 గిగా వాట్స్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించింది. కియాకు ఎకరా రూ.6 లక్షలతో మాత్రమే సేకరించే అవకాశం ఇచ్చింది. పైగా భూమిని చదును చేసే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఆరోపణ: అప్పనంగా భూములు కట్టబెట్టేస్తోంది.. వాస్తవం : ఈనాడు చెబుతున్నట్టుగా 4,827 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం లేదు. పైగా అవి ప్రభుత్వ భూములు కావు. రామాయపట్నంలో ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డ్ ద్వారా భూ సేకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో విధానం ప్రకారం భూసేకరణ కయ్యే వ్యయాన్ని పూర్తిగా మార్కెట్ ధర ప్రకారం ఇండోసోల్ కంపెనీయే భరిస్తుంది. అంతే గానీ భూమి కొనుగోలు కోసం ఇండోసోల్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీ ఇవ్వలేదు. ఆరోపణ: కలెక్టర్ లేఖ ఆధారంగా భూ సేకరణ వాస్తవం : దేశంలోనే అతి పెద్ద పీవీ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ కోసం ఈ భూమిని సేకరిస్తున్నారు. ఈ యూనిట్ మొదటి దశకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అర్హత సాధించింది. దాని ప్రకారం జాతీయ ప్రాముఖ్యతను కలిగిన ప్రాజెక్టు కోసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ జరుగుతోంది. ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన భాగాలపై ఆధార పడటాన్ని తగ్గించడం, గ్రామీణ విద్యుదీకరణ కోసం అవసరమైన విధానాలను కేంద్రం రూపొందించింది. ఇండ్రస్టియల్ కారిడార్లు, హబ్‌ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మేరకు అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో భాగం. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా, కేబినెట్ ఆమోదంతో ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు భూ సేకరణ కోసం చర్యలు చేపట్టింది. ఆరోపణ: ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగించలేదు.. వాస్తవం : రాష్ట్రంలోని ప్రముఖ విద్యుత్ ఉప కరణాల తయారీ కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇప్పటికే షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 2,500 మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఇడిఎ) ద్వారా సమీకృత సోలార్ మాడ్యూల్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) బిడ్డింగ్‌లో రిలయన్స్, అదానీలతో పోటీ పడి ఎల్–1గా నిలిచి రూ.1875 కోట్ల రాయితీలను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్ల వ్యవధిలో దశల వారీగా ప్రత్యక్షంగా 11,500 మందికి, పరోక్షంగా దాదాపు 10,000 –11,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా 11,500 మందికి ఉపాధి కల్పిస్తుండటంతో రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జాగ్రత్తగా పరిశీలించాకే ప్రోత్సాహకాలను వర్తింప చేసింది. -
AP: 2022లో పారిశ్రామిక ప్రగతిలో కీలక ఘటనలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికరంగ ప్రగతి 2022 సంవత్సరంలో ఊపందుకుంది. ముఖ్యంగా మే 22 నుంచి 26వ తేదీ వరకు సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటన రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. టాటా, బిర్లా, ఐటీసీ, నాల్కో, ఎన్టీపీసీ, మిథాని, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాయి. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ఏడాది నాలుగుసార్లు సమావేశమై రూ.1,66,919.71 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇందులో రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ రూ.43,143 కోట్లతో సోలార్ ప్యానల్స్ తయారీ, కాకినాడ సెజ్‌లో రూ.1,900 కోట్లతో లైఫిజ్ ఫార్మా యూనిట్, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.386.23 కోట్లతో కాసిస్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్, రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ, రూ.560 కోట్లతో నెల్లూరులో క్రిభ్కో బయో ఇథనాల్, రాష్ట్రంలో వివిధ చోట్ల అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ వంటివి ఉన్నాయి. మే నెలలో సీఎం జగన్ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన సందర్భంగా గ్రీన్ ఎనర్జీలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం ప్రపంచదృష్టిని ఆకర్షించింది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.2,700 కోట్లతో ఏర్పాటు చేసిన క్లోర్ ఆల్కాలిక్ (కాస్టిక్ సోడా) తయారీ యూనిట్‌ను కుమారమంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి ఏప్రిల్ 21న ప్రారంభించారు. జనవరి 12న గుంటూరులో ఐటీసీ వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్, నవంబర్ 11న ఐటీసీకి చెందిన స్పైసెస్ పార్కును సీఎం ప్రారంభించారు. జూన్ 23న తిరుపతిలో టీసీఎల్, ఫాక్స్‌లింక్, సన్నీఆప్టెక్, డిక్సన్ వంటి కంపెనీలను సీఎం ప్రారంభించడం ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించారు. ఆగస్టు 16న జపాన్ టైర్ల దిగ్గజ సంస్థ యకహోమా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.2,200 కోట్లతో ఏర్పాటు చేసిన హాఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన సులభరత వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడో ఏడాది మొదటిస్థానంలో నిలిచింది. విషాద సంఘటన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దుబాయ్ పర్యటనలో రూ.5,100 కోట్ల విలువైన పెట్టుబడులు కుదుర్చుకు వచ్చిన కొద్దిరోజులకే ఫిబ్రవరి 21న హఠాన్మరణం పొందడం రాష్ట్ర పారిశ్రామికరంగాన్ని కుదిపేసింది. అనంతరం మంత్రివర్గ విస్తరణలో పరిశ్రమలశాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. -
పెట్టుబడుల్లో ఫస్ట్.. దేశంలోనే మొదటి స్థానం
సాక్షి, అమరావతి: ప్రచార ఆర్భాటాలు, దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏపీలో రూ.44,286 కోట్ల విలువైన పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా వాస్తవ రూపంలోకి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాల్లో వెల్లడించింది. వీటి ద్వారా మొత్తం 70,000 మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.1,99,399 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇందులో 20 శాతం పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2020 నుంచి 129 యూనిట్లలో ఉత్పత్తి రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్పత్తిని ప్రారంభించిన ప్రముఖ కంపెనీల్లో ఏటీజీ టైర్స్, నాట్కో ఫార్మా, గ్రీన్కో సోలార్, ఇసుజు, ఇండస్ కాఫీ, రుచి సోయా, సెంబ్‌కార్ప్, కోరమాండల్, ప్రీమియం ఎలక్ట్రిక్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్, విష్ణు బేరియం తదిరాలున్నాయి. ఇక 2020 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో 129 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.64,476 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా మరో రూ.13,516 కోట్ల పెట్టుబడులు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 37 యూనిట్లు నిర్మాణ పనులను ప్రారంభించాయి. వీటి ద్వారా మరో రూ.13,516 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 143 కొత్త యూనిట్లు రాష్ట్రంలో నిర్మాణ పనులు ప్రారంభించగా వీటిద్వారా మొత్తం రూ.32,616 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించిన కంపెనీల్లో గ్రాసిమ్, సెంచురీ ప్లే, మునోత్ ఇండ్రస్టీస్, టీటీఈ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ, బ్లూస్టార్, హావెల్స్ లాంటి సంస్థలున్నాయి. సింగిల్ విండోలో అనుమతులు.. ముఖ్యమంత్రి జగన్ పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభం వరకు సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు మంజూరు చేయడం ద్వారా చేయూత అందిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కార్పొరేట్ దిగ్గజ సంస్థలు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందిస్తున్నాయని గుర్తు చేశారు. పరిశ్రమలకు పూర్తి స్థాయి మద్దతు అందిస్తుండటం వల్లే వరుసగా మూడో ఏడాదీ సర్వే ద్వారా ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో 10.04 లక్షల మందికి ఉపాధి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో మూడున్నరేళ్లల్లో 1,08,206 యూనిట్లు ఏర్పాటు కావడం ఇందుకు నిదర్శనం. వీటి ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 10,04,555 మందికి ఉపాధి లభించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ ఏడాది రాయితీలను అదే సంవత్సరం చెల్లిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1,144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను చెల్లించింది. లాక్‌డౌన్‌తో పూర్తిగా వ్యాపారాలు నిలిచిపోయి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని ఫ్యాప్సియా ప్రెసిడెంట్ మురళీకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్ల రాయితీలను అందచేసింది. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన! రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న రెండు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ నెలకొల్పే డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ నెలకొల్పే సౌర విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఇన్ఫినిటీ వైజాగ్.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ సమ్మిట్
సాక్షి,అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)తో కలిసి ‘ఇన్ఫినిటీ వైజాగ్’ పేరుతో విశాఖ వేదికగా 20, 21 తేదీల్లో సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యంగా విశాఖను ఇండస్ట్రీ 4 టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’తో చెప్పారు. బీమా, లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్, వంటి రంగాల్లో పెట్టుబడులకు విశాఖ ఎంతటి అనువైన ప్రదేశమో ఈ సమ్మిట్ ద్వారా వివరిస్తామన్నారు. ఈ సదస్సు విజయవంతంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్, టెక్‌మహీంద్రా, జాన్సన్ అండ్ జాన్సన్, ఇండియన్ సొసైటీ ఫర్ అసెంబ్లీ టెక్నాలజీ(ఐశాట్), విప్రో, బోష్, సీమెన్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి చంద్రశేఖరన్ ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీధర్ చెప్పారు. సదస్సు సందర్భంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన కంపెనీలకు ఎస్టీపీఐ అవార్డులతో పాటు స్టార్టప్‌లకు అవార్డులు అందిస్తున్నట్టు వెల్లడించారు. -
వైజాగ్ టెక్ సమ్మిట్ 2023కు కేంద్రం మద్దతు
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైజాగ్ టెక్ సమ్మిట్ 2023కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 16–17 తేదీల్లో జరిగే సమ్మిట్‌కు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చినట్లు సమ్మిట్ నిర్వాహకులు పరల్స్ గ్రూప్ సీఈవో శ్రీనుబాబు గేదెల ప్రకటించారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో నిర్మలా సీతారామన్‌ను కలిసి సమ్మిట్ వివరాలను తెలియచేసినట్లు తెలిపారు. జీ20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గ్లోబల్ టెక్ సమ్మిట్ విజయవంతానికి సహకారం అందిస్తామని, సమ్మిట్ ద్వారా జీ–20 విజన్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరినట్లు శ్రీనుబాబు తెలిపారు. జీ20 సదస్సులకు మద్దతుగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో గ్లోబల్ టెక్ సమ్మిట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మిట్ ద్వారా రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. -
పెట్టుబడులపై పచ్చ మంట.. రామోజీ ప్రతి రాతలో అదే బాధ!
సాక్షి, అమరావతి: కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఈనాడు, ఇతర పచ్చ మీడియా పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. పచ్చి నిజాలను సైతం వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తూ టీడీపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి విఫలయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై బురదచల్లడంతో పాటు పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయంటూ గోల చేస్తున్నాయి. తాజాగా అమరరాజా కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటూ తప్పుడు ప్రచారాన్ని ఎత్తుకున్నాయి. రామోజీరావుకు అత్యంత సన్నిహితుడైన గల్లా రామచంద్రనాయుడు కుమారుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన ఈ పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోమని మాత్రమే ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిశ్రమను మూసేయమని చెప్పలేదు. ఇప్పటికీ ఈ పరిశ్రమ రాష్ట్రంలో చక్కగా కొనసాగుతోంది. అసలే టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగానే మరో రాష్ట్రంలో ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఎక్కడున్నట్లు? ‘ఇలాగైతే రామోజీ రావు కూడా వేరే రాష్ట్రాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాగని ఈ రాష్ట్రంపై వ్యతిరేకత ఉందని భావించాలా?’ అని పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు విస్తుపోతున్నారు. మీ బాబు ఆ కూర్చీలో లేరన్నదే మీ బాధ! ► చంద్రబాబు సీఎం కుర్చీలో లేరన్న బాధ రామోజీ ప్రతి రాతలో కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరుతో విశాఖలో జరిపిన భూ దోపిడీకి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీన్ని తట్టుకోలేని రామోజీ ప్రతి రోజూ తన పత్రిక ద్వారా పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ విషం కక్కిస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ బీచ్ ఎదురుగా ఉన్న రూ.679.50 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ పేరుతో లూలూ గ్రూపుకు కట్టబెట్టారు. ఇంత విలువైన భూమిని అంత తక్కువ ధరకు ఎందుకు లీజుకిచ్చావు.. అని నామామాత్రంగా అయినా ప్రశ్నించే ధైర్యం రామోజీ చేయలేదు. పైగా 2017లో లీజు తీసుకున్ను లూలూ సంస్థ 2019 నవంబర్ వరకు ఒక్క రూపాయి కూడా లీజు చెల్లించలేదు. ► అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో ఈ ప్రభుత్వమే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసి, వందల కోట్ల విలువైన భూమిని కాపాడింది. దీన్ని స్వాగతించకపోగా లూలూ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ శోకాలు పెట్టడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 13.59 ఎకరాల భూమి ఏపీఐఐసీ వద్ద భద్రంగా ఉంది. అదనపు పెట్టుబడులు కనిపించవా? ► అదానీ గ్రూపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడులు పెడుతుండటమే కాకుండా వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చే 30 ఏళ్లల్లో రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా అదానీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విశాఖలోని కాపులుప్పాడలో 400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో వాస్తవంగా పెట్టే పెట్టుబడి వివరాలను అడిగితే అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు పంపడం.. ఆ మేరకు 130 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ పెట్టుబడి వల్ల 24,990 మందికి ఉపాధి లభించనుంది. ఈ డేటా సెంటర్ పనులకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. మరో రూ.15,376 కోట్లతో 3,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా మరో నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా పోర్టుల ఏర్పాటు ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఈ లెక్కన ఇప్పటికే 40–50 వేల కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే ఈ స్థాయిలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు ఎందుకు పెడుతుంది? రిలయన్స్‌కు వివాదాస్పద భూములు ► ఏదైనా ఒక సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఏ ప్రభుత్వమైనా వివాదాలు లేని భూమిని ఇస్తాయి. కానీ దీనికి భిన్నంగా సెట్‌టాప్ బ్యాక్స్‌ల తయారీ కోసం ముందుకొచ్చిన రిలయన్స్‌కు తిరుపతి వద్ద వివాదాస్పద భూమిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టింది. ► ఈ భూ కేటాయింపుపై 15 మందికి పైగా రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో రిలయన్స్ ఛాలెంజింగ్‌గా తీసుకువస్తున్న జీయో నెట్ వర్క్ కోసం ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అది వివాదాస్పద భూమి కావడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. దీంతో రిలయన్స్ సెట్‌టాప్స్ బాక్స్‌ల తయారీని థర్డ్ పార్టీకి ఇచ్చేసి, తన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ వేరే చోట వివాదం లేని భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చినా, రిలయన్స్ తన ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రామోజీ స్వయంగా అంగీకరిస్తూనే తెలివిగా ఈ తప్పును జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మీదకు నెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని ఏమనాలి? ఫ్రాంక్లిన్ పరిస్థితి తెలియదా? ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా భారీ డెట్ స్కాంలో ఇరుక్కోవడంతో దాని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు రూ.29,000 కోట్ల విలువైన ఆరు డెట్ ఫండ్స్‌ను సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో ఒకానొక దశలో పూర్తిగా ఇండియా కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీంతో ఇండియాలో విస్తరణ కార్యక్రమాలను నిలిపివేసింది. ► ఈ తప్పును కూడా ఈ ప్రభుత్వం మెడకు చుట్టడానికి ఈనాడు వేస్తున్న కుప్పిగంతులు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురంలో కియా వెళ్లకుండా అక్కడే మరో రూ.400 కోట్లతో విస్తరణ చేపడుతున్నట్లు ఆ సంస్థ ఎండీనే స్వయంగా ప్రకటించినా తప్పుడు రాతలు మానలేదు. మీ రాతలే నిజమైతే ఇవెలా సాధ్యం రామోజీ? ► గతంలో చంద్రబాబు హయాంలో సంస్కరణలు అమలు చేస్తున్నాం.. అంటూ ఇచ్చిన జీవోల ఆధారంగా సులభతర వాణిజ్య ర్యాంకులు ప్రకటించేవారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటి ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది? ఈ ఒక్క ఉదాహరణ చాలు పచ్చపత్రికలు ఎలా విషాన్ని వండి వారుస్తున్నాయో చెప్పడానికి. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసిన మాట వాస్తవం కాదా? 2019–20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం కాదా? ► ఎగుమతుల విషయంలో 2020లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2021లో తొమ్మిద స్థానానికి అధిగమించింది. ఎగుమతుల ద్వారా 2021లో దేశ జీడీపీలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో 50.85 శాతం వాటాతో గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా? ► లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)రిపోర్ట్ 2022లో ఆంధ్రప్రదేశ్ అచీవర్‌గా మొదటి స్థానంలో నిలిచిన మాటా వాస్తవం కాదా? దేశంలో తయారీ రంగంలో పెట్టబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న డీపీఐఐటీ 2021 టాప్10 రీజియన్స్‌లో చిత్తూరు–నెల్లూరు రీజియన్ దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానం దక్కించుకుంది. ► బాబు హయాంలో రూ.3,675 కోట్ల పారిశ్రామిక రాయితీలను బకాయి పెట్టిన మాట వాస్తవం కాదా? 2017–18 నుంచి 2019–20 వరకు అయిదు శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021–22లో 12.78 శాతం నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా? ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,715 కోట్ల పారిశ్రామిక రాయితీలు, రూ.1,143.83 కోట్ల విద్యుత్ రాయితీల ప్రయోజనం అందించడం ద్వారా ప్రగతి తిరిగి పట్టాలెక్కింది. ఈ మూడున్నరేళ్లలో 108 భారీ, 1,08,206 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం ద్వారా రూ.74,481.81 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 10.75 లక్షల మందికి ఉపాధి లభించింది. ► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే, కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి. ‘వాస్తవాలకు మసి పూస్తాం.. ఎలా కడుక్కుంటారన్నది మీ ఇష్టం.. మా చంద్రబాబు తిరిగి గద్దెనెక్కే వరకు ఇదే మా విధానం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చినా, వాటి గురించి మేం రాయం.. మాట్లాడం. అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని మేము ఎందుకు రాస్తాం? రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లిపోతోందనే మాత్రమే రాస్తాం. గతంలో కంటే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టినా, వెళ్లిపోయిందనే చెబుతాం. గతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన రిలయన్స్ కంపెనీకి వివాదాల్లో ఉన్న భూములు ఇచ్చినా ఈ ప్రభుత్వందే తప్పు అని ప్రచారం చేస్తాం. విశాఖలో భారీ భూ దోపీడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం రద్దు చేసుకుందని ఎందుకు చెబుతాం? మీ వల్లే లూలూ వెళ్లిపోయిందని చాటుతాం. మీ పరువు, రాష్ట్ర పరువు, నిజానిజాల సంగతి మాకేల? మా బాబు ప్రగతే మాకు ముఖ్యం.’ – కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇదీ పచ్చ పత్రికల వైఖరి -
రాష్ట్రంలో రూ.400 కోట్ల ‘ఇంధన’ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదర్శంగా ఏపీ సిమెంట్, స్టీల్, పవర్ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది. 49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. అదితితో సమన్వయం పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు. -
ఇంధన పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
సాక్షి, విశాఖపట్నం: దేశంలో పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) అశోక్‌కుమార్ చెప్పారు. కేంద్ర విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోని బీఈఈ సహకారంతో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) విశాఖలో బుధవారం పెట్టుబడుల బజార్ పేరిట సదస్సు నిర్వహించింది. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సదస్సుని అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి కనబరిచిన పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గొప్ప విషయమన్నారు. ఇంధన సామర్థ్య రంగంలో జాతీయస్థాయిలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ మొదటి అడుగు వేసిందని, వరుసగా ఇన్వెస్ట్మెంట్ బజార్స్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని ప్రశంసించారు. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి పెట్టుబడుల సదస్సులకు విశేష స్పందన లభించటం బీఈఈకి ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఏపీ ఆదర్శంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇన్వెస్ట్మెంట్ బజార్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంధన సామర్థ్య పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఈíసీఎం ఆధ్వర్యంలో ఆర్థికసంస్థల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికత అమలు చేసే పరిశ్రమలకు 5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం చేసిన ప్రతిపాదన కేంద్ర ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.15 వేలకోట్ల విలువైన ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విధానపరమైన ప్రమాణాలు రూపొందించడంలో ఏపీఎస్ఈíసీఎం ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన చెప్పారు. నిరంతర సరఫరాకు విద్యుత్ వ్యవస్థ బలోపేతం రాష్ట్ర ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తరఫున ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని చెప్పారు. ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పూర్తిస్థాయి సహాయ, సహకారాలందిస్తుందన్నారు. ఇంధన సామర్థ్యం అభివృద్ధితో ఇంధన భద్రత లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వం వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదకారిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీఈపీడీíసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, సూర్యప్రతాప్, పీఎఫ్సీ జనరల్ మేనేజర్ మదన్మోహన్, బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఏసీ.. మేడిన్ ఆంధ్రా
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా మేడిన్ ఆంధ్రా ఏసీలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్ కండిషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలో తయారైందే ఉండనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఏసీ అమ్మకాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌లో తయారైనవే ఉండనున్నాయి. దేశంలోని దిగ్గజ ఏసీ తయారీ సంస్థలు మన రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీం) కింద మార్చినాటికి ఉత్పత్తి ప్రారంభించే విధంగా పనులను వేగంగా చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకిన్ తొలిదశలో ఏటా 10 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా రెండోదశలో మరో 15 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా విస్తరించనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లను పెట్టుబడి పెట్టనుంది. బ్లూస్టార్ ఏటా 12 లక్షల ఏసీలను తయారు చేసే విధంగా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల గృహవినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షల ఏసీలకు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఏసీలో ఒకటి మన రాష్ట్రంలో తయారైందే ఉంటుందని అంచనా. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే 10 వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా. శ్రీసిటీలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్న ఏసీ తయారీ కంపెనీలు, వాటి పెట్టుబడులు (రూ.కోట్లలో) ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రోత్సాహం రాష్ట్రాన్ని ఏసీ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏసీ తయారీలో వినియోగించే ఉపకరణాలను తయారు చేసే ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహిస్తోంది. శ్రీసిటీలో ఏర్పాటవుతున్న ఆరు ఏసీ తయారీ యూనిట్లకు ఉపకరణాలను సరఫరా చేసే ఐదు కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అంతేగాకుండా ఇక్కడ ఏర్పాటవుతున్న యూనిట్లకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యూనిట్లు నిర్మాణ పనులు పూర్తిచేసుకునే సరికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టారు. -
68 ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పర్యాటకరంగం కొత్తపుంతలు తొక్కేలా సరికొత్త ఆలోచనలతో పర్యాటకశాఖ ముందుకెళ్తోంది. పెట్టుబడుల రాకకు ప్రధాన అవరోధాలుగా ఉన్న నియమ నిబంధనలు మార్చి కొత్తదారుల్ని అన్వేషించింది. రాష్ట్రవ్యాప్తంగా 68 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చేందుకు నిబంధనల్ని మరింత సరళతరం చేసింది. కొత్తగా రాబోతున్న ప్రాజెక్టులకు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.70 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులుగా నిర్దేశించింది. వాటర్ స్పోర్ట్స్‌లో బిడ్ వేయాలంటే ఐదేళ్ల అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని ఏడాదికి తగ్గించింది. ఒకవేళ ఆసక్తి ఉండి అనుభవం లేని ఎవరైనా పాల్గొనాలని భావిస్తే కన్సోటియం తీసుకున్నా సరిపోతుంది. టూరిజం ప్రాజెక్టులకు బిడ్ ఫీజును రూ.లక్ష నుంచి రూ.10 వేలకు తగ్గించింది. దీంతోపాటు టెండర్లలో కనీస ఆదాయం వాటా వాటర్ స్పోర్ట్స్‌కు 15 శాతం, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు 25 శాతం, ట్రెక్కింగ్‌కు 10 శాతంగా నిర్ణయించింది. ఇందులో ఎవరు ఎక్కువగా టెండర్లలో కోట్‌చేస్తే వారికి అవకాశం కల్పించేలా నిబంధనల్ని మార్చింది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహిస్తోంది. టూరిజం ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పర్యాటకశాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. -
పారిశ్రామికవేత్తలే ప్రచారకర్తలు
సాక్షి, అమరావతి: సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ సినీ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వారు కోరినంత డబ్బులు చెల్లించి మరీ ప్రచారాన్ని చేపడతాయి. ఇక గత సర్కారు ప్రచార ఆర్భాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంవోయూల పేరుతో మభ్యపుచ్చింది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు ఇలాంటి కృత్రిమ ప్రచారంతో పనిలేదు. వచ్చే ఏడాది మార్చిలో విశాఖ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన దిగ్గజ సంస్థలే ప్రచారకర్తలుగా నిలవనున్నాయి. ఆయా యూనిట్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా పరిశ్రమలు నెలకొల్పిన దిగ్గజాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూతన పెట్టుబడులను రప్పించేందుకు చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలు.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని మెచ్చి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆదిత్య బిర్లా, టాటా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డిక్సన్, సెంచురీ ప్లై, అపాచీ ఫుట్‌వేర్, ఏటీజీ టైర్స్, రామ్‌కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, అరబిందో, బ్లూస్టార్, హావెల్స్ లాంటి పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆదిత్య బిర్లా, ఐటీసీ గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రెండేసి యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి. ఏటీజీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్ లాంటి సంస్థలైతే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్న వేగాన్ని చూసి పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం ఇందుకు తార్కాణం. ఇటీవల రాష్ట్రంలో వివిధ యూనిట్ల ప్రారంభం, శంకుస్థాపన సందర్భంగా ఆయా సంస్థలు ఏమన్నాయో చూద్దాం.. రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏపీ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – బలభద్రపురంలో క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు.. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి 30 సెకన్లు మాత్రమే మాట్లాను. ఎమర్జింగ్ టెక్నాలజీని ఏపీకి తేవడంలో సహకరించాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా మా అబ్బాయి బయోఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహ్వానించారు. ఏపీలో బయో ఇథనాల్ పాలసీ లేదని ఆయన దృష్టికి తేవడంతో యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగిన ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. ఇలా మా అబ్బాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం గర్వకారణంగా ఉంది. – అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ సభలో సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా పెట్టుబడుల ఆకర్షణలో ఫస్ట్ దేశ జీడీపీ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సామాజిక ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను శరవేగంగా ప్రారంభించాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్‌ను ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పరిశీలిస్తుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ఎటువంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. – యడ్లపాడులో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ పార్క్ ప్రారంభోత్సవ సదస్సులో సంస్థ సీఈవో సంజయ్ పూరి అత్యుత్తమ ఈఎంసీ కొప్పర్తి కేవలం తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుంది. ఇక్కడి యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తాం. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారుగా మారింది – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ రూ.6 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు.. తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్లో యూనిట్ నెలకొల్పుతున్నాం. పెట్టుబడుల ప్రతిపాదనలు అందచేసిన రెండు నెలల్లోనే అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేశారు. ప్రభుత్వ సహకారాన్ని చూశాక రూ.6,000 కోట్ల పెట్టుబడులను రూ.26,000 కోట్లకు పెంచాలని నిర్ణయించుకున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక పారిశ్రామికవేత్తల మనోగతమే మాకు బ్రాండింగ్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవసరం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ప్రజాదరణే అతి పెద్ద బ్రాండింగ్. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థల అభిప్రాయాలనే వచ్చే మార్చిలో విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు బ్రాండింగ్‌గా వినియోగించుకుంటాం. 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
వాస్తవ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. విశాఖలో గ్లోబల్ సమ్మిట్
సాక్షి, అమరావతి: వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు– 2023ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి ఎటువంటి పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేకపోయామని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహిస్తున్న తొలి సదస్సు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 వివరాలను తెలియజేయడానికి మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు భిన్నంగా దీనిని నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ వాస్తవ రూపంలోకి వచ్చింది రూ.40,000 కోట్లే అని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి లక్ష్యాలు లేకుండా, వాస్తవంగా రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు సంబంధించి మాత్రమే ఒప్పందం చేసుకుంటామన్నారు. అంతకుముందు సీఎం క్యాంపు కార్యాలయంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్ షన్మోహన్, ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్ కె రవిచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు ఎల్ శ్రీధర్, ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్ ఎస్ నీరజ్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రోడ్‌షోలు రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించుకుంటూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించే విధంగా త్వరలో దేశ, విదేశాల్లో రోడ్‌షోలను నిర్వహించనున్నట్లు మంత్రి అమరనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో విజయవంతంగా పరిశ్రమలు నడుపుతున్న వారు చెబుతున్న అభిప్రాయాలనే బ్రాండింగ్‌గా వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ, ఎరోస్పేస్, మెరైన్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫుట్‌వేర్, పోర్టు ఆధారిత పరిశ్రమలు వంటి రంగాలపై దృష్టి సారిస్తామన్నారు. ఇజ్రాయిల్, తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో రోడ్‌షోలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా దేశ వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో కూడా రోడ్‌షోలను నిర్వహించన్నుట్లు తెలిపారు. ఈ ఇన్వెస్టర్ మీట్‌కు అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిలో భాగంగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2024 జనవరి నాటికి రామయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలతో పోటీ పడి.. దక్కించుకున బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రూ.40,000 కోట్ల పెట్టుబడులు, 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందన్నారు. దావోస్ సదస్సులో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.1.26 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగితే, అప్పుడే అందులో రూ.40,000 కోట్లు వాస్తవ రూపంలోకి వచ్చాయన్నారు. -
తూర్పుగోదావరికి సీఎం జగన్.. పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 10.30 గంటలకు గుమ్మళ్ళదొడ్డి చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 11.40 గంటల వరకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుప్రయాణం అవుతారు. బయో ఇథనాల్‌లో రూ.2,017 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి.అస్సాగోతో పాటు క్రిభ్కో, ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్, ఎకో స్టీల్, సెంటిని, డాల్వకో ట్, ఈఐడీ ప్యారీ వంటి సంస్థలు కలిపి సుమారు రూ.2,017 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. హరిత ఇంధనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా బయో ఇథనాల్ పాలసీని రూపొందిస్తోంది. ఇప్పటికే ముసాయిదా పాలసీ తయారుచేసిన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య కంపెనీల సూచనలు, సలహాలు తీసుకుని త్వరలోనే పాలసీని విడుదల చేయనుంది. దీనిద్వారా బయో ఇథనాల్ తయారీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం ఉంది. -
ఆంధ్రప్రదేశ్‌పై దిగ్గజ కంపెనీల దృష్టి
సాక్షి, అమరావతి: ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటాలు, బిర్లాలు, అదానీ, ఆర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెడుతుంటే టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం పారిశ్రామిక ప్రగతి క్షీణించిందంటూ దుష్ప్రచారం చేయటాన్ని పరిశ్రమల శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో వీసమెత్తు నిజం లేకపోగా పారిశ్రామిక ప్రగతిలో కేంద్రం కంటే రాష్ట్రం మెరుగైన పనితీరు కనపరుస్తోందని స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదన్న ఆరోపణలు అబద్ధమని, రూ.17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయనడం నిరాధారమని పేర్కొంది. కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని పెట్టుబడుల ప్రవాహంతో రాష్ట్రం పరుగులు తీస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంఎస్ఎంఈలు రెట్టింపు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన జూన్ 2019 నుంచి నేటి వరకూ రాష్ట్రానికి 107 మెగా పరిశ్రమలు వచ్చాయి. వీటి ద్వారా రూ. 46,002 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు ఎంఎస్ఎంఈలు రెట్టింపు స్థాయిలో ఏర్పాటయ్యాయి. గత మూడున్నరేళ్లలో 1,06,249 ఎంఎస్ఎంఈలు ఏపీకి రావడం ద్వారా రూ.14,656 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 7,22,092 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా మరో 57 మెగా పరిశ్రమలు పురోగతిలో ఉన్నాయి. వీటి ద్వారా రూ.91,243.13 కోట్ల పెట్టుబడులు, 1,09,307 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలకు చెందిన నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ.1,06,800 కోట్ల పెట్టుబడులతో పాటు 79,200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు రూ.1,73,021.55 కోట్ల పెట్టుబడులు, 1,38,403 మందికి ఉద్యోగాలందించే 45 భారీ పరిశ్రమలకు ఆమోదం తెలిపింది. కియా అదనపు పెట్టుబడులు.. కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ తరలనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీసత్యసాయి జిల్లాలోనే కియా అనుబంధ పరిశ్రమలన్నీ కొలువుదీరాయి. కియా అదనంగా రూ.400 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశాఖ మధురవాడలో శంకుస్థాపన జరగనున్న అదానీ డేటా సెంటర్ (ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ / బిజినెస్ పార్క్) ద్వారా రూ.14,634 కోట్ల పెట్టుబడులు, 24,990 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖ రుషికొండ ఐటీ సెజ్ నుంచి ఏ కంపెనీ తరలిపోలేదు. లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలు రూ.వేల కోట్ల విలువైన భూములను తీసుకుని గడువులోగా పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి వెనక్కు తీసుకుంది. ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్స్ పేపర్ పరిశ్రమ ఒప్పందం సాంకేతిక కారణాలతో రద్దయింది. కొత్తగా మూడు పారిశ్రామిక నగరాలు విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లను తీర్చిదిద్దింది. నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్, ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను కల్పించింది. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులు, 9,030 ఉద్యోగాలను కల్పించింది. అచ్యుతాపురంలో 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు, 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 6,740 ఎకరాలను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేసింది. కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండస్ట్రియల్ పార్కు, ఎంఎస్ఈ సీడీపీ, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రణాళికతో ముందుకెళుతోంది. రూ. 2595.74 కోట్ల నిక్‌డిక్ట్ నిధులతో కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్ అండ్ ప్లే పరిశ్రమల కోసం నాలుగు షెడ్ల నిర్మాణం పూర్తయింది. తద్వారా రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. గత సర్కారు బకాయిలూ చెల్లింపు.. పారదర్శకంగా పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020 – 23 తెచ్చింది. ‘వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం‘ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించింది. గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన రూ.3409 కోట్ల ప్రోత్సాహకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించింది. 11,059 ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి రూ.1324.53 కోట్ల బకాయిలతో పాటు రూ.962.05 కోట్ల బకాయిలు (7,039 ఎంఎస్ఎంఈలకు మంజూరు) కూడా అందచేసింది. 75 భారీ, మెగా యూనిట్లకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.380.85 కోట్ల ప్రోత్సాహకాలను కూడా క్లియర్ చేసింది. వీటిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న 49 టెక్స్టైల్ యూనిట్లకు రూ.242.13 కోట్లు విడుదల చేసింది. కేంద్ర సగటు కంటే అధికంగా.. గత సర్కారు హయాంలో 2018–19లో పరిశ్రమల రంగం జీవీఏ వృద్ధి రేటు (స్థిరమైన ధరల వద్ద) 3.17% మాత్రమే ఉంది. 2020–21లో లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికోత్పత్తి ఆగిపోయింది. ఆ ఏడాది కేంద్రం జీవీఏ –3.33 శాతం నమోదు కాగా రాష్ట్రంలో వృద్ధి రేటు 0.33%గా నమోదైంది. 2021–22లో కేంద్ర పారిశ్రామికోత్పత్తిలో 8% శాతం వృద్ధి నమోదు చేస్తే రాష్ట్రం రెండంకెల వృద్ధి 11% సాధించింది. కోవిడ్ సంక్షోభం వచ్చినా రెండేళ్లు కేంద్ర సగటు కంటే రాష్ట్రం మెరుగైన పనితీరును కనపరచింది. ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక నగరం చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌ను తీర్చిదిద్దుతోంది. తిరుపతి జిల్లాలో 2,500 ఎకరాలలో క్రిస్ సిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం రూ.1,448 కోట్లను వెచ్చిస్తూ టెండర్లను పిలిచింది. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను సాధించడమే కాకుండా ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దావోస్ పర్యటనతో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులు దావోస్ పర్యటనలో అదానీ, అరబిందో, గ్రీన్కో గ్రూప్, ఏస్ అర్బన్ డెవలప్ మెంట్ సంస్థలతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్, సోలార్ పవర్, విండ్ పవర్ ప్రాజెక్టŠస్ నెలకొల్పేలా రూ. 1,26,000 కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి అమలు ద్వారా రాష్ట్ర యువతకు 38 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. -
ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమల సైరన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరో 25 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గత మూడేళ్లలో 107 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వచ్చే మూడు నెలల్లో మరో 25 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం కింద ఏర్పాటైన బ్లూస్టార్, యాంబర్ ఎంటర్‌ప్రైజెస్‌లకు చెందిన ఎయిర్ కండీషనర్స్, దేశంలోనే తొలి లిథియం బ్యాటరీ తయారీ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. రూ.6,700 కోట్లతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన అన్‌రాక్ అల్యూమినియం, కర్నూలు జిల్లాలో రూ.2,938 కోట్లతో ఏర్పాటైన స్టీల్ పరిశ్రమ, అనకాపల్లి జిల్లాలోని రూ.2,000 కోట్లతో స్థాపించిన సెయింట్ గోబిన్, రూ.1,500 కోట్లతో నెలకొల్పిన శారద మెటల్స్ ఫెర్రో అల్లాయిస్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మొత్తం 25 యూనిట్ల ద్వారా రూ.16,148 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపంలోకి రానున్నాయని, వీటి ద్వారా 19,475 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.300 కోట్లతో ఏర్పాటవుతున్న అసాగో బయోఇథనాల్ ప్రాజెక్టుకు శుక్రవారం భూమి పూజ జరగనుంది. వీటితో పాటు త్వరలోనే విశాఖలో రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ సౌర విద్యుత్‌కు చెందిన ఉపకరణాల తయారీ యూనిట్‌కు సంబంధించిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి యూనిట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పెట్టుబడుల ప్రవాహం గత మూడేళ్లలో 107 పెద్ద యూనిట్లు ప్రారంభం కావడం ద్వారా రూ.46,002 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇదే సమయంలో 1,06,249 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 7,22,092 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా మరో రూ.91,243.13 కోట్ల విలువైన 57 ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ పూర్తయితే 1,09,307 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలోకి టాటా, బిర్లా, అదానీ, సంఘ్వీ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, యాసెంచర్ లాంటి ప్రముఖ ఐటీ కంపెనీల యూనిట్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఉత్తుత్తి పెట్టుబడుల ఒప్పందాలు కాకుండా వాస్తవం రూపం దాల్చేలా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
అంతర్జాతీయ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)తో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్న కీలక రంగాలపై భారీ సదస్సులను నిర్వహించనున్నాయి. రాష్ట్రంలో 974 కి.మీ. మేర తీరప్రాంతం ఉండటంతోపాటు ఒకేసారి 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వీటి ఆధారంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా నవంబర్ 18న విశాఖలో మారిటైమ్ సదస్సు నిర్వహించనున్నారు. అలాగే, వ్యవసాయం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ వివరాలను తెలియచేసేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో అగ్రి ఎక్స్పోను నిర్వహించనున్నారు. డిసెంబర్లో ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ అలాగే రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి అనేక ప్రోత్సహకాలిస్తూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏటా రాయితీలు విడుదల చేస్తుండటంతో ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేవిధంగా ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ను డిసెంబర్ మూడో వారంలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చట్టం చేయడమే కాకుండా ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్స్, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ కాలేజీలు, తిరుపతి, చెన్నైలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుండటంతో రాష్ట్రంలోని నైపుణ్యాభివృద్ధిలోని అవకాశాలను వివరించే విధంగా స్కిల్ ఆంధ్రా పేరుతో మరో కాన్క్లేవ్ను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న మారిటైమ్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ వెల్లడించారు. వీటితో పాటు హైదరాబాద్, ముంబై, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్లలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ రోడ్ షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
భారీగా పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశం విజయవంతం అయ్యేందుకు దేశవిదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలతో పాటు తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా/న్యూజిలాండ్, దావోస్‌ల్లో రోడ్‌షోలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. దేశంలో జరిగే రోడ్‌షోల్లో మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొనిసుదీర్ఘ తీరప్రాంతంతో పాటు మూడు పారిశ్రామిక కారిడార్లలో అభివృద్ధిచేస్తున్న పారిశ్రామిక పార్కులు, ప్రభుత్వ కల్పిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడి ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ప్రభుత్వం అందించే హ్యాండ్ హోల్డింగ్ వంటి వివరాలను తెలియజేయనున్నారు. అదే విధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ దేశాలతోపాటు జనవరిలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంను వేదికగా వినియోగించుకోనున్నారు. ఇక అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాయబారులు హాజరయ్యే ఈ సమావేశాలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర అధికార బృందం వెళ్లి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు నిర్వహణ బాధ్యతలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌కు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం.. రోడ్‌షోలను పరిశ్రమల శాఖతో కలిసి ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) నిర్వహించనుంది. రోడ్‌షోల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికను సిద్ధంచేశామని, వచ్చే మూడునెలల్లో వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ఎస్. ప్రసాద్ ‘సాక్షి’కి వివరించారు. సామాజిక మాధ్యమాల వేదికగా.. మరోవైపు.. కేవలం రోడ్‌షోలే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలనూ ప్రచారానికి వినియోగించుకోనున్నారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, యూనిట్లు ఏర్పాటుచేసిన వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. అలాగే, పెట్టుబడుల సదస్సుకు ప్రచారం కల్పించేందుకు వివిధ రాష్ట్రాల పత్రికలు, జాతీయ ఛానల్స్‌లో కూడా ప్రచారం కల్పిస్తారు. -
మత్స్య, ఆక్వా పెట్టుబడుల హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మత్స్య, ఆక్వా రంగాల్లో పెట్టుబడుల హబ్‌గా నిలవబోతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) జాతీయ కమిటీ కో చైర్మన్ అరబింద్దాస్ చెప్పారు. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల్లో అగ్రగామిగా ఏపీని నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సీఐఐ కట్టుబడి ఉందన్నారు. సీఐఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మత్స్య, ఆక్వారంగాల సుస్థిరాభివృద్ధిపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఆక్వారంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఐఐ కృషి చేస్తుందన్నారు. మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నవారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు తీరం వెంబడి పెద్దఎత్తున మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేస్తున్న ప్రభుత్వ తీరు ప్రశంసనీయమన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్‌కు ప్రోత్సాహం ఏపీ మారిటైమ్ బోర్డ్ డిప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ సి.డి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లు, ఇంటిగ్రేటెడ్ సీ పార్కుల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. తీరం వెంబడి చేపల కేజ్ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చేందుకు పరిశీలిస్తోందని చెప్పారు. మత్స్య, ఆక్వారంగాల్లో నైపుణ్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఏపీæ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ఎస్.ఏంజెలి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సీఐఐ రాష్ట్రశాఖ వైస్ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మత్స్య రంగాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి లోతైన, వ్యూహాత్మక ఆలోచన ఉందని చెప్పారు. ఈ రంగంపై ఆధారపడిన వర్గాల జీవనోపాధికి, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగకల్పన, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ తమకు స్ఫూర్తినిస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖతో పాటు ఈ రంగంలోని వాటాదారులందరితో సీఐఐ కలిసి పనిచేస్తుందని చెప్పారు. వాటర్‌బేస్ లిమిటెడ్ సీఈవో రమాకాంత్, డెల్టా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఫిష్ బాస్కెట్‌గా రాష్ట్రం సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా ఫిష్ బాస్కెట్‌గా రాష్ట్రం నిలిచిందన్నారు. హేచరీలు, విత్తన పెంపకం, బ్రూడ్ బ్యాంకులు, బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్లు, న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు, పంట అనంతర నష్టాన్ని తగ్గించడానికి తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. పంటకోతకు ముందు, అనంతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటురంగ పాత్ర చాలా కీలకమన్నారు. సప్లయి చైన్‌ను బలోపేతం చేయడం ద్వారా చేపలు, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. -
ఫిబ్రవరిలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు
దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు వీలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా ‘ప్రపంచ పెట్టుబడుల సదస్సు’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని శనివారం విశాఖపట్నంలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల సదస్సును రెండేళ్ల క్రితమే నిర్వహించాలని భావించినప్పటికీ కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం అనుకూలంగా ఉండడంతో సదస్సును వచ్చే ఏడాది నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడున్న పారిశ్రామికవేత్తలేనని సీఎం చెప్పారని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలన్నా.. రాష్ట్ర భవిష్యత్తు మార్చాలన్నా పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఉందని మంత్రి తెలిపారు. ఇక పరిశ్రమల సమస్యలపై చాంబర్ సభ్యులను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి వాటి పరిష్కరానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు త్వరలో మహిళా పారిశ్రామికవేత్తల పార్కును ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమర్నాథ్ చెప్పారు. డిమాండ్ ఆధారంగా ఇతర జిల్లాల్లో కూడా వీటి ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. సమావేశంలో గౌరవ అతిథి, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగుభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషిచేసిన వారిలో అనేకమంది మహనీయులుంటే.. ఆ జాబితాలో వైఎస్సార్‌తో పాటు ఆయన తనయుడు, సీఎం జగన్మోహన్రెడ్డి కూడా ఉన్నారన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, పరిశ్రమలకు వారథిగా వాణిజ్య మండలి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు (ఎలక్టెడ్) భాస్కరరావు వివరించారు. చిన్న పరిశ్రమలపై అధిక భారం పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం మరింత సహాయం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కోశాధికారి ఎస్.అక్కయనాయుడు, పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
సంపన్న తీర హారం!
బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి మళ్లీ మీ జిల్లాకు (కృష్ణా) వస్తా. దశాబ్దాల కలలు త్వరలోనే సాకారం కానున్నాయి. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. – ఇటీవల నేతన్న నేస్తం నిధుల విడుదల సందర్భంగా పెడన సభలో సీఎం జగన్ నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కోస్తా తీరం శాశ్వత ఆదాయ మార్గంగా రూపుదిద్దుకుంటోంది. బందరు పోర్టు పూర్తైతే రూ.పది వేల కోట్లకుపైగా పెట్టుబడులతోపాటు 15 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాథమిక అంచనా. ఏటా కనీసం 18–20 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.300 కోట్లకు మించి ఆదాయం సమకూరనుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఒకవైపు ఆక్వా రంగాన్ని బలోపేతం చేస్తూ మరోవైపు పోర్టులు, హార్బర్లు, జెట్టీల నిర్మాణాలను వేగంగా చేపడుతోంది. 974 కి.మీ. పొడవైన కోస్తా తీరంలో సగటున ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో ఐదు శాతంగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. విస్తార అవకాశాలు... అపార అవకాశాలతో కోస్తా తీరం ప్రగతికి చిరునామాగా నిలువనుంది. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ మెరుగుపడుతోంది. కోస్తా కారిడార్, జాతీయ రహదారులు, చెన్నై– కోల్‌కతా మూడో రైలు మార్గం, నూతన విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉన్న పోర్టులతో పాటు కొత్తవీ రాబోతున్నాయి. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, పేరెన్నికగన్న పులికాట్, కొల్లేరు సరస్సులు, హంసలదీవి, సూర్యలంక, మైపాడు బీచ్‌లు.. ప్రముఖ ఆలయాలతో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగశాల, గుల్లలమోద (నాగాయలంక)లో అందుబాటులోకి రానున్న మిస్సైల్ లాంచింగ్ సెంటర్, విశాఖలో నేవీ కేంద్రం... ఇలా కోస్తా తీరాన ప్రతిదీ ప్రత్యేకమే. పారిశ్రామిక కెరటాలు.. ఇప్పటికే ఉన్న పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు. కాకినాడ గేట్‌వే పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ జూలై 20న శంకుస్థాపన చేయగా త్వరలోనే భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫిషింగ్ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో రూ.1,204 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుండగా తాజాగా రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం హార్బర్ల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ పనులను ప్రారంభించనుంది. పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హర్బర్లు ఏర్పాటవుతుండటంతో 35 భారీ యూనిట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా రూ.34,532 కోట్ల పెట్టుబడులతోపాటు 72 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ తూర్పు గోదావరి జిల్లాలోనే రూ.78 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను కొనసాగిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు రవాణా మార్గం.. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతం తూర్పు ఆసియా దేశాలకు ముఖద్వారం లాంటిది. ఇక్కడి పోర్టులు తెలంగాణ, కర్నాటక, ఛతీస్ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సరకు రవాణాకు ఎంతో అనుకూలం. నాగ్‌పూర్‌కు సరుకు రవాణా చేయాలంటే ముంబై కంటే బందరు పోర్టు దగ్గరి దారి అవుతుంది. నాగ్‌పూర్‌కు చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ బందరు నుంచి నాగ్‌పూర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతం అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పోర్టులు, హార్బర్లను అనుసంధానించేలా ఏపీ మారిటైమ్ బోర్డు పలు ప్రతిపాదనలను రూపొందించింది. పోర్టులను రైల్వేలు, జాతీయ రహదారులతో అనుసంధానించడం, తీరప్రాంతంలో జీవనోపాధులను మెరుగుపరచడం ద్వారా కోస్టల్ కమ్యూనిటి అభివృద్ధి చెందేలా ప్రతిపాదనలు పంపింది. ఆక్వాలోనూ కింగే.. గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలతో అన్నపూర్ణగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల్లోనూ మేటిగా గుర్తింపు పొందుతోంది. సీఎం జగన్ ఆక్వా రంగాన్ని ఆదుకుంటూ సాగుదారులపై విద్యుత్తు భారాన్ని తగ్గించారు. పదెకరాల లోపున్న ఆక్వా రైతులు యూనిట్ విద్యుత్తుకు రూ.1.50 మాత్రమే చెల్లించేలా ఊరట కల్పించారు. అదే టీడీపీ హయాంలో ఏకంగా రూ.3.80 చొప్పున వసూలు చేయడం గమనార్హం. చార్జీల భారాన్ని తగ్గించడం ద్వారా మూడేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు రూ.2,400 కోట్లు మేర సబ్సిడీ కల్పించింది. అంతేకాకుండా సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్, ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అ«థారిటీ–20202ని తీసుకొచ్చారు. 5.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ఈ చట్టాలు భరోసా కల్పిస్తున్నాయి. చేపల వేటపై ఆధారపడి 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉండగా ఈ రంగం ద్వారా దాదాపు 16 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆక్వా హబ్‌ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా మరో 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా. రూ.10,640 కోట్లతో దశలవారీగా 19 బెర్తులకు విస్తరించడంతో 25 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయవచ్చు. 3,773 ఎకరాలను సేకరించి భారీ పారిశ్రామికవాడ నెలకొల్పనున్నారు. పలు కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. ► నిర్మాణంలోని ఫిషింగ్ హార్బర్లు: జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ► పనులు ప్రారంభంకానున్న హార్బర్లు: బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం ► నిర్మాణం కానున్న పోర్టులు: మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు. ► ఉన్న పోర్టులు: విశాఖపట్నం, గంగవరం, కాకినాడ (3), కృష్ణపట్నం సీమకూ సముద్ర తీరం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమకూ సముద్రతీరం దక్కింది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన జిల్లా పరిధిలోకి తీర ప్రాంతాలైన కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు, సూళ్లూరుపేట మండలాలు చేరాయి. పులికాట్ సరస్సు కూడా కలిసొచ్చింది. బెస్ట్ వయబుల్ ప్రాజెక్టు బందరు పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ద్వారా నిధులు అందనున్నాయి. బందరు పోర్టు బెస్ట్ వయబుల్ ప్రాజెక్టు అవుతుంది. – వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ -
Andhra Pradesh Assembly Session: జన అజెండా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా శాసనసభలో విస్తృతంగా చర్చించేందుకు అధికార పక్షం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని చట్టసభల వేదికగా తిప్పికొట్టి నిజానిజాలను ప్రజలకు వివరించనుంది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. శనివారం, ఆదివారం సమావేశాలకు సెలవు ఉంటుంది. తిరిగి సోమవారం నుంచి బుధవారం వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. శాసన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ► అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చట్టసభల్లో చర్చించేందుకు అధికార పక్షం సర్వ సన్నద్ధమైంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన మేరకు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణకు తీసుకున్న చర్యలు, ఇప్పటికే చేపట్టిన పరిపాలన సంస్కరణలపై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది. ► ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేయడంతోపాటు రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తూ పదేపదే అప్పులపై దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని అధికార పక్షం నిర్ణయించింది. అప్పులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులపై కూడా దుష్టచతుష్టయం విషం చిమ్ముతోంది. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులతో పాటు రానున్న పెట్టుబడుల వివరాలను కూడా అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని అధికార పక్షం నిర్ణయించింది. మరో పక్క కోవిడ్ సంక్షోభంలోనూ దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం రెండంకెల వృద్ధిని గత ఆర్థిక ఏడాదిలో సాధించింది. మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా అత్యధిక వృద్ధి సాధించడానికి తీసుకున్న చర్యలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు వివరించనుంది. ► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్య, వైద్య రంగాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ రంగ విద్యా సంస్ధలను బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన బోధనతో పేద, సామాన్య వర్గాల పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ వేదికగా అధికార పక్షం వివరించనుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు జవసత్వాలు కల్పించి అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దడంతోపాటు ఏకంగా 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టడం, హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేలా చేపట్టిన చర్యలను అసెంబ్లీ ద్వారా తెలియచేయనుంది. ► మహిళా సాధికారికతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలు, పిల్లల భద్రతకు పలు చర్యలను తీసుకుంది. ఇటీవల నేషనల్ క్రైం బ్యూరో నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నేరాలు తగ్గిన విషయాన్ని తెలియజేసింది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి ప్రజలకు తెలియజేయాలని అధికారపక్షం నిర్ణయించింది. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చేకూర్చిన న్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తీరుతో పాటు నేరుగా నగదు బదిలీ ద్వారా పారదర్శకంగా చేకూర్చిన లబ్ధిపై అసెంబీల్లో చర్చించి వివరించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 30 లక్షల మందికిపైగా పేద మహిళలకు వారి పేరిటే ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణాలను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈ అంశంపైన అసెంబ్లీలో చర్చించాలని అధికారపక్షం నిర్ణయించింది. ► పోలవరంపై గత ప్రభుత్వ నిర్వాకాలను చట్టసభల వేదికగా బహిర్గతం చేయడంతోపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేలా తీసుకుంటున్న చర్యల గురించి అసెంబ్లీలో చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. మద్యం, ఇసుకపై దుష్ట చతుష్టయం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది. -
రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆయా కంపెనీల ఏర్పాటు ద్వారా 36,380 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇందులో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇండోసోల్ సోలార్, ఆస్త్రా గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా, ఏఎం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్కో వంటి సంస్థలు పర్యావరణ ఉపయుక్తమైన ఆరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆరు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ యూనిట్ల ద్వారా 20,130 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ మరో రూ.43,143 కోట్లతో మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్.. రోల్డ్ గ్లాసెస్ తయారీ యూనిట్‌తో పాటు సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. కాకినాడ సెజ్ వద్ద రూ.1,900 కోట్ల పెట్టుబడితో లైఫిజ్ ఫార్మా, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద కాసిస్ రూ.386.23 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కేంద్రం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశాఫుడ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టుబడుల ప్రతిపాదనల వివరాలు ► రూ.286.23 కోట్లతో కాసిస్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్. ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కాసిస్ ఇ – మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ► రూ.386.23 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం రూ.286.23 కోట్లు, చార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్ల పెట్టుబడి. ► తొలి విడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని 1,000 ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయాలని లక్ష్యం. ► 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. రూ.1,900 కోట్లతో లైఫిజ్ ఫార్మా యూనిట్ ► కాకినాడ ఎస్ఈజెడ్లో యూనిట్ ఏర్పాటు చేయనున్న లైఫిజ్ ఫార్మా. ► మొత్తంగా రూ.1,900 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. ► 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ► ఏప్రిల్ 2024 నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యం. ► ఏపీఐ డ్రగ్ తయారీలో చైనా దిగుమతులపై ఆధార పడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు. ► పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలు సేకరించిన కంపెనీ. రూ.150 కోట్లతో అవిశా ఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ► కృష్ణా జిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్న అవిశా ఫుడ్స్ లిమిటెడ్. ► రూ.150 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ► 2023 మార్చి నాటికి పూర్తి చేసే దిశగా కంపెనీ అడుగులు. ► ఇందు కోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు. రూ.43,143 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ► మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్ అండ్ రోల్డ్ గ్లాసెస్ తదితర వాటి తయారీ కోసం పరిశ్రమతో పాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. ► మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి. ► 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు. ► నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతో పాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. రైతుల ఆదాయం పెరుగుతుంది: సీఎం రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మారడంతో పాటు క్లీన్ ఎనర్జీలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పెద్దగా ఆదాయం రాని భూముల్లో గ్రీన్ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30,000 ఆదాయం వస్తుందన్నారు. ‘గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమించడమే కాకుండా క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూములకు లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయాలు పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయి. వాటి ద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది’ అని చెప్పారు. ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇవీ.. ► వైఎస్సార్ జిల్లా వొంగిమల్ల వద్ద 1,800 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికోసం రూ.8,240 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉద్యోగాలు. 1,390 ఎకరాల్లో ప్రాజెక్టు ఏర్పాటు. డిసెంబర్ 2029 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యం. ► సోమశిల, ఎర్రవరం వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం. సోమశిల వద్ద 900 మెగావాట్లు, ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 2,100 మెగావాట్ల ప్రాజెక్టు కోసం రూ.8,855 కోట్లు ఖర్చు చేయనున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. 1600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. జూలై 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. ► అవుకు, సింగనమల వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. మొత్తంగా రూ.6,315 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అరబిందో రియాల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. 1,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. అవుకు వద్ద 800 మెగావాట్లు, సింగనమల వద్ద 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు. డిసెంబర్ 2028 నాటికి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం. ► వైఎస్సార్ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్ హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033 కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ. పైడిపాలెం ఈస్ట్ 1,200 మెగావాట్లు, నార్త్ 1,000 మెగావాట్లు, 3,500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు. 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి. డిసెంబర్ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. ► కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. రూ.5 వేల కోట్ల పెట్టుబడి. ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న కంపెనీ. మార్చి 2025 నాటికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం. ► కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంప్డ్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న గ్రీన్కో. 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, 2,300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్న గ్రీన్కో. మొత్తంగా రూ.19,600 కోట్ల పెట్టుబడి. 4,230 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. -
ఏపీలో పెట్టుబడులకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆసక్తి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సంస్థ కార్పొరేట్ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్ జె.శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీలు సీఎంను కలిసి ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వారికి చెప్పారు. పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ఆయన వారికి వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు
-
సీఎం వైఎస్ జగన్‌తో ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ ప్రతినిధులు భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించారు. అలాగే.. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్ జే. శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ ఉన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాము సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఏపీని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా -
భారీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడిదారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణపై సోమవారం సచివాలయంలో సీఐఐ ప్రతినిధులు, ముఖ్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఐటీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యాటక, చేనేత, వస్త్ర పరిశ్రమ, సముద్రయానం తదితర రంగాలతో పాటు పెట్టుబడులకు అవకాశాలున్న అన్ని రంగాల శాఖల అధికారులు సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీల విస్తరణపై దృష్టి సారించాలన్నారు. సదస్సుకు ప్రత్యేక అంబాసిడర్ అవసరంలేదని, అపాచీ, కియా, హీరో, బ్రాండిక్స్ తదితర కంపెనీల ప్రతినిధులనే పరిశ్రమల ప్రమోటర్లుగా వినియోగించుకోవాలన్నారు. వారి అభిప్రాయాలతో ఆడియో, వీడియోలు రూపొందించి వాటితో విస్తృత ప్రచారం చేయాలన్నారు. సదస్సు లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రతిబింబించేలా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్ ద్వారా లోగో, థీమ్ రూపొందించాలని ఆదేశించారు. ఈ రంగాలే కీలకం రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఇప్పటికే గుర్తించిన 32 వేల మెగావాట్ల సామర్థ్యంలో 20 వేల మెగావాట్లకు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంవోయూలు చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన 12 వేల మెగావాట్లకు ఈ సదస్సులో పెట్టుబడులు తేవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు సూచించారు. ఫార్మా పరిశ్రమలకు నక్కపల్లి, రాంబిల్లి ప్రాంతాల్లో దాదాపు 6 వేల ఎకరాలు భూమి అందుబాటులో ఉందని, ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబుకు సూచించారు. ఉన్నత విద్య అభివృద్ధికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలను ఆహ్వానించాలని ఉన్నత విద్యా శాఖ చైర్మన్ హేమచంద్రా రెడ్డిని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు, సముద్ర రవాణా, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. తొలుత సీఐఐ ప్రతినిధి నీరజ్ జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సదస్సు ప్రయోజనాలు, లక్ష్యాలు, ఫలితాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాత్మక విధానాలు, విస్తృత ప్రచారం తదితర అంశాలను వివరించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్, సంచాలకులు జి.సృజన, ఐటీ కార్యదర్శి సౌరబ్ గౌర్, రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత పాల్గొన్నారు. -
Andhra Pradesh: పెట్టుబడుల ప్రవాహం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన యూనిట్లను త్వరితగతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాలనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వీటి ద్వారా రూ.20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీల్లో గ్రాసిం ఇండస్ట్రీస్, పానాసోనిక్ లైఫ్ సైన్స్సొల్యూషన్స్, కాప్రికాన్ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో అల్లాయిస్, నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ లాంటివి ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం కుదిపివేసిన 2020, 2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా 2021లో రూ.10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత రెండున్నరేళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం రూ.40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో చేయూత పారిశ్రామికవేత్తల నుంచి కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చేయూత అందించేలా ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇదే విషయాన్ని పలు కంపెనీల ప్రతినిధులు స్వయంగా ప్రకటించడమే కాకుండా రెండో దశ విస్తరణ పనులకు కూడా శ్రీకారం చుట్టడం తెలిసిందే. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్ కంపెనీ యకహోమా గ్రూపు సంస్థ ఏటీసీ టైర్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో నితిన్ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు. సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందని, రాష్ట్రంలో మాత్రం సింగిల్ డెస్క్ విధానంలో వేగంగా మంజూరయ్యాయని తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలిదశ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా రెండో దశ పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిచినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు ‘సాక్షి’కి వెల్లడించారు. 2020 డిసెంబర్లో నిర్మాణం ప్రారంభించి 11 నెలల్లోనే పనులు పూర్తి చేశామని, దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సులభతర వాణిజ్యంలో మూడో ఏడాదీ మొదటి స్థానం గత రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా రూ.24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరునెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు రూ.5856 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ డెస్క్ విధానంలో అన్ని అనుమతులు ఆన్లైన్ ద్వారా మంజూరు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాదీ ఏపీ మొదటి స్థానంలో నిలబడటం దీనికి నిదర్శనమని తెలిపారు. ఎంఎస్ఎంఈలతో కలిపి 28,343 యూనిట్లు ప్రారంభం భారీగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తూ అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ.47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రూ.1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. ఇవి కాకుండా సుమారు రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయి. -
విశాఖ నుంచి 120 దేశాలకు అలయన్స్ టైర్లు
(అచ్యుతాపురం సెజ్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): రాష్ట్రంలో మరో భారీ విదేశీ పెట్టుబడి వాస్తవ రూపంలోకి వచ్చింది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసిన భారీ హాఫ్ హైవే టైర్ల తయారీ పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. వ్యవసాయం, మైనింగ్, అటవీ, పోర్టు, నిర్మాణ రంగానికి చెందిన భారీ యంత్ర పరికరాలకు వినియోగించే పెద్ద పెద్ద టైర్లు ఇక్కడ తయారవుతాయి. పూర్తిగా ఎగుమతుల కోసం ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ఉత్పత్తి అయ్యే టైర్లను 6 ఖండాలకు చెందిన 120కి పైగా దేశాలకు అందిస్తారు. అత్యధికంగా అమెరికా, యూరోప్ దేశాలకు ఎగుమతి కానున్నాయి. రికార్డు సమయంలో పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్ధమైన ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు అమెరికా, జపాన్, ఇండియాల్లో ఏడు యూనిట్లు ఉన్నాయి. ఇండియాలో ఇప్పటికే తిరువన్వేలి, దహేజ్‌లలో రెండు యూనిట్లు ఉన్నాయి. మూడవ యూనిట్‌ను విశాఖ వద్దఏర్పాటు చేసింది. రూ.2,352 కోట్ల పెట్టుబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2,352 కోట్ల (294 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో విశాఖలో యూనిట్ ఏర్పాటుకు యకహోమా గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 2019 నవంబర్ లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రతిపాదినకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపింది. వెంటనే ఏపీఐఐసీ భూమి కేటాయించడం, నిర్మాణం ప్రారంభం చకచకా జరిగిపోయాయి. 2021 ఫిబ్రవరిలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. కరోనా సంక్షోభం సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో రికార్డు సమయంలో తొలి దశ పనులు పూర్తి చేసినట్లు ఏటీసీ ప్రతినిధులు తెలిపారు. జూలై నెలలో ఏటీసీ తన తొలి టైరును ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ఉత్పత్తి పరిశీలన దశలో ఉంది. త్వరలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమవుతోంది. తొలి దశ కింద ఇప్పటివరకు రూ.1,320 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం రోజుకు 132 టన్నుల రబ్బరు వినియోగం కాగా, తొలి దశలో రోజుకు 69 టన్నుల రబ్బరును వినియోగించనున్నారు. స్థానికులకే పెద్ద పీట తక్కువ మానవ వనరులతో అధిక శాతం రోబోటిక్ విధానంలో నడిచేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ముడి సరుకు వచ్చినప్పటి నుంచి టైరు తయారయ్యి నేరుగా గొడౌన్‌లోకి వెళ్లే విధంగా లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,000 మందికి ఉపాధి లభిస్తుంది ఇందులో 75 శాతం స్థానికులే ఉంటారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 400 మందికిపైగా పనిచేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుతారు. ప్రభుత్వ మద్దతుతో.. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సహకారం అందించాయి. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధుల వరకు పూర్తిగా సహకరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వారు చూపించిన తపనతో నిర్దేశించుకున్న లక్ష్యంలోనే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. – అనిల్ గుప్తా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఏటీసీ టైర్స్ యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది జపాన్‌కు చెందిన యకహోమా టైర్ల తయారీ యూనిట్లో ఉద్యోగిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధికి కృసి చేస్తాను. లాబాల పవన్ కళ్యాణ్, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ సొంతూరులో ఉద్యోగం వచ్చింది నాది అచ్యుతాపురం. యకహామాకు చెందిన ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం వచ్చింది. సొంతూరిలోనే ఉద్యోగం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే పట్టుదలతో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటాను. ఇక్కడ పని వాతావరణం చాలా బాగుంది. పర్యావరణ పరిరక్షణ, భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు. రజనా శ్యామల, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ -
8 నెలల్లో 27 పరిశ్రమలు.. పారిశ్రామిక క్యాలెండర్ రెడీ
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిపై దృష్టిసారించింది. వచ్చే రెండేళ్లలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాటిని వాస్తవరూపంలోకి తీసుకురావడం, ప్రతిపాదిత యూనిట్లలో త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఎనిమిది నెలల్లో రూ.50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న 27 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ నెలలో ఏ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమవుతుందన్న సమాచారాన్ని సేకరించిన పరిశ్రమల శాఖ ఒక క్యాలెండర్ సిద్ధంచేసింది. దీని ఆధారంగా ప్రతీనెలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా వచ్చే ఎనిమిది నెలల్లో కనీసం 27 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల రూ.23,286 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడమే కాకుండా 20,974 మందికి ఉపాధి లభిస్తుంది. జపాన్‌కు చెందిన యోకోహామా గ్రూపునకు చెందిన ఏటసీ టైర్స్, ఆన్‌రాక్ అల్యూమినియం, రామ్‌కో సిమెంట్, టాటా కెమికల్స్, బ్లూస్టార్ఏసీ, శారదా మెటల్స్ విస్తరణ, ఓఎన్జీసీ వంటి యూనిట్ల నుంచి త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలను తీసుకుంటోంది. 24 కంపెనీల పనులకు భూమిపూజ వచ్చే మార్చిలోగా 24 కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేసి భూమిపూజ చేయించి, వాటి నిర్మాణం ప్రారంభించేలా కూడా అధికారులు ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రంలోకి కొత్తగా రూ.24,038 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 54,019 మందికి ఉపాధి లభిస్తుంది. అదానీ గ్రూపు వైజాగ్ టెక్‌పార్క్ పేరుతో రూ.14,634 కోట్లతో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ రూ.3,982 కోట్లు, రూ.1,500 కోట్లతో మల్క్ హోల్డింగ్స్ అల్యూమినియం తయారీ యూనిట్‌తోపాటు పలు ఫార్మా, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పనులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధంచేశారు. అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఇన్ఫోసిస్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలవడం పరిశ్రమల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. రానున్న కాలంలో ప్రతినెలా ఒక భారీ పరిశ్రమ ప్రారంభోత్సవం, శంకుస్థాపన ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేశాం. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మూడేళ్లలో 2.48 లక్షల మందికి ఉపాధి ఇక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ.47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా, 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవికాక.. మరో రూ.1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. అలాగే, ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. ఇవికాక.. సుమారు రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయి. -
పెట్టుబడుల వాస్తవరూపంలో ఏపీ నంబర్ 1
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా పెట్టుబడులను వాస్తవరూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల కాలంలో రాష్ట్రంలో రూ.19,409 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఈ పెట్టుబడులు పెట్టిన 15 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ వంటివి ఉన్నాయి. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా 221 యూనిట్ల ద్వారా రూ.65,929 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. వీటిలో 29.4 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నట్లు డీపీఐఐటీ గణాంకాలు తెలిపాయి. పారిశ్రామికంగా అతి పెద్ద రాష్ట్రంగా భావించే మహారాష్ట్రలో ఈ మూడు నెలల్లో వాస్తవ రూపం దాల్చిన పెట్టుబడులు రూ.11,882 కోట్లు మాత్రమే. మిగతా రాష్ట్రాలన్నీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ మూడు నెలల్లోనే రాష్ట్రంలో రూ.4,939 కోట్ల విలువైన 15 యూనిట్లకు ఒప్పందాలు జరిగాయి. ఒకపక్క కోవిడ్ ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ 2020 డిసెంబర్లో నిర్మాణం ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 11 నెలల్లోనే పనులు పూర్తి చేసినట్లు నోవాఎయిర్ ప్రతినిధులు ‘సాక్షి’కి వెల్లడించారు. దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. 27 నెలల్లో రూ.39,599 కోట్ల పెట్టుబడులు గడిచిన 27 నెలల్లో రాష్ట్రంలో కొత్తగా 104 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.39,599 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే 12 యూనిట్లు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. వీటివల్ల మరో రూ.24,039 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. సీఎం వైఎస్ జగన్ పరిశ్రమల ప్రోత్సాహకానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో కంపెనీలకు వైఎస్సార్ ఏపీ వన్ ద్వారా జీవితకాలం సహకారాన్ని అందిస్తున్నట్లు పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాథ్ చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. డీపీఐఐటీ లెక్క ఇలా.. ఏదైనా ఒక కంపెనీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించగానే డీపీఐఐటీ వద్ద ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండం (ఐఈఎం) పార్ట్–ఏ దాఖలు చేస్తాయి. ఆ సంస్థలు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే ఐఈఎం పార్ట్‌బీని దాఖలు చేస్తాయి. వీటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం దేశంలోకి వచ్చిన పెట్టుబడులను లెక్కిస్తుంది. -
పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం
సాక్షి, విశాఖపట్నం: అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) మధ్య పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ నగరంలో ‘వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’ శనివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు బుగ్గన, గుడివాడ హాజరుకాగా.. పశ్చిమ ఆస్ట్రేలియా తరఫున డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్, అంతర్జాతీయ విద్య, కల్చరల్ మంత్రి డేవిడ్ టెంపుల్మేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీని సిస్టర్ స్టేట్‌గా గుర్తించడంతోపాటు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడం.. పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతిక సహకారం, నైపుణ్యం అందించే అంశాలపై ఇరు ప్రాంతాల ప్రతినిధులు చర్చించారు. ముందుగా.. పరిశ్రమలు, అంతర్జాతీయ విద్య, గనులు మొదలైన అంశాలపై వేర్వేరుగా సెషన్లు నిర్వహించారు. ఏపీ, ఆస్ట్రేలియాలో ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం జరిగిన వ్యూహాత్మక సదస్సులో పలు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు బుగ్గన, గుడివాడతోపాటు ఆస్ట్రేలియా ప్రతినిధి రోజర్ కుక్ మాట్లాడారు. నైపుణ్యాభివృద్ధి దిశగా ఏపీ.. బుగ్గన ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ జరిగితే.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మల్టీనేషనల్ ఏజెన్సీల సహకారంతో అడుగులు వేస్తున్నాం. అంతర్జాతీయ విద్య విషయంలోనూ రాష్ట్రం పురోగమించింది. గడిచిన మూడేళ్ల నుంచి రాష్ట్ర జీడీపీ రేటు వృద్ధి చెందుతోంది. వాణిజ్య రంగంలో ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు ఆధునీకరించుకుంటూ అడుగులు వేస్తున్నాం. ముఖ్యంగా వివిధ కీలక రంగాల్లో సాంకేతికతని అందిపుచ్చుకుంటున్నాం. ఏపీలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదు. దేశంలోకంటే ఎక్కువమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇక్కడ ఉన్నారు. వొకేషనల్ ట్రైనింగ్ అందితే విద్యార్థులు మరింత నైపుణ్యవంతులవుతారు. ఈ దిశగా పశ్చిమ ఆస్ట్రేలియా ఆలోచన చేయాలి. అదేవిధంగా మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై దృష్టిసారించాలి. ఏపీ–ఆసీస్ బంధంతో మార్కెట్ వృద్ధి.. మంత్రి గుడివాడ ఏమన్నారంటే.. వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు ద్వారా భారత్–పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఇదే గొప్ప అడుగు. రాబోయే ఇరవై ఏళ్లలో ఇరు ప్రాంతాల మధ్య మార్కెట్ వృద్ధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాల్లో రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఏపీ, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య కార్యకలాపాల వృద్ధి 69.08 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లని ఏర్పాటుచేస్తున్నాం. మెరైన్ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. కార్గో హ్యాండ్లింగ్లోనూ ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉంది. పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు సింగిల్ విండో విధానం ద్వారా 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నాం. ఐటీ రంగంలో పెట్టుబడులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయి. భూములూ సిద్ధంగా ఉన్నాయి. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఐటీ పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నాం. కలిసి పనిచేసి చరిత్ర సృష్టిద్దాం : రోజర్కుక్ సోదర రాష్ట్రంతో కలిసి పనిచేసి చరిత్ర సృష్టించేందుకు, సరికొత్త ఆలోచనల్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ సదస్సుతో రెండు ప్రభుత్వాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగానికి ఏపీ నిలయంగా ఉంది. పాడి, మత్స్య సంపద, ఆక్వాకల్చర్ రంగాల్లో ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచంలోనే ప్రముఖ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ విద్య, పరిశోధనల్లో అవకాశాలను అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలతో ఇరు దేశాలు అనేక రంగాలలో అవకాశాలను పెంపొందించుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌తో సుసంపన్నమైన భవిష్యత్తును పశ్చిమ ఆస్ట్రేలియా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ, డబ్ల్యూఏ మధ్య ఎనిమిది ఒప్పందాలు.. ఏపీలో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఎనిమిది అంశాలపై రోజర్ కుక్ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం.. ఏపీ మంత్రుల సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఒప్పందాల వివరాలివీ.. ► అంతర్జాతీయ విద్య, నైపుణ్య సహకారం కోసం ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఏఐసీఎస్) డైరెక్టర్ పర్సెస్ ష్రాఫ్‌తో ఒప్పందం. ► విద్యుత్‌కు సంబంధించిన సవాళ్లను అధిగమించే విధానాలలో పరిశోధనాత్మక తోడ్పాటు కోసం ‘ఫ్యూచర్ బ్యాటరీ’తో ఏపీఈడీబీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం. ► ఏరో స్పేస్ రంగానికి చెందిన అంతరిక్ష సాంకేతిక అంశంలో పరస్పర సహకారం కోసం ‘స్పేస్ ఏంజిల్’ సంస్థతో ఏపీఈడీబీ ఎంఓయూ. ► విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘విలేజ్ ఎనర్జీ’ సంస్థ సీఈఓ వేన్ లూబిస్ కాస్తో ఎంఓయూ. ► నైపుణ్యం, వొకేషనల్ ట్రైనింగ్‌కి సంబంధించిన సహకారం కోసం ‘ఫినిక్స్ అకాడమీ’తో ఒప్పందం. ► పశ్చిమ ఆస్ట్రేలియాలోని విద్యుత్ రంగానికి సంబంధించిన ‘ఆస్ట్రేలియన్ ఎనర్జీ స్టోరేజ్’ కంపెనీతో అవగాహన. ► వైద్య పరికరాల తయారీ సంస్థ ‘హెల్త్ ఇంటిగ్రా ప్రైవేట్ లిమిటెడ్’తో అత్యాధునిక పరికరాల తయారీకి ఎంఓయూ. ► ‘హెల్త్ ఇంటిగ్రా ప్రైవేట్ లిమిటెడ్’ అనే వైద్య పరికరాల తయారీ సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. పలు కీలక అంశాల్లో పరస్పర అవగాహనతో కలిసి పనిచేయడానికి అంగీకారం. ► మత్స్య రంగానికి సంబంధించిన అంశాలలో కలిసి పనిచేయడానికి వీలుగా పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన ‘ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ’ (సీసీఐడబ్ల్యూఏ) వాణిజ్య పెట్టుబడుల హెడ్ మైకేల్ కార్టర్‌తో ఏపీఈడీబీ ఒప్పందం. ఇక ఈ సదస్సులో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, విద్యుత్ శాఖ జేఎండీ పృథ్వితేజ్ ఇమ్మాడి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బాలయ్య, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్‌బాబు, ఆంధ్రప్రదేశ్ సీఐఐ చైర్మన్ నీరజ్ శారద, ఇండియ గల్ఫ్ ఇన్వెస్ట్మెంట్–ట్రేడ్ కమిషనర్ నషిద్ చౌదరి, ఏపీ ఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్‌తో పాటు పరిశ్రమలు, ఏపీఐఐసీ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
పెట్టుబడులపై ఎందుకీ పగ?
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం)లో ఏపీ 97.89 శాతంతో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచినట్లు కేంద్ర వాణిజ్యశాఖ వెల్లడించిందని గుర్తుచేశారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుస్తూ మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేస్తుంటే ఎందుకంత కడుపు మంట? అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు కడుపుమంటకు మందే లేదని వ్యాఖ్యానించారు. సమ్మిట్స్ పేరుతో మోసం చేసిందెవరు? ఐదేళ్ల టీడీపీ పాలనలో నాలుగు సార్లు విశాఖలో సమ్మిట్లు నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నామని, 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడం వాస్తవం కాదా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులను సీఎం జగన్ నెరవేరుస్తుండటంతో టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. కాగితాల్లో పెట్టుబడులు, గ్రాఫిక్స్‌లో రాజధానిని చూపించి మోసం చేసిన చంద్రబాబుకు పారిశ్రామికాభివృద్ధిపై మాట్లాడే హక్కే లేదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంలో కార్ల తయారీ పరిశ్రమ స్థాపించేందుకు కియా మోటార్స్ అంగీకరించిందని గుర్తు చేశారు. అది తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతుల్లో కియా మోటార్స్ వాటా 4 శాతమేనని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిని కాగితాల్లో కాకుండా సీఎం జగన్ వాస్తవికంగా చూపుతున్నారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ సైతం ప్రశంసించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పెద్ద పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్రానికి 974 కి.మీ. సుదీర్ఘ తీరం ఉన్నందున ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా హార్బర్‌ను నెలకొల్పి పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో కొప్పర్తి, శ్రీకాళహస్తి–ఏర్పేడు, విశాఖ నోడ్లను తొలి దశలో అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఓర్వకల్లు నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పరిశ్రమల కోసం లక్ష ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, రహదారులు, విద్యుత్, నీరు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి సీఎం జగన్ భరోసా ఇస్తుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని తెలిపారు. విశాఖలో వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు కానుందని చెప్పారు. ‘రానున్న రెండేళ్లలో ఎంఎస్ఎంఈలు 1.25 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నాం. ఇందులో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. తద్వారా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఈ రంగానికి రూ.1,800 కోట్ల రాయితీలు ప్రోత్సాహకాలుగా అందించాం. వచ్చే ఆగస్టులో మరో రూ.500 కోట్లు ఇస్తాం. కరోనా కష్ట కాలంలో పరిశ్రమలను ఆదుకుని అండగా నిలిచాం’ అని పేర్కొన్నారు. జనసేన కాదు... ధనసేన పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ జనసేనను ధనసేనగా.. జనవాణిని ధనవాణిగా మార్చుకుంటే బాగుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ‘ఎనిమిదేళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టారు. చంద్రబాబు హామీలకు తనది పూచీ అన్నారు. ఐదేళ్లలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా టీడీపీ మోసం చేస్తే పవన్ కళ్యాణ్ ఏనాడైనా ప్రశ్నించారా?’ అని నిలదీశారు. 95 శాతం హామీలను నెరవేర్చిన సీఎం జగన్‌ను ప్రశ్నించడం విడ్డూరమన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ డబ్బులొస్తే అక్కడకు వెళ్తారని.. ఆయన వేలంపాటలో పాల్గొంటే మంచిదని సలహా ఇచ్చారు. ప్రపంచంలో ఆప్షనల్ రాజకీయాలు చేసేది ఒక్క పవన్ మాత్రమేనని చెప్పారు. ఎనిమిదేళ్లలో ఎనిమిది పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనుడు కూడా ఆయన ఒక్కరేనన్నారు. -
పారిశ్రామిక విప్లవంలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న తిరుపతి వేదికగా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం దిశగా మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఒకేసారి రూ.3,644.32 కోట్ల విలువైన ఎనిమిది భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ 1, 2)లో ఏర్పాటు చేసిన 5 ఎలక్ట్రానిక్ కంపెనీల ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు మరో రెండు ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఒక పాదరక్షల తయారీ కంపెనీ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఉత్పత్తి ప్రారంభిస్తున్న ఎలక్ట్రానిక్ కంపెనీల ద్వారా రూ.2,944.32 కోట్ల పెట్టుబడులు రానుండగా, ఇందులో ఇప్పటి వరకు రూ. 1,771.63 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. వీటి ద్వారా 10,139 మందికి ఉపాధి లభించనుండగా, ఇప్పటికే 3,093 మందికి ఉపాధి లభించింది. మొత్తంగా ఈ ఎనిమిది కంపెనీల ద్వారా 20,139 మందికి ఉపాధి లభించనుంది. ఉత్పత్తి ప్రారంభించే సంస్థలు టీసీఎల్–పీవోటీపీఎల్: టీసీఎల్‌కు చెందిన ప్యానెల్ ఆప్టోడిస్ప్లే టెక్నాలజీ లిమిటెడ్ రూ.1,230 కోట్లతో డిస్ప్లే ప్యానెల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ద్వారా 3,174 మందికి ఉపాధి లభించనుంది. ప్రస్తుతం ఈ యూనిట్ పెట్టుబడి ప్రతిపాదనల్లో రూ.1,040 కోట్లు వాస్తవ రూపం దాల్చడం ద్వారా 1,089 మందికి ఉపాధి కల్పించింది. ఈ మధ్య ట్రైల్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని వాణిజ్య పరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. డిక్సన్ టెక్నాలజీస్ : రూ.145 కోట్లతో వాషింగ్ మెషీన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా 1,131 మందికి ఉపాధి లభించనుంది. పెట్టుబడి ప్రతిపాదనలో ఇప్పటి వరకు రూ.100.80 కోట్లు వాస్తవ రూపంలోకి రావడం ద్వారా 254 మందికి ఉపాధి కల్పించింది. ఫాక్స్ లింక్స్ ఇండియా : రూ.1,050 కోట్లతో మొబైల్ ఫోన్లకు సంబంధించిన విడిభాగాలు, పీసీబీలను తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటి వరకు రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 800 మందికి ఉపాధి కల్పించింది. సన్నీ ఒప్పొటెక్ విస్తరణ: రూ.280 కోట్లతో కెమెరా విడి భాగాల తయారీ యూనిట్ విస్తరణ చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు రూ.100 కోట్లు వ్యయం చేయడం ద్వారా 1,200 మంది ఉపాధికి గాను 50 మందికి కల్పించింది. యూటీఎన్పీఎల్–కార్బన్ : రూ.130 కోట్లతో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.80 కోట్ల విలువైన పెట్టబడులు వాస్తవరూపం దాల్చాయి. 1,800 మందికి ఉపాధి కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 900 మందికి ఉపాధి లభించింది. భూమి పూజకు సిద్ధమైన కంపెనీలు డిక్సన్ టెక్నాలజీస్ : రూ.108.92 కోట్లతో టెలివిజన్ సెట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. సెవెన్ హిల్స్ డిజిటల్ పార్క్ : ఫాక్స్ లింక్ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన పెట్టుబడి వివరాలు తెలియాల్సి ఉంది. హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో 298 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్ల పెట్టుబడితో పాదరక్షల తయారీ యూనిట్ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా 10,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ మూడు కంపెనీలకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. ఇకపై ప్రతి నెలా ప్రారంభోత్సవాలు కోవిడ్‌తో గత రెండేళ్లుగా స్థబ్దుగా ఉన్న పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నెల 23న తిరుపతిలో ఎలక్ట్రానిక్, ఫుట్‌వేర్ యూనిట్ల ప్రారంభోత్సవం ద్వారా రాష్ట్రంలో భారీ పారిశ్రామికీకరణ విప్లవంలో మరో ముందడుగు వేయనున్నాం. ఇక నుంచి ప్రతి నెలా పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు రోడ్ షోలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి. -
అంతర్జాతీయ రోడ్‌షోలతో పెట్టుబడుల ఆకర్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న అంతర్జాతీయ రోడ్‌షోలు సత్ఫలితాలిస్తున్నాయి. కరోనాతో రెండున్నరేళ్లుగా ఆన్లైన్ సమావేశాలకే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ రోడ్‌షోలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అధికారుల బృందం వెళ్లివచ్చింది. అంతకుముందు అప్పటి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొంది. తాజాగా పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజన నేతృత్వంలో అధికారుల బృందం జర్మనీలోని హాన్ఓవర్ మెస్సే ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొంది. ఈ మూడు రోడ్‌షోలు మంచి ఫలితాలు అందించడంతో రానున్న కాలంలో మరిన్ని అంతర్జాతీయ రోడ్‌షోలను నిర్వహించడానికి పరిశ్రమలశాఖ సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ ట్రేడ్ ఫెయిర్‌గా పిలిచే హన్ఓవర్లో మే 30 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో రాష్ట్రం పాల్గొనడమే కాకుండా రాష్ట్రంలో తయారీ, పోర్టులు, లాజిస్టిక్స్, ఎగుమతుల రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన ‘సాక్షి’కి చెప్పారు. ఏబీబీ, ఎయిర్‌బస్, బోష్, జెస్సీ కర్ల్, ఫెస్టో, షెఫ్లర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేసిన జర్మనీ, ఇజ్రాయిల్‌లకు చెందిన షెఫ్లర్ టెక్నాలజీస్, ఫెస్టో వంటి కంపెనీలు రాష్ట్రంలోని అవకాశాలపై ఆసక్తిని వ్యక్తం చేసినట్లు చెప్పారు. రోబోటిక్, హెల్త్‌కేర్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. దుబాయ్, దావోస్, జర్మనీ రోడ్‌షోలు మంచి ఫలితాలివ్వడంతో త్వరలో నార్వే, దక్షిణ కొరియాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా దక్షిణ కొరియా రోడ్‌షోను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంపై మల్క్హోల్డింగ్ ఆసక్తి ఈ ఏడాది దుబాయ్ ఎక్స్పో సందర్భంగా రూ.5,150 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగ్గా అందులో కీలకమైన అమెరికాకు చెందిన మల్క్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ విషయమై ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసిన మల్క్హోల్డింగ్స్ ప్రతినిధులు వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.1,500 కోట్లతో అల్యూమినియం కాయల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచానికి ఏపీని రోల్‌మోడల్‌గా చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ఒక్క రంగంలోనే నాలుగు అంతర్జాతీయస్థాయి కంపెనీల నుంచి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించగలిగింది. మిట్టల్, అదానీ, అరబిందో, గ్రీన్కో వంటి కంపెనీలతో పాటు బైజూస్, టెక్ మహీంద్రా, డసల్ట్ వంటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ రోడ్‌షోల్లో వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు, ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్ తెలిపారు. -
ఏసీల తయారీ హబ్‌గా శ్రీ సిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ హబ్‌గా ఎదుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి ఏసీ తయారీ యూనిట్లు తిరుపతి జిల్లా శ్రీసిటీకి క్యూ కడుతున్నాయి. గత ఆరు నెలల్లోనే ఆరు అంతర్జాతీయ ఏసీ తయారీ, విడిభాగాల తయారీ సంస్థలు ఇక్కడకు వచ్చాయి. బ్లూస్టార్, డైకిన్ వంటి సంస్థలతో పాటు 20కిపైగా బ్రాండ్లకు విడిభాగాలను సరఫరా చేసే ఆంబర్, హావెల్స్, ఈప్యాక్ డ్యూరబుల్స్, పానాసోనిక్–యాంకర్ సంస్థలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటి ద్వారా రూ.3,755 కోట్ల పెట్టుబడులు రానుండగా, 9,700 మందికి ఉపాధి లభిస్తుంది. ఇందులో బ్లూస్టార్ ఏడాదికి 12 లక్షల ఏసీల సామర్థ్యంతో, డైకిన్ 15 లక్షల యూనిట్ల సామర్థ్యంతో పరిశ్రమలు నెలకొల్పుతున్నాయి. పానాసోనిక్ యాంకర్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. మిగిలిన పరిశ్రమల నిర్మాణం వేగంగా జరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో భూమి పూజ చేశామని, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని బ్లూస్టార్ ప్రతినిధి ‘సాక్షి’కి వివరించారు. ఒక్క శ్రీ సిటీకే రూ.8,349 కోట్ల పెట్టుబడులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008 ఆగస్టు 8న ప్రారంభమైన శ్రీ సిటీలో ఇప్పటివరకు 28 దేశాలకు చెందిన 200కు పైగా సంస్థల పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50,000 మందికి ఉపాధి లభిస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీ సిటీ గత మూడేళ్లలో భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019 జూన్ నుంచి ఇప్పటివరకు 38 సంస్థలు కొత్త పరిశ్రమలను నెలకొల్పాయి. ఇందులో కింబెర్లీ క్లార్క్, ఆల్స్టామ్ రెండో దశ విస్తరణ చేపట్టాయి. సీఆర్ఆర్సీ, ఎల్జీ పాలిమర్స్, కాస్‌మాక్స్ బ్యాటరీస్, ఓజి ఇండియా ప్యాకేజింగ్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో 14 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కోవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేవలం 14 నెలల రికార్డు సమయంలో యూనిట్‌ను ప్రారంభించినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు తెలిపారు. 2020 డిసెంబర్ 18న పనులు ప్రారంభించి 2021 నవంబర్‌లో సీఎం చేతులు మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభించారు. ఇక్కడ 220 టన్నులు ఆక్సిజన్‌తో పాటు పారిశ్రామిక అవసరాలకు ఇతర వాయువులను తయారు చేస్తారు. పవన విద్యుత్‌కు తయరీలో కీలకమైన విండ్ మిల్ గేర్ బాక్స్‌లను తయారు చేసే చైనాకు చెందిన ఎన్జీసీ ట్రాన్స్మిషన్ పరిశ్రమ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం క్వాలిటీ ఆడిటింగ్ జరుగుతోందని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. శ్రీ సిటీలో ఈ మూడేళ్లలో కొత్తగా రూ.8,349 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 21,540 మందికి ఉపాధి లభిస్తోంది. మూడేళ్లలో రాష్ట్రంలో రూ.36,313 కోట్ల పెట్టుబడులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 96 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.36,313 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 56,681 మందికి ఉపాధి లభిస్తోంది. మరో 36,000 కోట్ల విలువైన పెట్టుబడులతో 52 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే మరో 77 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఆర్సిలర్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు, అదానీ, సన్‌ఫార్మా, సెంచురీ ఫ్లైవుడ్స్, శ్రీ సిమెంట్స్, గ్రీన్కో ఎనర్జీ, అరబిందో వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ మూడేళ్లలో 26,922 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంస్‌ఈ) యూనిట్లు రాష్ట్రంలో రూ.7,550 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 1.76 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. -
విశాఖ ఇమేజ్ను దెబ్బతీయొద్దు
సాక్షి, విశాఖపట్నం: వరదలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందని ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో ఓ సంస్థ ప్రతినిధి ప్రశ్నిస్తే ఆశ్చర్యపోయానని, ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రతిపక్ష పార్టీకి మేలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఓ వర్గం మీడియా విశాఖపై విషం చిమ్ముతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తాను పుట్టిన ప్రాంతమైన ఈ నగరంపై ఇంత విషప్రచారం చేస్తున్న వారికి రెండు చేతులు జోడించి దండం పెడతాను.. దయచేసి విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీసేలా అవాస్తవాలు ప్రచురించొద్దని వేడుకున్నారు. విశాఖ ఇమేజ్ను దెబ్బతీస్తే తాను సహించలేకపోయానని.. సదరు ప్రతినిధికి ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించడంతోపాటు ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని.. దయచేసి ఎవరికీ చెప్పొద్దని కోరానని ఆయన వెల్లడించారు. ఇక్కడి సర్క్యూట్ హాస్‌లో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రాజకీయాలు ఎన్ని ఉన్నా.. రాష్ట్రాభివృద్ధి విషయంలో అందరూ కలిసి రావాలి. రాజకీయ స్వార్థం కోసం ఎవరూ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని పణంగా పెట్టకూడదు. గత పాలకుల మాదిరిగా అదిగో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని, మేం అబద్ధాలు చెప్పం. వాస్తవాలనే ప్రజల ముందు ఉంచుతాం. అందుకే దావోస్ పర్యటన అనంతరం రాష్ట్రానికి పెట్టుబడులు తదితర అంశాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం దాదాపుగా లక్ష ఎకరాలు అందుబాటులో ఉంచాం. ఇందులో ఇప్పటికే 40–50 వేల ఎకరాల్లో ఆయా పరిశ్రమలకు సంబంధించిన పనులు జరగుతున్నాయి. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. కోవిడ్ తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో.. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతంగా నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో చక్కటి ఫలితాలు సాధించాం. అత్యధిక తీర ప్రాంతం కల్గిన రాష్ట్రంగా ఉన్న ఏపీలో అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటున్నట్లు చెప్పేందుకు దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటుచేశాం. దేశంలో ఉన్న వివిధ పారిశ్రామికవేత్తలతో పాటు దాదాపు 50 బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, కొత్త పారిశ్రామికవేత్తలతోనూ భేటి అయ్యాం. ఈ సందర్భంగా వారందరికీ ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకుగల వనరులు, స్థితిగతులను వివరించాం. ఇక ఈ సదస్సు ద్వారా ఏపీకి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కర్బన ఉద్గారాల్లేని ఆర్థిక వ్యవస్థ దిశగా.. పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. స్వయంగా ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ (ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ) సీఈఓ ఆదిత్య మిట్టల్ ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 33వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాం. ఏపీలో దానికి అవసరమైన అన్ని వనరలున్నాయి. వాటిని వినియోగించుకోవాలని కోరాం. ఇక ఈ సదస్సులో నీతిఅయోగ్ సీఈఓ అమితాబ్ కాం™త్Œ సైతం డీకార్బనైజ్డ్ ఎకనామిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కితాబు ఇచ్చారు. డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఏపీ ఐకాన్‌గా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అత్యాధునిక సదుపాయాలున్న కార్పొరేట్ ఆసుపత్రులు ఏపీలో లేకున్నా కోవిడ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొన్న విషయాన్ని.. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం అక్కడ అందర్నీ ఆకట్టుకుంది. యూనికార్న్ హబ్‌గా విశాఖ మరోవైపు.. విశాఖను హై అండ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దనున్నాం. ఇందుకు టెక్ మహింద్రా సీఈఓ గుర్నాని అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ వర్సిటీతో పాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అదేవిధంగా విశాఖను యూనికార్న్ స్టార్టప్ (సుమారు రూ.7,700 కోట్ల విలువగల) హబ్‌గా తీర్చిదిద్దేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దేశ, ప్రపంచ స్థాయి వ్యవస్థాపకులు, సీఈఓలతో యూనికార్న్ స్టార్టప్స్‌కు వేదికగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దడానికి అంగీకారం తెలిపాం. అంతేకాక.. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి, రవాణ రంగానికి చేయూతనిచ్చేందుకు ఈజ్ మై ట్రిప్ కూడా అంగీకారం తెలిపింది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ సంస్థలను ఆహ్వానించాం. -
గ్రీన్ ఎనర్జీ.. ఏపీ ఒక దిక్సూచి కాబోతుంది: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామన్నారు. ప్రపంచస్థాయి వేదికలపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర ప్రగతిని ఫోకస్ చేశామన్నారు. ఐదు రోజుల సదస్సుకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. చదవండి: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి గీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఏపీని ఆదర్శంగా మారుస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీ ఒక దిక్సూచి కాబోతుందన్నారు. 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. -
CM YS Jagan Davos Tour: రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు. 27,700 మెగావాట్ల క్లీన్ గ్రీన్ ఎనర్జీ నాలుగోతరం పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి రాబోతోంది. గ్రీన్ కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ ప్రకటించింది. ముఖ్యమంత్రి.. సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ ఈ ప్రకటన చేశారు. ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. స్టీల్‌తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్ తదితర రంగాల్లో ఉన్న 76.571 బిలియన్ డాలర్ల ఆర్సిలర్ మిట్టల్ గ్రూపు తొలిసారిగా గ్రీన్ ఎనర్జీకి వేదికగా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది. కర్బన రహిత పారిశ్రామికీకరణపై దృష్టి కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తులపైనా దావోస్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కితాబిచ్చారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్ఈజెడ్ను తీసుకురానుండడం దావోస్ ఫలితాల్లో ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్‌ను అభివృద్ధి చేస్తారు. పారిశ్రామిక రంగానికి డబ్ల్యూఈఎఫ్ సహకారం కాలుష్యాన్ని తగ్గించడం.. పర్యావరణ సమతుల్యతకు, నాణ్యతకు పెద్దపీట వేయడం, గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో అడుగులు వేసింది. దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలోకి కొత్తగా నాలుగు పోర్టులు వస్తున్న దృష్ట్యా పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్ సభలో సీఎం దృష్టిపెట్టారు. దస్సాల్ట్ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌తోనూ జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి జగన్ ఇవే అంశాలపై దృష్టిపెట్టారు. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి సంబంధించిన వివరాలను వీరి ముందు ఉంచింది. తాము త్వరలో కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఓఎస్‌కే లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటో ప్రకటించారు. సీఎం విజ్ఞప్తి మేరకు, లాజిస్టిక్ రంగాలపైనా దృష్టిపెడుతున్నామన్నారు. ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో సరుకు రవాణా చేస్తున్న కంపెనీ ఇది. బైజూస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని.. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని బైజూస్ ప్రకటించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్‌స్విచ్ క్యూబర్ ప్రకటించింది. విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ వేదికగా విశేష కృషిచేశారు. ► హైఎండ్ టెక్నాలజీకి వేదికగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హైఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపైనా చర్చించారు. ► మేజర్ టెక్నాలజీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని సీఎం సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖను తీర్చిదిద్దాలనుకుంటున్నారని టెక్ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రితో భేటీ అనంతరం వెల్లడించారు. ► ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ ఇవే అంశాలను సీఎం జగన్ చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి. ► అలాగే, యూనికార్న్ స్టార్టప్స్‌కూ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్ వేదికగా గట్టి ప్రయత్నాలు చేశారు. వివిధ యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ అయ్యారు. ► ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూతనిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్‌మై ట్రిప్ వెల్లడించింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైనా ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు. -
‘దావోస్’ ఒప్పందం చరిత్రాత్మకం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారీ పెట్టుబడులు పెట్టేలా అదానీ గ్రీన్ ఎనర్జీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో గతంలో ఎన్నడూ జరగని విధంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర విద్యుత్ రంగంలోనే కీలకమైన పరిణామమని అన్నారు. చదవండి: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు మంత్రి పెద్దిరెడ్డి ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చిందని, 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. తద్వారా రైతులకు శాశ్వతంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను భవిష్యత్‌లో కూడా అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో బాటలు వేశారన్నారు. -
గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో భారీ ఇంటిగ్రేడెట్ పంప్డ్ స్టోరేజ్ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా దావోస్‌లో మూడో రోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఆర్సిలర్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్, గ్రీన్కో గ్రూప్ ఎండీ, సీఈవో అనిల్ చలమలశెట్టి, దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ సెషన్ మోడరేటర్‌గా వ్యవహరించారు. డీ కార్బనైజ్డ్ ఎకానమిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అమితాబ్‌కాంత్ ప్రశంసించగా రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వామి కానున్నట్లు ఆర్సలర్ మిట్టల్ గ్రూపు ప్రకటించింది. డీ కార్బనైజ్డ్ ఆర్థిక వ్యవస్థ దిశగా ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన, జీరో కార్బన్ కోసం అనుసరించాల్సిన విధానాలు, గ్రీన్ ఎనర్జీలో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... సీకోయ్ క్యాపిటల్ ఎండీ రాజన్‌తో సీఎం జగన్ బ్యాటరీ తరహాలో పంప్డ్ స్టోరేజీ పర్యావరణ పరిరక్షణకు కర్బన రహిత యంత్రాంగం ఏర్పాటు చాలా కీలకం. ఈ ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వకుంటే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారుతుంది. పర్యావరణ, సామాజికాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం మన బాధ్యత. కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ విషయంలో ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవనుంది. ఇక్కడకు (దావోస్) రావడానికి కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యువబుల్ ప్రాజెక్టు పనులను ప్రారంభించాం. పంప్డ్ స్టోరేజీ ఒక బ్యాటరీ తరహాలో పనిచేస్తుంది. దీనికి అనుసంధానంగా సౌరవిద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులు కూడా అక్కడ రానున్నాయి. జుబిలియంట్ గ్రూప్ చైర్మన్ కాళీదాస్తో సీఎం జగన్ నిరంతర విద్యుత్తు ఈ విధానంలో ఒక డ్యామ్ నిర్మిస్తాం. అందులో కేవలం 1 టీఎంసీ నీటిని వినియోగిస్తాం. దీన్ని ఉపయోగించి విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉన్నప్పుడు (పీక్ అవర్స్‌లో) నీటిని వదిలి విద్యుదుత్పత్తి చేస్తాం. వినియోగం తక్కువగా ఉన్నప్పుడు (నాన్ పీక్ అవర్స్‌లో) మళ్లీ నీటిని రిజర్వాయర్‌లోకి వెనక్కి లిఫ్ట్ చేస్తాం. అప్పుడు పవన, సౌర విద్యుత్ వాడుకుంటాం. దీనివల్ల 24 గంటలపాటు పగలు, రాత్రి కూడా పవర్ అందుబాటులోకి వస్తుంది. చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది స్ధిరమైనది, ఆర్థికంగా బలమైనది. వినియోగం తక్కువగా ఉన్న సమయంలో (నాన్ పీక్ అవర్స్‌లో) పవన, సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ కరెంట్‌ను ఉపయోగించుకుని నీటిని మళ్లీ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తాం. ఇది చాలా సులువైన మెకానిజమ్. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఏస్ అర్బన్ డెవలపర్స్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు గ్రీన్ పరిశ్రమలు.. డీశాలినైజేషన్ 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి చేయగల సామర్ధ్యం ఏపీకి ఉంది. ఏపీలో అవకాశాలను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. సంప్రదాయ పరిశ్రమల నుంచి సంప్రదాయేతర పరిశ్రమలకు కూడా మార్పు చెందవచ్చు. సంప్రదాయ పరిశ్రమ నుంచి గ్రీన్ పరిశ్రమగా మారడంతో పాటు ఈ పవర్‌ను ఉపయోగించుకుని హైడ్రోజన్,అమ్మోనియా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో నీటి డీశాలినైజేషన్ (నిర్లవణీకరణ) ప్రక్రియ కూడా చేయవచ్చు. వీటన్నింటికీ ఏపీ మీకు స్వాగతం పలుకుతోంది. పర్యావరణ పరిరక్షణపై సానుకూల దృక్పథంతో ముందుకొస్తే స్వాగతం పలుకుతాం. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్రెమంట్తో సీఎం జగన్ ప్రపంచానికి ఆదర్శంగా ఏపీ ప్రపంచంలో కర్బన కాలుష్యానికి భారత్ కారణం కాదు. గ్రీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూపిన చొరవ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. రాష్ట్రంలో ఒకేచోట సౌర, పవన, జల విద్యుత్ ప్లాంట్ ద్వారా చౌకగా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకీకృత పునరుత్పాదక ఇంధన పవర్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతోంది. ఏపీలో 23 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే భారత్‌లో ముఖ్యమైన కర్బన రహిత కేంద్రంగా నిలుస్తుంది. తద్వారా కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తనలో యావత్ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది. నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సీఎం జగన్ ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాల్ హరిత ఉదజని. ఫెర్టిలైజర్లు, స్టీల్, రిఫైనరీ, షిప్పింగ్ రంగాలు కూడా గ్రీన్ హైడ్రోజన్ వినియోగం దిశగా మారాల్సి ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చూపిన చొరవ ఆదర్శంగా నిలవనుంది. భారత్‌లో కర్బన ఉద్గార కారకాల తలసరి వినియోగం చాలా తక్కువ. అయితే కర్బన రహిత పారిశ్రామికీకరణ ప్రక్రియలో ప్రపంచంలోనే భారత్ తొలి దేశంగా నిలవాల్సి ఉంది. ఇది ఒక సవాల్ కాదు. అందివచ్చిన అవకాశంగా చూడాలి. – అమితాబ్‌కాంత్, నీతి ఆయోగ్ సీఈవో ఏపీ.. ఎంతో అనుకూలం ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టాం. గ్లోబల్ రెన్యువబుల్ ప్రాజెక్టు కోసం గ్రీన్కో కంపెనీతో కలసి పని చేస్తున్నాం. ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ 27 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ రెన్యువబుల్ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడికి ఎంతో సానుకూలంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంట్‌ను నేను స్వయంగా సందర్శించా. అక్కడ జరుగుతున్న పనులు, ఒకేచోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి కానుండడం, తక్కువ నీటి వినియోగం నిజంగా ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడ 650 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,000 కోట్లకు పైగా) పెట్టుబడి సమకూర్చాం. రోజంతా 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుండడం అద్భుతం. భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేయనున్నాం. పునరుత్పాదకాలు, హరిత ఉదజని కోసం మా వంతుగా పూర్తి చొరవ చూపుతాం. అన్ని రకాలుగా అనుకూల విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం. – ఆదిత్య మిట్టల్, ఆర్సిలర్ మిట్టల్ సీఈవో -
CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు
సాక్షి, అమరావతి: కర్బన ఉద్గారాలు లేని విద్యుదుత్పత్తి (గ్రీన్ ఎనర్జీ) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికసదస్సు (డబ్ల్యూఈఎఫ్) వేదికగా గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. ఆ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, ఆయా సంస్థల అధిపతులు సంతకాలు చేశారు. రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 14 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ విద్యుదుత్పత్తి చేసి 18 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం తాజా ఒప్పందాలను కుదుర్చుకుంది. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా ఎస్ఈజెడ్ ఏర్పాటుపై కూడా ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం అదానీ సంస్థతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేలమందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. దీంతో ఒక్క గ్రీన్ ఎనర్జీ విభాగంలోనే దావోస్ వేదికగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకున్నట్లైంది. గ్రీన్ కో గ్రీన్‌సిగ్నల్.. కర్బన రహిత విద్యుదుత్పత్తికి గ్రీన్కో – ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 8 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఒప్పందం జరిగింది. ఇందులో వెయ్యి మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ ప్రాజెక్టు, 5 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 2 వేల మెగావాట్ల విండ్(పవన విద్యుత్) ప్రాజెక్టు ఉన్నాయి. దీని కోసం రూ.37 వేల కోట్ల పెట్టుబడిని ఆ సంస్థ పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 6 వేల మెగావాట్లతో అరబిందో రాష్ట్రంలో 6 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వంతో అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2 వేల మెగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్టు, మరో 4వేల మెగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్టులు ఉంటాయి. ప్రస్తుతం కాకినాడ ఎస్ఈజెడ్లో సదుపాయాలను వినియోగించుకుని ఈ ప్రాజెక్టులను అరబిందో రియాల్టీ చేపట్టనుంది. ప్రాజెక్టు కోసం దాదాపు రూ.28 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బందరులో ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్.. మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. గ్రీన్ ఎనర్జీతో సహాయంతో ఈ జోన్లో పారిశ్రామిక ఉత్పత్తి చేపట్టనుంది. ఈ జోన్లో ప్రపంచస్థాయి కంపెనీలకు అవసరమైన వసతులు కల్పిస్తారు. బహ్రెయిన్‌కు ఏపీ ఎగుమతులు దావోస్‌లో మూడో రోజు మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీపాతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ, హై ఎండ్ టెక్నాలజీ విభాగాల్లో అవకాశాలను ప్రధానంగా తెలియచేశారు. రాష్ట్రం నుంచి బహ్రెయిన్‌కు విరివిగా ఎగుమతులపై చర్చించారు. విద్యారంగంలో పెట్టబడులపై సల్మాన్ అల్ ఖలీపాతో చర్చలు జరిపారు. అనంతరం సెకోయ క్యాపిటల్ ఎండీ రంజన్ ఆనందన్‌తో సీఎం జగన్ సమావేశమై స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధిపై చర్చించారు. సెకోయా క్యాపిటల్ ఏపీలో కార్యకలాపాల ప్రారంభం అంశంపైనా చర్చించారు. అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ ► డబ్ల్యూఈఎఫ్ వేదికగా ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రెమంట్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చే విధంగా ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్రంలో భారీగా రానుండటంతో ఆ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ► వ్యవసాయం, ఆహారం, ఫార్మా రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జుబిలియంట్ గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కాళీదాస్ హరి భర్తియాతో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌పై విస్తృతంగా చర్చించారు. విశాఖలో ఐఐఎం క్యాంపస్ నిర్మాణం వచ్చే ఆగస్టు నాటికి పూర్తి కానుందని, దీనికి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్నట్లు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాళీదాస్ హరి భర్తియా తెలిపారు. ► ప్రఖ్యాత స్టీల్ దిగ్గజ కంపెనీ ఆర్సెల్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ఏపీ పెవిలియన్‌లో సీఎం వైఎస్ జగన్ సమావేశమై గ్రీన్ ఎనర్జీ విద్యుదుత్పత్తిపై విస్తృతంగా చర్చించారు. గ్రీన్కో భాగస్వామ్యంతో ఏపీలోకి అడుగుపెడుతున్నామని ఆదిత్య మిట్టల్ ప్రకటించారు. ప్రపంచంలోనే తొలి హైడ్రో పంప్డ్ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నట్లు వెల్లడించారు. తమ కంపెనీ తరఫున 600 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. ► గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఐఎసీఎల్, ఎల్ అండ్ టీలతో జాయింట్ వెంచర్ రెన్యూ పవర్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్‌తో రెన్యూ పవర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుమంత్ సిన్హా సమావేశమయ్యారు. రాష్ట్రంలో హైడ్రోజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణతో సీఎం జగన్ సమావేశమై టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. విశాఖను హై ఎండ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్ వివరించారు. -
ఈ ఏడాది 21,500 ఎంఎస్ఎంఈలు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటంతో ఈ ఏడాది సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా 2022–23లో కొత్తగా 21,500 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్ల ద్వారా రూ.13,368 కోట్ల పెట్టుబడులతోపాటు 2,53,690 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా లక్ష ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2021–22లో 15,000 యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రూ.7,500 కోట్ల పెట్టుబడులు, 1.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. కోవిడ్, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వంటి కారణాలతో 2021–22లో కొత్తగా 10,613 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.2,632 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడంతోపాటు 66,310 మందికి ఉపాధి లభించింది. దీంతో 2021–22 సంబంధించి మిగిలిన లక్ష్యాన్ని కూడా ఏడాదిలో పూర్తి చేసే విధంగా ఎంఎస్ఎంఈ 2022–23 యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ డే జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా పలు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం జిల్లాల్లో ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ డేగా ప్రకటించడంతోపాటు ప్రతి నెలా పరిశ్రమలను అనుసంధానం చేసేలా సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఏడాదిలో 624 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహించనుంది. అలాగే కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి గైడెన్స్ ఇవ్వడానికి 2,600 ప్రాజెక్టు రిపోర్టులను రూపొందింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి మంగళవారం 20కిపైగా పారిశ్రామిక సంఘాలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్చువల్ సమావేశం నిర్వహిస్తోంది. -
పెట్టుబడుల ఆకర్షణకు.. త్వరలో జపాన్‌లో రోడ్ షో
సాక్షి, అమరావతి: జపాన్ పెట్టుబడులకు రాష్ట్రం అనువైనదని, ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టగా.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో త్వరలో జపాన్‌లో రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు) సీఈఓ జవ్వాది సుబ్రమణ్యం వెల్లడించారు. జపాన్‌కు చెందిన పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగ ప్రతినిధుల బృందం శుక్రవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సుబ్రమణ్యంను కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఆసక్తిని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జవ్వాది మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో త్వరలో జపాన్‌లో రోడ్‌షోను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జపాన్ కంపెనీల సీఈఓలతో త్వరలో రాష్ట్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. అంతేకాక.. విశాఖపట్నంలో జపాన్‌కు చెందిన యొకొహమ గ్రూపునకు చెందిన ఏటీజీ టైర్స్ భారీ టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తుండటమే కాకుండా ఆ యూనిట్‌కు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కదుర్చుకున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. జైకా, జెట్రో తదితర జపాన్ సంస్థలతో కలిసి ప్రయాణిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు మరోవైపు.. శ్రీసిటీకి 25 కి.మీ దూరంలో ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ (జిట్)ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకే హెల్ప్‌డెస్క్ వెసులుబాటుతో పాటు శ్రీసిటీలో జపనీస్ భాష అనువాదకులనూ ఏర్పాటుచేశామన్నారు. ఇక దక్షిణాదిలో వాణిజ్యపరంగా ఏపీ అన్నింటికి అనువైన రాష్ట్రంగా ఎంయూఎఫ్‌జీ బ్యాంకు చెన్నై బ్రాంచ్ అధ్యక్షులు యుకిహిరో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ ఢిల్లీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కజుయోషి షిబటని, జపనీస్ కార్పొరేట్ బ్యాంకింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్లు సహిల్ అగర్వాల్, సందీప్ వర్మ, ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్ హాజరయ్యారు. -
దావోస్‌లో బ్రాండ్ ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను ప్రపంచానికి విస్తృతంగా చాటిచెప్పేలా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు లాంటి నవరత్న పథకాలతో గడప వద్దకే పరిపాలన చేరువ చేయటాన్ని దావోస్ సదస్సు వేదికగా తెలియచేసేలా ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దావోస్‌లో జరిగే పర్యటన వివరాలను గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు తెలియచేశారు. జనవరిలో జరగాల్సినా.. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం మేరకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర బృందం ఈ సమావేశాలకు హాజరవుతున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇప్పటివరకు డబ్ల్యూఈఎఫ్‌లో మెంబర్ అసోసియేట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై ప్రతిష్టాత్మక ఫోరం ప్లాట్‌ఫాం పార్టనర్‌గా చేరనుందని, దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. దీనిద్వారా డబ్ల్యూఈఎఫ్‌కు చెందిన సీఈవో స్థాయి చర్చలు, ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభించనుంది. సాంకేతిక ఆవిష్కరణల పునాదులపై పారదర్శకత, అధికార వికేంద్రీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు సీఎం జగన్ నిబద్ధతతో కృషిచేస్తున్నారని సమావేశాలకు ఆహ్వానించేందుకు వచ్చిన డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్జ్ బెండే ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ సమావేశాలు జనవరిలోనే జరగాల్సినా కోవిడ్ థర్డ్‌వేవ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడినట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలతో సారూప్యం కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా మారిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ‘కలసి పని చేయడం – నమ్మకాన్ని పునరుద్ధరించడం’ అనే లక్ష్యంతో దావోస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఇవి దగ్గరగా ఉన్నట్లు మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను ప్రచారం చేసేలా సమావేశాల కోసం రూపొందించిన లోగోను మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఆవిష్కరించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చాటే విధంగా రూపొందించిన బుక్‌లెట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసిన నవరత్నాలు, పర్యావరణం, సాంఘిక సంక్షేమం, సుపరిపాలన లాంటి 9 అంశాలకు బుక్‌లెట్‌లో ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. 10 రంగాలపై ఫోకస్ దావోస్ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 2,200 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా 18 రంగాలపై చర్చలు జరగనుండగా విద్య, వైద్యం, నైపుణ్యం, తయారీ రంగం, లాజిస్టిక్స్, ఆర్థికసేవలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, వినియోగదారుల వస్తువులు, ఎఫ్ఎంసీసీ లాంటి పదిరంగాల్లో అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కుపైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు. సీఐఐ నేతృత్వంలో 23న వైద్యరంగం, 24న విద్య, నైపుణ్యరంగం, డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా అడుగులులాంటి అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది పెట్టుబడుల సమావేశం కాదని, కోవిడ్‌తో మారిన వాణిజ్య పరిణామాలపై చర్చించి వ్యాపార అవకాశాలు, సలహాలు ఇచ్చిపుచ్చుకునేందుకు డబ్ల్యూఈఎఫ్ చక్కటి వేదిక అని పేర్కొన్నారు. -
కొప్పర్తిలో మెగా టెక్స్టైల్ పార్క్
సాక్షి, అమరావతి: ఏపీలో మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (వైఎస్సార్ జేఎంఐహెచ్)లో 1,186 ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద ఏర్పాటుచేయతలపెట్టిన ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 2,698 టెక్స్టైల్ యూనిట్లు పీఎం మిత్ర పథకంపై బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కరికాల వలవన్ మాట్లాడుతూ.. విశాఖపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ)లోని కొప్పర్తి నోడ్‌లో పెట్టుబడులకు ప్రత్యేక రాయితీలతో పాటు టెక్స్టైల్ అప్పెరెల్ పాలసీ కింద మరిన్ని రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. టెక్స్టైల్ రంగానికి కీలకమైన పత్తిని ఏటా 2.2 మిలియన్ బేళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే ఏపీ ఏడో స్థానంలో ఉందని.. అంతేకాక, సిల్క్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలో టెక్స్టైల్ క్లస్టర్లు ఉన్నాయని.. విశాఖలోని బ్రాండిక్స్ అప్పెరెల్ సిటీ (బీఐఏసీ), రెడీమేడ్ గార్మెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, గుంటూరులోని టెక్స్టైల్ పార్క్, ప్రకాశంలో వీవింగ్ ప్రాసెసింగ్ కేంద్రాలు, అనంతపురంలో రెడీమేడ్ గార్మెంట్స్ సహా హిందూపూర్ వ్యాపార్ అప్పెరెల్ పార్క్ లిమిటెడ్, నెల్లూరులో తారకేశ్వర టెక్స్టైల్ పార్క్, ఎంఎఎస్ ఫ్యాబ్రిక్ పార్క్, చిత్తూరులో వీవింగ్ రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెసింగ్ వంటి భారీ టెక్స్టైల్ పరిశ్రమలతో కలిపి మొత్తం 2,698 యూనిట్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వీటి ద్వారా రూ.4,957 కోట్ల పెట్టుబడితో 1,31,426 మందికి ఉపాధి లభిస్తోందని.. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా రూ.3,615 కోట్ల విలువైన టెక్స్టైల్ ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పీఎం మిత్ర కింద రాష్ట్రంలో భారీ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా కరికాల్ వలవన్ కోరారు. టెక్స్టైల్ పార్క్‌కు కొప్పర్తి అనుకూలం ఇక ప్రత్యేక రాయితీలు, అన్ని మౌలిక వసతులు కలిగిన వైఎస్సార్ జేఎంఐహెచ్.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రదేశమని ఏపీఐఐసీ వీసీ, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. కొప్పర్తికి సమీపంలో కడప స్పిన్నింగ్ మిల్స్, రాయలసీమ స్పిన్నర్స్, ఆదిత్య బిర్లా అప్పెరెల్ ఫ్యాక్టరీ, శ్రీ లలితా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్, శ్రీ గోవిందరాజ్ టెక్స్టైల్ లిమిటెడ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ వంటి పరిశ్రమలతోపాటు 1.3 లక్షల మంది సెమీ స్కిల్డ్, 21,511 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులతోపాటు, కడప, తిరుపతి, బెంగళూరు ఎయిర్‌పోర్టులు సమీపంలో ఇది ఉండటం ఎగుమతులకు కలసొచ్చే అంశంగా ఆయన పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కొప్పర్తిలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని గతంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. పరిశీలన కోసం త్వరలో రాష్ట్రానికి అధికారుల బృందం రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక పార్క్‌తో లక్షమందికి ప్రత్యక్ష ఉపాధి టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఏడు పీఎం మిత్ర పార్క్‌లను ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఇందుకోసం రూ.4,445 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. ఒక పీఎం మిత్ర పార్క్ ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు రెండు లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేసింది. ఏడు పార్కుల కోసం మొత్తం పది రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలు
సాక్షి, అమరావతి: ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు, అదానీ, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ, సెంచురీ ఫ్లైవుడ్స్ భజాంకా, శ్రీ సిమెంట్స్ బంగర్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూపు తూర్పు తీరప్రాంతంలో కీలకమైన కృష్ణపట్నం, గంగవరం ఓడరేవుల్లో భారీ పెట్టుబడులు పెట్టడమే కాకుండా సుమారు రూ.15,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, కన్వెన్షన్ సెంటర్లను నిర్మిస్తోంది. మరో కార్పొరేట్ దిగ్గజం బిర్లాలకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ సంస్థ వైఎస్సార్ జిల్లా పులివెందులలో రూ.110 కోట్లతో గార్మెంట్ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా భలభద్రపురంలో రూ.2,700 కోట్లతో భారీ కాస్టిక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. కృష్ణపట్నం వద్ద జిందాల్ గ్రూపు రూ.7,500 కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ప్లై తొలుత రూ.600 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు రాగా రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని చూసి పెట్టుబడులను రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక ప్రకటించడం పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. సన్‌ఫార్మా, శ్రీ సిమెంట్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. రెండేళ్లలో రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం వచ్చే రెండేళ్లలో రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిపి సుమారు 70 భారీ పరిశ్రమలు యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. వీటి ద్వారా 1,80,754 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోనే రూ.1.07 లక్షల పెట్టుబడులు రానున్నాయి. ఓఎన్జీసీ తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా హిందుస్థాన్ పెట్రోలియం విశాఖలో రూ.28,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. రూ.6,700 కోట్లతో అన్‌రాక్ అల్యూమినియం, రూ.1,750 కోట్లతో జపాన్‌కు చెదిన ఏటీసీ టైర్స్, రూ.1,200 కోట్లతో కర్నూలులో రామ్‌కో సిమెంట్, రూ.1,404 కోట్లతో కాకినాడ జిల్లాలో శ్రావణ్ షిప్పింగ్ , రూ.2,000 కోట్లతో విశాఖలో సెయింట్ గోబియాన్ లాంటి భారీ సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 92 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 92 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. ప్రభుత్వ సహకారంతో కియా మోటార్స్, కిసాన్ క్రాఫ్ట్, హీరో మోటార్స్, టీహెచ్‌కే ఇండియా, దివీస్ ఫార్మా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి 92 భారీ పరిశ్రమలు ఈ కాలంలో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.36,313 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చగా 56,681 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న రంగాల్లో ఆటోమొబైల్, బల్క్ డ్రగ్స్, ఫార్మా, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్, ఫుడ్– మెరైన్ ప్రోడక్టŠస్ ఉన్నాయి. పోర్టు ఆధారిత పెట్టుబడులపై దృష్టి 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఆకర్షించేలా ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. కొత్తగా నాలుగు పోర్టులు నిర్మించడంతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. పరిశ్రమలకు అన్ని వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులతోపాటు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు, ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పెట్టుబడులకు అనువైన రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. కరోనా సమయంలోనూ బిర్లా, అదానీ, జిందాల్, సంఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో అంతర్జాతీయ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేస్తాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
ఏపీకి పెట్టుబడుల సిరులు: మేకపాటి గౌతంరెడ్డి
-
విదేశీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్పో–2022లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రతి అంశంలో ఏపీ ప్రత్యేకత కనిపించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 11 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరగనున్న ఎక్స్పోకి ఏర్పాట్లపై అధికారులతో గౌతమ్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎక్స్పోకి ప్రభుత్వం తరఫున మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం హాజరవనుంది. పలు ఆహార, సరకు రవాణా కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చాయి. ఈ నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఎక్స్‌పోలో ఏపీ పెవిలియన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది మంత్రికి వివరించారు. ఏపీ పెవిలియన్‌లో ఎంఎస్ఎంఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, ఐటీ, పోర్టులు సహా పలు రంగాలపై ఏపీ ప్రత్యేకతను చాటేందుకు తీసుకున్న చర్యలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. పర్యటన ఇలా.. ఈ నెల 13న 100 మంది సభ్యులతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 14న పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం, రోడ్ షో నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 250 మందికి పైగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి నేతృత్వంలో భారీ సమావేశం ఉంటుంది. 15న ప్రపంచ స్థాయి సకల సదుపాయాలతో కూడిన డీపీ వరల్డ్ ఫెసిలిటీ సైట్ విజిట్‌లతోపాటు వివిధ ఎమిరేట్ కంపెనీలతో బీ2జీ సమావేశానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 16న ‘ముబదల’ పెట్టుబడుల కంపెనీతో మంత్రి సమావేశమై ఏపీ గురించి చర్చిస్తారు. -
దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా..
సాక్షి, అమరావతి: పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు దిగ్గజ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన పలు భారీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఆయా కంపెనీల అధినేతలు పలువురు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో ప్రముఖ కంపెనీల రాక.. స్టాక్ మార్కెట్లో నమోదైన 15కిపైగా కంపెనీలు గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. రూ.లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన సన్‌ఫార్మా, ఐటీసీ, అదానీ, ఓఎన్జీసీ, ఆదిత్య బిర్లా గ్రూపు, అరబిందో, కాంకర్, బీఈఎల్, జిందాల్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డిక్సన్, బ్లూస్టార్, సెంచరీ ఫ్లైవుడ్, శ్రీ సిమెంట్ లాంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టు బడులు పెడుతున్నాయి. సన్‌ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వీ ముఖ్యమంత్రితో సమావేశమై రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐటీసీ సంస్థ గుంటూరులో తొలి ఫైవ్‌స్టార్ హోటల్‌ను నెలకొల్పడమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో కూడా ఐటీసీ పాలు పంచుకుంటోంది. సుమారు రూ.7.50 లక్షల కోట్ల విలువైన అదానీ గ్రూపు కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు విశాఖలో రూ.14,634 కోట్లతో 200 ఎంవీ డేటా సెంటర్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా రూ.24,990 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, బీఈఎల్ లాంటి కేంద్ర సంస్థలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో రూ.96,400 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 79,700 మందికి ఉపాధి లభించనుంది. ఒక్క ఓఎన్జీసీనే తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్లు వెచ్చిస్తుండటం గమనార్హం. ఓఎన్జీసీ చైర్మన్ సుభాష్ కుమార్ గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన సంగతి తెలిసిందే. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై ప్రధానంగా చర్చించారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో బీఈఎల్ యూనిట్ల పనులు జరుగుతుండగా విశాఖలో హెచ్‌పీసీఎల్ రూ.17,000 కోట్ల పెట్టుబడులను పెడుతోంది. పీఎల్ఐపై ప్రత్యేక దృష్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డిక్సన్ లాంటి లిస్టెడ్ కంపెనీలను ఆకర్షించగా ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్టైల్ రంగాల్లో కూడా భారీ పెట్టుబడులను రప్పించేలా చర్చలు జరుపుతోంది. దేశాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేలా 13 రంగాల్లో రూ.1.97 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఇచ్చేలా పీఎల్ఐ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం విధానం రాష్ట్ర సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానమని స్పష్టమైంది. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. సాంకేతికతను వినియోగించుకుని అత్యంత నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయడం ద్వారా ప్రజల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముందడుగు వేస్తున్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాం. ఏపీలో ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా ఔషధాల ఎగుమతి మా లక్ష్యం. – సన్‌ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వి. ఏపీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌తో మాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం బాగుంది. త్వరలో మరో రూ.400 కోట్ల మేర ఏపీలో పెట్టుబడి పెట్టనున్నాం. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగస్వాములు కావడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వెచ్చిస్తాం. – గుంటూరులో ఐటీసీ ఫైవ్‌స్టార్ హోటల్ ప్రారంభోత్సవంలో సంస్థ చైర్మన్, ఎండీ సంజీవ్ పూరి -
చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం
సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విధానాలతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామికరంగానికి ఊతమిచ్చేలా పలు చర్యలు చేపట్టారు. గత ఏడాది కోవిడ్ సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు)పై ఎక్కువ ప్రభావం పడింది. అయితే, రాష్ట్రంలోని పరిశ్రమలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేయూతనివ్వడంతో ఇక్కడి ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకోవడమే కాదు.. కొత్త పరిశ్రమలూ క్యూ కడుతున్నాయి. కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ పారిశ్రామిక రాయితీలు సకాలంలో ఇస్తుండటం, కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రెండు విడతల్లో రూ.2,086 కోట్లపైన ఇచ్చింది. ఇతరత్రా సహాయ సహకారాలు అందించింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం బకాయిలేమీ లేకుండా ప్రభుత్వ పరంగా చెల్లించాల్సినవి ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ప్రభుత్వ చర్యలతో అత్యధిక ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి రాష్ట్రం వేదికగా మారుతోంది. పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం సీఎంగా జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి గత ఏడాది (2021) డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 19,997 ఎంఎస్ఎంఈలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఈ యూనిట్ల ద్వారా రూ.4,558.01 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 1,09,829 మందికి ఉపాధి లభించింది. గడిచిన 12 నెలల్లోనే 6,875 యూనిట్ల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఏర్పాటు కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.2,055.01 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 45,932 మందికి ఉపాధి లభిస్తోంది. చిన్న పరిశ్రమలకు అందిస్తున్న సహకారం రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించడంతో పాటు ప్రస్తుత పారిశ్రామిక బకాయిలు సకాలంలో అందిస్తున్నారని ఫ్యాఫ్సియా అధ్యక్షులు వి.మురళీకృష్ణ తెలిపారు. కోవిడ్ కారణంగా పరిశ్రమలు మూతపడే సమయంలో రాయితీలు ఇవ్వడం ద్వారా పరిశ్రమ నిలబడటానికి ప్రభుత్వం ఊతమిచ్చిందని చెప్పారు. కోవిడ్‌తో ఏర్పడిన సమస్యలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు అన్ని సదుపాయాలు ఒకేచోట లభించేలా మౌలిక వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధితో పాటు ఎంఎస్ఈసీడీపీ పథకం కింద వివిధప్రాజెక్టులను చేపట్టింది. రూ.214 కోట్లతో ఎంఎస్ఎం ఈ క్లస్టర్లు, కా మన్ ఫెసిలిటీ సెంటర్లను అభి వృద్ధి చేస్తోంది. రూ.27.60 కోట్లతో మూడు ఎంఎస్ఎంఈ పార్కులు, ఆరుచోట్ల రూ.75.76 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్స్‌ను, రూ.95.53 కోట్లతో మరో ఆరు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తోంది. రూ.15.11 కోట్లతో ఫ్లాట ర్డ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తోంది.రాష్ట్ర పారిశ్రామిక విధానం 2020–23లో ఎం ఎస్ఎంఈలకు ప్రత్యేక రాయితీలివ్వడం, కొత్తగా ఏర్పాటుచేసే సంస్థలకు ప్రతిపాదనలు ద గ్గర నుంచి ఉత్పత్తి మొదలయ్యేవరకు సహకా రం అందించేలా సిడ్బీతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రంవైపు చూసేలా చేస్తోందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. -
పెట్టుబడుల పట్టుగొమ్మ
సాక్షి, అమరావతి: ఓ వైపు కోవిడ్ భయాలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆదానీ, ఆదిత్యా బిర్లా, ఓఎన్జీసీ, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్, సెంచరీ పైబోర్డ్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు తోడు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏసీలు, మొబైల్ విడిభాగాల ఉత్పత్తులను తయారు చేయడానికి బ్లూస్టార్, డైకిన్, యాంబర్, డిక్సన్, ఫాక్స్‌కాన్, సెల్కాన్, కార్బన్ వంటి సంస్థలు ముందుకు రావడంతో 2021ని ‘ఎలక్ట్రానిక్ ఇయర్’గా పిలుచుకోవచ్చని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామిక మౌలిక వసతులను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఆంక్షలు ఉన్నప్పటికీ రికార్డు సమయంలో 3,155 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి అదనంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద 2,134 ఎకరాల్లో క్రిస్ సిటీ పేరుతో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కు తొలి దశలో భాగంగా రూ.1,190 కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి డీపీఆర్ రూపొందిస్తోంది. ఇదే సమయంలో రూ.13,254 కోట్లతో రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో మూడు పోర్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. దేశంలోనే తొలిసారిగా రూ.3,622.86 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఆమోదం తెలపడమే కాకుండా 4 హార్బర్ల పనులు మొదలుపెట్టి మరో 5 హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చిన కొన్ని ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనలు ► విశాఖలో ఆదాని గ్రూప్ రూ.14,634 కోట్లతో 200 ఎంవీ సామర్థ్యంతో డేటా పార్క్ ఏర్పాటు చేయడానికి ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం 130 ఎకరాల భూమిని కేటాయించింది. ► కడపలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌లో భాగస్వామ్యం కావడానికి ఎస్సార్ స్టీల్ ముందుకొచ్చింది. ఈ యూనిట్లో సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ► కాకినాడ డీప్ వాటర్ పోర్టు వద్ద రూ.3,600 కోట్ల పెట్టుబడితో ఈపీసీఎల్ ఎల్ఎన్జీ టెర్మినల్. ► నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం వద్ద రూ.7,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్. ► కొప్పర్తిలో రూ.401 కోట్లతో పిట్టి రెయిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్, పరిశ్రమల పరికరాల తయారీ యూనిట్. ► కొప్పర్తిలో రూ.486 కోట్లతో నీల్కమల్ ఫర్నిచర్ తయారీ యూనిట్ ► నాయుడుపేటలో గ్రీన్‌టెక్ రూ.627 కోట్లతో విస్తరణ పనులు. ► రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో రూ.2,868.6 కోట్ల పెట్టుబడులతో హోటల్స్ ఏర్పాటు. ► కొప్పర్తిలో రూ.110 కోట్లతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ యూనిట్ ► వైఎస్సార్ జిల్లా బద్వేలులో రూ.2,600 కోట్లతో సెంచరీ ప్లైబోర్డ్స్ తయారీ యూనిట్. ► తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.861 కోట్లతో గ్రాసిం ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా తయారీ యూనిట్. ► కొప్పర్తిలో రూ.207 కోట్ల పెట్టుబడితో ఏఐఎల్ డిక్సన్ తయారీ యూనిట్. ► కొప్పర్తిలో రూ.75 కోట్లతో డీజికాన్ సొల్యూషన్స్ యూనిట్ ఏర్పాటు. ► రూ.100 కోట్లతో సెల్కాన్ రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్. ► రూ.109 కోట్లతో ఆస్ట్రం టెక్నికల్ భాగస్వామి చంద్రహాస్ ఎంటర్‌ప్రైజస్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్. ► రూ.112 కోట్లతో యూటీఎన్పీఎల్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్. ► రూ.365 కోట్లతో వీవీడీఎన్ యూనిట్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్. ► రూ.1,800 కోట్లతో కార్బన్ హార్మనీ యూనిట్. ► శ్రీ సిటీలో డైకిన్ రూ.1,000 కోట్లతో ఏసీ తయారీ యూనిట్. ► శ్రీ సిటీలో రూ.540 కోట్లతో బ్లూస్టార్ ఏసీ తయారీ యూనిట్. ► శ్రీ సిటీలో రూ.250 కోట్లతో యాంబర్ ఏసీ తయారీ యూనిట్. -
ఏపీలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో మరిన్ని పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో భాగస్వామి కావడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి నేతృత్వంలో సంస్థ బృందం గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రైతుల ఉత్పత్తులకు మంచి ధర అందించడం, నైపుణ్యాభివృద్ధిపై విస్తృత చర్చలు జరిగాయి. రైతుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన విప్లవాత్మక చర్యలను సీఎం జగన్ íఫ్లిప్‌కార్ట్ట్ బృందానికి వివరించారు. రైతులకు ఉత్తమ టెక్నాలజీ అందిద్దాం: సీఎం జగన్ రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించాం. విత్తనం అందించడం దగ్గర నుంచి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఫ్లిప్‌కార్ట్ కూడా ముందుకురావాలి. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించడంలో పాలు పంచుకోవాలి. రైతులకు మంచి టెక్నాలజీని అందుబాటులోకి తేవడంలో సహాయపడాలి. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు సీఎం యాప్ తీసుకొచ్చాం. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలి. విశాఖ మంచి వేదిక ఐటీ, ఇ–కామర్స్ పెట్టుబడులకు విశాఖపట్నం మంచి వేదిక. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఫ్లిప్‌కార్ట్‌ను కోరుతున్నా. నైపుణ్యాలను పెంపొందించేందుకు విశాఖలో ఏర్పాటు చేస్తున్న హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీలో పాలు పంచుకోవాలి. రాష్ట్రం నుంచి మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్ సహకారం అందించాలి. జగన్ దార్శనిక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్ సీఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తాము విస్తృతం చేస్తున్న సరుకుల వ్యాపారం ద్వారా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమని, మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, అక్కడ మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని, వచ్చే ఏడాది నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. వాల్‌మార్ట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో మత్స్యఉత్పత్తుల కొనుగోళ్లు చేస్తున్నామని, దీన్ని మరింత పెంచుతామన్నారు. సీఎం దూరదృష్టి ఎంతో బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు లభించేలా అంకితభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని అభినందించారు. సమావేశంలో ఫ్లిప్‌కార్ట్ సీసీఏవో రజనీష్ కుమార్, సీఎం కార్యదర్శి ఆరోఖ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీతో కలిసి పనిచేయడానికి సిద్ధం
నెల్లూరు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ప్రత్యేక బృందం తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల పెట్టుబడులు, ఇతర విషయాలపై చర్చించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని జపాన్ ప్రతినిధులు టెక్ గెంట్సియా సీఈవో జాయ్ సెబాస్టియన్, మార్కెటింగ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ డెనిస్ యూజిస్ అరకవల్ తదితరులు శనివారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏపీతో కలసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమలు, నైపుణ్య రంగాల్లో తీసుకుని వస్తోన్న వినూత్న సంస్కరణలతో పాటు, యువతకు ఉపాధి పెంచడం కోసం చేపడుతున్న చర్యలను జపాన్ బృందానికి మంత్రి వివరించారు. రెండు రోజుల్లో మరోసారి భేటీ అయ్యాక పలు అంశాలపై చర్చించి ముందుకు వెళతామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లూ ఓషియాన్ బిజినెస్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ చైర్మన్ బెన్సి జార్జ్ పాల్గొన్నారు. -
8 నెలల్లో రూ. 7,128 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వేగంగా ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రంలోకి రూ. 7,128 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 31 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొంది. ఇందులో వైఎస్సార్ జిల్లాలో పిట్టి రైల్ ఇంజనీరింగ్, చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో హావెల్స్ ఇండియా ఏసీ తయారీ యూనిట్, వైజాగ్‌లో అరబిందో ఫార్మా స్టెరిలైట్ యూనిట్, మోల్డ్‌టెక్ ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ, అనంతపురం జిల్లాలో ఎస్బీ ఎనర్జీ సోలార్ యూనిట్, కర్నూలు జిల్లాలో ఎస్బీజీ క్లీన్టెక్ ప్రాజెక్ట్స్, చిత్తూరులో కోకాకోలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి. ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టడం కోసం డీపీఐఐటీ వద్ద ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెమోరాండం పార్ట్–ఏ దరఖాస్తు చేసుకున్నాయి. వీలయినంత త్వరగా తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో మొత్తం 26 యూనిట్లు వాణిజ్య పరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 8,611 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇందులో జెమినీ ఈడిబుల్ ఆయిల్, ఇండియా మెటల్‌వన్, వసంత ఇండస్ట్రీస్, రంగ ప్రాక్టికల్ బోర్డ్స్, అయన సోలార్, ఫాక్స్‌లింక్ ఎలక్ట్రానిక్ వంటి సంస్థలు ఉన్నాయి. అలాగే 2020 సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 9,727 కోట్ల విలువైన 59 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. 42 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో రూ. 9,840 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. -
పారిశ్రామికవేత్తలకు అవార్డులతో ముఖ్యమంత్రి సత్కారం
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది పారిశ్రామికవేత్తలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. రెండేళ్లలో రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు, నమోదు చేసిన వ్యాపార పరిమాణం, ఉద్యోగాల కల్పన ఆధారంగా ఇండస్ట్రీ చాంపియన్లుగా ఎనిమిది మందిని, ఎగుమతుల్లో కీలక భాగస్వామ్యం వహించిన ఏడుగురు ఎగుమతిదారులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ఎంపిక చేసింది. విజయవాడలో మంగళవారం జరిగిన వాణిజ్య ఉత్సవ్‌లో వీరిని మెమెంటో, శాలువా, పుష్పగుచ్ఛాలతో ముఖ్యమంత్రి సత్కరించారు. ఇండస్ట్రీ చాంపియన్ అవార్డులు అందుకున్నవారు 1. పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సయంట్ లిమిటెడ్ 2. కబ్ డంగ్ లే, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3. అనిల్ చలమశెట్టి, ఎండీ, గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ 4. అవినాష్‌చంద్ రాయ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదాని ఇంటర్నేషనల్ 5. ఇషాన్‌రెడ్డి ఆళ్ల, ప్రమోటర్ డైరెక్టర్, రామ్కీ గ్రూపు 6. సి.వి.రాజులు, వైస్ ప్రెసిడెంట్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 7. కె.మదన్‌మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అరబిందో ఫార్మా 8. జోష్ ఫగ్లర్, ఎండీ, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా లిమిటెడ్ ఎక్స్పోర్ట్ అవార్డులు అందుకున్నవారు 1. సి.శరవణన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ ప్రైవేట్ లిమిటెడ్ 2. లీ మి తేస్, జనరల్ మేనేజర్, అపాచీ ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3. బి.వి.కృష్ణారావు, ఎండీ, పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4. వంకా రాజకుమారి, ఎండీ, ఇండియన్ హైర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5. పాండవ ప్రసాద్, జీఎం, ఎస్ఎన్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ 6. సింగలూరి శారదాదేవి, పార్టనర్, ఆర్వీ కార్ప్ 7. కె.శ్రీనివాసరావు, ఎండీ, అమరావతి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ -
పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రంతో పాటు మీరూ వృద్ధి చెందండి: సీఎం జగన్
ఈ కష్టకాలంలో పారిశ్రామికవేత్తలు చూపి స్తున్న అంకితభావానికి, ఎగుమతి దారులు, వాణిజ్య మండళ్లు, శ్రమిస్తున్న కార్మికులందరికీ అభినందనలు. పారిశ్రామికవేత్తల్లో ఈ వాణిజ్య ఉత్సవ్ మరింత నమ్మకాన్ని కల్పిస్తుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్రంతోపాటు అభివృద్ధి చెందేలా మరింత మందిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటాం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. మేం చేయాల్సినవి ఏమైనా ఉంటే సూచనలు చేయండి. కచ్చితంగా నెరవేరుస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినప్పటికీ రాష్ట్ర ఎగుమతుల్లో మాత్రం వృద్ధి నమోదైందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సరైన మౌలిక వసతులు, చక్కటి విధానాలు అమలు చేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలమనేందుకు ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో నమోదవుతున్న వృద్ధి, జీడీపీ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 290 బిలియన్ డాలర్లకు పడిపోగా అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయని వివరించారు. 2020–21లో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించగా రాష్ట్ర జీఎస్డీపీ క్షీణత 2.58 శాతానికే పరిమితమైందన్నారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో 5.8 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రెండు రోజుల ట్రేడ్ కార్నివాల్ ‘వాణిజ్య ఉత్సవ్’ను మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంతో పాటు మీరు కూడా (పారిశ్రామికవేత్తలు) అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయడంతో పాటు ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పోర్ట్ ట్రేడ్ పోర్టల్, వైఎస్సార్ ఏపీ వన్ బిజినెస్ అడ్వైజరీ సర్వీసులను బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ.. వాణిజ్య ఉత్సవ్–2021ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారం రోజులు మీతోనే... ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వచ్చిన వివిధ దేశాల దౌత్యాధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతి దారులు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్ల సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇతర భాగస్వాములందరికీ స్వాగతం. విజయవాడలో రెండు రోజులపాటు వాణిజ్య ఉత్సవ్ అనంతరం నాలుగు రోజులపాటు జిల్లాల్లో కూడా జరుగుతాయి. వారం రోజులపాటు వాణిజ్య వర్గాలు, ప్రభుత్వం కలసి మెలసి పనిచేస్తాయి. సంక్లిష్ట సమయం.. గత రెండేళ్లలో పెను సవాళ్లను ఎదుర్కొన్నాం. తొలి ఏడాది మాంద్యం కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటే రెండో సంవత్సరం కోవిడ్ విపత్తును చూశాం. దీనివల్ల దేశవ్యాప్తంగా రెవెన్యూ వసూళ్లు 3.38 శాతం పడిపోయాయి. 2018–19లో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ.20,80,465 కోట్లు ఉంటే 2019–2020లో రూ.20,10,059 కోట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. 2020–21లో మరింత క్షీణించి 7.3 శాతానికి పడిపోయింది. దేశ ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 290 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఎగుమతుల రంగానికి ఇది అత్యంత సంక్లిష్ట సమయం. 9 నుంచి 4కి ఎగబాకిన ర్యాంకు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ఎగుమతులు 19.4 శాతం వృద్ధి చెందాయి. రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో సముద్రపు ఉత్పత్తులు 15 శాతం ఉండగా షిప్స్, బోట్ల నిర్మాణ రంగం 8.5 శాతం, ఫార్మా రంగం 7.3 శాతం, ఐరన్, స్టీల్ ఉత్పత్తులు 7.3 శాతం, నాన్ బాస్మతి రైస్ 4.8 శాతంతో ఎగుమతులకు దోహదపడ్డాయి. 2018–19లో ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా 2019–20లో 7వ స్థానానికి చేరుకుంది. 2020–21లో నాలుగో స్థానానికి చేరుకున్నాం. రాష్ట్ర జీఎస్డీపీ కోవిడ్ సంవత్సరం 2020–21లో 2.58 శాతం క్షీణిస్తే దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించింది. ఈ వివరాలు ఎందుకు చెబుతున్నామంటే.. సరైన మౌలిక వసతుల కల్పన, చక్కటి విధానాల ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని మా గట్టి నమ్మకం. పారిశ్రామిక ప్రగతి, ఎగుమతుల వృద్ధికి ఈ రెండూ చాలా కీలకం. రెండేళ్లలో చాలా దూరం ప్రయాణం గత రెండేళ్లలో మేం చాలా దూరం ప్రయాణం చేశాం. రూ.5,204 కోట్లతో రాష్ట్రంలో 16,311 ఎంఎస్ఎంఈలు నెలకొల్పడం ద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాకుండా గత రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175 కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. 76,960 మందికి ఉద్యోగాలను కల్పించే సామర్థ్యం వీటికి ఉంది. గత ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు కానున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ – గెయిల్ స్థిరమైన పారిశ్రామిక ప్రగతి కోసం అవసరాలకు సరిపడా ఇంధన వనరులు అందుబాటులో ఉండడం చాలా కీలకం. సరిపడా గ్యాస్ లభ్యం కావాలి. పరిశ్రమలు, గృహ అవసరాల కోసం గ్యాస్ అందుబాటులో ఉంచడానికి గెయిల్ భాగస్వామ్యంతో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. అతి తక్కువ ఖర్చుతో ఇంధన వనరులను అందుబాటులోకి తేవడం దీని ఉద్దేశం. 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు నైపుణ్య లేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు తిరుపతి, విశాఖల్లో స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక యూనివర్సిటీ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టిపెడితే మరో వర్సిటీ ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించటంపై దృష్టి సారిస్తుంది. ఇవి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచి ఉద్యోగాల కల్పన దిశగా నడిపిస్తాయి. కొత్త పోర్టుల నిర్మాణం... రాష్ట్రానికి 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం ఉంది. ఎగుమతులు వృద్ధి చెందడానికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పోర్టులను నిర్మిస్తోంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టులను నిర్మిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ పోర్టులు సమీపంలో ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు, రామాయపట్నం తమిళనాడుకు, భావనపాడు ఉత్తరాది రాష్ట్రాలకు సమీపంలో ఉన్నాయి. విదేశీ వాణిజ్యాన్ని పెంచడంలో ఈ పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి. పారిశ్రామికీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టుల వార్షిక నిర్వహణ సామర్థ్యం 254 మిలియన్ టన్నులు కాగా మూడు కొత్త పోర్టుల వల్ల తొలిదశలో మరో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వృద్ధి చెందుతుంది. 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు వీటితోపాటు మరో 8 ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్మిస్తున్నాం. ఏపీకి ఇంత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్నా హార్బర్లు లేకపోవడంల్ల మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు విడతల్లో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. ఇందుకోసం రూ.3,827 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల 76,230 మంది మత్స్యకారులు లబ్ధి పొందడమే కాకుండా మరో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, చేపలు, రొయ్యల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి. 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల రైతులకు మంచి ధరలు దక్కడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లున్న ఏకైక రాష్ట్రం దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి. ఈ కారిడార్లు ఆర్థిక వృద్ధి రేటును పెంచడమే కాదు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. 3,155 ఎకరాల్లో మల్టీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్తు, నీరు, ఎస్టీపీలు లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు లక్ష మందికిపైగా ఉపాధి కల్పించే సమర్థత ఈ పార్కుకు ఉంది. ఇదే ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 800 ఎకరాల్లో రూ.730 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నాం. దీనిద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన సామర్థ్యం ఈఎంసీకి ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిన దృష్ట్యా 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ.13,500 కోట్లతో కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నాం. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ విజయవాడలో రెండురోజుల వాణిజ్య ఉత్సవ్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అమితంగా ఆకర్షించింది. రాష్ట్రంలో ఎగుమతి అవకాశాలను తెలిపే విధంగా మొత్తం 29 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 15 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఏపీ ఎక్స్పీరియన్స్ ఎరినా పేరుతో రాష్ట్రంలో మౌలిక వసతులు, వైఎస్సార్ వన్ ద్వారా అందించే బిజినెస్ అడ్వైజరీ సేవలు, రాష్ట్రంలో ఎగుమతులకు అవకాశం ఉన్న ఉత్పత్తులు, ఎగుమతులకు ప్రభుత్వం సహకారం తెలిపే విధంగా మూడు తెరలు ఏర్పాటు చేసి వీడియోలు చూసేలా టచ్ స్క్రీన్ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 15 నిమిషాలపాటు ఆసక్తిగా ఎరినా, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. మానవ శిరోజాలను ఎగుమతిచేసే స్టాల్స్, టీ ఎగుమతులు, హస్తకళలు, ఎంపెడా ఏర్పాటు చేసిన అక్వేరియం చేపలు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ, హస్తకళల స్టాల్స్‌ను సందర్శించి వ్యాపారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ స్టాల్స్‌లో చిన్న వేంకటేశ్వరస్వామి ప్రతిమను చూసి వీటిని పెద్దగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిథులకు ఇచ్చే మెమెంటోగా వాడుకోవచ్చని సీఎం అధికారులకు సూచించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఉత్పత్తులను తిలకిస్తున్న సీఎం జగన్ -
సీఎం జగన్‌ను కలిసిన యునైటెడ్ టెలిలింక్స్, నియోలింక్ కంపెనీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో యునైటెడ్ టెలిలింక్స్ నియోలింక్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. రూ.2150 కోట్ల పెట్టుబడితో 6వేల మందికి పైగా ప్రత్యక్షంగా 15 నుంచి 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యూటీఎన్పీఎల్ ముందుకు వచ్చింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రముఖంగా ఉన్న యూటీఎల్, నియోలింక్‌తో కలిసి తిరుపతి, వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్ఆర్ ఈఎంసీలో ఫ్యాక్టరీల ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్‌కు కంపెనీల ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో యూటీఎల్ ఛైర్మన్, డైరెక్టర్ సుధీర్ హసీజ, నియోలింక్ గ్రూప్ ఛైర్మన్ రువెస్ షెబెల్, గోల్డెన్ గ్లోబ్ ఎండీ రవికుమార్, వైఎస్సార్ ఈఎంసీ సీఈవో నందకిశోర్‌రెడ్డి ఉన్నారు. -
7 పరిశ్రమలు.. రూ.11,239.16 కోట్లు పెట్టుబడుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.11,239.16 కోట్ల పెట్టుబడితో కొత్తగా ఏడు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమల ద్వారా కొత్తగా ప్రత్యక్షంగా 17,334 మందికి ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఏర్పాటు కానున్న పరిశ్రమల వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రిటైల్ పాలసీకి కూడా ఇదే సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలు, పెట్టుబడుల వివరాలు ఇవీ.. జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ రూ.7,500 కోట్ల పెట్టుబడి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామం తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ధరతో ఇచ్చేందుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. 2.25 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.401 కోట్లతో కొప్పర్తిలో ‘పిట్టి’ ప్రాజెక్టు కడప సమీపంలోని కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇక్కడ ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం రూ.401 కోట్లు పెట్టుబడి పెట్టి ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. రూ.486 కోట్లతో కొప్పర్తిలో నీల్కమల్ పరిశ్రమ కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్కమల్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్ఐపీబీ బోర్డు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు నెలకొల్పిన నీల్కమల్ ఇక్కడ అన్నిటికంటే పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.486 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక్కడ ఫర్నీచర్, ఇతర గృహోపకరణాల తయారీ చేపట్టనున్నారు. తద్వారా ప్రత్యక్షంగా 2,030 మందికి ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నాయుడుపేటలో రూ.627 కోట్లతో గ్రీన్‌టెక్ విస్తరణ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ విస్తరణకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్ తదితర కంపెనీలకు గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ స్టీల్, ఐరన్ ఉత్పత్తులను అందిస్తోంది. అత్యాధునిక రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ చేపట్టింది. జర్మనీ నుంచి ఐఎల్టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రీన్‌టెక్ వినియోగించనుంది. ప్రస్తుతం 2,700 మందికి ఉద్యోగాలు కల్పించగా విస్తరణ ద్వారా అదనంగా 2,200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టగా విస్తరణ ద్వారా మరో రూ.627 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. తాడేపల్లిలో రూ.194.16 కోట్లతో రిటైల్ బిజినెస్ పార్క్ టెక్స్టైల్స్, గార్మెంట్స్ మార్కెట్ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్ పార్క్ నిర్మాణానికి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.194.16 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్ యూనిట్స్ వస్తాయి. తద్వారా సుమారు 5 వేల మందికిపైగా ప్రత్యక్షం ఉద్యోగాలు, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాల హబ్‌గా ఈ పార్క్ ఏర్పాటు అవుతుంది. రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70 శాతం విక్రయాలు ఇక్కడనుంచే జరుగుతాయని అంచనా. పార్క్‌లో భాగంగా ఏర్పాటయ్యే ఒక్కో స్టోర్‌లో ఏటా సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. రూ.30 కోట్లతో చిత్తూరు జిల్లాల్లో వస్త్ర పరిశ్రమ చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. సుమారు రూ.30 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే పరిశ్రమ ద్వారా 2,304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో 90 శాతం మహిళలకే ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇక్కడ పురుషులు, పిల్లల దుస్తులు తయారవుతాయి. విశాఖలో సెయింట్ గోబియాన్ రూ.2,001 కోట్ల పెట్టుబడి విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో నిర్మాణం జరుగుతున్న సెయింట్ గోబియాన్ పరిశ్రమకు ఏర్పాటు కాలవ్యవధి పొడిగింపునకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువు పెంచాలన్న సెయిట్ గోబియాన్ వినతి మేరకు జూన్ 2022 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సెయింట్ గోబియాన్ మూడు దశల్లో రూ.2,001 కోట్ల పెట్టుబడి పెడుతుంది. తద్వారా 1,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ► ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి జి.జయరాం, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. -
ఉపాధి కల్పనకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో భాగంగా భూకేటాయింపులను త్వరితగతిన చేస్తోంది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా వడివడి అడుగులు వేస్తోంది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేవలం రెండేళ్ల కాలంలోనే 2,068 కంపెనీలకు 2,526.52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. వీటిలో 2,050 కంపెనీలు సూక్ష్మ, మధ్యతరగతికి చెందినవే కావటం విశేషం. డీఆర్డీవో, పార్లే ఆగ్రో, ఏటీజీ టైర్స్, ఇంటెలిజెంట్ సెజ్, ఓఎన్జీసీ, ఏఆర్ లైఫ్ సైన్స్, జీఎం మాడ్యులర్, ఆస్ట్రమ్ ఇండస్ట్రీస్, లైఫ్ టైమ్ ఫార్మా వంటి సంస్థలతో పాటు అనేక సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు భూములు కేటాయింపు చేశారు. ఈ యూనిట్ల ద్వారా 1,54,757 మందికి ఉపాధి లభించనుంది. పూర్తి పారదర్శకంగా ఉండేవిధంగా ఆన్లైన్లోనే భూ కేటాయింపులు చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ (ఏపీఐసీసీ) అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం హయాంలో.. ఐదేళ్ల కాలంలో 2,980 యూనిట్లకు భూ కేటాయింపులు చేయగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే 2,068 కంపెనీలకు భూములు కేటాయించడం విశేషం. ఇంకా అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నాయని, త్వరలోనే మరిన్ని కంపెనీలు ఏర్పాటయ్యేలా కృషి జరుగుతోందని ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఐదు జిల్లాల మధ్య పోటీ పెట్టుబడుల ఆకర్షణలో ప్రధానంగా ఐదు జిల్లాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. అత్యధికంగా 408 యూనిట్ల ఏర్పాటుతో 35,501 మందికి ఉపాధి కల్పించడం ద్వారా చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. వీటిద్వారా చిత్తూరు జిల్లాలో రూ.3,791.76 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 232 యూనిట్ల ఏర్పాటుతో విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉండగా.. ఇక్కడ రూ.9,321.37 కోట్ల పెట్టుబడి రానుంది. తద్వారా 33,154 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కృష్ణా జిల్లాలో 267, ప్రకాశం జిల్లాలో 254, తూర్పు గోదావరి జిల్లాలో 223 యూనిట్లకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. -
రాష్ట్రానికి రెండేళ్లలో పెట్టుబడులు రూ.33,323.2 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 మహమ్మారి ఉన్నప్పటికీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. గడచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోకి రూ.33,323.2 కోట్ల విలువైన నూతన పెట్టుబడులు వచ్చినట్టు సర్వే లెక్క గట్టింది. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద, మెగా, ఎంఎస్ఎంఈ రంగాల్లో మొత్తం 13,789 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 1,41,276 మందికి ఉపాధి లభించినట్టు సర్వే వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం 2020–23, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం, సింగిల్ విండో క్లియరెన్స్ కోసం ‘వైఎస్సార్ ఏపీ వన్’ వంటివిధానాలు అమలు చేయడం వంటి పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడినట్టు తేలింది. పెట్టుబడులు, ఉపాధి కల్పనలో ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, విశాఖ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. 60 భారీ కంపెనీల ఏర్పాటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 60కి పైగా భారీ, అతి భారీ యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.28,188.75 కోట్ల విలువైన పెట్టుబడులు రాగా.. 29,531 మందికి ఉపాధి లభించింది. అత్యధికంగా అనంతపురం జిల్లా రూ.12,041 కోట్లు, చిత్తూరు జిల్లా రూ.11,194.72 కోట్లు, విశాఖ జిల్లా రూ.2,461.19 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. చిన్న పరిశ్రమల్లో భారీ ఉపాధి ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ రంగానిదే అగ్రస్థానమని మరోసారి నిరూపణ అయ్యింది. రెండేళ్లలో రాష్ట్రంలో ఈ రంగం ద్వారా 1,11,745 మందికి ఉపాధి లభించింది. 2019–20, 2020–21 కాలంలో రాష్ట్రంలో మొత్తం 13,729 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లు రాగా.. వీటిద్వారా రూ.5,134.45 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 1,596 యూనిట్ల ఏర్పాటుతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 16,377 మందికి ఉపాధి కల్పించడం ద్వారా ప్రకాశం జిల్లా ముందంజలో ఉంది. వైఎస్సార్ నవోదయం కింద ఆర్థికంగా కష్టాల్లో ఉన్న యూనిట్లు పునరుద్ధరించడానికి చేయూతనివ్వడం, రీస్టార్ట్ ప్యాకేజీ కింద కోవిడ్ సమయంలో రాయితీ బకాయిల చెల్లింపు, లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లుల మాఫీతో ఈ రంగంలో పెట్టుబడులు పెరగడానికి కారణమైందని ఆర్థిక సర్వే పేర్కొంది. -
ఏకీకృత రిజస్ట్రేషన్లు.. ఏపీ సన్నాహాలు
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకీకృత విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం ఒకే రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధులతో ఎన్జీడీఆర్ఎస్ (నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్)ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుకూలంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునేందుకు అనువుగా ఈ విధానానికి రూపకల్పన చేశారు. ఆస్తులు, లీజ్ అగ్రిమెంట్లతో పాటు రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ దేశం మొత్తం మీద ఒకే విధానంలో ఉండేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను పుణె ఎన్ఐసీ అభివృద్ధి చేసింది. ఇదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేసేందుకు పుణే ఎన్ఐసీతో కొద్దిరోజులుగా ఏపీ ఎన్ఐసీ కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల కోసం వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ స్థానంలో ఎన్‌జీడీఆర్‌ఎస్‌ను తీసుకురానున్నారు. ఇప్పటికే కృష్ణాజిల్లా కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తున్నారు. ఆ కొత్త వ్యవస్థపై పూర్తిగా అవగాహన వచ్చాక రాష్ట్రమంతా అమలు చేసే యోచనలో ఉన్నారు. 1999 నుంచి కంప్యూటరీకరణ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులన్నింటినీ గతంలో మాన్యువల్‌గా నిర్వహించేవారు. స్టాంప్ పేపర్లపై రాసి వాటినే భద్రపరిచేవారు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో కార్డ్ సెంటర్ ఆర్కిటెక్చర్ (సీసీఏ) ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థనంతటినీ కంప్యూటరీకరించారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈసీలు, నకళ్లను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ సీసీఏ ద్వారానే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పత్రాలను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. ఇప్పుడు దీని స్థానంలో అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండేలా రూపొందించిన ఎన్‌జీడీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం వల్ల మన రాష్ట్రంలో జరిగే రిజిష్ట్రేషన్లు, దానికి సంబంధించిన వ్యవస్థ అంతా దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఏకీకృత రిజిష్ట్రేషన్ల నెట్‌వర్క్‌లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అవకతవకలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభమవుతుంది ఎన్జీడీఆర్ఎస్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా సులభమవుతుంది. దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ అంతా ఒకే ప్లాట్‌ఫామ్ కిందకు వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇది ఎంతో ఉపయోగం. కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైలట్‌గా తీసుకుని లోటుపాట్లన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఆ తర్వాత వీలును బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. – ఎంవీ శేషగిరిబాబు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ -
ఫుడ్ ప్రాసెసింగ్‌లో యూఏఈ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: భారత్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆసక్తిగా ఉంది. దాదాపు రూ.50,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా సుమారు 2,00,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి యూఏఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు(ఏపీ ఈడీబీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యూఏఈ ప్రతినిధులతో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీలో మెగా ఫుడ్ పార్కులు, లాజిస్టిక్స్, శీతల గిడ్డంగులు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వంటి తదితరాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు యూఏఈ అంబాసిడర్ డాక్టర్ అహ్మద్ అబ్దుల్ రహమాన్ అల్బానా, యూఏఈ–ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ షరాఫుద్దీన్ షరాఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు జుల్ఫీ రవ్జీ, రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, ఏపీ ఈడీబీ సీఈవో జె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గణాంకాలతో వివరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 150కిపైగా కంపెనీలు పాల్గొనగా.. 70 కంపెనీలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిని చూపాయి. 1,663 టన్నుల పండ్లు ఎగుమతి.. రాష్ట్రం నుంచి ఏటా సుమారు రూ.10,000 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులను యూఏఈ దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రంగాల ఉత్పత్తులను యూఏఈ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నట్లు ఏపీ ఈడీబీ తేల్చింది. ఇందులో పండ్లు, పప్పు దినుసులదే అత్యధిక వాటా. ఏటా మన రాష్ట్రం నుంచి యూఏఈకి 1,663 టన్నుల పండ్లు, పప్పు దినుసులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో రెడీ టూ ఈట్ లేదా శుద్ధి చేసిన ఆహార పదార్థాల విలువ రూ.45 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. దీని తర్వాత అత్యధికంగా 10,945 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. అలాగే 177 టన్నుల కూరగాయలు, 421 టన్నుల చిరుధాన్యాలు, 19 లక్షల టన్నుల మాంసం ఎగుమతి అవుతున్నాయి. -
ఆరింటా అలరారేలా!
సాక్షి, అమరావతి: ఇప్పటికే ఎల్రక్టానిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం 13 రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఉత్పాదక ఆథారిత ప్రోత్సాహకాలు (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్–పీఎల్ఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కీలక రంగాలకు చెందిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓవైపు రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తూనే మార్కెట్ డిమాండ్ అనాలసిస్ నిర్వహిస్తోంది. ఇప్పటికే పీఎల్ఐ స్కీం కింద ఎల్రక్టానిక్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల(ఈఎంసీ)ను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం కీలకమైన మరో ఆరు రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించింది. నక్కపల్లి పారిశ్రామికవాడ కోసం ఎల్ అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సంస్థ నిర్వహించిన మార్కెట్ డిమాండ్ ఎనాలసిస్‌లో ఆటోమొబైల్ దాని అనుబంధ రంగాలు, ఫార్ములేషన్స్–డ్రగ్స్, ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్–స్పెషాల్టీ కెమికల్స్, ఏరో స్పేస్–డిఫెన్స్, ఇంటిగ్రేటెడ్ సోలార్ పీవీ సెల్స్ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అనువుగా ఉంటుందని అంచనా వేసింది. 69,200 ఎకరాలు అవసరం: ఈ రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా ఎంత భూమి అవసరం అవుతుంది, ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంత భూమి అందుబాటులో ఉందన్న విషయంపై ఎల్ అండ్ టీ నివేదిక తయారు చేసింది. ఈ ఆరు కీలక రంగాల్లో 2022 నుంచి 2032 వరకు అంటే వచ్చే పదేళ్ల కాలానికి కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడానికి సుమారు 69,200 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా ఆటోమొబైల్ రంగానికి 27వేలు, ఫార్మాస్యూటికల్స్ రంగానికి 17 వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా. రాష్ట్రంలో 13 జిల్లాల్లో మొత్తం 266 పారిశ్రామిక పార్కులు, కార్యకలాపాలు కొనసాగిస్తున్న సెజ్‌లు 32 వరకు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు లక్ష ఎకరాలను అభివృద్ధి చేసిన ఏపీఐఐసీ రానున్న కాలంలో దీన్ని 10 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన పార్కుల్లో 6,221 ఎకరాలు, సెజ్‌లలో 16,821 ఎకరాలు కలిపి మొత్తం 23,042 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పెట్టుబడులకు అనుగుణంగా పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధిపై ఏపీఐఐసీ దృష్టి సారించింది. సుమారు 1.02 లక్షల ఎకరాల్లో మొత్తం 12 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి దశలో 8,673 ఎకరాల్లో ఆరు క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా నక్కపల్లిలో పెట్రో కెమికల్స్, ప్రత్యేక రసాయనాలు, అచ్యుతాపురంలో ఇంజనీరింగ్, కాకినాడలో బల్క్ డ్రగ్స్ పార్క్, కృష్ణపట్నం నోడ్‌లో ఆటోమొబైల్, సోలార్ పీవీ సెల్స్, దొనకొండ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ రంగాలను ఆకర్షించే విధంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు
సాక్షి, అమరావతి: జర్మనీకి చెందిన పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ ప్రాధాన్యం ఇచ్చే తయారీ, ఉత్పత్తి, నైపుణ్యం, వైద్యం, సేంద్రియ వ్యవసాయం, సౌరవిద్యుత్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుందన్నారు. మంగళవారం ఏపీటీఎస్ కార్యాలయంలో జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్‌తో మంత్రి మేకపాటి సమావేశమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జర్మనీ కాన్సులేట్ జనరల్ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. త్వరలో నెల్లూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ఈనెల 25న ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. 28 నుంచి విమానాల రాకపోకలు ప్రారం భమవుతాయన్నారు. నెల్లూరు ఎయిర్‌పోర్టును త్వర లో అభివృద్ధి చేస్తామన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలో, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెటు ్టబడుల ఉపసంహరణపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్పష్టంగా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. అంతకుముందు పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్కు ఆహ్వానం పలికారు. పారిశ్రామికాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. స్టార్టప్‌లలో పాలుపంచుకోవాలని ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ కోరారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పరిశ్రమలశాఖ అదనపు డైరెక్టర్ నాయక్, ఈడీబీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ జీవీగిరి, ఐటీ సలహాదారు విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల బాటలో ఏపీ పెట్టుబడులకు అవకాశాలున్న మార్గంలో ఏపీ ముందుకెళుతోందని జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్స్టోల్ పేర్కొన్నారు. నైపుణ్యరంగంపై దృష్టి పెట్టడం మంచి పరిణామమన్నారు. -
ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా ఆసక్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, విద్య–నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారం అందించేందుకు ఆస్ట్రేలియా సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హెచ్ఈ బ్యారీ ఓ ఫారేల్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంగళవారం సమావేశం అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, విద్యాభివృద్ధి, ఉపాధి కల్పన తదితర అంశాలపై బృందంలోని సభ్యులు సీఎం జగన్‌తో చర్చించారు. పోర్టులు, పారిశ్రామిక పార్కులు, డి శాలినేషన్ ప్లాంట్లు తదితర మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామని వివరించారు. గనుల రంగానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను విశాఖలో నెలకొల్పేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ కర్టీన్ సహకారంతో ఈ సెంటర్‌ను నెలకొల్పుతారు. తీర ప్రాంతంలో ఆపారంగా ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకునేలా క్రిటికల్ మినరల్స్ రంగంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తృతం చేయాలని నిర్ణయించారు. మెడ్‌టెక్ జోన్లో పరిశోధనలకు సహకరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు ఒప్పందం కుదుర్చుకుని, పరిశోధనా రంగంలో సహాయ, సహకారాలు అందిస్తామని ఆస్ట్రేలియా హై కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా కాన్సూల్ జనరల్ సారా కిర్లే, ఫస్ట్ సెక్రటరీ (పొలిటికల్) జే సంగానీ తదితరులు పాల్గొన్నారు.