industries
-
పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే స్థాపించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిని నిత్యం పరిశీలించాలన్నారు. గురువారం సచివాలయంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన సీఎం చంద్రబాబు గత ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిపై సమీక్ష జరిపారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు రూ.1,21,659 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకురాగా సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎఈ పార్క్ చొప్పున మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. తొలివిడతగా జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్‌టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని కోరారు. ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలివీ1. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్: నాయుడుపేటలో రూ.1,742 కోట్ల పెట్టుబడులు, 2 వేల ఉద్యోగాలు.2. దాల్మియా సిమెంట్స్: వైఎస్సార్ జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు.3. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్: విశాఖపట్నంలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు.4. సత్యవేడు రిజర్వ్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్: శ్రీసిటీలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు.5. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.58,469 కోట్ల పెట్టుబడులు, 13,050 ఉద్యోగాలు. 6. బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.1,175 కోట్లు, 1,500 ఉద్యోగాలు. 7. ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు, 8,300 ఉద్యోగాలు.8. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: అన్నమయ్య, కడప జిల్లాలు, రూ.8,240 కోట్లు, 4 వేల ఉద్యోగాలు.9. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్: రూ.400 కోట్ల పెట్టుబడులు, 750 ఉద్యోగాలు.10. ఒబేరాయ్ విలాస్ రిసార్ట్: రూ.250 కోట్ల పెట్టుబడులు, 150 ఉద్యోగాలు. -
పరిశ్రమలు మూతపడుతున్నాయ్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని.. ఉన్న పరిశ్రమలు సైతం మూతబడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఎంతో కొంత పాజిటివ్‌గా ఉంటే.. ఏపీలో మాత్రం మైనస్ 2.94 శాతంగా ఉందని వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముందస్తు అంచనాల మేరకు రాష్ట్ర వృద్ధి 12.94 శాతంగా ఉన్నప్పటికీ.. పారిశ్రామిక వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ వెనకబడి ఉందన్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని, దీన్ని అధిగమించేందుకు పాలనలో స్పీడ్ పెంచి వినూత్న ఆలోచనలు చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు కొంత మంది వ్యక్తులు, కార్యదర్శులు ఏడాది నుంచి ఆర్నెల్లు, మూడు నెలలు సమయం తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికేతర ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. వ్యవస్థను మెరుగు పరిచేందుకే ఇటీవల ఫైళ్ల క్లియరెన్స్ డేటా విడుదల చేసినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు.కేంద్ర పథకాల నుంచి రెండు శాతం నిధులు తెస్తే రాష్ట్రానికి పెద్ద బలం చేకూరుతుందన్నారు. యూసీలు అందచేసి మార్చిలోగా అదనంగా నిధులు రాబట్టేలా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఏటా 15 శాతం వృద్ధి సాధిస్తేనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలమని చెప్పారు.అటవీ మార్గంలో శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అటవీ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎనిమిది నెలల్లోనే రూ.22,507 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. వాట్సాప్‌లో మరిన్ని సేవలు.. రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో 161 సేవలిస్తున్నామని, రాబోయే 45 రోజుల్లో 500 సేవలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. టీటీడీ సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తెస్తామన్నారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలన్నారు. వాట్సాప్‌లో క్యూ ఆర్ కోడ్ లేదా పౌరుల ఆధార్ అథెంటిఫికేషన్ కోరే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అఖిల భారత సర్విస్ అధికారుల నుంచి గ్రూప్ వన్ అధికారుల వరకు ఏప్రిల్‌లో గ్రామాల్లో బస చేయాలని, దీనికి సంబం«ధించి త్వరలోనే విధివిధానాలను సీఎస్ జారీ చేస్తారని తెలిపారు. గతంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాలను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. అంతకు ముందు అర్జీల పరిష్కారంపై సీఎస్ విజయానంద్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇప్పటి వరకు 7,42,301 అర్జీలు వస్తే 60.7 శాతమే పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల నుంచే ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, పల్నాడు, కృష్ణా జిల్లాల నుంచి అతి తక్కువ ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.వాట్సాప్‌లోనే అన్ని రకాల ధ్రువపత్రాలిస్తాం మంత్రి లోకేశ్ వెల్లడిసాక్షి, అమరావతి: ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ కోసం శాఖలన్నీ తమ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేయాలని కోరారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయా లంటే అన్ని శాఖల సహకారం అవసరమన్నారు. రేషన్ కార్డులు మొదలు అన్నీ కూడా ప్రజలకు సులభంగా ఆన్లైన్లోనే అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని.. తద్వారా క్యూఆర్ కోడ్‌తోనే రేషన్ పొందే సదుపాయం లభిస్తుందని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారా మదింపు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. వేధింపులు, రెడ్‌బుక్‌తోనే తిరోగమనంఒకవైపు పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటూ.. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఏపీ పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని.. అధికారుల్లో స్పీడ్ పెరగాలని వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూపించడమే ఈ దుస్థితికి కారణమని పేర్కొంటున్నారు. రెడ్‌బుక్ పాలన చేసింది మీరు..! అధికారంలోకి రాగానే దాడులు, అరెస్టులతో విధ్వంసానికి తెర తీసింది మీరు..! ఇక మేం ఏం చేయగలం..? అని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెరుగు పడాల్సింది తమ పనితీరు కాదని.. ప్రభుత్వంలో ఉన్న వారే కక్షపూరిత ధోరణిని విడనాడాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి పరిశ్రమ, ప్రతి టెండర్‌ను ప్రభుత్వ పెద్దలకు నచ్చినవారికే కట్టబెడుతూ అర్హతలు లేకపోయినా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, దీనివల్ల పెద్ద పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి రెడ్‌బుక్ పాలన సాగిస్తామని పదేపదే ప్రకటనలు చేయడం ఏమిటని అధికారులు విస్తుపోతున్నారు. తమ మాట వినని పారిశ్రామికవేత్తలను వేధిస్తూ అరెస్టులకూ వెనుకాడకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో పర్సంటేజీల కోసం కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ యాజమాన్యాన్ని తీవ్రంగా వేధించిన టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు తమకు కప్పం చెల్లించలేదని ఫ్యాక్టరీపై దాడులకు తెగబడటాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు సైతం తీసుకోలేదు. ఇక విశాఖలో కాలుష్య నియంత్రణ మండలిని ముందుపెట్టి అరవిందో ఫార్మాను తీవ్రంగా వేధించారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న సజ్జన్ జిందాల్‌ను ముంబై మోడల్ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తలొగ్గకపోవడంతో ఆయన సెలవుపై వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చాక డజను మందికిపైగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్షపూరితంగా వేధింపులకు దిగింది. ఇక ఏ నియోజకవర్గంలోనూ కూటమి ఎమ్మెల్యేల ఆమోదం లేకుండా ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు. జ్యుడీషియల్ ప్రివ్యూను ఎత్తివేసి నచ్చినోళ్లకు పనులు కట్టబెడుతున్నారు. ఇవన్నీ చేస్తూ ప్రభుత్వ పెద్దలు తిరిగి తమకు క్లాస్ తీసుకోవడం ఏమిటని అధికార యంత్రాంగం విస్తుపోతోంది. -
‘డీట్’తో మరిన్ని ప్రైవేటు కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల దరికి చేర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత జాబ్ పోర్టల్/ యాప్ ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్)ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విస్తృతపరి చింది. ఇప్పటివరకు కార్మిక, ఉపాధి కల్పన విభాగంతో ‘డీట్’ కలిసి పనిచేస్తుండగా ఇకపై పరిశ్రమలు, వాణిజ్య శాఖతోనూ అనుసంధానం కానుంది. గతంలో కార్మిక శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం మాత్రమే కనిపించే పరిస్థితి ఉండగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సేవలు పూర్తిగా ఉచితమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ తెలిపింది. ఇటీవలే ‘డీట్’ కొత్త లోగోను ప్రభుత్వం ఆవిష్కరించడం తెలిసిందే.నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సమాచారం కూడా.. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ‘డీట్’లో లభిస్తుంది. ఉద్యోగ ఖాళీలు, ఇంటర్వ్యూ తేదీలు, ఇతర సమాచారం దీనిద్వారా లభి స్తుంది. ఉద్యోగాలు అందించే సంస్థ ప్రతినిధితో నేరుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ, చేరిక, నియామకపత్రం అందజేత తదితర పూర్తి ప్రక్రియంతా ఈ యాప్ ద్వారా జరుగుతుంది.రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా.. ⇒ నిరుద్యోగులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డీట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.⇒ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.⇒ యాప్‌లోకి లాగిన్ అయ్యాక ఉద్యోగాలను అన్వేషిస్తూ విద్యార్థతలకు తగిన ఉద్యోగాలను తెలుసుకోవచ్చు. -
నిరుపయోగ భూములపై నజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతున్న నేపథ్యంలో.. గతంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్దేశించిన అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు, ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిరుపయోగంగా ఉన్న ప్లాట్ల లెక్క తేల్చేందుకు సిద్ధమైంది. నిరుపయోగంగా ఉన్న భూములను అవసరమైతే స్వా«దీనం చేసుకుని.. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు కేటాయించాలని భావిస్తోంది.ఇందుకోసం పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ మల్సూర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి చెందిన ఇద్దరు అధికారులను ఇందులో సభ్యులుగా నియమించింది. టీజీఐఐసీ ద్వారా పరిశ్రమలకు కేటాయించిన భూములను పరిశీలించి.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. ఆ నివేదిక అధారంగా నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయనుంది. ఉచితంగా భూమి కేటాయించినా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని 225 సంస్థల నుంచి 1,964 ఎకరాల భూమిని టీజీఐఐసీ గతంలో వెనక్కి తీసుకుంది. ఇందులో కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కమిటీ పరిశీలించే అంశాలివే ⇒ గతంలో జరిపిన భూ కేటాయింపులపై పూర్తిస్థాయిలో ‘భూ తనిఖీ’(ల్యాండ్ ఆడిట్) చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. ⇒ టీజీఐఐసీ భూ కేటాయింపులను రద్దు చేసినా, కొన్నిచోట్ల సదరు భూములు పారిశ్రామిక సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఆ భూములను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై జరిమానా కూడా విధించారు. ఇలాంటి అంశాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ⇒ పారిశ్రామిక వాడల్లో విక్రయించగా మిగిలిన ప్లాట్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. వాటి సంఖ్య, విస్తీర్ణం తేల్చే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పగించారు. ⇒ పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతరత్రా అవసరాలకు ఉపయోగిస్తున్నారా లేదా? అనే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుంది.దుర్వినియోగం కాకుండా పర్యవేక్షక వ్యవస్థటీజీఐఐసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 170కి పైగా పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. కొత్తగా మరో 35 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 13,741 ఎకరాల భూమి అవసరమని టీజీఐఐసీ గుర్తించింది. ఇందులో 2,338 ఎకరాలు ప్రభుత్వ, 7,638 ఎకరాలు అసైన్డ్, 3,765 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన, ప్రస్తుతం సేకరిస్తున్న భూములతో కూడిన ల్యాండ్ బ్యాంక్ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ల్యాండ్ బ్యాంక్ నిర్వహణ, కేటాయింపులను పర్యవేక్షించడంతో పాటు దుర్వినియోగం కాకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. -
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 0ట్యాంకర్లతో నీటి సరఫరా చేశారు. నాలుగున్నర గంటలకు పైగా భవనం మంటల్లోనే ఉంది. ఏడు ఫైర్‌ఇంజిన్లు, 40 వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. -
పరిశ్రమలకు 'కూటమి' కాటు
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పరిశ్రమలు తెస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు తేకపోగా, ఉన్న వాటిని కూడా వెళ్లగొట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారి అరాచకాలకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకొని కూటమి నేతలు పన్నిన కుట్రతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ప్రముఖ జెఎస్డబ్ల్యూ జిందాల్ గ్రూప్ వెనకడుగు వేసింది. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కృష్ణపట్నం పోర్టు దగ్గర అదానీ గ్రూపు ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. తాజాగా వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో అక్కడి ఎమ్మెల్యే వర్గీయులు అదానీ ప్రాజెక్టులో విధ్వంసానికి దిగారు. దీంతో దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూపే రాష్ట్రమంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. ప్రతి పనికీ కమీషన్లు ఇవ్వాలని, పనులు తమకే ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు పారిశ్రామికవేత్తల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఎమ్మెల్యేల దుశ్చర్యలను అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ తీరు రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలగజేస్తుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ఇదీ జరిగింది..వైఎస్సార్ జిల్లాలో గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టు అదానీ సంస్థకు దక్కింది. తొలి విడతగా రూ.1,800 కోట్లతో అదానీ సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. టెండర్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సివిల్ పనులు దక్కాయి. పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పనులు తమకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. అయినా స్పందన లేకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, మరో సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు ప్రాజెక్టు వద్ద విధ్వంసం సృష్టించారు. అక్కడి సిబ్బందిపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడి ఉద్యోగులు, ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక్కడ పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదంటూ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి, ఎంపీ సీఎం రమేష్ సోదరుడు రాజేష్‌నాయుడు బుధవారం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఎటువంటిస్పందనా రాలేదు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య జరుగుతున్న ఘర్షణ మొత్తం ప్రాజెక్టు పైనే పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీయుల విధ్వంసంతో అదానీ సంస్థకు నష్టం కలిగిందని, నాయకుల మధ్య ఈ దందాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు కొనసాగుతుందో, ఆగిపోతుందోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆగిపోయిన జిందాల్ స్టీల్ పరిశ్రమవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థ జేఎస్‌డబ్ల్యూ జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చింది. వైఎస్సార్ జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోపాటు మరికొన్ని భారీ పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటి కాదంబరి జత్వానీ పేరుతో దారుణంగా కేసులు పెట్టించి, రాష్ట్రంలో ఆ గ్రూపు పెట్టుబడులు పెట్టకుండా కూటమి పెద్దలు అడ్డుకొంటున్నారు. దీంతో ఆ గ్రూపు ఇప్పుడు రాష్ట్రం వైపు చూడటానికే జంకుతోంది. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ పరిశ్రమ నిలిచిపోయింది.కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి దాడులుగత నెలలో కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే స్వయంగా దాడికి పాల్పడ్డారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణపై మాట్లాడుతానంటూ తన అనుచరులతో కలిసి పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడి అదానీ సంస్థ ఉద్యోగులను దూషిస్తూ దాడికి దిగారు. పోర్టు డీజీఎంపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన పారిశ్రామిక, వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగించింది.అదానీ పవర్ ప్రాజెక్టుపై దాడి ఘటనలో కేసు నమోదుకొండాపురం: అదానీ సంస్థ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన దాడి ఘటనకు సంబంధించి కొందరిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. అదానీ సంస్థకు చెందిన రామకృష్ణ, రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. -
పారదర్శకంగా భూసేకరణ
మాదాపూర్: పరిశ్రమల కోసం భూసేకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో రెండు నెలల్లో లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ రంగంలో రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపు, ప్రోత్సాహకాలకు సంబంధించిన విధానాన్ని ఈ పాలసీలో వెల్లడిస్తామని చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో గురువారం ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పది నెలల్లో రాష్ట్రంలో రూ.35,820 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. 141 దేశీయ, బహుళజాతి కంపెనీలు ఔషధ టీకాలు, లైఫ్ సైన్సెస్, పరిశోధన రంగాల్లో పనులు ప్రారంభించాయని వెల్లడించారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే 51,086 మందికి ప్రత్యక్షంగా, లక్షన్నర మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఫార్మా రంగంలో ఆసియాలోనే మూడో పెద్ద కంపెనీ అయిన టకెడా లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లోని బయోలాజికల్– ఈ (బీఈ)తో కలిసి ఏటా ఐదుకోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందని, వీటిని ప్రపంచమంతా ఎగుమతి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, టీజీఐఐసీ సీఈఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమ చిన్నదే.. పాత్ర పెద్దది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గడిచిన పదేళ్లుగా ఈ రంగంలో తెలంగాణలో గణనీయ పురోగతి సాధించింది. తయారీ, సేవా రంగాలతోపాటు రిటైల్, వాణిజ్య రంగాల్లోనూ వీటి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. తెలంగాణలోని భారీ ప్రభుత్వ రంగ సంస్థలు, బహుళ జాతి కంపెనీల సరఫరా వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు విడదీయరాని భాగంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఐటీ, దాని అనుబంధ సేవలు, ఫార్మా, రక్షణ, వస్త్ర, ఆహారశుద్ధి తదితర రంగాలకు సూక్ష్మ, చిన్న, పరిశ్రమలు వెన్నెముకగా ఉన్నాయి.ఎస్ఎంఎస్ఈల కచి్చతమైన సంఖ్యపై స్పష్టత లేకున్నా సుమారు 26 లక్షల మేర ఉంటుందని 2015 నాటి నేషనల్ శాంపిల్ సర్వే అంచనా వేసింది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రకారం 8.93 లక్షలు, టీజీ ఐపాస్ కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్ఎంఎస్ఈలకు ఇచ్చిన అనుమతులు 22,206 ఉన్నాయి. వీటిలో సూక్ష్మ పరిశ్రమలు సుమారు 90 శాతానికి పైగా ఉండగా, ఎక్కువగా మాన్యుఫాక్చరింగ్, సేవలు, రిటైల్, హోల్‌సేల్ రంగాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర పారిశ్రామిక చట్టం టీజీ ఐపాస్ ప్రకారం 2014 నుంచి ఎంఎస్ఎంఈల నమోదులో గణనీయ పురోగతి నమోదవుతూ వస్తోంది. టీజీ ఐపాస్ కింద సూక్ష్మ, చిన్న పరిశ్రమల నమోదులో ఏటా 11 నుంచి 15 శాతం వృద్ధి కనిపిస్తోంది. పెట్టుబడుల్లోనూ భారీ వృద్ధి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 2014–19లో ఒక్కో పరిశ్రమపై పెట్టుబడి సగటున రూ.కోటి రూపాయలు కాగా, 2023 నాటికి రూ.2.15 కోట్లకు చేరింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న సమయంలో ఓ దశలో (2021–22)లో సగటు పెట్టుబడి ఒక్కో పరిశ్రమపై రూ.4 కోట్లకు కూడా చేరుకుంది. ఇదిలా ఉంటే ఎంఎస్ఎంఈల్లో ఎక్కువ శాతం రాజధాని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే 40 శాతం ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ⇒ రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ యాజమాన్యాల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలు 25 శాతంలోపే ఉన్నారు. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన ప్రతీ వేయిమంది ఎంటర్ప్రెన్యూర్లలో మహిళలు కేవలం 3.1 శాతం మాత్రమే ఉన్నారు. ఎంఎస్ఎంఈ యాజమాన్యాల్లో ఎస్సీలు 14.94 శాతం, ఎస్టీలు 8.75 శాతం, ఓబీసీలు 27.69 శాతం, జనరల్ 48.62 శాతంగా ఉన్నారు. ⇒ 2020–23 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా మూతపడిన సూక్ష్మ, పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అతి తక్కువగా ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లో మూతపడగా తెలంగాణలో కేవలం 231 ఎస్ఎంఎస్ఈలు మాత్రమే మూతపడ్డాయి. ఇదిలా ఉంటే నష్టాలతో మూసివేత బాటలో ఉన్న 1.340 ఎస్ఎంఎస్ఈలను తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మూతపడిన మరో 115 చిన్న పరిశ్రమలు తిరిగి తెరుచుకునేలా తోడ్పాటు అందించింది. ⇒ రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలతోపాటు అత్యధికంగా ఉపాధి కలి్పస్తున్న రంగాల్లో ఎంఎస్ఎంఈ కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. వీటిలో సేవల రంగంలోనే సుమారు 33 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. తర్వాతి స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ 10 లక్షలు, ఖనిజ, ఇంజనీరింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో నాలుగేసి లక్షలకుపైగా మంది ఉపాధి కలి్పస్తున్నాయి. ఎంఎస్ఎంఈ పాలసీ –2024 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ‘ఎస్ఎంఎస్ఈ పాలసీ–2024 ఆవిష్కరించింది. నూతన పాలసీలో భాగంగా ఎస్ఎంఎస్ఈల ఏర్పాటుకు అందుబాటులో భూమి, రుణ సదుపాయం, ముడి పదార్థాల లభ్యత, కార్మిక నైపుణ్యత, సాంకేతిక వినియోగానికి ప్రోత్సాహం, వ్యాపార విస్తరణకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తారు. తద్వారా జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటా 10 శాతానికి చేరడంతో పాటు వాటి నమోదులో 15 శాతం వృద్ధి రేటును ప్రభుత్వం ఆశిస్తోంది.ఉపాధి కల్పన, సమగ్రాభివృద్ధి, సాంకేతికత ఆధునీకరణ, ఉత్పాదకత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త పాలసీతో ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగాల కల్పనలో 20 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఎంటర్ప్రెన్యూర్లలో 30 శాతం వృద్ధిని ఆశిస్తోంది. పెట్టుబడుల్లో మరో 2 0 శాతం వృద్ధిని కోరుకుంటోంది. -
కార్మికుల సంక్షేమమే మా విధానం
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. వారి సంక్షేమమే ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. పరిశ్రమల్లో తనిఖీల పేరుతో యాజమానులను వేధించొద్దని సూచించారు. భద్రతా చర్యల పర్యవేక్షణకు ముగ్గురు కెమికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను నియమించాలని అధికారులు కోరగా.. నియమిస్తామని సీఎం చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.54 కోట్ల విడుదలకు ఆదేశాలిచ్చారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లోని సేవరి్మలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వడం ద్వారా.. అక్కడి పరిస్థితులను మెరుగుపరచాలన్నారు. త్వరలో చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు ఇచ్చే హామీని నెరవేరుస్తామన్నారు. కార్మికులతో పాటు ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాల వారికీ బీమా అందిస్తామని చెప్పారు. ఏఐ సిటీగా అమరావతి.. రాజధాని అమరావతిని ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సిటీగా తీర్చిదిద్దనున్నట్లు సీఆర్డీఏపై సమీక్షలో సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి పేరు మీదుగా ఏఐ సిటీ లోగో రూపొందించాలని సూచించారు. సీఆర్డీఏ కార్యాలయ భవన నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిలో నివాసించాలనుకునే వారి కోసం గతంలో తాము తెచ్చిన ‘హ్యాపీనెస్ట్’ ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం సూచించారు. రాజధానికి 3,558 ఎకరాలు సేకరించాల్సి ఉందని, రెండు గ్రామాల రైతులు భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. కాగా, విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డిని సీఎం ఆదేశించారు. విశాఖలో ఫేజ్–1లో రూ.11,400 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర, ఫేజ్–2లో రూ.5,734 కోట్ల వ్యయంతో 30 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మిస్తామన్నారు. ఫేజ్–1 పనులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడలో మెట్రో రైలు పనులనూ వేగవంతం చేయాలన్నారు. ‘మంకీ పాక్స్’ టెస్ట్ కిట్ ఆవిష్కరణ మంకీ పాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం దేశంలోనే మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను విశాఖ మెడ్‌టెక్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. దీనిని సీఎం ఆవిష్కరించారు. ఈ కిట్‌ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. మెడ్‌టెక్ భాగస్వామి అయిన ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ పేరుతో దీనిని తయారు చేసినట్లు మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ తెలిపారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్‌కు ఈ కిట్ దోహదపడుతుందని చంద్రబాబు అన్నారు. జనవరి నుంచి పూర్తి స్థాయిలో రాజధాని పనులుమంత్రి నారాయణ వెల్లడి సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి సంబంధించి అధ్యయనం జరుగుతోందని, అన్ని పనులకు టెండర్లు పిలిచి జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.‘ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు.. వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడలో రెండు దశల్లో మెట్రో ప్రాజెక్ట్ చేపట్టేలా డీపీఆర్ సిద్ధం చేశాం. విశాఖపట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి అంచనాలను కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి చెప్పారు. -
గూడుకట్టుకున్న నిర్లక్ష్యం
విశాఖ సిటీ: పరిశ్రమల్లో నిర్వహణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు కార్మిక లోకానికి గుబులు పుట్టిస్తున్నాయి. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తప్పా.. అధికార యంత్రాంగం పరిశ్రమలపై దృష్టిపెట్టిన సందర్భాలు ఉండడంలేదు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన భద్రతా ప్రమాణాలు ఇప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు పరిశ్రమల భద్రతపై ఒక్కసారి కూడా సమీక్షించిన సందర్భాల్లేవు.20 పాయింట్ ఫార్ములా ఏమైంది?2020, మేలో ఎల్జీ పాలీమర్స్ ఘటన తరువాత అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించింది. పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక నియమ, నిబంధనలు రూపొందించింది. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి అన్ని రకాల పరిశ్రమల్లో తనిఖీలు చేయించింది. ఇందులో ఉమ్మడి విశాఖలోని 121 పరిశ్రమల్లో లోపాలున్నట్లు గుర్తించింది. భద్రతా ప్రమాణాలు పాటించని ఆయా సంస్థలకు నోటీసులు జారీచేయడంతో పాటు 29 పరిశ్రమలపై కేసులు నమోదు చేసింది. ఈ పరిస్థితులు మరోసారి తలెత్తకుండా పరిశ్రమల్లో ప్రమాదాలను తగ్గించడానికి అప్పటి ప్రభుత్వం ‘20 పాయింట్ ఫార్ములా’ను అమలులోకి తీసుకొచ్చింది. అందులో ఉన్న అంశాలకు పాయింట్లు కేటాయించారు. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ పాయింట్లు వస్తే ఆ సంస్థ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిగణించాల్సి ఉంటుంది. కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల ముందు వరకు ప్రతి ఏడాది ఈ ఫార్ములా ప్రకారం అధికారులు తనిఖీలు నిర్వహించి పాయింట్లు కేటాయించారు. అయితే, ఎన్నికల హడావుడి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ 20 పాయింట్ ఫార్ములాను పట్టించుకోలేదు. -
డ్రామోజీ బ్రాండ్ పాయిజన్
-
పరిశ్రమలపై పనికిమాలిన రాతలు
-
రాష్ట్రంలో రిలయన్స్, బిర్లా భారీ పెట్టుబడులు
-
విశాఖకు పరిశ్రమలు రాకుండా విషం కక్కుతున్న రామోజీ
-
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. మూడోరోజూ కొనసాగుతున్న బంద్
సాక్షి, సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ బంద్ మూడో రోజు కొనసాగుతోంది. పవర్ లూమ్ సాంచాలు మూగబోయాయి. పాలిస్టర్ పరిశ్రమ బంద్‌తో సుమారు 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పాలిస్టర్‌కు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. ఇప్పటికే సిరిసిల్ల మిల్లుల్లో రూ. 35 కోట్ల రూపాయల పాలిస్టర్ బట్ట పేరుకు పోయింది. కార్ఖానాల్లోనే ఉత్పత్తి చేసిన బట్ట నిల్వలు ఉండటంతో కొత్త బట్ట ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల మ్యానుప్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమస్యపై దృష్టి సారించారు. ఆర్వీఎం బట్టల ఉత్పత్తి ఆర్డర్లను మ్యాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లకు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పరిశ్రమలు, ఉపాధి కల్పనలో క్రాంతి.. జగనన్న పాలనలో రాష్ట్రానికి సంక్రాంతి
భారీ, మెగా పరిశ్రమలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ, మెగా పరిశ్రమలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. గడిచిన 55 నెలల సమయంలో 311కి పైగా భారీ పరిశ్రమల్లో 1.30 లక్షల మంది ఉపాధి పొందారు. అంతే కాకుండా జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరిగాయి. దీంతో మరో 6.07 లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించనుంది. ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ. 2087 కోట్ల ప్రోత్సాహకాలను ఎంఎస్ఎంఈలకు ఇవ్వడం జరిగింది. పోర్టుల నిర్మాణం భారీ, మెగా పరిశ్రమలు మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందులో భాగమగ్నే ఇప్పటికే ఉన్న ఆరు పోర్టులకు అదనంగా 4 కొత్త పోర్టుల నిర్మాణానికి రూ. 16000 కోట్ల వ్యయం వెచ్చించారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కొత్తగా నిర్మితమవుతున్న పోర్టుల ద్వారా 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 75,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు సీఎం జగన్ ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధికి ఊతమిస్తూ రూ. 4,000 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేక ఒక ఫిషింగ్ హార్టర్ రానుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఎయిర్ పోర్టులు రూ. 3,200 కోట్ల వ్యయంతో శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు సాగుతున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 80 వేల మందికి ఉపాధి లభిస్తుంది. గన్నవరం, కాకినాడ, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్ పోర్టుల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌లో JSW స్టీల్, రాంకో సిమెంట్, సెంచురీ ఫ్యానల్స్, ATC టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమలు, MSMEల ద్వారా రూ.14.19 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీని వల్ల ఏకంగా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
బిల్ట్ పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా కమలాపూర్‌లోని బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను పునరుద్ధరించే అంశంపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, ఫిన్‌క్వెస్ట్ సంస్థ ఎండీ హార్దిక్ పటేల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. బిల్ట్ ఆస్తులు ప్రస్తుతం ఫిన్‌క్వెస్ట్ సంస్థ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ ఎండీతో, బిల్ట్ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితోనూ చర్చలు జరిపారు. 2014లో ఆ మిల్లు మూతపడడం వల్ల దాదాపు 750 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని వారికి ఉపాధి కల్పించడంతోపాటు, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని కోరారు. ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారు. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
నవంబర్‌లో ‘మౌలికం’ పురోగతి 7.8 %
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ నవంబర్‌లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 42 శాతం. -
ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు.. వాస్తవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ 130 భారీ ప్రాజెక్టులు ప్రారంభించి రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు ఉండగా వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత 3.87 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా కొత్తగా ఉపాధి పొందిన వారు 12.61 లక్షల మంది. ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం పెట్టిన రూ.1586 కోట్ల బకాయిలను సైతం సీఎం జగన్ తిరిగి చెల్లించారు. అంతేకాదు.. రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. ఇక ఇటీవల జరిగిన విశాఖ జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరాయి. 386 విలువైన ఒప్పందాలు ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశముంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అడుగులేస్తున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో ఆయన ఈ మేరకు ప్రకటించారు. వాస్తవాలు ఇలా ఉంటే రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై కొందరు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు.. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ అవాస్తవాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభమైన కొన్ని ముఖ్యమైన యూనిట్లు, సీఎం జగన్ భూమి పూజ చేసిన పరిశ్రమలు, ఎన్ని పెట్టుబడులు, ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చూద్దాం... ఉత్పత్తి ప్రారంభమైన కొన్ని ముఖ్యమైన యూనిట్లు కంపెనీ: గ్రాసిం ఇండస్ట్రీస్ పెట్టుబడి : రూ.861 కోట్లు ఉపాధి : 1,300 మంది రంగం : కాస్టిక్ సోడా కంపెనీ: ప్యానల్ ఆఫ్టో డిస్ ప్లే టెక్నాలజీస్ పెట్టుబడి: రూ.1,230 కోట్లు ఉపాధి: 2,200 మంది రంగం: టీవీ డిస్ ప్లే ప్యానల్స్ కంపెనీ: ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్ పెట్టుబడి: రూ.1,050 కోట్లు ఉపాధి: 2,000 మంది రంగం: ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ కంపెనీ: సన్నీ ఒప్పో టెక్ పెట్టుబడి: రూ.280 కోట్లు ఉపాధి: 1,200 మంది రంగం: కెమెరా మాడ్యూల్స్ కంపెనీ: ఏటీసీ టైర్స్ పెట్టుబడి: రూ.1250 కోట్లు ఉపాధి: 840 మంది రంగం: హాఫ్ హైవే టైర్స్ కంపెనీ: రాంకో సిమెంట్స్ పెట్టుబడి: రూ.1790 కోట్లు ఉపాధి: 1000 మంది రంగం: సిమెంట్ కంపెనీ: డిక్సన్ పెట్టుబడి: రూ.127 కోట్లు ఉపాధి: 1800 మంది రంగం: సీసీ కెమెరాలు కంపెనీ: గ్రీన్‌లామ్ సౌత్ పెట్టుబడి: రూ.800 కోట్లు ఉపాధి: 1050 మంది రంగం: లామినేషన్స్ కంపెనీ: ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుబడి: రూ.35 కోట్లు ఉపాధి: 1000 మంది రంగం: ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కంపెనీ: యుజియా స్టైరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి: రూ.500 కోట్లు ఉపాధి: 750 మంది రంగం: ఫార్మా కంపెనీ: లారస్ సింథటీస్ ల్యాబ్ పెట్టుబడి: రూ.191 కోట్లు ఉపాధి: 300 మంది రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: లారస్ ల్యాబ్ పెట్టుబడి: 440 కోట్లు ఉపాధి: 500 మంది రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: సెంచురీ ప్యానల్స్ పెట్టుబడి: రూ.1000 కోట్లు ఉపాధి: 2,266 మంది రంగం: ప్లై ఉడ్ భూమి పూజ చేసిన పరిశ్రమలు కంపెనీ: ఇంటెలిజెంట్ సెజ్ పెట్టుబడి: రూ.70 కోట్లు ఉపాధి: 2000 మంది రంగం: పాదరక్షల ఉపకరణాలు కంపెనీ: సెంచురీ ప్యానల్స్ పెట్టుబడి: రూ.1600 కోట్లు ఉపాధి: 2000 రంగం: ఫ్లై ఉడ్ ఫ్యానల్స్ కంపెనీ: ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పెట్టుబడి: రూ.1,10,38 కోట్లు ఉపాధి: 2,112 రంగం: గార్మెంట్స్ కంపెనీ: హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ పెట్టుబడి: రూ.700 కోట్లు ఉపాధి: 10,000 రంగం: పాదరక్షలు కంపెనీ: డిక్సన్ టెక్నాలజీస్ పెట్టుబడి: రూ.108 కోట్లు ఉపాధి: 830 రంగం: టెలివిజన్స్ కంపెనీ: ఫాక్స్ లింక్ ఇండియా విస్తరణ పెట్టుబడి: రూ.300 కోట్లు ఉపాధి: 1200 రంగం: స్యార్ట్ వాచీలు, ఇయర్ పాడ్స్ కంపెనీ: ఏటీసీ టైర్స్ ఫేజ్ -2 పెట్టుబడి: రూ.1000 కోట్లు ఉపాధి: 1160 రంగం: టైర్ల తయారీ కంపెనీ: పిడిలైవ్ ఇండస్ట్రీస్ పెట్టుబడి: రూ.202 కోట్లు ఉపాధి: 280 రంగం: వాటర్ ప్రూపింగ్ ఉత్పత్తులు కంపెనీ: మేఘా ఫ్రూట్ ప్రాసెసింగ్ పెట్టుబడి: రూ.186 కోట్లు ఉపాధి: 677 రంగం: ఆహార ఉత్పత్తులు కంపెనీ: ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ పెట్టుబడి: రూ.145 కోట్లు ఉపాధి: 70 రంగం: పారిశ్రామిక వాయువులు కంపెనీ: ఆప్టిమస్ డ్రగ్స్ పెట్టుబడి: రూ.125 కోట్లు ఉపాధి: 185 రంగం: ఫార్మా న్యూటికల్స్ కంపెనీ: విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ పెట్టుబడి: రూ.108 కోట్లు ఉపాధి: 382 రంగం: ఇన్సులేటర్స్ కంపెనీ: స్టేరాక్స్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడి: రూ.88 కోట్లు ఉపాధి: 450 రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: సినాస్టిక్స్ ల్యాబ్స్ పెట్టుబడి: రూ.82 కోట్లు ఉపాధి: 300 రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: ఇషా రిసోర్సెస్ పెట్టుబడి: రూ.68 కోట్లు ఉపాధి: 220 రంగం: కోక్ అండ్ కోల్ స్క్రీనింగ్ కంపెనీ: ఆసాగో ఇండస్ట్రీస్ పెట్టుబడి: రూ.270 కోట్లు ఉపాధి: 500 రంగం: బయో ఇథనాల్ కంపెనీ: JSW స్టీల్ పెట్టుబడి: రూ.8,800 కోట్లు ఉపాధి: రూ.2,500 రంగం: ఉక్కు తయారీ కంపెనీ: క్రిభ్కో బయో ఇథనాల్ పెట్టుబడి: రూ.560 కోట్లు ఉపాధి: 400 రంగం: బయో ఇథనాల్ కంపెనీ: ఎకో స్టీల్ ఇండియా పెట్టుబడి: రూ.540 కోట్లు ఉపాధి: 500 రంగం: బయో ఇథనాల్ కంపెనీ: లారస్ సింథసిస్ ల్యాబ్ పెట్టుబడి: రూ.240 కోట్లు ఉపాధి: 450 రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: లారస్ ల్యాబ్ పెట్టుబడి: రూ.240 కోట్లు ఉపాధి: 450 రంగం: బల్క్ డ్రగ్ -
జూబిలెంట్ సీఈవో మను అహుజా కన్నుమూత
జూబిలెంట్ ఇండస్ట్రీస్ (Jubilant Industries) ఎండీ, సీఈవో మను అహుజా కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ తెలియజేసింది. "కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మను అహుజా డిసెంబర్ 9 శనివారం నాడు ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాము" అని జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆదివారం (డిసెంబర్ 10) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అహుజా ఆకస్మిక మరణం కంపెనీకి కోలుకోలేని నష్టమని పేర్కొన్న యాజమాన్యం కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులందరూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, విచారం, సంతాపాన్ని తెలియజేస్తున్నారని అని వివరించింది. మను అహుజా 2018 మేలో జూబిలెంట్ ఇండస్ట్రీస్‌లో చేరారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, అహుజా జంషెడ్‌పూర్‌లోని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, పాటియాలాలోని థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదివారు. భారత్‌తోపాటు ఆగ్నేయాసియా అంతటా విభిన్న వ్యాపారాలు, పరిశ్రమలలో ఆయనకు విశేష అనుభవం ఉంది. జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది జూబిలెంట్ భారతీయ గ్రూప్‌నకు చెందిన అగ్రి, పెర్ఫార్మెన్స్ పాలిమర్స్ కంపెనీ. విస్తృత శ్రేణి పంట పోషణ, పంట పెరుగుదల, పంట రక్షణ ఉత్పత్తులతో పాటు అడెసివ్‌లు, వుడ్ ఫినిషెస్ వంటి వినియోగదారు ఉత్పత్తులు, వినైల్ పిరిడిన్, ఎస్బీఆర్, ఎన్‌బీర్ లేటెక్స్ వంటి ఆహార పాలిమర్లు కంపెనీ ఫోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. -
అదానీ గ్రూప్ చేతికి సంఘీ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్ఐఎల్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్ (ఏసీఎల్) వెల్లడించింది. షేరు ఒక్కింటికి రూ. 121.90 చొప్పున సవరించిన ధర మేరకు కొనుగోలు చేసినట్లు వివరించింది. గతంలో ఎస్ఐఎల్లో పబ్లిక్ షేర్హోల్డర్లకు ఉన్న 26 శాతం వాటాల కోసం కంపెనీ రూ. 114.22 రేటును ఆఫర్ చేసింది. ఎస్ఐఎల్ విలువను రూ. 5,185 కోట్లుగా లెక్కగట్టి దక్కించుకున్నట్లు ఏసీఎల్ తెలిపింది. సంఘీ ఇండస్ట్రీస్‌లో తమకు నియంత్రణాధికారాలతో 54.51 శాతం వాటాలు లభించినట్లు వివరించింది. దేశీ సిమెంటు పరిశ్రమలో తమ స్థానాన్ని పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపార విభాగం సీఈవో అజయ్ కపూర్ తెలిపారు. 74.6 ఎంటీపీఏకి ఉత్పత్తి సామర్థ్యాలు ఎస్‌ఐఎల్‌కు గుజరాత్‌లోని సంఘీపురంలో 2,700 హెక్టార్లలో క్లింకర్, సిమెంటు సమగ్ర తయారీ యూనిట్ ఉంది. ఇందులో 6.6 ఎంటీపీఏ క్లింకర్ ఉత్పత్తికి రెండు బట్టీలు, 6.1 ఎంటీపీఏ సిమెంటు గ్రైండింగ్ యూనిట్, 13 మెగావాట్ల క్యాప్టివ్ విద్యుదుత్పత్తి ప్లాంటు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ కొనుగోలుతో ఏసీఎల్ ఉత్పత్తి సామర్థ్యం వార్షికంగా 68.5 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) నుంచి 74.6 ఎంటీపీఏకి చేరుతుందని పేర్కొంది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ తదితర పశ్చిమ తీర ప్రాంత మార్కెట్లలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే 30 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాలను అదనంగా పెంచుకోనున్నట్లు వివరించింది. -
పరిశ్రమలకు శంకుస్థాపన
-
పరిశ్రమల భూకేటాయింపులు మరింత సరళం
సాక్షి, అమరావతి : సులభతర వాణిజ్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు భూ కేటాయింపులను మరింత సరళతరం చేసింది. 2023–27 పారిశ్రామిక విధానం కింద.. పరిశ్రమలు లీజు విధానంలో కాకుండా నేరుగా భూములు కొనుగోలు చేసేలా పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు 33/99 ఏళ్లకు లీజు విధానంలో ఈ కేటాయింపులు చేస్తుండగా నిధుల సమీకరణకు లీజు ఒప్పందాలు అడ్డంకిగా మారుతున్నాయంటూ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మన్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా పొందుపరిచారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసే వారు భూమి విలువను మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్షణం వారితో ఏపీఐసీసీ లేదా పరిశ్రమల శాఖ భూమి కొనుగోలు ఒప్పందం చేసుకుంటుంది. ప్రాజెక్టు ఏర్పాటుచేసేటప్పుడు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ నిర్ధిష్ట కాలపరిమితిలోగా చేసుకుంటే వెంటనే ఆ భూమిపై పూర్తి హక్కులను కేటాయిస్తూ తుది సేల్ డీడ్‌ను అందజేస్తారు. అదే మధ్య, పెద్ద, భారీ పరిశ్రమల విషయానికొస్తే.. దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టినా మొత్తం భూమి విలువ ఒకేసారి చెల్లిస్తే సేల్ అగ్రిమెంట్ చేస్తారు. అలాగే, డీపీఆర్ ప్రకారం దశల వారీగా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలుచేసిన తర్వాత తుది అమ్మకం డీడ్‌ను అందజేస్తారు. ఒకవేళ పరిశ్రమలు పెట్టేవారు దశల వారీగా సేల్‌డీడ్‌ను కోరుకుంటే ఆ ఫేజ్‌లో చేరుకోవాల్సిన లక్ష్యాలు చేరుకుంటే ఆ మేరకు ఆ భూమికి సేల్‌డీడ్ చేస్తారు. ఒకవేళ రెవెన్యూ శాఖ భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా పరిశ్రమల శాఖ ఆమోదించిన డీపీఆర్ నిబంధనలు చేరుకున్న తర్వాతనే భూమిని కేటాయిస్తారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం
రాజకీయపార్టీల్లో సైద్ధాంతిక ఆచరణ విధానం లోపించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అంటున్నారు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి. చట్టాల్లోని నిర్దేశిత సూత్రాలు వాస్తవ రాజకీయ ముఖచిత్రంలో కనిపించడం లేదని, ఎన్నికల్లో డబ్బు ఎరచూపి, పౌరుల హక్కులపై పార్టీలు దాడి చేయడం దుర్మార్గమన్నారు. పార్టీలిచ్చే పోటీ వాగ్దానాలు వేలం పాటలను తలపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సంక్షేమం పేదవాడి అభ్యున్నతికి వెన్నుపూసలాంటిదని చెప్పారు. మితిమిరిన హామీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తాయన్నారు. హామీల చక్రబంధంలో ఇరుక్కున్న ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యం ఆయనది. ఏపీఈఆర్సీ చైర్మన్‌గా విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టిన అనుభవం ఆయన సొంతం. ఎన్నికల వేళ ‘సాక్షి’తో ఆయన అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే... ఆ సిద్ధాంతాలేవి? అన్ని పార్టీల సిద్ధాంతాలు ఘనంగా ఉంటాయి. కానీ, అవన్నీ నేతల ఆచరణలో కనిపించకపోవడం విడ్డూరం. ఎన్నికల వ్యయాన్నే తీసుకోండి. దీనికి పరిమితి ఉంది కదా? ఏ పార్టీ నాయకుడైనా నిర్దేశించిన పరిమితిలోనే ఖర్చు చేస్తున్నారా? లేనే లేదు. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అలా చెయ్యకపోతే గెలవలేరు. అసలీ విషయంపై ఎవరూ మాట్లాడరేం? చట్ట విరుద్ధమని తెలిసినా మౌనంగా ఉంటారేం? తమ ఆకాంక్షలకు తగ్గవారిని ఎన్నుకోవడం ప్రజల హక్కు. ఈ హక్కును డబ్బుతో ముడిపెడుతున్నారు. ఇది రానురాను దిగజారుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో నాయకుడు చెప్పినంత ఇవ్వలేదని ఓ గ్రామంలో ప్రజలు ధర్నా చేశారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి కాదంటారా? ప్రజల నైతికతను డబ్బు అనైతికంగా కొనేస్తోందనడానికి ఇదే సాక్ష్యం. ఈ విషయంలో ప్రజలు జాగృతం కావాలి. డబ్బులకు ప్రలోభ పడొద్దు. ఓటును బలమైన ఆయుధంగానే భావించాలి. వేలం వెర్రి హామీలు అన్ని పార్టీలూ పోటీపడి హామీలిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వేలం వెర్రిగా గుప్పిస్తున్నాయి. ఇది ఓ రకంగా ప్రజలను మోసం చేయడమే. అలవి కాని హామీలు ఎలా నెరవేరుస్తారు? గెలవడమే పార్టీలకు గీటురాయిగా మారింది. పార్టీల మేనిఫెస్టోకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. అందుకే ఇచ్చే హామీలు ఒకలా ఉంటాయి. అమలు వేరోలా ఉంటాయి. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలకు సవాలక్ష షరతులు పెడతారు. లబ్దిపొందే వారి సంఖ్యను భారీగా కుదిస్తారు. దీన్ని మోసం కాదంటారా? 20 ఏళ్లక్రితం ఇలాంటి పరిస్థితి చాలా తక్కువ. ఇప్పుడే విపరీతమైన పరిస్థితి. హామీలివ్వడం నేతలకు అలవాటైంది. వాటికోసం ఎదురుచూడటం ఓటర్లకు రివాజు అయ్యింది. అంతిమంగా ప్రజలు హామీల చక్రబంధంలో ఇరుక్కుంటున్నారు. మితిమీరిన హామీలిస్తే ఆర్థిక పరిస్థితి ఎంత దెబ్బతింటుందనేది ఆలోచించడం లేదు. మోసపూరిత హామీలను నమ్మొద్దు. పవర్ పాలిటిక్స్ మంచిది కాదు.. విద్యుత్ అంశం రాజకీయ ఆయుధమైంది. ఈ విషయంలో అన్ని పార్టీలూ పోటీ పడుతున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేకు ప్రయత్నిస్తున్నాయి. జనం వాస్తవాలు తెలుసుకునే అవకాశమే ఇవ్వడం లేదు. ఈ నేరం ముమ్మాటికీ రాజకీయ పార్టీలదే. 1969లో పరిశ్రమలకు యూనిట్‌కు 10 పైసల విద్యుత్ ఉండేది. కానీ వ్యవసాయానికి 11 పైసలుండేది. ఉచిత విద్యుత్ తెచ్చింది దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు అన్ని పార్టీలూ వ్యవసాయ విద్యుత్‌ను రాజకీయ అస్త్రం చేసుకుంటున్నాయి. ఇవ్వొచ్చు. తప్పులేదు. విద్యుత్ చట్టం ప్రకారం వాడే విద్యుత్‌ను లెక్కగట్టాలి. ఈ పని జరగకుండా నేతలు రాజకీయం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యత్‌ను డిస్కమ్‌లకు ప్రభుత్వాలు ముందే చెల్లించాలి. అప్పుడే డిస్కమ్‌లు ఆర్థికంగా బాగుంటాయి. దీన్ని పక్కనబెడుతున్నారు. మీటర్లు.. మోటర్ల రాజకీయంతో ప్రజలను కరెంట్ వాస్తవాలు తెలియకుండా పక్కదారి పట్టిస్తున్నారు. మీటర్లు పెడితే తమ ఉచిత హక్కు హరించేస్తారనే భయం కల్పిస్తున్నారు. ఈ పాలిటిక్స్ మంచిది కానేకాదు. యువతకు ఉపాధి కల్పన పార్టీల ఎజెండా కావాలి ప్రభుత్వ ఉద్యోగాలు ఇక కలే. దీన్ని యువత గుర్తించేలా అన్ని పార్టీలు అవగాహన కల్పించాలి. ఉపాధి కల్పన పార్టీల ఎజెండా కావాలి. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనలోనూ మెరుగ్గా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి అవకాశాలు పెంచాలి. పరిశ్రమలు విస్తరించేలా చూడాలి. అన్నింటికన్నా ముందు విద్యావ్యవస్థలో మార్పు తేవాలి. పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చే నైపుణ్యం అవసరం. ఇది విద్యార్థి దశ నుంచే జరగాలి. చదువుకునేటప్పుడే ఏదో ఒక నైపుణ్యం కల్పించాలి. అమెరికాలోనైతే విద్యార్థి ఆసక్తిని గుర్తిస్తారు. అందులో మొదట్నుంచీ శిక్షణ ఇస్తారు. పార్టీలకతీతంగా యువతలో ‘సైంటిఫిక్ టెంపర్మెంట్’ తీసుకురావాలి. ఇందులో విజయవంతమయ్యే ప్రభుత్వాలే యువతను తమ వెంట ఉంచుకోగలవు. ఓటు ప్రతి ఒక్కరి ఆయుధం. సమాజానికి పనికొచ్చే వారిని గుర్తించి మరీ ఓటు వేయాలి. అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. -వనం దుర్గాప్రసాద్ -
పొలిటీషియన్ కాదు..పొలిటికల్ లీడరే ముఖ్యం
ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సింది పొలిటికల్ లీడర్స్ మాత్రమే.. పొలిటీషియన్లు కాదనేది \ సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ.రేవతి అభిప్రాయం. మహిళా మానవ వనరుల వినియోగంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని అన్ని పార్టీలూ గుర్తించాలని ఆమె అంటున్నారు. రాష్ట్రావతరణ తర్వాత పల్లె జీవనంలో మార్పు వచ్చిందన్నారు. ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నిరంతరం అధ్యయనం చేసే సెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవతి ఎన్నికల వేళ విధానపరమైన అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే.... దృక్కోణంలో మార్పు కావాలి పొలిటీషియన్ ఆలోచన ఎప్పుడూ కూడా తాత్కాలిక అవసరాల వైపే ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ధోరణిలో ఉంటుంది. ఆ దృక్కోణం దీర్ఘకాలిక ప్రయోజనాలివ్వదు. ఎన్నికల్లో గెలవడమే గీటురాయిగా సాధ్యం కాని హామీలు ఇవ్వడం పొలిటీషియన్ లక్షణం. కానీ పొలిటికల్ లీడర్ అలా కాదు. ఓ విజన్ ఉంటుంది. భావి తరాలకు మేలు చేసే ఆలోచనావిధానం ఉంటుంది. రాజకీయాల్లో ఒక్కోసారి వీరు విజయం సాధించకపోవచ్చు. కానీ ఆలస్యంగానైనా వీరి దూరదృష్టే ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రజలకు హామీలిచ్చేప్పుడు నేతలు ఆలోచించాలి. కార్యాచరణలోకి తేగలమన్న విశ్వాసం ఉన్నప్పుడే హామీలివ్వాలి. అన్ని పార్టీలూ ఈ దిశగా విధాన నిర్ణయం తీసుకోవాలి. యువశక్తిలో ఉద్వేగమెందుకు? రాష్ట్రావతరణ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరిగింది. విదేశీ పెట్టుబడులూ పెరిగాయి. పరిశ్రమలూ స్థాపించారు. కానీ ఉపాధి వేటలో యువశక్తిలో నైరాశ్యం కన్పిస్తోంది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక ఉద్యోగాలొస్తాయనేది కలే. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు రంగమే ఉపాధి మార్గం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కన్పిస్తున్నా, యువతలో ఉద్యోగాల్లేవన్న ఆందోళనకు కారణాలున్నాయి. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యం పెంచకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి ఉపాధి పొందుతున్న వారిలో మహిళలు 25 శాతమే ఉన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించే దిశగా పాలకులు ఆలోచించాలి. యూత్ ఉద్యోగాలు సాధించే నైపుణ్యం ఉంటేనే రాష్ట్ర సంపద కూడా పెరుగుతుంది. దీన్ని గుర్తించడంలో పాలకులు వెనకపడ్డారనే చెప్పాలి. అమెరికా వెళ్తున్న మన వారు పర్మనెంట్ ఉద్యోగమే చేస్తున్నారా? చేసే ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అయినా మూడు నెలల్లో మరో ఉద్యోగం చూసుకోవడం లేదా? ఇక్కడి యువతలోనూ ఆ స్థాయి నమ్మకం, నైపుణ్యం కల్పించే దీర్ఘకాలిక ప్రయోజనాల వైపు పాలకులు దృష్టి పెట్టాలి. వలసలు తగ్గాయి.. జీవనం మారింది ఒకప్పుడు తెలంగాణలో వలసలు ఎక్కువగా ఉండేవి. మహబూబ్‌నగర్ నుంచి అనేక రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్ ఉపాధి అవకాశాల హబ్‌గా మారింది. దీంతో అన్‌స్కిల్డ్ సెక్టార్ నుంచి వలసలు తగ్గాయి. రాష్ట్రంలో 86 శాతం సన్న,చిన్నకారు రైతులున్నారు. ఇప్పుడు వీరు వ్యవసాయం ఒక్కటే ఉపాధి అనుకోవ డం లేదు. కుటుంబంలో ఓ వ్యక్తి వ్యవ ాయం చేస్తే, ఇంకో వ్యక్తి ఇతర ఉద్యోగాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఉన్నత విద్యావంతులు మాత్రం వ్యవసాయం జోలికి వెళ్లడం లేదు. ఐఐటీ చేస్తే వ్యవసాయం చెయ్యకూడదని ఉందా? ప్రపంచీకరణ మార్పులను ప్రజలకు అవగాహన కల్పించడంలో అన్ని పార్టీలూ కృషి చేయాలి. సిరిసిల్ల వంటి చేనేత కారి్మకులున్న ప్రాంతాల్లో తెలంగాణ వచ్చాక మార్పు కన్పిస్తోంది. పవర్‌లూమ్స్ ద్వారా ఆదాయం పెంచుకున్నారు. ఇలా అన్ని సెక్టార్‌లోనూ స్కిల్ అభివృద్ధి చేయాలి. అప్పుడు నిరుద్యోగ సమస్య, యువతలో ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చు. నాణ్యమైన విద్య అందుతుందా? విద్యాబోధనలోనే తేడాలున్నాయి. ఇవి అసమానతలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ విద్యా రంగాన్నే చూడండి. గురుకులాలు... మోడల్ స్కూల్స్... కేజీబీవీలు... ప్రభుత్వ స్కూళ్ళు... స్థానిక సంస్థల స్కూళ్ళు... ఒక్కో చోట ఒక్కో నాణ్యత ఉంటోంది. నాణ్యమైన విద్య అందరికీ అందించాలనే ధోరణి పాలకుల్లో ఉండాలి. ఈ దిశగా మేధోమథనం జరగాలి. విద్యా విధానాలపై శాశ్వత మార్పులను ఆశించి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజాన్ని మేలుకొల్పే విద్యను నిర్లక్ష్యం చేస్తే భావితరం ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నూతన మార్పు తెచ్చేది రాజకీయ పార్టీలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే. -వనం దుర్గాప్రసాద్ -
లోకల్ టచ్చిస్తారా..నేషనల్ నచ్చేస్తారా?
వేలల్లో పరిశ్రమలు. లక్షలాదిమంది కార్మికులు.. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలతో సందడి..అన్ని భాషలు, సంస్కృతుల సమ్మేళనం.. వెరసి మినీ ఇండియా పేరుగాంచింది మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా. మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. వారిదే ప్రధాన భూమిక శ్రామికుల రాజధానిగా పేరుగాంచిన మేడ్చల్ జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై శ్రామిక ఓటర్లు ప్రభావం చూపనున్నాయి. ఈ జిల్లా జనాభాలో 40 శాతం మంది శ్రామికులే ఉన్నారు. జిల్లాలో మొత్తం శ్రామికులు 2,26,939 మంది ఉండగా, వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వలస శ్రామికులు 1,80,326 మంది ఉన్నారు. జిల్లాలో రెండు మెగా పరిశ్రమలు, 71 భారీ పరిశ్రమలు, 3,760 మైక్రో , 2320 సూక్ష్మ, 16 మధ్యతరహా పరిశ్రమల్లో 77,862 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. ఇక ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన 599 సూక్ష్మ, చిన్న పరిశ్రమలతో 4,609 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లోని నివసిస్తున్న వీరంతా ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరి ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. అయితే వీరు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి. జాతీయ పార్టీలకు మద్దతిస్తారా.. లోకల్‌గా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడి పార్టీ కే పట్టం కడతారా అన్నది చూడాల్సిందే. సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ప్రధానంగా బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, అస్సోం, ప శ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఏయే కంపెనీలు ఉన్నాయంటే.. జీడిమెట్ల, బాలానగర్, కూకట్పల్లి, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, శామీర్‌పేట్, మేడ్చల్ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలతోపాటు ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కెమికల్, ఎల్రక్టానిక్స్ తరహా పరిశ్రమలు ఉన్నాయి. బాలానగర్ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, బీర్ మాన్యు ఫాక్చరింగ్ యూనిట్, ఫాబ్రికేషన్, వైర్ మెష్ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బీహెచ్ఈఎల్, ఆర్ అండ్ డీ, హెచ్ఎఎల్, ఐడిపిఎల్, ఎన్ఆర్ఎస్ఎ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్పల్లి, సీఐఈ గాం«దీనగర్ ఒకే చోట ఉన్నాయి. ఇక శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లో బయెటెక్, కెమికల్, విత్తన చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. -
AP: అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగాలే ఉద్యోగాలు
అచ్యుతాపురం (అనకాపల్లి): రాష్ట్రంలోని యువతకు మంచిరోజులొచ్చాయి. ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను ఇప్పటికే అక్కున చేర్చుకున్న అచ్యుతాపురం సెజ్‌లో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. రానున్న రోజుల్లో కనీసం 1.80 లక్షల మందికి ఉద్యోగాలు/ఉపాధి కల్పించేందుకు ఇక్కడి ఎస్ఈజెడ్ జోన్లో కర్మాగారాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో 5,400 ఎకరాల భూమి సెజ్, నాన్ సెజ్ కింద సేకరించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన బ్రాండిక్స్, ఏషియన్ పెయింట్స్, లా రస్, యకోహహాతో పలు బ్రాండెడ్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. వివిధ రకాల కోర్సులు పూర్తి చేసిన వారికి అచ్యుతాపురం సెజ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. సిఫారసులు లేకుండా క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు. లారస్ విస్తరణలో భాగంగా 1,800 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొద్ది నెలల్లో మరో 2 కంపెనీలకు శంకుస్థాపన జరగనుంది. వీటిలో 1,800 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లో నిర్మాణాలు పూర్తయి కార్యకలాపాలు జరుగుతున్న కంపెనీలు 450 కాగా.. వీటిలో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మరో 223 కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిద్వారా అదనంగా మరో లక్షల 80 వేల ఉద్యోగాలు రానున్నాయి. డిప్లమో, డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు కార్మికులకు వైద్య సేవలందించే ఈఎస్ఐ ఆస్పత్రికి స్థలం కేటాయింపు జరిగింది. చదవండి: కాల్చేస్తే ‘సరి’.. -
కొబ్బరికి మహర్దశ
సాక్షి అమలాపురం: ఒకవైపు పరిశ్రమల లోటు తీర్చడం.. మరోవైపు స్థానికంగా పండే పంటలను ఉప ఉత్పత్తులుగా తయారు చేస్తే రైతుకు లాభసాటి ధర వస్తుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరిజిల్లాల్లో వరి తరువాత అతి పెద్ద సాగు కొబ్బరి. దశాబ్దాల కాలం నుంచి సాగవుతున్నా.. వీటి విలువ ఆధారిత పరిశ్రమలు స్థానికంగా లేకపోవడంతో కొబ్బరి మార్కెట్ తరచు ఒడుదొడుకులకు లోనవుతోంది. రాష్ట్రంలో సుమారు మూడులక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.78 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. దీన్లో ఒక్క డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి జిల్లాలోనే ఏడాదికి 124.72 కోట్ల కాయల దిగుబడి వస్తున్నట్లు అంచనా. ఇంత పెద్ద దిగుబడి వస్తున్నా తరచు కొబ్బరి సంక్షోభంలో కూరుకుపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి (వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్)కు కొబ్బరిని ఎంపిక చేసింది. ఈ పథకం కింద జిల్లాలో ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేదానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి ప్రోత్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్ ఇండియా బృందం గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిలా్లలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. హరిప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం సభ్యులు ముమ్మిడివరం వద్ద ఉన్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూనిట్‌ను, పేరూరులో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ఆధ్వర్యంలోని కొబ్బరి తాడు పరిశ్రమను, మామిడికుదురు మండలం పాశర్లపూడిలో క్వాయర్ బొమ్మల దుకాణం, క్వాయర్ మాట్ యూనిట్, చీపుర్ల యూనిట్, కోప్రా యూనిట్, చార్కోల్ యూనిట్లను సందర్శించనున్నారు. ఉద్యానశాఖతోపాటు జిల్లా పరిశ్రమలశాఖ, డీఆర్డీఏ, కేవీఐబీ, హ్యాండ్లూమ్ అధికారులు వారికి జిల్లాలో కొబ్బరి పరిశ్రమల అవసరాన్ని, అవకాశాలను వివరించనున్నారు. వందకుపైగా ఉప ఉత్పత్తులు కొబ్బరి నుంచి వందకుపైగా ఉప ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చెప్పుకొనే స్థాయిలో పెద్ద పరిశ్రమలు లేవు. ఒకటి రెండు ఉన్నా అవి కేవలం క్వాయర్ పరిశ్రమలు మాత్రమే. ఇక్కడ పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని ప్రణాళిక సిద్ధం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా యువతతోపాటు మహిళా స్వయంశక్తి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అధికంగా మేలు జరుగుతుంది. కొబ్బరికి స్థానికంగా డిమాండ్ పెరిగి మంచి ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. -
13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో ఉపాధి
-
పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. చదవండి: పవన్ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు -
CM Jagan: ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడింది. ఏపీలో ఆహార శుద్ధి, ఇథనాల్ తయారీ పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. 90, 700 వందల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పరిశ్రమల రంగంలో మరో ఏడు ప్రాజెక్టుల పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ► అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా ►తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్‌లామ్ సౌత్ ప్రాజెక్టు ►బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద రూ.225 కోట్లతో శ్రావణి బయో ఫ్యూయల్ ►శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్ ►తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్ ►శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్ ►శ్రీసత్యసాయి జిల్లా మడక శిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ -
ఏపీ చొరవతో దేశవ్యాప్తంగా పరిశ్రమలకు మేలు
సాక్షి, అమరావతి: పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మన రాష్ట్రం దేశానికి మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పటికే అనేక రంగాల్లో ఎన్నో జాతీయస్థాయి అవార్డులను, గుర్తింపును దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్.. కేంద్రప్రభుత్వ నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే తాజాగా కేంద్ర విద్యుత్‌శాఖ ప్రవేశపెడుతున్న పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకం. దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా నూతన సాంకేతిక విధానాలను అవలంభించే పరిశ్రమలకు, అవి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలో కొంత రాయితీగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ సహకారంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి కేంద్ర విద్యుత్‌శాఖ ఈ పథకాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్ (డీజీ) అభయ్ భాక్రే చెప్పారు. ఇందులో రూ.6 వేల కోట్లను విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జాతీయ ఎనర్జీ ఎఫిషియెంట్ సమ్మిట్–2023లో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాధనల ఆధారంగానే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్యరంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. దేశంలోనే తొలి ఇన్వెస్ట్మెంట్ బజార్‌ను విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల్లో రూ.430 కోట్ల పెట్టుబడులను సాధించిందన్నారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోను అలాంటి సదస్సులు నిర్వహించగా మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పారిశ్రామిక రంగానికి ప్రత్యేక వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి బీజం వేసిందని, అలాగే ఏపీ ఇంధనశాఖ కూడా రెండేళ్ల కిందట వడ్డీ రాయితీ కోరుతూ ప్రతిపాదనల లేఖ రాసిందని తెలిపారు. ఇంధనం ఆదా, తగ్గుతున్న కాలుష్యం జి–20 సమ్మిట్‌లో ప్రపంచదేశాల నేతలు ఆశించినట్లు.. దేశంలో 2050 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలనే లక్ష్యానికి ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. 2021–22లో బీఈఈ చర్యలతో 27.75 ఎంటీవోఈ ఇంధనం ఆదా అయిందని, 130.21 బిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేశామని తెలిపారు. 175.22 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామన్నారు. పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ (పాట్) పథకం ద్వారా ఈ ఏడాది మార్చి నాటికే 13 రంగాల్లో సుమారు 26 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయడమేగాక 70 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామని ఆయన వివరించారు. ఈ సమ్మిట్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్‌కపూర్ తరఫున ఈఈఎస్ఎల్ సౌత్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి ఏపీలో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య చర్యలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై నివేదిక సమర్పించారు. -
సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయా లు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, సంపద పెరగాలన్నా కొత్త పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు పెడితే స్థానికులకు నష్టం జరుగుతుందని కొందరు రాజకీయం కోసం వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి అపోహలకు గురికాకుండా స్థానిక నాయకులు పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రీమియం సిరప్ తయారీ కంపెనీ మొనిన్ రూ.300 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా గుంతపల్లిలో నిర్మించతలపెట్టిన ఫ్యాక్టరీకి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతిశీల విధానాలను చూసి వివిధ దేశాలకు చెందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. మొనిన్ కంపెనీ యాజమాన్యం దేశంలో 18 రాష్ట్రాల్లో తిరిగిందని, చివరకు తెలంగాణలో యూనిట్‌ను స్థాపిస్తోందని చెప్పారు. స్థానిక యువత నైపుణ్యాలు పెంచుకుంటే ఈ కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానం.. రాష్ట్రం వ్యవసాయ రంగంలో గణనీయ వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 వేల మెట్రిక్ టన్నుల నుంచి మూడున్నర లక్షల టన్నులకు చేరి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి బాటలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, మొనిన్ సంస్థ చైర్మన్ ఓలివర్ మొనిన్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే
సాక్షి, అమరావతి: గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అంగీకారం తెలిపింది. రేపటి (ఈ నెల 5వ తేదీ) నుంచి 15వ తేదీ వరకు షరతులతో కూడిన పవర్ హాలిడేకి అనుమతిస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ.పృథీ్వతేజ్, జె.పద్మాజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గృహ, పారిశ్రామిక రంగాలతోపాటు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు, ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కొంత ఇబ్బందికరంగా ఉంటోంది. రాష్ట్రంలో రోజువారీ అవసరాలకు ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. థర్మల్, హైడల్, గ్యాస్, పవన, సోలార్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 190 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇంకా 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయానికి బోర్లపై ఆధారపడిన వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలను సమర్పించాయి. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, డిమాండ్ స్థితి, ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల పరిమాణం, వాటి ప్రస్తుత ధరలను పరిశీలించిన కమిషన్.. రాష్ట్రంలోని పరిశ్రమల విద్యుత్ వినియోగంపై కొన్ని నియంత్రణ చర్యలను చేపట్టేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా డిస్కంల పరిధిలోని పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయనున్నారు. విధిలేని పరిస్థితుల్లో మాత్రమే పవర్ హాలిడే అమలు చేస్తున్నామని, విద్యుత్ లభ్యత మెరుగైతే పవర్ హాలిడే ఎత్తివేస్తామని సీఎండీలు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్‌చేసి తెలియజేయవచ్చని వారు సూచించారు. ఇవీ నిబంధనలు ♦ పరిశ్రమలు ప్రస్తుతం అమలు చేస్తున్న వారానికోరోజు వారాంతపు సెలవులకు అదనంగా ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయాలి. ♦ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఒక షిఫ్ట్ మాత్రమే పనిచేయాలి. ♦ సాయంత్రం 6 గంటల తరువాత విద్యుత్ వినియోగానికి అనుమతించేది లేదు. ♦ పరిశ్రమలు రోజువారీ విద్యుత్ వినియోగంలో 70 శాతం వినియోగించుకునే విధంగా ఆయా పరిశ్రమలు అవసరమైన చర్యలు చేపట్టాలి. ♦ ఈ పవర్ హాలిడేని జిల్లాల వారీగా రెగ్యులేట్ చేస్తారు. ♦ ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు వారాలు పవర్ హాలిడే అమల్లో ఉంటుంది. ♦ నియంత్రణ చర్యలు పాటించని పరిశ్రమలపై కమిషన్ నిర్దేశించిన జరిమానా చార్జీలు విధిస్తారు. ♦ ఈ నియంత్రణ చర్యల నుంచి బల్క్‌డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, వైద్య ఆక్సిజన్ ప్లాంట్లు, రైస్ మిల్లింగ్ యూనిట్లకు సంబంధించిన పరిశ్రమలకు మినహాయింపు ఉంది. ♦ రోజూ విద్యుత్ సరఫరా తీరును సమీక్షించి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారు. -
కొత్తగా 195 యూనిట్లకు భూమి కేటాయింపు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో ఈ వర్గాలకు పెద్ద పీట వేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తాజాగా చేసిన భూ కేటాయింపుల్లోనూ వీరికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో కొత్తగా 195 పరిశ్రమలకు 467.13 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిశ్రమల్లో 57 శాతం అంటే 111 యూనిట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవే. అందులో అత్యధికంగా మహిళల యూనిట్లే ఉన్నాయి. 54 యూనిట్లు ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఏర్పాటు చేస్తుండగా, ఎస్టీలు 15, బీసీలు 42 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 195 యూనిట్లు ద్వారా రూ.5,153.43 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 10,219 మందికి ఉపాధి లభిస్తుంది. రెండు సెంట్ల భూమి నుంచి రెండు ఎకరాల లోపు భూమిలో చిన్న పెట్టుబడులతో బడుగు, బలహీన వర్గాలు ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో ఆటోమొబైల్ వెల్డింగ్స్, పేపర్ ప్లేట్స్, బొమ్మల తయారీ, రెడీమేడ్ గార్మెంట్స్, వుడ్ కారి్వంగ్, కుట్టు మిషన్ల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. జనరల్ కేటగిరీ విభాగంలో పెద్ద పరిశ్రమలు జనరల్ కేటగిరీ విభాగంలో జరిగిన భూ కేటాయింపుల్లో అత్యధికంగా భారీ పరిశ్రమలు ఉన్నాయి. హెల్లా ఇన్ఫ్రా నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో రూ.260.70 కోట్లతో పీవీసీ పైపుల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ పరిశ్రమకు 26.75 ఎకరాలు కేటాయించారు. ఏఐఎల్ డిక్సన్ కొప్పర్తి ఈఎంసీలో 0.46 ఎకరాల్లో రూ.105.26 కోట్లతో డిజిటల్ వీడియో రికార్డులు, కెమెరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. గ్రేస్ వెంచర్స్ రూ.520 కోట్లతో నాయుడుపేటలో బయో ఇథనాల్ యూనిట్, , ఆరోకెమ్ ఇంగ్రిడియంట్స్ రూ.320 కోట్లతో నాయుడుపేట సెజ్‌లో అరోమా ఇంగ్రిడియంట్స్ యూనిట్, ఎవరెస్ట్ స్టీల్ రూ.242.13 కోట్లతో అనంతపురంలో పీఈబీ ప్లాంట్, అబీస్ ప్రొటీన్స్ రూ.150 కోట్లతో చిత్తూరులో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, తారకేశ్వర లాజిస్టిక్ పార్క్ రూ.180 కోట్లతో విశాఖలో వేర్‌హౌసింగ్, రూ.1,771.50 కోట్లతో హిందాల్కో తిరుపతిలో అల్యూమినియం ఉత్పత్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి భూములు కేటాయించారు. -
యాంకర్ యూనిట్లకు పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు
-
ఆహార శుద్ధి పరిశ్రమలకు శ్రీకారం
-
18 నెలలుగా పెరగనే లేదు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సగటు వేతన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో ముగిసిన 18 నెలల కాలంలో వారి వేతనంలో ఎలాంటి ఎదుగుదల లేదని పేర్కొంది. రూ. 14,700 దగ్గరే ఆగిపోయినట్లు వివరించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో సగటు ఉద్యోగి (శాలరీడ్ పర్సన్) నెలవారీ సగటు వేతనం మాత్రం రూ. 20,030 నుంచి 7.5 శాతం పెరిగి రూ. 21,647కు చేరుకున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పీఎల్ఎఫ్ఐ డేటా ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీ లేదా వేతనం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 302తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో రూ. 368కు పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లోని క్యాజువల్ లేబర్ రోజుకూలీ రూ. 385 నుంచి రూ. 464కు పెరిగింది. దేశంలోని కార్మికశక్తిలో 46 శాతం మంది వ్యవసాయ దిగుబడులపై ఆధారపడి ఉన్నారని... కానీ ఈ ఏడాది తీవ్ర వాతావరణ మార్పులు వారికొచ్చే నెలసరీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో... పట్టణాల్లో ఉత్పత్తి, సర్వీసెస్, ఇతర రంగాల్లో ఉద్యోగులు కేంద్రీకృతమైనట్లు పీఎల్ఎఫ్ఎస్ నివేదిక వెల్లడించింది. ప్రైవేటులో ఉపాధిలేమి.. పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ప్రైవేటు రంగంలోని ఐటీ, స్టార్టప్ సెక్టార్లలో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఉద్యోగులకు అవకాశాలు దక్కకపోవడంతో ఉపాధిలేమి కూడా వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ‘నెలవారీ హైరింగ్ ట్రెండ్స్’ దాదాపు 7 శాతం తగ్గిపోయినట్లు ‘ఫౌండిట్ ఇనసైట్స్ ట్రాకర్’ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలోని మొత్తం 27 పరిశ్రమల్లో 10 శాతం ఉద్యోగాల కల్పన తగ్గినట్లు ట్రాకర్ పేర్కొంది. ఏయే రంగాల్లో వృద్ధి... ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ అధ్యయనం ప్రకారం... గతేడాది నుంచి పరిశీలిస్తే కేవలం 9 రంగాల్లో మాత్రమే ఈ–రిక్రూట్మెంట్ కార్యకలాపాలు పెరిగాయి. ఇందులోనూ షిప్పింగ్/మెరైన్ పరిశ్రమ అత్యధికంగా 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. డేటా ఆధారంగా వ్యూహాలు రూపొందించుకొనే అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్–పీఆర్ పరిశ్రమలు 28 శాతం రిక్రూట్మెంట్ యాక్టివిటీ పెరుగుదల సాధించాయి. రిటైల్, ట్రావెల్, టూరిజం రంగాలు గతేడాదితో పోచ్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం... దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగట్లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని ఉద్యోగుల నిజ వేతనాలు (రియల్ వేజ్) పెరగక ఇబ్బందిపడుతున్నారు. పట్టణ ప్రాంతాలోన్లూ అదే పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే వేతనం ద్వారా నిర్ణిత ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా గత నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనం చేతుల్లో డబ్బుల్లేక వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీనికితోడు ఉపాధి హామీ పనిదినాలు తగ్గడం గ్రామీణ ప్రాంత దినసరి కూలీలపై మరింత ప్రభావం చూపుతోంది. గ్రామీణ భారతంలో సగటు వేతన జీవులు ఉసూరుమంటున్నారు..అత్తెసరు వేతన ఆదాయంతో బతుకుబండిని భారంగా లాగుతున్నారు..పల్లెల్లో చాలీచాలని ఆదాయంతో సర్దుకుంటున్నారు. కేంద్ర గణాంక శాఖ పరిధిలోని నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేతన జీవి సగటు ఆదాయం గత ఏడాదిన్నర నుంచి రూ. 14,700 వద్దే నిలిచిపోయింది. మరోవైపు ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన మరో అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ ప్రాంత ఉద్యోగి సగటు ఆదాయం రూ. 21,647గా నమోదైంది. -
ఈ రంగాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా?
ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీఎఫ్ఎస్ఐ, తయారీ రంగాలు నియామకాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించినట్టు మానవ వనరుల ప్లాట్‌ఫామ్ ‘ఫౌండిట్’ ఓ నివేదిక విడుదల చేసింది. ఐటీలో 19 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో 13 శాతం, గృహోపకరణాల రంగంలో 26 శాతం, తయారీ రంగంలో 14 శాతం మేర నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు తగ్గాయి. వీటిల్లో కొన్ని రంగాలు నియామకాల విషయంలో మే నెలతో పోల్చిచూసినప్పుడు కాస్త మెరుగైన పనితీరు చూపించాయి. నెలవారీగా జాబ్ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ (గతంలో మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్) ఈ వివరాలు ప్రకటించింది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూన్ నెలలో 2 శాతం పెరిగాయి. హెల్త్‌కేర్‌లో 11 శాతం, బీపీవోలో 7 శాతం, తయారీలో 5 శాతం, లాజిస్టిక్స్‌లో 9 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించింది. ముఖ్యంగా మెట్రోల్లో 3 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. టైర్–2 పట్టణాల్లో 2 శాతం మేర క్షీణత కనిపించింది. 0–2 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రెషర్లకు డిమాండ్ నెలకొనగా, మేనేజ్మెంట్ ఉద్యోగుల నియామకాలు 4 శాతం పెరిగాయి. 11–15 ఏళ్ల అనుభవం కలిగి సీనియర్ ఉద్యోగుల నియామకాలు ఒక శాతం, 7–10 ఏళ్ల అనుభవం ఉన్న విభాగంలో 2 శాతం, 4–6 ఏళ్ల అనుభవం కలిగిన విభాగంలో 2 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. రానున్న త్రైమాసికంలో మెరుగు.. ‘‘మేము ట్రాక్ చేస్తున్న మెజారిటీ రంగాల్లో నియామకాల్లో సానుకూల ధోరణి కనిపించడం ప్రోత్సాహకరంగా అనిపించింది. హెల్త్‌కేర్, తయారీ, ఐటీలోనూ కొంత మేర నియామకాలు పుంజుకున్నాయి. రానున్న త్రైమాసికంలో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. కంపెనీలు తమ నైపుణ్య అవసరాలను తిరిగి సమీక్షించుకోనున్నాయి’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీష తెలిపారు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్పును స్వీకరించడం అనేవి ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఉద్యోగంలో రాణించేందుకు అవసరమని సూచించారు. ఐటీ రంగంలో కూడా తగ్గాయంటున్న నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో మూడు శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వేలో తేలిసింది. ఐటీ, రిటైల్, బీపీవో, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ నియామకాల విషయంలో అప్రమ్తత ధోరణి వ్యవహరించడమే ఇందుకు కారణంగా ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో గణనీయంగా తగ్గాయి. జూన్ నెలలో 2,795 ఉద్యోగాలకు పోస్టింగ్‌లు పడ్డాయి. 2022 జూన్ నెలలో ఇవి 2,878గానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మే నెల నియామకాలతో పోల్చి చూసినా జూన్‌లో 2 శాతం తగ్గాయి. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రతి నెలా ఉద్యోగ మార్కెట్ ధోరణులు, నియామకాల వివరాలను విడుదల చేస్తుంటుంది. కార్యాలయ ఉద్యోగ మార్కెట్ దీర్ఘకాలం తర్వాత నిర్మాణాత్మక మార్పును చూస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఈ ఉద్యోగాలకు మెట్రో పట్టణాలు కీలక చోదకంగా ఉంటున్నట్టు గుర్తు చేసింది. రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, బీఎఫ్ఎస్ఐ ఎక్కువ ఉద్యోగాలకు కల్పించినట్టు నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో ఆందోళనకరం ఐటీ రంగంలో నియామకాల ధోరణి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. గతేడాది జూన్ నెలతో పోల్చిచూసినప్పుడు, ఈ ఏడాది జూన్‌లో ఐటీ నియామకాలు 31 శాతం తక్కువగా నమోదైనట్టు వివరించింది. అన్ని రకాల ఐటీ కంపెనీల్లోనూ ఇదే ధోరణి కనిపించినట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, సిస్టమ్ అనలిస్టులకు డిమాండ్ క్షీణత కొనసాగినట్టు వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఏఐ స్పెషలిస్ట్‌ల నియామకాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో బుల్లిష్ ధోరణి కొనసాగిందని, జూన్‌లో కొత్త ఉద్యోగ నియామకాలు ఈ రంగంలో క్రితం ఏడాది ఇదే మాసంతో పోల్చినప్పుడు 40 శాతం పెరిగాయని పేర్కొంది. పెద్ద ఎత్తున రిఫైనరీ సామర్థ్యాల విస్తరణ, దేశీయ డిమాండ్ అవసరాలను చేరుకునేందుకు కంపెనీల వ్యూహాలు నియామకాలకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. ఫార్మా రంగంలో నియామకాలు 14 శాతం పెరిగాయి. ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్లోనూ నియామకాల గణాంకాలు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా అహ్మదాబాద్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు జూన్‌లో 23 శాతం వృద్ధి చెందాయి. వదోదరలో 14 శాతం, జైపూర్‌లో స్థిరంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు చెందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఇప్పటికే కార్యాచరణలోకి రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థంగా అమలవుతుందన్నారు. దీనిపై సమీక్షిస్తూ క్రమం తప్పకుండా ఆరు నెలలకు ఒకసారి నివేదికలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. రూ.13,295 కోట్ల పెట్టుబడులతో 10,181 ఉద్యోగాలను కల్పించే పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్పీబీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. స్థానికుల సహకారం కీలకం.. ప్రైవేట్ సహా అన్ని రకాల పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఇది అత్యంత ముఖ్యమైనది. ఉద్యోగాలను కల్పిస్తున్న పరిశ్రమలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నాం. భూములు, ఇతర వనరులను సమకూరుస్తున్నాం. ఒక పరిశ్రమ ఏర్పాటై సమర్థంగా నడవాలంటే స్థానికుల సహకారం ఎంతో అవసరం. స్థానిక ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యం. అందుకనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. స్థానికంగా ఆయా పరిశ్రమల పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నాం. రాష్ట్రంలో నైపుణ్యాలకు కొదవలేదు. సరిపడా మానవ వనరులున్నాయి. పంట ఉత్పత్తులకు ‘మద్దతు’ తప్పనిసరి కంపెనీలు ఏవైనా సరే.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు కనీస మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాల్సిందే. ఈమేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలు వీలైనంత ఎక్కువగా శుద్ధి చేసిన, డీ శాలినేషన్ నీటినే వినియోగించుకునేలా చూడాలి. జనాభా పెరుగుతున్న కొద్దీ తాగునీటికి, వ్యవసాయానికి నీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వీలైనంత ఎక్కువగా పరిశ్రమలకు నీటిని సమకూర్చడంపై దృష్టి పెట్టాలి. ఇజ్రాయిల్ తరహా విధానాలతో ముందుకు సాగాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు ఎస్ఐపీబీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, రెవెన్యూ, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, జీఏడీ స్పెషల్ సీఎస్ కె.ప్రవీణ్ కుమార్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, హేండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ముఖ్యకార్యదర్శి కె. సునీత, పరిశ్రమలశాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదిత ప్రాజెక్టులివీ.. 1. వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం అశోక్‌నగర్, బక్కన్నవారి పల్లె వద్ద 1,500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు నెలకొల్పనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. రూ.8,104 కోట్ల పెట్టుబడితో డిసెంబర్ 2024లో పనులు ప్రారంభించేలా చర్యలు. ఏటా 3,314.93 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం. దాదాపు 1,500 మందికి ఉద్యోగావకాశాలు. 2. నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనుబంధ సంస్థ క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు. 225 మెగావాట్ల సోలార్, 150 మెగావాట్ల విండ్ పవర్ ఉత్పత్తి. రూ.2,450 కోట్ల పెట్టుబడితో 2023 అక్టోబరులో పనులు ప్రారంభం. చివరి దశ 2025 అక్టోబరు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. 375 మందికి ఉద్యోగావకాశాలు. 3.విశాఖ జిల్లా అన్నవరంలో మే ఫెయిర్ హెటళ్లు, రిసార్టుల ఏర్పాటు. రూ.525 కోట్ల పెట్టుబడితో 750 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి. ప్రాజెక్టులో భాగంగా కన్వెన్షన్ సెంటర్, 250 హోటల్ గదులు, మినీ గోల్ఫ్ కోర్టు నిర్మాణం. షాపింగ్ మాల్ సహా విల్లాల సదుపాయం. 4. తిరుపతి పేరూరు వద్ద రూ. 218 కోట్లతో హయత్ ఇంటర్నేషనల్ హోటల్ నిర్మాణం. 260 మందికి ప్రత్యక్షంగా, 1,296 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు. మూడున్నరేళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్టు. 5. విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలోని కృష్ణపాలెం వద్ద హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యూనిట్ ఏర్పాటు. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,800 మందికి ఉద్యోగావకాశాలు. 6. తిరుపతి జిల్లా వరదాయ పాలెం మండలం కువ్వకోలి వద్ద సీసీఎల్ పుడ్, బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు. రూ.400 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మందికి ఉద్యోగ అవకాశాలు. కాఫీ సాగుదారులు 2,500 మందికి కూడా లబ్ధి. ఏడాదికి 16 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం. 7. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో గోకుల్ ఆగ్రో రిసోర్స్ లిమిటెడ్ కంపెనీతో ఎడిబుల్ ఆయిల్ తయారీ ఫ్యాక్టరీ. రూ.230 కోట్ల పెట్టుబడి. రోజుకు 1400 టన్నులు ఉత్పత్తి. ప్రత్యక్షంగా 350 మందికి, పరోక్షంగా 850 మందికి ఉద్యోగావకాశాలు. 2500 మంది రైతులకూ ఉపయోగం. 8. తిరుపతి జిల్లా శ్రీ సిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ తయారీ ఫ్యాక్టరీ నిర్మాణం. ఏడాదికి 40 వేల టన్నుల తయారీ లక్ష్యం. రూ.168 కోట్ల పెట్టుబడితో 250 మందికి ప్రత్యక్షంగా, 800 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో 3 వేల మంది రైతులకు కూడా ప్రయోజనం. -
స్కిల్ కాలేజీలతో పరిశ్రమల అనుసంధానం
సాక్షి, అమరావతి: స్కిల్ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నైపుణ్యశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15కల్లా పరిశ్రమలతో అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. స్కిల్‌హబ్‌లలో శిక్షణ కోసం ఇప్పటివరకు 15,559 మంది నమోదు చేసుకున్నట్లు నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 3,636 మందికి ఉపాధి అవకాశాలు అందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్‌కుమార్ చెప్పారు. స్కిల్ కాలేజీలు, స్కిల్హబ్లకు సంబంధించి కొత్త విధానంలో బ్రాండింగ్ చేయాలని మంత్రి బుగ్గన సూచించారు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! -
2025 నాటికే 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని 2025 నాటికే సాధిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి తెలిపారు. ముందుగా నిర్దేశించుకున్న 2030తో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే చేరుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలను ఈ ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఆరంభించడం గమనార్హం. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న రెండు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం 10 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. వచ్చే ఏడాదికే 20 శాతం పెట్రోల్‌ను సరఫరా చేయగలమన్న నమ్మకంతో ఉన్నట్టు పురి చెప్పారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమంతో రూ.41,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఒక ఏడాదిలో ఆదా అవుతుండగా, దేశీయ రైతులకు, పరిశ్రమలకు ఈ మేరకు ప్రయోజనం లభించనుంది. చెరకు, విరిగిన, తినడానికి అనుకూలం కాని బియ్యంతో ఇథనాల్‌ను ప్రస్తుతం మన దేశంలో తయారు చేస్తున్నారు. 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల ద్విచక్ర వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలను 50 శాతం, నాలుగు చక్రాల వాహనాల నుంచి 30 శాతం మేర తగ్గించొచ్చని అంచనా. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 2021–22లో ముడి చమురు దిగుమతుల కోసం మన దేశం 120.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
ఎంఎస్ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ను సొంతంగా నిర్వహిస్తూ మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో మహిళలు ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే రాష్ట్రంలో అత్యధికంగా మహిళల యాజమాన్యంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం అందింది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా గత మూడేళ్లలో క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఈ ఆర్థిక సాయం అందించారు. 2020–21 నుంచి 2022–23 నవంబర్ వరకు రాష్ట్రంలో మహిళల యాజమాన్యంలోని 2.21 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి రూ.1,181.14 కోట్లు అందించినట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీలో మినహా గత మూడేళ్లలో మరే రాష్ట్రంలోనూ మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు ఇంత పెద్ద సంఖ్యలో ఆర్థిక సాయం అందించలేదని తెలిపింది. ఆర్థిక సాయం ఇలా.. 2020–21లో దేశం మొత్తం మీద 1.71 లక్షల మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందించింది. రాష్ట్రంలో అత్యధికంగా 74,339 ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం లభించింది. ఏపీ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి. అలాగే 2021–22లో దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 1.30 లక్షల ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందించగా.. రాష్ట్రంలో అత్యధికంగా 22,641 ఎంఎస్ఎంఈలకు సాయం దక్కింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్ నిలిచాయి. ఇక 2022–23లో నవంబర్ వరకు దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 2.34 లక్షల ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందగా రాష్ట్రంలో అత్యధికంగా 1.24 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలకు సాయం లభించింది. ఏపీ తర్వాత అత్యధికంగా సాయం అందుకున్న రాష్ట్రాల్లో జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ నిలిచాయని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెరిగిన ఎంఎస్ఎంఈలు 2021–22లో మహిళల యాజమాన్యంలో ఎంఎస్ఎంఈలు 86.11% పెరిగినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 మార్చి 31 నాటికి మహిళల యాజమాన్యంలో దేశంలో 4,89,470 ఎంఎస్ఎంఈలుండగా గతేడాది మార్చి 31 నాటికి వీటి సంఖ్య 9,10,973కు చేరింది. మహిళల యాజమాన్యంలో ఉన్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేయూతనిస్తున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ద్వారా మొత్తం 19,59,778 మందికి ఉపాధి లభించినట్టు వివరించింది. ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలను ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. సుమారు రూ.3,409 కోట్ల మేర టీడీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఎంఎస్ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించి ఎంఎస్ఎంఈలను ఆదుకుంది. అంతేకాకుండా మూడేళ్లుగా ఎంఎస్ఎంఈలకు సకాలంలో రాయితీలను చెల్లిస్తోంది. గత మూడేళ్లలోనే రూ.1,706.16 కోట్లను రాయితీల కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయిపట్టుకుని నడిపించేలా వ్యవహరిస్తోంది. సీఎం రాయితీలు అందించడం వల్లే.. ఎంఎస్ఎంఈ పథకం కింద కార్ల కోసం పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నా. నెల రోజుల్లోనే నాకు అనుమతి మంజూరైంది. రూ.14.50 లక్షలతో బొలేరో వాహనం, రూ.11.50 లక్షలతో బ్రిజా వాహనం కొనుగోలు చేశా. రెండు కార్లకు మొత్తం రూ.26 లక్షలు కాగా ఇందులో 45 శాతం సబ్సిడీ వచ్చింది. ఈ రెండు కార్లకు డ్రైవర్లను పెట్టుకొని బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈలకు రాయితీలు అందించడం వల్లే పరిశ్రమలు వస్తున్నాయి. నాకు జీవనోపాధి కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ఎప్పటికీ మరిచిపోను. –ఎస్ఎల్ శిరోమణి, జ్ఞానాపురం, నంద్యాల (చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? ) -
మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..
ఇస్లామాబాద్: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండగా.. ఇప్పుడు పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. దీంతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు దిగుమతి చేసుకోలేక పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే పాకిస్తాన్లో కర్యకలాపాలు నిలివేశాయి. సుజుకీ మోటార్ కార్పోరేషన్ మరికొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. టైర్లు, ట్యూబ్‌లు తయారు చేసే ఘంధారా టైర్, రబ్బర్ కంపెనీ తమ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు చెప్పింది. ముడిసరుకు దిగమతికి ఇబ్బందులు, వాణిజ్య బ్యాంకుల నుంచి కన్‌సైట్‌మెంట్ క్లియరెన్స్ పొందడానికి అడ్డంకులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ రెండు కంపెనీలు కేవలం ఉదాహరణలే. ఫర్టిలైజర్స్, స్టీల్, టెక్స్ట్టైల్స్ రంగాలకు చెందిన అనేక పరిశ్రమలు పాకిస్థాన్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. పాకిస్తాన్ విదేశీ కరెన్సీ నిల్వలు 3.19 బిలియన్ డాలర్లే ఉండటంతో దిగుమతులకు నిధులు సమకూర్చలేకపోతుంది. నౌకాశ్రయాల్లో వేలాది కంటైనర్ల సరఫరా నిలిచిపోయింది. పరిశ్రమల ఉత్పత్తి ఆగిపోయింది. వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. పరిశ్రమలు మూతపడితే నిరుద్యోగం పెరిగి ఆర్థిక వృద్ధిపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని పాక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో పరిశ్రమలు మూతపడటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. సుజుకీతో పాటు హోండా మోటార్, టొయోటా మోటార్ కూడా కొద్దివారాల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశాయి. దీంతో పాకిస్తాన్లో కార్ల సేల్స్ జనవరిలో 65శాతం పడిపోయాయి. ఆర్థిక సంక్షోభం వల్ల డిమాండ్ భారీగా తగ్గడమూ దీనికి మరో కారణం. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
పరిశ్రమలపై రాయితీల జల్లు
విజయనగరం ఫోర్ట్: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతో పాటు ఉన్న పరిశ్రమలకు ఆర్థిక ఊతం అందిస్తోంది. రాయితీల జల్లు కురిపిస్తోంది. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలకు విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తోంది. బిల్లుల భారం తగ్గించి అధిక ఉత్పాదకతకు తోడ్పాటునందిస్తోంది. జిల్లాలో సగానికిపైగా విద్యుత్‌ను వినియోగించే ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల ఆర్థిక వృద్ధికి విద్యుత్ రాయితీలు ఉపయోగపడుతున్నా యి. పరిశ్రమలు ఇలా.. జిల్లాలో 11 ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు ఉన్నాయి. ఫేకర్ ఎల్లాయీస్ లిమిటెడ్, హిరఎలక్ట్రో స్మిల్టర్స్ పీవీటీ లిమిటెడ్, ఆంజనేయ ఫెర్రో ఎల్లాయీస్ లిమిటెడ్, మీడీఏ మినరల్ దాతు ప్రైవేట్ లిమిటెడ్, మోరో ఎల్లాయీస్ పీవీటీ లిమిటెడ్, సిరి స్మిల్టర్స్ ఎనర్జీపీవీటీ లిమిటెడ్, జిందాల్ స్టేషనల్స్ లిమిటెడ్, ఆరో శ్రీ వెంకటేశ్వర స్వామి స్టీల్స్, డెక్కన్ ఫెర్రో ఎల్లాయీస్ లిమిటెడ్, శ్రీ మహలక్ష్మి స్మిల్టర్స్ పీవీటీ లిమిటెడ్, బెర్రా ఎల్లాయీస్ లిమిటెడ్ పరిశ్రమలు ఉన్నాయి. ఏడాదికి రూ.80 కోట్ల వరకు రాయితీ ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలకు ప్రభుత్వం ఏడాదికి రూ. 80 కోట్లు వరకు విద్యుత్ రాయితీ కల్పిస్తోంది. ఏడాదికి జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు కలిపి 3,252 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. వీటిలో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు 2,400 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. 852 మిలియన్ యూనిట్లు మిగతా విద్యుత్ వినియోగదారులు వినియోగిస్తున్నారు. పరిశ్రమల ఆర్థిక వృద్ధికి దోహదం ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలకు ప్రభుత్వం విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తోంది. ఏడాదికి రూ.77.93 కోట్ల విలువైన్ విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తున్నాం. ఇది పరిశ్రమల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. – పి.నాగేశ్వరరావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ -
ఏపీ పరిశ్రమల్లో జపాన్ సాంకేతికత
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపులో ఏపీ పరిశ్రమలకి సాంకేతికతను అందించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు జపాన్‌కు చెందిన ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టీఈఆర్ఐ – టెరి) డైరెక్టర్ గిరీశ్ సేథి చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా–జపాన్ ఎన్విరాన్మెంట్ వీక్’ సదస్సులో భాగంగా దేశంలో పర్యావరణ మౌలిక సదుపాయాలు, సాంకేతికతల ద్వారా రెసిలెంట్ డీ కార్బనైజ్డ్ సొసైటీ నిర్మాణం అనే అంశంపై టీఈఆర్ఐ ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా గిరీశ్ సేథి మాట్లాడుతూ జపాన్–ఇండియా టెక్నాలజీ మ్యాచ్ మేకింగ్ (జేఐటీఎం)లో భాగంగా ఇంధన సామర్థ్య సాంకేతికతల్లోను ఏపీని దేశానికే రోల్‌మోడల్‌గా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఇతర శాఖలతో సంప్రదింపులు జరిపి అవసరమైన అనుమతులు తీసుకున్న అనంతరం, జపాన్ ప్రభుత్వ సహకారంతో ఏపీలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) లో–కార్బన్ సాంకేతికతలను పరిచయం చేస్తామని చెప్పారు. ఏపీ పరిశ్రమల విభాగంలో ఇంధన వినియోగం దాదాపు 18,844 మిలియన్ యూనిట్లు (ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ 2022–23 ప్రకారం) ఉండగా, ఇందులో డిస్కంల డేటా ప్రకారం ఎంఎస్ఎంఈలు ఏటా 5 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయని తెలిపారు. దీన్లో 10 శాతం విద్యుత్తును ఆదాచేసినా, ఏడాదికి రూ.300 కోట్ల విలువైన 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. ఏపీలోని ఫిషరీస్, రిఫ్రాక్టరీ, ఫౌండ్రీ, స్పిన్నింగ్, దాల్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ వంటి ఆరు ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో తమ సంస్థ ఇంధన సామర్థ్య అధ్యయనం చేసిందని తెలిపారు. భీమవరంలోని సీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సుమారు 65 మిలియన్ యూనిట్లు, ఫౌండ్రీ క్లస్టర్లో 12 మిలియన్ యూనిట్లు, తూర్పుగోదావరిలోని రిఫ్రాక్టరీ క్లస్టర్లో 2,400 మెట్రిక్ టన్నుల బొగ్గుకు సమానమైన థర్మల్ ఇంధనాన్ని ఆదాచేయవచ్చని అంచనా వేశామని వివరించారు. ఈ మూడు క్లస్టర్లలోనే ఏటా 65 వేల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 30 స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలు (ఎస్డీఏలు) పాల్గొన్న ఈ సదస్సులో మన రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)కు మాత్రమే ప్రసంగించే అవకాశం లభించింది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు ఎనర్జీ ఎఫిషియెన్సీ ద్వారా చేకూరే ప్రయోజనాలపై టెరి తయారుచేసిన నివేదికను జపాన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ వ్యూహాలసంస్థ (ఐజీఈఎస్) డైరెక్టర్ సతోషి కోజిమా, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి రజనీరంజన్ రష్మీ ఆవిష్కరించి ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి అందజేశారు. -
భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే!
ముంబై: భారీ వ్యాపారాల ఆశలతో భారత మార్కెట్లో ప్రవేశించిన పలు బహుళ జాతి దిగ్గజాలు (ఎంఎన్సీ) .. తమ అంచనాలకు తగ్గట్లుగా ఇక్కడ పరిస్థితులు కనిపించక పోతుండటంతో ఆలోచనలో పడుతున్నాయి. నిష్క్రమించడమో లేక వ్యాపారాల పరిమాణాన్ని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నిష్క్రమించిన హోల్సిమ్, ఫోర్డ్, కెయిర్న్, దైచీ శాంక్యో వంటి సంస్థల బాటలోనే తాజాగా జర్మనీ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో కూడా చేరింది. స్థానికంగా తీవ్ర పోటీ నెలకొనడం, అంతర్జాతీయంగా మార్కెట్ ప్రాధాన్యతలు .. వ్యాపార విధానాలు మారిపోతుండటం, పన్నులపరమైన వివాదాల్లో ఏకపక్ష నిర్ణయాలు, పెరిగిపోతున్న నష్టాలు మొదలైనవి ఎంఎన్సీల నిష్క్రమణకు కారణాలుగా ఉంటున్నాయని పరి శ్రమ వర్గాలు తెలిపాయి. ఎనిమిదేళ్ల క్రితం ఫ్రాన్స్‌కి చెందిన క్యారీఫోర్ .. భారత్‌లో తమ హోల్‌సేల్ వ్యాపారాన్ని మూసేసింది. 19 ఏళ్ల కింద భారీ అంచనాలతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన మెట్రో ప్రస్తుతం తమ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాపారంలో మార్జిన్లు అత్యంత తక్కువగా ఉండటమే క్యారీఫోర్ వంటి ఎంఎన్‌సీలు నిష్క్రమిస్తుండటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ వంటి బడా కంపెనీలకు అనుకూలంగా కన్సాలిడేషన్ చోటు చేసుకుంటోందని వారు తెలిపారు. కిరాణా దుకాణాలకు కూడా క్విక్ కామర్స్, ఈ–కామర్స్ వంటి విభాగాల నుంచి పోటీ తీవ్రమవుతోందని వివరించారు. దేశీ సంస్థల హవా.. దేశీ సంస్థల హవా పెరుగుతుండటంతో ఎంఎన్సీల వాటా తగ్గుతూ వివిధ రంగాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉదాహరణకు సిమెటు రంగాన్ని తీసుకుంటే స్విస్ దిగ్గజం హోల్సిమ్ తమ భారత సిమెంటు యూనిట్లను అదానీ గ్రూప్‌నకు విక్రయించాక ఈ రంగంలో టాప్ కంపెనీలుగా దేశీ సంస్థలే ఉండటం గమనార్హం. పర్యావరణ అనుకూల వ్యాపారాలపై దృష్టి పెట్టేందుకే భారత్‌లో వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు హోల్సిమ్ పేర్కొంది. ఇలా ఆయా ఎంఎన్సీల వ్యాపార కారణాల వల్లే అవి నిష్క్రమిస్తున్నాయే తప్ప నియంత్రణ సంస్థలు, చట్టాలపరమైన అంశాల వల్ల కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అలాగే అంతర్జాతీయంగా మాతృ సంస్థ పాటించే విధానాలకు అనుగుణంగా ఇక్కడి వ్యాపార నిర్వహణ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఎంఎన్‌సీలు తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. మార్జిన్లు అంతగా లేకపోవడానికి తోడు భౌతిక స్టోర్స్ ద్వారా నిర్వహించే వ్యాపారాలకు ఆన్లైన్ మాధ్యమాల నుంచి పోటీ పెరగడం సైతం ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాయి. దీనికి క్యారీఫోర్ వంటి సంస్థలను ఉదాహరణగా తెలిపాయి. క్యారీఫోర్ ఇక్కడ పూర్తి రిటైలర్‌గా విస్తరించాలనుకున్నా .. హోల్‌సేల్ వ్యాపారం ద్వారానే కార్యకలాపాలు ప్రారంభించాల్సి వచ్చింది. ఇది ఆ సంస్థ అంతర్జాతీయ వ్యాపార విధానాలకు అనుగుణంగా లేకపోవడం .. కంపెనీ కార్యకలాపాలకు ప్రతికూలంగా మారిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి👉 ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
చిత్తూరులో రూ.250 కోట్లతో.. అమరరాజా కొత్త ప్లాంట్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. (చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ) -
అమరరాజా ప్రతినిధులు అలా ఎక్కడైనా చెప్పారా?: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరరాజా ప్రతినిధులు ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఏదో రకంగా బద్నాం చేయాలిని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈమేరకు మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కోసం ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేరు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారం ఏపీలో ఉంది. ఆయనను ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా?. పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇబ్బంది పెడితే ప్రియ, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎలా నడుస్తున్నాయి?. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చదవండి: (Janasena Party: బెదిరింపులు మీసం తిప్పుతున్నాయ్) -
Hyderabad: పరిశ్రమల నిర్వాకం.. గుంతలు తీసి.. రసాయనాలు దాచి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు రెడ్, ఆరెంజ్ కేటగిరీ బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నిల్వ చేస్తుండటంతో పర్యావరణ హననం జరుగుతోంది. ఇటీవల పీసీబీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పర్యావరణ నిబంధనలు పాటించనివి, పీసీబీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తులు చేస్తున్న ఆరు కంపెనీలను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... పలు ఫార్మా, బల్క్ డ్రగ్, కంపెనీల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్న క్రమంలో ఉత్పన్నమయ్యే ఫార్మా వ్యర్థ జలాలను జీడిమెట్లలోని ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించకుండా రోజుల తరబడి కంపెనీల ఆవరణలోనే భారీ గుంతలు తీసి వాటిల్లో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినపుడు వరద నీటితోపాటు ఈ వ్యర్థాలను బయటకు వదలిపెడుతుండడంతో సమీప చెరువులు, కుంటలు కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు అక్రమార్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ట్యాంకర్లలో ఈ వ్యర్థాలను తరలించి ఔటర్ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. అంతుచిక్కని లోగుట్టు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఇందులో బల్క్‌డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఎలాంటి ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమ ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా లేదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్య క్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపల ఏమి జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడటం గమనార్హం. కాగితాలకే పరిమితం.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టు పక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్ఓ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందారు.. ప్రతిరోజూ వెలువడుతున్న వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. -
కరోనాతో పారిశ్రామిక రంగం కుదేలు
-
పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక జిల్లాగా అనకాపల్లి అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అచ్యుతాపురం, అనకాపల్లి రాష్ట్ర ముఖచిత్రంలో పారిశ్రామిక ప్రాంతాలుగా నిలవనున్నాయన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పూడిలో ‘యమ రిబ్బన్ కంపెనీ’ నిర్మాణానికి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజులతో కలిసి అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చైనాకు చెందిన యమ రిబ్బన్ కంపెనీ సుమారు రూ.300 కోట్ల వ్యయంతో 15.76 ఎకరాల్లో తమ శాఖను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్, షిప్‌యార్డ్, బీహెచ్ఈఎల్ వంటి పరిశ్రమలతో విశాఖ పెద్ద పారిశ్రామిక నగరంగా వెలుగొందుతోందని గుర్తు చేశారు. ఇదే సమయంలో అచ్యుతాపురం సెజ్‌లో మరిన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయంటే.. పారిశ్రామిక ప్రగతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. యమ రిబ్బన్ కంపెనీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అందుబాటులో 25 వేల ఎకరాల భూమి.. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్ర తీరప్రాంతంలో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, తుని, కాకినాడ వరకు పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇప్పటికే 25 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా వాటికి భూమి కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. యలమంచిలి నియోజకవర్గం పూడిమడకలో త్వరలోనే ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని నంబర్‌వన్ స్థానంలో నిలిపిందని తెలిపారు. టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ యమ రిబ్బన్ కంపెనీ ద్వారా 2వేల మందికి ప్రత్యక్షంగా, మరో 2వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. చైనా జనరల్ కాన్సులేట్ జాలియో మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు, న్యూఢిల్లీలో చైనా ఎంబసీ కార్యదర్శులు యు యాంగ్ డబ్లు్య జూన్ నిమి, ఏపీఐఐసీ జెడ్ఎం త్రినాథ్‌రావు, చైనా జనరల్ కాన్సులేట్ (కోల్‌కతా) జాలియు, యమ రిబ్బన్ కంపెనీ ఇండియన్ డైరెక్టర్ శివప్రసాద్, మేనేజర్లు పాల్గొన్నారు. -
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో
పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆవిర్భవించి అర్ధ శతాబ్దం అయింది. ప్రభుత్వ యాజమాన్యంతో ప్రారంభమైన ఈ సంస్థ సుమారు 32 ఏళ్ల పాటు నిర్జీవంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జవసత్వాలు పుంజుకుంది. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులకు అండదండగా నిలిచింది. వేలాది పరిశ్రమల స్థాపనకు పునాదులు వేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించింది. తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రగతిని విస్తరిస్తోంది. ఆత్మకూరురూరల్(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): అర్ధ శతాబ్దం క్రితం రెక్కలు తొడిగిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు గత ప్రభుత్వాలు రెక్కలు విరిచేశాయి. నిధులు.. విధులు లేక ఆ సంస్థ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చేతులు ముడుచుకుని కూర్చొంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ సంస్థ చేతినిండా పనితో తన కార్యకలాపాలను సమృద్ధిగా విస్తరించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. 2004 నుంచి 2009 వరకు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏపీఐఐసీ వైఎస్సార్ మరణం తర్వాత మళ్లీ నిధులు, విధులు లేక చతికిలపడింది. తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ సంస్థకు మళ్లీ రెక్కలొచ్చాయి. పారిశ్రామిక ప్రగతికి తనవంతుగా భూసేకరణ చేయడంతో పాటు అందులో మౌలిక వసతులు కల్పించడంలో అహర్నిశలు శ్రమిస్తోంది. మూడు పారిశ్రామికవాడల నుంచి.. 1973లో ఏపీఐఐసీ ప్రభుత్వ సంస్థగా ఆవిర్భవించింది. అయితే 2004 సంవత్సరానికి ముందు వరకు జిల్లాలో ఈ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఆటోనగర్, ఉడ్‌కాంప్లెక్స్, వెంకటాచలం పరిధిలోనే మాత్రమే పరిశ్రమల ఏర్పాటు చేయగలింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాంబట్టు, మేనకూరు, అంకులపాటూరు, పంటపాళెం, కొడవలూరు ప్రాంతాల్లో పారిశ్రామికవాడల విస్తరణకు ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 27 వేల ఎకరాల భూములను సేకరించి పరిశ్రమల స్థాపనకు అనువుగా మార్చింది. వేలాది మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచింది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది. కొత్త పరిశ్రమలకు ఊతంగా.. జిల్లా విభజతో మాంబట్టు, మేనకూరు, అంకులపాటూరు తదితర పారిశ్రామికవాడలు తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక జిల్లాలో ఏపీఐఐసీకి మిగిలిన 4,107.97 ఎకరాల భూములను పారిశ్రామిక పార్కులుగా తీర్చిదిద్ది పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు కూడా పూర్తి చేసింది. జిల్లాలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో ఇప్పటి వరకు 1883.59 ఎకరాల్లో 925 సంస్థలు రూ.9,422.93 కోట్ల పెట్టుబడితో వివిధ పరిశ్రమలను స్థాపించింది. తద్వారా 11,939 మంది నిరుద్యోగులకు ఆయా సంస్థల్లో ఉపాధి లభించింది. రెండో దశలో 648.64 ఎకరాల్లో 47 సంస్థలు రూ.6,661.02 కోట్ల పెట్టుబడితో స్థాపించబోయే పరిశ్రమల ద్వారా 10,188 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మూడో దశలో 67.16 ఎకరాల్లో రూ.346.92 కోట్ల పెట్టుబడితో 44 సంస్థలు తాము ప్రారంభించబోయే పరిశ్రమల్లో 5,176 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాయి. నారంపేటలో వడివడిగా నిర్మాణాలు దివంగత పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మానసపుత్రికగా ప్రారంభమైన ఆత్మకూరు మండలం నారంపేట పారిశ్రామికవాడ నిర్మాణాలు ఆయన హఠాణ్మరణం కారణంగా కొంత కాలంగా పనులు మందగించాయి. తన అన్న ఆశయ సాధనే తొలి ప్రాధాన్యంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నారంపేట పారిశ్రామికవాడపై దృష్టి సారించడంతో ఆగిపోయిన పనులు మళ్లీ జోరందుకున్నాయి. తొలి దశలో 2.30 కి.మీ. బీటీ రోడ్లు, 3.22 కి.మీ. సిమెంట్ డ్రెయినేజీ కాలువలు రూ.6.46 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. రెండో దశలో రూ.12.73 కోట్ల వ్యయంతో 6.70 కి.మీ. బీటీ రోడ్లు, 19.40 కి.మీ. సిమెంట్ కాలువలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం 2.30 కి.మీట. బీటీ రోడ్లు, 4.60 కి.మీ. సిమెంటు కాలువలు నిర్మాణాలు పూర్తయ్యాయి. పారిశ్రామికవాడ ప్రత్యేకతలు 173.67 ఎకరాలు విస్తీర్ణంలో చేపట్టిన నారంపేట ఎంఎస్ఎంఈ పార్కులో ప్లాస్టిక్ పార్కు, ఫర్నీచర్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 337 ప్లాట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ ప్లార్కు ఏర్పాటుకు 36.23 ఎకరాలు, ఫర్నీచర్ పార్కుకు 25.56 ఎకరాలు కేటాయించారు. ఇందులో ఇప్పటికే పది ఎకరాల విస్తీర్ణాన్ని పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశారు. గృహ నిర్మాణాల కోసం 5.49 ఎకరాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవి కాకుండా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల కోసం గృహ సముదాయం, మౌలిక వసతుల కోసం ప్రత్యేక భవనాలు, విశాలమైన గ్రీన్ పార్కు, 24 గంటలు అందుబాటులో ఉండేలా విద్యుత్, నీరు, వాహనాల పార్కింగ్ తదితర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో భారీగా విస్తరణ దిశగా.. బొడ్డువారిపాళెం పారిశ్రామికవాడలో మిథాని గ్రూపు సంస్థలు ఏపీఐఐసీ ద్వారా 110 ఎకరాలు సేకరించి రూ.4,500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. క్రిబ్కో గ్రూపు సంస్థలు కూడా 289.81 ఎకరాల్లో రూ.560 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించే మరో పరిశ్రమ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పారిశ్రామికవాడలను విస్తరించిన ఏపీఐఐసీ తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్ ద్వారా కందుకూరు డివిజన్ సమీపంలో రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో 3,773.47 ఎకరాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రామాయపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించాలని నిర్ణయించారు. నెల్లూరురూరల్ మండలం కొత్తూరు, నెల్లూరు బిట్ 1 వద్ద 4 ఎకరాల్లో హెల్త్ హబ్ నిర్మించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీఐఐసీ ముమ్మరంగా కృషి చేస్తోంది. నెల్లూరు జిల్లా కేంద్రంలో 4 చోట్ల, వెంకటాచలం, కావలి, అనంతవరం, కొత్తపల్లి కౌరుగుంట, బొడ్డువారిపాళెం, ఆమంచర్ల, చెన్నాయపాళెం, ఏపూరు, గుడిపల్లిపాడు, పంటపాళెం, పైనాపురం, రామదాసుకండ్రిక, సర్వేపల్లి, తదితర ప్రాంతాల్లో 3,756.62 ఎకరాల భూమిలో పరిశ్రమల ఏర్పాటు కోసం 2 వేల ప్లాట్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 738 ప్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ఏపీఐఐసీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం ఏపీఐఐసీ ద్వారా సకల సదుపాయాలతో తీర్చిదిద్దిన పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నాం. జిల్లాలోని కొత్తపల్లికౌరుగుంట, నారంపేట, బొడ్డువారిపాళెం, అనంతవరం పారిశ్రామికవాడల్లో ఏర్పాటు చేసిన యూనిట్లను ఎస్సీ, ఎస్టీల వారికి 50 శాతం సబ్సిడీపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే డీఐఈపీసీ సమావేశంలో కేటాయింపులు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ కులాల వారికి 21 శాతం ప్లాట్లు రిజర్వు చేయబడతాయి. ఏపీఐఐసీ వెబ్సైట్లో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి తుది నిర్ణయం చేస్తారు. – జే.చంద్రశేఖర్, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ నెల్లూరు -
పరిశ్రమలకు పెద్దపీట..
-
ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఆరు నెలల క్రితం మే నెలలో దావోస్ వెళ్లినప్పుడు నన్ను గుర్నానీ కలిశారు. ఆయన నాతో మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ వైపు వేస్తున్న అడుగులకు ఎలాగూ ఊతమందిస్తున్నాం. మరోవైపు నా కుమారుడు ఇథనాల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. ఈ ప్లాంట్ ఎక్కడ పెట్టాలా.. అని ఆలోచిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల వైపు చూసి ఆలోచిస్తున్నారు. మన (ఏపీ) రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది’ అని నన్ను అడిగారు. రాష్ట్రంలో ఏ రకంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామో చెప్పాం. మన రాష్ట్రానికి రావాలని ఆహ్వానం పలికాం. అప్పటి నుంచి ఇప్పటికి కేవలం ఆరే ఆరు నెలలు. అంతలోనే పరిశ్రమకు భూములివ్వడం దగ్గర నుంచి.. కావాల్సిన అనుమతులన్నీ మంజూరు చేసి, ఈ రోజు భూమిపూజ చేసుకుంటున్నాం. ఇదీ మన రాష్ట్రంలో జ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శనం. రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న ఎంఎన్‌సీలు కూడా పలు రాష్ట్రాలను పరిశీలించినప్పుడు వాటికి తొలుత మన రాష్ట్రమే కనిపిస్తోంది. అందువల్లే ఏపీపై ఆసక్తి కనబరుస్తున్నాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుమ్మళ్లదొడ్డి నుంచి సాక్షి ప్రతినిధి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు మన ప్రభుత్వం సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ఎంతో మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంపై అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే పారిశ్రామిక దిగ్గజం అస్సాగో భారీ పెట్టుబడితో ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శుక్రవారం ఆయన కంపెనీ సీఎండీ, సీఈఓ ఆశీష్ గుర్నానీ.. తండ్రి, టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశీష్గుర్నాని, సీపీ గుర్నానీలను దావోస్‌లో కలిసి మాట్లాడి.. ఆరు నెలలు తిరక్కుండానే గుమ్మళ్లదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమకు భూమి పూజ చేసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముంటుందని అన్నారు. మన పిల్లలకే ఉద్యోగాలు ► ఈ ప్లాంట్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేసిన అస్సాగో ఇండస్ట్రీస్ ఎండీ, సీఈఓ ఆశీష్ గుర్నాని, ఆయనకు అన్ని విధాలా మార్గదర్శకత్వం వహిస్తున్న తండ్రి, టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని, ఇక్కడికి విచ్చేసిన ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు.. అందరికీ హృదయ పూర్వక అభినందనలు. ► టెక్ మహీంద్రా.. పెద్ద సాప్ట్వేర్ కంపెనీ అనే విషయం మనందరికీ తెలుసు. ఈ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీ కుమారుడు అశీష్ గుర్నానీ ఆధ్వర్యంలో ఇక్కడ 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ► ఈ ప్లాంట్‌తో 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వాటిలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం తీసుకురావడంతో చదువుకున్న మన పిల్లలకు మంచి జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా రైతులకు, వ్యవసాయాధారమైన ఈ ప్రాంతానికి చాలా మేలు చేస్తుంది. ► తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు ధాన్యం రంగు మారిపోవడమే కాకుండా ముక్కిపోవడం, బియ్యం విరిగిపోయే పరిస్థితులు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సమస్యలకు ఈ ప్లాంట్ పరిష్కారం చూపిస్తుంది. ► బ్రోకెన్ రైస్‌తో పాటు నూకలు, మొక్కజొన్న.. ఈ రెండింటి ఆధారంగా ఈ ఇథనాల్ ప్లాంట్ పని చేస్తుంది. దానివల్ల మన రైతులకు మేలు జరుగుతుంది. రంగు మారిన, విరిగి పోయిన ధాన్యానికి కూడా మంచి రేటు ఇప్పంచగలిగే గొప్ప అవకాశం ఉంటుంది. ఈ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిలో నిర్మిస్తుండటంతో కాలుష్యానికి అవకాశాలు చాలా తక్కువ. ఈ ప్లాంటుతో పాటు బై ప్రొడక్ట్ కింద హైక్వాలిటీ ప్రోటీ¯న్ పశువుల దాణా, చేపల మేత, కోళ్ల దాణా వంటి ఫీడ్ అందుబాటులోకి వస్తుంది. మరిన్ని పరిశ్రమలకు రాచబాట ► త్వరితగతిన ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక వేత్తల వద్ద, రకరకాల ఫోరమ్‌ల వద్ద మన రాష్ట్రంలో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ప్రస్తావించే అవకాశం, పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ పరిశ్రమలు గుర్నానీ ద్వారా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. ► ప్రతి అంశంలో మేం మీకు తోడుగా ఉంటామని గుర్నానీకి మాట ఇస్తున్నాను. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా మా పిల్లలకు మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా చేయడానికి మీరు అంబాసిడర్లా ఉండండి. ► ఏలేరు కుడి కాలువ నిర్మాణం గురించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇందాకే అడిగారు. దానికి దాదాపు రూ.50 కోట్లు అవుతుంది. ఈ పనులకు ఈ వేదికపై నుంచే అనుమతి మంజూరు చేస్తున్నా. ఈ పనుల ద్వారా 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయి. రైతులు, ప్రజలకు మంచి జరుగుతుంది. ► అస్సాగో ఇండస్డ్రియల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అశిష్ గుర్నాని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, చింతా అనురాధ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఆపలేరు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుకట్ట పడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం లేదు.. అభివృద్ది జరగడం లేదు.. పరిశ్రమలు తరలిపోతున్నాయని ఒక మాజీ మంత్రి సీఎంకు లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి వస్తే, ఇది మా ప్రాంతానికి వద్దు.. మాకు అవసరం లేదని లేఖలు రాశారు. ఇదీ వాళ్ల దుర్బుద్ధి. జరుగుతున్న అభివృద్ధి, తరలి వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా వారు అడుగులు వేస్తున్నారు. లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడుల కార్యచరణతో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి 30 సెకన్లలో సీఎం అంటే ఏమిటో తెలిసింది.. సీఎం జగన్మోహన్రెడ్డి.. మహానేత రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పీపుల్ ఓరియంటెడ్, సోషల్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ విధానంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచారు. పరిశ్రమకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతో నా కుమారుడు అశిష్ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో సందేహమే లేదు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌తో కేవలం 30 సెకన్లు మాత్రమే మాట్లాడాము. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా అమలు చేస్తారని, యువత ఉపాధికి ఏ రకంగా వినియోగిస్తారని అడిగాను. ఆ సమయంలోనే రాష్ట్ర అభివృద్ధి పట్ల సీఎం అంకితభావం తెలిసింది. ఈ ప్రాంతంలో యువత, పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్న లక్ష్యం.. సంకల్పం తెలియజేశారు. దావోస్‌లో చెప్పిన మాట ప్రకారం కేవలం ఆరు నెలలల్లోనే అన్ని అనుమతులు ఇచ్చారు. ఇదీ సీఎం నిబద్ధత, నిజాయితీకి నిదర్శనం. తొలిసారి ఒక పరిశ్రమ స్థాపనకు ఆసక్తి చూపించిన నా కుమారుడు కూడా జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నా. ఇందుకు సరైన వేదిక ఆంధ్రప్రదేశ్ అని భావించి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. – సీపీ గుర్నానీ, టెక్‌మహీంద్రా ఎండీ, సీఈఓ చదవండి: రాళ్లు విసిరించుకోవడం చంద్రబాబుకు సాధారణమే: మంత్రి జోగి రమేష్ -
Andhra Pradesh: పారిశ్రామిక స'పోర్టు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోర్టులను ఆసరాగా చేసుకుని పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఇందుకోసం అవసరమైతే ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించాలని సూచించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా సీఎస్, సీఎంవో అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలకు చేయూత అందించి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు – మౌలిక వసతులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. ఇంటర్నెట్, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక కారిడార్లపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. పరిశ్రమలు – మౌలిక వసతులపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు పరిశ్రమలు ప్రారంభం కావడమే కాకుండా అవి నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాలి. పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలకు చేదోడుగా నిలవాలి. వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభించి నిరుద్యోగం తగ్గుతుంది. అందుకే ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకునేలా నిరంతరం చేయూతనివ్వాలి. ఎంఎస్ఎంఈలపై మన ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ క్రియాశీలకంగా వ్యవహరించాలి. విదేశాల్లో ఎంఎస్ఎంఈల రంగంలో ఉత్తమ విధానాలపై పరిశీలన చేసి ఇక్కడ అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఇతర దేశాల్లోని ప్రతిష్ట్మాత్మక ఎంఎస్ఎంఈ పార్కులతో ఒప్పందాలు కుదుర్చుకునే అంశాలను పరిశీలించాలి. ఏయే రంగాల్లో ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి? వాటిని ఇక్కడకు రప్పించడం ద్వారా ఆదాయం, ఉద్యోగాల కల్పన ఎలా చేయవచ్చో ఆలోచన చేయాలి. ఎంఎస్ఎంఈ పార్కుల నిర్వహణ విధానాలను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ, ఉత్పత్తుల తయారీలో అత్యాధునిక విధానాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు పరిశీలనలో భాగం కావాలి. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. మార్కెట్లో అవకాశాలున్న ఉత్పత్తులు ఎంఎస్ఎంఈల నుంచి వచ్చేలా తగిన తోడ్పాటు అందించాలి. డిసెంబర్‌కు పూర్తిస్ధాయిలో ఇంటర్నెట్.. డిసెంబర్ నాటికి అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లను ఫైబర్‌తో అనుసంధానించి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. 5జీ సేవలను గ్రామాలకు చేరవేసే విధంగా టెలికాం కంపెనీలతో ఏపీఎస్ఎఫ్ఎల్ పని చేయాలి. డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా వేల్పులలో నెలకొల్పిన డిజిటల్ లైబ్రరీ ద్వారా సుమారు 30 మంది అక్కడ నుంచే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇలాంటి లైబ్రరీలు వస్తే సొంతూరి నుంచే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. దేశంలోనే ఇదొక వినూత్న వ్యవస్థ గా ఆదర్శంగా నిలుస్తుంది. బల్క్‌డ్రగ్ పార్కుపై ఫార్మా కంపెనీల ఆసక్తి రాష్ట్రానికి మంజూరైన కాకినాడ బల్క్‌డ్రగ్ పార్కులో కంపెనీల ఏర్పాటుకు ఇప్పటికే ప్రధాన ఫార్మా కంపెనీల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్కు నిర్మాణ ప్రణాళికను సీఎం జగన్‌కు వివరించడంతోపాటు గత మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతి వివరాలను అధికారులు తెలియచేశారు. ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈల కోసం రెండు క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ సమీర్‌శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ఎన్.భరత్ గుప్తా, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ షన్మోహన్, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐడీసీ ఛైర్పర్సన్ బండి పుణ్యశీల, ఏపీటీపీసీ ఛైర్మన్ కె.రవిచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఛైర్ పర్సన్ షమీమ్ అస్లాం, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారు రాజీవ్‌కృష్ణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సలహాదారు లంక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జూన్‌కు నాలుగు ఫిషింగ్ హార్బర్లు పోర్టు అనుబంధ పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేయాలి. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ప్రస్తుతమున్న పారిశ్రామిక నోడ్స్‌తో పాటు కొత్తగా అభివృద్ధి చేయనున్న మచిలీపట్నం, దొనకొండ నోడ్లకు అదనంగా భావనపాడు, రామాయపట్నం నోడ్లను అభివృద్ధి చేయాలి. రామాయపట్నం పోర్టును ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం 2024 మార్చి నాటికి కాకుండా 2023 డిసెంబర్‌కు పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. మొదటి విడతలో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను 2023 జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లపైనా దృష్టి పెట్టాలి. -
పరిశ్రమలకు సముద్రపు నీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా సముద్రపు నీటిని శుద్ధిచేసి మంచినీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి సరఫరా చేయడానికి రూ.400 కోట్లతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. పైడి భీమవరం ప్రాంతంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరబిందో వంటి 26కుపైగా ఫార్మా, రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ పరిశ్రమలకు అవసరమైన నీటికోసం అత్యధికంగా భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు. తీరప్రాంతంలోని పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ను పైడి భీమవరం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం మెంటాడ వద్ద సుమారు 50 ఎకరాల్లో దీన్ని నెలకొల్పనున్నారు. తొలిదశలో రోజుకు 35 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేసే విధంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రానున్న కాలంలో దీన్ని వంద మిలియన్ లీటర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీఐఐసీ శ్రీకాకుళం జోనల్ మేనేజర్ యతిరాజులు తెలిపారు. ఇక్కడ శుద్ధిచేసిన నీటిని పైప్లైన్ల ద్వారా పైడి భీమవరం పారిశ్రామికవాడ, దాని చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు అందించనున్నారు. దీనివల్ల భూగర్భ జలాల వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ యూనిట్లో భాగస్వామ్యం కోసం ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానిస్తోంది. బిల్డ్ ఓన్ ఆపరేట్ (బీవోవో), బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్సఫర్ (బీవోవోటీ) విధానంలో ఆహ్వానిస్తున్న ఈ టెండర్లలో పాల్గొనడానికి ఈ నెల 13 చివరితేదీ. నాలుగుపైసలకే లీటరు నీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి అతిచౌకగా నీటిని అందించే డీశాలినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 2019 ఆగస్టులో ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఉన్న హెచ్2ఐడీ డీశాలినేషన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఇజ్రాయిల్‌కు చెందిన కొంతమంది ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి డీశాలినేషన్‌లో ఐడీఈ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చు తక్కువ అవుతుందని తెలిపారు. కేవలం నాలుగు పైసలకే లీటరు నీటిని ఉత్పత్తిచేసే అవకాశం డీశాలినేషన్‌లో ఉండటంతో తీరంలో పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్న పైడి భీమవరంలోని రసాయన పరిశ్రమలకు డీశాలినేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారాన్ని చూపిస్తోంది. -
‘పీఎం గతిశక్తి’తో పరిశ్రమలకు వసతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం గతి శక్తి పథకాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్రం పీఎం గతిశక్తి కింద దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లను జాతీయ రహదారులు, పోర్టులతో అనుసంధానం, మౌలిక వసతుల కల్పన చేపట్టింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రూ.5 వేల కోట్లు కేటాయించింది. చదవండి: ‘యనమల’ పిల్లి శాపాలు.. ఉనికి చాటుకునేందుకేనా? ఈ పథకం కింద మన రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతుల కోసం రూ.781.88 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఓర్వకల్లు, కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లకు నీటి సరఫరాకు రూ. 459 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు 74 ఎంఎల్డీ నీటిని తరలించే రూ.288 కోట్ల ప్రాజెక్టు, కొప్పర్తి జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు 46 ఎంఎల్డీ నీటిని రూ.171 కోట్ల వ్యయంతో తరలించే ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి. అదే విధంగా రూ.322.88 కోట్లతో ఏడు ప్రాజెక్టుల భూసేకరణ ప్రతిపాదనలను పంపింది. ఈ ఏడు ప్రాజెక్టుల్లో రూ. 34.05 కోట్లతో నాయుడుపేట క్లస్టర్‌ను అనుసంధానించే రహదారి, రూ.16.74 కోట్లతో రౌతు సురమాల పారిశ్రామిక క్లస్టర్ అనుసంధానం, రూ.6.93 కోట్లతో ఎన్‌హెచ్ 16 నుంచి నక్కపల్లి క్లస్టర్‌ను అనుసంధానించే ప్రాజెక్టు, రూ.106.98 కోట్లతో అచ్యుతాపురం –అనకాపల్లి నాలుగులైన్ల రహదారి, రూ.15 కోట్లతో కియా మోటార్స్ వద్ద ఆర్వోబీ నిర్మాణం, రూ.50 కోట్లతో కొప్పర్తికి రైల్వే లైన్ అనుసంధానం, రూ.93.18 కోట్లతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యతమిస్తున్నామని, ఇందులో భాగంగానే పీఎం గతిశక్తి పథకానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో లాజిస్టిక్ వ్యయం తగ్గించడానికి విశాఖ, అనంతపురంలలో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. -
పరిశ్రమలు వద్దనడమే రాజకీయమా?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీకి వస్తున్న పరిశ్రమలను అడ్డుకునే పనిలో పడిందా? ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి రాసిన ఒక లేఖను చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అయినా బల్క్ డ్రగ్ పార్కును స్వాగతించి ఉంటే ఆ పార్టీ పద్ధతిగా వ్యవహరించిందని అనిపించేది. పెట్టుబడులు రావడం లేదని ఓవైపు ఆరోపిస్తూనే, వస్తున్నవాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వారి ఉద్దేశం స్పష్టం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. కాకినాడ జిల్లా కోన వద్ద సుమారు 8,500 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్ చేపట్టడా నికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పార్కు కోసం తెలంగాణ, తమిళనాడుతో సహా పదిహేడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కేంద్రం అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని హిమచల్ ప్రదేశ్, గుజరాత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. తొంభై రోజులలో ‘డీపీఆర్’ పంపితే సుమారు వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించి ప్రాథమిక సదుపాయాలు కల్పించడానికి సహకరించనుంది. ఇది అంతా సంతోషించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రావడానికి ఉన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ఈ బల్క్ డ్రగ్ పార్కు తెలంగాణకు ఇవ్వక పోవడం అన్యాయమని ఆ రాష్ట్ర మీడియా విమర్శిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంలో కేంద్రం వివక్ష చూపిందంటూ మండిపడుతున్నారు. కానీ తెలుగుదేశం మాత్రం ఈ పార్కును ఏపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నది. ఒకవేళ కేంద్రం తెలంగాణకు ఈ పార్కును ఇచ్చి ఉంటే– ఇదే టీడీపీ, టీడీపీ మీడియా గగ్గోలు పెట్టేవి. పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేసేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఈ లేఖ రాశానని యనమల రామకృష్ణుడు ప్రకటించినట్లు కూడా సమాచారం వచ్చింది. తన పేరుతో ఇలాంటి లేఖ రాస్తే పార్టీకి నష్టం వస్తుందని సందేహించి యనమలతో చంద్రబాబు రాయించారని అనుకోవచ్చు. మరో వైపు గుజరాత్‌కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు స్వాగతించాయి. టీడీపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో, ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. యనమల రామకృష్ణుడు ఈ ప్రాజెక్టు ఇవ్వవద్దని ఏకంగా కేంద్ర రసాయనాల శాఖ అధికారులకు లేఖ రాశారు. దానికి కారణం బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతం కలుషితం అవుతుందని అంటున్నారు. మరి టీడీపీ ప్రభుత్వ హయాంలో తుని ప్రాంతంలో కొన్ని కాలుష్య కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం ఆ పరిశ్రమలకు ఎలా మద్దతు ఇచ్చింది? అంటే తమ పార్టీ అధికారంలో ఉంటే కాలుష్యం ఉన్నా ఫర్వాలేదని చెబుతున్నారా? ఎక్కడైనా కాలుష్యం అధికంగా ఉంటే దాన్ని అదుపు చేయాలని కోరడం తప్పు కాదు. కానీ అసలు పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం! పరిశ్రమలు తీసుకురండి, కానీ కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోండి అని చెప్పవలసిన నేతలు ఇలా దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారంటే వారు టీడీపీకి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నారా, వద్దను కుంటున్నారా? నిజంగానే కాలుష్యంపై అంత శ్రద్ధ ఉంటే, తిరుపతిలో అమర రాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యం గురించి ప్రభుత్వం నోటీసు ఇస్తే టీడీపీ ఎంత యాగీ చేసింది? వీరికి అంత చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు స్వయంగా కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ భవంతిలో నివసిస్తూ కృష్ణా నది కాలుష్యానికి దోహద పడతారా? ఆ మాటకు వస్తే, అసలు మూడు పంటలు పండే పచ్చటి వేల ఎకరాల భూమిని సేకరించి రాజధాని నిర్మాణం చేపడతారా? ఇప్పటికీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ గొడవ చేస్తున్నారే? తమ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం పర్యావరణం పాడైపోయినా ఫర్వాలేదా? గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్పాలి. 1999 ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మంజూరు చేసిన వంటగ్యాస్ కనెక్షన్లను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ భావిం చింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రోశయ్య, పర్వతనేని ఉపేంద్ర కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ఫిర్యాదు చేస్తారా అని జనంలో ప్రచారం చేశారు. అదే కాదు, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని గత టరమ్‌లో ఎవరైనా కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని విమర్శించేవారు. అమరావతి రాజధానిని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నా రని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తే, తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తేవారు. అధికారం కోల్పో యిన తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ పల్లవి మార్చేసింది. ఎక్కడైనా ఏపీలో ఏదైనా మంచి పని జరిగితే దానిని ఎలా అడ్డు కోవాలన్న ఆలోచన చేస్తోంది. చివరికి పేదల ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా కోర్టుకు తీసుకు వెళ్లి అడ్డుపడే యత్నం చేశారు. ఆంగ్ల మీడియం ప్రవేశ పెడుతుంటే తెలుగు నాశనం అవుతోందని గగ్గోలు పెడుతూ విద్యార్థులకు కీడు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు ఏకంగా భారీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉన్న బల్క్ డ్రగ్ పార్కునే అడ్డుకునే యత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వస్తే సుమారు యాభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పది వేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక అనుబంధ, ఉప పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడం తెలుగుదేశంకు ఇష్టం లేదని అనుకోవాలి. అందుకే ఇలా అడ్డగోలుగా వ్యతిరేక ప్రచారానికి బరి తెగించారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినా అందులో చంద్రబాబు ఈ అంశం గురించి మాట్లాడలేదంటేనే తేలు కుట్టిన దొంగ మాదిరి భయపడ్డారని అనుకోవచ్చా? ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుంటే టీడీపీ మీడియా ఎంతో దుర్మార్గంగా కథనాలు ఇస్తోంది. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, కాలుష్య కారక పరిశ్రమలపై స్పష్టమైన విధానం ప్రకటించారు. కాలుష్యాన్ని అనుమతించే ప్రసక్తే లేదనీ, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వాటిని ప్రారంభిస్తామనీ అన్నారు. అదే ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ మధ్య ఒక కర్మాగారం కాలుష్యాన్ని జీరో స్థాయికి తెచ్చిన తర్వాతే దాని ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ విష యాలు యనమల, చంద్రబాబు వంటివారికి తెలియవని కావు. కానీ తమను ఓడించిన ఏపీ ప్రజల పట్ల కక్షతోనో, ద్వేషంతోనో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం తమకు ఈ పార్కు వద్దని చెబితే ఇదే టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసేది! పెట్టుబడులు రావడం లేదని ఎలా ఆరోపణలు చేసేది! ప్రభుత్వంపై విధ్వంసం అంటూ ఆరోపణలు గుప్పించే తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఇలాంటి పనులు నిజంగా విధ్వంసం కిందకు వస్తాయని గమనించాలి. తాజాగా ఏపీకి సుమారు లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రావడానికి అడుగులు పడుతున్నాయి. వాటిని టీడీపీ అడ్డుకోకుండా ఉంటే మంచిది. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియాను ఎదుర్కోవడం మరో ఎత్తు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి. చంద్రబాబు, యనమల వంటివారినీ, దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్న మీడియానూ ఎదుర్కుంటూ ధైర్యంగా ముందుకు సాగు తున్నారు. ఎన్నికలలో ఏమవుతుందన్నది పక్కనబెడితే, ఏపీ భవి ష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి పరిశ్రమలను అడ్డుకోకుండా టీడీపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిద్దాం. లేకుంటే ప్రజలే వారికి గుణ పాఠం చెబుతారు. కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కరోనా సంక్షోభ సమయంలోనూ పరిశ్రమలకు చేయూత
-
వినియోగదారులకు శుభవార్త, అదుపులోకి రానున్న సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు!
న్యూఢిల్లీ: పరిశ్రమలకు సరఫరా చేస్తున్న సహజవాయువును పట్టణ గ్యాస్, పైప్డ్ గ్యాస్ కోసం మళ్లించాలంటూ పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఆదేశించింది. సీఎన్జీ, పట్టణ పంపిణీ గ్యాస్ ధరలు 70% మేర పెరిగిపోవడంతో, వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గృహాల్లో వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు వినియోగించే సీఎన్జీ డిమాండ్ తీర్చేందుకు వీలుగా, ఖరీదైన ఎల్ఎన్జీ దిగుమతితో లోటును అధిగమించాలని మూడు నెలల క్రితం పెట్రోలియం శాఖ ఆదేశించింది. ఇది ధరలు పెరిగేందుకు దారితీసింది. దీంతో దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌ను పట్టణాల్లో సరఫరాకే వినియోగించాలన్న పూర్వపు విధానానికి అనుకూలంగా పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గ్యాస్‌ను పంపిణీ చేసే ఇంద్రప్రస్థ గ్యాస్‌కు, ముంబైలో గ్యాస్ పంపిణీలోని మహానగర్ గ్యాస్‌కు రోజువారీగా 17.5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) నుంచి 20.78 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ సరఫరా పెరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో సీఎన్జీ, పీఎన్జీ అవసరాలను 94% మేర తీర్చడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం 84% వరకు దేశీయ సరఫరా కాగా, మిగిలిన మొత్తానికి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. చదవండి👉భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్! -
నెల్లూరులో గ్యాస్ పరిశ్రమ ఏర్పాటు పనులు షురూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ అందించేందుకు అనుమతులు పొందిన ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులు షురూ చేసింది. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పనుల పరిశీలన... వెంకటరెడ్డి పాళెం పంచాయితీ పరిధిలోని ఓజ్లీలో ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులను సూళ్లూరు పేట ఆర్డీఓ పరిశీలించారు. పరిశ్రమ నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఆయన సర్వే సిబ్బందితో కలిసి నిశితంగా సమీక్షించారు. చెరువులో గానీ, గురుకుల పాఠశాల, వాకాటి వారి కండ్రిగ, రాజు పాలెం ఎస్టీకాలనీలకు సమీపంలో నిర్మాణాలు ఏమైనా చేపట్టారా అనే అనుమానాల నేపధ్యంలో ఈ పరిశీలన జరిపినట్టు ఆయన వెల్లడించారు. సందేహాల నివృత్తి కోసం పరిశ్రమ ప్రతినిధులు, గ్రామస్తులతో అధికారుల బృందం మాట్లాడింది. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు తమ పరిశ్రమ ఏర్పాటు సంబంధిత వివరాలు అందించారు. ఓజ్లిలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్సన్నాహాలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీగా ఏజీ అండ్ పీ ప్రథమ్‌కు 12 సీజీడీ లైసెన్లనుపెట్రోలియం– సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్ జీఆర్బీ) మంజూరు చేసింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా 34 జిల్లాల్లో ప్రతి రోజూ వినియోగం కోసం గ్యాస్‌ను ఏజీ అండ్ పీ అందిస్తుంది. అలా సంస్థ సరఫరా చేస్తోన్న ఓ గ్రామమే నెల్లూరు జిల్లాలోని ఓజ్లి గ్రామం.జ్లీ వద్ద ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ఏర్పాటుచేయడం కోసం పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ; డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్, బాయిలర్స్, ఫ్యాక్టరీస్ (డిష్); ద ఫైర్– స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ (ఫైర్ ఎన్ ఓసీ), నెల్లూరు నగరాభివృద్ధి సంస్ధ (నుడా), అపెక్స్ సేఫ్టీ స్టాట్యూటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కంపెనీ అవసరమైన అన్ని అనుమతులను తీసుకుంది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంగీకారం (సీటీఈ) సైతం పొందింది. పరిశ్రమ ఏర్పాటులో వర్తించేటటువంటి అన్ని చట్టాలకూ, అదే విధంగా స్టెయినబల్ గ్యాస్ ఆర్ధిక వ్యవస్ధ సృష్టికి తాము కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రతినిధులు వివరించారు. -
AP: పరిశ్రమలకు రాచబాట
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈవోడీబీ)లో రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయోజనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచి గత ర్యాంకింగ్‌ను కాపాడుకుంది. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటుకు ప్రపంచ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారితో పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంయుక్తంగా బిజినెస్ రిఫామ్స్ యాక్షన్ ప్లాన్ 2020ని ప్రకటించారు. గతంలో మాదిరి ర్యాంకులుగా కాకుండా ఈసారి టాప్ అచీవర్స్, అచీవర్స్, యాస్పైర్స్, ఎమర్జింగ్ బిజినెస్ ఎకో సిస్టమ్స్ పేరుతో నాలుగు విభాగాలుగా రాష్ట్రాలను విభజించి ప్రకటించారు. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్ అచీవర్స్‌గా ప్రకటించారు. ఇందులో ఏపీ 97.89 శాతంతో మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గుజరాత్ (97.77%), తమిళనాడు(96.67%), తెలంగాణ (94.86%), హరియాణా (93.42%), పంజాబ్ (93.23%), కర్ణాటక (92.16%) ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అచీవర్స్‌గా నిలిచాయి. అసోం, ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌లు యాస్పైర్స్గా.. అండమాన్–నికోబార్, బిహార్, చండీగఢ్, డామన్–డయ్యూ, దాద్రానగర్–హవేలీ, జమ్మూ–కశ్మీర్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపుర రాష్ట్రాలు ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్‌గా నిలిచాయి. తగినంత యూజర్ డేటా లేనందున సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, లదాఖ్‌ల ఫీడ్‌బ్యాక్ పొందలేకపోయామని కేంద్రం పేర్కొంది. 301 సంస్కరణల ఆధారంగా ర్యాంకింగ్స్ 19 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 301 సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం 2021 జనవరి నాటికే కట్టుదిట్టంగా అమలు చేసింది. ఒక్కొక్క సంస్కరణ ద్వారా ప్రయోజనం పొందిన వారిలో కనీసం 20 మందిని రాండమ్‌గా సర్వే చేయడం ద్వారా ర్యాంకులను నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ సంస్కరణల ద్వారా 8,850 మంది ప్రయోజనం పొందినట్లు డీపీఐఐటీ వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. సర్వేలో వీరు పేర్కొన్న అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో 97.89 శాతం సంతృప్తితో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలకు చేయూతనందించే విధంగా రిలేషన్ షిప్ మేనేజర్లు ఏర్పాటు చేయడం, ఔట్ రీచ్ కార్యక్రమాల ద్వారా పరిశ్రమల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, పరిశ్రమల సమస్యలను తక్షణం పరిష్కరించే విధంగా స్పందన ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడం, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, సింగిల్ డెస్క్ ద్వారా 93కు పైగా సేవలను అందిస్తుండంఈ ర్యాంక్ రావడానికి దోహదం చేసినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గరిష్టంగా 21 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్ పని చేస్తోందని, 2022 జూన్ 29 నాటికి 71,164 అనుమతులను ఈ పోర్టల్ ద్వారా ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రానున్న కాలంలో 23 విభాగాలకు ఈ సింగిల్ డెస్క్ సేవలను విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలు జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు పరిశ్రమలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తోందోన్న విషయాన్ని ఈ సర్వే వెల్లడించింది. వైఎస్ జగన్ పరిశ్రమలకు అందిస్తున్న సహకారానికి పారిశ్రామికవర్గాల నుంచి ఆమోదం లభించింది. పూర్తిగా పారిశ్రామికవేత్తల సర్వే ద్వారా ర్యాంకులు ప్రకటించిన రెండు సార్లు కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. పారిశ్రామిక సుస్థిరాభివృద్ధి కోసం ఇదే ప్రభుత్వం కొనసాగాలని పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్న విషయాన్ని తెలియచేస్తోంది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన రాష్ట్రం కావడంతో ఇప్పుడు పొరుగు రాష్ట్రాలన్నీ మనవైపు చూస్తున్నాయి. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి. ప్రభుత్వ సహకారంపై సంతృప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగోసారి ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో 2019, 2020 ర్యాంకులు విభిన్నమైనవి. గతంలో ప్రభుత్వ నివేదికల ఆధారంగా ర్యాంకులు ప్రకటించేవారు. కానీ గత రెండేళ్లుగా అమలు చేసిన సంస్కరణలు ప్రయోజనకరంగా ఉన్నాయా లేదా అని పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకొని ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఈ ప్రభుత్వ సహకారంపై పారిశ్రామికవేత్తలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయడం వల్లే వరుసగా రెండుసార్లు మొదటి స్థానం పొందగలిగాం. – కరికల్ వలవన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ వ్యాపార సంస్కరణలకు పెద్ద పీట దేశంలో 1991 నుంచి సంస్కరణల స్వభావం మారింది. 1991 నాటి సంస్కరణల మాదిరిగా ఇప్పుడు ఒత్తిడి పరిస్థితులు లేవు. మరింత పారదర్శకమైన వ్యవస్థను రూపొందించడమే లక్ష్యం. కొన్నేళ్లుగా వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక కింద అమలు చేస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. – నిర్మాలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి. దేశ ర్యాంకింగ్ మెరుగు పర్చుకోవడమే లక్ష్యం సులభతర వాణిజ్యంలో దేశం ర్యాంక్ మెరుగు పరచాలన్న ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ సంస్కరణలకు నాంది పలికాం. దీనివల్ల ఇప్పుడు సులభతర వాణిజ్యం అనేది కొన్ని ప్రాంతాలు, నగరాలకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా ప్రతిబింబిస్తోంది. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి. తయారీ రంగంలో కొత్తపెట్టుబడులు ఖాయం : ఫ్యాప్సీ సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టాప్ అచీవర్స్‌గా గుర్తింపు రావడంపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫ్యాప్సీ) హర్షం వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు లభించే విధంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రం ఈ ఘనత సాధించిందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ సీవీ అచ్యుతరావు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రం తయారీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సులభతర పారిశ్రామిక వాతావరణం మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా శ్రీసత్యసాయి జిల్లా
ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతోంది. శ్రీసత్యసాయి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తోంది. ప్రత్యేక రాయితీలు అందిస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లాలో మెగా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ ‘వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ఎలక్ట్రిక్ బస్సు తయారీ యూనిట్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. అనంతపురం టౌన్: భారీ పరిశ్రమలకు శ్రీసత్యసాయి జిల్లా కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే కియా కార్ల తయారీ పరిశ్రమతోపాటు అనేక అనుబంధ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీంతో పాటు నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్) సంస్థ శిక్షణ కేంద్రం రూపుదిద్దుకుంటోంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఎలక్ట్రిక్ బస్సుల బాడీ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ‘వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్’ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సదురు కంపెనీకి 124 ఎకరాల భూమిని కేటాయించింది. కంపెనీ ప్రతినిధులు దాదాపు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతున్నారు. రానున్న రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసి పరిశ్రమను ప్రారంభించనున్నారు. వేలాది మందికి ఉపాధి.. వీర వాహన ఉద్యోగ్ కంపెనీ తొలుత రూ.600కోట్ల పెట్టుబడితో బస్సుల తయారీ పరిశ్రమ ప్రారంభించి, దశల వారీగా రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. స్థానికంగా దాదాపు 8వేల మంది కార్మికులకు ప్రత్యక్ష్యంగా ఉద్యోగ అవకాశాలు దక్కడంతో పాటు పరోక్షంగా మరో 15వేల మందికి ఉపాధి లభించనుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీర వాహన ఉద్యోగ్ సంస్థ తయారు చేసే బస్సులను ఇప్పటికే దేశ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా ‘ఈ– బస్సు’ బాడీ తయారీ యూనిట్‌ను శ్రీసత్యసాయి జిల్లాలో నెలకొల్పుతోంది. గుడిపల్లి యూనిట్లో ఎలక్ట్రికల్ బస్సులతో పాటు ఏసీ, నాన్ ఏసీ బస్సు బాడీలను తయారు చేయనున్నారు. సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద బస్సుల బాడీ తయారీ ప్లాంట్ కోసం జరుగుతున్న పనులు ఏడాదికి 3 వేల బస్సుల తయారీ.. రానున్న రోజులు ఎలక్ట్రిక్ రంగానిదే. ఈ – వాహనాల తయారీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అన్ని కంపెనీలు ‘ఈ – వాహనాల’ తయారీపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే ‘వీర వాహన ఉద్యోగ్’ బస్సుల తయారీ పరిశ్రమ సైతం అటువైపు అడుగులు వేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న వీర వాహన ఉద్యోగ్ పరిశ్రమలో ఈ వాహనాలతోపాటు అన్ని రకాల బస్సులను తయారు చేయనున్నారు. ఏడాదికి మూడు వేల బస్సులు తయారు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. చదవండి: (ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..) త్వరలో మరిన్ని పరిశ్రమలు పారిశ్రామికంగా శ్రీసత్యసాయి జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లాలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. వీర వాహన బస్సుల తయారీ పరిశ్రమతోపాటు రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు భారీ పరిశ్రమల నిర్వాహకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. రెండేళ్లలో వీర వాహన ఉద్యోగ్ పరిశ్రమలో బస్సులు తయారీ ప్రారంభం కానుంది. – మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ వేగవంతంగా పనులు కోవిడ్ పరిస్థితుల కారణంగా ‘వీర వాహన’ పరిశ్రమ ఏర్పాటు పనులు ఏడాదికి పైగా ఆగిపోయాయి. ప్రస్తుతం పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే 30 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని వీర వాహన బస్సుల తయారీ పరిశ్రమ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ అండగా నిలుస్తోంది. సకాలంలో వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. – నాగభూషణం, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ -
పరిశ్రమలకు 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై విధించిన అన్ని ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఇంకా కొనసాగుతున్నా, రాష్ట్రంలో నిత్యం 195.26 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొన్నప్పటికీ పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచే పరిశ్రమలపై ఆంక్షల ఎత్తివేత వర్తిస్తుందని ఏపీఈఆర్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. బొగ్గు కొరత, ఎండలతో.. వేసవి ఉష్ణోగ్రతల ప్రభావంతో గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 235 మిలియన్ యూనిట్లకు చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ధర్మల్ విద్యుదుత్పత్తిలో సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పవర్ ఎక్ఛ్సేంజీల్లో యూనిట్ ధర రూ.16 నుంచి రూ.20 వరకూ పెరిగింది. ఫలితంగా సరఫరా తగ్గి కోతలు అనివార్యమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల విద్యుత్ వినియోగంపై నియంత్రణ విధించాల్సి వచ్చింది. డిస్కమ్‌ల అభ్యర్ధన మేరకు పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేస్తూ ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో.. మే 9న పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసి ప్రభుత్వం ఊరట కలిగించింది. నిరంతరం నడిచే పరిశ్రమలు 70 శాతం విద్యుత్ వాడుకోవడానికి అనుమతిచ్చింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ ఈ నెల 13న ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 15 తరువాత పరిశ్రమలపై ఆంక్షలను పొడిగించలేదు. పరిశ్రమలకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని, ఆంక్షలను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యుత్తు సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని ఆంక్షలు, నియంత్రణలను తొలగించడంతో పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ఊరట లభించింది. వ్యవసాయం, గృహ విద్యుత్ అవసరాలకు కోతలు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యుత్తు సరఫరా జరుగుతోంది. -
భారీ పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత
పొదలకూరు: భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనిస్తూ స్థానికంగా నిరుద్యోగులకు 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ప్రభగిరిపట్నంలో ఉన్న కిసాన్ క్రాఫ్ట్ వ్యవసాయ పనిముట్ల తయారీ పరిశ్రమను మంత్రి ఆదివారం కలెక్టర్ చక్రధర్‌బాబుతో కలిసి సందర్శించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న వ్యవసాయ పనిముట్ల యూనిట్‌ను మంత్రి, కలెక్టర్ కలిసి ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి హోదాలో కాకాణి ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిసాన్ క్రాఫ్ట్ ఎండీ ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించాలని తన వద్దకు వచ్చిన వెంటనే అన్ని రకాలుగా సహాయ సహకరాలు అందించామన్నారు. ముందుగా వారితో నైపుణ్యతతో పని లేకుండా స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధన పెట్టామన్నారు. తన నిబంధనకు ఒప్పుకుని నిజాయతీగా యాజమాన్యం ఉద్యోగావకాశాలు కల్పించిందని తెలిపారు. మంచి కంపెనీ ఈ ప్రాంతానికి రావడం సంతోషంగా ఉందని, భవిష్యత్‌లో మరో 300 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. త్వరలో రెండో యూనిట్‌ను ప్రారంభిస్తామని యాజమాన్యం చెబుతుందన్నారు. సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేందుకు కలెక్టర్ చక్రధర్‌బాబు చేసిన కృషిని మరువలేమన్నారు. మంత్రి కృషి వల్లే పరిశ్రమ పీజీపట్నం పంచాయతీలో 46 ఎకరాల్లో రూ.100 కోట్ల పెట్టుబడితో స్థాపించిన కిసాన్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కృషి వల్లనే స్థాపించారని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు అన్నారు. ఈ పరిశ్రమలో 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించడం మంచి పరిణామన్నారు. జిల్లాలో మరో 18 భారీ పరిశ్రమలు స్థాపించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రభుత్వ ఉత్తర్వులు నిరుద్యోగ యువకులకు ఉపయోగపడుతుందన్నారు. ఫ్యాక్టరీ ఎండీ రవీంద్రఅగర్వాల్‌ను కలెక్టర్ అభినందించారు. కిసాన్‌క్రాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉత్పత్తులను అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కిసాన్‌క్రాఫ్ట్ ఎండీ రవీంద్ర అగర్వాల్ కంపెనీ పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ అంకిత్, సీఎఫ్ఓ అజయ్‌కుమార్ చలసాని, జీఎం కేఎల్ రావు, ఎంపీడీఓ పీ.సుజాత, తహసీల్దార్ వి.సుధీర్ పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ ప్రణాళికపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
సాక్షి, అమరావతి: రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో లక్ష సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) యూనిట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సర ప్రణాళికపై దృష్టి సారించింది. ఇందుకోసం ఎంఎస్ఎంఈ 2022–23 పేరుతో ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ పలు దేశాలు, రాష్ట్రాలు పర్యటించి అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. చదవండి: అంగన్వాడీ వర్కర్లకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు అలాగే రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంఘాల నుంచి సూచనలు స్వీకరించేందుకు కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంలో 17వ తేదీన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 20కి పైగా సంఘాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎంఎస్ఎంఈ యాక్షన్ ప్లాన్‌లో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నారు. దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కార్యాచరణ ప్రణాళికను పరిశ్రమల శాఖ సేకరించింది. -
AP: పరిశ్రమలకు భారీ ఊరట.. ఆంక్షలు ఎత్తివేత
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ ఆంక్షల నుంచి భారీ ఊరట లభించింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 235 మిలియన్ యూనిట్ల నుండి 161 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్టుగానే పరిశ్రమలకు ఆంక్షల నుంచి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి మాట నిలుపుకుంది. చదవండి: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే.. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అభ్యర్థన మేరకు పరిశ్రమలపై ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏపీఈఆర్సీ ఆంక్షలు విధించింది. తొలుత వారంలో ఒక రోజు పవర్ హాలిడేతో పాటు, విద్యుత్ వినియోగంలో 50 శాతానికే అనుమతించింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆంక్షలను సడలించింది. తాజా ఆదేశాల ప్రకారం.. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజువారీ డిమాండ్‌లో 70 శాతం వినియోగించుకోవచ్చు. మిగతా సమయంలో 60 శాతం వాడుకోవాలి. పగటిపూట పనిచేసే పరిశ్రమలకు వారంలో ఒక రోజు ఉన్న పవర్‌హాలిడేను మూడు రోజుల క్రితమే తొలగించగా, రోజుకి ఒక షిఫ్టు మాత్రమే నడపాలని, సాయంత్రం 6 గంటల తరువాత ఎటువంటి షిఫ్టులకు అనుమతిలేదని నిబంధనలు విధించింది. తాజాగా వాటిని కూడా తొలగించి, పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగించుకొనే అవకాశం కల్పించింది. -
పరిశ్రమలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు ఏప్రిల్ 8వ తేదీనుంచి విధించిన పవర్ హాలిడేను ఎత్తివేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అమరావతి సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్‌తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. చదవండి: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా పరిశ్రమలపై విద్యుత్ ఆంక్షలను మరోసారి సడలిస్తూ వారంలో అన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిందని మంత్రి చెప్పారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజు వారీ డిమాండ్‌లో 70 శాతం విద్యుత్‌ను వినియోగించు కోవడానికి అనుమతించిందన్నారు. మిగతా సమయంలో 50 శాతం వినియోగించు కోవచ్చన్నారు. ఈ నిబంధనలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. పగటిపూట పరిశ్రమలకు ఒక షిఫ్టుకే.. పగటిపూట పనిచేసే పరిశ్రమలకు వారంలో ఒక రోజు ఉన్న పవర్‌హాలిడేను తొలగించిందని, అయితే రోజుకి ఒక షిఫ్టు మాత్రమే నడపాలని, సాయంత్రం 6 గంటల తరువాత అనుమతిలేదని ఏపీఈఆర్సీ స్పష్టం చేసిందని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. మిగతా రాష్ట్రాల్లో ఇలా లేదు.. మన రాష్ట్రంలో కంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలను పెద్ద ఎత్తున విధించడం వల్ల పరిశ్రమలను మూసేసుకున్నారని, అటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో తలెత్తలేదన్నారు. విద్యుత్ సరఫరాలో నష్టాన్ని, చౌర్యాన్ని నియంత్రించేందుకు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించే పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని మీటర్లు పెట్టేది, సబ్సిడీ ఇచ్చేదీ కూడా ప్రభుత్వమే అయినప్పటికీ ఏదో జరిగిపోయినట్లు ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వారెవరితో పొత్తుపెట్టుకుంటే ఏంటి.. గెలవలేనని తెలిసి చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనల్లో పొంతన ఉండటంతో ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్న విషయాన్ని బహిరంగంగా చెప్పాలని తాము అడిగామన్నారు. కాలుష్య కారక సంస్థలపై కఠిన చర్యలు రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ.. నిరంతర పర్యవేక్షణ చేయాలని కోరారు. నారాయణ అరెస్టులో కక్ష ఏముంది? టీడీపీ మాజీమంత్రి నారాయణ అరెస్టు కక్ష పూరితంగా చేసిందేమీ కాదని మంత్రి పెద్ది రెడి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. పేపర్ మాల్‌ప్రాక్టీస్ విషయంలో దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారన్నారు. ఇదంతా నారాయణ కాలేజీల్లోనే జరిగిందని తేలిందని, అందువల్లనే నారాయణను అరెస్టు చేసుంటారని, దీనిలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. -
పరిశ్రమలపై తొలగనున్న ఆంక్షలు
సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలపై విధించిన ఆంక్షలను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. విద్యుత్ సరఫరాపై పరిశ్రమలకు విధించిన కొద్దిపాటి ఆంక్షలను వీలైనంత త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిపై డిస్కంల సీఎండీలు స్పందిస్తూ.. బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ అంతరాయాలు లేకుండా గృహాలకు నిరంతరం, వ్యవసాయానికి పగటిపూట 7గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డైరెక్టర్ ఏవీకే భాస్కర్, డిస్కంల సీఎండీలు సంతోషరావు, పద్మజనార్ధనరెడ్డి, హరనాథరావు పాల్గొన్నారు. -
పరిశ్రమలకు వారానికో రోజు పవర్ హాలిడే
సాక్షి, తిరుపతి రూరల్: ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే అమలు చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ హరనాథ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పుత్తూరు డివిజన్‌ను మినహాయించి, మిగతా అన్ని డివిజన్లలో శుక్రవారం పవర్ హాలిడే అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు వారానికోరోజు వారాంతపు సెలవులను అమలు చేస్తున్నాయని, దీనికి అదనంగా ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేయాలని పారిశ్రామిక వినియోగదారులకు సూచించారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాలపాటు పవర్ హాలిడే అమలులో ఉంటుందన్నారు. ప్రస్తుతం కోవిడ్–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ వినియోగం అధికమైందన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన స్థాయిలో బొగ్గు లభ్యత లేకపోవడం, పవర్ ఎక్స్చేంజ్లలో డిస్కమ్‌లకు 14వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా కేవలం 2వేల మెగా వాట్ల విద్యుత్ మాత్రమే ఉన్నందున సమస్యకు కారణమవుతోందన్నారు. విద్యుత్ కోతల నివారణకు చర్యలు చేపడుతున్నామని.. విద్యుత్ సరఫరా తీరును ప్రతిరోజూ సమీక్షించి, మెరుగై నసరఫరాకు తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల) -
పరిశ్రమలకు 'పవర్' ఆంక్షలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబా టులో లేదు. దీంతో గృహ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇంధనశాఖ పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్యకేంద్రాల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను వ్యవసాయ, గృహావసరాలకు సర్దుబాబు చే యాలని నిర్ణయించింది. నిరంతరం పనిచేసే పరిశ్రమలు ప్రస్తుతం రోజులో వాడే విద్యుత్‌లో 50 శా తం లోడు తగ్గించాలని, ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలని ఇంధనశాఖ కోరింది. మిగతా పరిశ్రమలు కూడా ప్రస్తుతం ఉన్న ఒకరోజుకు అద నంగా మరొక రోజు ‘పవర్ హాలీడే’ ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పవర్ హాలీడే శుక్రవారం నుంచి రెండు వారాలపాటు అంటే, ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. దీనిని జిల్లాలవా రీగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నియంత్రి స్తాయి. మాల్స్, వ్యాపార, వాణిజ్యసంస్థలు సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విద్యుత్ నియంత్రణ పాటించాలని సూచించింది. ఈ సమయంలో హోర్డింగ్‌లు, సైన్ బోర్డుల విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివే యాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లో ఏసీలు 50 శాతమే వాడాలని చెప్పింది. ఇంధన శాఖ అత్యవసర సమావేశం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గిపోవడంతో ఇంధనశాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. విద్యుత్ వినియోగంపై సమీక్షించారు. దేశమంతటా కొరత ఏర్పడటంతో గుజరాత్ వంటి చాలా పారిశ్రామిక రాష్ట్రాలు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు లోడ్ రిలీఫ్ అమలు చేస్తున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిని గురువారం ఆయన సమీక్షించారు. పంట ముగింపు సీజన్, దేశవ్యాప్తంగా వేడిగాలుల కార ణంగా విద్యుత్ అందుబాటులో లేదని, రానున్న 15 రోజుల్లో పంటలు కోతకు రానున్నందున డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ విని యోగదారులకు నష్టం జరగకుండా విద్యుత్ సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి లోడ్ రిలీఫ్ అమలు చేయాలని డిస్కంలను ఆదేశించారు. కొందామన్నా దొరకడంలేదు వేసవి కాలం కావడంతో గృహ విద్యుత్ వినియోగం 5 శాతం, నీరు సమృద్ధిగా ఉండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కె సంతోషరావు, జె పద్మజనార్దనరెడ్డి, హెచ్ హరనాధరావులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. గత మూడేళ్లలో కోవిడ్ 19 కారణంగా పరిశ్రమలతో పాటు వాణిజ్య విద్యుత్ వాడకం కొంత తగ్గిందని, ఇప్పుడు కరోనా నుంచి బయటపడటంతో వినియోగం పెరిగిందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు అందుబాటులో లేకపోవడం, బహిరంగా మార్కెట్లో కొందామాన్న దేశవ్యాప్తంగా పవర్ ఎక్సే ్చజిల్లో 14 వేల మెగావాట్ల విద్యుత్‌కుగాను 2 వేల మెగావాట్లే అందుబాటులో ఉండటంతో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. పరిస్థితి మెరుగుపడగానే పవర్ హాలీడే, ఆంక్షలు ఎత్తివేస్తామని వారు వివరించారు. అనివార్యంగా లోడ్ రిలీఫ్ ఏప్రిల్ 1న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 235 మిలియన్ యూనిట్లు ఉండగా, అందుబాటులో ఉన్న ఉత్పత్తి వనరులతో పాటు బహిరంగ మార్కెట్ నుంచి సుమారు 64 మిలియన్ యూనిట్లు మాత్రమే లభించింది. ఈ డిమాండ్ 2021తో పోల్చితే 3.54 శాతం, 2020తో పోలిస్తే 46 శాతం ఎక్కువ. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్‌ను తీర్చడానికి అన్ని దీర్ఘకాలిక ఉత్పత్తి వనరులను ఉపయోగించిన తర్వాత, రోజుకు దాదాపు 40 నుంచి 50 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. దీనిని అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్ల నుండి కొనాలి. అయితే, దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజిల నుంచి విద్యుత్ కొంటున్నాయి. కానీ విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో ఎక్స్చేంజిలలో కూడా అవసరమైన మేరకు దొరకడంలేదు. దీంతో అనివార్యంగా రాష్ట్రంలోని వ్యవసాయ, గృహ రంగాలకు రోజులో కొన్ని గంటలు అత్యవసర లోడ్ రిలీఫ్ జారీ చేయవలసి వచ్చిందని ఇంధన శాఖ వివరించింది. -
Rayalaseema: పారిశ్రామిక ‘సీమ’
సాక్షి, అమరావతి: చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు విరబూస్తున్నాయి. పరిశ్రమలతో కళకళలాడుతున్నాయి. కడప నగరానికి కూత వేటు దూరంలోని కొప్పర్తి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నాడు పది లక్షలు.. నేడు రూ.కోటిన్నర రెండేళ్ల క్రితం కొప్పర్తి కనుచూపు మేరంతా తుప్పలతో నిండిన చౌడు భూములే కనిపించేవి. ఒక్క భవనమూ లేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే పరిస్థితి మారింది. రెండేళ్లలోనే రెండు పెద్ద పారిశ్రామిక వాడలు వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ రూపుదిద్దుకున్నాయి. గత డిసెంబర్లో సీఎం జగన్ వీటిని ప్రారంభించి పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. వివిధ పరిశ్రమల నిర్మాణంతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది. ఇది మార్పునకు స్పష్టమైన సంకేతమని దేవేంద్ర సిమెంట్స్ అధినేత మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి కూడా పనికిరాని ఈ భూములు ఏడాది క్రితం వరకు ఎకరా రూ.10 లక్షలు ఉండగా ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఎకరం రూ.1.5 కోట్లు పలుకుతోందని తెలిపారు. వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పిందని కొప్పర్తి పక్కన ఉన్న అంబాపురం వాసి కుంపటి ఓబిలేసు ఆనందంగా చెప్పాడు. భార్య భర్తకి కలిపి రోజుకు రూ.1,200 తక్కువ కాకుండా కూలి వస్తోందని తెలిపాడు. మారుతున్న సీమ రూపురేఖలు రాయలసీమలో మూడు భారీ పారిశ్రామిక పార్కులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని రకాల మౌలిక వసతులతో 36,133 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అభివృద్ధి చేస్తోంది. విశాఖ–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కొప్పర్తి నోడ్, చిత్తూరు నోడ్, ఓర్వకల్ నోడ్లను ఆసియా అభివృద్ధి బ్యాంకు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. కొప్పర్తి నోడ్ కొప్పర్తి వద్ద 3,157 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్ఆర్ ఈఎంసీ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వైఎస్ఆర్ జగనన్న ఎంఐహెచ్ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులతో పాటు 75,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇప్పటికే 47 పరిశ్రమలకు 430 ఎకరాలు కేటాయించారు. రూ.1,837 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. 8,941 మందికి ఉపాధి లభిస్తుంది. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీని రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా రూ.9,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. చిత్తూరు నోడ్ శ్రీకాళహస్తి వద్ద 23,538 ఎకరాల్లో ఏడీబీ నిధులతో ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. రెండు దశల్లో రూ.1,577.21 కోట్లతో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓర్వకల్లు కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిక్‌డిట్ నిధులతో 10,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 62,000 మందికి, పరోక్షంగా 77,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ రూ.37,300 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 3 ఎంఎంఎల్‌పీలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో కలిసి అనంతపురంలో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు ఓర్వకల్లు, కొప్పర్తి వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. పారిశ్రామిక విప్లవం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూన్ నుంచి ఇప్పటివరకు 50కి పైగా భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.27,530 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 37,204 మందికి ఉపాధి లభించింది. కియా కార్ల కంపెనీ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండా విస్తరణ పనులు వేగంగా చేపడుతోంది. హీరో మోటోకార్ప్, టాటా స్మార్ట్‌ఫుడ్జ్, టోరే, అపోలో టైర్స్, టీహెచ్‌కే ఇండియా లాంటి పలు సంస్థలు ప్రభుత్వ సహకారంతో విజయవంతంగా ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 43 భారీ పరిశ్రమలు రాయలసీమలో పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న ఈ యూనిట్ల ద్వారా రూ. 42,421 కోట్ల పెట్టుబడితోపాటు 1,26,396 మందికి ఉపాధి లభిస్తుంది. ఇందులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్, సెంచరీ ఫ్లైవుడ్స్, నీల్కమల్, పిత్తి లామినేషన్స్, రామ్‌కో సిమెంట్స్, ప్రిజిం సిమెంట్స్ , సుమిత్ ఫుట్‌వేర్, భారత్ ఎలక్ట్రానిక్స్, నాసీన్, బ్లూస్టార్, హావెల్స్ ఇండియా, ఆంబర్ ఎంటర్ప్రైజెస్, ఆల్ల్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలున్నాయి. ఇదే సమయంలో రాయలసీమలో 5,923 ఎంఎంస్‌ఎంఈలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.1,671 కోట్ల పెట్టుబడులతో పాటు 45,171 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. అభిప్రాయాలు రాష్ట్రమంతా అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణను ప్రభుత్వం చేపట్టింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలను విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. – జవ్వాది సుబ్రమణ్యం, వీసీఎండీ, ఏపీఐఐసీ ఏపీలో సరికొత్త నినాదం.. ‘‘రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’’ – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ శంకుస్థాపన సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ అంతకు మించి.. తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక మరిన్ని కంపెనీలు తీసుకొస్తాం పెట్టుబడి ప్రతిపాదన అందజేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు ఇతర కంపెనీలను కూడా తీసుకొస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ ప్రకటన -
కోస్తా తీరంలో పారిశ్రామిక కెరటాలు
సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ, పోర్టు ఆధారిత పరిశ్రమలను ఆకర్షించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. కోస్తాంధ్ర పరిధిలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లాలు, సముద్ర తీర ప్రాంతాలు కావడంతో అందుకు అనుగుణంగా పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలో పండే పంటల ఆధారంగా ప్రతి నియోజకవర్గ పరిధిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న 3 పోర్టులకు అదనంగా మరో రెండు పోర్టులు, ఏడు ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తోంది. పోర్టులకు సమీపంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రెండు భారీ పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రూ.40 వేల కోట్లకుపైగా పెట్టుబడులు... సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్తాంధ్ర జిల్లాల్లో గణనీయమైన పారిశ్రామిక పురోగతి కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పటికే రూ.6,008 కోట్ల విలువైన పెట్టబడులు కార్యరూపం దాల్చి ఉత్పత్తి ప్రారంభించగా మరో రూ.34,532 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన వాటిలో కిసాన్ క్రాఫ్ట్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అశోక్ లేలాండ్, తారకేశ్వర టెక్స్టైల్స్, వెంకటేశ్వర పేపర్ ప్రోడక్ట్స్ తదితర సంస్థలున్నాయి. ఈ 18 యూనిట్లు రూ.2,971 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా 11,181 మందికి ఉపాధి లభించింది. ఇదే సమయంలో 13,134 ఎంఎంఎస్ఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా రూ.3,037 కోట్ల పెట్టుబడులతో పాటు 78,905 మందికి ఉపాధి లభించింది. భారీ సంస్థల ఆసక్తి కోస్తాంధ్రాలో పోర్టు ఆధారిత వాణిజ్యం కోసం భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 35 యూనిట్లు రూ.34,532 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. వివిధ దశల్లో ఉన్న యూనిట్లు అందుబాటులోకి వస్తే 72,319 మందికి ఉపాధి లభిస్తుంది. జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ నెల్లూరు జిల్లాలో రూ.7,500 కోట్లతో ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,404.36 కోట్లతో శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్, రూ.2,700 కోట్లతో గ్రాసిం ఇండస్ట్రీస్, నెల్లూరు జిల్లాలో రూ.7,942 కోట్లతో ఏపీ పవర్ డెవలప్మెంట్ కంపెనీ, కాకినాడ వద్ద రూ.5,000 కోట్లతో కృష్ణా గోదావరి ఎల్ఎన్జీ టెర్మినల్ లాంటి భారీ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ఒక్కటే తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. కోస్తాంధ్ర అభివృద్ధి ప్రణాళిక ఇలా.. పంట ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఆహార రంగంలో ప్రముఖ సంస్థలతో కలసి ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.100 కోట్లతో అభివృద్ధి చేసిన మెగా ఫుడ్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనిపక్కనే ఏపీఐఐసీ కూడా మరో 50 ఎకరాల్లో ఫుడ్ పార్కును అభివృద్ధి చేసింది. ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేసుకున్న సంస్థలు మెగా ఫుడ్ పార్కులోని కోర్ ప్రాసెసింగ్ సెంటర్‌ను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. క్రిస్ సిటీ.. నిమ్జ్.. విశాఖ చెన్నై కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద తొలిదశలో 2,500 ఎకరాల్లో రూ.1,500 కోట్లతో క్రిస్ సిటీ పేరుతో పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం టెండర్ల స్థాయిలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పనులు ప్రారంభించనుంది. ప్రకాశం జిల్లాలో 14,390 ఎకరాల్లో నిమ్జ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు దొనకొండ వద్ద డిఫెన్స్, ఏరో స్పేస్ యూనిట్లను నెలకొల్పేలా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ.3,820 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధితోపాటు మచిలీపట్నంలో రూ.4,000 కోట్లతో, రామాయపట్నంలో రూ.3,650 కోట్లతో పోర్టులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం టెండర్లు ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నం పోర్టుకు మారిటైమ్ బోర్డు టెండర్లు పిలుస్తోంది. ఇంత భారీ వ్యయం ఇదే తొలిసారి రాష్ట్రంలోని తీరప్రాంతాన్ని వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి సుమారు రూ.25,000 కోట్లు వ్యయం చేయనుంది. ఈ స్థాయిలో ఓ రాష్ట్రం ఇంత భారీ వ్యయం చేయనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే 4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలు కాగా మరో 5 హార్బర్లకు టెండర్లు పిలిచాం. ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మిస్తున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులు అందుబాటులోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు ప్రభుత్వ ప్రోత్సాహంతో.. సాగు ఖర్చులను తగ్గించేలా పరికరాల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో నెల్లూరు జిల్లాలో కిసాన్ క్రాఫ్ట్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఏటా 75,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటైంది. ట్రెంచింగ్, సీడింగ్, ఇరిగేటింగ్, హార్వెస్టింగ్ లాంటి పలు పరికరాలను అమర్చుకొని వినియోగించుకునేలా ఇంటర్ కల్టివేటర్స్ను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటి వరకు వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండగా ఇక ఆ అవసరం ఉండదు. తయారీ యూనిట్‌తో పాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మేం అభివృద్ధి చేసిన ఉత్పత్తులకు 12 పేటెంట్లు లభించాయి. – అంకిత్ చిటాలియా, సీఈవో, కిసాన్ క్రాఫ్ట్ పెను మార్పులు.. తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తర్వాత రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయి. హార్బర్ల నిర్మాణం ద్వారా మత్స్యకార మహిళలకు నిజమైన చేయూత అందుతుంది. – ప్రసాదరావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఎకనామిక్స్ ఆచార్యులు మాట నిలబెట్టుకున్నారు.. ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా మత్స్యకార సమ్మేళనంలో మాకు ఇచ్చిన మాట మేరకు హార్బర్ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. మినీ హార్బర్ కోరితే ఏకంగా మేజర్ హార్బర్ చేపట్టడం మత్స్యకారుల అభ్యున్నతిపై ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. 50 వేల మత్స్యకార కుటుంబాలకు మేలు జరుగుతుంది. – కారే శ్రీనివాసరావు, మత్స్యకార నాయకుడు, తూ.గో. వలస వెళ్లక్కర్లేదు కుటుంబ పోషణ కోసం కర్నాటక, గుజరాత్‌లోని ఫిషింగ్ హార్బర్లలో చేపల బోట్లలో కూలీలుగా పని చేస్తున్నాం. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ద్వారా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. – కొమారి రాజు, మత్స్యకారుడు, తుమ్మలపెంట, కావలి, నెల్లూరు జిల్లా -
ఈ ఏడాది అందుబాటులోకి 30 కర్మాగారాలు..!!
-
తనిఖీలు నిల్లు.. నిబంధనలకు నీళ్లు!
సాక్షి హైదరాబాద్: పారిశ్రామిక వాడల్లో అపరిమిత కాలుష్యం వెదజల్లుతున్నవి, నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీల భరతం పట్టే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. మహా నగరానికి ఆనుకొని ఉన్న పది పారిశ్రామిక వాడల్లో ఆల్ఫాజోలం వంటి నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తరచూ ఆనవాళ్లు బయటపడడంతో పాటు పలు పారిశ్రామిక వాడల్లోని కంపెనీలు భరించలేని ద్రవ, ఘన, వాయు కాలుష్యం వెదజల్లుతున్నా.. టాస్క్‌ఫోర్స్ బృందాలు చోద్యం చూస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుట్టుగా కార్యకలాపాలు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామికవాడలున్నాయి. ఆయా వాడల్లో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు కొలువుదీరాయి. వీటిలో బల్క్‌డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఏం ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమల ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా ఉండదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపలేం జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతుండడం గమనార్హం. నిబంధనలివీ.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రె డ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమ లు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా సు మారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టూపక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్‌వో) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. ∙దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందాలి. నిత్యం వెలువడుతున్న వ్యర్థ జలాల, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన కాగితాలకే పరిమితమవుతుండడం గమనార్హం. ఇలాంటి కంపెనీలపై టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు చేసి కట్టడి చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వానికి సీఐఐ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఆదాయ వనరులు అడుగంటినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటాన్ని భారతీయ పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) అభినందించింది. రూ.7,880 కోట్లతో కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు రూ.3,820 కోట్లతో ఆధునికీకరణకు శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలపడాన్ని సీఐఐ ఏపీ విభాగం స్వాగతించింది. రెండేళ్లుగా కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్ర ఆర్థిక వృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు ఇచి్చనందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ నియంత్రణతో పాటు పరిశ్రమలు, వ్యాపార వ్యవహారాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఐఐ పేర్కొంది. ఈమేరకు సీఐఐ విడుదల చేసిన పత్రంలో కొన్ని సూచనలు చేసింది. చదవండి: AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం ►ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కొన్న దాదాపు రెండేళ్ల తర్వాత ప్రజల శక్తి తిరిగి పూర్వ స్థాయికి చేరుకునేందుకు ఆరి్థక కార్యకలాపాల పునరుద్ధరణ కీలకం. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాలి. ►కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు 25 శాతం ఆక్యుపెన్సీలో ఉంటే తగిన జాగ్రత్తలతో సాధారణ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అదే 25 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీలో ఉంటే సామాజిక కార్యకలాపాలను పరిమితం చేయాలి. కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి. ►కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు 50 నుంచి 75 శాతం వరకు ఆక్యుపెన్సీలో ఉంటే మైక్రో జోన్ల్లో కార్యకలాపాలపై నియంత్రణ, రద్దీని నివారించడానికి లాక్డౌన్ లాంటి కఠిన చర్యలు అవసరం. 75 శాతానికి మించి బెడ్లు నిండితే లాక్‌డౌన్‌తో పాటు అదనపు ఆంక్షలు అమలు చేయాలి. పరిశ్రమలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యాపారాల కొనసాగింపు, స్థిరత్వాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమని సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ సి.కె.రంగనాథన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆరి్థక మాంద్యాన్ని అధిగమించాలంటే వ్యాపార లావాదేవీలను కొనసాగించడం అవసరమన్నారు. ఎంఎస్ఎంఈలకు అండగా ఏపీ ప్రభుత్వంతో కలసి సీఐఐ పని చేస్తోందని చెప్పారు. మహమ్మారి సమయంలో పరిశ్రమలకు మద్దతిచి్చనందుకు ఏపీ ప్రభుత్వానికి సీఐఐ కృతజ్ఞతలు తెలియజేస్తోందని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఐఐ ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్ డి.తిరుపతిరాజు ప్రశంసించారు. 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, వైద్య కళాశాలల అభివృద్ధి ద్వారా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు బలోపేతమై ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమ వర్గాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాయని తెలిపారు. -
AP: పరిశ్రమకు రుణాల దన్ను
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ఏపీ రాష్ట్రంలో షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు పారిశ్రామిక రంగానికి రుణాల మంజూరును జోరుగా కొనసాగించాయి. దేశం మొత్తం మీద.. దక్షిణాది రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగానికి రుణాల మంజూరు తిరోగమనంలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మూడేళ్లుగా అంటే 2019 నుంచి 2021 మార్చి వరకు బ్యాంకు రుణాల మంజూరు పెరిగింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఏటేటా తగ్గుతూ వస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో సైతం 2019 నుంచి 2021 మార్చి వరకు ఏటేటా రుణాల మంజూరు తగ్గింది. వివిధ రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగానికి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల రుణాల మంజూరు తీరుపై ఆర్బీఐ ఇటీవల విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. 2020 మార్చి వరకు 2021 మార్చి నాటికి పోల్చి చూస్తే దేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగానికి బ్యాంకు రుణాల మంజూరు 3.9 శాతం తిరోగమనంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా 0.43 శాతం క్షీణత నమోదైంది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 5.3 శాతం వృద్ధి నమోదైంది. ఇందుకు ప్రధాన కారణం కోవిడ్ సంక్షోభంలో కూడా జాగ్రత్తలతో పరిశ్రమలు పని చేయడానికి అనుమతించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడమే. ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బ్యాంకుల ద్వారా పారిశ్రామిక రంగానికి రుణాలు మంజూరు చేసే వాతావరణాన్ని కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలకు రూ.44,500 కోట్ల మేర బ్యాంకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఆరు నెలల్లోనే అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.24,896 కోట్ల (55.95 శాతం) రుణాలు మంజూరయ్యాయి. -
ఆంధ్రప్రదేశ్ కు క్యూ కడుతున్న కంపెనీలు
-
స్థానికులకు ఉద్యోగాలిస్తే మరిన్ని ప్రోత్సాహకాలు
హఫీజ్‌పేట్: రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు అందించే పరిశ్రమలు, సంస్థలకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. ఐటీ సహా వివిధ వ్యాపార సంస్థలకు సైబర్ భద్రతా ఉత్పత్తులు, సేవలు అందించే కోటెలిజెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టెక్‌డెమోక్రసీ అనుబంధ సంస్థ) శుక్రవారం హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని స్కైవ్యూలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని కోటెలిజెంట్ ప్రతినిధులు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 136 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో 50% మంది 27 ఏళ్ల కంటే తక్కువ వయసు వారేనన్నారు. అయితే అందరి కీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ప్రభుత్వాలకు ఉండదన్నారు. అందుకే కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలని... ప్రభుత్వం అదే చేస్తోందని కేటీఆర్ తెలిపారు. నైపుణ్యం ఉంటే ఆటోమేటిక్‌గా ఉద్యోగాలు... హైదరాబాద్‌కు భారీగా పరిశ్రమలు వస్తున్నా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదంటూ పలువురు సోషల్ మీడియాలో పేర్కొంటున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతిభగల వారు, ఫైర్ ఉన్న యువత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఆటోమెటిక్‌గా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతిభగల వారిని కంపెనీలు తీసుకుంటాయని, స్థానికులకు కూడా ప్రతిభ ఉంటే ఉద్యోగాలు సంపాదించవచ్చన్నారు. కోటెలిజెంట్ సంస్థ ద్వారా వందలాది మందికి ఉదోగ్యాలు కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఎదగడం కోటెలిజెంట్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకిరణ్ పాటిబండ్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఆమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసి హైదరాబాద్‌లో కోటెలిజెంట్ సంస్థను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. సైబర్‌క్రైంపై చట్టం తెస్తున్నాం.. పౌరులు, సంస్థల డేటా భద్రంగా ఉండాలంటే సైబర్ సెక్యూరిటీ ఉండాల్సిందేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో సైబర్‌క్రైం పెరుగుతోందని... ప్రధాని ట్విట్టర్ ఖాతా కూడా తాజాగా హ్యాకింగ్‌కు గురైందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో సైబర్ యుద్ధాలే జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో కోటెలిజెంట్ సంస్థ సైబర్ వారియర్ అనే ప్రాజెక్టును కూడా ఏకకాలంలో ప్రారంభించడం మంచి విషయమన్నారు. నల్సార్ యూనివర్సిటీ సహకారంతో సైబర్ క్రైం కట్టడికి చట్టం తేవాలనుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ తరహా చట్టాన్ని తీసుకురానున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని కోటెలిజెంట్ ప్రతినిధులను కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి మంది సైబర్ వారియర్స్‌ను తయారు చేయడానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) మంత్రి కేటీఆర్ సమక్షంలో కోటెలిజెంట్ సంస్థ ఇచ్చిపుచ్చుకుంది. -
పరిశ్రమల ఖిల్లా ఆ జిల్లా.. రెండున్నర ఏళ్లలో ఆరు వేల ఉద్యోగాలు
జిల్లా పరిశ్రమలకు ఖిల్లాగా మారింది. సువిశాలమైన తీరం, ఆర్థిక మండళ్లు. భారీ పోర్టు, అనుబంధ పరిశ్రమలతో పారిశ్రామిక హబ్‌గా తయారైంది. దీంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటులో 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం చట్టబద్ధత చేయడం నిరుద్యోగులకు వరంగా మారింది. పరిశ్రమల ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో నిరుద్యోగులు ఉద్యోగాల్లో కొలువుదీరుతున్నారు. సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న పారిశ్రామిక చేయూత జిల్లా ముఖచిత్రాన్ని మార్చేసింది. పారిశ్రామికాభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. నిరుద్యోగులకు కొలువులు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హమీల్లో భాగంగా ఇప్పటికే గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులతో భర్తీ చేశారు. నూతనంగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు అందించే బిల్లుకు కూడా చట్టబద్ధత కల్పించారు. పోటీ ప్రపంచంలో యువతకు ఉద్యోగాలకు తగిన నైపుణ్యత ఇచ్చి జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మంత్రి మేకపాటి చొరవతో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటికే నైపుణ్య శిక్షణతో దాదాపు 6 వేల మంది కొలువు తీరారు. జిల్లాలో పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ ఇచ్చి కొలువులు ఇప్పించారు. ప్రత్యేకంగా 2019–20లో మూడు జాబ్ మేళాలతో పాటు 41 స్కిల్ కనెక్ట్స్ నిర్వహించి 1,368 మందికి ఉపాధి కల్పించారు. 2020–21లో 4 స్కిల్ కనెక్ట్స్ నిర్వహించి 154 మందికి ఉపాధి కల్పించారు. 2021–22 ఒక జాబ్‌మేళా, 5 స్కిల్ కనెక్ట్స్ నిర్వహించి 1,152 మందికి ఉపాధి కల్పించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఆత్మకూరు, ఉదయగిరి వంటి మెట్ట ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. చదవండి: (రైతన్నకు 100 % ‘మద్దతు’) ఆత్మకూరులో ఇప్పటికే రెండు విడతలుగా జాబ్‌మేళాలు నిర్వహించి దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించారు. 2019 నవంబర్‌లో ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో తొలి జాబ్‌మేళాలో 1,716 మంది నిరుద్యోగులు హాజరు కాగా, అందులో 424 మందిని అక్కడే ఎంపిక చేసి వివిధ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు పత్రాలు ఇచ్చారు. 674 మందికి ఒక నెల పాటు నైపుణ్య శిక్షణ అందించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. వీరితో పాటు మరో 213 మందికి దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. గత అక్టోబర్ 30న ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన మరో జాబ్‌మేళాలో 2,437 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హజరు కాగా వారిలో 25 కంపెనీలు 840 మందిని ఎంపిక చేసి ఉద్యోగాలు కల్పించాయి. స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు వివిధ యూనివర్సిటీలు, సంస్థలతో కలిసి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించడంతో పాటు వారి దృక్ఫథంలో మార్పును తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ఆ«ధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి స్కిల్ కనెక్ట్, ఏఎస్సీ డ్రైవ్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. యువతీ, యువకులు వారి ఆసక్తి మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు.అలాగే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జాబ్‌మేళాలు, స్కిల్ కనెక్ట్ డ్రైవ్స్ నిర్వహించి ఉద్యోగాలు కల్పించారు పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని శ్రీసిటీలో పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇండస్ట్రీ కస్టమైజేడ్ స్కిల్ ట్రైనింగ్, ప్లేస్మెంట్సెంటర్ను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. – షేక్ అబ్దుల్ ఖయ్యూం, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, నెల్లూరు -
Kuppam: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 30 ఏళ్ల చీకటి!
అమరావతి పేరిట రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించిన బాబు తనను మూడు దశాబ్దాలుగా మోస్తున్న కుప్పం ప్రజలను అంతకు మించి కలలతీరాల్లో విహరింపజేశారు. రాజధానికి మించి ఇక్కడ అభివృద్ధి చేస్తామని, పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తామని ఆ ఐదేళ్లూ ఊదరగొట్టారు. కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన పాపాన పోలేదు. నిజంగా ఇంత దారుణంగా మాయ చేస్తారా అనిపిస్తుంది వాస్తవాలు చూస్తే! సాక్షి ప్రతినిధి, తిరుపతి: అమాయక కుప్పం ప్రజలను ఎన్నో విధాలుగా నమ్మించి మాయ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరిశ్రమల పేరిట ఎన్నో జిమ్మిక్కులు చేశారు. ప్రజాప్రతినిధిగా మూడు దశాబ్దాల కాలంలో లెక్కకు మించిన అబద్ధాల దడి కట్టారు. ఎన్నెన్నో పరిశ్రమలు వచ్చేస్తున్నాయని నమ్మబలికారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 2016 ఆగస్టు 8వ తేదీ రాత్రి ఇక్కడే పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశమయ్యారు. రూ.3వేల కోట్లతో వివిధ పరిశ్రమలు వచ్చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. బడా కంపెనీల పేర్లు చెప్పేసరికి కుప్పం ప్రజలు ఆశల పల్లకిలో ఊరేగారు. అన్నీ కాకపోయినా కొన్నయినా వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా రాలేదంటే వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కుప్పం నియోజకవర్గం నుంచి రోజూ వేలాది మంది కార్మికులు బెంగళూరుకి వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా మొత్తం మీద వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కుప్పమే అంటే నమ్మశక్యం కాకపోయినా అక్షరాలా నిజం. మాకేంటి.. అనే డిమాండ్‌తో కొన్ని వెనక్కి వాస్తవానికి ఆయా చర్చల తర్వాత విరివిగా భూములు ఇస్తామని చెప్పడంతో కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ బాబుకి అత్యంత సన్నిహితులైన స్థానిక టీడీపీ నేతలు ఆయా కంపెనీల్లో మాకు వాటాలు ఇవ్వాలి.. మాకేం ప్రయోజనం కలిగిస్తారు.. అనే డిమాండ్లతో వచ్చే కంపెనీలు కూడా వెనక్కి వెళ్లాయనే వాదనలు ఉన్నాయి. ► బ్రిటానియా పరిశ్రమ కోసం ఆ సంస్థ ప్రతినిధులు శాంతిపురం మండలంలోని కర్లగట్ట కోతులగుట్ట, కుప్పం మండలంలోని గణేష్‌పురం, గుడుపల్లె మండలంలోని పొగురుపల్లె ప్రాంతాలలో స్థల పరిశీలన చేశారు. కానీ అక్కడితోనే ఆగిపోయి తర్వాత కన్నెత్తి చూడలేదు. ► వైష్ణవి మెగా ఫుడ్ పార్క్ కోసం శాంతిపురం మండలంలోని 121 పెద్దూరు వద్ద వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కేటాయించారు. ఈ భూములు సాగు చేస్తున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కోవడంపై స్థానికులు వ్యతిరేకించినా అధికార బలంతో వారి గొంతు నొక్కారు. కానీ ఇంత చేసినా పరిశ్రమ మాత్రం తీసుకురాలేకపోయారు. అనంతరం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ రైతులే తమ భూములను ఎంచక్కా సాగు చేసుకుంటున్నారు. పనులు దొరక్క బెంగళూరు పోతిమి.. నాకు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. అదిచేసినాం, ఇది చేసినాం అంటారే గానీ.. మాకు ఇక్కడ ఏ పనులు దొరకలేదు. పుట్టినూరు, ఉండే ఇళ్లు వొదిలేసి బెంగళూరుకు వెళ్లిపోయినాము. పదేళ్లకుపైనే ఇక్కడే ఉండాము. ఆకు కూరలు, కూరగాయలు అమ్మి పిల్లోళ్లని సదివిస్తా ఉండాము. ఏదైనా పండగొచ్చినా, పెళ్లిళ్లు జరిగినా కుప్పంకు వచ్చిపోతాము. – బాబు, చీలేపల్లె, కుప్పం ఉపాధి కోసం వలస వెళ్లడంతో పాడుబడిన బాబు నివాసం ఉపాధి కల్పనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన సుమారు 20వేల మంది కార్మికులు పనుల కోసం నిత్యం బెంగళూరుకు వెళ్లాల్సిన దుస్థితి. దీంతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంది. కుప్పంలో అపారమైన రాతి సంపద, నైపుణ్యం కలిగిన రాతి కార్మికులు ఉండడంతో ఆ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని భావించింది. వేలాది మందికి ఉపాధి సౌకర్యం కల్పించేలా గ్రానైట్ సర్వే స్టోన్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లె సమీపంలో పల్లార్ల పల్లె వద్ద 4 ఎకరాల స్థలంలో యూనిట్ స్థాపనకు చర్యలు చేపట్టింది. -
పునరుత్పాదక విద్యుత్ తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, ఇతర సంస్థలు తమ మొత్తం వినియోగంలో కనీస వాటా మేర పునరుత్పాదక విద్యుత్(సౌర, పవన లాంటి)ను తప్పనిసరిగా వినియోగించాల్సిందే. లేని పక్షంలో జరిమానా తప్పదు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించిన వారికి ప్రోత్సాహకాలు సైతం లభించనున్నాయి. ఇంధన సంరక్షణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సవరణలు తీసుకురాబోతోంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుండటం, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పాదక ఇంధన వినియోగ స్థాయిలను పెంచడానికి ఈ సవరణలు తీసుకువస్తున్నామని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. పరిశ్రమలు, భవనాలు, రవాణా తదితర రంగాల్లో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఈ సవరణలను ప్రతిపాదించింది. రంగాలవారీగా ఎంత శాతం మేర పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న అంశాలను ఈ సవరణల ద్వారా కేంద్రం తెలపనుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేలా పునరుత్పాద విద్యుత్‌ను వినియోగించే సంస్థలకు ‘కార్బన్ సేవింగ్ సర్టిఫికెట్’రూపంలో ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే విద్యుత్ మంత్రిత్వశాఖ వివిధ వర్గాల వినియోగదారులతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. ఈ సవరణలు అమల్లోకి వస్తే దేశంలో శిలాజాల(పెట్రో, డీజిల్ లాంటి) ఇంధన వనరుల వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. గ్రిడ్ ద్వారా నిర్దేశిత పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్ సరఫరా జరగనుంది. కర్బణ ఉద్గారాల తగ్గింపే లక్ష్యం.. పారిస్ ఒడంబడిక ప్రకారం.. దేశంలో 2030 నాటికి కర్బణ ఉద్గారాల విడుదలను 33–35 శాతం మేరకు తగ్గించాలి. 2030 నాటికి మొత్తం ఇంధన అవసరాల్లో 40 శాతం అవసరాలను శిలాజయేతర ఇంధన వనరులను ద్వారా తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుని కేంద్రం ఈ సవరణలను తీసుకొస్తోంది. 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ విడుదలను 550 మెట్రిక్ టన్నులకు తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. శిలాజాల ఇంధనవనరుల వినియోగం తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిపాదిత సవరణలో ప్రత్యేక నిబంధనలు ఉండనున్నాయి. చట్ట పరిధిలో భారీ నివాస భవనాలు.. వాతావణం కలుషితం చేయని విధంగా ఇంధన వనరులను వినియోగించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్ రంగం సైతం భాగం కానుంది. భారీ నివాస భవనాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని తప్పనిసరి చేయనుంది. భారీ భవనాలకు భవిష్యత్‌లో సోలార్ రూఫ్‌టాప్ లేదా ప్రత్యామ్నాయ మార్గంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం తప్పనిసరి కానుంది. -
బాబోయ్.. మేం భరించలేం..ఊపిరాడట్లే!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 51 కాలనీల్లో రాత్రివేళల్లో శివారు పరిశ్రమలు వెదజల్లుతున్న విష వాయువులతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిపూట ఊపిరి తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆయా పరిశ్రమల ఆగడాలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తక్షణం సదరు పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులను వేడుకుంటున్నారు. ప్రధానంగా బాచుపల్లి, నిజాంపేట్, మియాపూర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, మదీనాగూడ, లింగంపల్లి, గచ్చిబౌలి, బీహెచ్ఈఎల్, అమీన్పూర్ ప్రాంతాలవాసుల అవస్థలు అన్నీఇన్నీ కావు. కొంత కాలంగా కేవలం రాత్రి వేళల్లోనే ఇలాంటి విషవాయువుల వాసనతో తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నట్లు పీసీబీ దృష్టికి తీసుకురావడం గమనార్హం. చదవండి: Huzurabad Bypoll: ఈ ఎన్నిక చాలా ఖరీదు గురూ! పారిశ్రామిక వాడలకు సమీప ప్రాంతాల్లోనే.. గ్రేటర్‌తో పాటు శివార్లలోని పలు ప్రాంతాలు వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్ అండ్ డైయింగ్, పొగాకు, పెయింట్స్, మీట్ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్ పేపర్ తదితర పరిశ్రమలున్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి రాత్రివేళల్లో విష వాయువులను వెదజల్లుతుండడంతో ఈ ప్రాంతాలకు దగ్గరున్న కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో పీసీబీకి ఫిర్యాదులు తరచూ వెల్లువెత్తుతున్నాయి. చదవండి: డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో పరిశ్రమల ఆగడాలిలా.. ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు (ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం. గాఢత అధికంగా ఉన్న వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ఘన,ద్రవ వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. -
వారు మాకు బ్రాండ్ అంబాసిడర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించే క్రమంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారిని చాలా రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయని, తెలంగాణ మాత్రం వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా భావిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘8వ జాతీయ సదస్సు 2021’లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ ఏడేళ్ల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో 24 శాతం అనగా సుమారు 32 బిలియన్ డాలర్ల మేర ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఆకర్షించామని చెప్పారు. పెట్టుబడులను రాబట్టేందుకు అవసరమైన విధానాలు, మౌలిక వసతులపై మార్గదర్శనం చేసేందుకు నైపుణ్యం కలిగిన యువకుల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’వేదిక ద్వారా ఈ యువకులు మంచి ఫలితాలు రాబడుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ఐఐసీ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పునరుద్ధరణీయ ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఖర్చుతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేస్తున్నామని, స్థానికులకు ఎక్కువసంఖ్యలో ఉద్యోగాలు లభించేలా చూస్తున్నామని వివ రించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తు న్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, జీవ ఔషధాలతోపాటు ఫార్మా, బయోటెక్, వైద్య ఉపకరణాలు, రక్షణ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర, యంత్ర, ఎలక్ట్రానిక్ వాహనాలు, ప్లాస్టిక్, రసాయన, వజ్రాభరణాలు, చిల్లర వర్తకం వంటి రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. సమావేశంలో ఫిక్కి కార్యదర్శి జనరల్ దిలీప్ షెనాయ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
గోనె సంచుల కొరత తీరేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల అవసరం భారీగా పెరుగుతోంది. అటు రైతుల నుంచి ధాన్యం సేకరణ, ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి ఏటా 27 కోట్లకు పైగా గోనె సంచులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో జనుము సాగు లేకపోవడం, గోనె సంచుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో వీటి కొనుగోలుకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని జనపనార పరిశ్రమలు తెలంగాణలో 80 శాతానికి పైగా గోనె సంచుల అవసరాలను తీరుస్తున్నాయి. జనుము సాగుకు పేరొందిన పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో జనపనార దిగుబడి తగ్గినా, అక్కడి పరిశ్రమల్లో సమస్యలు ఏర్పడినా ధాన్యం కొనుగోలు సమయంలో తెలంగాణ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనుము సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభం కలిగేలా చూడటంతో పాటు, రైతులు పండించే జనపనారను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో జనపనార పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జనపనార పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో ఇటీవల కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.887 కోట్లతో మూడు జనపనార పరిశ్రమలు... దేశవ్యాప్తంగా సుమారు 140కి పైగా జనపనార పరిశ్రమలు ఉండగా, తెలంగాణలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా 38 వేలకు పైగా హెక్టార్లలో జనుము పంట సాగవుతుండగా పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనపనార ఉత్పత్తుల రంగంలో స్వయం స్వావలంబన సాధించేందుకు తొలి దశలో జనపనార పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెలలో వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ఇటీవల పరిశ్రమల శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.887 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ మూడు పరిశ్రమల ద్వారా 10,448 మందికి ప్రత్యక్ష ఉపాధి, రెండింతల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. జనపనార పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ జౌళి, దుస్తుల విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తారు. ఆయా యూనిట్లు తయారు చేసే గోనె సంచులను రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది. తమకు అవసరమైన ముడి జనపనార కోసం రైతులు జనుము సాగు చేసేలా ఈ కంపెనీలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. 15 కోట్ల సంచుల ఉత్పత్తి సామర్థ్ద్యం... రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడుతున్న మూడు పరిశ్రమలు ఏటా సుమారు 15 కోట్ల గోనె సంచులను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటికి అవసరమైన జనపనారను బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి రవాణా చేసేందుకు అయ్యే మొత్తాన్ని మొదటి ఏడాది వంద శాతం, మరో రెండేళ్లు 50 శాతం, ఆ తర్వాత ఐదేళ్లు 25శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. అదే విధంగా కంపెనీలు తయారుచేసే గోనె సంచులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వంద శాతం తిరిగి కొనుగోలు చేస్తుంది. ‘రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని పదేపదే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆయా పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా పెంపొందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే జనపనార పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని జనపనార కంపెనీలు పెట్టుబడులతో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – ‘సాక్షి’తో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ -
నేడు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించనున్న సీఎం జగన్
-
ఈ నగరానికి ఏమైంది.. ఆ సమస్యని పట్టించుకోరా?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ కలకలంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో నగరంలోని బల్క్‌డ్రగ్, ఫార్మా రంగంలోని పరిశ్రమలకు ప్రభుత్వం నిత్యం 24 గంటలపాటు ఉత్పత్తుల తయారీకి అనుమతించింది. ఇదే సమయంలో కొన్ని పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. గాలి, నీరు, నేల కాలుష్యానికి కారణమవుతున్న ఉద్గారాలను వదిలిపెడుతున్నాయి. పర్యావరణ హననానికి పాల్పడుతున్నాయి. ఈ విషయంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ కాలుష్య పరిశ్రమలను కట్టడి చేసే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీపీ) ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ఇటీవల జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, పటాన్చెరు, పాశమైలారం తదితర ప్రాంతాల్లో ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై పీసీబీకి వందకుపైగా ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయా పరిశ్రమలను తనిఖీ చేసే విషయంలో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలివే ►ఆయా బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకర ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టీపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు (ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం. ►గాఢత అధికంగా ఉన్న వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ►ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ప్రధానంగా మల్లాపూర్, ఉప్పల్, కాటేదాన్, కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, దుండిగల్, పటాన్చెరు, పాశమైలారం, బొంతపల్లి తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. ►ఆయా ప్రాంతాల్లో గతంలో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో ప్రయోగించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భారలోహలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. గతంలో ఎన్జీఆర్ జరిపిన సర్వేలోనూ బాలానగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలో ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లుగా వెల్లడైంది. కాగితాల్లోనే తరలింపు.. ►మహానగరానికి ఆనుకొని భయంకరమైన కాలుష్యం వెదజల్లుతున్న రెడ్, ఆరెంజ్ విభాగానికి చెందిన 1,160 పరిశ్రమలను సిటీకి దూరంగా తరలించే విషయంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కాలుష్య మేఘాలు మహానగరాన్ని కమ్మేస్తున్నాయి..సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ►గ్రేటర్ పరిధిలో ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్ అండ్ డైయింగ్, పొగాకు, పెయింట్స్, వార్నిష్, మీట్ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్ పేపర్ పరిశ్రమలున్నాయి. వీటి కారణంగా మహానగరం పరిధిలోని 185 చెరువుల్లో ఇప్పటికే సుమారు 100 కాలుష్య కాసారాలుగా మారాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థ జలాలను ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్య కాసారాలుగా మారాయి. -
ఫార్చ్యూన్ జాబితాలో రిలయన్స్ డౌన్...
న్యూఢిల్లీ: ‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500’ కంపెనీల జాబితా 2021లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 59 స్థానాలు కిందకు దిగిపోయింది. 155వ స్థానంలో నిలిచింది. 2017 తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇంత తక్కువ ర్యాంకు రావడం ఇదే మొదటిసారి. రిలయన్స్ ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు కారణం. రిలయన్స్ ఆదాయం 25.3 శాతం తగ్గి 63 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ జాబితా పేర్కొంది. 2020 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) చమురు ధరలు భారీగా పతనం అవ్వడం తెలిసిందే. అది ఆదాయం తగ్గేందుకు దారితీసింది. 524 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెరికన్ కంపెనీ వాల్‌మార్ట్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ 384 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. 280 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన అమెజాన్ మూడో స్థానంలోను, చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్, సినోపెక్ గ్రూపు ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇతర చమురు కంపెనీల పరిస్థితీ అంతే ఈ జాబితాలో దేశీయ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ 16 స్థానాలు పెంచుకుని 205కు చేరుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 61 ర్యాంకుల కిందకు పడిపోయి 212 స్థానంలో నిలిచింది. ఓఎన్జీసీ 243 (53 స్థానాలు తక్కువ), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 348 (114 స్థానాలు అధికం), టాటా మోటార్స్ 357 (20 స్థానాలు తక్కువ), భారత్ పెట్రోలియం 394 (క్రితం ఏడాది 309) ర్యాంకులు దక్కించుకున్నాయి. 2021 మార్చికి ముందు ఆయా కంపెనీల మొత్తం ఆదాయం (ఆర్థిక సంవత్సరం వారీగా) ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించినట్టు ఫారŠూచ్యన్ సంస్థ తెలిపింది. ఈ జాబితాలోని ఎస్బీఐ ఆదాయం 52 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఐవోసీ ఆదాయం 50 బిలియన్ డాలర్లు, ఓఎన్జీసీ ఆదాయం 46 బిలియన్ డాలర్లు, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఆదాయం 35 బిలియన్ డాలర్ల చొప్పున ఉండడం గమనార్హం. -
సీఎం జగన్‌ను కలిసిన యునైటెడ్ టెలిలింక్స్, నియోలింక్ కంపెనీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో యునైటెడ్ టెలిలింక్స్ నియోలింక్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. రూ.2150 కోట్ల పెట్టుబడితో 6వేల మందికి పైగా ప్రత్యక్షంగా 15 నుంచి 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యూటీఎన్పీఎల్ ముందుకు వచ్చింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రముఖంగా ఉన్న యూటీఎల్, నియోలింక్‌తో కలిసి తిరుపతి, వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్ఆర్ ఈఎంసీలో ఫ్యాక్టరీల ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్‌కు కంపెనీల ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో యూటీఎల్ ఛైర్మన్, డైరెక్టర్ సుధీర్ హసీజ, నియోలింక్ గ్రూప్ ఛైర్మన్ రువెస్ షెబెల్, గోల్డెన్ గ్లోబ్ ఎండీ రవికుమార్, వైఎస్సార్ ఈఎంసీ సీఈవో నందకిశోర్‌రెడ్డి ఉన్నారు. -
వేల కంపెనీలు మూతపడ్డాయ్, ఏ రాష్ట్రంలో ఎక్కువంటే
కరోనా వేళ వేలాది కంపెనీలు మూతపడ్డాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు 15 నెలల్లో కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదైన కంపెనీల్లో 17,228 మూతపడినట్టు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ రాజ్యసభకు తెలిపారు. ఇందులో తమిళనాడు రాష్ట్రానికి చెందినవి 1,899 ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి నోటిఫై చేసిన 379 ప్రత్యేక ఆర్థిక మండళ్లు దేశంలో పనిచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, 2014–20 మధ్య ఏడు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 440 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపారు. -
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ అగ్రస్థానం: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమతో పాటు పరిసరాల అభివృద్ధి జరగాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో కోస్టల్ కారిడార్ ఉందని, రాబోయే రోజుల్లో పెట్టుబడులు బాగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో పాటు స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని జీవో తెచ్చామని తెలిపారు. -
నాటి నుంచి నేటి దాకా.. ‘సరస్వతి’పై సర్వం కుట్రలే
సాక్షి, అమరావతి: పరిశ్రమలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎంపీ రాఘురామకృష్ణరాజు ద్వయం సరికొత్త కుట్రకు తెరతీసింది. నిబంధనల ప్రకారం మైనింగ్ లీజులు పొందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌పీఐపీఎల్)పై రాజకీయ దురుద్దేశంతో పన్నాగానికి పథక రచన జరుగుతోంది. ప్రభుత్వం నుంచి భూములు తీసుకోకుండా మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో మైనింగ్ నిర్వహిస్తున్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలకు పాల్పడుతుండటం విస్మయపరుస్తోంది. మైనింగ్ లీజు రద్దుకు టీడీపీ హయాంలో చేసిన కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ప్రస్తుతం బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో నిందితుడైన రఘురామరాజును అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నారు. వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని బ్యాంకులను మోసగించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు.. సరస్వతి పవర్ మైనింగ్ లీజులను రద్దు చేయాలని కోరడం విస్మయపరుస్తోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నది ప్రైవేటు భూములే.. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌పీఐపీఎల్) 2008లో గుంటూరు జిల్లాలో 266 హెక్టార్ల ప్రైవేటు భూమిని కొనుగోలు చేసింది. సాధారణంగా ఏ పారిశ్రామిక సంస్థ అయినా ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంది. కానీ రాజకీయ ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదని భావించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యం తమకు భూములు కేటాయించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరలేదు. పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో సున్నపురాయి మైనింగ్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందింది. పూర్తి పారదర్శకతతో జరిగిన ఈ వ్యవహారంపై భూములు అమ్మిన ప్రైవేట్ వ్యక్తులు కూడా దానిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రాజకీయ కక్షతో లీజు రద్దు.. చెల్లదని కోర్టు తీర్పు 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష పూరితంగా వ్యవహరించింది. మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించలేదంటూ సరస్వతి పవర్ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై సరస్వతి యాజమాన్యం సహేతుకమైన వివరణ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా మైనింగ్ లీజును 2014 అక్టోబర్ 9న రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూములైతే మైనింగ్ లీజు రద్దు చేసి వాటిని మరొకరికి ఇవ్వవచ్చు. కానీ అవి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూములు. లీజు రద్దు చేసినా సరే ఆ భూములు ప్రభుత్వానికి చెందవు. కేవలం రాజకీయ కక్షతోనే నాడు టీడీపీ సర్కారు అడ్డగోలుగా వ్యవహరించింది. చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మైనింగ్ లీజును రద్దు చేస్తూ టీడీపీ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ భూముల్లో మైనింగ్ చేసుకోవచ్చని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు అనుమతినిచ్చింది. ఆర్థిక నేరాల నిందితుడితో కలసి... సున్నపురాయి గనుల మైనింగ్ లీజు రద్దుకు తమ ప్రభుత్వ హయాంలో చేసిన కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈసారి కొత్త పన్నాగానికి తెరతీశారు. తన చేతిలో కీలుబొమ్మగా మారిన రఘురామకృష్ణరాజును తెరముందు పెట్టి కుట్ర పన్నారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు ఇచ్చిన మైనింగ్ లీజు రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. జాతీయ బ్యాంకుల నుంచి రూ.2,655 కోట్ల మేర రుణాలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. అటువంటి కేసులో నిందితుడు కోర్టును ఆశ్రయించి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజును రద్దు చేయాలని కోరడం వెనుక కచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర... రాష్ట్రం అభివృద్ధి చెందడం ఏమాత్రం సహించలేని చంద్రబాబు అండ్ కో రాజకీయ కుట్రతోనే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు పన్నాగం పన్నారన్నది సుస్పష్టమవుతోంది. పరిశ్రమలు ఎక్కువగా వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నది ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. అందుకే ప్రభుత్వాలే పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు భూములు కేటాయించి మరీ పరిశ్రమల స్థాపనకు చొరవ చూపిస్తాయి. కానీ ప్రభుత్వం నుంచి భూములుగానీ ఇతరత్రా ప్రయోజనాలను ఆశించకుండానే సరస్వతి పవర్ ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొని నిబంధనల మేరకు మైనింగ్ కార్యకలాపాలు చేపట్టింది. ఓ పారిశ్రామిక సంస్థ ఇంతటి ఉదారతతో వ్యవహరించడం అరుదని పారిశ్రామిక, న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఆగితే ఉపాధికి విఘాతం.. రాజకీయ దురుద్దేశంతో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజును అడ్డుకునేందుకు యత్నిస్తూ పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకునేందుకు పన్నాగం పన్నుతుండటాన్ని పరిశీలకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మైనింగ్ లీజును రద్దు చేస్తే ఆ భూములు ప్రభుత్వానికి చెందవు. సర్వస్వతి పవర్ ఇండస్ట్రీస్ వద్దే ఉంటాయి. ఎందుకంటే అవి ఆ కంపెనీ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూములు కాబట్టి. కానీ లీజు రద్దు చేస్తే ఆ భూములు నిష్ప్రయోజనంగా మారతాయి. పారిశ్రామిక కార్యకలాపాలు నిలిచిపోతే ఎంతోమంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం కల్పిస్తున్న సానుకూల వాతావరణానికి విఘాతం కలుగుతుంది. పారిశ్రామిక ప్రగతి దెబ్బతింటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ కుట్రలకే ప్రాధాన్యమిస్తూ చంద్రబాబు, రఘురామరాజు ద్వయం తమ పన్నాగాలను కొనసాగిస్తుండటం వారి దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఇటువంటి రాజకీయ పరిణితిలేని, కుట్రపూరిత చర్యలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విఘాతమని, పెట్టుబడులను ప్రోత్సహించాలన్న జాతీయ విధానానికి వ్యతిరేకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్ ఇదేమి సుమోటో..! -
హైదరాబాద్‌లో 36 శాతం తగ్గిన రెసిడెన్షియల్ నిర్మాణాలు
-
వైఎస్సార్ ఏపీ వన్ గొడుగు కిందకు అన్ని శాఖలు: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఏపీ వన్ గొడుగు కింద అన్ని శాఖలు తీసుకురానున్నట్లు పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. నైపుణ్యం వల్లే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన సమగ్ర పరిశ్రమ సర్వే, కౌన్సెలింగ్, స్కిల్లింగ్, ప్లేస్‌మెంట్స్, రీస్కిల్లింగ్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రీస్కిల్లింగ్‌లో భాగంగా శిక్షకులకు శిక్షణ, అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై చర్చించారు. సమగ్ర పరిశ్రమ సర్వే గురించి ఆరా తీశారు. కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులున్నా సర్వే కొనసాగిస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారురాజు వెల్లడించారు. 2017లో నైపుణ్య కొరతపై సర్వే జరిగిందని.. సిమెంట్, ఆటోమేటివ్, నిర్మాణ రంగాలు సహా మొత్తం 10 రంగాలపై పరిశీలించిన అనంతరం నైపుణ్య కోర్సులు ఎంపిక చేశామని మంత్రికి ఆయన వివరించారు. తయారీ కోసం భవిష్యత్తులో సాంకేతికతపైనా పరిశీలన చేస్తున్నామని, నైపుణ్యంపై బెంచ్ మార్కు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను సంప్రదించి.. చర్చించామని బంగారు రాజు తెలిపారు. మంత్రి మేకపాటి అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్ డీఎస్ ఎండీ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Home Guards: ఆంధ్ర వైపు తెలంగాణ హోంగార్డుల చూపు! AP: ‘మత్స్యకార భరోసా' పథకం.. నేరుగా ఖాతాల్లోకి రూ.10వేలు -
పరిశ్రమలపై లాక్డౌన్ ఎఫెక్ట్
-
తెలంగాణ లౌక్‌డౌన్: పరిశ్రమలకు నిబంధనలు ఇవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా పారిశ్రామిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామిక, సర్వీసు రంగాల కార్యకలాపాలకు సం బంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవల కార్యకలాపాలను వీలైనంత తక్కువ మంది సిబ్బందితో నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజింగ్ సర్వీసులు, సరుకుల రవాణా, కార్మికుల రాకపోకలకు అనుమతి, ఈ–కామర్స్, హోం డెలివరీ సర్వీసులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి అనుమతిస్తారు. పరిశ్రమల నిర్మాణ పనులు యథావిధిగా నడుస్తాయి. లాక్డౌన్ మినహాయింపు వేళల్లోనే కార్మికుల రాకపోకలకు అనుమతి ఉంటుంది. లాక్డౌన్ సమయంలో కార్మికులకు పరిశ్రమల ఆవరణలోనే వసతి ఏర్పాటు చేయాలి. ఐడీ కార్డులు ఉన్న కార్మికుల రాకపోకలకు అనుమతి ఇస్తారు. మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు కార్మికుల శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయడంతో పాటు, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించడంతో పాటు వేతనాలు కూడా చెల్లించాలి. కార్మికులు పాజిటివ్‌గా తేలితే శానిటైజేషన్ చేపట్టిన తర్వాతే కార్యకలాపాలు ప్రారంభించాలి. భోజన, టీ విరామ సమయంలో కార్మికులు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 500కు మించి కార్మికులు పనిచేసే పరిశ్రమలు సొంత క్వారంటైన్ వసతి ఏర్పాటు చేసుకోవాలి. చదవండి: పాస్‌పోర్టు సేవలు, రిజిస్ట్రేషన్లు నిలిపివేత తెలంగాణ: లాక్డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే -
వెనుకబడిన జిల్లాలకు పరిశ్రమలను విస్తరిస్తాం : కేటీఆర్
-
రాష్ట్రానికి రూ.60 కోట్ల విలువైన ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న పరిశ్రమలు–క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్ఈ–సీడీపీ) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.59.83 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.37.59 కోట్లతో సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం మూడు కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ఎంఎస్ఈ–సీడీపీ స్టీరింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్, మాచవరంలో పప్పులు తయారీ, వాటి ఉత్పత్తుల క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.30.07 కోట్లు ఇవ్వనుంది. దీనికి అదనంగా ఇప్పటికే ఉన్న మూడు పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. మచిలీపట్నంలోని ఆభరణాల పారిశ్రామిక పార్కు, హిందూపురం గ్రోత్ సెంటర్, గుంటూరు ఆటోనగర్ ఇండ్రస్టియల్ పార్కులను రూ. 22.24 కోట్లతో ఆధునీకరించడానికి కేంద్రం తుది ఆమోదం తెలిపింది. ఇందుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.15.57 కోట్లు సమకూర్చనుంది. మంగళవారం కేంద్ర ఎంఎస్ఎంఈ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఎంఎస్ఈ–సీడీపీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జే.సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ, ఎండీ కె.రవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యాలను అందుకోవాలి: గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ షన్ మోహన్, జాయింట్ డైరెక్టర్ ఇందిరా, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ జి.వి గిరి, శ్రీధర్ లంకా ,పరిశ్రమల శాఖ అధికారులు, ఈడీబీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈడీబీలో ఈ ఏడాది కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో మరింత మెరుగ్గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమ పెట్టాలనుకునే సామాన్య ప్రజలకు కూడా అనువైన విధానాలను అందుబాటులోకి తేవాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో పాటే నైపుణ్యం, ఉపాధి కల్పనపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి గౌతమ్‌రెడ్డి సూచించారు. చదవండి: ‘కేశినేని నాని.. పెద్ద గజదొంగ’ పచ్చనేతల కొత్త ఎత్తుగడ! -
మౌలికం... డిసెంబర్లో 1.3 శాతం ‘మైనస్’
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల గ్రూప్ 2020 డిసెంబర్లో 1.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గ్రూప్ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వరుసగా ఇది మూడవనెల. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40 శాతం పైగా వాటా కలిగిన గ్రూప్‌లోని క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. 2019 డిసెంబర్లో ఈ గ్రూప్ 3.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. డిసెంబర్ ఐఐపీ గణాంకాలు ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారాల్లో వెలువడనున్నాయి. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన మౌలిక రంగం గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020 డిసెంబర్లో బొగ్గు, విద్యుత్ మినహా అన్ని రంగాలూ క్షీణతను చూశాయి. ► క్రూడ్ ఆయిల్ (–3.6 శాతం), సహజ వాయువు (–7.2 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–2.8 శాతం), ఎరువులు (–2.9 శాతం), స్టీల్ (–2.7 శాతం), సిమెంట్ (–9.7 శాతం) క్షీణతలో ఉండగా, బొగ్గు (2.2 శాతం), విద్యుత్ (4.2 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. ► 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, గ్రూప్ ఉత్పత్తి క్షీణత 10.1 శాతంగా ఉంది. 2019–20 ఇదే సమయంలో 0.6 శాతం స్వల్ప వృద్ధి రేటు నమోదయ్యింది. ► కాగా 2020 సెప్టెంబర్‌లో గ్రూప్ 0.1 శాతం క్షీణత నమోదుచేసుకున్నట్లు తొలి గణాంకాలు పేర్కొనగా, తాజాగా ఈ గణాంకాలను 0.6 శాతం వృద్ధిగా సవరించడం జరిగింది. నిరాశ కలిగిస్తోంది... కీలక మౌలిక రంగం వరుసగా మూడవనెల డిసెంబర్‌లోనూ క్షీణతలో కొనసాగడం నిరాశను కలిగిస్తోంది. అయితే ఆటో పరిశ్రమ పురోగతి, చమురు యేతర ఉత్పత్తుల ఎగుమతులు తత్సబంధ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే, డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ– ఐఐపీ స్వల్పంగానైనా 0.5 శాతం నుంచి 1.5 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. – అదితి నాయర్ ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
త్వరలో ఐటీకి కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రస్తుతమున్న పాలసీ త్వరలో ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కొత్త ఐటీ పాలసీ తెస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రకటించిన ఐటీ పాలసీతో ఐటీ పరిశ్రమలో పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం పనితీరుపై మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరేళ్లుగా ఐటీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు ‘2021–26’మధ్య ఐదేళ్ల పాటు అమల్లో ఉండే నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు. పౌరుడే కేంద్రంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని, కొత్తగా సాంకేతిక అభివృద్ధిని ఆలంబనగా చేసుకుని సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా అందే పౌర సేవలను రాబోయే తరానికి చేరువయ్యేలా ఐటీ శాఖ దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రానున్న టీ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అందించాల్సిన కార్యక్రమాలపైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, దీని ద్వారా తమ గడప నుంచే ప్రభుత్వ సేవలు పొందేలా చూడాలని సూచించారు. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్) ఆవిష్కరణల వాతావరణం బలోపేతం.. ఆరేళ్లుగా రాష్ట్రంలో బలమైన ఆవిష్కరణల వాతావరణం (ఇన్నోవేషన్ ఎకో సిస్టం) ఏర్పడిందని, దీనిని మరింత బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా విద్యార్థులను ఇన్నోవేటర్లుగా మార్చేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గత ఆరేళ్లుగా నూతన పెట్టుబడులను రాష్ట్రానికి ప్రత్యేకించి హైదరాబాద్‌కు రప్పించడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించామని పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక యువతకు ఎక్కువ మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నారు. స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు దక్కేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. -
'ఎవరికీ కమిషన్లు, వాటాలు ఇవ్వనవసరం లేదు'
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'మేం ఓడితే పెట్టుబడులు రావు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతాయని శాపనార్థాలు పెట్టిన చంద్రబాబు, ఆయన భజన బృందం నోరు విప్పడానికి సిగ్గుపడుతున్నారు. సీఎం జగన్ గారి చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. గతంలోలాగా ఎవరికీ కమిషన్లు, వాటాలు ఇవ్వనవసరం లేదు' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: (అబ్బెబ్బే... ప్యాకేజి మాటే ఎత్తలేదు) -
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. దీని కోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని, ఈ స్పెషల్ డ్రైవ్ లో ఆయా పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. తాను కూడా కంపెనీల్లో తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఫ్యాక్టరీ, బాయిలర్ల శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. -
‘నవంబర్‌లో 'ఇండస్ట్రీస్ స్పందన' ప్రారంభం’
సాక్షి, అమరావతి: పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు ప్రజలు మరింత దగ్గరయ్యేందుకు, ఏ సమస్యకైనా సత్వరమే పరిష్కారం దిశగా పరిశ్రమల శాఖ అడుగులువేస్తోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఈడీబీ, పరిశ్రమల నీటి అవసరాలు, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీపై చర్చించారు. అలాగే పరిశ్రమల శాఖకు సంబంధించిన ప్రత్యేక 'స్పందన' వెబ్ సైట్‌ను నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ వెబ్ సైట్ ప్రారంభంతో పరిశ్రమల శాఖలో జవాబుదారీ, పారదర్శకత పెరుగనుందన్నారు. పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి సందేహం, ఫిర్యాదైనా సత్వరమే స్పందన లభించనుందని తెలిపారు చదవండి: 20 స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి 'ఫీడ్ బ్యాక్' వెసులుబాటుకు చోటు పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 'గ్రీవెన్స్' స్వీకరించేలా రూపకల్పన చేసినట్లు, ఫిర్యాదు, సమస్య సబ్ మిట్ మీట నొక్కిన వెంటనే ఫిర్యాదుదారుడికి మెసేజ్ వచ్చే సౌలభ్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వైఎస్సార్ ఏపీ వన్‌లను కూడా చేర్చాలని మంత్రి ఆదేశించారు. ఫిర్యాదు స్వీకరణ, పరిష్కారం తదితర పరిణామాలపై ఫిర్యాదుదారుడి ద్వారా 'ఫీడ్ బ్యాక్' వెసులుబాటుకు చోటు కల్పించాలన్నారు. పారిశ్రామిక, పెట్టుబడిదారులకు ఇండస్ట్రీస్ వర్చువల్ ఎంట్రిప్రూనర్ డిజిటల్ అసిస్టెన్స్, చాట్ బోట్ సౌకర్యంలో 'వేద' పేరుతో ఉన్న యానిమేషన్ బొమ్మ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సముద్ర వాణిజ్యంలో ఏపీ నంబర్ 1 ఏపీ బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటు బొమ్మల తయారీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విశాఖ, గోదావరి జిల్లాలలో బొమ్మల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేయాలన్నారు. అందుబాటులో ఉన్న భూములను బట్టి ముందుగానే కొంత భూమిని ఉంచాలని ఆదేశించారు. 'ఏపీ బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి తెలిపారు. కడపలోని కొప్పర్తి కేంద్రంగా ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దీనిపై స్పందించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది ఎమ్ఎస్ఎమ్ఈ యాదవపురంగా కేంద్రంగా అందుకు అనువైన చోటుందన్నారు. 'పాలసీ ల్యాబ్' ప్రస్తుత పరిస్థితిపై చర్చ కాగా ‘సోమశిల కాలువ ద్వారా చిత్తూరు-నెల్లూరు కేంద్రంగా పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలపై దృష్టి పెట్టాలన్నారు. పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలకు సంబంధించి డీపీఆర్ తయారు దిశగా సమాలోచన చేయాలన్నారు. ఏపీ టెక్స్ట్ టైల్స్, గార్మెంట్స్ పాలసీ 2018-23 ఆపరేషనల్ గైడ్ లైన్స్, ఐఎస్ బీతో భాగస్వామ్యం పై ఆరా తీశారు. ఎక్స్‌పోర్ట్‌లపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్ లంకా, ఐటీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, తదితరులు హాజరయ్యారు. -
‘ఏపీ కార్ల్’కు మహర్దశ!
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఏపీ కార్ల్)కు మహర్దశ పట్టనుంది. పశు సంపద, పాల ఉత్పత్తుల్ని పెంచడంతోపాటు అందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టే లక్ష్యంతో వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలోని పెద్ద రంగాపురంలో దీనిని నెలకొల్పారు. మహానేత మరణానంతరం ఇది నిరాదరణకు గురైంది. దాదాపు రూ.300 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దాదాపు పదేళ్లపాటు పూర్తిగా పక్కన పెట్టేశాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత పశు సంపద, పాల ఉత్పత్తుల పెంపుదల, వీటికి సంబంధించిన పరిశోధనలు చేపట్టేందుకు ఏపీ కార్ల్‌పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇక వాక్సిన్ తయారీ ఇక్కడే ►ఇకపై రాష్ట్రంలోనే పశు వ్యాధుల నివారణ వాక్సిన్ తయారు చేసే విధంగా హైదరాబాద్‌కు చెందిన ఐజీవై ఇమ్యూనోలాజిక్స్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ►పీపీపీ విధానంలో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జూలై నుంచి అన్ని రకాల పశు వ్యాక్సిన్ల తయారీ ఇక్కడ ప్రారంభమవుతుంది. ►ఇందుకోసం ఐజీవై సంస్థ దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 100 మంది నిపుణులు, సిబ్బందికి ఇక్కడ ఉపాధి లభించనుంది. మూడు కాలేజీలొస్తాయ్ ►ఇక్కడే వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక కళాశాలలను కూడా ఈ ఏడాది ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ►కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కాకపోవడంతో ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. ► రాష్ట్రంలో అరటి సాగు విస్తీర్ణం రాయలసీమ ప్రాంతంలోనే అధికంగా ఉండటంతో ఈ ప్రాంగణంలోనే 70 ఎకరాల విస్తీర్ణంలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ►తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికి ఈ ప్రాంగణంలోనే పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.18 కోట్లు వెచ్చిస్తారు. ►2021 నాటికి ఏపీ కార్ల్‌లో ఈ సంస్థలన్నీ కార్యకలాపాలు చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. చదవండి: ప్రభుత్వానికి రూ.4,881 కోట్ల అదనపు ఆదాయం -
తగ్గిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడంతో ఏప్రిల్–జూన్ మధ్య రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2,106.6 మిలియన్ యూనిట్లు తగ్గింది. మరోవైపు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో గృహ విద్యుత్తు వినియోగం మాత్రం 11.27 శాతం పెరిగింది. వ్యవసాయ విద్యుత్ వాడకం మే నెలలో మాత్రమే 5 శాతం మేర పెరిగింది. పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేని విధంగా 30.72 శాతం పడిపోయింది. విద్యుత్తు వినియోగంపై తొలి త్రైమాసికం నివేదికను ఇంధనశాఖ గురువారం మీడియాకు వెల్లడించింది. ఏపీఈఆర్సీకి గతంలో సమర్పించిన అంచనాలు తలకిందులు కావడంతో వాస్తవ చిత్రాన్ని సమర్పించనున్నారు. గతేడాది తొలి త్రైమాసికంలో అన్ని విభాగాల విద్యుత్ వినియోగం 15,262.64 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది ఇదే సమయంలో 13,156.04 మిలియన్ యూనిట్లు (13.80 శాతం తక్కువ) నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 5,221.37 ఎంయూలుగా ఉన్న ఉన్న డిమాండ్ ఈ ఏడాది 4,076.95 ఎంయూలకు పడిపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే సర్వీసులన్నీ ఆగిపోవడం విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 390.83 మిలియన్ యూనిట్లున్న విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది 262.77 ఎంయూలకు పడిపోయింది. ఒక్క మే నెలలోనే 42.71 శాతం పడిపోయింది. -
మత్సకారుల పాలిట శాపంగా.. వ్యర్థ జలాలు
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలో రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలు మత్సకారుల పాలిట శాపంగా పరిణమించాయి. రెండు సంవత్సరాల క్రితం అమీన్ పూర్ మండలం గండిగూడెం చెరువులో వ్యర్ధ జలాల మూలంగా భారీగా చేపలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ నేరుగా జోక్యం చేసుకుని పరిశ్రమలకు భారీ జరిమానా విధించడంతో పాటు వ్యర్థ జలాలు వదులుతున్న 14 పరిశ్రమలను మూసివేసింది. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో చెరువులు కలుషితం కావనే భరోసా మత్స్యకారుల్లో కలిగింది. అయినా పరిశ్రమల తీరు మారక పోవడంతో సమస్య ప్రతియేటా పునరావృతం అవుతూనే ఉంది. ఇదే సమయంలో జిన్నారం రాయని చెరువులో కాలుష్యం మూలంగా భారీగా చేపలు మృతి చెందాయి. గండి గూడెం చెరువు బాధితులకు జరిగిన న్యాయమే తమకు జరుగుతుందని అందరూ భావించినప్పటికీ ఆ సమస్యను కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) అధికారులు గాలికొదిలేశారు. ఆ సమయంలో సoబంధిత పరిశ్రమలపై కేసులు నమోదైనా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీనిని అలుసుగా భావించిన పలు పరిశ్రమలు ఏటా ఇదే తంతును కొనసాగిస్తూ వర్షపునీటిలో కాలుష్య జలాలు విడుదల చేస్తుండడంతో చేపలు చనిపోవడం పరిపాటిగా మారుతుంది. తాజాగా పరిశ్రమలు కలుషిత జలాలు విడుదల చేయడంతో జిన్నారం మండలం కిష్టయ్య పల్లి మల్లం చెరువు గడ్డపోతారం అయ్యమ్మ చెరువులో చేపలు చనిపోయాయని మత్స్యకారులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం రసాయన పరిశ్రమలు వ్యర్ధ జలాలను ఒక్క చుక్క కూడా బయటకు వదలకూడదు. ఇందుకు సంబంధించిన అనుమతులు జారీ చేసే సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు అంగీకార పత్రాన్ని కాలుష్యం నియంత్రణ మండలికి ఇస్తాయి. అయినా తప్పు జరిగితే జరిమానాలు కడితే సరిపోతుంది కదా అన్న ధోరణితో పరిశ్రమలు కాలుష్య జలాలు విడుదల చేస్తున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారుల అవినీతి సమస్యను పెంచిపోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాలుష్య జలాల కారణంగా చేపలు సరిగా ఎదగని పరిస్థితితో పాటు చేపలు ఎప్పుడు మృత్యువాత పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత రెండేళ్ల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ విభాగాలు కొన్ని కాలుష్యం కారకులకే వంత పాడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాలుష్యం బారిన పడే చెరువులకు చేప పిల్లలు ఇవ్వమని చెబుతున్న మత్స్యశాఖ తీరును గతంలో మత్స్యకారులు ఎండగట్టారు. కాలుష్య నియంత్రణ మండలి కొన్ని చెరువుల వివరాలు వెల్లడించిందని అందులో పేర్లు లేకుంటేనే చేప పిల్లలు ఇస్తామన్న రీతిలో మత్స్యశాఖ వ్యవహరించింది. నిజానికి ఇక్కడ తప్పు చేస్తున్నది రసాయన పరిశ్రమలు, కాలుష్యాన్ని నియంత్రించకుంటే సంబంధిత పరిశ్రమలను మూసివేయాలి కానీ ఇక్కడ తప్పు చేస్తున్న పరిశ్రమలను వదిలేసి చెరువులకు చేపలు ఇవ్వటం మానేస్తున్నారని మత్సకారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పరిశ్రమలు, అధికారుల తీరు మారాలని మత్సకారులు కోరుతున్నారు. కాలుష్య జలాల కారణంగా చేపలు మృత్యువాత పడ్డ సమయాల్లో సంబంధిత అధికారులు విచారణ, తనిఖీలు అంటూ హడావిడి చేసి అనంతరం సమస్యను మరుగున పడవేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికారుల చిత్తశుద్ధితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. -
పరిశ్రమలు పాతాళానికి!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 2020 జూన్‌లో భారీ క్షీణతను నమోదుచేసుకుంది. 2019 జూన్‌తో పోల్చుకుంటే, అసలు వృద్ధిలేకపోగా ఏకంగా మైనస్ 16.6 శాతం క్షీణతలోకి జారిపోయింది. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మంగళవారం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 60 శాతంపైగా ప్రాతినిధ్యం వహించే తయారీ రంగంలో ఉత్పత్తి ఏకంగా 17.1% క్షీణతను నమోదుచేసుకుంది. ► మైనింగ్ రంగం మైనస్ 19.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది ► ఇక విద్యుత్ ఉత్పత్తి మైనస్ 10 శాతం పడిపోయింది. ► రిఫ్రిజిరేటర్లు, స్పోర్ట్స్ పరికరాలు, బొమ్మలు వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఏకంగా –35.5 శాతం క్షీణించాయి. ► త్వరిత వినియోగ వస్తువుల విభాగంలో (కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్) మాత్రం 14 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. ► భారీ యంత్ర పరికరాలకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఈ క్షీణ రేటు ఏకంగా 36.9 శాతంగా ఉంది. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40 శాతంపైగా వెయిటేజ్ ఉన్న ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్– జూన్‌లో (2019 జూన్‌తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా మైనస్ 15 శాతం క్షీణించింది. ఎనిమిది రంగాల్లో ఏడు – బొగ్గు (–15.5 శాతం), క్రూడ్ ఆయిల్ (–6 శాతం) , సహజ వాయువు (–12 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–8.9 శాతం), స్టీల్ (–33.8 శాతం) , సిమెంట్ (–6.9 శాతం), విద్యుత్ (–11 శాతం) ఉత్పత్తి క్షీణ రేటును నమోదుచేసుకోవడం గమనార్హం. ఒక్క ఎరువుల రంగం మాత్రం వృద్ధి ధోరణిని కనబరచింది. నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్ కాగా, సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కరోనా ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. వార్షికంగా క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్‌లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. క్యూ1లో 35.9 శాతం క్షీణత ఇక ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో చూసినా కూడా పారిశ్రామిక ఉత్పత్తి మైనస్ 35.9 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదయ్యింది. -
పరిశ్రమలకు పాక్షిక సబ్సిడీలు
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ మూలంగా తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలని పారిశ్రామికవర్గాల నుంచి వినతులు అందిన నేపథ్యంలో దాదాపు రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు, బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశానికి సంబంధించి పరిశ్రమల శాఖ ఇదివరకే ప్రతిపాదనలు సమర్పించింది. పావు వంతు చెల్లింపు.... పారిశ్రామిక రంగానికి వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాల కింద సుమారు రూ. 2,500 కోట్ల మేర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇందులో ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 1,284 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ. 600 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ. 600 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. బకాయిల చెల్లింపునకు 2020–21 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో పేర్కొన్న బకాయిల మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా పారిశ్రామికవేత్తలు గతంలోనే పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. అయితే కరోనా లాక్డౌన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో దశలవారీగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ బకాయిల్లో పావు వంతును తక్షణమే విడుదల చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉండగా నేడో, రేపో ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలపైనా నిర్ణయం? లాక్డౌన్ మూలంగా మార్చి నుంచి మే వరకు మూడు నెలలపాటు పరిశ్రమల విద్యుత్ బిల్లులపై మారటోరియం విధించారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రూ. 130 కోట్ల మేర ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీంతోపాటు ఆస్తి పన్ను రద్దు చేసే యోచనలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు రుణాలు అందేలా చూడాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. త్వరలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి ఈ అంశంపై సమీక్షించే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
కడప స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా పలువురు అధికారులు హాజరు అయ్యారు. కడప స్టీల్‌ప్లాంట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్ స్టీల్ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. ప్రతిపాదనలు చేసిన సంస్థలతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు. అదే సమయంలో రెండు సంవత్సరాల్లో టౌన్షిప్, అనుబంధం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ నెలాఖరులోగా సాయిల్ టెస్టింగ్, జియో టెక్నికల్ సర్వే పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. (వెండి తెర వెలుగు రేఖ.. విశాఖ) ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్ వాల్, విద్యుత్ సరఫరా కోసం నిర్మాణపు పనులు, అలాగే ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం కరెంటుతో పాటు ఆర్టీపీపీ లైన్ ద్వారా నిర్మాణ పనుల కోసం నీరు, అలాగే ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటామన్న అధికారులు వివరించారు. -
వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం
సాక్షి, అమరాతి: పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వ్యర్థాల బదలాయింపునకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను శుక్రవారం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీఈఎంసీని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు గౌతం రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, స్పెషల్ చీఫ్‌సెక్రటరీ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఏపీపీసీబి మెంబర్ సెక్రటరీ వివేక్‌యాదవ్ పాల్గొన్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను ఇకపై ఏపీఈఎంసీ చేపట్టనుంది. పర్యావరణ నియమాలు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయనుంది. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా ఆన్లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. వ్యర్థాల నిర్వహణలో కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూట్నీ, ఆడిటింగ్ ప్రక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. కలుషిత వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ట్రీట్మెంట్ వ్యవస్థలేని పరిశ్రమలు ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమలు – వ్యర్థాల సమర్థ నిర్వహణ సంస్థలను ఆన్లైన్ వేదికగా కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇందుకుగాను వ్యర్థాల నిర్వహణ సంస్థలకు, ఏపీఈఎంసీకి పరిశ్రమలు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్ దేశంలోనే ఇది మొదటిది కావడం విశేషం. చదవండి: వ్యర్థాల నిర్వహణకు ‘ఆన్లైన్’ వేదిక -
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వేగంగా స్పందించాం
-
బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది: సీఎం జగన్
-
రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది: సీఎం జగన్
-
పరిశ్రమ మళ్లీ తెరుస్తున్నారా? జర భద్రం!
సాక్షి, అమరావతి: లాక్డౌన్ తర్వాత రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. నెలల తరబడి యంత్రాలను ఉపయోగించకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే వీలుందని అధికారులు చెబుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలను పునఃప్రారంభించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను విద్యుత్ భద్రతా సంచాలకులు, ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి గంధం విజయలక్ష్మి సోమవారం పేర్కొన్నారు. ఇలా చేయాలి ► విద్యుత్ పరికరాలను ఉపయోగించే ముందు అనుభవం ఉన్న ఇంజనీర్లు, విద్యుత్ సేఫ్టీ ఆఫీసర్ చేత తనిఖీ చేయించాలి. ► సబ్ స్టేషన్లలో హెచ్‌టీ ఇన్సులేటర్లు, బుషింగ్స్ మీద తేమ, ధూళిని సిలికాన్ గ్రీజ్‌తో శుభ్రం చేయాలి. ► ఏబీ స్విచ్, ఐసోలేటర్లు, హెచ్‌టీ బ్రేకర్స్, కాంటాక్టు క్లోజ్ చేసి, పె ట్రోలియం జెల్లీపూసి ఆపరేషన్ ఫ్రీగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ► విద్యుత్ లైన్లో లైటనింగ్ అరెస్టులు (పిడుగు వాహకాలు) పరీక్షించి, వాటి ఎర్త్ కనెక్షన్ పరిశీలించి, ట్రాన్స్ఫార్మర్ బ్రేకర్స్‌ను రక్షించేందుకు లైన్‌కు కలిపి ఉంచాలి. ► ట్రాన్స్‌ఫార్మర్‌లో సిలికాజల్, ఆయిల్ లెవల్ చెక్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే హెచ్వీ నుంచి యల్వీ, ఎర్త్‌లకు మెగ్గర్‌తో తనిఖీ చేయాలి. ► మెయిన్ ప్యానల్స్, సబ్ ప్యానల్స్, హెచ్‌టీ బ్రేకర్స్‌లను ఎయిర్ బ్లోయర్‌తో శుభ్రపరచి, కేబుల్ టెర్మినల్ కనెక్షన్‌ను పరిశీలించాలి. ► హెచ్‌టీ, ఎల్టీ సర్క్యూట్ బ్రేకర్స్ మాన్యువల్‌గా ట్రిప్ చేసి కాంటాక్టు చెక్‌చేసుకోవాలి. ► విద్యుత్ లైటింగ్ సర్క్యూట్లో ప్రమాణాల ప్రకారం 30, 100 ఎంఏ...ఆర్‌సీసీబీలను డ్రిస్టిబ్యూషన్ బోర్డులలో అమర్చి, ఎలక్ట్రికల్ షాట్ సర్క్యూట్ నుంచి రక్షిస్తూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలి. -
పరిశ్రమలకు వేగంగా నీటి కేటాయింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి కేటాయింపులను పారదర్శకంగా, వేగంగా చేయడానికి జలవనరుల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఈ నేతృత్వం వహించే ఈ విభాగానికి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఒక్కో ఎస్ఈని నియమించనుంది. పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతంలో నీటి కేటాయింపు కోసం ఆ ప్రాంత ఎస్ఈకి పారిశ్రామికవేత్త దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో నీటి లభ్యత, పరిశ్రమ అవసరాలపై అధ్యయనం చేసి ఎస్ఈ ఆ విభాగం సీఈకి నివేదిక ఇస్తారు. ఈ నివేదికపై సీఈ మరోసారి అధ్యయనం చేసి జలవనరుల శాఖ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. దీనిపై సర్కార్ తుది నిర్ణయం తీసుకుంటుంది. జాప్యం లేకుండా ఉండేందుకే.. ► పారదర్శక పాలన, అపార ఖనిజ సంపద, సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పరిశ్రమల స్థాపనకు వివిధ రకాల అనుమతులను నిర్దేశించిన గడువులోగా ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ► పరిశ్రమలకు అవసరమైన నీటి కేటాయింపుల కోసం ప్రస్తుతం ఆయా జిల్లాల సీఈలకు దరఖాస్తు చేసుకోవాలి. భారీ ఎత్తున చేపట్టిన ప్రాజెక్టుల పనుల పర్యవేక్షణ, ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం వంటి వాటి వల్ల సీఈలు, ఎస్ఈల పని భారం పెరిగింది. దాంతో పరిశ్రమలకు నీటి కేటాయింపుల కోసం చేసిన దరఖాస్తులపై గడువులోగా నివేదిక ఇవ్వలేకపోతున్నారు. ఇది పరిశ్రమల ఏర్పాటులో జాప్యానికి దారితీస్తోంది. ► ఈ నేపథ్యంలోనే పరిశ్రమలకు నీటి కేటాయింపుల కోసం జలవనరుల శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. -
పరిశ్రమల ఊతానికి టూల్ ‘కిటుకు’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి మూలంగా వివిధ రంగాలు తీవ్రంగా దెబ్బతినగా, కొన్ని మాత్రం నెలలు, ఏళ్లు గడిచినా పూర్వ స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్నింటికి ప్రభుత్వ పరంగా కొంత ఊతమిస్తే తిరిగి కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రంగాల వారీగా పరిశ్రమల స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందించాలనే అంశంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. వివిధ రంగాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ‘టూల్ కిట్ల’ను సిద్ధం చేసి 15 రోజుల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పరిశ్రమలకు ముడి సరుకులు ఎంత మేర అందుబాటులో ఉన్నాయి, కార్మి కుల వలస వాటి పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది, డీలర్లు, షాపుల మూసివేత వల్ల ఎంత మేర నష్టం జరుగుతోంది, వినియోగదారులు ఏ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నారు వంటి అంశాలను ‘టూల్‌కిట్’లో పొందుపరుస్తారు. టూల్ కిట్ రూపొందించడంలో భాగంగా భారీపరిశ్రమలతో పాటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం ఎదుర్కొంటున్న స్థితిగతులపై పరిశ్రమల శాఖ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. తద్వారా ఏయే రంగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఏ తరహా సాయం అందించవచ్చనే అంశాన్ని కూడా ‘టూల్‌కిట్’లో పొందు పరుస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. రాత్రి షిఫ్టులకు కూడా అనుమతి లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పట్టాలెక్కినట్లు పరిశ్రమల శాఖ చెప్తోంది. చాలా పరిశ్రమలు ముడి సరుకుల కొరత, వాటి ధరలు పెరగడం, రవాణా, మార్కెటింగ్, కార్మికుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కర్మాగారాల వద్దకు కార్మికులను చేరవేసేందుకు అవసరమైతే ఆర్టీసి బస్సులను తక్కువ అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. గతంలో 33 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం ఎంత మంది కార్మికులను అయినా విధుల్లోకి తీసుకునేందుకు అనుమతిస్తోంది. అవసరమైతే రాత్రి షిఫ్టుల్లోనూ ఉత్పత్తికి కూడా అనుమతులు ఇస్తోంది.పరిశ్రమలు మాత్రం కార్మి కుల కొరతను ఎదుర్కొనేందుకు గతంలో ఉన్న 8 గంటల పని విధానాన్ని 12గంటలకు పెంచాలని కోరుతున్నాయి. కార్మిక చట్టాలు, నిబంధనలకు లోబడి 12 గంటల షిఫ్టునకు అనుమతించడంలో సా ధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యూపీ, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 12 గంటల పని విధానానికి అనుమతిచ్చినా, వేతనాల్లో పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కార్మికుల కొరత రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో సుమారు పది వేలకు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో 15లక్షల మంది కార్మికులు పనిచేస్తుండగా, ఇందులో సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరుగుముఖం పడుతున్నారు. తమ కంపెనీలో పని చేసే 30 మంది కార్మికుల్లో అందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని, ఇప్పటికే ఎనిమిది మంది స్వస్థలాలకు వెళ్లడంతో ఉత్పత్తికి అంతరాయం కలుగుతోందని ఉప్పల్ పారిశ్రామిక వాడకు చెందిన ఓ పరిశ్రమ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు. -
నగరమా.. నువ్వూ అంతే!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో కాలుష్య కారక పరిశ్రమలు వదులుతోన్న ఘన, ద్రవ, వాయువులతో మహానగర పర్యావరణం పొగచూరుతోంది. వాతావరణ కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి పొగబెడుతోన్న పారిశ్రామిక కాలుష్యం కట్టడిలో పీసీబీ, పరిశ్రమల శాఖలు దారుణంగా విఫలమవుతున్నాయి. వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి విషవాయువు వెలువడిన ఘోర దుర్ఘటన నేపథ్యంలో నగరంలో కాలుష్యానికి కారణమౌతున్న పరిశ్రమల ఆగడాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. కాలుష్య కారక పరిశ్రమలను దశలవారీగా నగరానికి దూరంగా తరలించే విషయంలో సర్కారు విభాగాలు గత నాలుగేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏడాది క్రితం అత్యంత కాలుష్యం వెదజల్లుతోన్న రెడ్, ఆరెంజ్ విభాగానికి చెందిన 1160 పరిశ్రమలను సిటీకి దూరంగా తరలించే విషయంలో తెలంగాణా పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) మీనమేషాలు లెక్కిస్తుండడంతో..కాలుష్య మేఘాలు మహానగరాన్ని కమ్మేస్తున్నాయి..సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ⇔ గ్రేటర్ పరిధిలో ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్,భోలక్‌పూర్, పాశమైలారం, ఖాజిపల్లి, బొంతపల్లి, ఐడీఏ బొల్లారం, పటాన్చెరు, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్ అండ్ డైయింగ్, పొగాకు, పెయింట్స్, వార్నిష్, మీట్ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్ పేపర్ తదితర పరిశ్రమలున్నాయి. ⇔ వీటి కారణంగా మహానగరం పరిధిలోని 185 చెరువుల్లో ఇప్పటికే సుమారు 100 కాలుష్యకాసారంగా మారాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలను ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్యకాసారంగా మారాయి. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతోన్న కాలుష్యం ఇలా.. వాయుకాలుష్యం: నగరానికి ఆనుకొని ఐదు వేలకు పైగా పరిశ్రమలుండగా..వీటిలో ప్రమాదకర వాయువులు వదులుతోన్న కంపెనీలు వెయ్యికి పైగానే ఉన్నాయి. ఈ పరిశ్రమలు వెదజల్లుతోన్న వాయుకాలుష్యంలో ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్,బెంజీన్, టోలిన్, నైట్రోజన్,కార్భన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులుండడంతో సిటీజన్లకు స్వచ్ఛమైన ప్రాణవాయువు దూరమౌతోంది. జలాశయాల కాలుష్యం: నగరంలో సుమారు 185 చెరువులుండగా..ఇందులో 100 చెరువులు ఆర్గానిక్ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి నిత్యం వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలు ఆయా జలాశయాల్లో చేరి పర్యావరణం హననం అవుతోంది. ఆయా జలాశయాల నీరు కాలుష్య కాసారమౌతోంది. నేల కాలుష్యం: బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్, తోలు, లెడ్, బ్యాటరీ కంపెనీల నుంచి వెలువడుతోన్న ఘన, ద్రవ కాలుష్య ఉద్గారాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో ఆయా ఉద్గారాల్లోని భారలోహాలు, మూలకాలు వర్షం పడినపుడు నేలలోపలికి ఇంకుతున్నాయి. దీంతో భూగర్భజలాలు సైతం కాలుష్యకాసారంగా మారుతున్నాయి. ప్రధానంగా వ్యర్థ జలాల్లో మెర్క్యురీ, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్, మాంగనీస్, కాపర్, కోబాల్ట్ వంటి మూలకాలుండడంతో నేల కాలుష్యం సంభవిస్తోంది. కాలుష్య పరిశ్రమల ఆగడాలివే.. ⇔ ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన వాయు, ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. రాత్రి వేళల్లో పలు కాలుష్య పరిశ్రమలు విషవాయువులను బయటకు వదులుతున్నాయి. ⇔ ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిబుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం. ⇔ గాఢత అధికంగా ఉన్న వ్యర్థజలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ⇔ ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ⇔ ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్ర మార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ⇔ ప్రధానంగా మల్లాపూర్,ఉప్పల్,కాటేదాన్,కుత్భుల్లాపూర్,జీడిమెట్ల, దుండిగల్, పటాన్చెరు, పాశమైలారం, బొంతపల్లితదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. ⇔ మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రముల్లో నింపి శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్ చేస్తున్నారు. ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. ⇔ ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబోస్తున్నారు. అక్రమ వ్యవహారం బయటికి కనిపించకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరూ అటు వైపు రాకుండా 24 గంటల పాటు భద్రతా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం. ⇔ వ్యర్థాల డంపింగ్‌తో కుత్భుల్లాపూర్,జీడిమెట్ల, బొల్లారం తదితర పారిశ్రామివాడలు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ⇔ ఆయా ప్రాంతాల్లో గతంలో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో ప్రయోగించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భారలోహలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. ⇔ గతంలో ఎన్జీఆర్ జరిపిన సర్వేలోనూ బాలానగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలో ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లుగా వెల్లడైంది. పరిశ్రమల కాలుష్యానికి కళ్లెంవేయాలిలా.. ⇔ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విషవాయువులను బయటకు వదిలినా.. వ్యర్థాలను ఆరుబయట,నాలాలు, చెరువులు, కుంటలు, వాగుల్లో పారబోసేందు ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. సంబంధిత పరిశ్రమలను మూసివేసేందుకు ఆదేశాలివ్వాలి. ⇔ నూతనంగా పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామిక వాడల్లో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. వీటిని ఏర్పాటుచేయని కంపెనీలకు అనుమతులివ్వరాదు. ⇔ పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కాలుష్య ఉద్గారాలను కట్టడిచేయాలి. ⇔ ఆయా బృందాలు 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉల్లంఘనుల ఆట కట్టించాలి. ⇔ నాలాలు, చెరువులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి వాటిని పీసీబీ, జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్ల కార్యాలయంలోని టీవీలకు అనుసంధానించాలి. సిటీజన్ల ఆరోగ్యానికి సెగ.. ⇔ గ్రేటర్లో పెరుగుతున్న వాయు కాలుష్యం సిటిజన్లలో గుండె, ఊపిరితిత్తులకు, పొగ పెడుతోంది. శ్వాసకోశ, జీర్ణకోశవ్యాధులతోపాటు కళ్లు, చర్మసంబంధ సమస్యలకు పరిశ్రమల కాలుష్యం కారణమౌతోంది. -
చిరు చప్పుడు మొదలైంది
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ మినహాయింపులతో భారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా 50 శాతం కార్మికులకు మాత్రమే పరిశ్రమల్లోకి అనుమతిస్తున్నారు. సోమవారం 40 శాతంపైగా పరిశ్రమలు ఉత్పత్తుల ప్రక్రియను ప్రారంభించాయి. దీంతో గత 40 రోజులుగా బోసి పోయిన నగర శివార్లలోని పారిశ్రామిక వాడల్లో మళ్లీ కార్మికుల సందడి నెలకొంది. పారిశ్రామిక రంగం మళ్లీ పట్టాలెక్కినట్లు కనిపిస్తోంది. వాస్తవంగా లాక్‌డౌన్‌తో చిన్న, మధ్యతరహా పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అసలే అరకొర పనితో నష్టాల బాటలో నడుస్తున్న చిరు పరిశ్రమలు లాక్‌డౌన్‌తో కుదేలయ్యాయి. దీంతో లాక్డౌన్ నష్టాలను పూడ్చాలంటూ పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. లాక్‌డౌన్‌తో భారీ పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలచిపోవడంతో వాటిపై ఆధారపడిన చిన్న పరిశ్రమలు ఆగమయ్యాయి. కన్సైన్మెంట్లు నిలిచిపోవడంతో చెల్లింపులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కట్టాల్సిన బ్యాంకు లోన్లు, విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. 40 వేల పరిశ్రమలపైనే మహా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో సుమారు 40 వేలకు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయన్న అంచనా. ప్రధానంగా నగర పరిధిలో సనత్‌నగర్, అజామాబాద్, చందూలాల్ బారాదరి పారిశ్రామిక వాడలు ఉండగా, శివార్లలో ఉప్పల్, మౌలాలి, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, గాంధీనగర్, బాలనగర్, పటాన్ చెరు, వనస్థలిపురం తదితర పారిశ్రామికవాడల్లో పెద్ద సంఖ్యలో స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలు విస్తరించి ఉన్నాయి. ఒక్కో పరిశ్రమలో 10 నుంచి 40 మందికి పైగా పని చేస్తుంటారు. నడిపేదేట్లా... లాక్ డౌన్లో పరిశ్రమలకు సడలింపు లభించినా..నడిపేదేట్ల అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులను రప్పించి, ఉత్పత్తిని ప్రారంభిస్తే అన్నీ సర్దుకుంటాయన్నట్లు పైకి కనిపిస్తున్నా...లాక్డౌన్ వ్యవధి పెరిగే కొద్దీ అంతర్గతంగా అనేక సమస్యలు పరిశ్రమలను చుట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం అతిపెద్ద సమస్య ఉద్యోగులకు జీతాలు చెల్లించడమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చాయి. గత 40 రోజుల నుంచి పరిశ్రమలు నడవడం లేదు. కనీస రాబడీ లేదు. ఇట్లాంటి పరిస్థితులలో జీతాలు చెల్లింపు కష్ట సాధ్యంగా తయారైంది. సాధారణంగా మార్చి నెలలో లభించే ప్రభుత్వ టెండర్ల కోసం చాలా సంస్థలు పెద్ద ఎత్తున ముడి సరకు సిద్ధం చేసుకుంటాయి. ప్రభుత్వానికి కావల్సిన వస్తువులను టెండర్ల ద్వారా సేకరిస్తారు. చివరి మూడు నెలల (త్రైమాసికం) టెండర్లు ఇంకా పిలవలేదు. దీంతో ముడిసరుకుతోపాటు ఉత్పత్తులు కూడా కుప్పలుగా పేరుకున్నాయి. ఫలితంగా ఆర్థిక లావాదేవీలకు ఈ పరిస్థితి అడ్డంకిగా మారినట్లు కనిపిస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో... సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 7,341 పరిశ్రమలు ఉండగా 1,07,773 మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. పరిశ్రమల పునః ప్రారంభంలో భాగంగా ఇప్పటి వరకు 2,650 పరిశ్రమలు ఉత్పత్తులను మొదలు పెట్టగా, సోషల్ డిస్టెన్స్ వల్ల 50 శాతం కార్మికులు మాత్రమే పని చేస్తున్నారు. కోవిడ్–16 నియంత్రణలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగణంగా సోషల్ డిస్టెన్స్ పాటించటం, శానిటైజేషన్, పరిశుభ్రత వంటి చర్యలపై దృష్టి సారించినట్లు మేడ్చల్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పడాల రవీందర్ తెలిపారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలతోపాటు ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్ ఫర్నిచర్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ , బయెటెక్, కెమికల్, విత్తన పరిశ్రమలు తమ ఉత్పత్తుల్ని ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ఈ పరిశ్రమల యాజమాన్యాలకు ఒకింత ఊరట దక్కింది. కాగా నిబంధనల మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పరిశ్రమలు పనిచేసేందుకు అనుమతిచ్చారు. తెరుచుకున్న పరిశ్రమలు ఇవే.. స్టోన్ క్రషింగ్, ఇటుకల తయారీ, చేనేత మగ్గాల నిర్వహణ, మరమ్మతుల వర్క్‌షాప్‌లు, బీడీ తయారీ, ఇసుక మైనింగ్, సిరామిక్ టైల్స్, రూఫ్ టైల్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు, జిన్నింగ్ మిల్లులు, ఐరన్–స్టీల్ ఇండస్ట్రీలు, ప్లాస్టిక్ శానిటరీ పైపుల తయారీ, పేపర్ ఇండస్ట్రీ, కాటన్ పరుపుల తయారీ, ప్లాస్టిక్ రబ్బర్ ఇండస్ట్రీ, నిర్మాణ పనులు, దుకాణాల ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. -
కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం ఊరట..
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా 36 రోజులుగా మూతబడిన కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్టోన్ క్రషర్లు, ఇటుక బట్టీలు, చేనేత పరిశ్రమలు, ట్రాక్టర్, వరికోత యంత్రాల రిపేర్ షాపులకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిస్తూ తెలం గాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిలో యథావిధిగా కార్యకలాపాలు జరపొచ్చని అనుమతులు మంజూరు చేసింది. ఆయా పరిశ్రమల్లో పరిశుభ్రత, భౌతిక దూరం పాటిం చాలని స్పష్టంచేసింది. వీటిలో పనిచేసే ఉద్యోగుల రవాణా, రాకపోకలకు సంబంధించిన ఆటంకాలు లేకుండా చూడాలని తెలంగాణ డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వరితోపాటు పలు రకాల పంటలు కోతకు వచ్చాయి. వీటిని కోసేందుకు రాష్ట్రంలో దాదాపుగా 15 వేలకు పైగా వరికోత యంత్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొత్తం ఎంత ధాన్యం వచ్చినా తామే కొంటామని పదేపదే ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. ఈ పనులు నిరంతరాయంగా కొనసాగించే క్రమంలో చాలా చోట్ల యంత్రాలకు రిపేర్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం ట్రాక్టర్, వరికోత యంత్రాలు రిపేర్ చేసే షాపులకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. కూలీలకు ఉపశమనం.. లాక్డౌన్ కారణంగా ఐదు వారాలుగా ఎలాంటి పని లేకుండా.. ఒక పూట తిని, మరోపూట పస్తుంటున్న వలస కూలీలు, కూలీలకు ప్రభుత్వ నిర్ణయం భారీ ఉపశమనాన్ని కలిగించనుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి బాధలు వర్ణనాతీతం. చేతిలో చిల్లి గవ్వలేక, ఇతరుల వద్ద చేతులు చాచలేక ఆకలితో అలమటిస్తున్నారు. చాలామంది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు పిల్లాజెల్లాతో మండుటెండల్లో కాలినడకన బయల్దేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్లు, చేనేత పరిశ్రమలు నడిపించుకునేందుకు అనుమతించడంతో లక్షలాది మందికి తిరిగి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో రెడ్‌జోన్‌లో ఉన్న జిల్లాలు క్రమంగా ఆరెంజ్ జోన్‌కు వస్తుండటం, పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ గడువు కూడా దగ్గరికి వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: మర్కటాలకు మహాకష్టం -
పరిశ్రమల రీస్టార్ట్‌కు ఎన్వోసీ తప్పనిసరి
సాక్షి, అమరావతి/నెల్లూరు (సెంట్రల్): లాక్డౌన్ సమయంలో గ్రీన్జోన్లో ఉన్న పరిశ్రమలు రీస్టార్ట్ పథకం కింద తిరిగి ప్రారంభించడానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) ఉండాల్సిందేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంఘాలు, పారిశ్రామిక శాఖ అధికారులతో ‘రీస్టార్ట్’ నిబంధనల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ► పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కింద గ్రీన్జోన్లో ఉన్న పరిశ్రమలను నెమ్మదిగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ► గురువారం నాటికి 812 కంపెనీలు ఎన్వోసీకి దరఖాస్తు చేసుకోగా అందులో ఇప్పటి వరకు 138 సంస్థలకు అనుమతి ఇచ్చామని, 585 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు వివరించారు. ► పరిశ్రమలు తిరిగి ప్రారంభించడంలో ఎదురవుతున్న సమస్యలపై ఫిక్కీ, సీఐఐ, ఎఫ్‌ఏపీఎస్‌ఐఏ, ఎలీప్, ఫెర్రో అల్లాయీస్, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్స్ ప్రతినిధులను మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. -
పరిశ్రమలు రీస్టార్ట్
రెడ్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు లేకుండా మే 3 వరకు యథావిధిగా లాక్ డౌన్ నిబంధనలు అమలవుతాయి. ఏయే మండలాల్లో ఏ పరిశ్రమలను తెరవచ్చో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. పరిశ్రమల్లో భౌతిక దూరం పాటించేలా పర్యవేక్షించే బాధ్యతను తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారి, ఎస్ఐ, పరిశ్రమలు, కార్మిక శాఖల అధికారులకు అప్పగించారు. సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో దాదాపు నెల రోజులుగా మూతపడ్డ పారిశ్రామిక రంగాన్ని దశలవారీగా పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా వైరస్ విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే వలస కార్మికులు, నిర్మాణ రంగ కూలీలకు చేయూతనిచ్చేలా సోమవారం నుంచి లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా గాడిలో పెడుతూ ప్రజల చేతుల్లోకి నగదు వచ్చే విధంగా ‘రీ స్టార్ట్’ పేరుతో నిబంధనలను రూపొందించింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్రంలోని మండలాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్ మండలాలు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎలాంటి పారిశ్రామిక కార్యక్రమాలను అనుమతించరు.గ్రీన్ జోన్లో కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు కూడా కఠినమైన నిబంధనలు పాటించాలి. పరిశ్రమలు, యూనిట్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఎక్కడైనా వైరస్ విస్తరించి రెడ్‌జోన్‌గా మారితే అప్పటివరకు ఇచ్చిన అనుమతులు రద్దవుతాయి. మార్గదర్శకాలు ఇవీ.. ► ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడకుండా పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. ఒక వాహనంలో ప్యాసింజర్ కెపాసిటీలో 30 నుంచి 40 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. ► అన్ని వాహనాలను ప్రవేశ ద్వారం వద్దే రసాయనాలు చల్లి శుభ్రం చేయాలి. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. ► సిబ్బంది అందరికీ వైద్య బీమా ఉండాలి. ► హ్యాండ్ వాష్, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ► ఒక్కో షిఫ్ట్‌కు మధ్య గంట విరామం ఉండాలి. భోజన విరామంలో కార్మికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ► పది మంది కంటే ఎక్కువగా సమావేశాలను నిర్వహించకూడదు. పనిచేసే ప్రాంతంలో సీట్ల మధ్య దూరం కనీసం ఆరు అడుగులు ఉండాలి. ► లిఫ్ట్‌ల సామర్థ్యంలో సగం మందిని మాత్రమే అనుమతించాలి. మెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలి. ► గుట్కా, పొగాకు వినియోగాన్ని నిషేధించాలి. ఉమ్మి వేయడాన్ని కఠినంగా నిషేధించాలి. ► సందర్శకులను అనవసరంగా అనుమతించరాదు. ► కరోనా చికిత్స ఆసుపత్రులు వివరాలను కార్మికులు, సిబ్బందికి అందుబాటులో ఉంచాలి. ► పరిశ్రమల ప్రాథమిక సమాచారం, కార్మికుల వివరాలను జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్‌కు అందజేసి పునఃప్రారంభించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. తనిఖీ నివేదికల ఆధారంగా కలెక్టర్ అనుమతి మంజూరు చేస్తారు. ► ప్రతి పరిశ్రమ రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కార్మికులను గుర్తించాలి. తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ప్రతి కార్మికుడితో హామీపత్రం తీసుకోవాలి. పర్యవేక్షణ అధికారులు వీరే... తెరుచుకునే పరిశ్రమలు ఇవే... ► నిత్యావసర, అత్యవసర పరిధిలోకి వచ్చే పరిశ్రమలు బియ్యం, ఆయిల్, పప్పు మిల్లులు, పిండి మరలు ► పాడి పరిశ్రమలు, ఆర్వో ప్లాంట్లు, డిస్టిల్డ్ వాటర్, ప్యాకేజ్ వాటర్, బిస్కెట్లు, పండ్ల రసాలు, వెర్మిసెల్లీ, చక్కెర లాంటి అన్ని రకాల ఆహార పరిశ్రమలు ► బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఫార్ములేషన్స్, ఆర్ అండ్ డీ, ఐబీ సెట్స్, ఆక్సిజన్ సరఫరా, పీపీ గేర్, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే పరికరాలు, గ్లౌజులు, బ్యాండేజ్‌ల తయారీ సంస్థలు ► లిక్విడ్ సబ్బులు, డిటర్జెంట్లు, ఫినాయిల్, బ్లీచింగ్ ఫౌడర్, ఫ్లోర్ క్లీనర్స్, శానిటరీ నాప్కిన్స్, డైపర్స్, పేపర్ నాప్కిన్స్, ఆక్సిజన్ సిలెండర్లు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు ► శీతల గిడ్డంగులు, వేర్ హౌసింగ్, లాజిస్టిక్ ► మిరప, పసుపు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు వంటి వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు, ► బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు. చేపలు, కోళ్లు, ఇతర జంతువుల దాణా తయారీ సంస్థలు. ► సౌర విద్యుత్‌తో పాటు అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ► ఆయుర్వేదం, హోమియోపతి మందుల తయారీ ► ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సంస్థలు ► పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, కంటైనర్ డిపోల వద్ద ఉన్న శీతల గిడ్డంగులు, వేర్ హౌసింగ్ కార్యకలాపాలు ► నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించిన అన్ని రకాల రవాణా సర్వీసులు నిర్మాణ రంగంలో వీటికి అనుమతి రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు, బిల్డింగులు, అన్ని రకాల పారిశ్రామిక ప్రాజెక్టులు, మున్సిపాల్టీ పరిధిలో లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు, అన్ని రకాల పారిశ్రామిక వాడల నిర్మాణం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వీటికి కూడా అనుమతి ► మున్సిపాల్టీ పరిధిలో లేని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగించవచ్చు ► ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక నగరాలు ► నిరంతరాయంగా పనిచేయాల్సిన యూనిట్లు ► హార్డ్‌వేర్ తయారీ సంస్థలు ► బొగ్గు ఉత్పత్తి, గనులు, ఖనిజాలు వీటికి సంబంధించిన పేలుడు పదార్థాల తయారీ సంస్థలు ► చమురు, గ్యాస్ అన్వేషణ, శుద్ధి కర్మాగారాలు జనపనార పరిశ్రమ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు ► ఎరువులు, రసాయనాలు తయారీ, డిస్ట్రిబ్యూషన్, రిటైల్ సంస్థలు ► వ్యవసాయ సంబంధిత అన్ని రకాల పనిముట్లు, యంత్రాలు, హేచరీస్, వాణిజ్య ఆక్వా సాగు, దాణా తయారీ సంస్థలు ► తేయాకు, కాఫీ, రబ్బరు, జీడిపప్పు ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ అమ్మకం 50 శాతం సిబ్బందితో అనుమతి ► 50 శాతం మంది సిబ్బందితో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు ► ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల డేటా, కాల్ సెంటర్లు, కొరియర్స్ సర్వీసులు -
కరోనాతో కుదేల్..!
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు వివిధ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వ్యవసాయ, పౌల్ట్రీ, ఫార్మా, సిమెంట్, గ్రానైట్, విద్యుత్ తదితర రంగాలు లాక్డౌన్ కారణంగా కుదేలవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు మొదలు పారిశ్రామికవేత్తల వరకు అందరినీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. మే 3 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ను ఎత్తేసినా దీని ప్రభావం మరికొంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముడి రసాయనాల రవాణాకు ఆటంకం.. భారతీయ ఔషధ తయారీ పరిశ్రమలు ఉపయోగించే ముడి రసాయనాలు సుమారు 70 శాతం మేర చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. లాక్‌డౌన్‌తో నౌకాశ్రయాల్లో తనిఖీలు ఆలస్యంగా పూర్తవుతున్నాయి. సముద్ర రవాణా అత్యధికంగా యూరోపియన్ దేశాల ఆధిపత్యంలో ఉండటంతో ముడి పదార్థాల రవాణాపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముడి సరుకుల ధర, రవాణా వ్యయం పెరగడం, కార్మికుల హాజరు తగ్గడంతో ఔషధాల ధరల్లో పెరుగుదల తప్పదని ఫార్మారంగ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా క్లోరోక్విన్ఫాస్ఫేట్, మాంటేల్ కాస్ట్ ఎల్సీ, పారా మోనోఫినాల్ (పీఏపీ), మెటాఫోర్నియా (డీసీడీఏ), విటమిన్ సీ (2కేజీఏ) ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. లాక్డౌన్ నేపథ్యంలో ముడి పదార్థాల ధరలు 30 శాతం మేర పెరిగినట్లు బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: కరోనా ఆగట్లేదు.. జర జాగ్రత్త సంక్షోభంలో గ్రానైట్ పరిశ్రమ.. ఆర్థిక మందగమనంతో ఇప్పటికే దెబ్బతిన్న గ్రానైట్ పరిశ్రమ కరోనాతో పూర్తిగా స్తంభించి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో క్వారీయింగ్‌లో వెలికితీసిన బ్లాక్‌లు ఎక్కువగా చైనాకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం రవాణా స్తంభించడంతో బ్లాక్‌లను తరలించే పరిస్థితి లేదు. పైగా ఇప్పటికే ఎగుమతి చేసిన సరుకుకు సంబంధించి రూ. 5 వేల కోట్ల మేర విదేశీ మార్కెట్లో చిక్కుకుపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గ్రానైట్ రంగానికి దక్షిణాదిలో ప్రధాన ఉత్పత్తి, ఎగుమతిదారులుగా ఉన్న తెలంగాణ, ఏపీ తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రంగంలో సుమారు 25 లక్షల మంది పనిచేస్తుండగా రాష్ట్రంలోనే సుమారు 6 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ ఇతర రూపాల్లో నష్టం జరగుతుండగా, తాము బ్యాంకు రుణాలు, కిస్తీల చెల్లింపు, వేతనాలు, డెడ్ రెంట్ చెల్లింపు వంటి అనేక అంశాల్లో ఇబ్బందులు పడుతున్నట్లు దక్షిణాది గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు వి.సుదర్శన్‌రావు, గణేశ్, సీఎస్ రావు వెల్లడించారు. గ్రానైట్ రంగంపై ఆధారపడిన లాజిస్టిక్స్ రంగం కూడా కరోనా మూలంగా తీవ్రంగా దెబ్బతింది. సిమెంట్ పరిశ్రమల్లో నిలిచిన ఉత్పత్తి.. లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని సిమెంట్ పరిశ్రమలన్నీ మార్చి 23 నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి నిలిపివేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తయారయ్యే సిమెంట్‌ను దేశీయ మార్కెట్లో 98 శాతం వినియోగిస్తుండగా నిర్మాణ రంగం స్తంభించడం సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిశ్రమల వద్ద నిల్వల్లో ఒకటీ అరా శాతం మాత్రమే అత్యవసర ప్రభుత్వ పనుల కోసం రవాణా చేస్తున్నారు. ఈ నెల 20 తర్వాత లాక్డౌన్ నిబంధనలు సడలించినా ఉత్పత్తి సామర్థ్యంలో 30 శాతానికి మించి సిమెంట్ తయారీ సాధ్యం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. రిటైల్ రంగం గాడిన పడితేనే సిమెంట్ తయారీ రంగం తిరిగి çపూర్తిస్థాయిలో పట్టాలెక్కుతుందని భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరక్టర్ రవీందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్రాన్స్ఫార్మర్లకు ‘కోర్‌ప్లేట్’కొరత.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ‘కోర్‌ప్లేట్’ను చైనా, జపాన్, కొరియా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. కరోనా మూలంగా ఈ ముడి పదార్థం రవాణా నిలిచిపోవడం ట్రాన్స్ఫార్మర్ల తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో 10, 25, 160 కిలోవాట్ల సామర్థ్యంగల ట్రాన్స్ఫార్మర్ల కొరతకు దారితీస్తోంది. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్) వద్ద ప్రస్తుతం 160 కేవీ సామర్థ్యంగల ట్రాన్స్ఫార్మర్లు 300 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు సుమారు 2 వేలు కావాల్సి ఉండగా కొరత మూలంగా అత్యవసర ప్రాంతాల్లోనే అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం.. తెలంగాణలో రబీ వరి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా బత్తాయి, ద్రాక్ష, పూల సాగు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెటింగ్ లేక పండ్లు, పూలను నేలపాలు చేసేందుకు కూడా రైతులు వెనుకాడటం లేదు. లాక్డౌన్ మూలంగా మార్కెటింగ్, రవాణా వసతి లేకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తామనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కోళ్ల పరిశ్రమకు అపార నష్టం చికెన్ తింటే కరోనా సోకుతుందనే ప్రచారం పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌కు ముందే చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగానికి రూ. 20 వేల కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా సుమారు రూ. 2 వేల కోట్లు ఉంటుందని పౌల్ట్రీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కరోనా ప్రభావానికి ముందు దేశంలో రోజూ సగటున 25 వేల కోట్ల గుడ్ల ఉత్పత్తి జరగ్గా రెండు రాష్ట్రాల్లో 3.75 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగింది. ప్రస్తుతం దేశంలో గుడ్ల ఉత్పత్తి 17 కోట్లకు పడిపోగా తెలంగాణలో 2.20 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 1.20 కోట్ల కోళ్లు (ఒక్కో కోడి సగటు బరువు రెండు కిలోలు) అమ్ముడవుతుండగా తెలంగాణలో 7.50 లక్షల కోళ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. గతంతో పోలిస్తే చికెన్ వినియోగం 40 శాతం పడిపోయింది. రెండు నెలలుగా ఒక్కో గుడ్డుపై రూపాయిన్నర చొప్పున నష్టం వస్తోందని ‘నెక్’బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావర్ వెల్లడించారు. రవాణా నిలిచిపోవడం, ఔషధాల లభ్యత, కోళ్ల ఎదుగుదల లేమి పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశవ్యాప్తంగా ఈ రంగంపై ఆధారపడిన 60 లక్షల మంది ఉపాధితోపాటు చిన్న, సన్నకారు రైతులు, దాణా తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. -
పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఊరట
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కాలంలో మూతపడిన పరిశ్రమలు, తెరుచుకోని వాణిజ్య సంస్థలకు విద్యుత్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వాస్తవ వినియోగానికి సంబంధించి మీటర్ రీడింగ్ తీసే వరకు పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు ఉన్నతాధికారులు బుధవారం సంకేతాలు పంపించారు. వాస్తవ రీడింగ్ తీసే వరకూ.. ► లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలు చాలా వరకూ మూతపడ్డాయి. వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, హోటళ్లు వంటివి కూడా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ► లాక్డౌన్ కారణంగా రీడింగ్ తీసే సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫిబ్రవరిలో వినియోగించిన యూనిట్ల ఆధారంగా మార్చి నెలకు ఇచ్చిన బిల్లులనే చెల్లించాలని వినియోగదారులకు మెసేజ్‌లు వెళ్లాయి. ► మార్చి నెలలో కొన్ని రోజులు విద్యుత్ వినియోగించ లేదని, అయినా బిల్లులు ఎలా చెల్లిస్తామని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు అభ్యంతరం లేవనెత్తాయి. ► దీనిపై స్పందించిన ఇంధన శాఖ వాటికి బిల్లులు ఇచ్చినా వాస్తవ రీడింగ్ తీసే వరకూ చెల్లింపుల కోసం ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశాలిచ్చింది. ► ఈ నిర్ణయం వల్ల పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు రూ.వెయ్యి కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ► ఏప్రిల్‌లో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి ఇదే తరహా మినహాయింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. వసూళ్లు నిలిపేశాం విద్యుత్ వాడనప్పుడు బిల్లులు వసూలు చేయడం సరికాదని ఇంధన శాఖ భావించింది. ఈ దృష్ట్యా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు జారీ అయిన బిల్లుల వసూలుకు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని కచ్చితమైన ఆదేశాలిచ్చాం. తదుపరి ఉత్తర్వులు అందే వరకూ డిస్కమ్‌లు ఈ ఆదేశాల్ని పాటిస్తాయి. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
ఉద్యోగులను తొలగించొద్దు.. వేతనాల్లో కోత పెట్టొద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా తీవ్ర స్థాయిలో ఆర్థిక మందగమనం ముప్పు నేపథ్యంలో కంపెనీలు మానవీయ కోణంలో నడవాలని, ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాలకు కోత విధించడం చేయరాదని నిపుణులు సూచించారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో, ముఖ్యంగా తయారీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడడం వల్ల, వాటిల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన కార్మికులకు ఉపాధి కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగుల భద్రతకు తమది పూచీ అంటూ, వారిని ఉద్యోగాల నుంచి తీసివేయకుండా దేశీ పరిశ్రమలు సందేశం పంపించాల్సిన తరుణమిది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఉద్యోగుల వేతన వ్యయాలను తగ్గించుకోకుండా చూడొచ్చని సూచించారు. -
కోమాలో ఉన్నట్టుంది
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ ప్రాంతంలోని శాస్త్రిపురంలో కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకుని కూర్చుంటారా అని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. 2012లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 198 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని చెబుతున్నారని, అవి ఇప్పుడు 345కు చేరాయని, 8 ఏళ్లు నిర్లక్ష్యం చేశారని, జీహెచ్ఎంసీ కోమాలో ఉన్నట్లుగా అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. నోటీసులిచ్చిన పరిశ్రమలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాస్త్రిపురంలో ప్లాస్టిక్ పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడు తోందంటూ వినయ్ పాల్నిట్కర్, రషీద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్ హాజరయ్యారు. జీహెచ్ఎంసీ, పీసీబీ, విద్యుత్ శాఖలు అలాంటి పరిశ్రమల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ‘కాలుష్యంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని ఇలాగే కొనసాగిస్తే ఢిల్లీని దాటేస్తాం. శాస్త్రిపురంలో 268 ఎకరాల్లో పరిశ్రమలు ఉంటే వాటిజోలికే వెళ్లకుండా అఫిడవిట్లు దాఖలు చేశారు. తొలిసారి 3 కాలుష్య పరిశ్రమలే ఉన్నాయన్నారు. మేము క్షేత్ర స్థాయిలోకి మా ప్రతినిధి ని పంపి నివేదిక తెప్పించుకున్నాక 198 ఉన్నా యని చెప్పారు. 2012 నాటి పిల్స్‌లో ఇంతవరకూ ఏం చేశారు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. జరిగిన పొరపాటుకు లోకేష్‌కుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, నిజాయి తీగా తప్పును ఒప్పుకున్నందుకు అభినందిస్తున్నట్లు పేర్కొంది. 98 పరిశ్రమల్ని మూసేశామని, 198కి నోటీసులిచ్చామని కమిషనర్ చెప్పారు. పీసీబీతో కలిసి ఎందుకు పనిచేయడంలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏ పరిశ్రమ భవనానికైనా జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వాలని, అలాంటప్పుడు కాలుష్య పరిశ్రమలు ఎలా వచ్చాయని నిలదీసింది. హైకోర్టు నియమించిన కమిటీ నివేదిక ప్రకారం శాస్త్రిపురంలో 345 కాలుష్య పరిశ్రమల్ని తొలగించాలని చెప్పిందని, పీసీబీ మాత్రం 34 పరిశ్రమలనే అంటోందని తప్పుపట్టింది. 345 పరిశ్రమలకు ఈ నెల 2న నోటీసులు ఇస్తే వచ్చిన సమాధానాల్ని పరిశీలిస్తే 281 పరిశ్రమల్ని మూసేయాలని నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అలాంటి పరిశ్రమల్ని మూసేందుకు చట్టప్రకారం వ్యవహరించాలని, అందుకు ప్రత్యేకంగా హైకోర్టు అనుమతులు అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2012లో పిల్స్ దాఖలైతే పీసీబీ ఎనిమిదేళ్లుగా ఏం చేస్తోందని ప్రశ్నించింది. మూడేళ్ల క్రితం నోటీసు లిచ్చారంటే ఆ తర్వాత తీసుకున్న చర్యల గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ, పీసీబీ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, తప్పు చేసిన అధికారుల విషయంలో ఉపేక్షించబోమని, శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాలుష్య పరిశ్రమలపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం, విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. -
పరిశ్రమలతో ఎంవోయూ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కనీసం 5 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. ఉద్యోగ,ఉపాధి అ వకాశాలు ఎక్కువగా ఉన్న, మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 కొత్త కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లు (ఇన్‌టేక్) పెరగకుండా, ఉన్న సీట్లలోనే కోర్సులు బదలాయించుకోవచ్చని (కన్వర్షన్) వెల్లడించింది. అదనపు సీట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, నెట్ వర్కింగ్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రొబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్ వంటి కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొంది. ఈ నెల 26 నుంచి యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. మార్చి 11 నుంచి మార్చి 16 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. మార్చి 16 నుంచి దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ పరిశీలన కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ప్రాసెస్‌పై కాలేజీల యాజమాన్యాలతో మంగళవారం జేఎన్టీయూ సమావేశం నిర్వహించింది. 2020–21 విద్యా ఏడాదిలో తాము అమలు చేయబోయే విధానాలను తెలియజేయడంతో పాటు యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు ఈ సందర్భంగా స్వీకరించింది. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏఐసీటీఈ అనుమతిస్తేనే మేం ఇస్తాం రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్లో సమస్యలు ఉన్న 238 కాలేజీల్లో 154 కాలేజీలు జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయని జేఎన్టీయూ పేర్కొంది. అందులో 79 కాలేజీలు తమ లోపాలకు సంబంధించిన వివరణలతో కూడిన నివేదికలు అందజేశాయని పేర్కొంది. ఇంకా 75 కాలేజీలు వివరణలతో కూడిన నివేదికలు ఇవ్వలేదని, తాము ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. అయితే ఈ కాలేజీల విషయంలో తాము ఏం చేయలేమని, ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తేనే తాము అనుబంధ గుర్తింపు ఇస్తామని, ఏఐసీటీఈ ఇవ్వకపోతే తాము అనుబంధ గుర్తింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బీటెక్, బీ–పార్మసీ విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు రోజుల్లో గవర్నింగ్ బాడీల నామినీలు ప్రతి కాలేజీ గవర్నింగ్ బాడీలు ఏర్పాటు చేయాల్సిందేనని, సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహించాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ స్పష్టం చేసింది. జేఎన్టీయూ నామినీలను 3 రోజుల్లో ఇస్తామని పేర్కొంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద కాలేజీల్లో పదోన్నతులు ఇచ్చుకోవచ్చని, వాటిని యూనివర్సిటీలో ర్యాటిఫై చేయించుకోవాలని తెలిపింది. కాలేజీలు పక్కాగా మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం అమలు చేయాల్సిందేనని సూచించింది. వరుసగా మూడేళ్లు 25% కంటే ప్రవేశాలు తక్కువగా ఉంటే ఆ కోర్సును అమలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. అన్ని కోర్సులు ఇవ్వాలి: ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు ఉద్యోగ అవకాశాలున్న 10 రకాల కొత్త కోర్సులకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపిందని, అందులో 8 కోర్సులకే అనుమతిస్తామని జేఎన్టీయూ పేర్కొనడం సరికాదని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు పేర్కొన్నారు. ఏఐసీటీఈ ఆమోదించిన అన్ని కోర్సులకు సిలబస్ రూపొందించి జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరారు. -
కోవిడ్-19 ప్రభావం : ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చైనాలో వ్యాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరోనా వైరస్ ప్రభావం భారత్‌పై స్వల్పమే అని అన్నారు. అంతర్జాతీయంగా చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరించడం వల్ల ప్రపంచ వృద్ధి రేటు, వాణిజ్యంపై కరోనా వైరస్ ప్రభావం పడనుందని తెలిపారు. దేశంలో పలు రంగాలు కొంత మేర ప్రభావానికి లోనయినా, వాటిని పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించామని అన్నారు. చైనా ఆర్థక వ్యవస్థ మందగమనం వల్ల దేశీయ ఫార్మా, ఎలక్ట్రానిక్ రంగాలపై కొంత మేర ప్రభావం పడవచ్చని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు చైనా అతిపెద్ద భాగస్వామి అని, చైనాలో జరిగే ప్రతి అంశాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. చైనా నుంచి భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటుందని అన్నారు. దేశీయ ఫార్మా రంగానికి సంబంధించిన ముడి పదార్ధాలను చైనాను నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ సమస్యలను అధిగమించడానికి ఇతర ఆసియా దేశాల నుంచి ముడిసరుకులను దిగుమతి చేసుకోవడానికి భారత్ ప్రమత్నిస్తుందని తెలిపారు. చైనాకు భారత్ ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కొంత మేర ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. చదవండి: మటన్ కొంటే హెల్మెట్ ఉచితం! -
కోవిడ్ : పరిశ్రమలకు ఆర్థికమంత్రి అభయం
సాక్షి,న్యూఢిల్లీ: చైనాలో వ్యాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావాలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రధానంగా దేశీయంగా ఆటో,ఫార్మ, తదితర రంగాలపై ఈ వైరస్ సృష్టిస్తున్న సంక్షోభంపై సమీక్షించిన ఆమె, దేశీయ పరిశ్రమలకు భయాలు అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. ఈ వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ రంగాల ప్రముఖులతో ఆమె భేటీ అయ్యారు. వాణిజ్య, కస్టమ్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆటో, పేపర్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, రసాయన, ఇంధనం, సౌర, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, ఫార్మా రంగాల ప్రతినిధులు, ఫిక్కీ, సిఐఐ, అసోచం నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పరిశ్రమలకు అందించగల ఉపశమనం గురించి పీఎంవో చర్చించనున్నట్లు నిర్మల సీతారామన్ చెప్పారు. ముడి పదార్ధాల సరఫరాపై ఫార్మా, సౌర , రసాయన పరిశ్రమల ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారని అయితే, ముడి పదార్థాల కొరత గురించి తక్షణ ఆందోళనలను తొలగించడంతో పాటు, ధరలను నియత్రించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ చర్యలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని ఆమె చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయాన్నిసంప్రదించిన తరువాత ఖరారు కానున్న కార్యాచరణను రూపొందించడానికి బుధవారం కార్యదర్శులు మరోసారి సమావేశమవుతారని సీతారామన్ చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులు ఆయా విభాగ కార్యదర్శులతో చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని ఆమె అన్నారు. ప్రధానంగా ఔషధాల ముడి సరుకు నిల్వపై దేశీయ ఫార్మ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫార్మా తయారీ, ఔషధాల లభ్యత కొరతను నివారించడానికి, చైనా నుండి ఏఐపీ సామాగ్రిని విమానంలో దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. చదవండి : కోవిడ్ : పరిస్థితి భయంకరంగా ఉంది -
పారిశ్రామిక మేడలు..!
ఎచ్చెర్ల క్యాంపస్: పేరుకు పారిశ్రామిక వాడలు.. అక్కడ వెలుస్తున్నాయి కమర్షియల్ మేడలు.. నిరుద్యోగిత ముసుగులో కొంతమంది వ్యాపారులు దర్జాగా వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని, 16వ నంబరు జాతీయ రహదారి పక్కన ఉండటంతో పారిశ్రామిక వాడ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. గత టీడీపీ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోపాటు ఏపీఐఐసీ అధికారులతో లాలూచీ పడి పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు పొందినట్టు తెలుస్తోంది. ఇదీ ఏపీఐఐసీ లక్ష్యం... నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా పోత్సహించాలి. సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగి పది మందికి ఉపాధి కల్పించాలి. ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన శాఖ (ఏపీఐఐసీ) లక్ష్యం. అధికారుల పర్యవేక్షణ లోపం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు కంటే వ్యాపారులకు వాణిజ్య సముదాయాలు నిర్మాణం, అద్దెలకు ఇచ్చేందుకు ఈ పారిశ్రామికవాడ ఉపయోగపడుతుంది. ఆన్లైన్ వ్యాపార గోదాములు, కార్యాలయాలు వంటివి నిర్వహణకు అద్దెకు ఇచ్చుకునేందుకు అనువైన స్థలం కావటంతో ఎక్కువ మంది వ్యాపార సముదాయాల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్నారు. పారిశ్రామిక వాడలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు.... కుశాలపురం సమీపంలోని నవభారత్ పారిశ్రామికవాడ 16.37 ఎకరాలు విస్తరించి ఉంది. నిరుద్యోగ యువతకు పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు కేటాయిస్తారు. పరిశ్రమలు మూతపడితే స్థలాలు ఏపీఐఐసీ స్వా«దీనం చేసుకుని, మరొకరికి ఇవ్వాలి. ప్రస్తుతం 55 పరిశ్రమలు ఉండగా, ఇందులో 12 పరిశ్రమలు మూతపడ్డాయి. స్టీల్, గ్రానైట్, అల్యూమినియం, గార్నటైట్, రంగులు, రీ ట్రైడ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. గత ప్రభుత్వం సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించకపోవటం, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకోకపోవటం వంటి అంశాల వల్ల కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఇదేక్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా కమర్షియల్ కాంప్లెక్స్ (వాణిజ్య సముదాయాలు)ను నిర్మిస్తున్నారు. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని అద్దెకు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఐదు కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఈ పారిశ్రామిక వాడలో ఉండటం గమనార్హం. పరిశ్రమల స్థాపన పేరిట రాయితీలు... పరిశ్రమల ఏర్పాటు పేరుతో బ్యాంకుల నుంచి రాయితీ రుణాలు సైతం కొందరు తీసుకుంటున్నారు. వీటితో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకున్న విధంగా పరిశ్రమ నిర్మాణం చేపట్టాలి. లేదంటే అధికారులు స్థల మంజూరును రద్దు చేయాలి. ఇలా చేయడం లేదు. దీంతో నిరుద్యోగుల స్థానంలో వ్యాపారులు ప్రయోజనాలు ఎక్కువుగా పొందుతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేపడుతున్నారు. ఏపీఐఐసీ శాఖ స్పందించకుంటే భవిష్యత్తులో ఇక్కడ సూక్ష్మ పరిశ్రమలు సైతం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. నిబంధనల అమలుకు కృషి వాణిజ్య సమదాయాల నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకం. స్థలాలు పొందిన వారు నిబంధనలు పక్కాగా పాటించాలి. స్థలాలు తీసుకున్నప్పుడు దరఖాస్తులో పేర్కొనేలా నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు ఉండాలి. దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. – సుధాకర్, ఏపీఐఐసీ, జోనల్ మేనేజర్ -
‘రెడ్ కేటగిరీ’తో అనర్థాలు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో రెడ్ కేటగిరి పరిశ్రమలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కాలుష్య పూరితమైన పరిశ్రమలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర శివారులలో వెలిసిన పరిశ్రమలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ప్రభుత్వం కాలుష్యం వదిలే వాటిని ప్రజా నివాసాలకు దూరంగా తరలించే ఆలోచన చేస్తున్నా వాటి యాజమాన్యాలు మాత్రం ఉలుకూపలుకూ లేకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. జిల్లాలో రెడ్ కేటగిరి పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్య కారకాలపై ప్రత్యేక కథనం.. నియంత్రణ కరువు.. కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతుల ప్రకారం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 111, కామారెడ్డి జిల్లాలో 32 పరిశ్రమలు ఉన్నాయి. వాటిని నాలుగు కేటగిరీలుగా విభజించింది. కాలుష్యం తక్కువగా వెదజల్లే వాటిని ఆరెంజ్, కాలుష్య రహిత పరిశ్రమలను ఆకుపచ్చ, తెలుపు రంగులోకి మార్చింది. సీఎఫ్‌వో అనుమతి లేని పరిశ్రమలలో రైస్ మిల్లులు, కంకర క్వారీలు, నూనె మిల్లులు, చక్కర ఫ్యాక్టరీలు ఉన్నాయి. పీపీటీ నిబంధన ప్రకారం ప్రతి పరిశ్రమలో నీటి శుద్ధి కేంద్రం, గాలి, కాలుష్య నివారణ యంత్రాలు, మురుగు నీటి శుద్ధి చేయు యంత్రాలు అందుబాటులో ఉండాలి. అయితే ఇవేమి పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారంగా సీఎఫ్‌వో అనుమతులు(కాన్సెంట్ ఫర్ ఆపరేషన్) ఇచ్చేస్తున్నారు. అధికారులు తమ ఉనికిని చాటుకునేందుకు నోటీసులు అందించి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలోని పరిస్థితి ఇదీ.. రెడ్ కేటగిరి పరిశ్రమల కారణంగా జిల్లాలో గాలి, నీరు ఎక్కువగా కలుషితమవుతోంది. నిజామాబాద్ నగర శివారులో, రూరల్ మండలాల్లో వెలిసిన రైస్ మిల్లుల ద్వారా వచ్చే ఊకదమ్ముతో పారిశ్రామిక వాడల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ పెద్ద చెరువు సమీపంలో నిర్మించిన బయో మెడికల్ వేస్టేజీ ట్రీట్మెంట్ ప్లాంటు నుంచి వెలువడుతున్న కలుషిత రసాయనాల కారణంగా పెద్ద చెరువు నీరు ప్రతి ఏటా వర్షాకాలంలో ఆకుపచ్చగా మారుతున్నాయి. జక్రాన్‌పల్లి, డిచ్పల్లి, ధర్పల్లి, మాక్లూర్ మండలాల్లో జాతీయ రహదారి వెంట వెలిసిన కంకర క్వారీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యాల పాలవుతున్నారు. నిజామాబాద్‌రూరల్, మోపాల్ మండలాల్లో కొన్ని నూనె మిల్లులు సరైన కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదు. సామర్థ్యం మించి ఉత్పత్తి.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలల్లో సామర్థం మేరకు అనుమతులు పొంది ఉత్పత్తి మాత్రం సామర్థ్యానికి మించి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అనుమతి ఒకటైతే ఉత్పత్తి మరొకటి అన్నట్లుగా తయారయ్యాయి. ఫలితంగా ఆయా పరిశ్రమలు చుట్టు పక్కల వారిని కాలుష్య కాటకం వేధిస్తోంది. -
విస్తరణ వద్దే వద్దు
సాక్షి, మనోహరాబాద్/వెల్దుర్తి : ‘ఇప్పటికే మా గ్రామాలకు పిల్లనివ్వమని చెబుతున్నారు. గర్భిణులు ఊరు వదిలి వెళ్తున్నారు. పుట్టే బిడ్డలు బలహీనంగా పుడుతున్నారు. గాలి, నీరు కలుషితం అవుతున్నాయి. రోగాల బారిన పడుతున్నాం. ప్రాణాలు పోతున్నాయి. ఉన్న పరిశ్రమతోనే చస్తుంటే విస్తరణ పేరిట సభలు పెడతారా.. విస్తరణ చేపడితే బలిదానాలే శరణ్యం’ అంటూ మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామస్తులు తేల్చి చెప్పారు. పరిశ్రమ విస్తరణ చేపట్టొద్దని అధికారులకు దరఖాస్తు పెట్టుకోగా గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో పరిశ్రమ సమీపంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జేసీ నాగేష్, పీసీబీ ఈఈ రవికుమార్, ఆర్డీఓ శ్యాంప్రకాష్, పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విస్తరణపై ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పాలన్నారు. పరిశ్రమతో కలిగే లాభనష్టాలపై ప్రజలు చెప్పిన ప్రతి అంశాన్ని రికార్డ్ చేసి, ప్రతి ఫిర్యాదును కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు నివేదిస్తామన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. పరిశ్రమ ఏర్పాటైన నాటి నుంచి 14 ఏళ్లుగా రోగాల బారిన పడుతున్నారని, ప్రాణాలు విడుస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను విస్తరిస్తే తమను ఎటైనా పంపండి అని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమతో మాకెలాంటి ఉపయోగం లేదు.. పరిశ్రమ స్థాపిస్తే గ్రామానికి నిధులు వస్తాయి, ఉపాధి కలుగుతుందని అశగా ఎదురు చూసిన మాకు రోగాలు, మసిబారిన బతుకులు వచ్చాయని, పంచాయతీకి నిధులు వచ్చింది లేదన్నారు. నీటి కాలుష్యంతో సాగు చేయలేక పొరుగు గ్రామాలకు కూలి పనులకు వెళ్తున్నామని, పరిశ్రమ వద్దకు వెళ్తే కేసులు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. అధికారులు వారం రోజులు స్థానికంగా ఉండి పరిస్థితులు తెలుసుకోవాలని, అప్పుడు తమ బాధలు తెలుస్తాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పిల్లలను ఎలా సాకాలి.. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో మా ఆయనకు రోగం వచ్చి మరణించారు. ఉన్న సంపాదనంతా ఆసుపత్రి చుట్టూ తిరగడానికే ఖర్చయింది. పిల్లలను ఎలా సాకాలో అర్థం కాని పరిస్థితి ఉంది. – కుంట లక్ష్మి, రంగాయపల్లి ప్రజలను చంపడమే.. కాలుష్యం తో పంట లు లేవు. వృద్ధులు శ్వాసకోస వ్యాధులకు గురవుతున్నారు. పరిశ్రమలో డ్యూటీ అడిగితే జాడు కొట్టేది ఉందని చెబుతున్నారు. పరిశ్రమ విస్తరణ అంటే రెండూళ్ల ప్రజలను చంపడమే. – విఠల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ -
పరిశ్రమ డీలా..
సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు నియోజకవర్గంలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో పరిశ్రమలు వెలిశాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరకడంతోపాటు బీహర్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పరిశ్రమల్లో పని చేస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో నాలుగు, ఐదు రోజులు మాత్రమే పని దినాలు కల్పిస్తున్నారు. దీంతో కార్మికులు జీవనోపాధి పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని మహీంద్ర అండ్ మహీంద్ర ఆర్థిక మాంద్యం ప్రభావంతో సుమారు 30 శాతం ఉత్పత్తి తగ్గించిందని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. వెయ్యి మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారని వారు తెలిపారు. ఈ పరిశ్రమపై ఆధారపడిన అవంతి, పోలాల్ లాంటి చిన్న పరిశ్రమలు మూత పడే పరిస్థితిలో ఉన్నాయి. ఎంఆర్ఎఫ్లో కాంట్రాక్టు కార్మికులకు వారానికి మూడు రోజుల వీక్లీ ఆఫ్ ఇస్తున్నారు. దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీఐడీసీ పరిశ్రమలో ఉత్పత్తి సగానికి పడిపోయింది. దీంతో నాలుగు వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సుమారు 250 పరిశ్రమల్లో ఆర్థిక మాంద్యం ప్రభావంతో మూతపడే దశలో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగానికి పొంచి ఉన్న ప్రమాదం.. ఆర్థిక మాంద్యంతో ఆటోమోబైల్ రంగాలపై ఆధారపడిన పరిశ్రమలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిశ్రమల్లో తయారు చేసిన ఉత్పత్తులు అమ్మకాలు జరగడం లేదు. ఈ పరిశ్రమలపై ఆధారపడిన చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. దీంతో వేరే రంగాలకు వెళ్లలేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. -
పరిశ్రమలు మూత!
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా దివాళా తీస్తున్నాయి. వందల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు మూతపడుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఏళ్లుగా అందకపోవడంతో నిర్వహణ భారం తడిసిమోపడువుతోంది. మరోపక్క రుణం ఇచ్చిన బ్యాంకులకు క్రమం తప్పకుండా అప్పుతో కలిపి వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు ఆరేడు కేటగిరీల్లో సబ్సిడీ విడుదలకాకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొన్ని పరిశ్రమలు మూతపడగా.. మరికొన్ని అతికష్టం మీద నెట్టుకొస్తున్నాయి. నూతన పరిశ్రామిక పాలసీ వచ్చిన తొలి రెండేళ్లలో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, రీయింబర్స్మెంట్ విడుదల తీరును చూసి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ఆకర్షించిన ప్రోత్సాహకాలు.. రాష్ట్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానానికి (టీఎస్–ఐపాస్) ఆకర్షితులై చాలా మంది ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు జిల్లాలో అధిక సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పారు. 15 రోజుల్లోనే అనుమతులు ఇవ్వడంతోపాటు పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించడంతో స్థానిక, దేశీయ, బహుళ జాతీయ కంపెనీలు సైతం రాష్ట్రానికి వరుసకట్టాయి. పరిశ్రమలు నెలకొల్పేందుకు టీ–ఐడియా కింద జనరల్, టీ–ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీలు ఇస్తున్నారు. పెట్టుబడి, పావలా వడ్డీ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, పన్నులు, భూమి ధర, భూ మార్పిడి, విద్యుత్ ఛార్జీల రీయింబర్స్మెంట్ తదితర ప్రోత్సాహకాలు ప్రకటించడంతో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా, భారీ, మెగా తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. టీఎస్–ఐపాస్ అమల్లోకి వచ్చాక జిల్లాలో రూ.41,580 కోట్ల అంచనా వ్యయంతో 855 పరిశ్రమల స్థాపనకు ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. ఇందులో ఇప్పటివరకు రూ.10,200 కోట్ల పెట్టుబడితో 511 పరిశ్రమలు తమ ఉత్పత్తులను మొదలు పెట్టాయి. రూ.230 కోట్ల మేర బకాయిలు.. జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.230 కోట్ల సబ్సిడీ, రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ పారిశ్రామికవేత్తలకు అడపాదడపా సబ్సిడీ విడుదల చేస్తున్న ప్రభుత్వం.. జనరల్ కేటగిరీ విషయంలో కరుణించడం లేదు. ఈ కేటగిరీ పారిశ్రామికవేత్తలకు 2014, 2015 నుంచి సబ్సిడీలో ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. విద్యుత్ ఛార్జీల రీయింబర్స్మెంట్ చివరిసారిగా 2015 వరకు అందజేశారు. 2016 నుంచి ఇప్పటివరకు దిక్కులేదు. అలాగే 2014 నుంచి సేల్స్ ట్యాక్స్, పావలావడ్డీ సబ్సిడీ, పెట్టుబడి సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీలకు చివరిసారిగా 2017 సెప్టెంబర్‌లో సబ్సిడీ అందజేసింది. ప్రతినెలా ఎదురుచూస్తున్న ఈ పారిశ్రామికవేత్తలు సబ్సిడీ విడుదలపై ఆశలు వదులుకుంటున్నారు. ప్రభుత్వం మీద నమ్మకంతో సబ్సిడీ ద్వారా కొంత భారమైనా తగ్గుందని భావించి పరిశ్రమలు స్థాపిస్తే.. ఇప్పుడు కష్టాలు పడుతున్నామని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ నిర్వహణ భారం, బ్యాంకులకు అప్పుతో సహా వడ్డీ చెల్లింపులు తలకు మించిన భారంగా మారుతున్నాయంటున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరహా కొన్ని పరిశ్రమలు రాష్ట్రంలో ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో మూతపడ్డాయి. మూసివేతే శరణ్యం! ‘పరిశ్రమల స్థాపనలో మొదటిస్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎంటర్ప్రైజెస్ స్థాపన విధానం సరళతరం చేశామని ప్రకటిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సబ్సిడీ విడుదలలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా మా లాంటి సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు మూతవేయడమే శరణ్యంగా మారుతోంది. సబ్సిడీని నమ్ముకుని చేతిలో డబ్బులు లేకున్నా అప్పు తెచ్చి ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. ఐదేళ్లుగా సబ్సిడీగా విడుదల కాకుంటే ఎలా నడిపిస్తాం. తెచ్చిన అప్పుకు పెరుగుతున్న వడ్డీని తలుచుకుంటే ఏం పాలుపోవడం లేదు. సబ్సిడీ, రీయింబర్స్మెంట్ విడుదల చేస్తేనే పరిశ్రమలకు మళ్లీ జీవం వస్తుంది. లేదంటే మూసివేతే శరణ్యం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పారిశ్రామికవేత్త ‘సాక్షి’తో తన ఆవేదనను పంచుకున్నారు. -
పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం
సాక్షి, అమరావతి: ‘మాది పరిశ్రమలకు అనుకూల ప్రభుత్వం. రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం.. మన పిల్లలకే ఉద్యోగాలు ఇస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని గర్వంగా చెబుతున్నామన్నారు. మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి.. మా పిల్లలకు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వండి అని మాత్రమే తిరిగి కోరుతామని తమ ప్రభుత్వ విధానాన్ని వెల్లడించారు. స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని ఇలా ప్రసంగించారు. స్థానికుల సమ్మతితోనే పారిశ్రామికీకరణ ‘ఈ చట్టం తేవడం వల్ల పారిశ్రామికీకరణ ఆగిపోతుందని, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడతారని, పరిశ్రమలు రావని, ఉన్నవి మూతపడతాయని కొన్ని రోజులుగా టీడీపీతోపాటు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ సందర్భంగా నేను రెండు విషయాలపై స్పష్టత ఇవ్వదలిచాను. పాదయాత్రలో ప్రజల సమస్యలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాను. అందుకే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే బిల్లును తీసుకువచ్చాం. ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు స్థానిక ప్రజలను మభ్యపెడతారు. భూములు తీసుకుంటారు. ఆ తరువాత అక్కడ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు. ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి రాజకీయ నాయకులు అడిగితే పట్టించుకోరు. పైగా ఆ రాజకీయ నాయకుడు వారి పార్టీ తరఫున పోరాటం చేయడానికి వచ్చారని ముద్ర వేస్తారు. ఇంకా వ్యతిరేక ప్రభుత్వం ఉంటే వారిపై తిరిగి కేసులు పెట్టడం కూడా మనం చూశాం. ఫ్యాక్టరీలు రావడం వల్ల ఎంతో కొంత కాలుష్యం వస్తుంది. పర్యావరణానికి ఇబ్బంది వస్తుంది. కాలుష్యం ఎక్కువా తక్కువా అన్నది ఫ్యాక్టరీని బట్టి ఆధారపడి ఉంటుంది. స్థానికులు దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. చదువులు పూర్తి చేసి, డిగ్రీలు చేతికి వచ్చాక మన పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తోంది. అక్కడా ఉద్యోగాలు లేకపోతే దుబాయ్, కువైట్ పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పోవాలి. అందుకు మనం ఓ అడుగు ముందుకు వేస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు ఇస్తామంటేనే స్థానికులు పరిశ్రమలు రావడానికి, భూములు ఇవ్వడానికి అంగీకరిస్తారు. పార్లమెంటు నియోజకవర్గానికో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రభుత్వమే స్థానికులకు శిక్షణ ఇచ్చి మరీ పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందిస్తుంది. అందుకోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓ ఇంజనీరింగ్ కాలేజీని ఎంపికచేసి అందులో ఓ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ నేతృత్వంలో బృందం పరిశ్రమల యజమానులతో మాట్లాడి ఎలాంటి శిక్షణ ఇవ్వాలన్నది నిర్ణయిస్తుంది. దాని ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను తీర్చిదిద్దుతాం. ఆ నియోజకవర్గ పరిధిలో పెట్టే పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుతాం. పరిశ్రమలకు మూడేళ్లు గడువు ఇస్తున్నాం. ఈ మూడేళ్లలో అందరం కలిసి మన పిల్లలను నిపుణులుగా తయారు చేసుకుందాం. స్థానికులు నిర్వచనం ఇలా.. ‘స్థానికులు’ అనే అంశాన్ని ఈ బిల్లులో సరిగ్గా నిర్వచించాం. పరిశ్రమలు పెట్టేందుకు ఎక్కడైతే భూములు తీసుకుంటారో ఆ భూములకు సంబంధించిన వారిని మొదటి ప్రాధాన్యత కింద స్థానికులు అని చెప్పాం. అక్కడ పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవవనరులు దొరక్కపోతే ‘స్థానికత’ పరిధి మరింత పెరుగుతుంది. చుట్టుపక్కల ఊళ్లు కూడా వచ్చి మండల స్థాయికి చేరుతుంది. అక్కడా తగిన నైపుణ్యం ఉన్న వారు పూర్తిగా దొరక్కపోతే జిల్లా స్థాయికి పెరుగుతుంది. అక్కడా దొరక్కపోతే రాష్ట్ర స్థాయికి పెరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా దొరకని పరిస్థితి అయితే ఉండదు. గర్వంగా చెబుతున్నా..ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఈ రాష్ట్రంలో లంచాలు ఉండవని గర్వంగా చెబుతున్నాను. పరిశ్రమలు పెట్టాలంటే ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతి పారిశ్రామికవేత్తకూ చెబుతున్నాను. ఉన్నతస్థాయిలో ఎవ్వరూ లంచాలు అడగరు. కిందిస్థాయిలో కూడా లంచాలు లేని వ్యవస్థను తీసుకువస్తున్నాం. మా ప్రభుత్వ విధానం అంతా పారదర్శకంగా ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటుకు అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమలు పెట్టండి.. మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండని మాత్రమే తిరిగి కోరుతున్నాం. దాంతో అందరికీ అంతా మంచే జరుగుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. పీపీఏల సమీక్షతో పరిశ్రమలకే ప్రయోజనం విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లపై ఇటీవల కాలంలో టీడీపీ నానా ప్రచారం చేసింది. పీపీఏలను పునఃపరిశీలిస్తున్నామని, దాంతో ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామికవేత్తలు ఎవరూ రారని, విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇవ్వవని దుష్ప్రచారం చేస్తోంది. మేము వేసే ప్రతి అడుగు పారిశ్రామికీకరణకు అనుకూలమేనని స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్తు సంస్థల నుంచి తాను కరెంటు కొనుగోలు చేసే ధర కంటే కొంచెం ఎక్కువ వేసుకుని తిరిగి ఆ కరెంటును పరిశ్రమలకు అమ్ముతుంది. అలా వచ్చే డబ్బును వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి, ఇతర రాయితీలకు ఖర్చు చేస్తాం. దీన్నే క్రాస్ సబ్సిడీ అంటారు. ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి ఎక్కువ ధరకు కరెంటు కొంటే దానిపై మరికొంత లాభం వేసుకుని మరీ పరిశ్రమలకు అమ్మాల్సి ఉంటుంది. దాంతో పరిశ్రమలకు అమ్మే కరెంటు రేటు పెరుగుతుంది. అలాంటప్పుడు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు? తక్కువ ధరకు కరెంటు వస్తోందని వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతారు. అందుకే మనం పరిశ్రమలకు అనుకూలంగా ప్రతి అడుగు వేస్తున్నాం. ప్రభుత్వం తక్కువ ధరకు కరెంటు కొంటే పరిశ్రమలకు కూడా తక్కువ ధరకు కరెంటు ఇవ్వగలం. అందుకే పీపీఏలను సమీక్షించాలని నిర్ణయించాం. మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నదే ప్రభుత్వ విధానం. -
కంపెనీలకు డేటా చోరీ కష్టాలు
న్యూఢిల్లీ: డేటా చోరీ, ఉల్లంఘనలు వ్యాపార సంస్థలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో డేటా ఉల్లంఘనల కారణంగా దేశీ సంస్థలు సగటున రూ. 12.8 కోట్ల మేర నష్టపోయాయి. టెక్ దిగ్గజం ఐబీఎం కోసం పోనిమాన్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2018 జూలై నుంచి 2019 ఏప్రిల్ మధ్య కాలంలో 500 పైగా సంస్థల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం అంతర్జాతీయంగా డేటా చౌర్య నష్టాలు సగటున 3.92 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 27.03 కోట్లు)గా ఉన్నాయి. సగటున దేశీయంగా 35,636 రికార్డుల డేటా ఉల్లంఘన జరుగుతోంది. అంతర్జాతీయంగా ఈ సగటు 25,575 రికార్డులుగా ఉంది. డేటా ఉల్లంఘన వల్ల చట్టపరమైన, నియంత్రణ నిబంధనలపరమైన వ్యయాలు మొదలుకుని బ్రాండ్ పేరు దెబ్బతినడం, కస్టమర్లు ఇతర సంస్థలకు మళ్లడం, ఉద్యోగుల ఉత్పాదకత తగ్గిపోవడం దాకా వివిధ రూపాల్లో ఉండే నష్టాలను ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకున్నారు. ‘భారత్‌లో సైబర్ నేరాల తీరుతెన్నుల్లో పెను మార్పులు వస్తున్నాయి. నేరగాళ్లు కూడబలుక్కుని ఒక పద్ధతిలో చేసే ధోరణులు పెరుగుతున్నాయి. దీంతో డేటా చౌర్యం కారణంగా వాటిల్లే నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి‘ అని ఐబీఎం ఇండియా/దక్షిణాసియా సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లీడర్ వైద్యనాథన్ అయ్యర్ పేర్కొన్నారు. మూడింటిపై దృష్టి పెట్టాలి.. డేటా చౌర్య ముప్పు నేపథ్యంలో వ్యాపార సంస్థలు సైబర్ సెక్యూరిటీపరంగా ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని అయ్యర్ చెప్పారు. వ్యాపార లక్ష్యాలకు పొంచి ఉండే రిస్కులను మదింపు చేసుకోవడం, ముప్పులను సమర్ధంగా ఎదుర్కొనే వ్యవస్థను రూపొందించుకోవడం, డిజిటల్ విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవడంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని వివరించారు. డేటా ఉల్లంఘనలకు ఎక్కువగా క్రిమినల్ దాడులు (51 శాతం), సిస్టమ్‌లో లోపాలు (27 శాతం), మానవ తప్పిదాలు (22 శాతం) కారణంగా ఉంటున్నాయని నివేదికలో వెల్లడైంది. డేటా ఉల్లంఘనలను గుర్తించేందుకు పట్టే సమయం సగటున 188 రోజుల నుంచి 221 రోజులకు పెరిగింది. అయితే ఉల్లంఘనలను నియంత్రించేందుకు పట్టే సమయం 78 రోజుల నుంచి 77 రోజులకు తగ్గింది. డేటా ఉల్లంఘనల కారణంగా అత్యధికంగా నష్టపోయిన సంస్థల్లో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా హెల్త్‌కేర్ సంస్థలే నిల్చాయి. డేటా చౌర్య ప్రభావాలు కొన్ని సందర్భాల్లో అనేక సంవత్సరాల పాటు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది. -
పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, అమరావతి: ఇక నుంచి రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలను ప్రభుత్వం స్థానికులకే ఇవ్వనుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు కూడా వచ్చే మూడేళ్లలో 75 శాతం ఉద్యోగాలను కూడా స్థానికులకే ఇచ్చేలా చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనసభలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలను, ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. మరింత సులువుగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా సరళతర విధానాలను రూపొందించనుందని బిల్లులో స్పష్టం చేసింది. విద్యుత్, గనులు, మౌలిక రంగాలు, పోర్టులు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవోనోపాధిని కోల్పోయేవారికి అండగా..: పరిశ్రమల స్థాపనకు ప్రైవేట్ వ్యవసాయ భూముల డిమాండ్ పెరిగిపోతోందని, పరిశ్రమలకు భూములిచ్చినవారు తమ భూమితోపాటు జీవనోపాధిని, ఆదాయాన్ని కోల్పోతున్నారని బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరికి ఆ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్ ఉందని పేర్కొంది. అయితే.. పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న ఉద్యోగాలకే స్థానికులను పరిమితం చేస్తున్నారని తెలిపింది. దీనివల్ల తక్కువ ఆదాయంతో స్థానిక యువతలో అసంతృప్తి పెరిగిపోతోందని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో కనీసం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చట్టం చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. స్థానికత అంటే.. ఏపీతోపాటు జిల్లా, జోన్‌గా పేర్కొంది. స్థానికంగా తగిన అర్హతలు ఉన్నవారు లేకపోతే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు.. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, తగిన శిక్షణ ఇచ్చి మూడేళ్లలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, పీపీపీ విధానంలోని జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో మూడేళ్లలోగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల నుంచి మినహాయింపు కోరాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు వారాల్లోగా తగిన విచారణ చేసి నిర్ణయం తీసుకుంటుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తున్నారా? లేదా? అనే అంశాన్ని నోడల్ ఏజెన్సీ ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తున్నవారిపై ఎటువంటి న్యాయస్థానాలకు వెళ్లరాదనే నిబంధన విధించారు. -
కోరలు చాస్తున్న కాలుష్య భూతం
సాక్షి, చౌటుప్పల్ : ఒకప్పుడు పచ్చటి పంటలతో కళకళలాడిన చౌటుప్పల్ మండలం కాలుష్య కాసారంగా మారుతోంది. ప్రస్తుతం మండల భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇప్పటికే వ్యవసాయం నాశనం అయ్యింది. పశు సంపద మృత్యువాత పడుతోంది. కులవృత్తులన్నీ కుదేలయ్యాయి. ప్రజలంతా జీవనోపాధికి దూరమవుతున్నారు. జీవితాలన్ని అగమ్యగోచరంగా మారుతుండడంతో బతుకు జీవుడా అనుకుంటూ కుటుంబాలన్నీ వలసలు వెళ్తున్నాయి. కొందరి కాసుల కక్కుర్తితో ఇంతటి ఘోరం జరుగుతుంది. తమ స్వలాభాలే తప్పిస్తే ప్రజల క్షేమాన్ని పట్టించుకోని రసాయన పరిశ్రమల నిర్వాకమే ఈ భయానక పరిస్థితులకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. స్థానికులకు ఉపాధి కల్పిస్తామంటూ నమ్మబలికిన పరిశ్రమల యాజమాన్యాలు ఆ తర్వాత మాత్రం ఉపాధి చూపకపోగా ప్రాణాలనే హరించేవరకు వచ్చాయి. భారీ స్థాయిలో విడుదల చేస్తున్న వ్యర్థరసాయనాలతో సర్వం నాశనమే అ య్యింది. ఇదేమని అడగాల్సిన ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఉండే రాజకీయ పార్టీల నాయకులు మాత్రం పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే తాయిళాలకు తలొగ్గి వారికి సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు. ఫలితంగా రానున్న కొద్ది రోజులకే మండలంలోని ఈ ఊరు... ఆఊరు అని కాకుండా ప్రతి ఊర్లోని ప్రజలంతా ఇళ్లు వదులుకుని వలసలు వెళ్లాల్సిన భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చౌటుప్పల్ మండలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం పదిలోపే కంపెనీలు ఉండేవి. ఉన్న కంపెనీలు కూడా కాలుష్యం వెదజల్లని పరిశ్రమలే. కానీ 1993 సంవత్సరం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. స్థానికంగా యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన ఆంధ్రా పారిశ్రామికవేత్తలు తెలివిగా స్థానికంగా పరిశ్రమలను స్థాపించారు. ఒక్కొక్కరుగా గ్రామాల్లో స్థిరపడ్డారు. అలా వచ్చిన అన్ని రకాల కంపనీలు ప్రస్తుతం సుమారుగా 80 వరకు ఉన్నాయి. వీటిలో మూడొంతులకుపైగా రసాయన పరిశ్రమలే కావడం విశేషం. ప్రారంభంలో ఎన్నో రకాల మాయమాటలతో జనాలను ఆకర్షించే యాజమాన్యాలు నేడు దగ్గరకు సైతం రానివ్వడంలేదంటే ఎంతటి దౌర్భాగ్యంగా మారిందో మండల దుస్థితి అర్థం చేసుకోవచ్చు. విచ్చలవిడిగా పరిశ్రమల కాలుష్యం ప్రస్తుతం మండలంలో రసాయన పరిశ్రమల కాలుష్యం విచ్చలవిడిగా తయారైంది. మండలంలో లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, ఆరెగూడెం, ఎస్.లింగోటం, మందోళ్లగూడెం, జైకేసారం, నేలపట్ల, తంగడపల్లి, చౌటుప్పల్, దేవలమ్మనాగారం, మల్కాపురం, కొయ్యలగూడెం, ఎల్లగిరి, ధర్మోజిగూడెం, తూప్రాన్‌పేట గ్రామాల్లో రకరకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమలు వదులుతున్న కాలుష్యానికి హద్దే లేకుండాపోయింది. పరిశ్రమల కారణంగా మండలంలో ఉన్న 26 గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీలో ఉన్న 5 గ్రామాలు పూర్తిగా కలుషితమై ఘోస తీస్తున్నాయి. కాలుష్యం కారణంగా ఎలాంటి పరిశ్రమలు లేని గ్రామాలు సైతం ప్రభావితమయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు, పద్ధతులు ఏమీ లేకుండా ఆయా పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. కలుషితమైన భూగర్భజలాలు.. పరిశ్రమల కాలుష్యం కారణంగా మండలంలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఎర్రగా, నల్లగా, పసుపుగా రంగుమారి వస్తున్నాయి. కాలుష్యం ప్రభావంతో బావులు, బోర్లల్లోని నీరు నురగలు కక్కుతుంది. చేతులతో పట్టుకుంటే చర్మం చిమచిమలాడుతుంది. ఇలాంటి జలాలతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా గ్రామాల్లో పంట పొలాలన్నీ పడావుగా మారాయి. తరి పంటలు కాకుండా వర్షాధార పంటలను సాగు చేద్దామని ప్రయత్నించినా పంట ఎదుగుదల రాని పరిస్థితి. ఓ వైపు భూగర్భ జలాలు కలుషి తమై, మరోవైపు పంట పొలాలన్నీ నాశనమవ్వడంతో రైతాంగం, కుల వృత్తులపై ఆధారపడే కుటుంబీకులు జీవనోపాధికి అల్లాడుతున్నారు. అదేవిధంగా ప్రజలు, పశుసంపద పూర్తిగా ప్ర మాదకరమైన చర్మ వ్యాధులబారిన పడుతుంది. ప్రమాదకరమైన రసాయనాలన్నీ భూగర్భంలోకే.. పరిశ్రమల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడుతున్నాయి. తమకు కాసులే ముఖ్యమనుకుని ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని గాలికి వదులుతున్నాయి. తమ పరిశ్రమల్లో వెలువడే ప్రమాదకరమైన వ్యర్థ రసాయనాలను ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేయాల్సి ఉంది. ట్రీట్మెంట్ ప్లాంట్లను తమతమ పరిశ్రమల్లోనే ఏర్పా టు చేసుకోవాలి. కానీ కొందరు ఏర్పాటు చేసుకోగా మరికొందరు మాత్రం ఇప్పటికీ ఆ ఆలో చనే చేయడంలేదు. ట్రీట్మెంట్ ప్లాంట్లల్లో వ్యర్థాలను శుద్ధి చేస్తే భారీగా ఖర్చు అవుతుందని గ్ర హించిన పరిశ్రమల యాజమాన్యాలు తమ పరి శ్రమల ప్రాంగణాల్లో భూమిలోకి కొన్ని వేల ఫీట్ల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. అనంతరం వ్య ర్థాలను ఆ బోరు గుంతల్లోకి వదులుతున్నారు. ఈ వ్యవహారం బయటకు తెలియకపోతుండడంతో వారికి ఖర్చులు తప్పడంతోపాటు బదనాం నుంచి మినహాయింపు పొందుతున్నారు. వ్యర్థాల తరలింపు మాఫియా ఏజెంట్లు స్థానికులే.. ప్రతి సందర్భంలోనూ కంపెనీల్లోని బోర్లలోకి వ్యర్థాలను వదిలితే స్థానికంగా భూగర్భ జలాలన్నీ కలుషితమవుతాయి. దీంతో యాజమాన్యాలు తమ చేతులకు మట్టి అంటకుండానే పని ముగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా స్థానికంగా ఉన్న కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకొని వారి ద్వారా ట్యాంకర్లతో వ్యర్థాలను బయటకు తరలిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు 80వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఇలా పరిశ్రమ సామర్థ్యం మేరకు ప్రతి నెలలో 3–5ట్యాంకర్ల వ్యర్థాలు వెలువడనున్నాయి. వ్యర్థాలను తరలించేందుకు నియమితులైన స్థానికులు లక్షల రూపాయలు ఆర్జిస్తూ రసాయన పరిశ్రమలకు వత్తాసు పలుకుతుంటారు. ప్రమాదకరమైన వ్యర్థాలను ట్యాంకర్లతో రాత్రి వేళల్లోనే బయటకు తీసుకువచ్చి నీటి కాలువల్లో లేదంటే నిర్మాణుష్యమైన ప్రాంతాల్లో పారబోస్తున్నారు. వ్యర్ధాలు తరలించే వ్యక్తులు పెద్ద మాఫియాగా మారారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు రసాయన పరిశ్రమల దుర్మార్గాలపై స్థానికులు, రైతులు ఇప్పటికే అనేక రకాలుగా ఫిర్యాదులు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. ఫిర్యాదులు వచ్చిన సమయంలోనే కొద్దిపాటి హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత మాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత కలిగిన అన్ని శాఖల అధికారులకు సంబంధిత పరిశ్రమల నుంచి ఏదో ఒక రూపంలో మామూళ్లు అందుతాయి. అందుకే వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు తోడుగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు సైతం కంపనీల మామూళ్లకు అలవాటు పడి గ్రామాలను నాశనం చేసేందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బడా కంపెనీల జోలికే వెళ్లడం లేదు మండలంలో రసాయన పరి శ్రమల మూలంగా వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. పరి శ్రమల కాలుష్యంపై సంబం ధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకర పరిశ్రమలను విడిచిపెట్టి చిన్న చిన్న కంపెనీలపై అధికారులు దాడులు చేస్తున్నారు. కాలుష్య కంపెనీలపై ఇటీవల మెంబర్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాం. కాలుష్య నియంత్రణ అధికారులు కంపెనీల మత్తులో తరిస్తున్నారు. – పీఎల్ఎన్రావు, పర్యావరణ సామాజిక కార్యకర్త, లింగోజిగూడెం కఠిన చర్యలు తీసుకుంటాం పరిశ్రమల వ్యర్థ రసాయనాలు ఇష్టానుసారంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళల్లో వ్యర్థ రసాయనాల సరఫరాపై నిఘా ఉంచాం. సిమెంట్ పరిశ్రమల పేరిట తీసుకెళ్తున్నారు. ఎంతో ప్రమాదకరమైన వ్యర్థాల పారబోతను సహించబోం. – వెంకటేశ్వర్లు, సీఐ -
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
సాక్షి, చౌడేపల్లె: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచికరంగా అందించాలని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త అన్నారు. పుంగనూరు పర్యటన ముగించుకుని చిత్తూరు వెళుతున్న కలెక్టర్ చౌడేపల్లె మండలం పుదిపట్ల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. భోజనం నాణ్యతపై దృష్టి పెట్టాలని వంట నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హెచ్ఎం వేదవతికి సూచించారు. విద్యార్థుల జీవితాలకు మార్గం చూపేలా బోధన సాగాలని తెలిపారు. గత ఏడాది పుదిపట్లలో 98 శాతం ఉత్తీర్ణత సాధిం చామని హెచ్ఎం కలెక్టర్‌కు వివరించారు. ఈ ఏడాది ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వాచ్మెన్ కావాలని పాఠశాల సిబ్బంది కోరారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 21 ఎంఓయూలు చేయడం ద్వారా 7,911 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 2018–19 సంవత్సరాల్లో 1,363 యూనిట్లు స్థాపించినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 175 యూనిట్లు స్థాపించినట్లు తెలిపారు. 2014–15 నుంచి 2019–20 వరకు 3,289 యూనిట్ల ద్వారా 92,697 మందికి ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. 2018–19లో మెగా పరిశ్రమల స్థాపనలో భాగంగా 9 పెద్ద పరిశ్రమలను స్థాపించామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు ప్రతినెలా 5న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సింగిల్ డెస్క్ హోటల్ ద్వారా మూడు నెలల కాలంలో 352 దరఖాస్తులు అందగా 331 దరఖాస్తులను ఆమోదించామన్నారు. 129 పెద్ద పరిశ్రమలకుగాను 78 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మార్కండేయులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంఓయూలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కమలకుమారి, పరిశ్రమల శాఖ జీఎం అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీఐఐసీ జెడ్ఎం ఐఎల్.రామ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మన ఊపిరి.. ప్రత్యేక హోదా
సాక్షి, విజయవాడ : ‘అధికారంలోకి రాగానే ఐదేళ్లు, పదేళ్లు కాదు...15 ఏళ్లు ప్రత్యేకహోదా ఇస్తాం..’ ఇదీ గత ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ కలిసి ఇచ్చిన హామీ. ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేయకుండా, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని రాష్ట్రంలోని యువతకు తీరని ద్రోహం చేసింది. పరిశ్రమలు లేక, ఉన్నత చదువులు చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దీంతో ఎంతో విలువైన యువశక్తి వృథా అవుతోంది. ప్రత్యేకహోదా కోసం గత నాలుగేళ్లుగా అనేక పోరాటాలు, ఉద్యమాలు, యువభేరి కార్యక్రమాలు, ధర్నాలు, ఆందోళనలు, రిలేదీక్షలు, ఆమరణ దీక్షలు ఇలా అనేక రూపాలలో పోరాటం చేసి చివరకు ప్రత్యేకహోదా కన్నా ప్యాకేజీనే మిన్న అని చెప్పిన చంద్రబాబు చేత కూడా ప్రత్యేకహోదా కావాలని చెప్పించిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే మద్దతు తెలుపుతానని జగన్ జాతీయ పార్టీలకు స్పష్టం చేయడాన్ని బట్టే రాష్ట్రాభివృద్ధి పట్ల, యువత పట్ల ఆయనకు ఎంత నిబద్ధత ఉందో అర్ధమవుతోంది. రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలంటూ వైఎస్సార్ సీపీ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో మహోద్యమాన్ని నడిపింది. ఈ ఉద్యమాలకు కృష్ణాజిల్లా కూడా వేదికైంది. ధర్నాలు, రాస్తారాకోలు, రైల్‌రోకోలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, కలెక్టరేట్ ముట్టడి వంటి విభిన్న మార్గాల్లో గత ఐదేళ్లుగా నిరసనలు తెలియచేస్తోంది. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని కాదని, హోదా గురించి ఉద్యమాలు చేస్తే అరెస్టులు చేయిస్తామని చంద్రబాబు బెదిరించినా ఏ మాత్రం బెదరకుండా ఉద్యమాన్ని జిల్లా వాసులు నడిపారు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పటికీ 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగి ఉన్నాయి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే 12వ రాష్ట్రమయ్యేది. మరో ఐదు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీతో పాటు నాటి ప్రధాని మన్మోహన్సింగ్ హామీ ప్రకారం మార్చి 2,2014 పార్లమెంట్ చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉద్యమాన్ని ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీలు చేపట్టినా ఐదేళ్లు దీన్ని సజీవంగా నిలబెట్టింది మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. హోదా.. లాభాలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర నిధులు 90 శాతం గ్రాంటుగానూ, 10 శాతం అప్పుగానూ ఇస్తుంది. గ్రాంటుగా వచ్చే సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేదు. పరిశ్రమలకు భారీగా రాయితీలు వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కం ట్యాక్స్ 100 శాతం పన్ను రాయితీ వస్తుంది. ప్రైట్ రీయింబర్స్ మెంట్ దక్కితే పరిశ్రమలు వస్తాయి. మనం కొనుగోలు చేసే అనేక వస్తువులు సగం ధరకే వస్తాయి. కరెంటు చార్జీలు భారీగా తగ్గుతాయి. కృష్ణాజిల్లాలో పారిశ్రామికవేత్తలకు కొదవలేదు. ఈప్రాంతానికి చెందిన లగడపాటి రాజగోపాల్, కావూరు సాంబశివరావు తదితర పారిశ్రామికవేత్తలు కృష్ణాజల్లా కంటే ఇతర రాష్ట్రాల్లోనే పెద్దపెద్ద పరిశ్రమలు స్థాపించారు. వ్యవసాయరంగంలో అభివృద్ధి చెందిన కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు చెప్పుకోదగిన పరిశ్రమ ఒక్కటీ లేదు. గత ఐదేళ్లలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేయడమే తప్ప ఒక చెప్పుకోదగిన పరిశ్రమ రప్పించడం కాని ప్రారంభించడం కాని లేనేలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పారిశ్రామికవేత్తలు ఇక్కడికే వలస వచ్చేవారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 2వేల పరిశ్రమలు వచ్చాయి. వెనుకబడిన రాష్ట్రంలోనే అన్ని పరిశ్రమలు వస్తే.. బందరు వంటి ఓడరేవు ఉండి పరిశ్రమలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్న కృష్ణాజిల్లాకు ఈ ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చేవని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం,ఉపాధి కరువైంది! పరిశ్రమలు లేకపోవడంతో ఆరున్నర లక్షల కుటుంబాలు వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తున్నారు. విద్యావంతులైన యువకులు ఉద్యోగఅవకాశాలు లేక హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుతో తదితర నగరాలతో పాటు విదేశాలకు వలసపోతున్నారు. లక్షల మంది ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా రావడం వల్ల ఉత్తరాఖండ్‌లో 490 శాతం ఉద్యోగ అవకాశాలు పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. మన జిల్లాలో పరిశ్రమలు వచ్చి ఉంటే కనీసం ఆరేడు వందల శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు ఉద్యోగాల కోసం వలసలు వచ్చేవారు. అనుబంధ పరిశ్రమల్లో అవకాశాలు! ప్రత్యేక హోదా మనకు వచ్చి ఉంటే కృష్ణాజిల్లాలోని యువతీ యువకులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొత్తగా పరిశ్రమలకు అనుబంధంగా పరిశ్రమల్ని పెట్టుకునేందుకు అవకాశం ఉండేదని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్స్, ఇంకంట్యాక్స్లో 100 శాతం పను రాయితీలు ఇచ్చి, బ్యాంకులు యువతకు సబ్బీడీలోలోన్లు ఇచ్చి ఉంటే జిల్లా వ్యవసాయపరంగానే కాకుండా పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందిన మరొక హైదరాబాద్‌గా మారేదని విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న వ్యాపార సంస్థలు ఏడెనిమిది రెట్లు పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. హోదాను బతికించింది జగనే రాష్ట్రంలో ప్రత్యేకహోదా నినాదాన్ని బతికించింది వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి మాత్రమే. ఈ విషయం అన్ని పార్టీలతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు ప్రత్యేకహోదా ఉపయోగంలేదు అన్న ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకుని హోదా కావాలని నాటాకాలు ఆడుతున్నారు. ఉద్యోగం రాలేదు! చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన కొమ్ము రత్తయ్య, సరోజనీలు కూలీ పనులకు వెళ్లి కొడుకు కొమ్ము వీర వెంకట సత్యనారాయణను ఇంజనీరింగ్ చదివించారు. 2012 ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. అప్పటి నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. హోదా వచ్చి ఉంటే కొలువు దక్కేదని భావిస్తున్నాడు. ప్రత్యేక హోదా.. రాష్ట్రానికి సంజీవని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హోదా కల్పించాలని మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్. హోదా వల్ల రాష్ట్రానికి రాయితీలు వస్తాయని, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెడతారని, చదువుకున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయని గళమెత్తి నినదించిన నాయకుడు ఆయనే. హోదా ఉద్యమంలో గణనీయమైన పాత్ర పోషించటంతో పాటు గడచిన ఐదు సంవత్సరాలుగా ప్రతి వేదికపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఒకసారి హోదా కావాలని, మరోసారి ప్యాకేజీ అని, హోదా అంటే అరెస్టులు చేయించి, మరలా ఇప్పుడు హోదా కోసం పాటు పడుతున్నామంటూ రంగులు మార్చే ఊసర వెల్లులకు తగిన గుణపాఠం ఈ ఎన్నికలలో చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. రాయితీలు లేక అనేక పరిశ్రమలు మూతపడటంతో పాటు, నష్టాల్లో ఉన్నాయి. వాటిని ఆదుకోవడానికి ప్రత్యేక హోదా సంజీవని. తప్పక హోదా ఇవ్వాలి. - షేక్ మున్ని–ముస్తాబాద, గన్నవరం చేజేతులా నాశనం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నాలుగేళ్లపాటు మిత్రత్వం నెరపి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ప్యాకేజీ కోసం పాకులాడడం వల్లే నేడు రాష్ట్రానికి ఇలాంటి దుర్గతి పట్టింది. హోదా వచ్చి ఉండి ఉంటే ఈ ఐదేళ్లలో ఎంతో ప్రగతి సాధించే వారం. ప్యాకేజీలకు తలొగ్గారు. హోదా కోసం ఐదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయం ఈ సార్వత్రిక ఎన్నికలతో నెరవేరుతుందనే నమ్మకం కలుగుతోంది. –చిట్టూరి నాంచారయ్య, చినకామనపూడి, ముదినేపల్లి హోదాతో వ్యవసాయానికి మరింత లాభం ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ పరికరాల తయారీ కంపెనీల ఏర్పాటు రాష్ట్రంలోనే జరుగుతుంది. తద్వారా పరికరాలు తక్కువ ఖర్చుకే దొరుకుతాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే బియ్యం, మినుములు వంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడే నెలకొల్పడంతో రైతులు ఆశించిన దానికంటే ఎక్కువ గిట్టుబాటు ధర వస్తుంది. విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. అంతేకాకుండా వ్యవసాయానికి ఎక్కువ సమయం విద్యుత్ సరఫరా చేస్తారు. వ్యవసాయ విత్తనోత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేయడంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. హోదా వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి లాభం ఎక్కువగా ఉంటుంది. –పంచకర్ల విష్ణువర్ధన్, అభ్యుదయ రైతు, అరిసేపల్లి, మచిలీపట్నం హోదా నిలిచింది టీడీపీ వల్లే! రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి ప్రభుత్వ నిర్వాకమే కారణం. ముఖ్యమంత్రి ఒకసారి ప్రత్యేక హోదా సంజీవనా అంటారు. ప్రత్యేక హోదా ఉన్న చత్తీస్‌గఢ్ ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడ పరిశ్రమలొచ్చాయి. మన ముఖ్యమంత్రి హోదాపై డ్రామాలు ఆడటం బాధాకరం. –అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, మైలవరం ఉద్యోగాలు, పరిశ్రమలొస్తాయి ప్రత్యేకహోదా రాష్ట్రానికి చాలా అవసరం. అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలంటే హోదా కావాలి. పన్ను రాయితీలు ఉంటే పరిశ్రమలు వస్తాయి. పేరున్న విద్యాసంస్థలు, ఉన్న త ప్రమాణాలతో కూడిన విద్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. రాయితీలు ఉన్నప్పుడు ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. కేంద్రానికి చెల్లించే సొమ్ము 10 శాతమే ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో ప్రగతి వేగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. – ఆర్. వసంత్‌కుమార్, విద్యావేత్త, కంకిపాడు హోదా వస్తే ఉద్యోగాలొచ్చేవి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఈప్రాంతంలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. హోదా రాకపోవటం వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. ఆక్వా పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉన్న గుడివాడ ప్రాంతానికి ఆక్వా హబ్ రావటంతో పాటు ఆ రంగంలో పరిశ్రమలకు అవకాశం పెరిగేది. పరిశ్రమలు రాయితీ ఉంటేనే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. హోదా ఈ రాష్ట్రానికి, యువతకు అవసరం. ఈసారైనా హోదా సాధించే వారికే మద్దతు ఉండాలి. – టి సీతారామయ్య, ఉపాధ్యాయులు, గుడివాడ ప్యాకేజీలకు తలొగ్గారు ప్రత్యేక హోదాలో ఏముంది, ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదాకి తేడా లేదన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం హాస్యాస్పదం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. కేంద్రానికి పన్నులు చెల్లించే ఆవశ్యకత ఉండదు. టాక్స్ ఫ్రీ స్టేట్ అవుతుంది. కొత్త పారిశ్రామికవాడలు, కంపెనీల స్థాపనకు దోహదమవుతుంది. పారిశ్రామికీకరణ ద్వారా రహదారులు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రాభివృద్ధి ఇతోధికంగా జరిగి ఆర్ధికాభివృద్ధి వేగంగా జరుగుతుంది. –పుప్పాల శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది సంజీవని కాదన్నారు నాడు సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు. ప్యాకేజీకి ఒప్పుకొన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టారు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హోదాపై డ్రామాలాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తుంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మొదట నుంచి హోదా సాధనే ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నారు. – కంభపు రాంబాబు, మంటాడ, పామర్రు హోదా రాక.. చాలా నష్టపోయాం రాష్ట్రం అన్యాయంగా విభజనకు గురైంది. ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయింది. అధికారంలో ఉండి, నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు హోదా సాధించలేకపోయారు. దీని అవసరం ఎంతో తెలిసి కూడా హోదాను పక్కన పెట్టేశారు. దీనివల్ల పరిశ్రమలు రాలేదు. అసలే నందిగామ ప్రాంతం అన్ని విధాలుగా వెనుకబడిపోయింది. –పింగళి లక్ష్మీ నరసింహారావు, న్యాయవాది -
గరళంపై ఇక కఠినం!
సాక్షి, హైదరాబాద్: కాలుష్యాన్ని వ్యాపింపచేస్తూ, ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పరిశ్రమలు, ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి పరిశ్రమలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం అరణ్యభవన్‌లో వివిధ విభాగాలపై మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, అటవీ అభివృద్ధిసంస్థ వైస్ చైర్మన్, ఎండీ రఘువీర్, పీసీబీ మెంబర్ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, ఈపీటీఆర్ఐ ఎండీ కల్యాణ చక్రవర్తి, బయో డైవర్సిటీ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శిల్పి శర్మ, టీఎస్ కాస్ట్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో కాలుష్యం కోరలు చాస్తోందని, తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి చెక్... రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కూడా ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి చెప్పారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్, క్లాత్ బ్యాగులను వాడేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం ఉన్నా, కంపెనీలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ బ్యాగులను తయారు చేస్తున్నాయని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాలం చెల్లిన వాహనాలకు చెక్.. కాలం చెల్లిన వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాల కారణంగా స్వచ్ఛమైన గాలి కలుషితమవుతోందని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కాలం తీరిన వాహనాలకు చెల్లు చీటీ పాడాలని మంత్రి సూచించారు. కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టేందుకు నిరంతరం కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చే విధంగా ఈపీటీఆర్ఐ పరిశోధనలు చేపట్టాలన్నారు. -
ఇంటర్న్‌షిప్‌తోపాటే ఉద్యోగం!
చదువుకునే సమయంలోనే విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు వీలుగా నూతన ఇంటర్న్‌షిప్ విధానం అమలులోకి వస్తోంది. సాంకేతిక కోర్సులంటే సమాజంతో పనిలేదు అనే ధోరణి నుంచి బయటకు రప్పించేలా ఇంటర్న్‌షిప్‌ను తీర్చిదిద్దారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంతో పాటు ఇంటర్న్‌షిప్‌ను పకడ్బందీగా పూర్తి చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి, అమరావతి: విద్యార్థులు సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందిం చేందుకు సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్న్‌షిప్ విధానంలో సమూల మార్పులు అమలులోకి రానున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమో కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ కాలపరిమితిని పెంచడంతోపాటు పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానాన్ని మెరుగుపర్చడానికి కేంద్రం ప్రభుత్వం నూతన ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించి జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల మోడ్రన్ ఇంటర్న్‌షిప్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాక్టికల్ విధానానికి ఇందులో పెద్దపీట వేశారు. అదే సమయంలో ఇప్పటివరకు ఉన్న క్రెడిట్ల సంఖ్యను తగ్గించారు. బీటెక్ కోర్సులో 220 క్రెడిట్లను 160కి కుదించారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కు 14 నుంచి 20 క్రెడిట్స్‌ను కేటాయించారు. డిప్లొమోలో దీన్ని 10 నుంచి 16 క్రెడిట్లుగా నిర్ణయించారు. ఇంటర్న్‌షిప్ నాలుగు నెలలకు తగ్గకుండా ఉండేలా నిబంధనలు విధించారు. దీనివల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడంతో పాటు కోర్సు పూర్తయ్యేలోగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శిక్షణతో వేతనాలకు కోత ఇంజనీరింగ్, డిప్లొమో కోర్సులు చదివేవారిలో నైపుణ్యాల లేమితో మూడో వంతు మంది కూడా ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారని భావిస్తున్న ఏఐసీటీఈ నూతన విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఉపాధి పొందుతున్న వారిలో కూడా నైపుణ్యాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఆయా పరిశ్రమలు తిరిగి శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. అయితే శిక్షణ పేరుతో వేతనాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఏటా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వేతనాలు పొందాల్సిన వారు కేవలం రూ.1.5 లక్షలే అందుకోగలుగుతున్నారు. డిప్లొమోలో 500 గంటలు.. ఇంజనీరింగ్‌లో 700 గంటలు.. కొత్త నిబంధనల ప్రకారం డిప్లొమో కోర్సులు చేసే విద్యార్థులు 450 నుంచి 500 గంటలు, ఇంజనీరింగ్ విద్యార్థులు 600 నుంచి 700 గంటలు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇంటర్న్‌షిప్‌లో ఫుల్‌టైమ్ పార్ట్‌టైమ్ వెసులుబాటు కూడా కల్పించారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఫుల్‌టైమ్ ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. పార్ట్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌కు హాజరయ్యే వారు కోర్సు మధ్యలో ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. సెకండ్ సెమిస్టర్ నుంచి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. 40 నుంచి 45 గంటల పనిగంటలను ఒక క్రెడిట్‌గా పరిగణిస్తారు. ఒక వారంలో దీన్ని పూర్తిచేయవచ్చు. ఇందులో ట్రైనింగ్, ప్రాజెక్టు వర్కు, సెమినార్ తదితర కార్యక్రమాలుంటాయి. 4, 6 సెమిస్టర్ల అనంతరం వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తదితర కార్యక్రమాలను చేపట్టవచ్చు. చివరిలో ప్రాజెక్టు వర్కు, సెమినార్లు ఇంటర్న్‌షిప్‌ను పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చిన్న, మధ్య తరహా సంస్థల్లోనూ చేయవచ్చు. చివరి 8వ సెమిస్టర్లో ప్రాజెక్టు వర్కు, సెమినార్లు లాంటివి ఆయా సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి సంస్థలో ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం ఏర్పాటు చేసి దీనికో అధికారిని ప్రత్యేకంగా నియమించాలి. అనుసంధానమైన పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ఆయా సంస్థలు రూపొందించాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ పురోగతిని రోజూ సమీక్షించుకోవాలి. విద్యార్ధులు ఇంటర్న్‌షిప్ దినచర్యను డైరీలో నమోదు చేసుకోవాలి. పకడ్బందీగా మూల్యాంకన విధానం విద్యార్ధుల ఇంటర్న్‌షిప్‌పై పరిశ్రమలు, సైట్ విజిట్ చేసే ఫాకల్టీ సూపర్వైజర్ మూల్యాంకనం చేయాలి. చివరిగా సంస్థలో సెమినార్, వైవా ద్వారా ఇంటర్న్‌షిప్ తీరును మదింపు చేయాలి. విద్యార్థుల నైపుణ్యాలను గమనిస్తూ పరిశ్రమలు డైరీల్లో రిమార్కులు రాయాలి. ఇంటర్న్‌షిప్‌లకు అదనంగా 100 పాయింట్లు అకడమిక్ గ్రేడ్లకు అదనంగా ఇంటర్న్‌షిప్‌లకు ఏఐసీటీఈ 100 పాయింట్లను కేటాయించనుంది. ఇందుకు దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని రూపొందించింది. లేటరల్ ఎంట్రీ ద్వారా (డిప్లొమో అనంతరం) ఇంజనీరింగ్‌లో చేరే వారికి 75 పాయింట్లు నిర్దేశించారు. సామాజిక సేవ, తదితర కార్యక్రమాలను ఇంజనీరింగ్ విద్యార్థులు 300 నుంచి 400 గంటలు, డిప్లొమో విద్యార్థులు 200 నుంచి 250 గంటలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది నాన్ క్రెడిట్ కార్యక్రమంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి ఇందుకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాలి. స్థానిక స్కూళ్లలో విద్యార్థులకు సేవలందించడం, గ్రామాల ఆర్థిక వనరులు పెంపొందించేందుకు ప్రణాళికలు సూచించడం, మంచినీటి సదుపాయాలు, నిర్వహణను అభివృద్ధి పర్చడం, టూరిజమ్ ప్రమోషన్, సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక సమస్యల పరిష్కారం, విద్యుత్తు వినియోగాన్ని తగ్గించే నూతన ప్రయోగాలు, మహిళా సాధికారతకు తోడ్పాటు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేయడం తదితర అంశాలను చేపట్టాలి. మోడ్రన్ ఇంటర్న్‌షిప్ లక్ష్యాలు ఇవీ – ఇంజనీరింగ్ పరిజ్ఞానం పెంపు – విశ్లేషణ, సమస్య పరిష్కారానికి వీలుగా డిజైన్/డెవలప్మెంట్ – సంక్లిష్ట సమస్యల శోధన – ఇంజనీర్లుగా సామాజిక బాధ్యత – పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత – నైతిక విలువలతో కూడిన ఇంజనీరింగ్ విద్య, నైపుణ్యాలు – వ్యక్తిగత, బృందంగా పనిచేసే సామర్థ్యాలు పెంపొందించడం – కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడం – ప్రాజెక్టు మేనేజ్మెంట్, ఫైనాన్స్ తదితర అంశాల్లో అవగాహన – లైఫ్ లాంగ్ లెర్నింగ్ విద్యార్థులు, విద్యాసంస్థలు, పరిశ్రమలకు ప్రయోజనాలివీ.. – సమస్యను పరిష్కరించగలిగే నైపుణ్యాలు విద్యార్థుల్లో పెరగడం. – తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను ఇంటర్న్‌షిప్‌ల ద్వారా అవగాహన చేసుకోవడం. – ఇంటర్న్‌షిప్ అనుభవాలను తిరిగి తరగతి గదుల్లో చర్చించడం. – అకడమిక్ కెరీర్, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం. – పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది సైకాలజీ, అలవాట్లు, ప్రవర్తనను అధ్యయనం చేయడం ద్వారా సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడం. – ఇంటర్న్‌షిప్ ద్వారా సామాజిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలు, ప్రభావాన్ని అంచనావేయడం. –నిపుణులైన అభ్యర్థులు పరిశ్రమలకు అందుబాటులోకి వస్తారు. –విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాల ద్వారా పరిజ్ఞానం పెరుగుతుంది. –విద్యాసంస్థలకు కూడా పరిశ్రమలతో అనుబంధం పెరుగుతుంది. –ఆయా సంస్థల క్రెడిబులిటీ, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది – సంస్థలోని సిబ్బందికి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ సమకూరుతుంది. – రిటెన్షన్‌కు అవకాశం లేకుండా విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. -
ఈవోడీబీలో తెలంగాణకు రెండో ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: సరళీకృత వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్/ఈవోడీబీ) ర్యాంకింగ్స్‌లో గతేడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ.. ఈ ఏడాది త్రుటిలో ఆ ర్యాంకును కోల్పోయింది. రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ (డీఐపీపీ) మంగళవారం 2017 సంవత్సరానికి సంబంధించిన ఈవోడీబీ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో 98.42 శాతం స్కోరుతో ఏపీ తొలి ర్యాంకు కైవసం చేసుకుంది. 98.33 శాతం స్కోరుతో (0.09 శాతం తక్కువ) తెలంగాణ రెండో ర్యాంకును సాధించింది. 98.07 శాతం స్కోరుతో హరియాణా మూడు, 97.99 శాతం స్కోరుతో జార్ఖండ్ నాలుగు, 97.96 శాతం స్కోరుతో గుజరాత్ ఐదో స్థానంలో నిలిచాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2017లోని సంస్కరణల అమలు ఆధారంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు డీఐపీపీ ర్యాంకులు కేటాయించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, తనిఖీలు, సింగిల్ విండో విధానం, పరిశ్రమలకు స్థలాల లభ్యత, కేటాయింపులు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ అనుమతుల విధానం, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ, పారదర్శకత, సమాచార లభ్యత, కార్మిక విధానాలు తదితర 12 అంశాల్లో సంస్కరణలను పరిగణనలోకి తీసుకుని ఈవోడీబీ ర్యాంకులను కేటాయించింది. 2016 సంవత్సరంలో తెలంగాణ, ఏపీలు 98.78 శాతం స్కోరు సాధించి ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలిచాయి. ఫీడ్‌బ్యాక్‌లో తెలంగాణ వెనకడుగు వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2017లో భాగంగా 3,725 సంస్కరణలను అమలు చేయాలని డీఐపీపీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తించే సంస్కరణలను మినహాయించాక రాష్ట్రం అమలు చేయాల్సిన మొత్తం 368 సంస్కరణలను తెలంగాణ అమలు పరిచింది. దీంతో సంస్కరణల అమలు (రిఫార్మ్ ఎవిడెన్స్) విభాగంలో తెలంగాణకు 100 శాతం స్కోరు లభించింది. ఏపీ అమలు చేయాల్సిన 369 సంస్కరణలకు గాను 368 సంస్కరణలను అమలు చేసి 99.73 శాతం స్కోరు సాధించింది. అయితే రాష్ట్రాల్లో సంస్కరణల అమలుపై కొత్త పరిశ్రమలు, పాత పరిశ్రమలు, ఆర్కిటెక్టులు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, న్యాయవాదుల నుంచి డీఐపీపీ సేకరించిన ఫీడ్‌బ్యాక్‌లో తెలంగాణకు 83.95 శాతం స్కోరు లభించగా, ఏపీ 86.5 శాతం స్కోరు సాధించింది. ఫీడ్‌బ్యాక్ స్కోరులో తెలంగాణ కంటే మెరుగైన స్కోరు సాధించడంతో ఏపీ ఈ సారి ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించింది. -
పరిశ్రమలకు రాష్ట్రం అనుకూలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన ఆరు మాసాల్లోనే అత్యుత్తమైన టీఎస్–ఐపాస్ విధానానికి రూపకల్పన చేసి సింగిల్‌విండో విధానంలో పరిశ్రమలకు సత్వర అనుమతులు జారీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. రూ.1,30,216 కోట్ల పెట్టుబడి విలువగల 7,337 పరిశ్రమలకు అనుమతులిచ్చామని, 6 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఇప్ప టికే 4,884 పరిశ్రమలు ప్రారంభమయ్యాయని తెలిపారు. భారతదేశంలోని రాష్ట్రాలను విదేశాల్లో ప్రమోట్ చేయడంలో భాగంగా భారత రాయబారుల బృందం రాష్ట్రాల పర్యటన చేపట్టింది. ఈ క్రమంలో ఆ బృందం బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సచివాలయంలో సమావేశమైంది. సీఎస్ మాట్లాడు తూ సులభతర వాణిజ్యంలో మొదటి స్ధానంలో నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, తగినంత భూమి అందుబాటులో ఉందని, పలు సబ్సిడీలు అందిస్తున్నామని పేర్కొన్నా రు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ వ్యయంతో పరిశ్రమలు స్థాపించవచ్చని పేర్కొన్నారు. 18.25 లక్షల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యంగల గోడౌన్స్ నిర్మించామని, యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా 27,742 చెరువుల్లో పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టామని, 8.25 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యాన్ని సృష్టించామని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఫిన్లాండ్లో భారత రాయబారి వాణీరావు, పెరూలో భారత రాయబారి ఎం.సుబ్బారాయుడు, సిషెల్స్ భారత రాయబారి ఔసఫ్ సయీద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అడిగిన వెంటనే పరిశ్రమలకు భూములు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అడిగిన వెంటనే భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కోరగానే ప్రభుత్వ భూములను అప్పగించాలన్నారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసిన తక్షణమే వారికి ఏపీఐఐసీ భూములు కేటాయించాలని, ఏమాత్రం జాప్యం చేయరాదని పేర్కొన్నారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసం వద్దనున్న గ్రీవెన్స్ హాల్లో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ఫలితాలు సాధించిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే 2029 కంటే ముందే మన రాష్ట్రం తిరుగులేని శక్తిగా ఆవిష్కృతమవుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వంద శాతం డిజిటల్ లిటరసీ సాధించాలని సూచించారు. ‘‘పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు వచ్చి మనల్ని భూములు, సౌకర్యాలు అడగడం కాదు. మనమే వారి వద్దకు వెళ్లి మేం ఇవి ఇస్తాం, మీరు పరిశ్రమలు పెట్టండి అని పిలవాలి’’ అంటూ ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విడుదలలో జాప్యం చేయరాదన్నారు. చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘‘రాష్ట్రంలో లక్ష హోటల్ గదుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలి. హోటల్ గదులు మనం నిర్మించాలి. నిర్వహణ బాధ్యతలను ప్రముఖ సంస్థలకు అప్పగించాలి. మనం కష్టపడి రూపొందించిన ఈ–ప్రగతి, ఫైబర్ నెట్ లాంటి వాటిని మేధో హక్కుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరిపాలనపై ప్రజల సంతృప్త స్థాయిని ప్రస్తుతం ఉన్న 75 శాతం నుంచి 80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు, ఎయిర్‌స్ట్రిప్, పరిశ్రమ కోసం 5,000 ఎకరాలు సేకరించాలి. విజయవాడ శివారులోని జక్కంపూడిలో 106 ఎకరాలు, నున్నలో 70 ఎకరాలు, త్రిలోచనపురంలో 40 ఎకరాలను సేకరించండి. టౌన్‌షిప్‌లు నిర్మిద్దాం. గోదావరి జిల్లాలోని తిమ్మాపురంలో ఎకనామిక్ సిటీ నిర్మిద్దాం. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి వెంటనే భూసేకరణకు వెళ్లండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణపై దృష్టి పెట్టండి. కేవలం పథకాలను అమలు చేస్తే సరిపోదు. వాటి గురించి ప్రజలకు తెలియజేయాలి. ఇందుకోసం డబ్బు ఖర్చు అవుతుందని వెనుకడుగు వేయాల్సిన పనిలేదు. 200 గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ 2019 మార్చి నాటికి 19 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆ తరువాత మరో 20 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దేవాదాయ స్థలాలను వేలం వేసి, పేదలకు ఇవ్వాలి. భవిష్యత్‌లో ఎండోమెంట్ భూములను కాపాడలేం. ఇప్పుడే పేదలకు పంపిణీ చేస్తే బాగుంటుంది. పట్టణాల్లో పేదలు ప్రైవేట్ స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి 200 గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. క్రీడలు నిరంతర ప్రక్రియగా ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలి. నిరుద్యోగ భృతిని వచ్చే నెల నుంచి అందించాలని నిర్ణయించాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. చెరువులను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి ప్రయోజనార్థం చెరువు భూమిని వేస్ట్‌ల్యాండ్‌గా మార్చడం సరికాదేమో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సూచించారు. అయితే గత ఏడాది మా జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అర్బన్ హౌసింగ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని మునిసిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి కరికాలవలవన్ చెప్పగా మంత్రి ఈ వ్యాఖ్యాలు చేశారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. 2016–17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గృహాలను జిల్లాకు కేటాయించలేదన్నారు. మద్యం బెల్ట్ షాపులను నియంత్రించాలి రాష్ట్రంలో మద్యం బెల్ట్ దుకాణాలు ఇంకా కొనసాగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు నొక్కి చెప్పారు. బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించేందుకు ఎక్సైజ్, పోలీసు అధికారులతోపాటు కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ల సదస్సులో, తర్వాత శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమీక్షలోనూ సాంబశివరావు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆధార్ డేటా వాడితే క్రిమినల్ చర్యలు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) డేటాను బహిర్గతపరచడం చట్టరీత్యా తీవ్ర నేరమని ఆధార్ అథారిటీ ఛైర్మన్ జె.సత్యనారాయణ తెలిపారు. ‘‘ఆధార్‌కు సంబంధించిన డేటా ఎక్కడైనా వెబ్సైట్లలో ఉంటే వెంటనే తొలగించండి. ఆధార్ వివరాలు వెబ్సైట్లో ప్రదర్శించినా, బహిరంగ పరిచినా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని కలెక్టర్ల సదస్సులో సత్యనారాయణ స్పష్టం చేశారు. -
నగరం బయటకు కాలుష్య పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో 54 నాలాలున్నాయని, 90 శాతం మురుగు నీరు మూసీ నదిలోకి వెళ్తోందని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. హుస్సేన్‌సాగర్ బయోలాజికల్ ఆక్సిజన్ లెవల్స్ (బీవోడీ) గతేడాది సెప్టెంబర్‌లో తగ్గాయని.. అనుకోకుండా వచ్చిన మురుగు నీటితో ఈ పరిస్థితి ఏర్పడిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో శుద్ధీకరణ చేస్తామన్నారు. గ్రేటర్ పరిధిలో 1,234 కాలుష్యకారక పరిశ్రమలున్నాయని.. వీటిని నగ రం బయటకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 3 నెలల్లో 100 పరిశ్రమలను తరలిస్తామని, ఫార్మా సిటీకి మరో 400 పరిశ్రమలను తరలిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే 13 కంపెనీలను మూసేయించామని వెల్లడించారు. చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లే చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, కాలుష్యం బారిన పడుతున్నాయని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో గ్రేటర్‌లోని చెరువుల పరిరక్షణ, నాలాల శుద్ధి, కాలుష్యకారక పరిశ్రమల తరలింపుపై ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, పాషా ఖాద్రీ, కె.పి.వివేకానంద్, ఎం.కృష్ణారావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ‘జీహెచ్ఎంసీ పరిధిలో 185, హెచ్ఎండీఏ పరిధిలో 3,132 చెరువులున్నాయి. ఇవి మురుగు నీరు చేరి కలుషితమవుతున్నాయి. ఔటర్ రింగురోడ్డు లోపలి 40 చెరువులను శుద్ధి చేస్తున్నాం. మొదటి దశలో రూ.287 కోట్లతో 20 చెరువులు శుద్ధి చేస్తున్నాం’అని వివరించారు. 503 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశాం: కడియం అదనపు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కార్పొరేట్ కాలేజీలను నియంత్రించేందుకు ర్యాంకుల విధానం తొలగించి గ్రేడింగ్ విధానం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చైతన్య, నారాయణ కాలేజీలకు కొత్తగా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ‘వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న 190 కళాశాలపై దాడులు చేసి జరిమానా విధించాం. వీటిలో నారాయణ 61, చైతన్య 50, గాయత్రి కాలేజీలు 13 ఉన్నాయి’అన్నారు. రాష్ట్రంలో 503 రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది 13 కొత్త గనులు: జగదీశ్‌రెడ్డి సింగరేణి కాలçరీస్ కంపెనీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది 13 కొత్త గనులు ప్రారంభించనున్నట్లు ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. వాటిలో 6 భూగర్భ, 7 బహిరంగ గనులు ఉన్నాయన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రస్తుత బహిరంగ గనులను విస్తరించాలని యోచిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం వెలుపల కూడా సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు. 752 కోట్లతో వంతెనలు: తుమ్మల గోదావరి, కృష్ణ, మంజీర, మానేరు నదులపై అవసరమైన చోట వంతెనలు నిర్మిస్తున్నామని రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రధాన నదులపై రూ.752.75 కోట్లతో ఇప్పటికే 11 వంతెనలు నిర్మిస్తున్నామని చెప్పారు. -
వ్యాపారీకరణతో పెను ప్రమాదం
సందర్భం బొగ్గుగనుల జాతీయకరణ స్థానంలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గని విధానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రైవేట్ బొగ్గు సంస్థలు మళ్లీ రాజ్యమేలే పరిస్థితి ఏర్పడనుంది. ధరల నియంత్రణ కూడా వాటి పరమయ్యే ప్రమాదముంది. స్వాతంత్య్రం నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వ నిర్వహణలో 1956లో ఏర్పడిన జాతీయ బొగ్గు అభివృద్ధి సంస్థ బొగ్గు ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1945 నుంచే కార్యకలాపాలు సాగిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. భారతీయ బొగ్గు పరిశ్రమ 1950లలో ప్రభుత్వ యాజమాన్య కంపెనీల ఆజమాయిషీలో ఉండేది. ఇవ్వాళ సింగరేణి కాలరీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆజ మాయిషీలో 51:49 నిష్పత్తితో కొనసాగుతోంది. పెరుగుతున్న ఉక్కు పరిశ్రమ అవసరాల రీత్యా, నేలబొగ్గు నిక్షేపాలను వెలికితీసి వాడుకోవడంపై ఆసక్తి పెరి గింది. కానీ దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలకు తగినంత మూలధనాన్ని సమకూర్చే పనికి ప్రైవేట్ బొగ్గు గని యజమానులు పూనుకోలేదు. ప్రైవేట్ బొగ్గు గని యజమానులు అశాస్త్రీయ పద్ధతులను పాటించడం, గని కార్మికుల పని పరిస్థితి దిగజారడం వంటివాటిపై స్పందించిన కేంద్రప్రభుత్వం ప్రైవేట్ బొగ్గుగనులను జాతీయం చేయాలని నిర్ణయించుకుంది. ఇది రెండు రకాలుగా జరిగింది. 1971–72లో ఖనిజబొగ్గు గనులను, 1973లో థర్మల్ బొగ్గు గనులను కేంద్రప్రభుత్వం స్వాధీనపర్చుకుంది. 1971లో కోకింగ్ కోల్ మైన్స్ యాక్ట్ ద్వారా బొగ్గు గనులను, బొగ్గు ప్లాంట్లను జాతీయం చేసి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక 1973 కోల్ మైన్స్ యాక్ట్ ద్వారా 1971లో స్వాధీనపర్చుకున్న బొగ్గు గనులతోపాటు, 7 రాష్ట్రాల్లోని ఖనిజ, ఖనిజయేతర బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ అన్ని గనులనూ కోల్ మైన్స్ యాక్ట్ 1973 ద్వారా కేంద్రప్రభుత్వం 1973 మే 1న జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఖనిజయేతర బొగ్గు గనులను ఇలా 1973లో జాతీయం చేసి భారత బొగ్గుగని ప్రాధికార సంస్థ అధీనంలోకి తీసుకొచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థగా ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ను 1975లో స్థాపించారు. ఇది రాణిగంజ్ బొగ్గుక్షేత్రం లోని అన్ని ప్రైవేట్ కాలరీలను స్వాధీనపర్చుకుంది. దీంతో 29.72 బిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలతో ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ దేశంలోనే రెండో అతిపెద్ద బొగ్గు సంస్థగా ఆవిర్భవించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కోల్ మైన్స్ యాక్ట్ 2015ను పార్లమెంట్ 2015 మార్చిలో ఆమోదించింది. దీంతో బొగ్గుగనులను వేలం పాటద్వారా కేటాయించే అధికారం కేంద్రప్రభుత్వానికి దఖలు పడింది. అలాగే తమ సొంత సిమెంట్, ఉక్కు, విద్యుత్ లేక అల్యూమినియం ప్లాంట్ల వినియోగం కోసం బొగ్గుగనులను తవ్వుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ చట్టం అవకాశమిచ్చింది. ఇక 2018 ఫిబ్రవరి 20న భారత్‌లో ప్రైవేట్ సంస్థలు వాణిజ్య బొగ్గు పరిశ్రమలో ప్రవేశించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతించేసింది. దీంతో 1973 జాతీయకరణ తర్వాత వాణిజ్యపరమైన బొగ్గుగనులపై ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా సంస్థకున్న గుత్తాధిపత్యం చెదిరిపోయింది. దీంతో టన్ను ధరను ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి గనులు దక్కే విధానం అమలులోకి వచ్చేసింది. వాణిజ్య బొగ్గు గని తవ్వకాల దుష్ఫలితాలు : 1. బొగ్గు అత్యంత అరుదైన సరుకు కాబట్టి ఒకసారి నిల్వలు ఖాళీ అయ్యాయంటే తర్వాత బొగ్గు లభ్యం కాదు. గతంలో ప్రైవేట్ గని సంస్థలు లాభదాయకంగా ఉండే బొగ్గు నిక్షేపాలలోనే బొగ్గును తవ్వుకుని కఠిన పరిస్థితుల్లోని బొగ్గు గనుల జోలికి వెళ్లేవి కావు. 2. అనుమతించిన ప్రాంతంలోనే కాకుండా ప్రైవేట్ బొగ్గుగనుల యజమానులు అక్రమ తవ్వకాలకు పాల్పడే ప్రమాదముంది. 3. లేబర్ చట్టాల ఉల్లంఘనకు అవకాశమెక్కువ. 4. బొగ్గు తవ్వకాల రికార్డు లేకుండా ప్రైవేట్ కంపెనీలు జరిపే తవ్వకాలవల్ల ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలు, పన్నులు తగ్గిపోయే అవకాశం ఎక్కువ. 5. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడి, ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నంలో కార్మికుల సంఖ్యను ప్రభుత్వ బొగ్గు సంస్థలు తగ్గించడం అని వార్యం. కార్మికుల తొలగింపు మాత్రమే కాకుండా తాజా నియామకాలు గణనీయంగా తగ్గిపోతాయి. 6. బొగ్గు పరిశ్రమ క్రమేపీ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి, జాతీయకరణకు మునుపుటిలాగా ధరలను ఇతర నిబంధనలనూ వారే నియంత్రించే ప్రమాదం పొంచి ఉంది. 7. ప్రైవేట్ సంస్థల ప్రవేశంతో గనుల్లో ప్రమాదాలు పెరుగుతాయి. అధిక లాభాల యావలో ఇవ కార్మికుల భద్రతను గాల్లో కలిపేయడం తెలిసిందే. దీంతో మరిన్ని ప్రమాదాలు, మరిన్ని మరణ ఘట నలు తప్పవు. 8. కాలుష్య నిబంధనలను ఖాతరు చేయవు కాబట్టి ప్రైవేట్ బొగ్గుగని కంపెనీలు పర్యువరణానికి కలిగించే ప్రమాదం మామూలు స్థాయిలో ఉండదు. బి. జనక్ ప్రసాద్ వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ ఈ–మెయిల్ : janakprasad@rediffmail.com -
రండి.. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించాలని కోరారు. దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫుడ్ – 2018 ట్రేడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. రెండోరోజు బుధవారం ట్రేడ్‌షోలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఇప్పటికే అనేక సంస్థలు తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్‌విండో విధానంలో ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ అమలు చేస్తున్నామని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి లభ్యత, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక రాయితీలను కూడా కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాంసం ఉత్పత్తి రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో మన రాష్ట్రంలో పర్యటించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని మంత్రి వెల్లడించారు. మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రం మాంసం ఎగుమతి చేసేస్థాయికి ఎదగాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేశామని, వీటి ద్వారా రాబోయే రోజుల్లో మాంసం ఎగుమతి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించి మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు గత సంవత్సరం 22 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశామని వివరించారు. ట్రేడ్‌షోలో మంత్రితోపాటు డెయిరీ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.