వయనాడ్‌ విపత్తులో వందలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు: మోదీ | This disaster is not normal: PM after visit to landside-hit Wayanad | Sakshi
Sakshi News home page

ప్రకృతి విపత్తులో వందలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు: మోదీ

Published Sat, Aug 10 2024 5:31 PM | Last Updated on Sat, Aug 10 2024 6:04 PM

This disaster is not normal: PM after visit to landside-hit Wayanad

కేరళలో ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్‌ విలయ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని మోదీ పరామర్శించారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్‌, గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, కేంద్రమంత్రి సురేష్‌ గోపి, ఇతర యవనాడ్‌ ఉన్నతాఅధికారులతో ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. వయనాడ్‌లో కొండచరియలు విగిరిపడినప్పటి నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విపత్తులో వందలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారని అన్నారు. ప్రకృతి విలయంలో వాళ్ల కలలన్నీ కల్లలైపోయాయని అన్నారు. ఈ దుఃఖ సమయంలో మీకు అండగా ఉంటామని బాధితులకు చెప్పినట్లు తెలిపారు.

 

 ‘ఈ రోజు నేను రిలీఫ్‌ క్యాంపులో బాధితులను స్వయంగా కలిశాను. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించాను. వారు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు. వయనాడ్‌ విలయంలో చిక్కకున్న వారికి అండగా నిలవాలి. అంతా కలిసి పనిచేస్తేనే బాధితులకు అ అండగా ఉండగలం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అంతా కలిసి పనిచేయాలి. ఆప్తులను కోల్పోయిన వారికి అండగా నిలుద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నష్టం అంచనాలు పంపిన వెంటనే ప్రకృతి విపత్తు సాయం అందిస్తాం

సంఘటన జరిగిన రోజు ఉదయం నేను సిఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. మేము సహాయం అందజేస్తామని, వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాను. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌. సైన్యం, పోలీసులు, వైద్యులు, ప్రతి ఒక్కరూ బాధితులకు వీలైనంత త్వరగా సహాయం చేయడానికి ప్రయత్నించారు. మృతుల కుటుంబీకులు ఒంటరిగా లేరని నేను హామీ ఇస్తున్నాను. వారికి మేము అండగా ఉన్నాం. కేరళ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం వారికి సాయం చేస్తోంది. ’ అని తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement