న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ నవంబర్‌లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి.
బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 42 శాతం.
Comments
Please login to add a commentAdd a comment