PROGRESS
-
Narendra Modi: దేశ పురోభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉంది: మోదీ
చండీగఢ్: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) దేశ పురోగతికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పేదలు, దిగువవర్గాల అభ్యున్నతికి, సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం మోదీ ఇక్కడి ఫైవ్‌స్టార్ హోటల్లో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంతులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. మొత్తం 17 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మోదీ ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘సుపరిపాలన అందించడం, ప్రజలు జీవితాలను మెరుగుపర్చడంపై సు దీర్ఘంగా చర్చించాం. దేశ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పేదలు, అట్టడుగువర్గాలకు సాధికారతను కల్పించడానికి ఎన్డీయే కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితర ఎన్డీయే మిత్ర పక్షాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హరియాణా విజయా న్ని సానుకూలంగా మలచుకొని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను ఎదుర్కొనాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మొత్తం ఆరు తీర్మానాలను ఆమోదించినట్లు జేపీ నడ్డా తెలిపారు. ఎమర్జెన్సీ ఖండిస్తూ అమిత్ షా తీర్మానం పెట్టగా, రాజ్యంగం అమృతమహోత్సవంపై రాజ్‌నాథ్ తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. -
నవంబర్‌లో ‘మౌలికం’ పురోగతి 7.8 %
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ నవంబర్‌లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 42 శాతం. -
Uttarakhand Tunnel Crash: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: పది రోజులకుపైగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకుతెచ్చే డ్రిల్లింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక, డ్రిల్లింగ్ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద కొండను తవ్వుతుండగా లోపల 57 మీటర్లమేర సొరంగం కూలిందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 39 మీటర్లమేర తవ్వగా బుధవారం సాయంత్రానికి మరో ఆరు మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి ‘సహాయక’పైపును విజయవంతంగా జొప్పించారు. వీరి అంచనా ప్రకారం మరో 12 మీటర్లు తవ్వితే కారి్మకులు చిక్కుకున్న చోటుకు పైపు చేరుకోవచ్చు. దాదాపు మీటరు వ్యాసమున్న ఈ స్టీల్ పైపులోంచి కారి్మకులను బయటకు తీసుకురావాలని ప్రణాళిక సిద్దంచేసిన సంగతి తెల్సిందే. కార్మికులను బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతి డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనాస్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. 12 అంబులెన్సులను, 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధంచేశారు. మరీ అత్యవసరమనుకుంటే వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలీకాప్టర్‌ను తెప్పించనున్నట్లు సమాచారం. బగ్వాల్ పండుగ వారితోనూ చేసుకుందాం ‘‘డ్రిల్లింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. వారితో కలిసే స్థానిక బగ్లాల్ పండగ జరుపుకుందాం’’ అని ప్రధాని కార్యాలయం మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే ఘటనాస్థలి వ్యాఖ్యానించారు. దీపావళి పండగ తర్వాత స్థానిక గర్వాల్ ప్రాంతంలో బగ్వాల్ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. అక్కడి బగ్వాల్ను ఈ ఏడాది గురువారం జరుపుకుంటున్నారు. మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. సొరంగంలో కూలింది ఎక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో ఆ మార్క్ దాటి సొరంగం లోపలి వైపుగా కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడలై్పన శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు యతి్నస్తున్నారు. -
కాంగ్రెస్ వల్లే 'ఇండియా' పురోగతి తగ్గింది: నితీష్ కుమార్
పాట్నా: కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టిందని విమర్శించారు. అందుకే కూటమిలో దూకుడు తగ్గిందని చెప్పారు. బీజేపీ హటావో.. దేశ్ బచావో పేరుతో పాట్నాలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడానికి అందరం అంగీకరించామని తెలిపిన నితీష్ కుమార్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే ఇండియా కూటమి మరో భేటీ జరిగేలా కనిపిస్తోందని వెల్లడించారు. ఇండియా కూటమి కాంగ్రెస్ వల్లే దెబ్బతింటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే లోక్ సభ ఎన్నికలపై సన్నద్ధత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. కాగా.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొదటి సమావేశం బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగింది. రెండో సమావేశం బెంగళూరు వేదికగా నిర్వహించారు. ఇక మూడోసారి ముంబయిలో ఆగష్టు 31న భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. సీట్ల షేరింగ్‌లో పార్టీల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించింది. ఇదీ చదవండి: కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు -
బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్యంపై పురోగతి
న్యూఢిల్లీ: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చల్లో ఎంతో పురోగతి ఉన్నట్టు, చర్చలు త్వరలోనే ముగుస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భరత్వాల్ వెల్లడించారు. ఈ నెలలో రెండు దేశాల మధ్య జరిగే ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశంలో అపరిష్కృత అంశాలను కొలిక్కి తీసుకువచ్చేందుకు అవకాశం ఉందని చెప్పారు. ‘‘ఎఫ్‌టీఏలో 26 చాప్టర్లకు గాను, ఇప్పటికే 19 చాప్టర్లపై చర్చలు ముగిశాయి. ఇంకా కొన్ని అంశాలే మిగిలి ఉన్నాయి. జైపూర్‌లో జరిగే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ (టీఐడబ్ల్యూజీ) సమావేశానికి బ్రిటన్ బృందం రానుంది. అప్పుడు మిగిలిన అంశాలపైనా ఏకాభిప్రాయానికి వస్తామనే భావిస్తున్నాం’’అని సునీల్ భరత్వాల్ తెలిపారు. రెండు దేశాల మధ్య పెట్టుబడుల విషయమై విడిగా ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే యూకే బృందంలో ఒక వర్గం ఢిల్లీకి చేరుకుందని, మిగిలిన వరు 16వ తేదీ నుంచి వస్తారని భరత్వాల్ వెల్లడించారు. జైపూర్ చర్చల్లో పాల్గొనేందుకు బ్రిటన్ వాణిజ్య మంత్రి డీజీ ట్రేడ్ కూడా రానుండడం గమనార్హం. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం, ఆటో, విస్కీ, మేథో హక్కులు, సేవలకు సంబంధించిన అంశాలు రెండు దశాల మధ్య చర్చకు రానున్నాయి. వాణిజ్యం కోసమే కాదు.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కేవలం వాణిజ్య కోణంలోనే కాదని, దేశ వ్యూహాత్మక అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామని సునీల్ భరత్వాల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా కీలక ఖనిజాల సరఫరా దీనితో సాధ్యపడుతుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు కీలకమైన మినరల్స్ అవసరమని, వీటి సరఫరా కోసం భారత్ ఆ్రస్టేలియాతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పెరూ, చిలీలోనూ కీలక ఖనిజాల నిల్వలు దండిగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు 17 శాతం అప్
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) ఆగస్టు 10వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం పెరిగి రూ.5.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఇది 32 శాతానికి సమానం. ఆదాయపు పన్ను శాఖ ప్రకటన ప్రకారం, స్థూల వసూళ్లు 15.73 శాతం పురోగతితో రూ.6.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిలో రిఫండ్స్ రూ.69,000 కోట్లు. ఒక్క రిఫండ్స్ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 3.73 శాతం అధికం. 2023–24లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23తో పోల్చితే (రూ.16.61 లక్షల కోట్లు) ఈ పరిమాణం 9.75 శాతం అధికం. -
పటిష్టంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్న సమయంలో భారత ప్రభుత్వం తన భవిష్యత్ వృద్ధిపై ఆశాజనకంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చిందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో గురువారం నిర్మలా సీతారామన్ మాట్లాడారు. అమెరికా, యూకే, యూరోజోన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో ఆర్థిక సవాళ్ల మధ్య ఉన్నాయని, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా వినియోగదారుల డిమాండ్లు, వేతనాల స్తబ్దత వంటి సమస్యలనెదుర్కొంటోందని తెలిపారు. ‘‘ప్రపంచబ్యాంకు గణాంకాల ప్రకారం 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి 3%గా ఉంది. 2023 నాటికి అది 2.1శాతానికి పడిపోయింది. అదే సమయంలో మోర్గన్ స్టేన్లీ సంస్థ 2013లో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని పేర్కొంది. అదే సంస్థ తాజాగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ను గుర్తించింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే దీనికి కారణం’’ అని చెప్పారు. మిలేగా స్థానంలో మిల్గయా ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం గరీబీ హఠావో నినాదాన్ని సీతారామన్ ఎగతాళి చేస్తూ వాస్తవంగా పేదరికం తొలగిపోయిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో సమూల మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. ఒకప్పుడు మిలేగా (లభిస్తుంది) అన్న పదం స్థానంలో ఇప్పుడు మిల్ గయా (అన్నీ అందాయి) అని ప్రజలు చెప్పుకునే స్థాయికి పాలన వెళ్లిందన్నారు. అవినీతి, బంధుప్రీతితో దశాబ్దాల పాటు కాంగ్రెస్ సమయాన్ని వృథా చేసిందని, అన్ని సంక్షోభాల్ని అవకాశాలుగా అందిపుచ్చుకొని ముందుకు వెళుతున్నామన్నారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలో తమిళనాడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా తమిళంలో మాట్లాడారు. సెంగాల్ (రాజదండం) గురించి ఆమె ప్రస్తావిస్తూ దానిని ఎక్కడో మ్యూజియంలో పడేశారని అది తమిళనాడు ఆత్మగౌరవాన్ని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సెంగాల్‌ను లోక్‌సభలో ప్రతిష్టించి సముచిత స్థానాన్ని కల్పించారన్నారు. అదే సమయంలో ఆమె సభను పక్కదారి పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, లెప్ట్ పార్టీల ఎంపీలు వాకౌట్ చేశారు. నిండుసభలో జయలలిత చీర లాగారు మణిపూర్‌లో మహిళల అకృత్యాల గురించి సీతారామన్ ప్రస్తావిస్తూ కేవలం మణిపూర్ మాత్రమే కాదు మహిళల్ని అవమానపరిచే, కించపరిచే ఘటనలు రాజస్థాన్, ఢిల్లీ ఇలా ఏ రాష్ట్రంలో జరిగినా ఆందోళన కలిగిస్తాయన్నారు. ఈ ఘటనలు ఎక్కడ జరిగినా తీవ్రంగా పరిగణించాలన్నారు. మణిపూర్ అంశంపై ప్రసంగించిన డీఎంకే ఎంపీ కనిమొళికి ఈ సందర్భంగా ఒక ఘటనను గుర్తు చేయాలనుకుంటున్నాను అంటూ తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన పరాభవం గురించి ప్రస్తావించారు. ‘‘జయలలిత ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు 1989 మార్చి 25న పరమ పవిత్రమైన నిండు సభలో ఆమె చీరను లాగారు. డీఎంకే సభ్యులు అదంతా చూస్తూ జయలలితను గేలి చేశారు. ఆమెను చూసి నవ్వుకున్నారు. రెండేళ్ల తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలితను పరాభవించినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వారు ఇప్పుడు విపక్ష నేతలుగా ద్రౌపదికి చీర లాగడం గురించి మాట్లాడుతున్నారు’’ అని డీఎంకేకి చురకలు అంటించారు. -
అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్‌లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత.. ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ? రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు. గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.. గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్‌ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
సంక్షేమాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలను పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు మరింత కష్టాల్లోకి నెట్టాయని చెప్పారు. బిల్డింగులు, పరిశ్రమలు, వంతెనలు కడితేనే అభివృద్ధి కాదని, సామాన్యుడి జీవనం బాగుపడాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయం దిశగా పయనిస్తోందన్నారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెటర్ ఫర్ ఏపీ సొసైటీ పేరుతో పౌరులకు వాస్తవాలను తెలియజేసేందుకు రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ ప్రగతి నాడు–నేడు’ సమగ్ర నివేదికను శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజు వేసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, దేశానికి ఆర్థిక శక్తిని అందించడంలో ఏపీ కీలకంగా మారింది. ఆర్బీఐ, నీతి ఆయోగ్, సోషియో ఎకనామిక్ రిపోర్టు.. ఇలా అన్ని నివేదికల్లో నాలుగేళ్లుగా ఏపీ సాధిస్తున్న వృద్ధి కనపడుతోంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నాలుగేళ్లలో 3.26 లక్షల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చరిత్రలోనే ప్రథమం. ఫలితంగా పేదలు ఆర్థి క పరిపుష్టి సాధించారు. వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా 16.22 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులతో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఏపీలోనే లభిస్తోంది. పరిశ్రమల నెట్ అసెట్ విలువలో దక్షిణాదిన టాప్‌లో, ఫ్యాక్టరీల సంఖ్యలో దేశంలో నాలుగో స్థానం, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లలో రెండో స్థానం, ఎగుమతుల్లో 9 నుంచి 4వ స్థానానికి వచ్చింది. ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టే.. 2018–19లో తలసరి ఆదాయం రూ.1.50 లక్షలు ఉంటే ఇప్పుడు 2.30 లక్షలకు పెరిగింది. పేదరికం 6.6 శాతానికి దిగివచ్చింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించిన తీరు సీఎం జగన్ దార్శనికతకు అద్దం పట్టింది. సంక్షేమ పథకాలు లేకుంటే కోవిడ్ సమయంలో ప్రజా జీవనం తల్లకిందులయ్యేది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో పరిశ్రమలకంటే వ్యవసాయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది’ అని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో నేత్ర వైద్యులు బి.సుబ్బారావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డి్రస్టిక్ట్ గవర్నర్ రామలింగరాజు, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నగర అధ్యక్షుడు అశోక్ కుమార్, రిటైర్డు ప్రొఫెసర్ రెహా్మన్, సీనియర్ జర్నలిస్టు పీజీకే మూర్తి, సామాజికవేత్త అనంత హృదయరాజ్, గీతా విజన్ ట్రస్టు చైర్మన్ గీతా సుబ్బారావు, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో–కన్వినర్ ఎస్.కోటేశ్వరరావు, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిల్వెస్టర్, సామాజిక కార్యకర్త బి.జయప్రకాశ్ తదితరులు ప్రసగించారు. అంతకు ముందు కళాశాల విద్యార్థులకు ‘రాష్ట్రంలో నాడు–నేడు అభివృద్ధి’పై క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అసత్యాలే వారికి ఆయుధాలు సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ న్యూస్. ఏపీలో బాధ్యతాయుత మీడియా సైతం అభివృద్ధి లేదని ప్రచారం చేయడం సిగ్గుచేటు. నిత్యం పత్రికల్లో వచ్చే వార్తలను చూసి ఏపీ అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేశాం. మా పరిశీలనలో ఏపీ ఏ రంగంలోనూ వెనుకబడలేదు. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ నాలుగు రెట్ల పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తుంటే తప్పుడు ప్రచారం చేసే మీడియాను అందరూ ఎండగట్టాలి. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతోంది. పారిశ్రామిక రంగం వృద్ధి గతంలో 3.2 శాతం ఉంటే ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. ఒకప్పుడు 60 వేల ఎంఎస్ఎంఈలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1.10 లక్షలకు చేరింది. 10 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరిగింది. 600 పెద్ద పరిశ్రమల్లో 6 లక్షలకు పైగా ఉపాధి వచ్చింది. – మేడపాటి వెంకట్, అధ్యక్షుడు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సామాజిక మార్పుతోనే అభివృద్ధి సాధ్యం సామాజిక మార్పు ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యం. జీడీపీ పెరిగిందంటే ప్రజా జీవనం బాగుపడినట్టే. రాష్ట్రంలో పేదరికం తగ్గింది. అంటే సామాజిక న్యాయం కచ్చితంగా జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఏకంగా రూ.44 వేల కోట్లు సామాజిక న్యాయానికి ఖర్చు చేసింది. – ఏఆర్ సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు,నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం నిత్యం అప్పులంటూ విష ప్రచారం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తే.. సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. చంద్రబాబు రూ. 2.64 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.77లక్షల కోట్లు మాత్రమే అప్పు తెచ్చింది. కానీ, ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు రూ.10 లక్షల కోట్లు అప్పు అంటూ దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు. ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎన్నడూ లేవు. అప్పట్లో తెచ్చిన డబ్బంతా ఎటు పోయిందని ఎవరూ అడగట్లేదు. టీడీపీ హయాంలో సంపద పంపిణీ కొంత మంది చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్లింది. – పి.విజయ్‌బాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం సమానత్వం కోసం కృషి జరుగుతోంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఏపీలో సమానత్వం కోసం కృషి జరుగుతోంది. చంద్రబాబు 14 ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. సీఎం జగన్ రూ.21 వేల కోట్లతో 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నారు. అసైన్డ్ భూములకు హక్కులు ఇచ్చారు. అమరావతిలో ఇప్పుడు 50 వేల ఇళ్ల పట్టాలతో రూ.3 లక్షల కోట్ల ఆస్తి రాబోతోంది. – మాదిగాని గుర్నాథం, అధ్యక్షుడు, సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పేదల అభివృద్ధే నిజమైన సూచీ మనిషి జీవన ప్రమాణం పెరుగుదలే నిజమైన అభివృద్ధికి సూచీ. ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోంది. ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. సీఎం జగన్ మాత్రం పేదల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం సాగుతోంది. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి. – గౌతమ్‌రెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు హయాంలో దళితులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలంలే సబ్సిడీ వచ్చేది కాదు. కానీ, సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేశారు. ఒక్క కరోనాలోనే రూ. 2 వేల కోట్లు ఎంఎస్ఎంఈల కోసం ఖర్చు చేశారు. జగనన్న బడుగు వికాసం, ఇతర కార్యక్రమాల ద్వారా ఊపిరిపోశారు. దళితులను ఉద్యోగం చేసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు. – కాలే వెంకటరమణారావు, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు -
మేలో ‘తయారీ’ పటిష్టం
న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పురోగతిని కనబరిచినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ధ్ (పీఎంఐ) స్పష్టం చేసింది. సూచీ 31 నెలల గరిష్ట స్థాయిలో 58.7కు చేరినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఏప్రిల్‌లో సూచీ 57.2 వద్ద ఉంది. నిజానికి సూచీ 50పైన వుంటే వృద్ధి ధోరణిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ 50 పైన కొనసాగడం వరుసగా 23వ నెల కావడం గమనార్హం. -
పోలవరం ప్రాజెక్ట్: అడ్‌హక్ నిధుల విడుదలకు కేంద్రం సానుకూలత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై గురువారం సమావేశం జరిగింది. ఆరు అంశాలపై నిర్వహించిన ఈ సమావేశంలో సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, సలహాదారు వేదిరే శ్రీరామ్ , ఏపీ ఇంజినీర్ చీఫ్ నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు హాజరయ్యారు. పోలవరం పనుల పురోగతి, సమస్యలపై సమీక్షించామని, పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తవ్వాలన్నదే సంకల్పమని కేంద్రమంత్రి షెకావత్ అన్నారు. నిధుల విడుదలకు కేంద్రం సానుకూలం: ఏపీ ఇంజినీర్ చీఫ్ నారాయణరెడ్డి పోలవరానికి రూ.17,414 కోట్ల అడ్‌హక్ నిధులు విడుదల చేయాలని కోరామని, నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ఇంజినీర్ చీఫ్ నారాయణరెడ్డి తెలిపారు. తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, తొలిదశలోనే 100 శాతం డ్యాం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. జూన్ 2024 కల్లా పోలవరం పూర్తి చేయాలని కేంద్రం సూచించిందని నారాయణరెడ్డి అన్నారు. చదవండి: చంద్రబాబుది ఓ కాపీ పేస్ట్ బతుకు: సీఎం జగన్ -
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు. -
మార్చిలో తయారీ రంగం పరుగు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. అయితే సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సూచీ వృద్ధి బాటన కొనసాగడం వరుసగా 21వ నెల. ఉద్యోగ కల్పన విషయానికి వస్తే, మార్చిలో పేరోల్ సంఖ్యలో దాదాపు మార్పులేదు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
మంచి మాట: జీవన స్పృహ
స్పృహ అనేది ప్రాణం ఉన్న ప్రతిమనిషికీ ఉండాల్సిన వాటిల్లో అతిముఖ్యమైంది. స్పృహ ఉండాలన్న స్పృహ కూడా లేనివాళ్లు ఉన్నారు. మనిషి ఏ పరిస్థితిలోనూ ఏ రకమైన మత్తుకూ లోనుకాకూడదు. ఏ రకమైన మత్తుకూ మనిషి చిల్తై పోకూడదు. కొన్ని సందర్భాల్లో మనిషిని నిస్పృహ ఆవరిస్తూ ఉంటుంది. దానికి కొనసాగింపుగా నిస్తేజం పట్టి పీడిస్తూ మనిషిని అదిమేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోంచి మనిషి తెప్పరిల్లి తేరుకోగలగాలి. అందుకు స్పృహ అనేది తప్పకుండా ఉండాలి. స్పృహతో నిస్తేజాన్ని నిశ్వాసిస్తూ ఉత్తేజాన్ని ఉచ్ఛ్వాసిస్తూ ఉండాలి; సత్తేజంతో ఉండాలి. మనిషిలో లేదా మనిషికి తప్పకుండా ఉండాల్సింది స్పృహ. స్పృహ అన్నది లేకుండా పోతే మనిషి తన నుంచి తాను తప్పిపోతాడు; మనిషి తనకు తాను కాకుండా పోతాడు. ఒక మనిషి తన జీవనోపాధిని కోల్పోవచ్చు, తన ఆస్తుల్ని కోల్పోవచ్చు, తనవి అన్నవాటిని అన్నిటిని ఒక మనిషి కోల్పోవచ్చు కానీ స్పృహను మాత్రం కోల్పోకూడదు. దేన్ని అయినా వదులుకోవచ్చు కానీ స్పృహను వదులుకోకూడదు. మనిషికి ఏదైనా లేకుండా పోవచ్చు కానీ స్పృహ లేకుండా పోకూడదు. తనకు తాను ఉన్నంత వరకూ, తనలో రక్తం పారుతున్నంత వరకూ మనిషికి స్పృహ ఉండాలి. మనిషి రక్తంలో స్పృహ పారుతూ ఉండాలి. మనిషిలో రక్తంలా స్పృహ ప్రవహిస్తూ ఉండాలి. తనలో స్పృహ ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితంలోకి ప్రయాణం చేస్తూ ఉండగలడు. స్పృహ మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. స్పృహ వల్ల మనిషికి బయటా, లోపలా చలనం కలుగుతుంది. ఆ చలనం గతికి, ప్రగతికి కారణం అవుతుంది. స్పృహ లేనప్పుడు మనిషికి ఏదీ అందదు, మనిషివల్ల ఏదీ జరగదు. స్పృహలేకపోతే మనిషికి గతి, ప్రగతి ఉండవు. ‘జీవితం నిన్ను బలపరిచేందుకు సిద్ధంగా ఉంది; అందుకు ముందు నువ్వు జీవితానికి తలుపు తెరిచి ఉంచాలి‘ అని జర్మన్ తాత్త్వికుడు ఎక్‌హార్ట్ టోల్ తెలియజె΄్పారు. స్పృహ ఉన్నప్పుడు మాత్రమే మనం జీవితానికి తలుపు తెరిచి ఉంచగలం. లేదా మనకు ఉన్న స్పృహ మాత్రమే జీవితానికి తలుపు తెరిచి ఉంచగలదు. మత్తు జీవితాన్ని మూసేస్తుంది. మన మత్తును మనం వదిలించుకోవాలి. మనల్ని మన జీవితం బలపరచాలంటే మనకు స్పృహ కావాలి. ఎక్‌హార్ట్ టోల్ స్పృహ విషయంలో ఇంకా ఇలా స్పష్టతను ఇచ్చారు, ‘మనకు కలిగే ఆలోచనను స్పృహ అని అనుకోవడం తప్పు. ఆలోచన, స్పృహ పర్యాయపదాలు కావు. ఆలోచన అనేది స్పృహలోని ఒక చిన్న క్రియారూపం మాత్రమే. స్పృహ లేకుండా ఆలోచన ఉనికిలో ఉండదు; కానీ స్పృహకు ఆలోచన అవసరం ఉండదు’. మనం స్పృహ తోనే జీవనం చెయ్యాలి. మనకు ముందు కొందరికైనా సామాజిక స్పృహ ఉండి ఉండబట్టే ఇవాళ సమాజం ఉంది. సంగీతం, సాహిత్యం, ఇతర కళలపై స్పృహ ఉన్న కొందరివల్ల అవి చలామణిలో ఉన్నాయి. విద్య, వృత్తులు, పరిశోధనలు వంటివాటిపై మనకు పూర్వం ఉన్నవాళ్లకు స్పృహ ఉండబట్టే మనం మనుగడ చెయ్యగలుగుతున్నాం. స్పృహలేని మనిషి ఊపిరితో ఉన్న రాయి . మనం స్పృహతో మనుగడ చేద్దాం. రాళ్లల్లా కాదు మనుషులమై బతుకుదాం. – శ్రీకాంత్ జయంతి -
ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?
భారత స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం. బ్రిటిష్ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు? వలస వాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు దాదాపు నూట యాభై ఏళ్ళు సాగించిన మహోజ్జ్వల పోరాటాల ధారలో ఒక మజిలీ 1947 ఆగస్ట్ 15. ఆ విస్తృత పోరాట సంప్రదాయం ఏ ఒక్క పార్టీదో, ఏ ఒక్క ప్రజా సమూహానిదో, ఏ ఒక్క నినాదానిదో, ఏ ఒక్క ప్రాంతానిదో, ఏ ఒక్క ఆశయానిదో కాదు. అది ఈ దేశ ప్రజలందరూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కావాలనే విశాల ఆశయానిది! పద్ధెనిమిదో శతాబ్ది చివరి నుంచే ఆదివాసులు ప్రారంభించిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలూ; రైతుబిడ్డలైన సైనికులూ, రైతాంగమూ, సంస్థానాధీశులూ, రెండు ప్రధాన మతాలకూ చెందిన ప్రజలందరూ ఐక్యంగా పాల్గొన్న ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటమూ; ఆ తర్వాత ముప్ఫై సంవత్సరాలకు ప్రారంభమైన మధ్యతరగతి జాతీయోద్యమమూ, ఇరవయ్యో శతాబ్ది తొలి అర్ధభాగంలో సాగిన ఎన్నో విప్లవోద్యమాలూ, భిన్నమైన రాజ కీయ ఉద్యమాలూ, ఆ ఉద్యమాలలో పాల్గొన్న అన్ని ప్రజాసమూ హాలూ, అన్ని ప్రాంతాలూ... జాతీయోద్యమంలో భాగమే. ► అది ప్రధా నంగా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. చాలాచోట్ల అది స్థానిక భూస్వామ్య దోపిడీ, పీడనలను కూడా వ్యతిరేకించిన ఉద్యమం. భారత సమాజం అనుభవిస్తున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం అది. ► బ్రిటిష్ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఈ ఏడున్నర దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధి గణాంకాలు చూపి, ‘‘స్వతంత్ర భారత ప్రగతి’’ గురించి చెప్పడానికి అవకాశం ఉంది. భారత ఉపఖండంలోని ఇరుగు పొరుగు దేశాలలో ప్రజా స్వామ్యం అనుభవించిన అవాంతరాలను చూపి, భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదనే అవకాశమూ ఉంది. వలసానంతర భారత సమాజ గమనాన్ని అర్థం చేసుకోవ డానికీ, విశ్లేషించడానికీ ఎన్నో సూచికలూ ప్రాతిపదికలూ ఉన్నప్పటికీ, ప్రగతి, ప్రజాస్వామ్యం అనే రెండు సూచికలే కీలకమైనవి. ► బ్రిటిష్ వలస పాలన తొలగిపోవాలని భారత ప్రజలు కోరు కోవడానికీ, ఉద్యమించడానికీ మూల కారణం వలసవాదం భారత సంపదలను దోచుకుపోతున్నదనే అవగాహన. విస్పష్టమైన గణాం కాల ఆధారంగా దాదాభాయి నౌరోజీ 19వ శతాబ్ది చివరి రోజుల్లో ప్రతిపాదించిన ‘వనరుల తరలింపు’ సిద్ధాంతాన్ని దాదాపుగా జాతీయోద్యమంలోని అన్ని పాయలూ అంగీకరించాయి. భారత సమాజ వనరులతో స్థానికంగా సంపద పోగుపడడానికీ, తద్వారా సామాజిక ఆర్థికాభివృద్ధి జరగడానికీ వలస పాలన అవకాశం ఇవ్వడం లేదని జాతీయోద్యమ నాయకులందరూ భావించారు. వలస పాలన భారత సమాజ అభివృద్ధిని అడ్డుకుంటున్నదనీ, అందువల్ల దాన్ని తొలగించి స్వరాజ్యం సాధించినప్పుడే స్వతంత్ర, భారత ప్రజా ప్రభుత్వం భారత వనరులను స్థానికాభివృద్ధికి వినియోగించగలుగు తుందనీ జాతీయోద్యమం భావించింది. ► 75 ఏళ్ళ క్రితం వలస పాలకులు వెళ్లిపోయారు. భారత ప్రజల మైన మనం మన స్వతంత్ర రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ప్రణాళికా బద్ధ ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని రచించుకున్నాం. కుంటుతూనో, నడుస్తూనో, పరుగులతోనో పన్నెండు ప్రణాళికలు అమలయ్యాయి. ప్రణాళిక అంటేనే సోషలిజం చిహ్నమేమో అని భయంతో గంగ వెర్రులెత్తే రాజకీయపక్షం అధికారం సాధించి, ప్రణాళికా సంఘాన్నీ, ప్రణాళికలనూ రద్దు చేసి పారేసి ఏడేళ్ళు గడిచాయి. ప్రణాళిక లేకుం డానే భారతదేశాన్ని పరివర్తన చెందిస్తానని కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. అనేక గ్రంథాలు కాగలిగిన ఈ సుదీర్ఘ చరిత్రలో భారత సమాజం సాధించిన ఆర్థిక, సామాజిక అభివృద్ధి ఎంత? ► జాతీయాదాయం 3 లక్షల కోట్ల రూపాయల నుంచి 140 లక్షల కోట్ల రూపాయలకు, ఆహార ధాన్యాల ఉత్పత్తి 5 కోట్ల టన్నుల నుంచి 30 కోట్ల టన్నులకు, ఎగుమతులు ఒక బిలియన్ డాలర్ల నుంచి 38 బిలియన్ డాలర్లకు, రోడ్డు మార్గాలు 4 లక్షల కి.మీ. నుంచి 64 లక్షల కిలోమీటర్లకు పెరిగాయని... అటువంటి గణాంకాలతో మనం సాధించిన ప్రగతి గురించి చెప్పుకోవచ్చు. కానీ నాణానికి ఈ బొమ్మతో పాటే బొరుసు ఉంది. ఇక్కడ ఎన్నో రెట్లు పెరిగినట్టు కనబడుతున్న అంకెల పొట్ట విప్పి చూస్తే ఆ పెరుగుదలలోని ఒడుదొడుకులు బయట పడతాయి. ఉదాహరణకు జాతీయాదాయం లెక్కలో ఒక వంద మందిని మినహాయిస్తే, హఠాత్తుగా మన జాతీయాదాయం సగానికి పడిపోతుంది. ఆ వందమంది ఆదాయం 55 కోట్ల మంది ఆదాయం కన్నా ఎక్కువ. ► అలాగే ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఆరు రెట్లు పెరుగు దల, జనాభా పెరుగుదల నాలుగు రెట్ల కన్న తక్కువే ఉన్నప్పటికీ, ఇప్పటికీ దేశంలో ఆకలిచావులు, అర్ధాకలి కొనసాగుతూనే ఉన్నాయి. ఎగుమతుల్లో 38 రెట్ల పెరుగుదల కనబడుతున్నప్పటికీ, దిగుమ తులు ఇదే కాలంలో ఒక బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు పెరిగి, విదేశీ వాణిజ్య లోటు విపరీతంగా హెచ్చింది. ఎగుమతి దిగుమతుల వ్యత్యాసం 2 కోట్ల రూపాయల నుంచి 20 వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఈ 75 ఏళ్ళలో ఆర్థిక, సామాజిక అసమానతలు, అవిద్య, అనారోగ్యం, నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలు గణనీయంగా మారలేదు. ఏ ఒక్క అభివృద్ధి గణాంకం తీసుకున్నా, ఆ వెలుగు వెనుక పెనుచీకటి కనబడుతూనే ఉన్నది. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు? ► అంత మాత్రమే కాదు, ఆ నాడు ఒక్క బ్రిటన్‌కు వలసగా ఉన్న భారతదేశం ఇవాళ, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాల తర్వాత అనేక పెట్టుబడిదారీ దేశాలకు ముడిసరుకులు అందించే వనరుగా, వాళ్ల సరుకులు అమ్ముకునే మార్కెట్‌గా మారిపోయింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ షరతులకూ, దిగుమతుల కోసం ఆధారపడిన అన్ని దేశాల అవమా నకర ఆదేశాలకూ తలొగ్గి, సార్వభౌమాధికారాన్నే పలుచబరచుకునే స్థితి వచ్చింది. ఆధునికత, విద్య, రవాణా, సమాచార సంబంధాలు, పారిశ్రామికాభివృద్ధి వంటి రంగాలలో అంకెల్లో మాత్రమే చూస్తే బ్రిటిష్ వలస పాలన కూడ ఇటువంటి ప్రగతి సాధించినట్టే కనబడు తుంది. కానీ, సుపరిపాలన ఉన్నా సరే, స్వపరిపాలనకు ప్రత్యా మ్నాయం కాదు అని జాతీయోద్యమం కోరుకుంది. ► ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలనీ, పరాయి పాలన పీడన తొలగిపోవాలనీ కోరుకుంది. సంపద తరలింపు గురించి మాట్లాడిన నౌరోజీయే ‘‘బ్రిటిషేతర పాలన’’ అన్నాడు. అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రా తృత్వం వంటి నినాదాల పుట్టుకకు కారణమైన పెట్టుబడిదారీ విధానం వలస వాదంగా, సామ్రాజ్యవాదంగా మారి, ఆ నినాదాల స్ఫూర్తిని వదిలేసి, తమ వలస ప్రజలకు స్వేచ్ఛ లేని స్థితి కల్పించిందని అర్థం. ఆర్థికాభివృద్ధి కన్నా ముఖ్యం స్వాతంత్య్రం అని సాగిన జాతీయోద్యమం 1947 ఆగస్ట్ 15న ఆ స్వాతంత్య్రాన్ని సాధించానని భావించింది. ► కానీ, ఆ తరువాతి ఇన్నేళ్ళ చరిత్రను అవలోకిస్తే, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే విశాల భావనను ఐదు సంవత్సరాలకు ఒకసారి మొక్కుబడిగా జరిగే ఎన్నికలకు కుదించారు. ఆ ఎన్నికలు అక్రమాలకు నిలయాలయ్యాయి. ఒకసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతే ఐదేళ్ళలో ఏమైనా చేసే అధికారం చేజిక్కుతున్నది. ప్రభుత్వాధికారం వ్యక్తిగత సంపదలు పెంచుకునే సాధనంగా మారిపోయింది. ఉదాత్తంగా రాసుకున్న రాజ్యాంగ ఆదేశాల అమలు కన్నా ఉల్లంఘన ఎక్కువ జరుగుతున్నది. ప్రజా భాగస్వామ్యంతో నడవవలసిన పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌన సాక్షులుగా మిగిలి పోయారు. బహుళత్వానికి నిలయమైన దేశంలో నెలకొనవలసిన, బలపడవలసిన పరస్పర సహాయ సహకార సంఘీభావాల స్థానంలో కుల, మత, ప్రాంత, భాషా విద్వేషాల రాజకీయాలు చెలరేగి సమాజ అస్తిత్వమూ, భవిష్యత్తూ ప్రమాదకర స్థితికి చేరాయి. వలస పాలకులు తయారు చేసిన న్యాయవ్యవస్థ, భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి స్వల్పమైన మార్పులతో కొనసాగుతున్నాయి. ► వలస పాలకులు సృష్టించిన రాజద్రోహ నేరం ఇప్పటికీ అట్లాగే ఉంది. జాతీయోద్యమం తీవ్రంగా వ్యతిరేకించిన రౌలట్ చట్టాన్ని మించిన దుర్మార్గమైన ప్రజావ్యతిరేక చట్టాలు లెక్కలేనన్ని స్వతంత్ర భారత పాలనలో అమలులోకి వచ్చాయి. ‘దేశమనియెడు దొడ్డ వృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయి/ నరుల చమటను తడిసి మూలం/ ధనం పంటలు పండవలెనోయి’ అని గురజాడ అప్పారావు ‘దేశభక్తి’ గీతంలో రాసి నప్పుడు మొదటి రెండు పంక్తులు ప్రజాస్వామ్యానికీ, బహుళత్వ సామరస్యానికీ , చివరి రెండు పంక్తులు సంపద అభివృద్ధికీ, సమాన పంపిణీకీ సూచనలు. ఈ 75 ఏళ్లలో భారతదేశం అనే దొడ్డ వృక్షం ఎన్నో పూలు పూసింది, ఫలాలూ ఇచ్చింది, నరుల చెమటతో ధనం పంటలూ పండించింది. కానీ ఆ ప్రగతి ఫలాలు దక్కిందెవరికి? ఆ ధనం నింపిన బొక్కసాలెవరివి అనే ప్రశ్నలు ఇంకా భారత సమాజం ముందు నిలిచే ఉన్నాయి. ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు -
మేలో మౌలిక రంగం భారీ వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మేనెల్లో (2021 మే నెలతో పోల్చి) భారీగా 18.1 శాతం పురోగతి సాధించింది. ఈ స్థాయి ఫలితం నమోదుకావడం 13 నెలల తర్వాత ఇదే తొలిసారి. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ గ్రూప్ వెయిటేజ్ మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో దాదాపు 44 శాతం. మే నెల్లో బొగ్గు (25.1 శాతం), క్రూడ్ ఆయిల్ (4.6 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (16.7 శాతం), ఎరువులు (22.8 శాతం), సిమెంట్ (26.3 శాతం) విద్యుత్ (22 శాతం) రంగాలు మంచి పురోగతి సాధించాయి. అయితే సహజ వాయువు ఉత్పత్తి 7 శాతం క్షీణించగా, స్టీల్ ఉత్పత్తి 15 శాతం పడింది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 13.6 శాతంగా నమోదయ్యింది. -
వారెవ్వా ఐపాస్... ప్రగతి పట్టాలపై పారశ్రామిక పరుగు
కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామికరంగం మళ్లీ ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతోంది. గత ఏడేళ్లలో పరిశ్రమల ఏర్పాటులో మేడ్చల్ అగ్రభాగాన ఉండగా..రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర ఖజానాకు మూడో వంతు ఆదాయాన్ని సమకూర్చడమేగాకుండా నిరుద్యోగులకు ఉపాధిలోనూ ముందు వరుసలో ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే–2021లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే టాప్‌లో నిలిచింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ అండ్ సెల్ప్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ ఐపాస్) విధానంతో ఉమ్మడి జిల్లాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత (2014–21 మధ్య) జిల్లాకు రూ.29,488 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఏర్పాటు చేసిన 5,362 కంపెనీల వల్ల 2,62,018 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. అంతేకాదు నగరశివారులో ఏర్పాటు చేసిన ఈ సంస్థల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూ రాయి. ఫలితంగా జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ కొనసాగుతోంది. పరిశ్రమల ఏర్పాటు లో మాత్రం మేడ్చల్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఏడేళ్లలో మేడ్చల్ జిల్లాలో 3,805 కంపెనీలు ఏర్పాటు కాగా, రంగారెడ్డిజిల్లాలో 1,137 కం పెనీలు వచ్చాయి. వీటి ద్వారా 1,60,382 మందికి ఉపాధి లభించింది. ఉత్పత్తుల ఎగుమతుల్లో మేడ్చల్ 25.52శాతంతో మొదటి స్థానంలో ఉంటే, అదే రం గారెడ్డి 16.97 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన టీఎస్–ఐపాస్‌కు ఆన్లైన్ దరఖాస్తులతో అన్ని రకాల అనుమతులు ఏకగవాక్ష విధానంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే జారీ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఫలితంగా దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సహాకాలు ప్రకటిస్తుంది. ఫలితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మచ్చుకు కొన్ని.. ఇప్పటికే విమానాలు, హెలిక్యాప్టర్ విడిభాగాల ఉత్పత్తిని చేపడుతున్న జిల్లా త్వరలోనే రైల్వేకోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రం కానుంది. శంకర్పల్లి మండలం కొండకల్ వద్ద మేద సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు చేసింది. ఏటా 500 రైల్వే కోచ్‌లు, 50 లోకోమోటివ్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనుంది. అంతేకాదు 2,200 మందికి ఉపాధి కల్పించనుంది. ట్రయల్ రన్లో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మహేశ్వరం మండలం కేసీతండాలో ఎలక్ట్రిక్ హార్ట్‌వేర్ పార్క్‌లో రూ.300 కోట్లతో విప్రో కన్జ్యూమర్ కంపెనీ స్థాపించింది. 900 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇటీవల ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. ఐపాస్‌తో పెరిగిన వేగం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుత పారిశ్రామిక వాడలను మరింత విస్తరించడంతో పాటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మంఖాల్, మహే శ్వరం, షాబాద్, తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఎంఎస్ఎంఈ పార్కులు, ఫుడ్ పార్కులు, ప్లాస్టిక్ అండ్ లెదర్ పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నాం. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నాం. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రవాణా, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ, అధికారి (చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్) -
శతమానం భారతి.. లక్ష్యం 2047
భారతదేశ ఆర్థిక వ్యవస్థను రెండు ప్రధాన దశలుగా పరిగణించాలి. ఒకటి 1947 నుంచి 1990 వరకు. రెండవది 1991లో మొదలైన అర్థిక సంస్కరణలు, సరళీకరణల దశ. తొలి దశలో బ్రిటిష్ పాలకుల వల్ల క్షీణించిన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు జవహర్లాల్ నెహ్రూ పారిశ్రామికీకరణపై భారీ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు. 1991లో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పీవీ నరసింహారావు ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించి మూలధనాన్ని సమీకరించడం, సాధారణ ప్రజలకు సైతం ఆ వాటాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించడం మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి తోడ్పడింది. కోవిడ్ ప్రభావం వల్ల ఈ రెండేళ్లలో కొన్ని ఒడిదుడుకులు సంభవించినప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆశాజనకంగా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల అన్నారు. చదవండి: (దేశమాత స్వేచ్ఛ కోరి.. తిరుగుబాట్లు.. ఉరికొయ్యలు) 2021లో దేశం ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంది. 1991 జూలై 24న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ రోజును నేటికీ కొందరు ఆర్థిక వేత్తలు భారతదేశ ఆర్థిక స్వాతంత్య్ర దినంగా అభివర్ణిస్తున్నారు. దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచడం, లైసెన్సింగ్ రాజ్‌ను ముగించడం, కంపెనీలకు పర్మిట్ల నుంచి విముక్తి కల్పించడం, ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులు వంటి లక్ష్యాలతో నాటి బడ్జెట్‌కు రూపకల్పన జరిగింది. సాఫ్ట్వేర్ ఎగుమతి కోసం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 హెచ్హెచ్సి కింద పన్ను మినహాయింపు కూడా ప్రకటించారు. ఇవన్నీ ఈ ముప్పై ఏళ్లలో అనేక సత్ఫలితాలను ఇచ్చాయి. రానున్న 25 ఏళ్లలో ఆర్థిక పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రస్తుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
మత్స్యరంగంలో ఏపీ అద్భుత ప్రగతి
సాక్షి, అమరావతి: మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తమ్ రూపాలా ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ మత్స్య రంగం గణనీయమైన పురోగతి దిశగా అడుగులేస్తోందని అభినందించారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును ఏపీ మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్నబాబులకు కేంద్ర మంత్రి ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.10 లక్షల చెక్కుతో పాటు ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చదవండి: AP: శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ అనంతరం పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా అందించడంతో పాటు డీజిల్ సబ్సిడీ పెంపు, ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌ను ఆక్వా రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడుల ఎగుమతుల్లో పెరుగుదల నమోదైందని చెప్పారు. 8 ఫిషింగ్ హార్బర్లు, రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, నాలుగు ఫ్లోటింగ్ జెట్టీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. 70 ఆక్వా హబ్‌లు, 14 వేలకు పైగా అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. మత్స్య రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మిలియన్ మెట్రిక్ టన్నులున్న మత్స్య ఉత్పత్తులను.. 22 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి మురుగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకానమీకి విస్తృత వ్యాక్సినేషన్ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని ఆర్థిక మంత్రిత్వశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలు పటిష్టంగా ఉండడంతోపాటు, వేగవంతంగా వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతుండడం, పండుగల సీజన్ వంటి అంశాలు దేశంలో డిమాండ్ రికవరీ పటిష్టతకు దారితీస్తున్నట్లు తెలిపారు. డిమాండ్–సరఫరాల్లో అంతరం తగ్గుతోందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరగుపడుతున్నాయని కూడా ఆర్థిక వ్యవస్థ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశ ఆర్థిక పునరుద్ధరణలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్, వ్యవస్థాగత సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆయా కార్యక్రమాలు, చర్యల వల్ల వ్యాపార అవకాశాలు, డిమాండ్, వ్యయాలు పెరుగుతున్నాయి. ► అధిక విస్తీర్ణంలో రబీ సాగు, మెరుగైన రిజర్వాయర్ స్థాయిలు, ఎరువులు, విత్తనాల విషయంలో రైతులకు తగినంత లభ్యత వంటి అంశాలు వ్యవసాయ రంగం పురోగతికి దోహద పడుతోంది. ఆర్థిక పునరుద్ధరణలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ► వ్యవసాయ–ఎగుమతుల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ విభాగంలో 22 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆయా అంశాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్‌లో ట్రాక్టర్లు, ద్విచక్ర, త్రి చక్ర వాహనాల విక్రయాలు పటిష్ట రికవరీని సూచిస్తున్నాయి. ► రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి, మార్కెట్లో తగినంత లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), బాండ్ల రేట్ల స్థిరత్వం వంటి అంశాలు ఎకానమీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ► బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రయోజనం వ్యవస్థలో ప్రతిబింబిస్తోంది. 2020 ఫిబ్రవరి– 2021 సెప్టెంబర్ మద్య తాజా రూపీ రుణాలపై సగటు రుణ రేటు 130 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిడం సానుకూలాంశం. ► భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని 2020–21 ఎకనమిక్ సర్వే పేర్కొంటోంది. పలు రేటింగ్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాలు 9–10 శాతం శ్రేణిలో ఉన్నాయి. -
లక్ష్యసాధనకు స్వీయ నియంత్రణ
నేటితరంలో యువతను సునిశితంగా పరికిస్తే, కొందరిలో ఒక రకమైన నిరుత్సాహ ధోరణి కనబడుతుంది. ‘‘నేను పెద్ద చదువులు చదువుదామని అనుకున్నా, కానీ అది నాకు సాధ్యం కాని పని కదా’’, ‘‘నేను సివిల్ సర్వీస్ అంటే విపరీతంగా అభిమానిస్తా.. కానీ నాకది సాధ్యం కాదు సుమా..’’ వంటి సంభాషణలు తరచు వింటూ ఉంటాం. కానీ, ఆ ధోరణిలో మాట్లాడే యువతీ యువకుల మాటలను విని వదిలేయడం కాకుండా, వీలున్నంత వరకు వారిని సంస్కరించడానికి యత్నించాలి. మానవుడు సాధించలేనిది ఏముంది? మహితమైన, జగతికి హితమైన ఎన్నో కార్యాలను మన తోటి మానవులే సాధించారు. వారికి, సామాన్యమైన రీతిలో సాగేవారికి తేడా ఏమిటి? కారణాలు ఎన్నైనా, ప్రధాన సూత్రం ఒక్కటే..!! వారు తమపై తమకు అపురూపమైన రీతిలో నమ్మకాన్ని కలిగి ఉండడమే గాకుండా, తగిన రీతిలో పరిశ్రమించడమనేదే, వారు కోరుకున్నది సాధించగలగడానికి సహకరించిన విశేషమైన అంశం. వ్యక్తి అస్థిత్వాన్నీ, గుర్తింపును నిర్వచించే వాటిలో మొదటిది వారికి తమపై తమకున్న అవగాహన. వర్తమానంలో తానే స్థితిలో ఉన్నాడు, భవిష్యత్తులో తాను చేరాలనుకునే ఉన్నతస్థానం ఏమిటి అన్నది స్థిరంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆ విధంగా తనను తాను ముందుగా అంచనా వేసుకోవడం ప్రతివారికీ అవసరం. స్వీయ పరిశీలన చేసుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం వ్యక్తి పురోగతి సాధించడంలో తీసుకోవవలసిన అత్యంత సమంజసమైన విధిగా నిస్సందేహంగా చెప్పవచ్చు. విద్యలోనూ, విషయ గ్రాహ్యతలోనూ అంతగా రాణించే శక్తిలేని మనిషి, తాను ఎంత దృఢమైన రీతిలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని భావించినా, సాధారణ పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే, వారికున్న మానసిక బలం, శారీరక బలం కార్యసాధనకు సహకరించాలి కదా..!! అయితే, ఇది దుస్సాధ్యమైన విషయంగా పరిగణించవలసిన పనిలేదు. మనం అనుకున్నదానికంటే, మన అవగాహన గుర్తించినదానికంటే, ఎంతో అధికమైన శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. కృతనిశ్చయంతో ‘‘నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలను’’ అని భావించి, ఉద్యమిస్తే, ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమైన విషయమేమీ కాదు. అంతే కాదు.. అదే కృషిని త్రికరణశుద్ధిగా కొనసాగిస్తే, ఉన్నతస్థానంలో నిలకడను సాధించి నిలబడగలగడమూ కష్టమేమీ కాదు. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతి వ్యక్తీ స్వీయ క్రమశిక్షణ పాటించడం అవసరం. ఆత్మనియతితో తమపై తాము విధించుకుని అమలుపరచే జీవన విధానమే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి. స్వీయనియంత్రణ అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తీ తాను రోజుకు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం లేదుకదా..!! ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి ఎటువంటి దురలవాట్లకూ బానిస కాకుండా ఉండడమూ స్వీయ నియంత్రణలో అంతర్భాగమే..!! తనను తాను సరిచేసుకుని ముందుకు సాగే విధానంలో సాధకుడు సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు ఇవ్వకూడదు. సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణిని సూచించే ఒక చిన్న ఉదంతాన్ని ప్రస్తావించుకుందాం. ఒకచోట ఒక వక్త చక్కని ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు. ఇద్దరు మిత్రులు ఆ ఉపన్యాసాన్ని వినగోరి అక్కడకు వచ్చారు. వక్త తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే, ఆయన మెడలో ఉన్న గులాబీ దండలోని రేకులు ఒక్కటొక్కటిగా రాలి పడుతున్నాయి. మిత్రుల్లో ఒకడు రెండోవాడితో ‘‘చూశావా.. ఆయన వేసుకున్న దండలోని గులాబీరేకులు ఎలా రాలి పడుతున్నాయో..!! కాసేపటికి రేకులన్నీ రాలిపోగా చివరికి లోపలున్న దారం ఒక్కటీ ఆయన మెడలో మిగులుతుంది’’ అంటూ ఎకసెక్కపు ధోరణిలో నవ్వాడు. రెండోవ్యక్తి అతని మాటలకు ప్రతిస్పందిస్తూ, ‘‘నువ్వు ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తు్తన్నావు మిత్రమా.. ఆయన అమృతమయ వాక్కులకు పరవశించి, ఆ గులాబీ రేకులు పూజిస్తున్న చందాన, పవిత్రమైన ఆయన పాదాలను తాకుతున్నాయని భావించవచ్చు కదా’’ అన్నాడట. మనిషిలోని సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణులకు ఈ మిత్రుల మాటలే అద్దం పడతాయి. సమస్త శక్తీ మనలోనే నిబిడీకృతమై ఉంది. మనసారా పరిశ్రమిస్తే, తలపెట్టిన ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేయగలడు. అద్వితీయమైన తన చేతలతోనే దైవత్వాన్నీ ప్రదర్శించగలడు. నిద్రావస్థను వదిలి జాగ్రదావస్థలోకి రాగలిగితే మానవమేధ దారిలోఎదురయ్యే అన్ని అవరోధాలను తొలగిస్తుంది... అన్ని అవసరాలనూ తీర్చగల, అన్ని ఆకాంక్షలనూ ఈడేర్చగల అపూర్వమైన శక్తి మనిషిలో దాగి ఉంది. అయితే, ఆ శక్తి తనలో ఉందని గ్రహించగలగడమే వివేకవంతుడు చేయగలిగిన పని. జీవితంలో లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది ఓటమి పాలవ్వడం లేదా ఆశించిన గమ్యాన్ని అందుకోకపోవడానికి స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే కారణం. జీవులందరూ ఒకేరకమైన రీతిలో జనించినా, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే అసాధారణమైన విజయాలను అందుకోవడానికి, తాము అనుకున్న ఎత్తుకు ఎదగడానికి కారణం వారు పాటించే స్వీయ నియంత్రణ లేదా క్రమశిక్షణ అని చెప్పవచ్చు. ప్రతి మనిషీ తన లక్ష్యాన్ని సాధించడానికి కొందరినుంచి స్ఫూర్తిని పొందుతూ ముందుకు సాగుతాడు. తనకు స్ఫూర్తిదాతయైన వ్యక్తి ఆధ్యాత్మికంగా శక్తిమంతుడు కావచ్చు, లేదా ఒక జనహితం కోసం కృషి చేసే నాయకుడో, సమాజ సేవకుడో లేక క్రీడాకారుడో కావచ్చు. అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్న వారో, తమ చేతలద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి నుంచైనా స్ఫూర్తిని పొందవచ్చు. తాను పొందిన అమేయమైన స్ఫూర్తిని, అమలుపరచడంలో ఎడతెగని ఆర్తిని కనబరచి, త్రికరణశుద్ధిగా కృషి చేస్తే, భవిత సాధకునికి తప్పనిసరిగా దీప్తిమంతమవుతుంది. –వ్యాఖ్యాన విశారద+ .++000000000 వెంకట్ గరికపాటి -
దసరాలోగా అందరికీ తాగునీరు: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: దసరాలోగా అందరికీ తాగునీరు అందిస్తామని రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ పట్టణ ప్రగతిలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రైతుబజార్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 100 పడకల ఆస్పత్రిలో రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేశామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచిందని.. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి, ఆదర్శంగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. -
పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. వెబ్సైట్ నిలిపివేత! -
రెండేళ్లు పూర్తి చేసుకున్న రాచకొండ కమిషనరేట్
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నర కోట్లతో నూతన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటయి రెండేళ్లు పూరైనా సందర్భంగా కమిషనరేట్ పరిధిలో సాధించిన విజయాలను మహేశ్ భగవత్ వివరించారు. ‘రాచకొండ కమిషనరేట్ విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దది. కమిషనరేట్ పరిధిలో 3,787 సిబ్బంది పనిచేస్తుండగా.. 3,119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం చేపడుతాం. 2017 జూన్ నుంచి 2018 జూన్ వరకు 20, 817 కేసులు నమోదయ్యాయి. 4,243 ఆర్థిక నేరాలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఏడాది కాలంలో షీ టీమ్ బృందాలు 591 కేసులు నమోదు చేశాయి. మరో 700 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 40కు పైగా బాల్య వివాహాలను అడ్డుకున్నాం. 760 కుటుంబ సమస్యలను పరిష్కరించాం. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 210 మంది చిన్నారులను రక్షించాం. మైనర్ నేరస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టి తిరిగి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. నాలుగున్నర కోట్లతో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. మేడిపల్లిలో 56 ఎకరాల్లో కమిషనరేట్ భవన నిర్మాణం జరగనుంద’ని మహేశ్ భగవత్ తెలిపారు. -
‘సుడా’.. గడబిడ..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) గతేడాది అక్టోబరు 24న అవతరించింది. మార్చి 15న ‘సుడా’కు చైర్మన్‌గా జీవీ రామకృష్ణారావు నియామకం జరిగింది. ‘సుడా’ ఏర్పడి ఎన్నిమిదిన్నర నెలలు కావస్తున్నా.. చైర్మన్ నియామకం జరిగి రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటికే పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ ప్రక్రియ సాగడం లేదు. వీటితోపాటు ‘సుడా’కు ఇంకా విధివిధానాలే ఖరారు కాలేదు. కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో లేఅవుట్, భవన నిర్మాణాల అనుమతులు మంజూరు వ్యవస్థ డోలాయమానంలో పడింది. ‘సుడా’ ఏర్పాటుతో అనుమతుల జారీ ప్రక్రియ తమ పరిధిలోకి రాదని డీటీసీపీ అధికారులు పేర్కొంటున్నారు. ‘సుడా’లో విలీనమైన గ్రామాలకు సంబంధించి పంచాయతీలూ ఇదే మాట చెబుతున్నాయి. దీంతో సుడా పరిధిలో విచ్చలవిడిగా అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో ‘సుడా’ ఏర్పడి ఎనిమిదిన్నర నెలలు.. కమిటీకి చైర్మన్‌ను నియమించి రెండున్నర నెలలు కావస్తున్నా కార్యకలాపాలు సాగకపోవడంపై చర్చ జరుగుతోంది. పాలకవర్గంపై ప్రతిపాదనలకు మోక్షం ఏదీ..? శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా)కు రెండున్నర నెలల క్రితం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జీవీ రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. అయితే.. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అంటూ సుడా పాలకవర్గం కోసం ఆశావాహులు ఎదురుచూస్తూనే ఉన్నారు. సుడా డైరెక్టర్ల నియామకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఆశావాహులు ఎక్కువ కావడంతో పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేస్తూ డైరెక్టర్ పదవులు పొందేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ద్వారా ‘సుడా’ కమిటీలో చేరేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అయితే.. చివరకు కమిటీ తుది నిర్ణయ బాధ్యతలను మాత్రం స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భుజాలపై వేయగా.. ఆయన అన్నివర్గాల వారికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే 13 పేర్లతో ఒక కమిటీని తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలిసింది. ఈ జాబితాపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి ఆమోదించినట్లు కూడా సమాచారం. కాగా.. అందరి సమ్మతంతోనే నేడో రేపో పాలకవర్గాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వ జీవో జారీ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నా.. ఇంకా జీవో విడుదల కాలేదు. ప్రతిపాదిత కమిటీలో పేర్లు ఇవే.. సుడా చైర్మన్‌తోపాటు 13 మంది డైరెక్టర్లను నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పెద్దల సూచనల మేరకు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు, మధ్యలో వచ్చి అంకితభావంతో పనిచేస్తున్న వారి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఒక్కో సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కమిటీని ప్రతిపాదించినట్లు సమాచారం. కమిటీలో తోట మధు, ఐలేందర్‌యాదవ్, భూక్య లావణ్య, షెక్ యూసుఫ్, చీటి రాజేందర్రావు, కామారపు శ్యాం, బల్ల ఆంజనేయులు, వంగర రవీందర్, నేతి రవికుమార్, లక్కాకుల మోహన్‌రావు, కాటం సురేష్, వొల్లాల శ్రీనివాస్‌గౌడ్, చికిరి శోభ పేర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే.. ఇందులో కూడా మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ‘సుడా’ స్థబ్దతతో భారీగా ఆదాయానికి గండి.. కరీంనగర్ నగర శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా సుడాలో విలీనమైన కరీంనగర్ పట్టణం, సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లిహవేలి, లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేఅవుట్లు వెలుస్తున్నాయి. వీటి పరిధిలో వందల ఎకరాల వెంచర్లకు సంబంధించి సుమారు 70 దరఖాస్తులు అనుమతులకు నోచుకోక పెండింగులో ఉన్నాయి. భారీ సంఖ్యలో భవన నిర్మాణ దరఖాస్తుల అనుమతులు అటకెక్కాయి. లేఅవుట్ రుసుం ఎకరానికి రూ.25 వేలకు పైబడి ఉంటుంది. భవన నిర్మాణానికి రూ.5 లక్షల వరకూ ఉంది. ఐదు నెలలుగా అనుమతుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో కోట్ల రూపాయల ప్రభుత్వానికి గండి పడుతోంది. నాలా ఫీజు చెల్లించి లేఅవుటు వేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున వ్యయం చేసి భూ అభవద్ధి చేసిన స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ఆస్కారం లేక గగ్గోలు పెడుతున్నారు. సుడా పరిధిలోకి వచ్చే ప్రతిపాదిత గ్రామాలు.. కరీంనగర్ పట్టణం, సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లిహవేలి, లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి, ఇరుకుల్ల, మగ్దుంపూర్, చెర్లబూత్కూర్, చామన్‌పల్లి, తాహెర్ కొండాపూర్, పకీర్‌పేట్, జూబ్లీనగర్, ఎలబోతారం ,మానకొండూర్: మానకొండూర్, సదాశివపల్లి, బగ్గయ్యపల్లి, శ్రీనివాస్‌నగర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, అన్నారం, చెంజర్ల, లింగాపూర్ తిమ్మాపూర్: తిమ్మాపూర్, అల్గునూరు, పొరండ్ల, రేణికుంట, కొత్తపల్లి (పీఎస్), నుస్తులాపూర్, నేదునూర్, పచ్చునూర్, మన్నెంపల్లి. గన్నేరువరం: చెర్లాపూర్, హన్మాజిపల్లి, గోపాల్పూర్, పి.కొండాపూర్, పోత్గల్, హస్నాపూర్, యాశ్వాడ, గునుకుల కొండాపూర్, గన్నేరువరం, పారువెల్లి, కాశీంపెట, మైలారం, మాదాపూర్, జంగపల్లి.రామడుగు: వన్నారం, కొక్కెరకుంట, దేశ్రాజ్పల్లి, కిష్టాపూర్, వెదిర, వెలిచాల.చొప్పదండి:కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట, చాకుంట గంగాధర: ఒద్యారం. -
అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం
► మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ జన్నారం(ఖానాపూర్): అన్నివర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. మండలంలోని జన్నారం జామ మజీద్‌లో శుక్రవారం ఆయన ముస్లింలను కలిశారు. ఈ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొంతం శంకరయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అన్నారు. పండుగ శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కలిసిమెలసి ఉండాలన్నారు. పార్టీ అధిష్టానానికి కట్టుబడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ నందునాయక్, సురేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
‘నేను’ లయమైతేనే కైవల్యం
ఆత్మీయం నీరు ఏ పాత్రలో వుంచితే ఆ పాత్ర ఆకారం పొందుతుంది. మనస్సు కూడా ఏ వస్తువుపై లగ్నమైతే ఆ వస్తువు స్వరూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది. అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో విద్యుద్దీపంలో తీగె వెలిగినట్టే, ధ్యానంతో యోగి మనసు తేజోమయమవుతుంది. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో యోగి దేహం, శ్వాస, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం సమీకృతమై విలీనమవుతాయి. అప్పుడే అనిర్వచనీయమైన చైతన్యానుభూతిని ఆస్వాదిస్తాడు. ధ్యానస్థితిలో ధ్యానం చేయడం, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యాన వస్తువు వుంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ‘ధ్యానం చేస్తున్నాను’ అనే భావన పోతుంది. «ధ్యాన వస్తువు, ధ్యానం చేసే వ్యక్తి మిగులుతారు. ధ్యానం తీవ్రమైన కొద్దీ ధ్యాన వస్తువు కూడా లయమైపోతుంది. ద్యానం చేసే వ్యక్తి మాత్రమే మిగులుతాడు. ‘నేను ధ్యానం చేస్తున్నాను’ అనేది పోతే తప్ప సమాధిస్థితి ఉచ్ఛస్థితికి చేరదు. ఆ అహంకారం ‘నేను’గా చివరి వరకూ వుంటుంది. ఎవరికైతే ‘నేను’ కూడా లయమైపోతుందో, అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే స్వయంప్రకాశంగా మిగులుతుంది. అదే నిజమైన సమాధి, కైవల్యం. -
ప్రగతి పనుల్లో ‘తమ్ముళ్ల’ జాతర
– సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనుల్లో బినామీలుగా అవతారం – నాణ్యతకు పాతర.. ప్రేక్షక పాత్రలో పంచాయతీరాజ్ ఇంజినీర్లు గాలి ఉన్నప్పుడే తూర్పు పట్టాలనుకున్నారేమో. ప్రగతి పనుల్లో టీడీపీ తమ్ముళ్లు జాతర చేసుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్లుగా మారి అభివృద్ధి పనుల ఖజానాను కొల్లగొడుతున్నారు. ప్రమాణాలకు పాతర వేసి పదికాలాల పనులను మూన్నాళ్ల ముచ్చట చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన ఇంజినీర్లు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కమీషన్లతో సరిపెట్టుకుని నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగాన్ని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో గ్రామీణుల్లో ఆందోళనలు నెలకొంది. - మంత్రాలయం పనుల వివరాలు : మంత్రాలయం నియోజకవర్గంలో 72 పంచాయతీలు ఉండగా రూ.8.27 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మాణం చేపట్టారు. 14వ ఆర్థిక ప్రణాళిక నిధులు, ఉపాధి హామీ పథకం నిధులతో కలిపి రూ.4 కోట్లు, ఎస్డీపీ, ఎస్డీఎఫ్, జెడ్పీ నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.4.27 కోట్ల పనులు చేశారు. మంత్రాలయం మండలంలో రూ.2 కోట్లు, కోసిగిలో 2.21 కోట్లు, పెద్దకడబూరులో 1.52 కోట్లు, కౌతాళంలో రూ.2.54 కోట్లతో పనులు కానిస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ 50 శాతం, ఇతర నిధులు 50 శాతంతో పనులు జరుగుతున్నాయి. నాణ్యతకు పాతర ప్రగతి పనులకు అధికార పార్టీ నాయకులు చీడపురుగుల్లా తయారయ్యారు. బినామీలుగా మారి గ్రామాల్లో జరిగే ప్రతి పనిలో తమ మార్క్ చాటుకుంటున్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీల పనులు బినామీలుగా చేసేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతు సర్పంచుల గ్రామాల్లోని పనుల్లోనూ వారు అధికారం చెలాయిస్తున్నారు. గుడికంబాళి, మంత్రాలయం, కౌతాళం, చిలకలడోణ, డి.బెళగల్, కోసిగి గ్రామాల్లో చేసిన పనులను పరిశీలించగా నాణ్యత ప్రమాణాలు మచ్చుకైనా కానరావడంలేదు. మంత్రాలయం మండల కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి నిధి రూ.5.10 కోట్లతో అండర్‌గ్రౌండ్ నిర్మాణం పనులు చేపట్టారు. రామచంద్ర నగర్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు అధికారపార్టీ నాయకులు బినామీలుగా చేసేశారు. నెలలోపే 20 అడుగులకో చోట రోడ్డు అడ్డుగా బీటలు వారింది. గుడికంబాళిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం సర్పంచు బినామీగా చేస్తున్నారు. నిర్మాణం దశలోనే ఎక్కడపడితే అక్కడ సీసీ రోడ్డు రాలి పడిపోయింది. కౌతాళం, డి.బెళగల్, చిలకలడోణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. ప్రేక్షక పాత్రలో ఇంజినీర్లు పవర్‌కు తలొగ్గారో.. కమీషన్లతో కక్కుర్తిపడ్డారో తెలియదుగానీ పంచాయతీరాజ్ ఇంజినీర్లు పనులు పర్యవేక్షించడం మానేశారు. పనులు వైపు కన్నెత్తి చూడకుండానే బిల్లులు చేసేస్తున్నారు. పదికాలాల పాటు మన్నిక ఉండాల్సిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నా చలించని వైనం. రోడ్ల నిర్మాణాల్లో ఇష్టారాజ్యంగా ప్రమాణాలు పాటిస్తున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు కనుసన్నల్లోనే పనులు సాగిపోతున్నాయి. ఇంజినీర్ల నిర్లక్ష్యంపై సర్వత్రా గ్రామాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి: బొగ్గుల తిక్కన్న, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సేవాదళ్ జిల్లా కార్యదర్శి ప్రగతి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు చూడాలి. నాణ్యత పాటించని పనులకు బిల్లులు చేయకుండా చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకులు బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి నాణ్యతకు నీళ్లొదలడం సరికాదు. పనుల నాణ్యతపై ప్రత్యేక కమిటీలు వేసి విచారణ చేపట్టాలి. పనులు పర్యవేక్షిస్తున్నాం: మోహన్, పంచాయతీరాజ్ ఏఈ, కౌతాళం ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నాం. నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యత పాటించకపోతే బిల్లులు నిలిపేస్తామని హెచ్చరిస్తున్నాం. -
చింతలపూడేనా!
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పథకం పనులు 28 శాతం మాత్రమే పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. భూసేకరణ, నష్టపరిహారంపై అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా రైతులతో కలెక్టర్ జరిపిన చర్చలు బెడిసికొట్టడంతో పథకం ఎప్పటికి పూర్తవుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొవ్వూరు : చింతలపూడి ఎత్తిపోతలు.. మూడేళ్ల క్రితం పూర్తి కావాల్సిన మెట్ట రైతుల ఆశా పథకం ఇదీ.. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి పథకం పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ జిల్లా మంత్రి పీతల సుజాత ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మెట్ట రైతులను మభ్యపెట్టె ప్రయత్నమేననే అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 2014 మార్చి నాటికే ఈ పథకం 25 శాతం పనులు పూర్తయిపోయాయి. దీనికి రూ.344 కోట్లు ఖర్చయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 నెలల కాలంలో మూడు శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటి వరకు భూసేకరణతో కలిపి కేవలం రూ.714కోట్ల విలువైన పనులే పూర్తయ్యాయి. వీటిలో సగానికిపైగా పనులు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందే పూర్తయ్యాయి. 2009 ఫ్రిబవరిలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం మంజూరైంది. రూ.1,701 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరి నాటికి పథకం పూర్తికావాలనేది అప్పటి లక్ష్యం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తగిన చొరవ చూపక పోవడంతో మెట్ట రైతుల ఆశలు నెరవేరలేదు. పనుల్లో ఏదీ పురోగతి ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో జనవరి నెలాఖరు నాటికి 230 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 107లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వారు. ప్రధాన కాలువపైన మార్గమధ్యలో 110 నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. వీటిలో 18 మాత్రమే పూర్తి చేశారు. మరో ఐదు స్ట్రక్చర్లు పురోగతిలో ఉన్నాయి. ప్ర«ధాన కాలువలో 97.5ల„ýక్ష ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు చేయాల్సి ఉండగా 66.6లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం పనులు చేశారు. పిల్ల కాలువలకు సంబంధించి ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి ఉంటే కేవలం పదివేల క్యూబిక్ మీటర్లు మట్టి పనులు మాత్రమే చేశారు. రెండో ప్యాకేజీలో 60 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి ఉండగా 29.84 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారు.ఈ ప్యాకేజీలో 84 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా ఒక్కటీ పూర్తి కాలేదు. కేవలం ఆరు నిర్మాణాలు మాత్రం పురోగతిలో ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటి వరకు రూ.714 కోట్లు ఖర్చు చేస్తే దీనిలో రూ.525.34 కోట్లు విలువైన నిర్మాణ పనులు, రూ.188.93 కోట్లు భూసేకరణ వెచ్చించారు. మొదటి ప్యాకేజీ పనులు 31శాతం, రెండో ప్యాకేజీ పనులు 20 శాతం పూర్తి చేశారు. కొలిక్కిరాని భూ సేకరణ పథకం నిర్మాణానికి 17,042.61 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 7,725 ఎకరాల భూమి మాత్రమే సేకరించారు. ఇంకా 9,317 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనిలో 6,683 ఎకరాల అటవీ భూమి, 2,634 ఎకరాల జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది. ప్రధానంగా అటవీ భూములకు ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంది. భూసేకరణలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నష్టపరిహారంగా ఒక్కోచోట ఒక్కో ధర నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా శనివారం రైతులతో కలెక్టర్ జరిపిన చర్యలు బెడిసి కొట్టడంతో పనుల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేజ్–2 ప్రకటనలతో సరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పేజ్–2 ప్రకటనలకే పరిమితమైంది. జిల్లాలో 2.68 లక్షల ఎకరాలతో పాటు కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏడాది క్రితం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ఇది కార్యరూపు దాల్చడం లేదు.రూ.3.208 కోట్ల రివైజ్డ్ అంచనాలతో మొత్తం ప్రాజెక్టు విలువను రూ.1,701 కోట్ల నుంచి రూ.4,909 కోట్లకు పెంచారు. దీనికి పరిపాలనా ఆమోదం లభించినా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంత వరకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఎర్రకాలువ పరిధిలో 27వేల ఎకరాలు, తమ్మిలేరు ప్రాజెక్టు పరిధిలో 24 వేల ఎకరాలు, కొవ్వాడ ప్రాజెక్టు పరిధిలో 17వేల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు జల్లేరు జలాశయం సామర్థ్యాన్ని 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో తిరువూరు, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల పరిధిలో సాగర్ ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. పరిపాలనా ఆమోదం లభించినా టెండర్ల ప్రక్రియకు నోచుకోవడం లేదు. ఫేజ్–1లో చేపట్టిన పనులకు సంబంధించి తొమ్మిదేళ్ల క్రితం అంచనాలు రూపొందించారు. అప్పటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెండర్లు ఖరారు చేశారు. అదే రేట్లను అనుసరించి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఫేజ్–2లో ప్రస్తుత లెక్కల ప్రకారం టెండర్లు పిలిస్తే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఫేజ్–1లో పనులకూ ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలన్న వాదన తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
ఆ మూడింటిలో అద్భుత ప్రగతి
విద్యుత్, నీటిసరఫరా,శాంతి భద్రతల పరిరక్షణలో సఫలమయ్యాం • అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆదరించారు • నీటి సరఫరాలో పైపులైన్ల లీకేజీని అరికట్టేందుకు చర్యలు • రూ.502 కోట్ల విలువైన 465 కిలోమీటర్ల పైపులైన్ పనులు పెండింగ్‌లో.. • హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణపై కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మూడు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం అద్భుత ప్రగతిని సాధించిందని, అందుకే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు తమను మనస్ఫూర్తిగా ఆదరించారని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా, సక్రమమైన నీటి సరఫరా, శాంతిభద్రతల నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మజ్లిస్ సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, మొహ్మద్ మోజంఖాన్ నగరంలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. నగరంలో మొత్తం 1,334 కిలోమీటర్ల పైప్‌లైన్ మార్పిడి పనులు అవసరమవుతాయని 2013–14లో చేసిన ఓ అధ్యయనంలో తేలిందని, అందులో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరీ అధ్వానంగా ఉన్న 178 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశామని చెప్పారు. నగరం నడిబొడ్డున, శివార్లలో, పాతబస్తీలో కలిపి ఇంకో 698 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు పురోగతిలో ఉన్నాయని, ఇంకో 465 కిలోమీటర్ల మేర రూ.502 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందని చెప్పారు. దశలవారీగా పైప్లైన్ల పరిస్థితిని బట్టి, బోర్డులో ఉన్న నిధులు, ప్రభుత్వ బడ్జెట్‌ను అంచనా వేసుకుంటూ ముందుకెళుతున్నా మని తెలిపారు. నగర ప్రజలకు శుద్ధమైన, నాణ్యమైన మంచినీటిని ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అక్బరుద్దీన్ మాట్లాడుతూ నగరానికి వస్తున్న నీటిని సక్రమంగా వినియోగించుకోలేక పోవడానికి పైపులైన్ల లీకేజీలే కారణమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అసలైన హైదరాబాద్‌లో నివసించే అసలైన తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లు, ప్రజలు నగరంలో హాయిగా ఉంటున్నారని ఆరోపించారు. దీనికి స్పందించిన మంత్రి హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వారంతా తెలంగాణవాసులేనని, అందరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కాలుష్య కారక పరిశ్రమల తరలింపు 2017 కల్లా పూర్తి రెడ్, ఆరెంజ్ కేటగిరీలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించే కార్యక్రమంలోని మొదటి దశను 2017 చివరికల్లా పూర్తి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మొత్తం ఈ కేటగిరీలో 1,545 పరిశ్రమలను గుర్తిం చామని, అందులో 1,160 పరిశ్రమలను తొలిదశలో తరలిస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ సభ్యులు కేపీ వివేకానంద, సుధీర్‌రెడ్డి, అంజయ్య శాటిలైట్ టౌన్ షిప్‌లపై అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ రాజధాని చుట్టూ 13 శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తున్నా మని, వాటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలో ఉందని చెప్పారు. 330 కిలోమీటర్లతో ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డుకు జాతీయ రహదారి హోదా కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరిం చిందన్నారు. -
జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో అసుపత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో జయ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని, అయితే మరికొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని తెలిపారు. ఎయిమ్స్ వైద్యులతో పాటు అపోలో బృందం ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తున్నట్లు అపోలో వర్గాలు తెలిపాయి. జయకు చికిత్స అందిస్తున్న వైద్యుల వివరాలతో పాటు పలు విషయాలను హెల్త్ బులెటిన్‌లో అపోలో వర్గాలు వెల్లడించాయి. ఆమెకు రెస్పిరేటరీ(శ్వాసక్రియ) సపోర్ట్‌తో పాటు.. అవసరమైన యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్టులు, రెస్పిరేటరీ ఫిజిషియన్స్‌తో పాటు డయబెటాలజిస్ట్‌లు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సీఎంకు అందిస్తున్న చికిత్సపై ఎయిమ్స్ కు చెందిన వైద్య నిపుణుల బృందం కూడా పరీక్షించింది. అమ్మకు మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిమ్స్ వైద్య బృందం ఈ నెల 7వ తేదీ వరకూ ఆస్పత్రిలోనే ఉండి పర్యవేక్షించనుంది. గతవారం 30న సీఎం జయకు లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. రిచార్డ్ బాలే ఈ రోజు కూడా జయ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని, అయితే మరికొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని రిచార్డ్ బాలే తెలిపారు. -
ప్రగతి పథంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.134కోట్ల టర్నోవర్ బ్యాంకు చైర్మన్ ప్రదీప్‌రావు కాశిబుగ్గ: నగరంలో 21ఏళ్ల క్రితం ఒకే బ్రాంచితో ప్రారంభమైన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ప్రస్తుతం ఆరు బ్రాంచిలతో విస్తరించి, రూ.134 కోట్ల టర్నోవర్‌తో ప్రగతి పథంలో సాగుతోందని బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు. నగరంలోని స్వర్ణ ఫంక్షన్ ప్యాలెస్‌లో ఆదివారం ప్రదీప్‌రావు బ్యాంకు 20వ వార్షిక నివేదికను ప్రవేశపెట్టగా, వాటాదారులు, ఖాతాదారుల చప్పట్లతో ఆమోదించారు. ఈ సందర్భంగా బ్యాంకు పురోగతి, చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, వాటాదారులకు గల సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం వరకు బ్యాంకు రూ.82.75 కోట్ల డిపాజిట్లు, రూ.51.40 కోట్ల రుణాల మంజూరుతో రూ.134 కోట్ల టర్నోవర్ సాధించినట్లు తెలిపారు. కాశిబుగ్గలో సొంత భవనాన్ని నిర్మించామని, ఆర్బీఐ అనుమతితో 4 ఏటీఎంలను ఏర్పాటు చేసి, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బ్యాంకు పురోభివృద్ధికి వాటాదారులు, ఖాతాదారులు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు తోట జగన్నాథం, డైరెక్టర్లు పాలారపు కృష్ణమూర్తి, వేణుగోపాల్, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్‌కుమార్, గౌసొద్దీన్, నరేష్కుమార్, పవన్‌కుమార్, పాపిరెడ్డి, రమేష్‌గౌడ్, సృజన్‌కుమార్, హరినాథ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న జిల్లాలతోనే పురోగతి
కేసీఆర్‌ది సాహసోపేత నిర్ణయం భూపాలపల్లి జిల్లా ఏర్పాటు హర్షణీయం శాసన సభాపతి మధుసూదనాచారి పట్టణంలో విజయోత్సవ ర్యాలీ భూపాలపల్లి : జిల్లాల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని శాసన సభాపతి, స్థానిక ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూ పాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం ముసాయిదా విడుదల చేయడాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి, అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. ఆచార్య జయశంకర్ 1952 నుంచి చనిపోయేంత వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతి యుత పోరాటం చేశారని, రాష్ట్రాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకొని అతడి కలలను నెరవేర్చాలన్నారు. భూపాలపల్లి, ములుగు, మంథని ప్రాంతాలను కలుపు తూ ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాను ప్రకటించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నవనీతరావు, సిరికొండ ప్రదీప్, సిరికొండ ప్రశాంత్, నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, వైస్‌చైర్మన్ ఎరుకల గణపతి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, గోనె భాస్కర్, రేగుల రాకేష్, కెక్కెర్ల శ్రీనివాస్, మేకల రజిత, ముం జాల నిర్మల, చందుపట్ల స్వప్నలత, బేతోజు వజ్రమణి, తాటి హైమావతి పాల్గొన్నారు. -
పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక కమిటీలు
మాడుగుల: గ్రామాల్లో పారిశుధ్యం మెరుగకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేస్తున్నామని డీపీవో కృష్ణకుమారి అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులు పరిశీలన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పారిశుధ్య కమిటీల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 550 క్లస్టర్లు ఉండగా వీరిలో 376 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులు, గుమస్తాలు ఉన్నారని చెప్పారు. జిల్లాలో రూ.40 కోట్ల ఇంటి పన్నుల వసూలకు ఇప్పటివరకు రూ.40 కోట్లు మాత్రమే వసూలైందన్నారు. విద్యుత్ బకాయిలు రూ.13 కోట్లలో రూ.7 కోట్లు వసూలైందన్నారు. ఆక్రమణకు గురవుతున్న పంచాయతీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఈవో సత్యనారాయణను ఆదేశించారు. పంచాయతీ షాపింగ్ కాంప్లెక్సు అద్దె వసూలుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయనను ఆదేశించారు. వారపు సంతల్లో గిడ్డంగులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈవోపీఆర్డీ కొంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
పనుల ప్రగతిపై ప్రతి నెలా నివేదిక
పాడేరు: ఏజెన్సీలో అభివద్ధి పనుల పురోగతిపై ప్రతి నెలా 5న నివేదికను రూపొందించనున్నట్టు ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎల్.శివ శంకర్ వెల్లడించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా అభివద్ధి పనులకు ఈ నివేదిక దోహదపడుతుందన్నారు. అభివద్ధిపై ప్రజలకు ఒక అవగాహన కలుగుతుందన్నారు. మన్యంలో డయేరియా ప్రబలుతున్నందున దీని నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా వారపుసంతల్లో కుళ్లిన చేపలు, నిల్వ ఉంచిన మాంసం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు తనిఖీలు చేపడతామన్నారు. ఇందుకు డిప్యూటీ తహసీల్దార్, వెటర్నరీ అసిస్టెంట్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో బందాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మన్యంలో ఇప్పటి వరకు ఐదు డయేరియా మరణాలను గుర్తించామని తెలిపారు. హుకుంపేట మండలం డూరువీధిలో ఒకరు, అడ్డుమండలో ఇద్దరు, డుంబ్రిగుడలో ఒకరు, చింతపల్లి మండలంలో ఒకరు చనిపోయినట్టు వివరించారు.సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి అన్ని పీహెచ్‌సీలకు అవసరమైన మందులు సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు. పీహెచ్‌సీల్లో అన్ని మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావును ఆదేశించారు. పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగు పరచాలని సర్పంచ్‌లు, కార్యదర్శులకు సూచించారు. గతంతో పొలిస్తే మన్యంలో 41 శాతం వ్యాధుల తీవ్రత పెరిగిందన్నారు. గిరిజన గ్రామాల్లో మలేరియా, డయేరియా సోకితే ఐటీడీఏ హెల్ప్‌లైన్ 1800 4250 0004 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి 10.30 వరకు డయల్‌యువర్ పీవోకు గ్రామీణ సమస్యలపై సమాచారం అందించ వచ్చన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో కుమార్, ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. సక్రమంగా మెనూ అమలు గిరిజన విద్యార్థులకు అన్యాయం జరగకుండా మెనూ సక్రమంగా అమలు చేయాలని పీవో అన్నారు. ఏటీడబ్ల్యూవోలు, గురుకులం ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. అనంతగిరి మండలంలో విద్యార్థులకు గుడ్డు పెట్టడం లేదని పత్రికల్లో వార్తలపై ఆరాతీశారు. గ్యాస్‌పొయ్యి పాడైపోవడంతో మధ్యాహ్నం భోజనం పెట్టడం లేదని అనంతగిరి ఏటీడబ్ల్యూవో వివరించారు. సీఆర్టీలు, పార్ట్ టైమ్ లెక్చరర్లు భర్తీపై ఆరాతీశారు. గిరిజన విద్యార్థులకు అంటువ్యాధులు సోకకుండా ఆశ్రమాలు, గురుకులాలు, కేజీబీవీల్లో వైద్యశిబిరాలు నిర్వహించే బాధ్యత ఏటీడబ్ల్యూవోలదే అన్నారు. కళాశాలల్లో లైబ్రరీ సదుపాయాలు కల్పించాలన్నారు. ఎంసెట్, ఎన్డీఏ, డీఎడ్ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీ రియల్ను ఉంచాలన్నారు. 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుని విద్యార్థులకు స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ పేరు మీద క్విజ్‌పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల, 11 మండలాల గురుకులం ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. -
శిశువు అదృశ్యం కేసులో కీలక ఆదారలు
-
ఎవరికీ దొరక్కుండానే ‘పోతాడా..?’
కవర్ స్టోరీ ‘డాన్ కో పకడ్నా ముష్కిల్ భీ నహీ... నా ముమ్కిన్ భీ హై...’ అంటూ అమితాబ్ బచ్చన్ ‘డాన్’ సినిమాలో స్థిరంగా, నిదానంగా పలికిన ఈ డైలాగుకు అప్పట్లో థియేటర్లలో ఈలలు మోగాయి. ‘డాన్’లంటే సమాజంలో అబ్బురపాటుతో కూడిన ఆసక్తి అప్పటి నుంచే మొదలైంది. డాన్లను పట్టుకోవడం అంతటి అసాధ్యమైన విషయమా? అనే సందేహాలు కూడా... డీ ఫర్ డాన్... డీ ఫర్ ధందా... డీ ఫర్ డేంజర్... అంతేకాదు, డీ ఫర్ దావూద్ కూడా! ముంబైని గడగడలాడించిన డాన్ దావూద్ ఇబ్రహీం జాడ కనుగొనడానికి ఇప్పటికే వందలాది కోట్లు ఖర్చు చేసిన భారత్ ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు అంతర్జాతీయ భద్రతా సంస్థలూ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతీ సాధించలేకపోయాయి. ఇప్పుడు అతడు మరణశయ్యపై ఉన్నాడంటూ కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. డయాబెటిక్ అయిన దావూద్ గ్యాంగరిన్తో బాధపడుతున్నాడని, రోజులు లెక్కిస్తున్నాడని పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దావూద్ దొరక్కపోతాడా..? లేక ఎవరికీ దొరక్కుండానే ‘పోతాడా..?’ ఇది బిలియన్ డాలర్ల ప్రశ్న! చీకటి రాజ్యం మాఫియా వ్యాపారం ఒక చీకటి రాజ్యం. డాన్లు నడిపే డేంజరస్ ధందా ఇది. ప్రపంచంలోని నిషిద్ధ వస్తువులన్నింటినీ నిత్యావసరాల్లా విక్రయించే చీకటి విపణి ఇది. ఇందులో చట్టం గిట్టం జాన్తా నై. ఇక్కడ వ్యవహారాలన్నీ కరెన్సీ కట్టలతో ‘సామరస్యంగా’ సెటిలైపోతాయి. కాదూ కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే తూటాలు మాట్లాడతాయి. నడివీధుల్లో నెత్తుటేర్లు ప్రవహిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాదు, శాంతిభద్రతలకు కూడా పెనుసవాలుగా నిలుస్తున్న అధోజగత్తు ఇది. దీనిని సమూలంగా పెకలించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి లేకపోలేదు. ఇక భవిష్యత్ తరాలు ఇలాంటి ‘డాన్’లనే ఆదర్శంగా తీసుకుంటే, యావత్ సమాజమే అతలాకుతలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మరణశయ్యపై డాన్! దావూద్ ఇబ్రహీం పూర్తి పేరు షేక్ దావూద్ ఇబ్రహీం కస్కర్. ముంబై మాఫియాను కొంతకాలం ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు. అప్పట్లో ఇతడి డెన్ ఇక్కడే ఉండేది. ఇతడి గ్యాంగ్ ‘డీ కంపెనీ’గా పేరుమోసింది. ముంబైలో ఉన్నంత కాలం సినీప్రముఖులతో రాసుకు పూసుకు తిరిగేవాడు. సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడని కూడా బాలీవుడ్లో చెప్పుకుంటారు. 1993లో ముంబై పేలుళ్ల తర్వాత భద్రతాదళాలు వేట మొదలుపెట్టడంతో ఈ ‘డాన్’ పలాయన మంత్రం చిత్తగించాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు. కొన్నాళ్లు దుబాయ్‌లో తలదాచుకున్నాడని, తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ కథనాలు వెలువడిన వెంటనే దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ ఆ వార్తలను ఖండించింది. గత ఏడాది దావూద్‌కు అరవయ్యేళ్లు నిండాయి. షష్టిపూర్తి సందర్భంగా అతడు రిటైర్మెంట్ ప్రకటించుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే దావూద్ ఆరోగ్యం దిగజారి, గ్యాంగరిన్తో బాధపడుతూ మరణశయ్యపైకి చేరుకున్నాడని కథనాలు వచ్చాయి. అయితే, ప్రభుత్వ వర్గాలేవీ వాటిని ధ్రువీకరించడంలేదు. ఇదిలా ఉంటే, దావూద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టి తెస్తామని, అతడి నేరాలపై విచారణ జరిపి, అతడికి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నెల్లాళ్ల క్రితం ప్రకటించారు. ఇందుకు అవసరమైన అంతర్జాతీయ భద్రతా బలగాల సహకారం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. మన ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు ఇంటర్‌పోల్ వంటి అంతర్జాతీయ భద్రతా సంస్థలు కూడా దావూద్ ఇబ్రహీం కోసం గాలింపు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరూ స్పష్టంగా అతడి జాడ కనుక్కున్న దాఖలాల్లేవు. ఈ పరిస్థితుల్లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన మాట నిలబెట్టుకుంటారా... లేదా... వేచి చూడాల్సిందే! డాన్ కా ‘భయో’డేటా ⇒ దావూద్ ఇబ్రహీం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ముమ్కా గ్రామంలో 1955 డిసెంబర్ 4న కొంకణి ముస్లిం కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఇబ్రహీం కస్కర్ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. ⇒ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్‌వార్‌లో పాల్గొనడంతో దావూద్ నేరచరిత్ర మొదలైంది. అప్పట్లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ హాజీ మస్తాన్ తరఫున దావూద్ ఆ గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్నాడు. ⇒ హాజీ మస్తాన్ గ్యాంగ్‌లో కొనసాగుతుండగానే 1980ల ప్రారంభంలో ఒక దోపిడీ కేసులో మొదటిసారిగా అరెస్టయ్యాడు. విడుదలయ్యాక నేరాలనే వృత్తిగా చేసుకుని, డాన్‌గా ఎదిగాడు. ⇒ హాజీ మస్తాన్ గ్యాంగ్, పఠాన్ గ్యాంగ్‌ల నడుమ గ్యాంగ్‌వార్‌ల తర్వాత దావూద్ మరింత ప్రమాదకరంగా మారాడు. హాజీ గ్యాంగ్‌లో కొనసాగుతున్న తన సోదరుడు సబీర్ను సుర్వే గ్యాంగ్ సహాయంతో పఠాన్ గ్యాంగ్ హత్య చేయడంతో దావూద్ ప్రతీకార దాడులకు తెగబడి, సుర్వే గ్యాంగ్, పఠాన్ గ్యాంగ్‌లను దాదాపు తుడిచిపెట్టేశాడు. ⇒ హాజీ మస్తాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో, దావూద్ గ్యాంగ్ పగ్గాలను చేపట్టాడు. కొద్దికాలంలోనే ముంబై అండర్ వరల్డ్‌లో హాజీ మస్తాన్‌ను మించిన డాన్‌గా ఎదిగాడు. ⇒ ముంబైలో పాతనౌకలను ధ్వంసం చేసే పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. కొంతకాలం దుబాయ్‌ని కేంద్రంగా చేసుకుని ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ రవాణా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు సాగిస్తూ ఆర్థికంగా బలపడ్డాడు. ⇒ ఆర్థికబలం పుంజుకున్నాక బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడు. బాలీవుడ్ వివాదాల సెటిల్మెంట్లలోనూ తలదూర్చేవాడు. క్రికెట్ బెట్టింగ్‌లను అనుకూలంగా మలచుకునేందుకు భారత్, వెస్టిండీస్ జట్లలోని కొందరు క్రికెటర్లనూ ‘మ్యానేజ్’ చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ⇒ బాలీవుడ్‌కు ‘ఆర్థిక’సాయం చేస్తున్న కాలంలోనే దావూద్ అప్పటి హీరోయిన్ మందాకినితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత అనితా ఆయూబ్‌తో ఎఫైర్ నడిపాడు. ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడని కూడా కథనాలు వచ్చాయి. మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం భారత్‌కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా ‘బాగా కావాల్సిన’ (మోస్ట్ వాంటెడ్) నేరగాడు. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా, పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి. యూపీఏ సర్కారు హయాంలో దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ దావూద్‌కు వాటా ఉందనే కథనాలు వచ్చాయి. మొదట్లో మిగిలిన డాన్ల మాదిరిగానే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ రవాణా, అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, హవాలా లావాదేవీలు వంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చినా, క్రమంగా ఉగ్రవాదులతోనూ చేతులు కలిపాడు. ‘డాన్’ ముదిరి టైస్టుగా మారాడు. ‘అల్ కాయిదా’ అధినేత ఒసామా బిన్ లాడెన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థలు తేల్చాయి. చివరకు 2003లో దావూద్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా కూడా ప్రకటించాయి. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దావూద్‌పై, అతడి అనుచరులపై పలు ఆంక్షలు విధించడమే కాకుండా, ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి ఆస్తులను స్తంభించేలా చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని చర్యలు ప్రారంభించినా ‘డీ కంపెనీ’ యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే వస్తోంది. పలు దేశాల్లో యథేచ్ఛగా తన ఆస్తులను పోగేసుకుంటూనే ఉంది. గత ఏడాది ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకటించిన అంచనా ప్రకారం దావూద్ ఆస్తుల నికర విలువ 670 కోట్ల డాలర్లకు (రూ.45,181 కోట్లు) పైమాటే! ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలోని పది దేశాల్లో ‘డీ కంపెనీ’కి ఆస్తులు ఉన్నాయని, వీటిలో అత్యధికంగా బ్రిటన్‌లోనే 45 కోట్ల డాలర్ల (రూ.3034 కోట్లు) ఆస్తులు ఉన్నాయని అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి. కరాచీలో డెన్! ముంబై నుంచి పరారైన తర్వాత పలుచోట్ల సురక్షిత స్థావరం కోసం ప్రయత్నాలు సాగించిన దావూద్ చివరకు పాక్ ఇంటెలిజెన్స్ అండదండలతో కరాచీ చేరుకుని, అక్కడ సురక్షిత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. పాక్ ప్రభుత్వం ఈ కథనాలను ఎంతగా ఖండిస్తున్నా, అతడికి పాక్ ప్రభుత్వం తరఫున అందుతున్న అన్ని రకాల సహాయ సహకారాల కారణంగానే అతడు అంతర్జాతీయ భద్రతా సంస్థలకు చిక్కకుండా తప్పించుకోగలుగుతున్నాడనేది దాదాపు బహిరంగ రహస్యం. కరాచీలో సంపన్నులు నివసించే క్లిఫ్టన్ ఎన్‌క్లేవ్‌లో 36 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో శత్రు దుర్భేద్యమైన కోటలాంటి ఇల్లు నిర్మించుకుని, అక్కడి నుంచి ‘ధందా’ సాగిస్తున్నాడని కథనాలు వచ్చాయి. ‘బిజినెస్ ఇన్సైడర్’ గత ఏడాది ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో దావూద్‌కు తొమ్మిది నివాస భవనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో జర్దారీ నివాసానికి అత్యంత చేరువలో ఉంది. దావూద్ ఫ్యామిలీ షబీర్ అహ్మద్: దావూద్‌కు అన్న. ఇబ్రహీం కస్కర్ సంతానంలో ఇతడే పెద్దవాడు. పఠాన్గ్యాంగ్ చేతిలో 1981 ఫిబ్రవరి 12న హత్యకు గురయ్యాడు. సయీదా కస్కర్: దావూద్‌కు అక్క. రత్నగిరి జిల్లాలోని స్వగ్రామం ముమ్కేలో నదిలో మునిగి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. నూరా ఉల్ హక్: దావూద్‌కు తమ్ముడు. ముంబైని వదిలి 1989లోనే గల్ఫ్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి ఇక్కడకు రాలేదు. అక్కడే 2009 మే నెలలో గుండెపోటుతో మరణించాడు హసీనా ఇబ్రహీం పర్కర్: దావూద్ చెల్లి. ముంబైలోని నాగపడా ప్రాంతంలో ఉండేది. మాఫియా కార్యకలాపాలను శాసిస్తూ ‘గాడ్‌మదర్ ఆఫ్ నాగపడా’గా పేరుమోసింది. రెండేళ్ల కిందట గుండెపోటుతో మరణించింది. ముంతాజ్ రహీం: దావూద్ చెల్లి. పెళ్లి తర్వాత కరాచీలో స్థిరపడింది. దావూద్ ఇక్బాల్ కస్కర్: దావూద్ తమ్ముడు. ముంబై నుంచి పారిపోయాక కరాచీ డిఫెన్స్ కాలనీలో ఉండేవాడు. లాడెన్ హతం తర్వాత తనను కూడా అలాగే చంపేస్తారనే భయంతో పాక్-అఫ్ఘాన్ సరిహద్దులకు పారిపోయినట్లు కథనాలు వచ్చాయి. ముంబైలో ఉన్నప్పుడు అన్న అండతో రియల్ ఎస్టేట్ రంగంలో ‘ధందా’గిరీ చలాయించేవాడు. అనీస్ అహ్మద్: దావూద్ తమ్ముడు. మాఫియా ‘ధందా’లో అన్నకు చేదోడుగా ఉండేది ఇతడే. ముంబై పేలుళ్ల తర్వాత అన్న దావూద్‌తో కలసి ఇక్కడి నుంచి పరారయ్యాడు. బాలీవుడ్ ప్రముఖులకు వచ్చే బెదిరింపు కాల్స్ వెనుక ఇతడి ప్రమేయం ఉందంటారు. అంతేకాదు, దావూద్‌కు వారసుడు ఇతడేనని కూడా అంటారు. ఫర్జానా తుంగేకర్: దావూద్ చెల్లి. ఒక వ్యాపారిని పెళ్లి చేసుకుని, ముంబైలోని మజాగావ్ ప్రాంతంలో స్థిరపడింది. జైతూన్ అంతులే: దావూద్ చెల్లి. దుబాయ్ వ్యాపారి హమీద్ అంతులేతో పెళ్లి తర్వాత అక్కడే స్థిరపడింది. ముస్తకీం ఇబ్రహీం, మహమ్మద్ హుమయూన్ ఇబ్రహీం: దావూద్ కవల తమ్ముళ్లు. అయితే, మాఫియా నేరాలకు సంబంధించి వీరిపై ఎలాంటి కేసులూ లేవు. వీళ్లిద్దరూ కరాచీలోనే ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదివరకే వెల్లడించాయి. వీరిద్దరిలో హుమయూన్ లంగ్ కేన్సర్‌తో, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతూ కరాచీ ఆస్పత్రిలో కొద్దిరోజుల కిందటే మరణించాడు. లేడీ డాన్ మెహజబీన్ అలియాస్ జుబీనా జరీన్: దావూద్ భార్య. లేడీ డాన్. ఎవరికీ భయపడని దావూద్... భార్య వద్ద మాత్రం భయపడతాడని చెబుతారు. ఆమె ఇంట్లో లేనప్పుడు విచ్చలవిడిగా పార్టీలు ఏర్పాటు చేసే దావూద్, ఇంకాసేపట్లో ఆమె వచ్చేస్తుందనే అనుమానం ఉంటే, అర్ధంతరంగానే పార్టీలకు ప్యాకప్ చెప్పిన సందర్భాలూ లేకపోలేదనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దావూద్, జుబీన్లకు నలుగురు కూతుళ్లు. ఒక కొడుకు. పాక్ క్రికెటర్ జావెద్ మియాందాద్ కొడుకు జునైద్‌తో పెద్ద కూతురు మహ్రుక్ పెళ్లి జరిపించడంలో జుబీన్దే కీలక పాత్ర అని చెబుతారు. ఇక రెండో కూతురు మహ్రీన్ అమెరికాలో స్థిరపడ్డ పాక్ వ్యాపారి ఆయూబ్‌ను పెళ్లాడింది. ఒక్కగానొక్క కొడుకు మొయిన్ లండన్‌లోని ఒక వ్యాపారి కూతురు సానియాను పెళ్లాడాడు. ఖురాన్‌ను కంఠోపాఠం చేసిన మొయిన్ ‘ధందా’కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అందుకే దావూద్ వారసుడిగా అనీస్ ‘డీ కంపెనీ’ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా. మాఫియా పుట్టినిల్లు ఇటలీ ఆధునిక మాఫియా కార్యకలాపాలకు మూలాలు ఇటలీలో ఉన్నాయి. సిసిలీ కేంద్రంగా తలెత్తిన మాఫియా గ్యాంగ్‌లు దశాబ్దాల పాటు ఇష్టారాజ్యం చలాయించాయి. తర్వాత ఈ మాఫియా ముఠాలు ఆర్థిక శక్తిగా ఎదిగిన అమెరికాలోనూ వేళ్లూనుకున్నాయి. అక్కడి నుంచి క్రమంగా ఇతర దేశాలకూ విస్తరించాయి. ముసోలినీ హయాంలో ఇటలీ మాఫియా కాస్త వెనక్కు తగ్గినా, ముసోలినీ మరణం తర్వాత తిరిగి విజృంభించాయి. ఇక మన దేశంలో ముంబై కేంద్రంగా మాఫియా గ్యాంగ్‌లు అవతరించాయి. ఇతర దేశాల్లోని మాఫియా గ్యాంగ్‌లతో సంబంధ బాంధవ్యాలు నెరపుతూ చీకటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. ఇక్కడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మాఫియా డాన్లు విదేశాల్లో స్థావరాలు ఏర్పరచుకుని, ఇక్కడ ఉంటున్న తమ మనుషుల ద్వారా ‘ధందా’లు నడిపించుకుంటున్నారు. సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లు సాగించుకుంటున్నారు. ముంబై మాఫియా ముంబైకి 1940వ దశకం తొలినాళ్లలో అఫ్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చిన అబ్దుల్ కరీం షేర్‌ఖాన్ అలియాస్ కరీంలాలా ఓడ రేవుల్లో పనిచేసేవాడు. చిల్లర గ్యాంగులను ఏకతాటిపైకి తెచ్చి ముంబైలో మొట్టమొదటి మాఫియా డాన్‌గా అవతరించాడు. అప్పట్లోనే తమిళనాడు నుంచి వలస వచ్చిన మస్తాన్ హైదర్ మీర్జా అలియాస్ హాజీ మస్తాన్ రంగంలోకి దిగాడు. హాజీ మస్తాన్ కేవలం మాఫియా వ్యవహారాలకే పరిమితం కాలేదు. సినీరంగంలోనూ తలదూర్చాడు. సినిమాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాడు. సినీతారలకు తరచు పార్టీలు ఇచ్చేవాడు. ముంబైలో ‘సెలబ్రిటీ డాన్’గా దాదాపు రెండు దశాబ్దాల పాటు చీకటి రాజ్యాన్ని శాసించాడు. తర్వాత 1985లో ‘దళిత ముస్లిం సురక్షా మహాసంఘ్’ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తమిళనాడు నుంచి వలస వచ్చిన వరదరాజన్ ముదలియార్ మద్యం అక్రమ వ్యాపారంతో రంగంలోకి దిగాడు. హాజీ మస్తాన్‌తో దోస్తానా చేసి డాన్‌గా ఎదిగాడు. దావూద్ ఇబ్రహీం సహా ఇప్పటి డాన్లలో చాలామంది ఒకప్పుడు హాజీ మస్తాన్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నవారే. అప్పట్లో దావూద్‌కు ఛోటారాజన్ కుడిభుజంగా ఉండేవాడు. 1993లో ముంబై పేలుళ్ల సంఘటన తర్వాత దావూద్‌కు దూరమయ్యాడు. దీంతో దావూద్ మనుషులు అతడిపై బ్యాంకాక్‌లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఛోటారాజన్ గత ఏడాది బాలిలో ఇండోనేసియన్ పోలీసులకు పట్టుబడ్డాడు. బాలీవుడ్‌పై మాఫియా నీడ మాఫియా కథల ఆధారంగా సినిమాలు రూపొందించే బాలీవుడ్‌ను మాఫియా పడగ నీడ వెన్నాడుతూనే ఉంది. టీ-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ 1997లో మాఫియా దాడిలోనే ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత రాకేశ్ రోషన్‌పై 2000 జనవరిలో మాఫియా సభ్యులు కాల్పులకు తెగబడ్డా అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దావూద్ ఇబ్రహీంతో ‘సన్నిహిత’ సంబంధాలు ఉన్న నటి అనితా ఆయూబ్‌కు తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి నిరాకరించిన నిర్మాత జావేద్ సిద్దికీ 1995లో మాఫియా దాడిలోనే బలైపోయారు. మాఫియాతో సంబంధాలు కొనసాగించడం వల్లనే సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మహేశ్ భట్, సుభాష్ ఘయ్ తదితర దర్శక నిర్మాతలు తమకు మాఫియా నుంచి బెదిరింపులు ఎదురైనట్లు మీడియాకు వెల్లడించారు. మాఫియా కార్యకలాపాలు కొనసాగిస్తూ బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి, ఆమె భర్త విక్రమ్ గోస్వామి రెండేళ్ల కిందట కెన్యాలో పట్టుబడ్డారు. మరో డాన్ అబు సలేంతో బాలీవుడ్ నటి మోనికా బేడీ కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించిన సంగతి బహిరంగ రహస్యమే. అబు సలేం అరెస్టు తర్వాత ఇద్దరూ విడిపోయారు. అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తదితర బడా హీరోలకూ మాఫియా డాన్లతో పరిచయాలు ఉన్నాయి. ఛోటా షకీల్‌తో తాను మాట్లాడినట్లు షారుఖ్ బహిరంగంగానే అంగీకరించాడు. - పన్యాల జగన్నాథదాసు -
‘అణు’ సభ్యత్వం తథ్యం కానీ..
బైలైన్ అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో స్థానం సంపాదిం చాలన్న మన ప్రయత్నంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు సమస్య ‘ఇవ్వాలా’ కాదు, ‘ఎన్నడు’ అనేది. గత ఏడాదిగా భారత్‌ను సమర్థిస్తూ, అనుకూల ప్రభావాన్ని కలుగజేస్తున్న అమెరికా, అది ఈ ఏడాది చివరికే జరుగుతుందని విశ్వసిస్తోంది. భారత్ సభ్యత్వం అంశం చర్చకు వచ్చిన సియోల్ ప్లీనరీ జరిగిన తర్వాత శ్వేతసౌధమే అది తెలిపింది. అంతిమ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది. ఒకప్పుడు మన దేశ అణు కార్యక్రమం పట్ల జాగరూ కతతోనో లేదా వ్యతిరేకతతోనో ఉండిన కెనడా వంటి దేశాలు ఎన్ఎస్జీ సమావేశానికి ముందు... మన దేశానికి ప్రాధ్యాన్యతా ప్రాతిపదికపై ప్రవేశం కల్పించాలని బహిరం గంగానే వాదించాయి. అవి ఉపయోగించిన పదం ‘‘అతి త్వరగా’’. బ్రిటన్, ఫ్రాన్స్, మాస్కో ప్రభుత్వాలు కల్పించిన ఆటంకం ఏమైనా ఉందంటే అదే. విస్పష్టమైన లక్ష్యాల కోసం అలుపెరగని శక్తిసామర్థ్యాలతో, ఆత్మవిశ్వాసంతో. అంతర్జాతీయ ప్రమాణాల మందకొడి గమనానికి బదు లుగా మన కాలానుగుణ ప్రణాళిక ప్రకారం కృషిని సాగిం చడం మన దౌత్యంలోని నూతన పరిణామం. ఇప్పుడు చైనా తప్ప అన్ని ప్రధాన అణుశక్తులూ మన దేశాన్ని ఎన్ఎస్జీలో చేర్చుకోవాలని కోరుతున్నాయంటే అది ఈ నూతన పరిణామం వల్ల కలిగిన లాభమే తప్ప, యాదృచ్ఛికంగా కలిగినదేమీ కాదు. అంతర్జాతీయ బహుముఖ సంస్థలలో ఏకా భిప్రాయం ఏర్పడటం అవసరమైన ఇలాంటి అంశాలను నిర్వచించకుండా వదిలేసిన కాలమనే బహిరంగ ప్రదేశం లోకి తోసేయడం సంప్రదాయకంగా జరుగుతుంటుంది. యథాతథ స్థితి కన్నా దౌత్యపరమైన ప్రశాంతత మెరుగని చెప్పనవసరం లేదు. క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎమ్టీసీఆర్) విషయంలో నెలకొన్న అంతర్జాతీయ జడత్వాన్ని మిత్రుల సహాయంతో ఈ నెల మొదట్లో అధిగ మించాం. 2030 నాటికి 40 శాతం కర్బనేతర విద్యుదు త్పత్తికి కట్టుబడతామని మనం గత ఏడాది పారిస్‌లో వాతా వరణ మార్పుల విషయమై హామీ ఇచ్చాం. ఆ హామీని సైతం ప్రస్తావిస్తూ అతి జాగ్రత్తగా రూపొందించిన వాద నతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ఎస్జీ విషయంలోని యథాతథ స్థితిని సవాలు చేశారు. శ క్తివంతమైన ఆ వాదన బలమైన శత్రువులను సైతం మిత్రులుగా మార్చింది. భారత్ తన శక్తికి మించి మరీ వాతావరణ మార్పుల విష యంలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ప్రపంచం కూడా భారత అణు వ్యాపారానికి మద్దతును తెలిపితీరాలి అనే తర్కాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఇక రెండవ కారణం, అణ్వస్త్రవ్యాప్తి నిరోధకత విష యంలో భారత్‌కు ఉన్న చరిత్ర. చైనా ప్రతిఘటనను ‘‘విధి విధానాలకు సంబంధించిన అటంకాలు’’ అన్నారని మనకు తెలుసు. అవి, పాకిస్తాన్‌తో తనకున్న వ్యూహాత్మక మైత్రిని పరిరక్షించుకోవాలనే చైనా కోరిక ఫలితం. మిగతా అణు శక్తులలో చేరడానికి ముందు భారత్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేసి తీరాలనేది చైనా లాంఛనప్రాయమైన అభ్యంతరం. అణుశక్తులైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ వాదనను అంగీకరించడానికి ఎందుకు తిరస్కరించాయి? అణువ్యాప్తి నిరోధం విష యంలో భారత్‌ది మచ్చలేని చరిత్ర కాబట్టి. 1950ల నుంచి అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్న భారత్‌కు వ్యతిరేకంగా ఎన్నడూ ఏ చిన్న గుసగుస వినిపించ లేదు. అందుకు విరుద్ధంగా పాకిస్తాన్‌కు అణువ్యాప్తి చెందిం చిన చరిత్ర ఉన్నది. 2002 స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసం గంలో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పాకిస్తాన్‌ను అణు ముప్పు ఉన్న ప్రాంతంగా పేర్కొన్నారు. అడ్రియన్ లెవీ అండ్ కాథరిన్ స్కాట్-క్లార్క్‌లు రచించిన డిసెప్షన్: పాకిస్తాన్, ది యునెటైడ్ స్టేట్స్ అండ్ ది గ్లోబల్ న్యూక్లియార్ వెపన్స్ కాన్స్పిరసీ అనే పుస్తకం ఈ అంశంపై ప్రామాణి కమైనది. ఆ పుస్తకం కవర్ పేజీ పైనే ‘‘అమెరికా సహా యంతో, సాంకేతికతను ఇతర దేశాలకు అందించడం ద్వారా, పునరుజ్జీవితమైన తాలిబన్‌కు, అల్‌కాయిదాకు ఆశ్రయం కల్పించడం ద్వారా భారీ అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకుని పాకిస్తాన్ నిజానికి పాశ్చాత్య దేశాలను వంచిం చింది’’ అని ప్రముఖంగా ముద్రించి ఉంటుంది. ‘‘టైఫాయిడ్ మర్ఫీ’’ మారుపేరున్న డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ డబ్బుకు ఆశపడి... కొన్నిసార్లు ఆ దురాశకు భావ జాలం ముసుగుతొడిగి మరీ అణు రహస్యాలను అమ్మేశాడు. ఒక అసాధారణమైన డాక్యుమెంటు ఫలితంగా ఖాన్ 2004 ఫిబ్రవరి 4న బహిరంగంగా ఆ విషయాన్ని టెలివి జన్‌లో అంగీకరించాల్సివచ్చింది. లిబియా, ఉత్తర కొరి యాల వంటి ఖాతాదార్లకు అణు సాంకేతికతను అమ్ముతూ ఖాన్ అణు బ్లాక్ మార్కెట్‌ను నడిపాడు. ఆయన ఇది ఒంటరిగా చేసి ఉండరనేది స్పష్టమే. కానీ సైన్యం చేత తప్పు చేసినవాడిగా ముద్ర వేయించుకున్నాడు. ‘‘ఖాన్ తన తప్పును అంగీకరించాడు, ఆయన అత్యున్నత సహాయకు లకు అణు వ్యాపారం లేకుండా పోయింది’’ అని నాటి అధ్యక్షుడు బుష్ అన్నారు. ‘‘ఖాన్ నెట్‌వర్క్‌కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్నంతా పంచుకుంటానని, తమ దేశాన్ని తిరిగి మరెన్నడూ అణు వ్యాప్తికి వనరును కానిచ్చేది లేదని అధ్యక్షుడు ముష్రాఫ్ వాగ్దానం చేశారు’’ అని కూడా తెలిపారు. పాకిస్తాన్ అధ్యక్షుడు సైతం తన దేశం తప్పు చేసిందని అంగీకరించాల్సి వచ్చింది. ఖాన్‌కు నగదు రూపం లోనూ, భౌతికంగానూ కూడా చెల్లింపులు జరిగాయి. అతడ్ని జైలుకు పంపడానికి బదులు ఆ డబ్బునంతా ఆయననే ఉంచుకోనిచ్చి, ప్రశాంతంగా పదవీ విరమణానం తర జీవితం గడపమని పంపేశారు. దీనికి విరుద్ధంగా భారత్ ‘‘అణ్వాయుధ వ్యాప్తి నిరో ధక ఒప్పందంలోని నిబంధనలను, లక్ష్యాలను సాధ్యమై నంత విశాలమైన రీతిలో అమలుపరచడానికి’’ సహకరిం చిందని ఎన్ఎస్జీ 2008లో పేర్కొంది. ఇంతకంటే ఎక్కు వగా చెప్పాల్సినది, ప్రత్యేకించి ఎన్ఎస్జీకి సంబంధించి ఏమీ లేదు. పాకిస్తాన్‌ను కాపాడటం కోసం భారత్‌కు వ్యతిరేకంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధం సమస్యను లేవనె త్తడం పూర్తి పరిహాసోక్తి కాకపోయినా, గొప్ప వైచిత్రి అవుతుంది. చైనా అభ్యంతరం సైతం సభ్యత్వ క్రమానికి సంబంధిం చినదే తప్ప మన దేశ అర్హతకు సంబంధించి నది కాకపో వడం కూడా భారత్ విశ్వసనీయతపై సందేహం లేదనే దానికి ఆధారం. దౌత్యం ఒక సుదీర్ఘ క్రీడ. క్షిపణి సాంకేతికత వంటి విష యాల్లో మనం ఫలితాలను వెంటనే సాధించగలుగుతాం. ఎన్ఎస్జీ సభ్యత్వం కేవలం కాలానికి సంబంధించిన సమస్యే, అది కూడా చాలా ఎక్కువ కాలమేమీ కాదు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు) పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
శభాష్.. డాక్టర్
{పభుత్వ వైద్య సేవల్లో జిల్లా ఉత్తమం మన వైద్యులను ఆహ్వానించిన బీజాపూర్ కలెక్టర్ బృందాన్ని పంపిన కలెక్టర్ కరుణ వరంగల్ : ప్రభుత్వ వైద్య సేవల పరంగా జిల్లాలో కొన్ని నెలలుగా గణనీయమైన మార్పులు వచ్చాయి. ఏడాది క్రితంతో పోల్చితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగయ్యాయి. ముఖ్యం గా కాన్పుల విషయంలో పురోగతి ఎక్కువగా ఉందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ గుర్తిం చింది. వైద్య సేవల పరంగా రాష్ట్రంలోనే జిల్లా ఉత్తమంగా ఉందని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కలెక్టర్‌కు తెలిపింది. ఆ జిల్లా కలెక్టర్ అయ్యాజ్ ఎఫ్ తాంబోలి స్వయంగా వైద్యుడు. అక్కడి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర కుటుం బ సంక్షేమశాఖ కమిషర్‌కు లేఖ రాశా రు. ప్రభుత్వ సేవలపరంగా మెరు గ్గా ఉన్న వరంగల్ వైద్య బృం దాన్ని బీజాపూర్‌కు పంపించాలని కోరా రు. దీంతో ఇదే విషయమై కుటుం బసంక్షేమ కమిషనర్.. కలెక్టర్ వాకాటి కరుణకు లేఖ రాశారు. కాగా, కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు జిల్లాలోని వైద్య బృందం బీజాపూర్‌కు వెళ్లింది. మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం)లో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న పిల్లల వైద్యులు బలరాం, సురేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదర్శంగా నిలిపిన వైద్యుడు మహేందర్ ఈనెల 25 బీజాపూర్‌కు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడి వైద్యులకు తగు సలహాలు, సూచనలు అందించి 27న తిరిగి వచ్చారు. ప్రత్యేక శిక్షణకు వినతి... బీజాపూర్ జిల్లాలో 2.52 లక్షల మంది జనాభా ఉండగా, వైద్యులు 16 మంది మాత్రమే ఉన్నారని ఇక్కడి నుంచి వెళ్లిన వైద్య బృందం తెలిపింది. బీజాపూర్ జిల్లా కేంద్రంలో 35 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. అక్కడున్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల అస్పత్రిగా ఆ జిల్లా కలెక్టర్ తాంబోలి అభివృద్ధి చేశారు. 16 మంది వైద్యులలో తొమ్మిది మంది జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడి వారికి శిక్షణ అవసరమని భావించి మన జిల్లా వైద్యులను బీజాపూర్‌కు ఆహ్వానించారు. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నందున తమ వద్ద విధులు నిర్వహించేందుకు వచ్చే వారికి రెండు లక్షల రూపాయల చొప్పున వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కడి కలెక్టర్ చెప్పారని మన వైద్యులు తెలిపారు. -
మహిళలకు ఆర్థిక స్వావలంబన
మహిళల్లో ఆర్థిక స్వావలంబన మెరుగుపరుస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. మహిళా సంక్షేమం, ప్రగతి పథకాలకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ పురుషులతో సమానంగా స్త్రీలు సంపాదనపరులు కావాలని, ఇందుకు స్వయం సహాయ సంఘాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. అందుకనే నాలుగేళ్ల కాలంలో మహిళా పథకాల కింద రూ.20,270 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించామని తెలిపారు. అలాగే ఈ ఏడాది మరో రూ.6వేల కోట్ల బ్యాంకు రుణాలను స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా మంజూరు చేయనున్నట్లు ఆమె తెలి పారు. రాష్ట్రంలోని 10 వేల స్వయం సహాయక సంఘాలకు ఈ మొత్తం ద్వారా లబ్ధిచేకూరుతుందని చెప్పారు. మహిళలపై ఆధారపడే కుటుంబాల్లో జీవినాధారం పెంచేందుకు, వివిధ పథకాల అమలుకు 700 గ్రామాలను గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఆయా గ్రామాల్లోని చిన్నతరహా మహిళా గ్రూపులకు రూ.58 కోట్ల రుణాలను బాంకుల ద్వారా అందజేస్తామని తెలిపారు. ఒక్కో గ్రూపుకు ఒక లక్ష రూపాయల చొప్పున 1500 గ్రామాలకు రూ.15 కోట్లు కేటాయించామని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1.14 లక్షల ఇళ్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ర హదారుల అంశంపై మాట్లాడుతూ, 2015-16 ఆర్థికసంవత్సరంలో రూ.800 కోట్లతో 4వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. గ్రామసీమలో రాష్ట్ర ప్రగతికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపుగా అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.50వేల కోట్లతో 41 బ్రిడ్జీలను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ పనులు పూర్తయ్యే దశలో మరో రూ.1475 కోట్లు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. బ్రిడ్జీలు, రహదారుల విస్తరణ, రోడ్ల మరమ్మతులతో పాటుమరిన్ని అభివృద్ది కార్యక్రమాలను గ్రామాలకు తీసుకెళుతున్నామని అన్నారు. -
‘మిషన్’పై అశ్రద్ధ
⇒ నత్తనడకన సాగుతున్న మిషన్ కాకతీయ పనులు ⇒ 555 చెరువులకు గాను 340 చెరువుల్లో సర్వే పనులు కొలిక్కి ⇒ అందులో 187 చెరువులకు మాత్రమే ప్రతిపాదనలు తయారు ⇒ జూన్ నాటికి తొలివిడత పనులు పూర్తయ్యేది అనుమానమే సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెరువుల పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ పనుల్లో జిల్లాలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. వచ్చే వర్షాకాలం నాటికి చెరువులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలని సర్కారు భావించినప్పటికీ.. జిల్లాలో మాత్రం అధికారుల ఉదాసీనత వల్ల సర్వే పనులు ముందుకుసాగడం లేదు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,747 చెరువులున్నాయి. ఈ చెరువులను పునరుద్ధరించి ఆయకట్టు పొలాలకు నీరు అందించి సాగులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలివిడత 20శాతం చెరువులను ఎంపిక చేసుకుని వాటి మరమ్మతులు, కొత్తగా పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా నీటిపారుదల విభాగాలను ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో 555 చెరువులను గుర్తించిన అధికారులు.. వాటి సర్వే పనుల్లో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలోగా నిర్దేశించిన చెరువులు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మూడోవంతు చెరువులకే.. జిల్లాలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా తొలివిడత 555 చెరువులను గుర్తించారు. ఈ చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలి. ఇందుకుగాను ముందుగా ఆయా చెరువులను సర్వే చేసి అంచనాలను సిద్ధం చేయాలి. ఇందులో భాగంగా సర్వే పనులను ఉపక్రమించిన అధికారులు.. ఇప్పటివరకు కేవలం 340 చెరువుల సర్వే మాత్రమే పూర్తి చేశారు. ఇందులో 187 చెరువులకు మాత్రమే ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో వంద ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం గల చెరువులు 77 ఉండగా, వంద ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు 110 ఉన్నాయి. రూ.113 కోట్లకు ఓకే.. సర్వే పనులు పూర్తిచేసి ప్రణాళికలను ప్రభుత్వానికి పంపితే అందుకు సంబంధించి అనుమతులను ప్రభుత్వం ఇస్తుంది. ఈక్రమంలో జిల్లాలో 555 చెరువులకుగాను ఇప్పటివరకు 187 చెరువుల ప్రణాళికలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఆయా పనులను ఆమోదిస్తూ పరిపాలన పరమైన అనుమతులిచ్చింది. ఈ 187 చెరువుల మరమ్మతులకుగాను రూ.113 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. గడువులోగా పూర్తయ్యేనా.. వచ్చే ఏడాదిలో వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా నిర్దేశించిన చెరువుల పునరుద్ధరణ పూర్తికావాలి. జిల్లాలో 555 చెరువులు గుర్తించగా.. ఇప్పటివరకు 187 చెరువుల పనుల అంశం కొలిక్కి వచ్చింది. మిగతా చె రువులకు సంబంధించి సర్వే, ప్రణాళికల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వ ఆమోదం లభిస్తే గడువులోగా పనులు పూర్తిచేసే వీలుండేది. కానీ అధికారుల ఉదాసీనవైఖరితో ప్రణాళికల తయారీ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో వానాకాలంలోగా నిర్దేశించిన చెరువులు పునరుద్ధరణ అనుమానమే. -
ప్రగతీలేదు..‘ప్రణాళిక'లేదు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అట్టహాసంగా ప్రవేశపెట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ ఆచరణలో ‘ప్రగతి' చూపలేక పోయింది. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై ఈనెల 15తో ముగిసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం పెద్ద పీట వేసిన పారిశుద్ధ్య కార్యక్రమం సైతం అమలుకు నోచలేదు. ఫలితంగా పల్లెలు అపరిశుభ్రవాతావరణంలో అలమటిస్తున్నాయి. నిధులివ్వని ఈ తరహా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతాయని సాక్షాత్తూ గ్రామ సర్పంచ్‌లే స్పష్టం చేస్తున్నారు. సత్తెనపల్లి: దోమలు పెరగకుండా, రోగాలు ప్రబల కుండా పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం పల్లెలవైపు చూడడం లేదని గ్రామీణులు గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ‘వంద రోజుల ప్రణాళిక’ పేరిట గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు పెద్ద పీట వేసినా ఆచరణలో ప్రగతి చూపలేదంటున్నారు. మరో వైపు నిధులు ఇవ్వకుండా పంచాయతీల్లో పనులు ఎలా చేపట్టాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న కొద్దిపాటి నిధులు ఖర్చు అయ్యాయని, కొత్త పథకాల అమలు భారమేనని అంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఏగ్రామం చూసినా అపరిశుభ్రంగానే దర్శనమిస్తోంది. దోమలు పెరిగి వ్యాధుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 57 మండలాలు 1,011 పంచాయతీలు. వీటిలో 112 మేజరు, 899 మైనర్ పంచాయతీలు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ముందు రెండేళ్లపాటు ప్రత్యేక అధికారుల ఏలుబడిలో సమస్యలు పేరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. గత ఏడాది పంచాయతీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టాయి. అనంతరం విడుదలైన సాధారణ నిధులతో సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు, చెత్త కుప్పల తొలగింపు, సైడు కాలువలు శుభ్రం చేయించడం, బోర్ల మరమ్మతులు, కాలువల్లో పూడిక తీత పనులను అరకొరగానే చేయించగలిగారు. అమలు కాని ‘వంద రోజుల ప్రణాళిక’ ... కొత్త ప్రభుత్వం చేపట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం నిధులు లేక నీరసించింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ‘వంద రోజుల ప్రణాళిక’ను నిర్ధేశించింది. ఇందులో పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభమైన వంద రోజుల ప్రణాళిక ఈనెల 15తో ముగిసింది. కొన్ని గ్రామాల్లో కాలువల్లో పూడిక తొలగించి చేతులు దులుపుకున్నారు. చాలా పల్లెల్లో వంద రోజుల ప్రణాళిక ఊసే లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళికతో గ్రామాల్లో ఏమాత్రం ప్రగతి కనిపించలేదని పేర్కొంటున్నారు. కొత్త పథకాలే భారం... వంద రోజుల ప్రణాళికలో గ్రామసభల ఏర్పాటు, స్వచ్ఛ భారత్, జన్మభూమి-మా ఊరు, పారిశుద్ధ్యం, నీటి ట్యా ంకుల పరిశుభ్రత వంటి పనులు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల సర్పంచ్‌లు తమ సొంత నిధులతో చిన్న చిన్న పనులు చేయగా, మరికొందరు తామేమీ చేయలేమని వదిలేశారు. -
బాల్యం మర్చిపోని మనిషి...
నేడుతాపీ ధర్మారావు జయంతి సాహిత్యం, సినిమా, పత్రికలు, అధ్యాపకత్వం - ఇన్ని రంగాల్లో ఏకకాలంలో కృషి చేసిన అభ్యుదయవాది అంటే ‘ఆంధ్ర విశారద’ తాపీ ధర్మారావు పేరే గుర్తొస్తుంది. 127 ఏళ్ల క్రితం జన్మించిన ఈ ‘తాతాజీ’ తన కాలానికి కన్నా ముందు ఆలోచనలతో వర్ణాంతర వివాహాలు, దండల పెళ్లిళ్లకు అప్పట్లోనే పురోహితుడు. ఈ మానవతావాదిని అతి దగ్గర నుంచి చూసిన ఆఖరు మనుమరాలు్ర శీమతి సుజాతా షా. స్వయంగా కవయిత్రి, అధ్యాపకురాలైన ఆమె మాటల్లో... ఆ వ్యావహారిక భాషా విప్లవమూర్తి జ్ఞాపకాల్లోకి ప్రయాణం... తాపీ ధర్మారావు ‘మీ తాతయ్యట కదా’ అని ఎవరైనా అనగానే ఒక్కసారిగా యాభై ఎనిమిదేళ్ళు వెనక్కి, నా చిన్నతనానికి వెళ్ళిపోతాను. మనుమరాళ్ళలో అందరి కన్నా చిన్నదాన్ని నేను. తాతయ్యకు ముగ్గురబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు. పెద్దబ్బాయి - మా నాన్న, ప్రముఖ జర్నలిస్టు తాపీ మోహనరావు. ఆఖరబ్బాయి - దర్శకుడు చాణక్య బాబాయి. నిజం చెప్పాలంటే, మా లాంటి వాళ్ళం ఆయనను తాతయ్యగానే ఎక్కువ చూశాం. కానీ, ఆయన పోయిన తరువాత రచయితగా, సినీకవిగా, పరిశోధకుడిగా ఆయన గురించి నలుగురూ చెబుతూ ఉంటే, అప్పుడు తెలిసింది - ఎంత గొప్పమనిషితో మేమింత కాలం కలసి గడిపామో అని! చిన్నప్పుడు ఆర్థికంగా చాలా కష్టపడి, ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, క్రమంగా యెదిగిన తాతయ్య బయట ప్రపంచంలో ఎంతో ప్రముఖులైనా ఇంట్లో మామూలు గృహస్థులా పిల్లల పట్ల అక్కరతో ఉండేవారు. మద్రాస్, ఆ తరువాత హైదరాబాద్‌ల నుంచి తాతయ్య విజయవాడలో నాన్న దగ్గరకెప్పుడొచ్చినా మాకు పండగే. పడక్కుర్చీలో పడుకొని కాళ్ళ మీద చిన్నదాన్నైననన్ను ఊపుతూ ఆయన చెప్పిన సంగతులు ఇంకా జ్ఞాపకం. పిల్లల చదువు, పెళ్ళిళ్ళ విషయంలో తాతయ్య చాలా స్వేచ్ఛనిచ్చేవారు. నాకు లెక్కలంటే భయమని నా పరీక్షల రోజుల్లో ప్రత్యేకంగా వచ్చి, నాకు పాఠాలు చెప్పేవారు. అలాగే, మేము వారం వారం ఆయనకు ఉత్తరాలు రాయాల్సిందే. కార్డు మీద ఒకవైపు యోగక్షేమాలు, మరోవైపు చిట్టి కవితలు రాసి పంపేదాన్ని. వాటికి ఆయన ఇచ్చే జవాబులు, ప్రోత్సాహం తమాషాగా ఉండేవి. ఉత్తరాలు రాకపోతే, ఆయనే టెలిగ్రావ్‌ు ఇచ్చేసేవారు. ఒకసారి స్కూల్లో హంపీ విహార యాత్ర వెళ్ళి వచ్చాక, ఉగ్ర నరసింహమూర్తి అంటూ నేను కవిత రాశా. అందులోని ‘చరాచర జీవకోటి’ లాంటి మాటలు విని, బాగుందంటూనే, ఇంకా తేలిక మాటల్లో రాయాలనడం ఇప్పటికీ గుర్తు. జన వ్యవహారంలో...: ఆ మాటకొస్తే పత్రికల్లో వ్యావహారిక భాషా వాదానికి కూడా ఆయన పెద్ద అండ. 1930 జూన్‌లో జస్టిస్ పార్టీ వారి పత్రిక ‘సమదర్శిని’లో సంపాదకులుగా, 1935-’36లో గూడవల్లి రామబ్రహ్మం సారథ్యంలోని ‘ప్రజామిత్ర’ పత్రికలో రచయితగా, 1936లో పిఠాపురం రాజా పీపుల్స్ పార్టీ పక్షాన నెలకొల్పిన ‘జనవాణి’కి ఎడిటర్‌గా పత్రికా రంగానికి తాతయ్య చేసిన సేవ, పెట్టిన ఒరవడి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. ముందు వీర గ్రాంథికవాదైనా, గిడుగు వారి ప్రభావంతో తర్వాత వ్యావహారికానికి తాతయ్య పట్టం కట్టారు. ‘కొత్త పాళీ’ పట్టారు. ఆచరణలోనూ అభ్యుదయం...: నిత్యం నేర్చుకోవాలనే తపన జీవితాంతం కొనసాగిన జిజ్ఞాసువు తాతయ్య. అందుకే, మా నాన్న గారి కమ్యూనిస్టు భావాల ప్రభావాన్నీ సంతోషంగా ఇముడ్చుకొన్నారు. పార్టీలో సభ్యులుగా నాన్న,‘ప్రజానాట్యమండలి’ బుర్రకథ కళాకారిణిగా అమ్మ రాజమ్మల వర్ణాంతర వివాహాన్ని స్వాగతించారు. ఇంటా, బయటా అభ్యుదయ మార్గంలో దండల పెళ్ళిళ్ళెన్నింటికో పౌరోహిత్యం వహించారు. అభ్యుదయ రచయితల సంఘం తొలి మహాసభలకూ ఆయనే అధ్యక్షుడు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖులు చంద్రం లాంటి వారందరితో తాతయ్యకు బాగా స్నేహం. ‘విశాలాంధ్ర’కు పేరు పెట్టి, దాన్ని ప్రారంభించిందీ ఆయనే. రాంభట్ల, బిరుదురాజు రామరాజు, సెట్టి ఈశ్వరరావు, డాక్టర్ చిట్టూరి ఆయనకు బాగా దగ్గర! ఇంటి పేరు... మనిషి తీరు...: ఇంటిపేరుకు తగ్గట్లే రచనల్లో తాపీతనం, జాప్యం మాటెలా ఉన్నా, తాతయ్య రచన కోసం దర్శక, నిర్మాతలు ఇంటికొచ్చిన సందర్భాలు నాకు గుర్తు. సినీ రచయితగా ఆయన తొలిచిత్రం ‘మోహినీ రుక్మాంగద’ (1937). ఆ పౌరాణిక చిత్రంలో ఆయన వ్యావహారిక భాషలో డైలాగులు రాయడం అప్పట్లో చర్చనీయాంశం. ‘మాలపిల్ల’, ‘రోజులు మారాయి’ చిత్రాల రచనల్లో ఆయన అభ్యుదయ భావాలు చూడవచ్చు. ఇక ఎన్టీఆర్ ‘భీష్మ’ (1962) ఆయన పూర్తి స్థాయిలో రచన చేసిన చివరి చిత్రం. అయితే, ‘మదర్ ఇండియా’ని నటి జమునతో ‘బంగారు తల్లి’ (1971)గా రూపొందించినప్పుడు పద్యం లాంటి చిన్న పాటను తాతయ్యతో బలవంతాన రాయించారు దర్శకుడైన మా చాణక్య బాబాయ్. తాతయ్య ఆఖరి సినీ రచన అది. సంపాదకీయాలు ఇవాళ్టికీ...: తాతయ్య ప్రసిద్ధ రచనలు ‘పెళ్ళి - దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?’ లాంటివన్నీ పలు ముద్రణలు పొందాయి. అప్పటి ప్రసిద్ధ వేగుచుక్క గ్రంథమాల కోసం ఆయన రాసిన స్వభావ పరిశోధనాత్మక నవల ‘క్రొవ్వురాళ్ళు’ తాతయ్య బతికున్నప్పుడే వేరొక పబ్లిషర్ చేతుల్లో పడి కనిపించకుండా పోయింది. కానీ, అప్పట్లో తాతయ్య స్వయంగా దిద్దుకున్న ప్రూఫు కాపీ నా దగ్గర సగం దొరికింది. అలాగే, తాతయ్య జీవితం - రచనల మీద పరిశోధన చేసిన సాహితీవేత్త ఏటుకూరి ప్రసాద్ మిగతాది కష్టపడి సంపాదించారు. అలా అది ఈ మధ్య మళ్ళీ తాతయ్య పేరు మీద పాఠకలోకం ముందుకొచ్చింది. ఇక, తాతయ్య ఎడిటోరియల్స్, వ్యాసాలు, పాటలను పుస్తకంగా తేవాలని ప్రయత్నం. మరపురాని జ్ఞాపకం...: ఆఖరు వరకు బాల్యం మర్చిపోని మనిషి ఆయన. చెప్పిందే చేస్తూ, చేసేదే చెబుతూ బతికిన ఆయన మాట్లాడు తుంటే, మెరిసే ఆ కళ్ళు ఇవాళ్టికీ నాకు గుర్తే. బొమ్మలు గీయడం, కవితలు రాయడం, ఉపాధ్యాయ వృత్తి లాంటి నా లక్షణాలకు తాతయ్య జీన్సే కారణమనిపిస్తుంటుంది. రెండేళ్ళ క్రితం తాతయ్య 125వ జయంతి సంవత్సరం సందర్భంగా విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో వేదికకు ఆయన పేరు పెట్టారు. తాతయ్య గురించి నేను మాట్లాడితే, దూరం నుంచి మైకులో నా మాటలు విన్న ఒక ఎన్నారై కుర్రాడు దగ్గరకొచ్చి సమాజం, భాష, పెళ్ళి లాంటి వాటి గురించి కొన్ని దశాబ్దాల క్రితమే తాతయ్య వెలిబుచ్చిన అభిప్రాయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ, అప్పటికప్పుడు ఆయన రచనలన్నీ కొనుక్కొని వెళ్ళడం తాతయ్య భావాలు నవ తరానికి కూడా ప్రేరణనిస్తున్నాయనడానికి ఋజువు! సంభాషణ: రెంటాల జయదేవ మా ఇంటి పేరుకూ కథ ఉందని చెప్పేవాళ్ళు తాతయ్య. మా పూర్వీకుల ఇంటి పేరు బండి వారో, బండారు వారోనట! సైన్యంలో సిపాయిలుగా ఉంటూ, సైన్యం నుంచి విడుదలై వచ్చాక ఏదో పని చేసుకొనేవారట. మా తాతయ్యకు ముత్తాత లక్ష్మయ్య వాళ్ళ ఊళ్ళో (శ్రీకాకుళం) తాపీ పనిలో బాగా పేరు తెచ్చుకున్నారట. కొడుకూ, కూతురూ చనిపోవడంతో తన దగ్గర పెరుగుతున్న మనుమణ్ణి లక్ష్మయ్య బడిలో వేసినప్పుడు ‘తాపీ లక్ష్మయ్య మనుమడు అప్పన్న’ అని రాశారట. అలా మా ఇంటి పేరు ‘తాపీ’ అయింది. సినీ రచన విషయంలో తాతయ్య అక్షరాలా తాపీగానే పనిచేసేవారట. -
మూడు కేసుల్లో ముందుకెళ్లని విచారణ
మూడు కేసుల్లో ముందుకెళ్లని విచారణ కేసు నమోదుకే పరిమితమైన పోలీసులు ఇతర సెటిల్మెంట్లలో తలమునకలు వరంగల్ క్రైం : వరంగల్ పోలీసులు ఎంతో భేష్.. అని ఆ శాఖ ఉన్నతాధికారులు లెక్కలేనన్ని సార్లు కితాబిచ్చి ఉంటారు. మరి... ఆ గౌరవాన్ని మన పోలీసులు నిలబెడుతున్నారా? అంటే కాసింత వెనుకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సంచలనం, కలకలం సృష్టించిన సంఘటనల మిస్టరీని ఛేదించిన వరంగల్ పోలీసులు... ఇటీవల జరిగిన మూడు ఘటనల్లో నిందితులను పట్టుకోవడంలో ముందడుగు వేయలేకపోతుండడం అందుకు ఆస్కారమిస్తోంది. అసలు ఆ కేసులేంటి? పోలీసులు ఏం చేస్తున్నారో? వివరాల్లోకి వెళితే... హన్మకొండ విజయ్‌పాల్ కాలనీలో ఈ ఏడాది మార్చి ఏడో తేదీన ఓ వివాహిత హత్యకు గురైంది. ప్రాథమిక విచారణలో మాత్రం ఆమె సంబంధీకులే ఈ హత్య చేసుంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంతకుమించి ఆ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. అది మే 29. పట్టపగలే హంటర్‌రోడ్డులోని నందిహిల్స్‌లో ఓ ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది. అది కూడా ఆ దొంగలు తాము సీబీసీఈడీ అంటూ సినీఫక్కీలో రూ.50లక్షలు దోచుకెళ్లడం అప్పుడు పెద్ద సంచలనమే సృష్టించింది. అంత పెద్దమొత్తం ఇంట్లో ఉన్న విషయం డబ్బు ఇచ్చిన వారికి, పుచ్చుకున్నవారికి, ఆసమయంలో వారి వెంట ఉన్నవారికి మాత్రమే తెలిసుంటుందనేది పలువురి వాదన. పోలీసులు కూడా అదే వాదనను నిర్ధారించుకున్నప్పటికీ కేసులో నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కీర్తినగర్‌లోని శ్రీలంకనగర్ కాలనీలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఎవరో తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. కానీ, దానివెనుక దాగి ఉన్న అసలు మర్మాన్ని బయటపెట్టడంలో వారు చేసిందేమీ లేదనే చెప్పొచ్చు. మే 18వ తేదీన జరిగిన మర్డర్.. దాదాపు మూడు నెలలవుతోంది. ఈ కేసులో ఆటోడ్రైవర్, పనిమనిషి, వారి దగ్గరి బంధువులను విచారించిన గీసుకొండ పోలీసులు... నిందితులెవరో కనిపెట్టలేకపోయారు. రిస్క్ ఎందుకనీ... అయితే, ఎన్నికల నేపథ్యంలో కొంతమంది కొందరు అధికారులు జిల్లాకు వచ్చారు. రేపోమాపో ఇక్కడి నుంచి వెళ్లిపోతాం.. మనకెందుకులే.. అని వీరు కేసుల దర్యాప్తుపై పెద్దగా దృష్టిసారించడం లేదని తెలుస్తోంది. తాము వెళ్లిపోయాక కొత్తగా వచ్చేవారు తంటాలు పడతారనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఖాళీగా ఉండడం ఎందుకనీ... సెటిల్మెంట్లలో ఫుల్లుగా మునిగిపోయినట్లు డిపార్ట్‌మెంటులోనే చర్చసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలను చక్కదిద్దుతూ ఎంతోకొంత వెనకేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా.. కొరుకుడుపడని కేసుల మిస్టరీని ఇట్టే ఛేదించే సత్తా గల పోలీసులుగా పేరున్న జిల్లా పోలీసు శాఖ.. సంచలనం కలిగించిన పై మూడు సంఘటనల్లో నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి సాధించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొత్తవారు వస్తారా? నగరంలో పలువురు సీఐలకు బదిలీల రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మడికొండ, కాజిపేట, సుబేదారి, హన్మకొండ, మట్టెవాడ, ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ, కేయూసీ, హసన్‌పర్తి స్టేషన్ల సీఐలకు దాదాపు పోస్టింగులు కూడా ఖరారైనట్లు చర్చించుకుంటున్నారు. -
నచ్చిన కొలువే నిచ్చెన మెట్టు
ప్రేరణ మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో.. ఆ పనే చేయండి! మిమ్మల్ని మీరు ప్రగాఢంగా విశ్వసించండి. శ్రమించండి. మీ ప్రగతికి అడ్డొచ్చే ఎలాంటి సాకులనూ అస్సలు దరిచేరనీయకండి!! మీకు ఏమాత్రం ఇష్టంలేని ఉద్యోగంలో ఇరుక్కుపోయామని మదనపడుతున్నారా..! మీరిప్పుడు చేస్తున్న ఉద్యోగంతో డబ్బు, సమాజంలో గుర్తింపు అనేది ఎప్పటికీ ఎండమావేననిపిస్తోందా..! అయితే, మీరిప్పుడు గెయిల్ కెల్లీ ఉద్వేగభరిత విజయగాథను తెలుసుకోవాల్సిందే..! దక్షిణాఫ్రికాకు చెందిన 54ఏళ్ల గెయిల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని అతిపెద్ద బ్యాంక్ వెస్ట్‌ప్యాక్-సీఈవో. అంతేకాదు ఆస్ట్రేలియాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఇది వాస్తవ వర్తమానం, కాని, గతంలో ఆమె అతి సామాన్యురాలు. అతి సాధారణ మహిళ నుంచి అత్యంత ధనవంతురాలిగా గెయిల్ ఎదిగిన క్రమం చూస్తే- ఇష్టమైన పనిని అలుపుసొలుపూ లేకుండా చేస్తుంటే.. ఆస్తిపాస్తులు, పేరుప్రఖ్యాతలు ఇట్టే వచ్చిపడతాయన్నది నిజమనిపిస్తుంది. గెయిల్ 1954లో దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించింది. ఓ సగటు విద్యార్థిలాగే డిగ్రీ పూర్తిచేసుకుంది. 21ఏళ్లకే తోటి విద్యార్థితో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకుంది. భర్తకు జింబాబ్వేలో ఉద్యోగం రావడంతో గృహిణిలా అతనితోపాటు అక్కడకు వెళ్లింది. ఏడాది తర్వాత ఆ దంపతులు స్వదేశానికి తిరిగివచ్చారు. గెయిల్ ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరింది. ఆ రోజుల గురించి ఆమెకు గుర్తుందల్లా.. గడుగ్గాయులైన కొంతమంది విద్యార్థులు, వాళ్లపై ఆమె అరుపులు! ఒక రోజు ఓ విద్యార్థి స్పోర్ట్స్ రూమ్‌లో తన టీషర్ట్ వదిలేసి వస్తాడు. ఆ విద్యార్థిపై గెయిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా అరుస్తుంది. ‘‘చిన్న పిల్లలపై నేను అరవడం, ఆగ్రహించుకోవడం నాకే నచ్చలేదు. నాపట్ల నాకే చాలా సిగ్గనిపించింది. నా అసంతృప్తిని విద్యార్థులపై చూపిస్తున్నానిపించింది’’ అంటారు గెయిల్ ఆ రోజులను గుర్తుచేసుకుంటూ! మరుసటి రోజు ఆమె పాఠశాలకు వెళ్లేందుకు బస్సులో కూర్చుందేకాని.. మనసంతా ఏవో ఆలోచనలు.. అక్కడ అసలు పాఠశాలే లేనట్టు, ఆమె అందులో టీచర్ కానట్టు.. ఇలా రకరకాల ఆలోచనలు.. ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంది. అంతే.. ఆ క్షణమే బస్సు దిగేసింది. ఆ రోజు స్కూల్ బస్సు దిగడం.. గెయిల్ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. తర్వాత గెయిల్‌కు ఓ బ్యాంక్‌లో చిన్న ఉద్యోగం దొరికింది. తనకిష్టమైన బ్యాంక్ జాబ్ కావడంతో బాగా పనిచేసింది. కొద్దికాలంలోనే పదోన్నతి పొందింది. అలా పనిచేస్తూ ఉండగానే 30ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మ ఇచ్చింది. బిడ్డ ఆలనాపాలనా చూస్తూనే ఎంబీఏ పూర్తిచేసింది. ఆమె ఎంత ఇష్టంగా, నిబద్ధతతో పనిచేస్తుందో తెలిసిన బ్యాంక్ యాజమాన్యం.. చంటిపిల్ల తల్లి అయినా తిరిగి ఉద్యోగంలో చేర్చుకుంది. అమోఘమైన పని తీరుతో కెరీర్లో ఉన్నత స్థానాల దిశగా ఒక్కో మెట్టూ ఎక్కసాగింది. ఈ లోపే మళ్లీ గర్భం.. ఈసారి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు. ఆశ్చర్యంగా.. కాన్పు అయిన 5 నెలలకే గెయిల్ మళ్లీ బ్యాంక్‌కు వ చ్చి ఉత్సాహంగా బాధ్యతలు చేపట్టింది. ఇష్టమైన పని కావడంతో సంతోషంగా చేసానంటారామె! అలా చేస్తూనే పిల్లలకు మరింత మంచి భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో గెయిల్ దంపతులు ఆస్ట్రేలియా ప్రయాణమయ్యారు. అక్కడ బ్యాంక్ ఉద్యోగంలో చేరి తన అద్భుత పనితీరుతో.. 54 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన వెస్ట్ప్యాక్కు సీఈవో అయ్యారు. కెరీర్లో తన ఉన్నతికి పాషన్(అమితమైన ఇష్టం), హార్డ్‌వర్క్ (శ్రమించడం), ఉన్నత విద్య- ఎంబీఏ, మంచి టీం, వెన్నంటి నిలిచే భర్త ప్రధాన కారణాలంటారు గెయిల్. వీటన్నింటికంటే కూడా తనకిష్టం లేని టీచర్ ఉద్యోగాన్ని వదిలేందుకు ఆ రోజు స్కూల్ బస్సు దిగకపోయి ఉంటే.. ఈ రోజు అతిపెద్ద బ్యాంక్‌కు సీఈవోను అయ్యేదాన్ని కాదంటారు! ఓ సాధారణ స్కూల్ టీచర్ అతిపెద్ద బ్యాంక్‌కు సీఈవో కాగలిగినప్పుడు.. మీరెందుకు కెరీర్లో ఉన్నతంగా ఎదగలేరు. కచ్చితంగా ఎదగొచ్చు. కాకపోతే నచ్చని పనిని వదిలేయాలి. ఇష్టమైన పనిని సంతోషంగా చేయాలి. బాగా శ్రమించాలి. మీ మీద మీరు నమ్మకం పెంచుకోవాలి. సాకులు అంటే.. నాకు ఎంబీఏ లేదు.. నేను పిల్లల్ని చూసుకోవాలి.. బదిలీలు అయితే ఊళ్లు మారలేను.. వంటివి మీ ఎదుగుదలకు ప్రతిబంధకాలు కాకుండా చూసుకోండి. గెయిల్ విజయగాథ మనకు ఇస్తున్న సందేశం ఒక్కటే- నచ్చని పని చేస్తున్నారా.. వెంటనే వదిలేయండి. ప్రయాణం ఆనందం ఇవ్వడంలేదా.. బస్సు దిగేసేయండి. మీ కోసం మరెన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న సంగతి మరవకండి! మనలో చాలామంది జీవితాంతం నచ్చని పనిని అంటిపెట్టుకొని ఉంటారు. చేస్తున్న పనిని ప్రతిక్షణం ద్వేషిస్తుంటారు. ఇది వారి పని పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయినా, ఇష్టమైన పనికి మారాలన్న ఆలోచన చేయరు. కారణం.. చేస్తున్న ఉద్యోగం వదిలేసే ధైర్యం లేకపోవడమే! ప్రయాణం నచ్చకపోయినా.. బస్సు దిగే ప్రయత్నం చేయరు. జీవితం చాలా చిన్నది. ఇష్టంలేని పనిచేస్తూ అమూల్యమైన సమయం వృథా చేసుకోవడం సమర్థనీయం కాదు. ఏ పనైతే సంతోషంగా చేస్తారో అందులో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. ఆనందాన్ని ఇచ్చే పనిచేస్తున్నప్పుడే ఏవైనా ప్రతిబంధకాలు ఎదురైతే.. వాటిని అధిగమించే సామర్థ్యం కూడా దానంతట అదే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. ఇష్టంలేని పనిలో మగ్గిపోకండి. గెయిల్ కెల్లీలా మీకు సంతోషం ఇచ్చే పనే చేయండి!! -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
నత్తనడకన ‘మెగా వాటర్‌షెడ్’
ఒక్క పథకంతో ఊరు బాగుపడటమే కాకుండా మీ అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు ఊదరగొట్టారు. అయితే ఆ పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెగా వాటర్‌షెడ్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్న పేదల ఆశలు అడియాసలవుతునాయి. మండల పరిధిలో 2010లో పథకం ప్రారంభం కాగా, ఇప్పటికీ 30 శాతం మేర కూడా అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల్లో పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ఈ పథకం అమలు, రెండు విడతల్లో నిధుల ఖర్చు, చేపట్టనున్న అభివృద్ధి పనుల గూర్చి అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మొదటి విడతతో రూ.ఐదు కోట్లతో నానక్‌నగర్, నందివనపర్తి, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో చెక్‌డ్యాంలు, రాతికట్టలు నిర్మిస్తామని, అలాగే కుల వృత్తిదారులకు రుణాలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహాలు అందజేస్తామని అధికారులు నమ్మబలకడంతో ఇక తమ బతుకులు బాగుపడినట్టేనని పేదలు ఆశించారు. అయితే చిన్న చిన్న చెక్‌డ్యాంలు, మొక్కలు నాటడం మినహా పనుల్లో పురోగతి లేకపోవడంతో వారంతా ఉసూరంటున్నారు. మరోపక్క మెగా వాటర్‌షెడ్ పథకం అక్రమాలకు నిలయంగా మారిందని ఆయా గ్రామాల కమిటీల చైర్మన్లు విమర్శిస్తున్నారు. తమకు తెలియకుండానే చిన్నపాటి చెక్‌డ్యాంల నిర్మాణానికి కూడా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు గ్రామాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి రోడ్ల కిరువైపులా నాటిన మొక్కలు సక్రమ నిర్వహణ లేక ఎండిపోతున్నాయి. రెండో విడతా అదే తీరు... మెగా వాటర్ షెడ్ మొదటి విడత పనులు పూర్తికాకుండానే హడావుడిగా రెండో విడత పనులు చేపట్టారు. ఐదు గ్రామాల్లో రూ.5.16 కోట్ల నిధులతో 4302 హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించడం ద్వారా పదివేల మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యం. ఈ మేరకు 2012 జూలై 24న అప్పటి హోంమంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా చౌదర్పల్లి గ్రామానికి వెళ్లే దారిలో పనుల ప్రారంభానికి సంబంధించి శిలాఫలకం వేయించారు. ఏడాది దాటినా పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. అభివృద్ధి పనుల్లో వేగం లేదు వేలాది మందికి ప్రయోజనం చేకూర్చాల్సిన పథకం అమలులో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. కేవలం చెక్‌డ్యాంల నిర్మాణంతో సరిపెడుతూ మిగతా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పథకం రెండు విడతల్లో ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలి. - కలకొండ బీరప్ప, మెగావాటర్‌షెడ్ చైర్మన్, నక్కర్తమేడిపల్లి పనులు పర్యవేక్షిస్తా... వాటర్‌షెడ్ కింద చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల సత్వర పూర్తికి చర్యలు తీసుకుంటా. వాటర్ షెడ్ పథకం పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ పర్యటించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటా. పేదల సంక్షేమానికి ఉద్దేశించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యేలా చూస్తా. - ఉష, ఎంపీడీఓ, యాచారం