Womens Welfare
-
మహిళా సాధికారతే మా లక్ష్యం
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలో పర్యటించారు. రాజధాని తిరువనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా శక్తి మోదీ వెంటే’ పేరిట నిర్వహించిన మహిళల బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్రంలో గత పదేళ్లలో మహిళల సంక్షేమం, సాధికారత కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. ‘మోదీ గ్యారంటీ’ల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించామని చెప్పారు. మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఉజ్వల పథకం, మంచినీటి కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ముద్రా రుణాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశామని ఉద్ఘాటించారు. త్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ప్రసాదించామని పేర్కొన్నారు. ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మహిళా సాధికారతే తమ లక్ష్యమని అన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేలి్చచెప్పారు. మహిళల జీవన నాణ్యతను పెంచడమే లక్ష్యంగా మోదీ గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఇప్పుడు చట్టంగా మారిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు విపరీతమైన జాప్యం చేశాయని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో మంచి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
రవీంద్రభారతిలో ఘనంగా మహిళాసంక్షేమ సంబరాలు (ఫొటోలు)
-
AP: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల్లోని పేదింటి మహిళలను వారి సామర్థ్యం మేరకు చిన్న, మధ్యస్థాయి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. డ్వాక్రా కార్యక్రమాల్లో కనీసం మూడు నాలుగేళ్ల అనుభవం ఉండి, ఒకట్రెండు విడతలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించిన మహిళలు చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా వారికి వ్యక్తిగతంగా ఒకొక్కరికి గరిష్టంగా రూ.10లక్షల వరకు రుణం ఇప్పించే ఏర్పాట్లుచేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి 575 మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.10 లక్షల చొప్పున వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఇప్పటికే ముందుకొచ్చింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం ఆధ్వర్యంలో మిగిలిన బ్యాంకులు కూడా ఈ తరహా రుణాలిచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. ఇక ఎస్బీఐ ఈ ఏడాది డిసెంబరు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 575 మందిలో ఈ ఆగస్టు 15న 75 మందికి ప్రాథమికంగా రుణ మంజూరు పత్రాలను అందజేయనుంది. తర్వాత దశలో.. రాష్ట్రంలోని ప్రతి పొదుపు సంఘం నుంచి ఇద్దరేసి చొప్పున మహిళలకు ఆర్థిక లావాదేవీలపై శిక్షణనిస్తారు. అనంతరం వారు పూర్తిస్థాయి వ్యాపారస్తులు లేదా చిన్న పరిశ్రమల యజమానులుగా ఎదిగేందుకు అవసరమైన మొత్తాన్ని వ్యక్తిగతంగా బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ఆరు కీలక అంశాల్లో శిక్షణ.. యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వడంలో దేశంలోనే అగ్రగామి సంస్థగా పేరున్న నేషనల్ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌ఏఆర్‌యూడీఎస్‌ఈటీఐ)కు చెందిన నిపుణుల ద్వారా ప్రతి సంఘంలో ఇద్దరు మహిళలకు ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా.. ఆర్థిక ప్రణాళిక, పొదుపు ప్రక్రియలో ఆధునిక పద్ధతులు, రుణాలు పొందడం, బీమాపై అవగాహన, డిజిటల్ లిట్రసీ, వృద్ధాప్య దశలో ఆర్థిక భద్రత.. తదితర అంశాలపై శిక్షణనిస్తారు. ఇప్పటిదాకా వ్యవసాయ అవసరాలకే వినియోగం.. మరోవైపు.. పొదుపు సంఘాల పేరుతో మహిళలు తీసుకుంటున్న రుణాల్లో 60–65 శాతం మేర వ్యవసాయ ఆధారిత అవసరాలకే ఉపయోగించుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా గ్రామీణ ప్రాంతంలోని పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి రూ.18,006.36 కోట్లు రుణం పొందారు. ఇందులో రూ.11,045 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వినియోగించుకున్నట్లు తేలింది. రూ.460.22 కోట్లను సేవా రంగ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టగా, మరో రూ.1,398.48 కోట్లను వివిధ రకాల చిన్నపాటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. అలాగే, ఇంకో రూ.565.25 కోట్లతో కిరాణ షాపులు ఏర్పాటుచేసుకోగా, రూ.800 కోట్లు ఇతర రకాల వ్యాపారాల కోసం వినియోగించుకున్నట్లు తేలింది. 99.6 శాతం మంది సకాలంలో చెల్లింపులు ఇక మాజీ సీఎం చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీచేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేయడంతో డ్వాక్రా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. దీంతో దీనిని గాడిలో పెట్టేందుకు ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలుచేస్తోంది. 2019 ఏప్రిల్ 11నాటికి పొదుపు సంఘాల పేరుతో మహిళలు తీసుకున్న రుణం మొత్తం రూ.25,516 కోట్లు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో మహిళలకు నేరుగా ఈ మొత్తాన్ని అందజేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే సగం మొత్తాన్ని రెండు విడతల్లో రూ.12,756 కోట్లను మహిళలకు అందజేసింది. దీనికితోడు సకాలంలో రుణాలు చెల్లించే మహిళల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. దీంతో పొదుపు మహిళలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. ఫలితంగా.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పొదుపు సంఘాల రుణ రికవరీ రేటు మన రాష్ట్రంలో 99.6 శాతం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదాయం వచ్చేచోటే 50 శాతం పెట్టుబడి పెట్టాలి పొదుపు సంఘాలకు అందజేసే రుణ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇక నుంచి.. కొత్తగా పొదుపు సంఘాన్ని ఏర్పాటుచేసుకుని బ్యాంకు నుంచి తొలివిడత రుణం తీసుకోదలచిన వారికి సంఘం మొత్తానికి రూ.లక్షన్నర దాకా ఇచ్చేలా బ్యాంకులకు ఆదేశాలొచ్చాయి. అనంతరం.. ఈ మొత్తాన్ని చెల్లించిన వారికి రెండో విడతలో మూడు లక్షల దాకా రుణం పొందే వెసులుబాటు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. అలాగే, సంఘాలు తీసుకునే రుణంలో కనీసం లక్ష రూపాయిలు లేదంటే 50 శాతం మేర విధిగా ఆదాయం వచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టేలా చర్యలు చేపడతారు. ఇది కూడా చదవండి: ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు.. -
AP: వ్యాపారవేత్తలుగా ‘పొదుపు’ మహిళలు
సాక్షి, అమరావతి: మహిళల పొదుపు సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. పది నుంచి పన్నెండు మంది చొప్పున ఉండే ప్రతి పొదుపు సంఘంలో కనీసం ఇద్దరిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణను సిద్ధంచేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.42 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో ఆసక్తి, ఉత్సాహం ఉన్న ఇద్దరేసి చొప్పున మొత్తం 16,84,026 మంది మహిళలను గుర్తించి, వారిని పూర్తిస్థాయిలో వ్యాపారవేత్తలుగా తయారుచేసేలా ప్రణాళికను రూపొందించింది. ఇలా గుర్తించిన వారికి ‘రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్యూడీఎస్ఈటీ)లో శిక్షణ పొందిన నిపుణుల ద్వారా ఆరు ప్రధాన అంశాలపై తర్ఫీదు ఇస్తారు. మహిళల్లో పూర్తిస్థాయి ఆర్థిక చైతన్యం కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలకు సుస్థిర ఆదాయం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. వైఎస్సార్ ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చి, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పలు బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది. రూ.30 వేల కోట్ల రుణ లక్ష్యం ఇక సకాలంలో రుణాలు చెల్లించిన 5.34 లక్షల పొదుపు సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి రూ.30 వేల కోట్ల రుణం అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లక్ష్యంగా నిర్ధేశించుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై బ్యాంకర్ల సంఘం ఆమోదం తెలిపింది. మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరిన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.9,800 కోట్లు దాకా పొదుపు చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న తమ డబ్బును మహిళలు నామమత్రం వడ్డీ వచ్చే పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఉంచుకుని.. అదే బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాయి. కానీ, అలాకాకుండా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును అవసరాల మేరకు తీసుకుని ఆ తర్వాత అదనంగా అవసరమయ్యే మొత్తాన్ని బ్యాంకు రుణం పొందడం ద్వారా పెద్దగా అప్పుచేయాల్సిన అవసరం ఉండదని.. బ్యాంకులు ఇందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ బ్యాంకర్ల సమావేశంలో ప్రతిపాదించారు. ఇందుకు బ్యాంకులు సానుకూలంగా స్పందించాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
అక్క చెల్లెమ్మలకు ఆర్థిక దన్ను
సాక్షి, అమరావతి: వర్తన చిన్ని... రెండేళ్లుగా ఇంట్లోనే ఓ చిన్న దుకాణం నడుపుతోంది. పెట్టుబడి దాదాపు 70 వేలు. అన్ని సరుకులూ దొరుకుతుండటంతో వ్యాపారం బానే సాగుతోంది. రోజు గడవటానికి ఇబ్బంది లేదు. కాకుంటే రెండేళ్ల కిందట మాత్రం ఈ పరిస్థితి లేదు. అల్లూరి జిల్లా పాడేరు మండలానికి చెందిన చిన్ని.... ఇక్కడి గుడివాడ గ్రామంలో శ్రీనివాస డ్వాక్రా సంఘ సభ్యురాలే. కానీ సంఘాలు సరిగా అప్పులు తీర్చటం లేదని బ్యాంకులు వీటివైపు చూడటం మానేశాయి. చిన్ని లాంటి మహిళలకు అప్పు పుట్టడమే గగనం. దీంతో రోజు గడవటానికీ ఇబ్బంది పడేది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్ ఆసరా కింద రూ.20వేలు అందింది. దీనికి తోడుగా బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకుంది. ఈ పెట్టుబడే ఆమెను నిలబెట్టింది. తలెత్తుకునేలా చేసింది. బ్యాంకు రుణానికి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో... అదీ ఆమెకు వ్యాపార లాభంగానే మిగులుతోంది. క్రమం తప్పకుండా రుణం తీరుస్తుండటంతో మరికొంత రుణమివ్వటానికి బ్యాంకు సిద్ధంగా ఉంది. ఎవరు తన కథ అడిగినా... సున్నా వడ్డీ పథకం తన జీవితానికి దిగుల్లేకుండా చేసిందంటుంది చిన్ని. చిన్ని లాంటి కథలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన 9.76 లక్షల పొదుపు సంఘాల్లో చాలాచోట్ల వినిపిస్తాయి. ఇంటిని చక్కదిద్దే స్థాయిలో మహిళలు సొంత కాళ్లపై నిలబడ్డారు. దుకాణాలు, జిరాక్స్, ఫ్యాన్సీ షాపులు, బర్రెలు, ఆవులు.. మేకల పెంపకం, ఇలా రకరకాల వ్యాపారాలతో కుటుంబానికి దన్నుగా నిలబడ్డారు. వారు క్రమం తప్పకుండా అప్పు చెల్లిస్తున్నారు కాబట్టే... ప్రభుత్వం కూడా క్రమం తప్పకుండా వడ్డీ రాయితీని చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు రూ.2,354 కోట్లను వడ్డీ రాయితీగా చెల్లించిన ప్రభుత్వం... మూడో ఏడాది కూడా రూ.1,261 కోట్ల మొత్తాన్ని ఈ నెల 22న జమ చేయబోతోంది. ఏటేటా పెరుగుదల పొదుపు సంఘ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అందజేస్తోన్న తోడ్పాటుతో మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,85,615 సంఘాలు సకాలంలో తమ రుణాలు చెల్లిస్తే.. 2020–21 ఆర్థిక సంవత్సంలో ఈ సంఖ్య 9,41,088కి పెరిగింది. ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 9,76,116 సంఘాలకు చెందిన మహిళలు తమ రుణ కిస్తీలను సకాలంలో చెల్లించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించగా... నాటి నుంచి మహిళలు తమ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందుతూ వస్తున్నారు. ఇలా గత రెండు విడతల్లో రూ.2,354.22 కోట్ల మొత్తాన్ని అందుకున్నారు. మూడో విడతగా ఇప్పుడు మరో రూ.1,261.07 కోట్ల మొత్తాన్ని అందుకోబోతున్నారు. అప్పట్లో హామీ ఇచ్చి నట్టేట ముంచిన చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ సంగతి మరిచిపోయారు. దీంతో నాడు రాష్టంలో పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఫలితంగా సంఘాల కార్యకలాపాల్లో కీలకమైన మహిళలు ప్రతి నెలా పొదుపు చేయడాన్ని అప్పట్లో (2014–18 మధ్య) పక్కన పెట్టేశారు. నెల నెలా సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవడం మానేశారు. రుణాలు చెల్లించడం కూడా తగ్గిపోయింది. దీంతో పలు సంఘాలు ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)గా మారిపోయాయి. రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు కూడా ముందుకు రాలేదు. దీనికి తోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పావలా వడ్డీ వంటి పథకాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిధులు నిలిపి వేసింది. ఈ కారణాలన్నింటి వల్ల పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలివ్వటం తగ్గించేశాయి. కోటి రెండు లక్షల మందికి లబ్ధి కోటి రెండు లక్షల మంది మహిళలు 9,76,116 పొదుపు సంఘాల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,261.07 కోట్ల వడ్డీ డబ్బును ప్రభుత్వం ఆయా సంఘాల రుణ ఖాతాల్లో జమ చేయబోతుంది. ఈ నెల 22వ తేదీన మూడో ఏడాది సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ మహిళలు తమ రుణం మొత్తం చెల్లించడం ద్వారా ఆ రుణ ఖాతా క్లోజ్ అయి ఉంటే అలాంటి సందర్భంలో ఆయా సంఘాల పొదుపు ఖాతాలో వారికి సంబంధించిన వడ్డీ డబ్బులు జమ చేయనున్నట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వెల్లడించారు. అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు ► చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 18.36 శాతం సంఘాలు సకాలంలో రుణాలు చెల్లించక బ్యాంకుల వద్ద ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)గా ముద్ర వేసుకున్నాయి. ► ప్రస్తుతం 99.27 శాతం సంఘాలు ఎప్పటికప్పుడు సకాలంలో తమ రుణాలు కిస్తీలను చెల్లిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఎన్పీఏలు కేవలం 0.63 శాతం సంఘాలే. ► ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు సంఘంలో మహిళలందరూ సమావేశమై చర్చించుకోవడం, పొదుపు చేసుకోవడం, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని, బాగా కార్యకలాపాలు నిర్వహించుకునే వాటికి ఏ గ్రేడ్ ఇస్తారు. తర్వాత స్థాయిలో ఉన్న వాటికి బీ, సీ, డీ గ్రేడ్లు కేటాయిస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 60 శాతం సంఘాలు సీ, డీ గ్రేడ్లలో ఉంటే.. కేవలం 40 శాతం సంఘాలు మాత్రమే ఏ, బీ గ్రేడ్‌లో ఉన్నాయి. ► వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 91 శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో ఉండగా, కేవలం తొమ్మిది శాతం సంఘాలు మాత్రమే సీ, డీ గ్రేడ్‌లో ఉన్నాయి. ► మహిళల్లో పొదుపు అలవాటు మరింత పెరిగింది. ఇప్పటి దాకా రాష్ట్రంలోని పొదుపు సంఘాలన్నింటి పేరిట ఉన్న పొదుపు సంఘాల సంఘ నిధి మొత్తం రూ.12,067 కోట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ► గత 34 నెలల కాలంలో ప్రభుత్వం పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.71,673.69 కోట్ల మొత్తాన్ని రుణాలుగా ఇప్పించింది. ► డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి, వడ్డీ శాతం 13.5 నుంచి 9.5కు తగ్గించింది. ఇలా మన రాష్ట్రంలో మాత్రమే జరిగింది. దీంతో పొదుపు సంఘాల కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ► మరోవైపు.. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా (గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి) పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఉన్న రుణ మొత్తాన్ని ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా మహిళలకే అందజేస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక భారం తగ్గింది సున్నా వడ్డీ పథకం మాకు కొండంత అండగా నిలుస్తోంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు అయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నందున జీవనోపాధి మెరుగైంది. ఈ పథకం కింద నాకు మొదటి విడతగా రూ.5,800, రెండో విడతగా రూ.6,300 బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు మూడో ఏడాది సున్నా వడ్డీ సొమ్ము అందనుంది. మా గ్రూప్ సభ్యులంతా కలిసి సక్రమంగా కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నాం. – మడ్డు రాజేశ్వరి, అక్కుపల్లి, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా జిరాక్స్ షాపు బాగా జరుగుతోంది మా సంఘానికి రూ.10 లక్షల రుణం మంజూరైంది. అందరం కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇందులో నా వాటాగా రూ.లక్ష వచ్చింది. నేను జిరాక్స్ షాపు పెట్టుకున్నాను. బాగా జరుగుతోంది. నా అప్పునకు గాను నాకు గత ఏడాది వడ్డీ కింద రూ.3,400 వచ్చింది. ఈ షాపు పెట్టుకోవడం ద్వారా ఆర్థికంగా నాలుగు డబ్బులు కళ్ల జూస్తున్నాను. నాలాగ ఎంతో మంది మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ డబ్బులు ఇస్తోంది. ఈ వారంలో మరో దఫా సున్నా వడ్డీ జమ కానుండటం సంతోషకరం. – వి.శాంతి, ముత్యాలమ్మ గ్రూపు సభ్యురాలు, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా. -
అక్కచెల్లెమ్మలకే అగ్రాసనం
సాక్షి, అమరావతి: ‘యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత (ఎక్కడ మహిళలను పూజిస్తారో.. అక్కడ దేవతలు కొలువుంటారు)’ అన్న సూక్తిని అక్షరాలా చేసి చూపించింది.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. రెండేళ్ల పాలనలో అన్నింటా అక్కచెల్లెమ్మలకే అగ్రాసనం వేసింది. దాదాపు ప్రతి పథకం రూపకల్పన.. అమలు మహిళా అభ్యున్నతే లక్ష్యంగా.. సాధికారితే ధ్యేయంగా.. వారి సంక్షేమంగా పరమావధిగా సాగిందంటే వైఎస్ జగన్ ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఎంత పెద్దపీట వేసిందో అర్థమవుతోంది. ఈ రెండేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 21 పథకాల ద్వారా 4.53 కోట్ల మంది మహిళలకు ఏకంగా రూ.89,234 కోట్ల లబ్ధి చేకూరింది. ఇందులో 3.49 కోట్ల మంది అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.57,052 కోట్ల నగదు బదిలీ జరిగింది. అలాగే నగదేతర బదిలీ పథకాల ద్వారా 1.04 కోట్ల మందికి రూ.32,182.38 కోట్ల లబ్ధి చేకూరింది. ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోనీయకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి. తద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపింది. అధికారం చేపట్టిన కొద్ది నెలల పాలనలోనే ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేసి మహిళా పక్షపాత ప్రభుత్వమని నిరూపించింది. 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు సొంత గూడు లేని కుటుంబాలను గుర్తించి.. మహిళల పేరిటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేసింది. 30.76 లక్షల మంది లబ్ధిదారుల కోసం ఏకంగా 68 వేల ఎకరాలకు పైగా సేకరించింది. ఇందుకు అవసరమైన భూసేకరణ పరిహారం, భూమి అభివృద్ధి కోసం ఏకంగా రూ.27 వేల కోట్ల భారీ వ్యయం చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చేలా చట్టం చేసింది. మహిళల రక్షణ కోసం దిశ బిల్లును ఆమోదించడమే కాకుండా రాష్ట్రంలో ప్రత్యేకంగా దిశ పోలీస్స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. హోంమంత్రి పదవిని మహిళకు ఇచ్చి అక్కచెల్లెమ్మలకు రక్షణపరంగా భరోసా కల్పించింది. సున్నా వడ్డీకి బాబు మంగళం.. వైఎస్ జగన్ సర్కార్ చెల్లింపు గత టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల సున్నా వడ్డీకి కూడా మంగళం పలికింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన మాట మేరకు సున్నా వడ్డీ నిధులను నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలకే జమ చేశారు. పొదుపు సంఘాల్లోని 98,00,626 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2354.22 కోట్లను వేశారు. పొదుపు సంఘాలను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తే.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి ఆర్థిక సాధికారతకు, జీవనోపాధికి నున్నటి బాటలు పరిచింది. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు.. ‘చేయూత’ వైఎస్సార్ చేయూత కింద 45 – 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థికంగా అండదండలు అందించడంతోపాటు వారు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఈ ఏడాది ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)ల్లో 45 – 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థికంగా సాయం అందించాలని నిర్ణయించింది. ఆ నిధులతో వారి స్వయంఉపాధికి పెద్ద కంపెనీలతో అవగాహన ఒప్పందాలను చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన నగదుకు తోడు బ్యాంకుల నుంచి మరింత ఆర్థిక సాయం అందించే ఏర్పాటు చేస్తోంది. కిరాణా షాపులు ఏర్పాటు చేసుకోవడం లేదా గేదెలు, ఆవులను కొనుగోలు చేసుకుని వ్యాపారం పెంపొందించుకునేందుకు వీలుగా పెద్ద కంపెనీల ద్వారా సహకారం అందిస్తోంది. మద్యనియంత్రణతో అక్కచెల్లెమ్మలకు ఊరట మద్యం మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుండటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 43 వేల బెల్టు షాపులు, 4,380 పర్మిట్ రూములను పూర్తిగా ఎత్తేసింది. అంతేకాకుండా మద్యం విక్రయించే వేళలను కూడా తగ్గించేసింది. దీంతో మద్యం విక్రయాలు బాగా తగ్గిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్రంలో 3.80 కోట్ల లిక్కర్ కేసుల అమ్మకాలు జరగ్గా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంఖ్య 2019–20లో 2.59 కోట్ల కేసులకు తగ్గింది. అంటే 32 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. 2020–21లో లిక్కర్ అమ్మకాలు 1.87 కోట్ల కేసులకే పరిమితమవడం గమనార్హం. అదేవిధంగా బీర్ల అమ్మకాల్లోనూ భారీ క్షీణత నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా.. ఇప్పుడీ సంఖ్య 2,394కు పరిమితమైంది. మహిళా సంఘాలకు బాబు సర్కార్ టోకరా.. జగన్ సర్కార్ ఆసరా గత టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న రూ.14,204 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల (2014) ముందు వాగ్దానం చేసింది. అంతేకాకుండా దాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చి ఆ తర్వాత అక్కచెల్లెమ్మలకు ఎగనామం పెట్టింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో తిరిగి అక్కచెల్లెమ్మలకే ఇస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చీరాగానే నెలల వ్యవధిలోనే తొలి విడతగా వైఎస్సార్ ఆసరా పేరిట 77,75,681 మంది మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే రూ.6,310.68 కోట్లు జమ చేశారు. అంతేకాకుండా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను మరింత ఆర్థికంగా బలోపేతంచేసేందుకు పలు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన నిధులకు తోడు బ్యాంకుల ద్వారా మరింత ఆర్ధిక సాయం అందిస్తూ వ్యాపారాలను చేసుకోవడానికి ఊతమందిస్తోంది. మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో కంపెనీలు సహకారమందిస్తున్నాయి. అలాగే మహిళలు స్వయంఉపాధి కింద ఏర్పాటు చేసుకునే షాపులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది. -
అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత కల్పించి పెద్ద పీట వేశారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మంత్రివర్గంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు సీఎం కల్పించారని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆడపిల్లల డ్రాపవుట్లు తగ్గించిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. మహిళలే మహరాణులు అని గుర్తిస్తూ, జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ లా నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా తదితర పథకాల ద్వారా ప్రత్యక్షంగా రూ.56,875 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారని పేర్కొన్నారు. పరోక్షంగా జగనన్న గోరుముద్ద వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ జగనన్న లేఅవుట్లు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యాకానుక పథకాల ద్వారా రూ. 31,164 కోట్లు మహిళల ఖాతాల్లో జమ అయిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం మహిళల ఖాతాల్లో రూ.88 వేల కోట్లకు పైచిలుకు లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలో రాజన్న పాలన మళ్లీ వచ్చిందని ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన నాడు డాక్టర్ వైఎస్సార్ సంక్షేమంపై ఏ విధంగా ప్రధానంగా దృష్టి పెట్టారో మళ్లీ అదే తరహాలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని సుచరిత చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కళాశాల చొప్పున 16 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటలకు ఆర్బీకే ద్వారా గిట్టుబాటు ధరలు కల్పించేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలం రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ అగ్రతాంబూలం అందించారని సుచరిత అన్నారు. రెండేళ్ల సీఎం జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలన ఎలా ఉందో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఓ చిన్న ఉదాహరణగా తీసుకుంటే యాదార్థం అర్థం అవుతుందని చెప్పారు. ఆ కుటుంబానికి అందిన వివిధ సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయన్నారు. వివిధ పథకాల ద్వారా ఒక్క మహిళకే రూ.11 లక్షల మేర లబ్ధి చేకూరిందన్నారు. పేద, బడుగు, బలహీన, మైనార్టీ, వర్గాలకు, మహిళలకు అండగా నిలబడిన సీఎం జగన్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, సువర్ణ పాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సీఎం జగన్ తమకు అండగా నిలిచారని మహిళలు భావిస్తున్నారు. ఇటువంటి మంచి పాలనలో భాగస్వామ్యమైనందుకు మా జన్మ కూడా ధన్యమైందని చెప్పారు. ప్రజలను ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగానే టీడీపీ చూసిందన్నారు. చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి, వాటిల్లో ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వంచించారన్నారు. అదే సీఎం మేనిఫెస్టోలో ఇచ్చిన 94.5 శాతం హామీలను కేవలం రెండేళ్లోనే అమలు చేశారని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వానికి అటు ప్రజలు, ఇటు దేవుని సహకారం ఉందన్నారు. -
8న మొబైల్ కొనే మహిళలకు 10 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల సంక్షేమం, భద్రత దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ ఇప్పటికే విప్లవాత్మక చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి సంబంధించి గురువారం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో హోం, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మెప్మా తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజు.. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2,000 స్టాండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిశ యాప్ కోసం ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో ఆ రోజు (8వ తేదీ) మొబైల్ ఫోన్ల కొనుగోలుపై మహిళలకు 10 శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత, సాధికారతపై షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని, ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలని నిర్ణయించారు. పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్ డే ఆఫ్‌గా ప్రకటించనున్నారు. క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ సీఎం నిర్ణయాలు, ఆదేశాలు ఇంకా ఇలా.. – అంగన్వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్ చెకప్ చేయించాలి. – నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు. – చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్ ఉంచాలి. ఇందు కోసం సెర్ప్, మెప్మా, హెచ్ఎల్ఎల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలి. – ప్లస్–1, ప్లస్–2లో విద్యార్థినులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – జూనియర్ కాలేజీల నుంచి పైస్థాయి కాలేజీల వరకు ‘దిశ’పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలి. ఇందులో దిశ యాప్ సహా అన్ని వివరాలు ఉండేలా చూడాలి. దిశ కింద తీసుకుంటున్న చర్యలు, దీనిపై అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం కొనసాగాలి. – ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఏ రవిశంకర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీఐజీ (టెక్నికల్ సర్సీసెస్) జి పాలరాజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (ఏక కాలంలో అంగన్వాడీ భవనాల పనులు) -
మహిళలకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద వచ్చిన సొమ్ముతో చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. సర్కారు లక్ష్యానికి అనుగుణంగా వివిధ కంపెనీలు, ఆయా శాఖల కార్పొరేషన్ల ఎండీలు, లబ్ధిదారులతో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుకొచ్చిన కంపెనీలు ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన మహిళలు వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులుగా ఉన్నారు. ఒక్కొక్కరికీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తుంది. ► వారికి ఇప్పటికే మొదటి విడత సాయం అందించింది. ఆ సొమ్ముతో అత్యధికులు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ► వారికి వివిధ కంపెనీలు తమ ఔట్లెట్స్ ద్వారా సరుకులు సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ► హిందుస్థాన్ లీవర్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సరుకులు సరఫరాకు అయ్యే రవాణా ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు. ► 3 నెలల వరకు సరుకు అమ్ముడుకాకపోతే రిటర్న్ తీసుకునేందుకు కూడా పలు కంపెనీలు అంగీకరించాయి. ► హిందుస్థాన్ యూనివర్సల్ లిమిటెడ్, ఐటీసీ, పీఅండ్‌జీ కంపెనీలు సంబంధిత మహిళలకు అవసరమైతే రుణ సాయం చేస్తామని, సరుకులు సరఫరా చేసి వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపాయి. ► లబ్ధిదారుల సందేహాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. -
24 గంటల్లోనే చార్జిషీట్ దాఖలు
ఏలూరు టౌన్/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ‘దిశ’ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానం చేశారు. దిశ పోలీసు స్టేషన్లు, దిశ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్ఓఎస్ యాప్ మహిళలకు రక్షణగా నిలుస్తోంది. ఈ యాప్ ద్వారా రక్షణ కోరిన ప్రభుత్వ మహిళా అధికారికి పోలీసులు అండగా నిలిచారు. ఆమెను వేధింపులకు గురిచేసిన ప్రొఫెసర్ బసవయ్య కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసులు చార్జిషీట్‌ను(అభియోగ పత్రం) కేవలం 24 గంటల్లోనే బుధవారం ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేయడం గమనార్హం. అసలేం జరిగింది.. విశాఖపట్నం నుంచి విజయవాడకు బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళా అధికారిని ఆంధ్రా యూనివర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కాలోతు బసవయ్య మంగళవారం తెల్లవారుజామున పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. వెంటనే ఆమె దిశ ఎస్ఓఎస్ యాప్ ద్వారా రక్షణ కోరగానే, బస్సు ఏలూరు జాతీయ రహదారిలో పెదపాడు మండలం పరిధిలోని కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకునేలోపు ఏలూరు త్రీటౌన్ పోలీసులు స్పందించి, కేవలం 6 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలికి రక్షణగా నిలిచారు. నిందితుడిని అరెస్టు చేసి ఏలూరు త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆదేశాలతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును పెదపాడు పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. పెదపాడు ఎస్సై జ్యోతిబసు కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం 24 గంటల్లోనే ఈ కేసులో చార్జిషీటును ఏలూరు ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేశారు. దేహశుద్ధి జరిగినా బుద్ధి మార్చుకోని బసవయ్య దిశ యాప్ ద్వారా నమోదైన తొలి కేసులోని నిందితుడు కాలోతు బసవయ్య నాయక్ నేపథ్యం ఆరా తీస్తే అతడు గతంలోనూ మహిళలను వేధించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బసవయ్య ఎమ్మెస్సీ చదివి, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరాడు. ఇటీవలే ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. మహిళలను వేధింపులకు గురిచేయడం బసవయ్యకు అలవాటేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. భీమవరంలోని ఓ కాలేజీలో గతేడాది జరిగిన పరీక్షలకు బసవయ్య ఎగ్జామినర్‌గా వచ్చాడు. అప్పుడు అక్కడి విద్యార్థినులు, మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కాలేజీ సిబ్బంది అతడిని నిర్బంధించి, దేహశుద్ధి చేశారు. అçప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు సమాచారం అందించారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని యూనివర్సిటీ ప్రతినిధులు భీమవరంలోని ప్రైవేట్ కాలేజీ సిబ్బందికి నచ్చజెప్పడంతో అతడిని విడిచిపెట్టారు. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని బసవయ్య బస్సులో ప్రభుత్వ ఉద్యోగిని వేధిçస్తూ పోలీసులకు చిక్కాడు. పెదపాడు పోలీసులు అతడిపై క్రైమ్ నెంబర్ 52/2020 ఐపీసీ సెక్షన్ 354, 354(ఎ) కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఏలూరు ఎక్సైజ్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు నిందితుడు బసవయ్యకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. -
ప్రతి అంగన్వాడీలో మరుగుదొడ్డి!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్డిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల్లో అత్యధిక లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు ఈ కేంద్రాన్ని సందర్శించే సమయంలో వారికి అత్యవసర సమయంలో వసతి కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. చాలాచోట్ల అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాల ఆవరణకు సమీపంలో, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఉండడంతో స్కూల్‌కు కేటాయించిన మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. వీటి నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో కేంద్రం మంజూరు చేస్తున్న నేపథ్యంలో స్థానిక అవసరాలు, లబ్ధిదారుల నిష్పత్తిని బట్టి అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఏటా 25శాతం చొప్పున కార్యాచరణ ప్రణాళికలో పొందుపర్చి నిర్మాణాలు చేపట్టనున్నారు. మొత్తంగా నాలుగేళ్లలో ప్రతి కేంద్రంలో మరుగుదొడ్డి ఉండాల్సిందే. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాను భరించాల్సి ఉంటుంది. తాగునీరూ అవసరమే లబ్ధిదారులకు వసతుల కల్పనలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి వసతికి ప్రభుత్వం నిధులివ్వనుండగా.. మరుగుదొడ్ల నిర్వహణ ఇతరత్రా కార్యక్రమాలకు అవసరమయ్యే వాడుక నీటికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం స్థానిక పాలకులు చూడాల్సిందిగా సూచించింది. మరుగుదొడ్లు, తాగునీటి వసతులను ఒకే కార్యాచరణ ప్రణాళికలో రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తే విడుదల వారీగా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. -
‘షీ నీడ్’ మంచి ఆలోచన
హైదరాబాద్: మహిళల కోసం ‘షీ నీడ్’ను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘ్‌వేంద్రసింగ్ చౌహన్ సతీమణి రేఖా చౌహాన్ పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని జెడ్పీహెచ్ఎస్ ముందు తొలిసారిగా ఏర్పాటు చేసిన షీ నీడ్ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించేందుకు షీ నీడ్ దోహదపడుతుందని అన్నారు. వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. రుతుక్రమం సమయంలో ఎంతో మంది విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడం లేదన్నారు. సురక్షితమైన శానిటేషన్ ప్యాడ్లు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో షీ నీడ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉపయోగించిన ప్యాడ్లను చెత్త లో, డ్రైనేజీలో వేయడం సరికాదన్నారు. ఉపయోగించిన ప్యాడ్లను కాల్చివేసే మెషీన్ షీ నీడ్‌లో ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ, ఆపిల్ హోమ్ సంయుక్తంగా మరికొన్ని షీ నీడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయని వెల్లడించారు. ఆపిల్ హోమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమా ఆర్య మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న సమస్య నుంచే షీ నీడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. త్వరలో అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్ వద్ద మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి కియోస్క్ మిషన్‌లో ప్రతి రోజు 50 శానిటరీ ప్యాడ్లు అంటే నెలకు 1,500 ప్యాడ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తొలి సెంటర్ ఏర్పాటుకు తానే ఖర్చు చేశానని, జీహెచ్ఎంసీ పరిధిలో 50 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సంవత్సరంలో 18,000 శానిటరీ ప్యాడ్స్ అందించే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వీటి ఏర్పాటుకు దాతల సహకారం తీసుకుంటామని మెషీన్‌తో పాటు సంవత్సరం మొత్తం శానిటరీ ప్యాడ్స్ అందించే వారికే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. షీ నీడ్‌కు రూ.2.05 లక్షల ఖర్చు ప్రతి షీ నీడ్ కేంద్రంలో స్వయం ఉపాధి గ్రూప్ మహిళల చేతి ఉత్పత్తులను విక్రయించుకొనే అవకాశం కల్పిస్తామని నీలిమా ఆర్య తెలిపారు. ప్యాడ్స్‌ను తీసుకున్న మహిళలు ఉపయోగించిన ప్యాడ్లను కాల్చివేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ప్యాడ్ అవసరమైన వారు ఎలాంటి మొహమాటం లేకుండా శానిటరీ ప్యాడ్ పొందవచ్చని తెలిపారు. షీ నీడ్ ఏర్పాటు కోసం రూ.2.05 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శానిటరీ ప్యాడ్లను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఎంతో సంతృప్తి ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఉపకమిషనర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా మహిళల రక్షణ చట్టాల అమలు
సాక్షి, హైదరాబాద్: మహిళా హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఉన్న వివిధ చట్టాలను పకడ్బందీగా, మరింత ప్రభావవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ రంగాల ప్రతినిధులు జాతీయ మహిళా కమిష న్కు సూచించారు. మహిళలు ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లు, సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్‌క్రైమ్‌కు ఎక్కువగా మహిళలే గురవుతున్నందున, వాటిని అదుపు చేసేందుకు నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలనే సూచనలు చేశారు. విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో మహిళలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వ్యవసాయ రంగంలోని మహిళల హక్కులను గుర్తించి సహాయ చర్యలను చేపట్టాలని, ఇళ్లల్లో పనిచేసే పనిమనుషుల సంక్షేమానికి, వివిధరూపాల్లో మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు గృహహింస చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో జాతీయ, తెలంగాణ మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ మహిళా విధానం-2016 ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపుల ప్రక్రియ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరిల నుంచి మహిళాహక్కులు, సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీవోలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు, వివిధ సంఘాల ప్రతినిధులు, నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యకార్యదర్శి ప్రీతిమదన్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా ముసాయిదా జాతీయవిధానాన్ని గురించి వివరించారు. గురువారం సాయంత్రంలోగా జాతీయ మహిళా కమిషన్‌కు ముసాయిదా మార్పులు, చేర్పులపై తమ సలహాలు, సూచనలు తెలియజేస్తే, వాటిని పరిశీలించి జాతీయ విధానంలో చేరుస్తామని ప్రీతిమదన్ తెలిపారు. సమావేశంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్న పనేని రాజకుమారి, కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ కేసీ రోసా కుట్టి, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రశాంతి, డెరైక్టర్ విజేంద్ర బోయి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ రిజర్వేషన్లు రాలేదా: ప్రీతిమదన్ లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు వాస్తవరూపం దాల్చుతాయో తెలియడం లేదని త్రిపురాన వెంకటరత్నం వ్యాఖ్యానించగా, ఈ రిజర్వేషన్లు వచ్చాయి కదా అని ప్రీతిమదన్ ప్రతిస్పందించారు. రాజకీయ రిజర్వేషన్లు ఎక్కడ వచ్చాయంటూ ఆమె వ్యాఖ్యలను త్రిపురానతోపాటు పలువురు విభేదించారు. దీనితో ఆమె సర్దుకుని పోటీ పడి హక్కులు సాధించుకోవాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి, మెరుగైన వైద్యంపై దృష్టి పెట్టాలని రమా మెల్కోటె సూచించారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఉమాపతి సూచించారు. గ్రామ పంచాయతీలలోనే వీటిని అరికట్టేలా ప్రత్యేకచర్యలు, రైళ్లలో వీరి రవాణాను అడ్డుకునేందుకు టీసీలను భాగస్వాములను చేయాలన్నారు. -
పురుషుల హక్కులకు భరోసాగా...
రిపోర్ట్ రాజ్యాంగం సాక్షిగా మనది గణతంత్ర రాజ్యం. సర్వసమాన రాజ్యం. స్వేచ్ఛా వాయువులు నలుచెరగులా విస్తారంగా వీచే సర్వస్వతంత్ర రాజ్యం. ఇంకనూ... దయగల ఏలినవారి చలవ వల్ల మనది సంక్షేమ రాజ్యం. ఇన్ని విశేషణాలు గల కర్మభూమిలో పురుషాధములకు కష్టములేమి యుండును? ఏలినవారు బహుశ అటులనే భావించి ఉందురు. ఎక్కడపడితే అక్కడ వేలాడే ముఖాలతో కనిపించే మగాళ్లను సుఖజీవులుగానే వారు తలపోసి ఉందురు. మగజాతిపై విశ్వవిద్యాలయాలదీ, ప్రసారసాధనాలదీ కూడా ఇదే దృక్పథం. ఆ యొక్క మహత్తర దృక్పథంతోనే మన విశ్వవిద్యాలయాలు ఎక్కువ సమానులైన మహిళల గురించి, వారి సాధక బాధకాల గురించి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకుని, ఆ విధంగా ముందుకు పోతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలవుతోంది. ఇన్నాళ్లలో మన ప్రభుత్వాలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ ఎక్కడా మగాళ్ల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనే చేయలేదు. రాష్ట్రపతి, ప్రధాని ఇత్యాది ఘనత వహించిన పదవులను అలంకరించిన వారిలో అత్యధికులు పుణ్యపురుషులే. అయినా, వారెవరూ సాటి ‘మగా’నుభావుల ఈతిబాధలను పట్టించుకున్న పాపాన పోలేదు. పత్రికలు, ప్రసార సాధనాలు సైతం ఇతోధికంగా స్త్రీవాదుల గొంతును మార్మోగించడంలోనే తలమునకలుగా ఉంటూ, పురుషాధముల గొంతును కడు వ్యూహాత్మకంగా విస్మరిస్తున్నాయి. పురుష హక్కుల సంఘాలు ఎంత గగ్గోలు పెడితే మాత్రం... అదంతా మీడియాకు ఎక్కకపోయాక ఇక ఏం లాభం? మన దేశంలో మాత్రమే కాదు, చాలా దేశాల్లో మగాళ్లది ఇదే పరిస్థితి. ప్రపంచంలో మగాళ్ల బతుకులు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దశలో ఫిన్లాండ్ అనే అప్రాచ్య దేశంలో ఒక ఆశాజనకమైన పరిణామం చోటు చేసుకుంది. పురుషాధములలో మెజారిటీ జనాభా తమను తాము తక్కువ సమానులుగా తలపోస్తూ, కుంగిపోతుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఫిన్లాండ్ సర్కారు నడుం బిగించింది. పురుషుల హక్కులకు భరోసా కల్పించేందుకు తగిన విధానాన్ని రూపొందించే బాధ్యతను లింగ సమానత్వ (జెండర్ ఈక్వాలిటీ) మంత్రిత్వ శాఖకు అప్పగించింది. -
మహిళలకు ఆర్థిక స్వావలంబన
మహిళల్లో ఆర్థిక స్వావలంబన మెరుగుపరుస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. మహిళా సంక్షేమం, ప్రగతి పథకాలకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ పురుషులతో సమానంగా స్త్రీలు సంపాదనపరులు కావాలని, ఇందుకు స్వయం సహాయ సంఘాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. అందుకనే నాలుగేళ్ల కాలంలో మహిళా పథకాల కింద రూ.20,270 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించామని తెలిపారు. అలాగే ఈ ఏడాది మరో రూ.6వేల కోట్ల బ్యాంకు రుణాలను స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా మంజూరు చేయనున్నట్లు ఆమె తెలి పారు. రాష్ట్రంలోని 10 వేల స్వయం సహాయక సంఘాలకు ఈ మొత్తం ద్వారా లబ్ధిచేకూరుతుందని చెప్పారు. మహిళలపై ఆధారపడే కుటుంబాల్లో జీవినాధారం పెంచేందుకు, వివిధ పథకాల అమలుకు 700 గ్రామాలను గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఆయా గ్రామాల్లోని చిన్నతరహా మహిళా గ్రూపులకు రూ.58 కోట్ల రుణాలను బాంకుల ద్వారా అందజేస్తామని తెలిపారు. ఒక్కో గ్రూపుకు ఒక లక్ష రూపాయల చొప్పున 1500 గ్రామాలకు రూ.15 కోట్లు కేటాయించామని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1.14 లక్షల ఇళ్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ర హదారుల అంశంపై మాట్లాడుతూ, 2015-16 ఆర్థికసంవత్సరంలో రూ.800 కోట్లతో 4వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. గ్రామసీమలో రాష్ట్ర ప్రగతికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపుగా అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.50వేల కోట్లతో 41 బ్రిడ్జీలను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ పనులు పూర్తయ్యే దశలో మరో రూ.1475 కోట్లు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. బ్రిడ్జీలు, రహదారుల విస్తరణ, రోడ్ల మరమ్మతులతో పాటుమరిన్ని అభివృద్ది కార్యక్రమాలను గ్రామాలకు తీసుకెళుతున్నామని అన్నారు. -
త్వరలో మహిళల కోసం ప్రత్యేక ఆటోలు
సాక్షి, ముంబై : మహిళా ప్రయాణికుల కోసం మహిళా డ్రైవర్లతో 50 ఆటో సేవలు థానేలో త ్వరలో ప్రారంభం కానున్నాయి. పట్టణంలో కొన్ని ఆటోలు మహిళలే నడపాలని ఎమ్మెమ్మార్డీఏకు ప్రతిపాదన పంపిన రవాణా శాఖ, తర్వాత మహిళల సంక్షేమం కోసం 50 మంది మహిళా డ్రైవర్లను ఇవ్వాలని ఎన్జీవోలను ఆశ్రయించింది. మహిళలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేసి వారితో ఆటోలను నడిపించేందుకు కృషి చేస్తున్నామని రవాణా విభాగం పేర్కొంది. మహిళలే ఆటో నడపడం వల్ల మహిళా ప్రయాణికులకు కూడా సురక్షిత భావం ఏర్పడుతుందని రవాణా శాఖ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటోలకు ప్రత్యేక రంగు ప్రతిపాదించామని తెలిపారు. ఈ ప్రతిపాదన అమలైతే రాష్ట్రంలో మహిళా డ్రైవర్లున్న తొలి పట్టణంగా థానేకు ఘనత దక్కుతుందని అన్నారు. -
30 రోజుల్లో 1400 మైళ్లు పరుగెత్తింది!
రోజుకు దాదాపు 50 మైళ్లు... అలా 32 రోజులు. మొత్తంగా 1,460 మైళ్ల దూరం! అది కూడా సఫారీల మధ్యన.. అటవీ జంతువులకు ఆవాసమైన దక్షిణాఫ్రికాలోని కొండలు, గుట్టలతో ఉన్న అడవుల మధ్య. పైగా ఈ సాహసం చేసిందేమీ పడచు పిల్ల కాదు, 52 యేళ్ల నడివయస్కురాలు! అంతటి సాహసం చేసింది... మిమి అండర్సన్. ఈ పరుగును ఆమె తన ప్రతిభను చాటుకోవడానికి కాదు... ఒక సంక్షేమ కార్యానికి నిధులు సమకూర్చడం కోసం పూర్తి చేసింది. తమ దేశమైన దక్షిణాఫ్రికాలో వివక్షకు గురి అవుతున్న మహిళల, బాలికల సంరక్షణార్థం నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన మిమి విజయవంతంగా 22 వేల పౌండ్ల నిధిని సేకరించగలిగింది. మిమీది అనేక రేసుల్లో పాల్గొని, ఛాంపియన్‌గా నిలిచిన నేపథ్యం. దాంతో ఆమె తన ప్రతిభా సామర్థ్యాలను మహిళా సంక్షేమం కోసం వెచ్చించాలనుకుంది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా భారీ మారథాన్‌కు శ్రీకారం చుట్టింది. మారథాన్‌ను మొదలు పెట్టడానికి ముందు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది మిమీ. అందులో తన ప్రయాణం గురించి వివరిస్తూ విరాళాలను కోరింది. పీటర్‌మారిట్జ్‌బర్గ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కేప్‌టౌన్ సమీపంలోని పార్ల్‌లో తన మారథాన్‌కు ముగింపును ఇచ్చింది మిమి. ఈ ప్రయాణంలో మిమి పడ్డ కష్టాలు అలాంటిలాంటివి కాదు... చెట్లు, చేమలు, కొండలతో నిండి ఉన్న ఈ అటవీప్రాంతంలో పరిగెత్తడం మామూలు మాటలు కాదు.. అందులోనూ ఒకటి కాదు రెండు కాదు... రోజుకు సుమారు 50 మైళ్ల దూరం పరుగెత్తింది మిమి. సముద్రమట్టానికి కొన్ని వందల, వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో పరుగు పెట్టడం అంత సులభం కాదని.. అయితే ఒక మంచి పని కోసం కష్టపడుతున్నాననే భావన కొండంత స్థైర్యాన్ని ఇచ్చిందని సంతోషంగా చెప్పింది. దటీజ్ మిమి. -
సమానత్వం కోసం వినూత్న యత్నం
హి ఫర్ షి స్త్రీ, పురుష సమానత్వం కోసం ప్రపంచ దేశాలలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) చాలాకాలంగా కృషిచేస్తున్నాయి. కొన్ని దేశాల్లోనైతే లైంగిక సమానత్వం కోసం ప్రభుత్వమే ప్రణాళికలను చేపడుతోంది. సమానత్వం ఉన్న చోట సమాజంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి ఉంటుంది. అందుకే ఈ ప్రయత్నాలు. ఈ క్రమంలో ఇప్పుడు ఐరాస మహిళా విభాగం ఇటీవల న్యూఢిల్లీలో స్త్రీ, పురుష సమానత్వ ప్రచారోద్యమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఆ ఉద్యమం పేరు ‘హి ఫర్ షి’. పేరులోనే కాదు, ఉద్దేశంలోనూ నవ్యత ఉన్న కార్యక్రమం ఇది. 2030ని ఒక గడువుగా పెట్టుకుని ఆనాటికల్లా స్త్రీ, పురుష సమానత్వం సాధించడం కోసం అంతర్జాతీయంగా బాలురు, పురుషుల సహాయంతో ముందుకెళ్లాలని 'హ ఫర్ షి’ ద్వారా సమితి సంకల్పించింది. ‘హి ఫర్ షి’ అంటే.. ఆమె కోసం అతడు అని. ఈ నినాదంతో మహిళా సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం పురుషుల సేవలను, సహకారాన్ని తీసుకుని తద్వారా లైంగిక సమానత్వం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమితి మహిళా ప్రతినిధి రెబెక్కా టవేర్స్’ ప్రకటించారు. ఇందుకోసం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ‘మెన్ఎంగేజ్’ అనే సంస్థ నేతృత్వంలో బాలురు, పురుషుల సహాయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. తొలుత ఈ ఏడాది సెప్టెంబరు 20న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రారంభమైన ‘హి ఫర్ షి’ ప్రచారోద్యమాన్ని, మనదేశంలో అక్టోబర్ 18న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రారంభించారు. ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది బాలురు, పురుషుల నుంచి ప్రతిజ్ఞా సంతకాన్ని సమితి సేకరించింది. అందులో 4000 మంది భారతీయులు ఉన్నారు. ఇలా ప్రతిజ్ఞ చేసినవారు స్త్రీల హక్కుల కోసం తమ వంతుగా పాటు పడవలసి ఉంటుంది. స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలలో తమ గళం వినిపించవలసి ఉంటుంది. స్త్రీల సమస్యలపై మగవాళ్లలో సహానుభూతి కల్పించి, లైంగిక సమానత్వం సాధించడం కోసం గత నాలుగు మాసాలుగా భారత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని చెబుతూ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం కూడా లైంగిక సమానత్వానికి మరింతగా తోడ్పడుతుందని మనేకా గాంధీ అన్నారు. బాలురు, పురుషులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ‘హి ఫర్ షి’ లో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు ‘మెన్ ఎంగేజ్’ సంస్థ నవంబర్ 10 నుంచి 13 వరకు నాలుగురోజుల పాటు తన రెండవ అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించబోతోంది. ‘లైంగిక సమానత్వం కోసం బాలురు, యువకులు’ అనే ప్రధానాంశంగా ఈ సదస్సు జరగనుంది. దీనిపై ‘సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ జస్టిస్’ ప్రతినిధి అభిజిత్ మాట్లాడుతూ... ‘‘స్త్రీల సమస్యల పట్ల సహానుభూతి కలిగి ఉండడమే అసలైన పురుషత్వం అనే భావనను బాలురు, పురుషులలో కలిగించ డమే ‘మెన్ ఎంగేజ్’ లక్ష్యం అని అన్నారు. ఇంత ఉన్నతమైన లక్ష్యానికి దేశంలోని బాలురు, పురుషులంతా సహకరిస్తే, తమ మద్దతు ప్రకటిస్తే స్త్రీ పురుష సమానత్వాన్ని గడువులోపలే సాధించవచ్చు. మగవాళ్లకు అవగాహన కల్పించాలి స్త్రీ, పురుష సమానత్వ సాధనలో పురుషుల భాగస్వామ్యమే కీలకం. స్త్రీలు ఎదుర్కొంటున్న సామాజిక ఆంక్షలు, కుటుంబ అవరోధాలపై గనుక బాలురకు, పురుషులకు అవగాహన కలిగించగలిగితే లైంగిక అసమానతలు త్వరలోనే రూపుమాసిపోతాయి. - మనేకాగాంధీ, కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి