సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో యునైటెడ్ టెలిలింక్స్ నియోలింక్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. రూ.2150 కోట్ల పెట్టుబడితో 6వేల మందికి పైగా ప్రత్యక్షంగా 15 నుంచి 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యూటీఎన్‌పీఎల్ ముందుకు వచ్చింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రముఖంగా ఉన్న యూటీఎల్, నియోలింక్‌తో కలిసి తిరుపతి, వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్ఆర్ ఈఎంసీలో ఫ్యాక్టరీల ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్‌కు కంపెనీల ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో యూటీఎల్ ఛైర్మన్, డైరెక్టర్ సుధీర్ హసీజ, నియోలింక్ గ్రూప్ ఛైర్మన్ రువెస్ షెబెల్, గోల్డెన్ గ్లోబ్ ఎండీ రవికుమార్, వైఎస్సార్ ఈఎంసీ సీఈవో నందకిశోర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment