బుధవారం తిరువనంతపురంలో అభివాదం చేస్తున్న మోదీ
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలో పర్యటించారు. రాజధాని తిరువనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా శక్తి మోదీ వెంటే’ పేరిట నిర్వహించిన మహిళల బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్రంలో గత పదేళ్లలో మహిళల సంక్షేమం, సాధికారత కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. ‘మోదీ గ్యారంటీ’ల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించామని చెప్పారు.
మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఉజ్వల పథకం, మంచినీటి కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ముద్రా రుణాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశామని ఉద్ఘాటించారు. త్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ప్రసాదించామని పేర్కొన్నారు. ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మహిళా సాధికారతే తమ లక్ష్యమని అన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేలి్చచెప్పారు.
మహిళల జీవన నాణ్యతను పెంచడమే లక్ష్యంగా మోదీ గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఇప్పుడు చట్టంగా మారిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు విపరీతమైన జాప్యం చేశాయని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో మంచి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment