మహిళల్లో ఆర్థిక స్వావలంబన మెరుగుపరుస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. మహిళా సంక్షేమం, ప్రగతి పథకాలకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ పురుషులతో సమానంగా స్త్రీలు సంపాదనపరులు కావాలని, ఇందుకు స్వయం సహాయ సంఘాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. అందుకనే నాలుగేళ్ల కాలంలో మహిళా పథకాల కింద రూ.20,270 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించామని తెలిపారు. అలాగే ఈ ఏడాది మరో రూ.6వేల కోట్ల బ్యాంకు రుణాలను స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా మంజూరు చేయనున్నట్లు ఆమె తెలి పారు. రాష్ట్రంలోని 10 వేల స్వయం సహాయక సంఘాలకు ఈ మొత్తం ద్వారా లబ్ధిచేకూరుతుందని చెప్పారు. మహిళలపై ఆధారపడే కుటుంబాల్లో జీవినాధారం పెంచేందుకు, వివిధ పథకాల అమలుకు 700 గ్రామాలను గుర్తించినట్లు ఆమె తెలిపారు.
ఆయా గ్రామాల్లోని చిన్నతరహా మహిళా గ్రూపులకు రూ.58 కోట్ల రుణాలను బాంకుల ద్వారా అందజేస్తామని తెలిపారు. ఒక్కో గ్రూపుకు ఒక లక్ష రూపాయల చొప్పున 1500 గ్రామాలకు రూ.15 కోట్లు కేటాయించామని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1.14 లక్షల ఇళ్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ర హదారుల అంశంపై మాట్లాడుతూ, 2015-16 ఆర్థికసంవత్సరంలో రూ.800 కోట్లతో 4వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. గ్రామసీమలో రాష్ట్ర ప్రగతికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపుగా అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.50వేల కోట్లతో 41 బ్రిడ్జీలను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ పనులు పూర్తయ్యే దశలో మరో రూ.1475 కోట్లు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. బ్రిడ్జీలు, రహదారుల విస్తరణ, రోడ్ల మరమ్మతులతో పాటుమరిన్ని అభివృద్ది కార్యక్రమాలను గ్రామాలకు తీసుకెళుతున్నామని అన్నారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన
Published Fri, Sep 4 2015 2:33 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
Advertisement
Advertisement