Womens Rally
-
అబార్షన్ మా హక్కు
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అబార్షన్ హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది మహిళలు రాజధాని వాషింగ్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ర్యాలీలతో హోరెత్తించారు. వాషింగ్టన్ వీధుల్లో నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పురుషులు కూడా నిరసనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాకుండా అబార్షన్ హక్కుల సవరణల బ్యాలెట్‌పైనా ఓటేయాలని ప్రజలను కోరారు. వాషింగ్టన్లో జరిగిన విమెన్స్ మార్చ్‌లో స్త్రీవాద ఉద్యమకారిణి ఫన్నీ గోమెజ్ లూగో అబార్షన్ బ్యాలెట్ ఉన్న 10 రాష్ట్రాల జాబితాను చదివి వినిపించారు. మిస్సోరీలోని కాన్సాస్ సిటీలో జరిగిన ర్యాలీలో అబార్షన్ హక్కుల చట్టం కోసం ప్రజలు సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ అభ్యరి్థగా హారిస్ బరిలోకి దిగినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు మహిళల అబార్షన్ హక్కులు ప్రధానాంశంగా మారాయి. అబార్షన్ హక్కును రద్దు చేసి, దానిపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుకు నిరసనగా కార్యక్రమాలు పెరిగాయి. -
మహిళా సాధికారతే మా లక్ష్యం
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలో పర్యటించారు. రాజధాని తిరువనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా శక్తి మోదీ వెంటే’ పేరిట నిర్వహించిన మహిళల బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్రంలో గత పదేళ్లలో మహిళల సంక్షేమం, సాధికారత కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. ‘మోదీ గ్యారంటీ’ల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించామని చెప్పారు. మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఉజ్వల పథకం, మంచినీటి కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ముద్రా రుణాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశామని ఉద్ఘాటించారు. త్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ప్రసాదించామని పేర్కొన్నారు. ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మహిళా సాధికారతే తమ లక్ష్యమని అన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేలి్చచెప్పారు. మహిళల జీవన నాణ్యతను పెంచడమే లక్ష్యంగా మోదీ గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఇప్పుడు చట్టంగా మారిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు విపరీతమైన జాప్యం చేశాయని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో మంచి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
దాహం తీర్చరూ..
కురవి : మండల కేంద్రంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు సోమవారం గ్రా మపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళలు తొలుత ర్యాలీ నిర్వహించా రు. పైప్‌లు పగిలాయనే కారణంతో న ల్లాల ద్వారా నీటిని అందించడంలో అధికారు లు విఫలమవుతున్నారన్నారు. పాత బోర్లను రిపేరు చేయించాలని, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందజేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఎం డివిజన్ కమిటీ సభ్యుడు గం ధసిరి శ్రీనివాస్, మేట్ల సంఘం నాయకులు, మహిళలు కొత్త శ్రీనివాస్, కొణతం వీరన్న, రజిత, లలిత, నరేష్, కట్ల కృష్ణయ్య, చంద నర్సమ్మ, ఉపేంద్ర, రజిత, గంధసిరి పద్మ, సంధ్య, గోరు రవి, సాగరిక పాల్గొన్నారు.