Wayanad
-
‘మ్యాన్ ఈటర్’ హతం..ఇతర పులుల దాడిలోనే..!
తిరువనంతపురం:కేరళలో మనుషులపై దాడి చేసి చంపుతున్న మ్యాన్ ఈటర్ ఆడపులి మృతిచెందింది. పులి కళేబరాన్ని సోమవారం ఉదయం వయనాడ్‌లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. కళేబరం తాము వెతుకున్న మ్యాన్ ఈటర్దేనని ధృవీకరించారు. 6నుంచి7 ఏళ్ల వయసు ఉండి ఒంటిపై గాయాలున్న ఆడపులి కళేబరాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గత వారం పులి 45 ఏళ్ల గిరిజన మహిళపై దాడి చేసి చంపిందని కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ తెలిపారు. దీంతో దానిని కాల్చి చంపేందుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. మ్యాన్ ఈటర్ పులిని పట్టుకునేందుకు తాము సాగించిన వేట దాని కళేబరం దొరకడంతో ముగిసినట్లు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ తెలిపారు. పులి ఒంటిపై ఉన్న గాయాలు కొన్ని పాతవి కాగా మరికొన్ని తాజాగా అయినవని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. ఇతర పులుల దాడిలోనే అది మరణించి ఉండొచ్చని చెప్పారు. తమపై వన్యమృగాల దాడులు ఎక్కువయ్యాయని,వాటిని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని వయనాడ్‌లో గిరిజనులు ఇటీవల ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.ఇదీ చదవండి: జగిత్యాలలో పులి సంచారం.. భయాందోళనల్లో ప్రజలు -
కుటుంబం, తోడుంటానన్న ప్రియుడు దూరమైపోయినా..శృతి స్ఫూర్తిదాయక జర్నీ
ధైర్యంగా ఉండాలి. ఆశ నిలపాలి. స్థైర్యాన్ని కూడగట్టుకోవాలి. జూలై 30న వాయనాడ్ వరదల్లో శ్రుతి చూసిన నష్టాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబ సభ్యులను పోగొట్టుకుంది. పెళ్లి కోసం దాచిన డబ్బు, బంగారం నీటి పాలయ్యాయి. ఆఖరికు చేసుకోవాల్సిన కుర్రాడు కూడా యాక్సిడెంట్లో మరణించాడు. అయినప్పటికీ ఎందరో ఆమెకు తోడుగా నిలిచారు. శ్రుతి విధిని ఎదిరించి నిలబడింది. మొన్నటి సోమవారం ప్రభుత్వ ఉద్యోగిగా నియమితురాలై తన సీటులో కూచుని నవ్వింది.సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్బుక్ పేజీలో ఇలా రాశారు ‘వాయనాడ్ వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన శ్రుతికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చాం. ఇవాళ మా మాట నెరవేర్చాం’ అని ఉంది అందులో. వాయనాడ్ కలక్టరెట్లోని కంప్యూటర్ డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా బాధ్యతలు తీసుకుని చిరునవ్వుతో చూస్తున్న శ్రుతి ఫొటోను విజయన్ తన వ్యాఖ్యకు జత చేయడం వల్ల నెటిజన్స్ అందరూ ఆ ఫొటోలోని శ్రుతిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.‘ఈ సమయంలో మా అమ్మా నాన్నలేరు. నాకు కావలసిన భర్త కూడా లేరు. అందుకు నాకు బాధగా ఉంది. కాని జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు సాగాలని తెలుసుకుని ఆ విధంగా కొనసాగినందుకు సంతోషంగా ఉన్నాను’ అందామె. 24 ఏళ్ల శ్రుతి కచ్చితంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆమె కోసం కేరళ అంతా తోడుగా నిలిచింది. ఇకపై నిలిచే ఉంటుంది. ఒక ధైర్యం సాటి మనిషి కల్పిస్తే బాధలో ఉన్న వ్యక్తి కోలుకుంటారనడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణ. అలాగే దు:ఖంలో ఉన్న వ్యక్తి ధైర్యం సడలనివ్వకుండా ఉంటే సమాజం తోడు నిలిచి ఆ వ్యక్తిని నిలబెట్టుకుంటుందనడానికి కూడా ఈ ఘటనే ఉదాహరణ.వాయనాడ్‌లో ఆమెవాయనాడ్లోని ఒక ప్రయివేటు సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న శ్రుతి తనకు బాల్య స్నేహితుడైన జాన్సన్‌ను వివాహం చేసుకోవాలనుకుంది. వారివి వేరు వేరు మతాలైనా ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. సెప్టెంబర్, 2024లో పెళ్లి అనుకుంటే జూన్ 1 వాళ్లు వాయనాడ్ సమీపంలోని సొంత ఇంటికి మారారు. జూన్ 2న శ్రుతికి, జాన్సన్‌కు నిశ్చితార్థం అయ్యింది. అంతా సంతోషంగా ఉంది అనుకుంటూ ఉండగా జూన్ 30న వరదలు చుట్టుముట్టాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. ఆ సమయానికి శ్రుతి వాయనాడ్‌లో ఉండటం వల్ల ఆమె తప్ప కుటుంబంలోని 15 మంది మృత్యువు పాలయ్యారు. అదొక్కటే కాదు పెళ్లి కోసం తల్లిదండ్రులు దాచి పెట్టిన బంగారం, 4 లక్షల నగదు మొత్తం వరద నాలయ్యాయి. ఇల్లు కూలిపోయింది. ఈ విషాదంలో శ్రుతి స్తంభించిపోయింది. అయితే జాన్సన్ ఆ సమయంలో ఆమెకు కొండంత అండగా ఉన్నాడు. ధైర్యం చెప్పాడు. ‘నీ దగ్గర రూపాయి లేకపోయినా నేను వివాహం చేసుకుంటా... నిన్ను సంతోషంగా ఉంచుతా’ అని మాట ఇచ్చాడు. అందరూపోయినా జాన్సన్ ఉన్నందుకు ఆమె కార్చే కన్నీటిలో ఒక చిన్న ఆశాకిరణాన్ని నిలబెట్టుకుంది.కోల్పోయిన ఆ తోడుఅయితే విధి మరోసారి శ్రుతి మీద పగబట్టింది. సెప్టెంబర్ మొదటి వారంలో తన బంధువుల సమాధులను (వాయనాడ్ వరద మృతులు) చూసి వద్దామని వ్యాన్‌లో జాన్సన్ బయలుదేరి తోడుగా శ్రుతిని, బంధువులను తీసుకెళ్లాడు. ఆ సమయంలోనే ఆ వ్యాన్‌కు యాక్సిడెంట్ అయ్యింది. డ్రైవ్ చేస్తున్న జాన్సన్ దుర్మరణం పాలయ్యాడు.కదలిన కేరళఈ ఉదంతం తెలిసిన వెంటనే కేరళ మొత్తం కదిలింది. అందరూ శ్రుతి ఫొటోను తమ ఫోన్ల డీపీలుగా పెట్టుకుని ‘నీకు మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు. వందలాది వేలాది మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ప్రభుత్వంలోని మంత్రులు, ఎంఎల్ఏలు వచ్చి పలుకరించి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగాన్ని హామీ ఇచ్చారు. ఇవన్నీ శ్రుతిని నిలబెట్టాయి. ఇప్పుడు తను ప్రభుత్వ ఉద్యోగిని అయ్యింది. మర్చిపోయిన నవ్వును పెదవుల మీదకు తెచ్చుకుంది. కాలం దయతో చూడాలి అందరినీ. అది ఇక్కట్లపాలు చేసినా వెలుతురు తీసుకువస్తుంది. (చదవండి: రణబీర్ కపూర్‌కి నాసల్ డీవియేటెడ్ సెప్టం: అంటే ఏంటి..?) -
‘సారీ.. నో డేటా’..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలపై సమగ్ర డేటా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతోంది. ప్రకృతి వైపరిత్యాలు సహా దేశంలో పేపర్ లీకేజీలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో కులాల ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష వంటి కీలక అంశాలపై ఎలాంటి డేటాను నిర్వహించట్లేదని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకుంటోంది. ప్రధాన అంశాలపై ఇప్పటికే పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రుల నుంచి ‘నో డేటా’అన్న సమాధానమే తరుచుగా వస్తోంది. డేటా నిర్వహించట్లే.. రెండ్రోజుల కిందటే ఈ నెల 4న రాజ్యసభలో వయనాడ్ వరద బీభత్సం, ఈ విపత్తులో మరణించిన, గాయపడిన వివరాలపై రాజ్యసభ ఎంపీ రణదీప్‌సింగ్ సూర్జేవాలా ప్రశ్న సంధించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ‘‘ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల డేటాను ఈ మంత్రిత్వ శాఖ కేంద్రీకృతంగా నిర్వహించడం లేదు’అని సమాధానమిచ్చారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వయనాడ్ ప్రమాదంలో 359 మంది మరణించడం లేక తప్పిపోయారని, మరో 378 మంది గాయాల పాలయ్యారని కేరళ ప్రభుత్వం తమకు మెమొరాండం సమరి్పంచిందని వెల్లడించారు. నిజానికి వయనాడ్ దుర్ఘటన సమయంలో కేంద్రం ఓ ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపడంతో నష్టం అంచనాలు వేసినప్పటికీ అందుకు సంబంధించిన డేటా మాత్రం తాము నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక సెంట్రల్ యూనివర్శిటీలు, ఐఐటిలు, ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన కేసులపై డేటాను సైతం నిర్వహించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ అలోక్ కుమార్ సుమన్ అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమాధానమిస్తూ ‘విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలలో ఎస్సీ,ఎస్టీల పట్ల వివక్షకు సంబంధించిన డేటాను కేంద్రం నిర్వహించదు’అని బదులిచ్చారు. ఇక కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో పేపర్ లీక్‌లపై డేటాను సైతం నిర్వహించడం లేదని ఈ నెల డిసెంబర్ 2న విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభకు తెలిపారు. ‘రిక్రూట్మెంట్తో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం వివిధ సంస్థలు పోటీ పరీక్షలను నిర్వహిస్తాయి. పరీక్షల నిర్దిష్ట సంఘటనలకు సంబంధించిన డేటాను మంత్రిత్వ శాఖ నిర్వహించదు‘అని తెలిపారు. ఇక దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలు చేసుకున్న మెడికల్ ఇంటర్న్‌ల డేటాను సైతం కేంద్రం నిర్వహించడం లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ రాజ్యసభకు తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన మెడికల్ ఇంటర్న్‌ల సంఖ్య గురించి సుఖేందు శేఖర్ రే అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. -
అటు ప్రేమ, ఇటు వివక్ష
కోజికోడ్(కేరళ): పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ప్రధాని మోదీ కేరళలోని వయనాడ్ బాధితుల పట్ల విపక్ష కనబరుస్తున్నారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తొలిసారిగా సొంత నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కోజికోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమెతో కలిసి రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు. ‘‘అందర్నీ సమాన దృష్టిలో చూడాలని మన రాజ్యాంగం ప్ర¿ోధిస్తోంది. కానీ మన ప్రధానికి మాత్రం అవేం పట్టవు. అమెరికాలో అదానీపై కేసులు నమోదయ్యాక ఆయనను భారతీయులంతా ఒక నిందితుడిగా చూస్తుంటే ప్రధాని మోదీ మాత్రం ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. అమెరికాలో అదానీపై నేరాభియోగాలు నమోదైనా ప్రధాని మోదీ అస్సలు పట్టించుకోరు. ఆయనను నేరస్తుడు అని అమెరికా సంబోధించినా భారత ప్రభుత్వం ఆయనపై ఎలాంటి నేరాభియోగాలు మోపదు. అదానీపై ఇంతటి ప్రేమ ఒలకబోసే ప్రధాని కేరళలో ప్రకృతి విలయంతో సర్వం కోల్పోయిన వయనాడ్ బాధితుల బాధలను చెవికెక్కించుకోరు. అవసరమైన సహాయక సహకారాలు మద్దతు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ సమర్థవంతంగా ప్రజల కోసం పోరాడుతోంది. మన మీద నమ్మకంతో, కాపాడుతామన్న విశ్వాసంతో ప్రజలు మన వద్దకు వస్తున్నారు. వయనాడ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు పోరాడతా’’అని అన్నారు. అంతకుముందు రాహుల్ వయనాడ్ మృతులకు నివాళులరి్పంచారు. బీజేపీ, ప్రకృతి విపత్తు ఒక్కటే: ప్రియాంక రాహుల్ తర్వాత ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. ‘‘ప్రకృతి విపత్తు, బీజేపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రెండింటి శైలి ఒక్కటే. ప్రకృతి విపత్తు ఎలాగైతే తనకు నచి్చనట్లు చేస్తుందో బీజేపీ కూడా ఎలాంటి నియమనిబంధనలు, వివరణలు, ప్రజాస్వామ్యయుతవిధానాలను అవలంభించదు. బీజేపీ నుంచి ఎదుర్కొంటున్న రాజకీయసవాళ్లు అచ్చు కొండచరియలు విరిగిపడటం లాంటిదే. రాజకీయసమరంలో పాటించాల్సిన కనీస ధర్మాలనూ బీజేపీ పాటించదు. రాజ్యాంగబద్ద సంస్థలనూ నాశనంచేస్తోంది. విధ్వంసకర అజెండాకు మాత్రమే బీజేపీ కట్టుబడి ఉంటుంది. వయనాడ్ ప్రజల మనిషిగా పార్లమెంట్లో మాట్లాడతా. ఇక్కడి వారి సమస్యలను ప్రస్తావిస్తా. సోదరుడు రాహుల్‌గాం«దీపై చూపించిన ప్రేమను నాపైనా చూపించినందుకు మీకు రెండింతల ధన్యవాదాలు. గెలిచి ఇక్కడికొచ్చా. వయనాడ్ ప్రజల ఉజ్వల భవిత కోసం నా శాయశక్తుల కృషిచేస్తా’’అని ప్రియాంక గాంధీ అన్నారు. -
నేడు వయనాడ్‌కు రాహుల్, ప్రియాంక
వయనాడ్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కోజికోడ్ జిల్లాలోని ముక్కమ్‌లో మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నాయి. కరూలై, వాందూర్, ఎడవాన్నా పట్టణాల్లోనూ ప్రజలను ప్రియాంక, రాహుల్ కలుసుకుంటారని తెలిపాయి. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ హోదాలో తొలిసారిగా వయనాడ్‌లో పర్యటించబోతున్నారు. తనను గెలిపించినందుకు గాను నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్‌సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు. అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది. ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.(చదవండి: ఫేస్ యోగా"తో..సెలబ్రిటీల మాదిరి ముఖాకృతి సొంతం!) -
Parliament Session: ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి. అటు లోక్‌సభ, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అదాని గ్రూప్ అవినీతి ఆరోపణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను వాయిదావేశారు. పార్లమెంట్ ఉభయ సభలు 12గంటల వరకూ వాయిదా పడ్డాయి.లోక్‌సభ స్పీకర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. #WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, " I am delighted as we had campaigned for her. I am happy that she won...as you can see, she is appropriately dressed in a Kerala saree" pic.twitter.com/MFoJPaf4dj— ANI (@ANI) November 28, 2024 కాగా తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ నాలుగు లక్షలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనుండగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29న గడువును పొడిగిస్తూ ప్రతిపాదనను సమర్పించనుంది.ఇక నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజు నుంచి స్తంభిస్తూనే ఉన్నాయి. ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతున్నాయి. మణిపూర్ హింస, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి. -
వయనాడ్ లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ విజయం
-
వయనాడ్‌లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్‌లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్‌లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్‌లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్‌కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్‌సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్‌దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్‌గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్‌తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
అన్న రాహుల్ గాంధీ మెజార్టీని దాటేసిన ప్రియాంక
-
Wayanad: ప్రియాంక గాంధీ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే!
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. తన సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె 4,08. 036 ఓట్ల మెజార్టీతో తన సమీప సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిపై గెలుపొందారు.రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్వయనాడ్ ఉప ఎన్నికల్లో ఏకంగా సోదరుడు రాహుల్ గాంధీ మెజార్టీ ప్రియాంక బ్రేక్ చేశారు. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టీ రాగా.. ప్రియాంకకు 4 లక్షల 8 వేల ఓట్ల మెజార్టీ లభించింది. సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరి రెండో స్థానంలో, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ డో స్థానంలో ఉన్నారు.కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. 3, 64, 653 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. రాహుల్‌కు మొత్తం 6,47,445 ఓట్లు రాగా.. సీపీఐ నేత అన్నీ రాజాకు 2,83023 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి కే సురేంద్రన్ను 1, 41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
మూడు లక్షల ఆధిక్యం.. వయనాడ్‌లో భారీ లీడ్‌లో ప్రియాంక గాంధీ
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. ప్రియాంకా గాంధీ సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్లక్షకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారామె. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగడంతో.. ఫలితంపైనే యావత్ దేశం దృష్టి కేంద్రీకృతమైంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి.. ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి మూడు లక్షల ఓట్ల భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ.. తరువాత వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండటం విశేషం. వయనాడ్‌లో ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రియాంక గాంధీకి సీపీఐ సీనియర్ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. -
యూపీ ప్రచారానికి అగ్రనేతలు అనుమానమే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్ సహా మాజీ ఎంపీ పీఎల్ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ తనూజ్ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. -
వయనాడ్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
Updates వాయనాడ్‌లో సాయంత్రం 6 గంటల వరకు 64.27% ఓటింగ్ నమోదైంది. వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. వాయనాడ్ నియోజకవర్గంలో 64.27% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇది 72.92 శాతంగా ఉంది.కలపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 65.01%, సుల్తాన్ బతేరిలో 62.10%, మనంతవాడిలో 63.48%, తిరువంబాడిలో 66.05%, ఎర్నాడులో 68.97%, నిలంబూరులో 61.46%, వండూరులో 64.01% పోలింగ్ నమోదైంది. వయనాడ్‌లో పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.వాయనాడ్ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 1 గంటల వరకు 40% పైగా ఓటింగ్ నమోదైందివాయనాడ్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34.38 శాతం పోలింగ్ నమోదైంది#WayanadElection | Chanda, an 80-year-old woman of the Kallumala tribal settlement, after casting her vote at a booth at Meppadi in #Wayanad #Byelections2024 📸E.M. Manoj pic.twitter.com/PPDIf8unGL— The Hindu - Kerala (@THKerala) November 13, 2024 ఉదయం 11 గంటల వరకు వయనాడ్‌లో 27.04 శాతం పోలింగ్ నమోదైంది. #JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 కేరళ: వయనాడ్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 9 గంటల వరకు వాయనాడ్‌లో 13.04 శాతం ఓటింగ్ నమోదైంది.#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారుషిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు#WATCH | | Karnataka | BJP leader and Former CM Basavaraj Bommai casts his vote at a polling booth in Shiggaon, as voting in bypoll to the assembly constituency is underwayHis son Bharath Bommai is the BJP candidate for bypoll to the Shiggaon assembly constituency pic.twitter.com/x2ta1ZaFDw— ANI (@ANI) November 13, 2024 కేరళ:వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలు చూపిన ప్రేమను తిరిగి చెల్లించడానికి, వారి కోసం పని చేయడానికి తమ ప్రతినిధిగా ఉండటానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేస్తారని ఆశిస్తున్నా #WATCH | Kerala: Congress candidate for Wayanad Lok Sabha by-elections Priyanka Gandhi Vadra says, "My expectation is that the people of Wayanad will give me the chance to repay the love and affection they have shown and to work for them and to be their representative. I hope… pic.twitter.com/LYg9Sgg4OE— ANI (@ANI) November 13, 2024 రాజస్థాన్: దౌసా అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ మురారీ లాల్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.దౌసా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి దీనదయాళ్ బైర్వా, బీజేపీ నుంచి జగ్మోహన్ మీనాను బరిలోకి దిగారు.#WATCH | Dausa, Rajasthan: Congress MP from Dausa Murari Lal Meena casts his vote for the Dausa Assembly by-election.Congress has filled Deendayal Bairwa from the Dausa assembaly seat. BJP has fielded Jagmohan Meena from this seat. pic.twitter.com/0qtmoLyimy— ANI (@ANI) November 13, 2024 కేరళవయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలకు అట్టడుగు స్థాయిలో పని చేయగల, పార్లమెంటులో తమ సమస్యలను పరిష్కరించగల నేత కావాలి. కిట్లు, డబ్బు, మద్యం, అన్నీ అందించి ఈసారి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయం కాంగ్రెస్‌కు ఉంది#WATCH | Kerala: BJP candidate from Kerala's Wayanad Lok Sabha constituency, Navya Haridas says, "... People of Wayanad need a person who can work with them at the grassroots level and who can address their issues in Parliament and find solutions. Congress is trying to influence… pic.twitter.com/2TjyrKKiVx— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్:బుద్ని ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.సెహోర్‌లోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికే చౌహాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Sehore: Kartikey Chouhan, son of Union Minister Shivraj Singh Chouhan shows his inked finger after casting his vote at a polling station in Sehore for Budhni by-elections. Kartikey Chouhan says "I would like to request everyone to come out and cast their votes. There… pic.twitter.com/FUrPIsYGur— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఓటు వేయడానికి కర్ణాటకలోని చన్నపట్నాలోని పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు.ఎన్డీయే తరఫున ఈ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ నేత నిఖిల్ కుమారస్వామి, కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీ యోగేశ్వర్ పోటీలో ఉన్నారు. #WATCH | Karnataka: People queue up at a polling station in Channapatna, Karnataka to vote for Channapatna Assembly by-electionsNDA has fielded JDS leader Nikhil Kumaraswamy from this seat; five-time MLA CP Yogeshwar is contesting against him on a Congress ticket pic.twitter.com/YO5DLC32Cp— ANI (@ANI) November 13, 2024 కేరళపాలక్కాడ్ అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. పశ్చిమ బెంగాల్: పశ్చిమ్ మేదినీపూర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శ్రీతికోన అరబింద హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లో ఉన్నారు. కేరళ:వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు. ఛత్తీస్‌గఢ్:రాయ్‌పూర్ సిటీ సౌత్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.బీజేపీ మాజీ ఎంపీ, మేయర్ సునీల్‌కుమార్ సోనీని, కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆకాశ్ శర్మను పోటీలో ఉన్నారు. #WATCH | Chhattisgarh: Voting underway for Raipur City South Assembly by-elections BJP has fielded Sunil Kumar Soni, a former MP and mayor, while Congress has fielded Akash Sharma, the president of the Youth Congress state unit. pic.twitter.com/KEDX8M4but— ANI (@ANI) November 13, 2024 అస్సాం:సమగురి అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటు వేయడానికి ప్రజలు నాగాన్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Assam: People queue up at a polling station in Nagaon to vote for the Samaguri Assembly by-polls. pic.twitter.com/XH1fLEZPPu— ANI (@ANI) November 13, 2024 కేరళవాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలకు ఓటు వేయడానికి ప్రజలు వాయనాడ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Kerala: People queue up at a polling station in Wayanad to vote for the Wayanad Lok Sabha by-polls pic.twitter.com/lBF0ykyJNn— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్: షియోపూర్ జిల్లాలోని బుద్ని అసెంబ్లీలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.పోలింగ్ స్టేషన్ నంబర్ 170 ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల కొత్త భవనం (విజయపూర్) వద్ద పోలింగ్ ప్రారంభమైంది.#WATCH | Madhya Pradesh: Voting for the by-election to be held today in the Budhni assembly of Sheopur district. Preparations underway at polling station number 170 Government Higher Secondary School New Building Vijaypur. pic.twitter.com/SopzxUBWBH— ANI (@ANI) November 13, 2024 కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారుఇక్కడ 14 లక్షల మంది ఓటర్ల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఈ రోజు(బుధవారం) 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
జార్ఖండ్ తొలి దశకు సర్వం సిద్ధం
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు. బుధవారం తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ బుధవారమే పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారు.ఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది.ఐదవ జార్ఖండ్ శాసనసభ కాలపరిమితి వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన ముగియనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలుబుధవారమే 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారు. ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
బీజేపీ నేతలు ప్రజానుబంధం ఏనాడో తెంచుకున్నారు
వయనాడ్: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శలను పెంచారు. ఆదివారం నైకెట్టి, సుల్తాన్ బతేరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారర్యాలీల్లో గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ ఇక్కడున్న పెద్దవాళ్లలో చాలా మందికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాగా తెలిసే ఉంటుంది. గిరిజనులతో ఆమెకు ఎంతో అనుబంధం ఉండేది. ఇక్కడి భూమి, అడవులు, నేల, నీరుతో గిరిజనులు అవినాభావ సంబంధం ఉంది. పేదల అభ్యున్నతి కోసమే అటవీ చట్టం, గ్రామీణ ఉపాధ హామీ పథకం, విద్యాహక్కుచట్టం తెచ్చాం. అదే బీజేపీ నేతలు సొంతవాళ్లనే పట్టించుకుంటూ గిరిజనులను, జనాలను గాలికొదిలేసింది. అసలు బీజేపీ నేతలు ప్రజలతో బంధాన్ని ఏనాడో తెంచుకున్నారు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. -
Priyanka Gandhi: సొంతబిడ్డల్లా సంరక్షిస్తా
వయనాడ్(కేరళ): కేరళలో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యరి్థగా బరిలో దిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. పిల్లల ఆలనాపాలనా తల్లి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా చూస్తుందో అదేరీతిలో తాను పౌరుల బాగోగులను పట్టించుకుంటానని ప్రియాంక వ్యాఖ్యానించారు. మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలాంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అకంపదం, పొథుకల్లు పట్టణాల్లో ప్రియాంక ప్రసంగించారు. ‘‘గెలిపించి నాకొక అవకాశం ఇస్తే మీ సమస్యలపై ఒక్క పార్లమెంట్లోనేకాదు వేర్వేరు సందర్భాల్లో ప్రతి ఒక్క భిన్న వేదికపై పోరాడతా. గతంలో గెలిపించిన రాహుల్‌పై వయనాడ్ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నన్ను గెలిపిస్తే నా కుటుంబానికి ఇంత మద్దతుగా ఉన్న మీకందరికీ సాయపడతా’’అని ఓటర్లునుద్దేశించి అన్నారు. ‘‘మోదీ ప్రభు త్వం సాయం అందక వయనాడ్‌లోని కొండలు, గ్రామీణ ప్రాంత రైతులు, చిరువ్యాపారులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలే ఇందుకు కారణం’’అని అన్నారు. వయనాడ్ స్థానానికి నవంబర్ 13వ తేదీన పోలింగ్ జరగనుంది. -
వయనాడ్ విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోంది: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ.. లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా.. వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కెనిచిరాలో సోమవారంప్రచారం చేశారు.‘‘ప్రజలకు తీరని బాధ కలిగించిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది. దేశం, ప్రజల ప్రయోజనాలు, దేశ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన ప్రదేశంలో నిలబడి ఉన్నాం. కొండచరియలు విరిగిన జిల్లాలోని కుటుంబాలకు తగినంత సహాయం పంపిణీ చేయడంలో కేంద్రం విఫలమైంది. ఈ సమస్యపై పోరాడుతా. పార్లమెంటులో వయనాడ్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తే.. నేను మీ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడి చూపిస్తా. ..నేను మీ సమస్యలను ప్రతిచోటా వినిపిస్తాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా. మీ అవసరాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గని పోరాటయోధురాలుగా మీ పక్కనే ఉంటా. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా.. ద్వేషం, కోపం, విభజన, విధ్వంసాలను బీజేపీ ఉపయోగిస్తుంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలను పరిష్కరించటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ రాజకీయాలు ఇక్కడి సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించటమే లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఏకైక లక్ష్యం.. ఎంత ఖర్చు అయినా సరే అధికారంలో ఉండటం’’ అని అన్నారు.జూలైలో వయనాడ్‌లో చోటు చేసుకున్న కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వంద ఇళ్లు బురదలో కొట్టుకుపోయాయి. -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం: రాహుల్
వయనాడ్: దేశంలో నేడు ప్రధానమైన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆగ్రహం, విద్వేషంతో కాకుండా ప్రేమ, ఆప్యాయత, వినయంతో రాశారు. అంతటి విశిష్టమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పౌరులుగా మనం పొందుతున్న రక్షణ, దేశ ఔన్నత్యం తదితరాలకు రాజ్యాంగమే కారణభూతం’’ అన్నారు. కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మనాంథావాడీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంకా గాంధీ కోసం ప్రచారం చేశారు. ‘‘ప్రేమకు, విద్వేషానికి ఆత్మవిశ్వాసానికి, అభద్రతకు మధ్య నేడు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో నెగ్గాలంటే విద్వేషాన్ని, ఆగ్రహావేశాలను హృదయం నుంచి తొలగించుకోవాలి. ప్రేమ, అనురాగం, వినయాలను నింపుకోవాలి’’ అని సూచించారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రియాంక కోసం తాను ఓట్లు అభ్యరి్థంచడం ఇదే తొలిసారని రాహుల్ గుర్తు చేశారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోదోషి అయిన నళినిని ఆప్యాయంగా హత్తుకున్న మంచి మనస్సు తన చెల్లిదన్నారు. ప్రేమ, సానుభూతి, మానవత్వంతో కూడిన ఇలాంటి రాజకీయాలే మనకు కావాలని ఉద్ఘాటించారు. రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. ‘‘మోదీ గురించి చెప్పీ చెప్పీ బోరు కొట్టేసింది. అందుకే ఆయన ప్రస్తావన తేవడం లేదు’’ అన్నారు. అనంతరం రాహుల్ అరీకోడు పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.సంపన్న మిత్రుల కోసమే ఆరాటంప్రధాని మోదీపై ప్రియాంక మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. సంపన్న మిత్రుల సేవలో ప్రధాని తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనాంథావాడీలో సభలో ఆమె ప్రసంగించారు. ‘‘పేదలకు మంచి చేయాలన్న ఆలోచన మోదీకి అస్సలు లేదు. ప్రజలకు మంచి విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం లేదు. దేశ ప్రజల మధ్య మోదీ సర్కారు చిచ్చుపెడుతోంది. వారిని విభజిస్తోంది. హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తోంది’’ అని ధ్వజమెత్తారు. -
వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ: ప్రియాంక గాంధీ
వయనాడ్: వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ అని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇదే సమయంలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం కాకుండా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ కామెంట్స్ చేశారు.వయనాడ్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ..‘వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ. వయనాడ్ ప్రజలు అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవించే భూమి వయనాడ్. పజాస్సి రాజా, తలక్కల్ చంతు, ఎడచెన కుంకన్ వంటి నాయకుల స్ఫూర్తి కలిగిన బలమైన చరిత్ర మీకు ఉంది. మీరు ఎల్లప్పుడూ సరైన దాని కోసం పోరాడారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా ప్రియాంక.. తన వ్యాపార మిత్రుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో నిరుద్యోగుల గురించి మోదీ సర్కార్ ఏనాడు ఆలోచించదు. మెరుగైన ఆరోగ్యం, విద్య కోసం కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే బీజేపీకి ఉండదు. ఏం చేసైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. ప్రజలను విడగొట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకోవడంతో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. కానీ, వయానాడ్ ప్రజలకు రాహుల్‌కు ఎప్పుడూ అండగానే ఉన్నారని ప్రశంసించారు.ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో నవంబర్ 13వ తేదీన పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉండగా.. బీజేపీ తరఫున నవ్య హరిదాస్ పోటీలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. #WATCH | Wayanad, Kerala: Congress leader and party's candidate for Wayanad Lok Sabha by-election, Priyanka Gandhi Vadra says, "Modi ji's government works only for his big businessman friends. His objective is not to give you a better life. It is not to find new jobs. It is not… pic.twitter.com/l5fkrO7pGX— ANI (@ANI) November 3, 2024 -
మదర్ థెరిసా మా ఇంటికి వచ్చారు: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు. .. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్రూమ్లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.చదవండి: రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ -
ఎన్నికల్లో పోటీ చేయడమే కొత్త.. ప్రజా పోరాటాలు కొత్త కాదు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ప్రజా పోరాటాలు తనకు కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి తరఫున ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం పోరాటం సాగించానని, అదే తన జీవితానికి కేంద్ర బిందువు అని వెల్లడించారు. ఈ మేరకు వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ప్రియాంక శనివారం విడుదల చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ వారికి ప్రతినిధిగా వ్యవహరించారని తెలియజేశారు. వయనాడ్ ప్రజలతో కలిసి పనిచేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని వయనాడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ప్రజా సేవకురాలిగా తన ప్రయాణానికి వయనాడ్ ప్రజలే మార్గదర్శకులు, గురువులు అని ప్రియాంక స్పష్టంచేశారు. తన సోదరుడు రాహుల్ గాం«దీపై చూపిన ప్రేమానురాగాలే తనపైనా చూపించాలని కోరారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, అరుదైన వనరులను బహుమతిగా పొందిన వయనాడ్‌కు ప్రజాప్రతినిధి కావడం తన అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. -
వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా? తేల్చేసిన కాంగ్రెస్
ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానపరిచిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆయన కొద్దిసేపు మాత్రమే బయట వేచి ఉన్నారని.. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆయన లోపలే ఉన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.తలుపుకి తాళం వేసి ఉండటం వల్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోపలికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు. ‘బీజేపీ ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తుంది?. సభ పూర్తయ్యాక కలెక్టరేట్‌కు చేరుకోగానే డోర్ మూసి ఉంది. తరువాత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అక్కడికి వచ్చారు.. వారు కూడా కొన్ని నిమిషాలు వేచి చూసి లోపలికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి తలుపు తాళం వేసి ఉండటంతో నిమిషంపాటు బయట వేచి ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే ప్రియాకం నామినేషన వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై, పార్టీపై బీజేపీ ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైంది కాదు.’ అని పేర్కొన్నారు.కాగా వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’
తిరువనంతపురం: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా నిర్వహించిన రోడ్డు షోకు భారీగా ప్రజలు తరలిరావటంపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ విమర్శలు గుప్పించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రియాంకా గాంధీ రోడ్డు షోకు త్రిసూర్‌తో సహా ఇతర జిల్లాల ప్రజలను తరలించారని అన్నారు. అందుకే భారీగా జనాలు వచ్చారని తెలిపారు.‘‘షూటింగ్‌కు లేదా వయనాడ్‌లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ప్రజలను ప్రియాంక గాంధీ రోడ్డు షోకు తీసుకొచ్చారు. రోడ్‌షోకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావటం వెనక కారణం ఇది. ప్రియాంక గాంధీ వయనాడ్‌కు రావటం, రోడ్‌షో నిర్వహించటం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే వచ్చే ‘సీజనల్ ఫెస్టివల్’ లాంటిది. ప్రజలు అన్నీ గమనిస్తారు. ...ప్రముఖ రాజకీయ కుటుంబ నేపథ్యం ఆధారంగా మాత్రమే ప్రియాంకా గాంధీ అభ్యర్థి అయ్యారు. కానీ, నేను కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ప్రజల కోసం ఏళ్ల తరబడి పనిచేశా. అట్టడుగు స్థాయిలో పనిచేసి ప్రజాసేవలో అనుభవం సంపాదించా. ఒక అభ్యర్థి గొప్పతనానికి కుటుంబ ఆధిపత్యమే ప్రమాణమైతే.. దానికి నిదర్శనం ప్రియాంకా గాంధీ మాత్రమే. అయితే.. బీజేపీకి అలాంటి ప్రమాణాలు ఉండవు’’ అని అన్నారు. ఇక.. నవ్య హరిదాస్ ఇవాళ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. -
ప్రియాంక నామినేషన్
వయనాడ్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం రాత్రి కేరళకు చేరుకున్న ప్రియాంక బుధవారం వయనాడ్ జిల్లా కేంద్రమైన కాల్పెట్టా నగరంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన జన వాహినిని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు. మొదటిసారిగా 1989లో 17 ఏళ్ల వయసులో తన తండ్రి రాజీవ్ గాం«దీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నానని తెలిపారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నేతల కోసం ప్రచారం చేశానని వెల్లడించారు. తన విజయం కోసం తాను ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఉద్ఘాటించారు. వయనాడ్‌లో పోటీ చేసే అవకాశం కలి్పంచిన మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు. ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు. వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా, గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మొత్తం ప్రపంచమంతా తన సోదరుడు రాహుల్ గాం«దీకి వ్యతిరేకంగా మారిన సమయంలో వయనాడ్ ప్రజలు మాత్రం ఆయనకు అండగా నిలిచారని చెప్పారు. తన కుటుంబమంతా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. వయనాడ్‌ను విడిచి వెళ్తున్నందుకు రాహుల్ బాధపడుతున్నారని వెల్లడించారు. రాహుల్‌కు, ప్రజలకు బంధాన్ని తాను మరింత బలోపేతం చేస్తానన్నారు. వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు: రాహుల్ తన చెల్లెలు ప్రియాంక బాగోగుల మీరే చూసుకోవాలి అంటూ వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇచి్చనట్లుగానే తన సోదరికి సైతం ఇవ్వాలన్నారు. వయనాడ్‌కు తాను అనధికారిక ఎంపీనని, ప్రియాంక అధికారిక ఎంపీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్లో వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు ఉంటారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ప్రియాంకా గాం«దీని ఆశీర్వదించాలని వయనాడ్ ఓటర్లను కోరారు. రోడ్ షో అనంతరం ప్రియాంకా గాంధీ వయనాడ్ కలెక్టరేట్‌కు చేరుకొని, నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు. నామినేషన్ తర్వాత ప్రియాంక, రాహుల్ పుత్తుమల శ్మశాన వాటికను సందర్శించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులరి్పంచారు. ప్రియాంక గాంధీ ఆస్తులు రూ.12 కోట్లు తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ను బుధవారం ఎన్నికల అధికారికి సమరి్పంచారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు. అలాగే రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లుగా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సొంతంగా కొన్న ఇంటి విలువను రూ.5.63 కోట్లుగా ప్రస్తావించారు. అలాగే రూ.15.75 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రియాంకా గాం«దీపై గతంలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటవీ శాఖ నుంచి ఆమెకు నోటీసు అందింది. భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్‌కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్‌గా నిలిచింది. బ్యాక్‌రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్‌కు టాలిస్ మాన్‌గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్‌ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
తొలిసారి పోటీ చేస్తున్నా, భారీ మెజారిటీతో గెలిపించండి: ప్రియాంక
తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.అనంతరం బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. గత 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు.‘నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాను. వయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి నా సోదరుడు చెప్పాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వాయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిపించండి ’ ఆమె హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్ అని అన్నారు. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్‌లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections. Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024 -
వయనాడ్ ఉపఎన్నికల అభ్యర్థిగా ఇవాళ ప్రియాంక వాద్రా నామినేషన్
-
వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. వయనాడ్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా యంగ్ డైనమిక్ లీడర్, కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను ఖరారు చేసింది. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.ఇక, బీజేపీ నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడంతో ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. నవ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. బీటెక్ చదవి ఉద్యోగం చేసిన నవ్య.. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో తన ముద్ర వేసి తక్కువ కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా వయనాడ్ బరిలోకి టికెట్ పొంది బంపరాఫర్ దక్కించుకున్నారు.నవ్య హరిదాస్ రాజకీయ నేపథ్యం..👉నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు.👉బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు.👉నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.👉బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.👉2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి.👉అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.👉నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది.Navya Haridas to take on PriyankaGandhi from the Wayanad Lok Sabha seat on a BJP ticket👍👍 pic.twitter.com/joo5dXrEhT— tsr. (@srikanth690935) October 19, 2024 -
వయనాడ్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది. నవ్య హరిదాస్ ఇక్కడి నుంచి తమ పార్టీ తరపున బరిలో ఉంటారని వెల్లడించింది. నవ్య కేరళ బీజేపీ మహిళామోర్చాకు ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌ను వదులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. నవంబర్ 13న వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. ఇదీ చదవండి: జార్ఖండ్‌లో కాంగ్రెస్,జేఎంఎం మధ్య కుదిరిన పొత్తు -
వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి ఖుష్బూ!
సాక్షి, న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున సినీనటి ఖుష్బూ సుందర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. పార్టీ తరఫున పోటీలో నిలిపే అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌లో ఖుష్బూ పేరును సైతం చేర్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీకి ఖుష్బూ అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరనే భావన వ్యక్తమవుతోంది. వయనాడ్‌లో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. పార్టీ సీనియర్లయిన ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను బీజేపీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ కసరత్తు కొలిక్కి వస్తున్న వేళ ఖుష్బూ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరి, అనంతరం 2014లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌ను వీడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు యూనిట్లో భాగంగా ఉన్నారు. తమిళనాడు నేపథ్యం ఉన్న ఆమెను వయనాడ్‌లో పోటీకి నిలిపే విషయమై బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్ర శాఖ తెలిపే అభిప్రాయం మేరకు అభ్యర్థిత్వంపై పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. -
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. -
వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
తిరువనంతపురం : వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ దిగుతున్నట్లు కొద్ది సేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ,కేరళ వయనాడ్.. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూన్‌లో ప్రకటించారు. తాజాగా, అధికారికంగా ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే, ప్రస్తుత పార్లమెంట్లో గాంధీ కుటుంబం నుంచి ఆమె మూడో ఎంపీ. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. -
లెబనాన్ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?
హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో.. కేరళకు చెందిన ఓ టెక్కీని బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్వేలో స్థిరపడిన అతనికి.. బల్గేరియాలో ఓ కంపెనీ ఉంది. అక్కడి నుంచే పేజర్ల సప్లై జరిగిందని, పేలుడు పదార్థాలను ఇక్కడే అమర్చి ఉంటారన్న అనుమానాల నడుమ మూడు రోజులపాటు అతన్ని విచారించారు. వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్(37).. నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే.. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు ఇతని కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అధికారులు అనుమానించారు. ఈ అనుమానాలకు అతని కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. దీంతో.. బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్ఎస్, ఆ దేశ విదేశాంగ సహకారంతో జోస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. చివరకు.. పేలుళ్లకు సంబంధించిన పేజర్లకు, ఇతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు.‘‘లెబనాన్ పేజర్ల పేలుళ్లకు నోర్టా గ్లోబల్ లిమిటెడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీ యాజమానితో పేజర్లకు సంబంధించి లావాదేవీలు(ట్రాన్జాక్షన్స్) జరిగాయన్న వాదనలోనూ నిజం లేదు’’ అని డీఏఎన్ఎస్ ప్రకటించింది. మరోవైపు ఓస్లో(నార్వే) పోలీసులు సైతం ప్రాథమిక విచారణలో జోస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి.ఇదీ చదవండి: పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదేసెప్టెంబర్ 17వ తేదీన లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా.. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని, పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో..తైవాన్‌కు చెందిన పేజర్ల కంపెనీ గోల్డ్ అపోలో పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. పేలుడుకు గురైన ఏఆర్-924 పేజర్లకు తమకు సంబంధం లేదని తైవాన్ కంపెనీ స్పష్టం చేసింది. హంగేరీ బుడాపెస్ట్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గర వాటి తయారీ ట్రేడ్ మార్క్ ఉందని తేలింది. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన రిన్సన్ జోస్.. కొంతకాలం లండన్‌లోనూ పని చేశాడు. ఆపై సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఓస్లోలోనే ఉంది. తాజా పరిణామాలతో కేరళలోని జోస్ కుటుంబం ఆందోళనకు గురైంది. అతన్ని ఇరికించే కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. మూడు రోజులపాటు అధికారులు అతన్ని కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని భార్య మీడియా వద్ద వాపోయింది. అయితే లెబనాన్ పేలుళ్ల కేసు నుంచి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ అతన్ని ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం. -
'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది!
కన్నీటికి కూడా ఇష్టం ఉన్నట్టుంది. కన్నీటికి కూడా ఒక మనిషి కంటినే అంటి పెట్టుకొని ఉండాలన్న కోరిక ఉన్నట్టుంది. కన్నీరు ఎందుకనో ఒకే మనిషిని పదే పదే ఆలింగనం చేసుకుంటూ ఆ మనిషికి మరింత ప్రేమను పంచాలని అనుకుంటున్నట్టుంది. కేరళలో ఒకమ్మాయి శ్రుతి. ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా కన్నీరు కారుస్తోంది. ఆమెను ఊరడించడానికి కేరళ ప్రభుత్వం, కేరళ ప్రజలు కదిలారు. ఈ ప్రేమ కోసమేనా కన్నీరుకు ఆమెపై ప్రేమ?‘బాధ పడకు. నీకు నేనున్నాను. నేను చనిపోయినా నువ్వు ఒంటరివి కావు. నీకంటూ ఒక భరోసా ఉండేలా చూస్తాను’ అన్నాడా యువకుడు ఆ అమ్మాయితో ఓదార్పుగా. ఇవాళ ఆ యువకుడు కన్నుమూశాడు. ఆ యువకుడి మాటలను గుర్తు చేసుకుంటున్న కేరళ ప్రజలు ‘మేమున్నాం’ అంటూ ఆ అమ్మాయికి తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన చాలా అరుదు.ఆ అమ్మాయి పేరు శ్రుతి..అందరు అమ్మాయిల్లాంటిదే శ్రుతి. కోజికోడ్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేయడం... సెలవులలో ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడపడం... తండ్రి చిన్న ఉద్యోగి... తల్లి చిన్న షాపు నడిపేది... చెల్లెలు కాలేజీ చదువుతోంది. వాళ్ల కుటుంబం వాయనాడ్‌లోని చూరలమలలో కొత్త ఇల్లు కట్టుకుని వరదలకు నెల ముందే షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రుతి నిశ్చితార్థం జరిపించారు. ఈ డిసెంబర్లో పెళ్లి చేయాలని 4 లక్షల డబ్బు. 15 సవర్ల బంగారం ఇంట్లో దాచారు. అంతా సంతోషమే. కాని...జూలై 30 రాత్రి..ఆ రాత్రి ఉద్యోగరీత్యా శ్రుతి చూరలమలకు రెండు గంటల దూరంలో ఉన్న కోజికోడ్‌లో ఉంది. వరద విజృంభించింది. శ్రుతి వాళ్ల కొత్త ఇల్లు ధ్వంసమైంది. తల్లి, తండ్రి, చెల్లెలు... పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం పోయాయి. ఎవరూ మిగల్లేదు. ఏమీ మిగల్లేదు. శ్రుతి కన్నీరు కట్టలు తెంచుకుంది. అది ఆగలేదు. ఆపేందుకు ఒక్కడు పూర్తిగా ప్రయత్నించాడు. అతని పేరు జాన్సన్. శ్రుతికి కాబోయే భర్త.నేనే తోడుంటా..‘శ్రుతికి ఇప్పుడు ఏమీ మిగల్లేదు. అంతమాత్రం చేత నేను వదిలేస్తానా? పదేళ్లుగా మేము స్నేహితులం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు ఆమె సర్వం కోల్పోయినా నేను వదలను. తోడుంటా. నేను చనిపోయినా ఆమె ఒంటరిదై పోకుండా మంచి ఉద్యోగం, ఇల్లు ఏర్పాటు చేస్తా’ అన్నాడు. ఆ మాటలు ఎందుకన్నాడో. అవి వాయనాడ్ విషాదాన్ని ప్రసారం చేసేటప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యాయి.ఆ తోడు కూడా పోయింది...శ్రుతికి ఇక ఏడవడానికీ కన్నీరు మిగల్లేదు. జాన్సన్ చనిపోయాడు. మొన్నటి మంగళవారం వాయనాడ్‌లో అతను, శ్రుతి, శ్రుతి బంధువులు కొంతమంది ప్రయాణిస్తున్న వ్యాను బస్సుతో ఢీకొంది. శ్రుతి, ఆమె బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. కాని జాన్సన్ మృత్యువుతో పోరాడి బుధవారం మరణించాడు. అన్నీ కోల్పోయిన శ్రుతికి ఆఖరి ఆసరా కూడా పోయింది. ఆమె ఏం కావాలి?మేమున్నాం..ఇక కేరళ జనం తట్టుకోలేకపోయారు. మేమున్నాం అంటూ శ్రుతి, జాన్సన్ జంట ఫొటోలను డీపీగా పెట్టుకోసాగారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నేనున్నానంటూ ఫేస్బుక్ పోస్ట్ రాశారు. ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మంత్రి ఒకరు శ్రుతికి మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది... కేరళ ప్రజలది అన్నారు. శ్రుతి కోసం కేరళ కన్నీరు కారుస్తోంది. శ్రుతి కన్నీటిని కేరళ పంచుకుంది. అయినవారిని లాక్కుని పరాయివారినెందరినో ఆమె బంధువులుగా మార్చింది కన్నీరు. ఈ కన్నీటిని ఏమని నిందించగలం. కన్నీరా కనికరించు... చల్లగా చూడు అనడం తప్ప.ఇవి చదవండి: బెయిలా? జైలా?.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు -
శ్రుతి జీవితంలో మరో పెను విషాదం
వయనాడ్ విలయంతో కుటుంబాన్ని కోల్పోయిన ఆమెకు.. కాబోయేవాడు అండగా నిలిచాడు. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశానవాటికకు చేరుకొని.. ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఇద్దరూ వివాహంతో ఒక్కటి కావాల్సి ఉంది.ఈ లోపు విధి ఆమెపై మరోసారి కన్నెర్ర చేసింది.కేరళ వయనాడ్ విలయం తర్వాత.. ప్రధాని మోదీ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ యువతి, యువకుడు కలిసి మోదీతో మాట్లాడడం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే.. ఆమెకు అంతటి కష్టం వచ్చింది కాబట్టి. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యుల్ని పొగొట్టుకుందామె.చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి తన చిరకాల మిత్రుడైన జెన్సన్ (27) ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా.. తల్లిదండ్రులు వివాహానికి పచ్చ జెండా ఊపారు. జూన్ 2న ఎంగేజ్మెంట్ జరిగింది.జూన్ 30న వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ జెన్సన్ ఆమెకు అండగా నిలిచాడు. మోదీ పర్యటన టైంలో జాతీయ మీడియా సైతం ఈ జంట గురించి కథనాలు ఇచ్చింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ నెలలోనే రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.అయితే..వివాహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు. కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. జెన్సన్ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ జేన్సన్ బుధవారం రాత్రి మరణించాడు. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన శ్రుతి బాధ వర్ణణాతీతంగా మారింది. -
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్‌లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్‌లో ఒక ΄ాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్‌ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
Rahul Gandhi: వయనాడ్ బాధితులకు విరాళంగా నెల జీతం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రకృతి విపత్తుతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు. తన ఒక నెల జీతం రూ.2.3 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) అందజేశారు.2 లక్షల తన విరాళానికి సంబంధించిన రశీదును ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘వయనాడ్‌లోని మా సోదర, సోదరీమణులు వినాశకరమైన విషాదాన్ని చవిచూశారు. వారు ఎదుర్కొన్న ఈ నష్టాల నుంచి కోలుకునేందుకు మన మద్దతు అవసరం. అందుకే బాధితుల సహాయార్థం, పునరావాస ప్రయత్నాలకు నా వంతు సాయంగా నెల మొత్తం జీతాన్ని విరాళంగా ఇచ్చాను’ అని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందించాలని రాహుల్ పిలుపునిచ్చారుOur brothers and sisters in Wayanad have endured a devastating tragedy, and they need our support to recover from the unimaginable losses they have faced.I have donated my entire month's salary to aid in the relief and rehabilitation efforts for those affected. I sincerely urge… pic.twitter.com/GDBEevjg5y— Rahul Gandhi (@RahulGandhi) September 4, 2024కాగా, ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ‘స్టాండ్ విత్ వయనాడ్–ఐఎన్‌సీ’ అనే యాప్‌ను రూపొందించింది. వయనాడ్‌లో పునరావాస పనులకు సంబంధించిన పురోగతిని కాంగ్రెస్ ఎంపీ కే సుధాకరన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు తెలిపారు.ఇదిలా ఉండగా, జూలై 30న భారీ వర్షాలు, వరదలు వయనాడ్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు వయనాడ్‌లో భారీగా మట్టిపెళ్లలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విలయంలో సుమారు 400 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది -
వయనాడులో మళ్లీ విరిగిపడిన కొండచరియలు
నెల రోజుల క్రితం కేరళలోని వయనాడులోని ముండక్కై, చురల్మల ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే మరోమారు పంచరిమట్టం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన అనంతరం అధికారులు ఈ ప్రాంతంలోని వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గత జూలై నెలలో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత ప్రాంతానికి చెందిన వారు ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఘటన జరిగిన ప్రాంతాలను ప్రభుత్వం నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా ప్రకటించవచ్చని అంటున్నారు. మరోవైపు తాజాగా మరోమారు కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
మానవ తప్పిదాలే విలయ హేతువులు
కేరళలోని వయనాడ్‌లో జూలై 30న వానరూపంలో మృత్యువు చేసిన కరాళ నృత్యానికి 375 మంది మృత్యు వాతపడగా మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విలయం కంటే ముందు 2019 ఆగస్ట్‌లో పుతుమల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇక, 2018లో కనివిని ఎరుగని విధంగా కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదలకు 433 మంది మృత్యువాత పడగా, దాదాపు 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఇంతకూ ఎందుకు కేరళ రాష్ట్రంలో పదేపదే ప్రకృతి ప్రకోపిస్తోంది? ఈ ప్రశ్నకు జవాబు ప్రభుత్వాలకు చెంప పెట్టుగా నిలుస్తుంది. నిజానికి ప్రకృతి తనంతట తాను ప్రకో పించదు. దాన్ని ధ్వంసం చేసినప్పుడు మాత్రమే కన్నెర్ర జేస్తుంది. మనిషి అంతులేని స్వార్థంతో ప్రకృతి సంపదను ఇష్టానుసారం దోచుకోవడానికి చేసే విధ్వంసమే ప్రకృతి గతి తప్పడానికి కారణం అవుతోంది. ఇది ఒక్క కేరళలో మాత్రమే కాదు... గత దశాబ్ద కాలంగా హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో సైతం ఇదే జరుగు తోంది. అందుకే అక్కడా తరచుగా భారీ వర్షాలు కురిసి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడం పరిపాటిగా మారింది. బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’కు చెందిన ప్రొఫెసర్ సీపీ రాజేంద్రన్ ‘వయనాడ్’లో ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్న అంశాలను శాస్త్రీయంగా వివరించారు. 50వ దశకం వరకు వయనాడ్‌లో 85 శాతం దట్టమైన అడవులు ఉండగా, అవి క్రమంగా క్షీణిస్తూ 2018 నాటికి 62 శాతానికి చేరుకొన్నాయి. అడవులను నరికి వేసి ఆ ప్రాంతంలో విస్తారంగా తేయాకు తోటల పెంపకం ప్రారంభించారు. దాంతో అక్కడ అనేక జనావాసాలు పుట్టు కొచ్చాయి. మానవ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. కాలుష్య కారకాల వల్ల కర్బన ఊద్గారాలు పెరిగి వాతా వరణంలో వేడి అధికమైంది. ఫలితంగా, ఆగ్నేయ ప్రాంతంలోని అరేబియా సముద్రం వేడెక్కి ఒక్కసారిగా కుండపోత వానలు పడటం మొదలైంది. అడవులు ఉన్నప్పుడు వర్షపు నీటి ప్రవాహ వేగం తక్కువుగా ఉండి ఒక క్రమపద్ధతిలో పల్లపు ప్రాంతానికి చేరేది. కానీ, అడవుల్ని నరకడం వల్ల ప్రవాహ ఉధృతి పెరిగిపోవడం, వర్షపునీటి సాంద్రత అధికమవడంతో... రాతి శకలాల మధ్య ఉన్న మట్టి తొందరగా కరిగిపోయి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడు తున్నాయి. వయనాడ్ కొండప్రాంతం లేటరైట్ మృత్తిక, రాతిశకలాల మిశ్రమంతో నిండి ఉండటం వల్ల భారీ వర్షాలు, వరదనీటి తాకిడికి కొండలు పెళ్లలు ఊడిపడినట్లు పడతా యని ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు.పశ్చిమ కనుమల పర్యావరణ స్థితిగతుల నిపుణుల బృందం (వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్)కు నేతృత్వం వహించిన మాధవ్ గాడ్గిల్ 2010 నుంచి దాదాపు ఏడాదిపాటు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేరళ నుంచి ఇటు తమిళనాడు; అటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ వరకు విస్తరించిన పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సున్నితమైన 3 జోన్లుగా వర్గీకరించి... ఒకటవ జోన్లో ఉన్న వయనాడ్ ప్రాంతంలో పర్యావరణాన్ని నష్టపరిచే కార్యకలా పాల్ని నిషేధించాలని సిఫారసు చేశారు. కనుమల స్థిరత్వాన్ని దెబ్బతీసే భారీ కట్టడాల్ని నిర్మించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.అయితే, అపరిమితమైన ప్రకృతి సంపద గలిగిన ఆ ప్రాంతంపై కన్నేసిన కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మాధవ్ గాడ్గిల్ కమిషన్ నివేదికను బుట్ట దాఖలా చేయాలని చూశారు. స్థానికంగా ఉన్న ప్రజల్ని రెచ్చ గొట్టారు. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రచారం ముమ్మరం కావడంతో మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు తలొగ్గిన ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిషన్ చేసిన సూచనలకు సవరణలు ప్రతిపాదించి, పరిమితమైన వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చాయి. ఫలితంగా వయ నాడ్ ప్రాంతంలో మైనింగ్, క్వారీ కార్యకలాపాలు పెరిగి పోయాయి. అలాగే కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు సజావుగా సాగిపోయింది. ఈ చర్యలన్నింటి వల్లనే కేరళ తరచుగా విపత్తులకు గురవుతోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. దేశంలో ఎటువంటి ఉపద్రవం సంభవించినా దాని చుట్టూ రాజకీయ రంగు పులుముకోవడం సహజమైపోయింది. వయనాడ్ మృత్యు విలయంపై ఆ మరుసటి రోజునే పార్లమెంట్లో హోమ్ మంత్రి అమిత్‌షా ‘కాలింగ్ అటెన్షన్’ రూపంలో చర్చను ప్రారంభించారు. ముందుగా ఆయన భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక (అలెర్ట్) లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అదే సమయంలో పశ్చిమ కనుమలలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణం పరంగా సున్నిత ప్రాంతంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అందులో వయనాడ్‌లోని కనుమ ప్రాంతం కూడా ఉంది. అయితే, కేంద్రం తాజాగా ప్రకటన నేపథ్యంలో 5 రాష్ట్రాల పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన ఈ కనుమలలో ఇప్పటికే జరుగుతున్న పర్యావరణ విధ్వంసకర కార్యకలాపాలను నిలుపుదల చేయాలంటే అక్కడి పరిశ్రమలను వెంటనే తరలించాలి. ఆ పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల యజమానులకు తగిన పరిహారం ఇవ్వాలి. ఈ చర్యలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే జరగాలి. ఇవన్నీ జరగాలంటే.. రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ప్రజల ప్రాణాలకంటే విలువైనదేదీ లేదన్న స్పృహ పాలకుల్లో కలిగినప్పుడే విపత్తుల్లో చోటుచేసుకునే ప్రాణ, ఆస్తి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
పాఠం నేర్చుకోకపోతే... ఇక ఇంతే!
ఈ ఏడాది జూలై 30, మంగళవారం కేరళ, వయనాడ్‌లోని వెల్లారి మలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో వైతిరి తాలూకాలోని మెప్పాడి గ్రామ పంచాయితీలోని ముండక్కై, చూరల్మల గ్రామాలు చాలా వరకు కొట్టుకుపోయాయి. అపార ప్రాణ నష్టం సంభవించింది. బురద, బండరాళ్లు, నేల కూలిన చెట్లతో కూడిన ప్రవాహం భారీ వినాశనానికి కారణమయింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు రావడంతో కొండచరియలు చల్యార్ నది ఉప నదులలో ఒకటైన ఇరువజింజి పూజ (మలయాళంలో పూజ అంటే నది అని అర్థం)లోకి జారిపడి, బురద వేగంగా ప్రవహించి దిగువ ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగించింది.‘సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్’కు చెందిన పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ వయనాడ్ విపత్తు క్వారీ కార్యకలాపాల వల్లనే సంభవించిందని అన్నారు. 2011లో ఆయన నేతృత్వంలోని పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల బృందం వర్గీకరించిన మూడు సున్నితమైన పర్యావరణ జోన్లలో ప్రస్తుతం ప్రభావితమైన వైత్తిరి తాలూకా అత్యంత బలహీనమైన, సున్నితమైన జోన్. 2019లో, ముండక్కై కొండ దిగువలో జరిగిన, పుత్తుమల కొండచరియ విరిగిపడిన ఘటన తర్వాత, జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వేచేసి మరి కొన్ని తేలికపాటి కొండ చరియలు విరిగిపడిన స్థలా లను గుర్తించి, వయనాడ్‌లోని వేలారిమల ప్రాంతాన్ని, అత్యంత బలహీనమైన జోన్‌గా వర్గీకరించింది. పశ్చిమ కనుమలలోని ఈ ప్రాంతం భౌగోళికంగా ఒక పీఠభూమి. అనేక చిన్న చిన్న నదులతో కూడిన ఒక నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్). ఇవి చెల్లయ్యయార్ నదికి ఉపనది అయిన ఇరువజింజి పుళాలో కలుస్తాయి. ఈ చిన్న చిన్న నదుల వాలులపై ఏర్పడిన మంద పాటి మట్టి పొరలు చాలా తొందరగా కిందికి కదిలి ఉండవచ్చు. వయనాడ్‌కు అంతకు ముందూ కొండచరియలు విరిగిపడిన చరిత్ర ఉంది. 1984, 2020ల్లో తక్కువ తీవ్రతతో విరిగిన కొండ చరియలు ప్రస్తుత పరిస్థితికి మరింత దోహదపడి ఉండవచ్చు.కొండ ప్రాంతాలలో భూమి కొరత వలన కొండ వాలులు, నదీ తలాలపై ఇళ్లు నిర్మించుకుంటూ ఉంటారు. ఈ చర్యను నివారించాలి. ముండక్కై, చూరల్మల గ్రామాల్లో కొన్ని ఇళ్ళు ఈ తరహా లోనే ఉన్నట్లుగా గూగుల్ ఇమేజ్‌లో చూస్తే అర్థమవుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు, జరిగిన విధ్వంసానికి ముఖ్య కారణం, మందాకిని నదీ తలాల్లో నిర్మించిన అడ్డదిడ్డమైన కట్టడాలే అని నిపుణులు స్పష్టం చేశారు. వయనాడ్ సంఘటనలో కూడా చాలావరకు ఇళ్ళు, నీటి మట్టం పెరిగి, నదీ ప్రవా హంలో కొట్టుకుపోయాయి. వయనాడ్‌లో ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఎన్నో ప్రాణాలు పోయేవి కావు. ప్రకృతి వైపరీత్యాల అనుభవాల నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. సహజ విపత్తులను ఎటూ నివారించలేం. అయితే జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు. వివిధ కార ణాల వల్ల నిపుణుల సూచనలను విధాన రూప కర్తలు పట్టించుకోరు. వయనాడ్ విలయం వంటి వాటిని నివారించడానికి... నది తలాలను ఆక్రమణకు గురి చేయకపోవడం, బలహీనమైన వాలుల నుండి నివాసాలను ఖాళీ చేయించడం, ఘాట్ రోడ్ల వెంబడి బలహీనమైన చోట్ల గోడలను నిర్మించడం లాంటివి తరచుగా నిపుణులు ఇచ్చే సూచ నలు. వీటిని పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అయితే మన జీవన విధానం ప్రకృతికి అనుకూలంగా క్రమబద్ధం చేసుకోకపోవడమే వచ్చిన చిక్కల్లా!ఎన్. కుటుంబరావు వ్యాసకర్త డైరెక్టర్ జనరల్ (రిటైర్డ్), జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియామొబైల్: 94404 98590 -
మనసు లేని బ్యాంకులు! కేరళ ప్రభుత్వం అసంతృప్తి
కేరళలో వయనాడ్ విపత్తు బాధితుల పట్ల బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై కేరళ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాధితుల ఖాతాల నుంచి రుణాల ఈఎంఐలను కట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ రుణాలను బ్యాంకులు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేసింది.ఈ రుణాలను మాఫీ చేయడం వల్ల బ్యాంకులకు భరించలేని నష్టమేమీ వాటిల్లదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం విజయన్ మాట్లాడుతూ.. బాధితుల వడ్డీ మొత్తాలలో సడలింపు లేదా నెలవారీ వాయిదాలను చెల్లించడానికి సమయాన్ని పొడిగించడం పూర్తి పరిష్కారం కాదన్నారు.గత జులై 30న జరిగిన భయానక దుర్ఘటన ప్రభావాన్ని, మిగిల్చిన శోకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విపత్తులో 200 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది చనిపోయారని, విపత్తు కారణంగా వారి భూమి నిరుపయోగంగా మారిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకున్న వారు ఇంటినే పోగొట్టుకున్నారని తెలిపారు. అలాంటి వారు ఇప్పుడు ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు. బాధితులు తీసుకున్న మొత్తం రుణాలను మాఫీ చేయడమే మన చేయగల మేలు అని సీఎం విజయన్ సూచించారు.సాధారణంగా బ్యాంకులు మాఫీ చేసిన మొత్తానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం చెల్లించాలని ఆశిస్తాయనీ, అయితే ఈ సమస్యపై అలాంటి వైఖరి తీసుకోవద్దని సీఎం విజయన్ అన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు సొంతంగా భరించాలని ఆయన కోరారు. కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన కొందరి ఖాతాల నుంచి ఈఎంఐలు కట్ చేసిన కేరళ గ్రామీణ బ్యాంకుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో యాంత్రికంగా ఉండకూడదన్నారు. -
Wayanad: రాత్రికి రాత్రే.. భయానక దృశ్యాలు వైరల్
కేరళ వయనాడ్ ప్రకృతి విపత్తుతో కకావికలం అయ్యింది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి.. బురద ప్రవాహం గ్రామాల్ని ముంచెత్తింది. సుమారు 300 మంది మరణించగా.. వందల మంది నిరాశ్రయులయ్యారు. మరో వంద మందికి పైగా జాడ లేకుండా పోయారు. ఈ విలయం ధాటికి దెబ్బతిన్న గ్రామాలు.. అక్కడి ప్రజలూ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.CCTV footage of the devastating #Wayanadlandslide in #Kerala which occurred 20 days ago, has gone viral.The disaster claimed 231 lives, with 212 body parts recovered, while 118 people remain missing.The footage, now circulating widely, captures the catastrophic moment,… pic.twitter.com/5FV9NbgaW9— South First (@TheSouthfirst) August 19, 2024అయితే.. కొండచరియలు విరిగినపడిన సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారి బురద కలగలిసిన జలప్రవాహం ఎగిసిపడి ముంచెత్తిన దృశ్యాలు వీడియోల్లో కనిస్తున్నాయి. -
మనిషికి మనిషిని జతకలిపే దర్జీలు
వారధి నిర్మాణ పనుల్లో ‘నేనెంత’ అనుకోలేదు ఉడుత. ‘నేను కూడా కొంత’ అనుకొని పనుల్లోకి దిగింది. వయనాడ్ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులకు అండగా నిలవడానికి, తమ వంతు సహాయం అందించడానికి స్థాయి భేదాలు లేకుండా ఎంతోమంది మహిళలు వస్తున్నారు. శిబిరంలోని మహిళలకు బట్టలు కుట్టి ఇవ్వడం నుంచి పరిసరాల శుభ్రత వరకు దీక్షతో పనిచేస్తున్నారు...శృతికి చారమాలలో చాలా మంది బంధువులు ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన సంఘటనలో కొందరు చనిపోయారు. మరికొందరు మెప్పడిలోని సహాయ శిబిరంలో ఉన్నారు. కొంతమంది మహిళలు స్నానం చేయడానికి శృతి ఇంటికి వచ్చినప్పుడు తమకు ఇచ్చిన దుస్తులకు సంబంధించిన సమస్యల గురించి చెప్పుకున్నారు. ఆల్ట్రేషన్కు అవకాశం లేకపోవడంతో తమకు సరిపోయే ఒకే జత దుస్తులనే వాడాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్నేహితురాలి దగ్గర కుట్టుమిషన్ తీసుకొని నిర్వాసిత కుటుంబాల సహాయ శిబిరానికి బయలుదేరింది శృతి.ప్రతి గదికి వెళ్లి ‘నేను రెండు రోజులు ఇక్కడే ఉంటాను. దుస్తుల సైజ్ సర్దుబాటు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అని అడిగింది. ఇక ఆరోజు నుంచి చిరిగిపోయిన దుస్తులు, సైజు సరిగా లేని దుస్తులను సరి చేసే పని మొదలైంది.టైలరింగ్ వల్ల జరిగిన మరో మేలు ఏమిటంటే మనసును దారి మళ్లించడం. ఈ శిబిరంలో కొద్దిమంది టైలరింగ్ పని తెలిసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రమ్య మనోజ్ ఒకరు.‘భయపెట్టే జ్ఞాపకాల నుంచి బయటపడడానికి టైలరింగ్ అనేది చికిత్సామార్గంలా ఉపయోగపడింది. చాలా రోజులుగా మేము శిబిరంలో ఖాళీగా ఉన్నాం. ప్రతిరోజూ విషాద జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉండేవి. మెషిన్‌పై ఆల్ట్రేషన్ పనులు మొదలు పెట్టిన తరువాత నాకు ఎంతో ఉపశమనం లభించింది’ అంటుంది రమ్య మనోజ్.శృతి, రమ్య... మొదలైన వారిని దృష్టిలో పెట్టుకొని సహాయ శిబిరానికి కుట్టుమిషన్లను ఒక స్వచ్ఛంద సంస్థ విరాళంగా ఇవ్వనుంది.‘మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు రోజులు ఉండాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం శిబిరం ఉన్నంతవరకు రోజూ వచ్చి పోవాలనుకుంటున్నాను’ అంటుంది శృతి.సహాయ శిబిరానికి శృతి రోజూ రావాలనుకోవడానికి కారణం కేవలం టైలరింగ్ పనులు కాదు. ఇప్పుడు అక్కడ ఆమె ఎంతోమంది బాధితులకు ఓదార్పునిస్తోంది. బాధితులు విషాద జ్ఞాపకాల నుంచి బయటపడడానికి సినిమాల నుంచి ఆటల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటుంది.‘శిబిరానికి శృతి రావడానికి ముందు మా మాటల్లో బాధలు, కష్టాలు, చేదు జ్ఞాపకాలు మాత్రమే ఉండేవి. అయితే శృతి మమ్మల్ని అటువైపు వెళ్లనివ్వకుండా రకరకాల విషయాలు మాట్లాడుతుంటుంది. ధైర్యం చెబుతుంటుంది’ అంటుంది సహాయ శిబిరంలో తలదాచుకుంటున్న ఆశ.హరిత కర్మ సేన ఆల్ ఉమెన్ గ్రూప్పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిలో కొందరు జ్వరం, దగ్గులాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పునరావాస శిబిరం పరిసరప్రాంతాల్లో అపరిశుభ్రత ఆనవాలు లేకుండా చేస్తున్నారు. పునరావాస శిబిరాలుగా మారిన పాఠశాలలు శుభ్రంగా కనిపించడానికి కారణం హరిత కర్మ సేన–ఆల్ ఉమెన్ గ్రూప్. భోజనాల తరువాత టేబుళ్లు, నేలను శానిటైజ్ చేస్తున్నారు. క్రిములు పెరగకుండా, వ్యాధులు వ్యాప్తి చెందకుండా, సహాయ శిబిరం చుట్టుపక్కల ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు కనిపించకుండా చూస్తున్నారు.కేరళలో మొత్తం 1018 హరిత కర్మ సేన యూనిట్లు పని చేస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో 4,678, గ్రామీణప్రాంతాల్లో 26, 546 మంది మహిళలు పనిచేస్తున్నారు. ‘వేస్ట్ ఫ్రీ కేరళ’ నినాదాన్ని భుజాల కెత్తుకున్న హరిత కర్మ సేన కలెక్టింగ్, ట్రాన్స్‌పోర్టింగ్, ప్రాసెసింగ్, రీసైకిలింగ్, వేస్ట్ మెటీరియల్స్ డిస్పోజల్ అండ్ మేనేజ్మెంట్కు సంబంధించి వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘సమాజానికి ఉపయోగపడే మంచి పని చేస్తున్నాను అనే భావన మనసులో ఉండడం వల్ల కావచ్చు ఎంత పని చేసినా శ్రమగా అనిపించదు’ అంటుంది హరిత కర్మ సేన సభ్యురాలు ఉద్విత. -
తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!
కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారింది వాయనాడ్. కొండచరియలు వాయనాడ్ని తుడిచిపెట్టేశాయి. ఈ ఘటనలో మొత్తం 295 మంది మృతి చెందారు. వాయనాడ్ విషాదం ఎందరినో కదిలించింది. ప్రముఖులు, సెలబ్రెటీలు తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. అయితే ఈ ఘటనలో ఎన్నో కన్నీటి కథలు, వ్యథలు ఉన్నాయి. ఈ విషాద ఘటనలో ఒక మహిళ తమ వ్యక్తిగత బాధను పక్కన పెట్టి మరీ ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చి అందరిచేత ప్రశంసలందుకుంది. ఆమెనే దీపా జోసెఫ్. ఎవరంటే ఆమె..!కేరళలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ దీపా జోసెఫ్. దారుణ వినాశనాన్ని చవిచూసిన వాయనాడ్‌లో తన అంబులెన్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బాధితులు రక్షించి నిస్వార్థంగా సహాయ సహకారాలు అందించింది. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి తన వంతుగా సాయం అందించి ఆయా మృతదేహాలను వారికి చేరవేసింది. ఆ ఘటనలో బాధితుల మృతదేహాలను అందజేసేటప్పుడూ కొన్ని దృశ్యాలు మెలితిప్పేసేవని చెబుతోంది దీపా. ఒక్కోసారి తనకు కూడ కన్నీళ్లు ఆగేవి కావని చెబుతోంది. ఎవరంటే ఆమె..?కరోనా మహమ్మారి సమయంలో దీపా జోసెఫ్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబ జీవనాధారం కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించింది. కేరళలో ఈ వృత్తిలో పనిచేస్తున్న తొలి మహిళ దీపానే కావడం విశేషం. సవాళ్లతో కూడిన ఈ వృత్తిలో చాలా ధైర్యంగా సాగిపోయింది దీపా. అయితే వ్యక్తిగత విషాదం కారణంగా తన వృత్తి నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. తన కన్న కూతురు బ్లడ్ కేన్సర్‌తో చనిపోవడంతో డిప్రెషన్‌కి వెళ్లిపోయింది దీపా. దీంతో విధులకు గత కొద్ది రోజులుగా దూరంగానే ఉండిపోయింది.వాయునాడ్ దుర్ఘటన గురించి విని మళ్లీ విధుల్లోకి వచ్చి బాధితులకు తన వంతుగా సాయం అందించింది. తన బాధను దిగమింగి ప్రజలకు నిస్వార్థంగా సాయం అందించింది. నిరంతరం రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ..సహాయ సహకారాలు అందించి అందరిచేత ప్రశంసలందుకుంది దీపా. కాగా, ఆమె నాటి విషాద దృశ్యాలను గుర్తు చేసుకుంటూ..బాగా కుళ్లిపోయిన మృతదేహాలను కూడా తరలించినట్లు తెలిపింది. కొన్ని ఘటనల్లో అయితే తెగిపోయిన అవయవాల ఆధారంగా తమ వాళ్లను గుర్తించాల్సిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది దీపా. ఈ అనుభవాలను తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, అదే తన బాధను పక్కన పెట్టి సాయం చేయాలనే దిశగా పురిగొల్పిందని అంటోంది దీపా. ప్రస్తుతం తానింకా విధుల్లోకి వెళ్లడం లేదు కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్‌డ్రైవర్‌గా పనిచేస్తానని తెలిపింది. నిజంగా గ్రేట్ జీవనాధారం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వ్యక్తిగత విషాదంతో పనికి దూరమయ్యింది. కానీ ఆ బాధను కూడా పక్కనపెట్టి వాయనాడ్ విషాదంలోని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం అనేది నిజంగా ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం కూడా.(చదవండి: గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్‌కి భారీ విందు..!) -
వయనాడ్ బాధితులకు అండగా మరో స్టార్ హీరో!
కేరళలోని వయనాడ్ బాధితులకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ అండగా నిలిచారు. బాధితుల సహయార్థం సీఎం సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే పలువురు సినీతారలు సాయం అందించారు. మలయాళ నటులతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ నటులు సైతం విరాళాలు ఇచ్చారు.ధనుశ్ ఇటీవలే రాయన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. గతనెల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
వయనాడ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ... అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులకు భరోసా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Narendra Modi: అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
వయనాడ్: భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల ధాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు. బురద దారుల్లో మోదీ నడక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వయనాడ్ జిల్లాలోని చూరమల, ముండక్కై, పుంచిరిమట్టామ్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత కాల్పెట్టాలో దిగారు. రోడ్డు మార్గంలో చూరమలకు చేరుకున్నారు. బురద, రాళ్లతో నిండిపోయిన దారుల్లో కాలినడకన కలియదిరిగారు. వరద బీభత్సాన్ని స్వయంగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులతో, సహాయక సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి మెప్పడిలో సహాయక శిబిరానికి చేరుకొని, బాధితులతో సంభాíÙంచారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. స ర్వం కోల్పోయామంటూ బోరుమని విలపించారు. ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. గూడు లేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధి తు లు కోరగా, తప్పకుండా ఇస్తామంటూ మోదీ చెప్పారు. పలువురు చిన్నారులతోనూ ఆయ న సంభాíÙంచారు. వరదల తర్వాత భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కాసేపు నడిచారు. మోదీ పర్యటన సందర్భంగా చూరమలలో రహదారికి ఇరువైపులా వందలాది మంది జనం గుమికూడారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అరి్థంచడానికి వచ్చామని వారు చెప్పారు. -
హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇస్తున్నా
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్‌పై హీరోయిన్... రియల్‌గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్‌ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు? సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.→ వయనాడ్‌లో షూటింగ్స్ ఏమైనా చేశారా?ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్‌కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను. → ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా? ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.→ సంయుక్తా మీనన్లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు? మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్‌ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం. → సింగిల్ పేరెంట్‌గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్... యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్‌ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారన్న మాట... ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు. → ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...అవును. పాలక్కాడ్‌లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్గా నేను పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను. → కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్‌ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా? ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్‌ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. → మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా... ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను. – డి.జి. భవాని -
వయనాడ్ విపత్తులో వందలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు: మోదీ
కేరళలో ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్ విలయ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని మోదీ పరామర్శించారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్రమంత్రి సురేష్ గోపి, ఇతర యవనాడ్ ఉన్నతాఅధికారులతో ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించారు. #WATCH | Kerala: Prime Minister Narendra Modi holds a review meeting with officials regarding the landslide-affected area in Wayanad.Governor Arif Mohammed Khan, CM Pinarayi Vijayan and Union Minister Suresh Gopi are also present.(Source: DD News) pic.twitter.com/Yv6c0sU36Y— ANI (@ANI) August 10, 2024ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. వయనాడ్‌లో కొండచరియలు విగిరిపడినప్పటి నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విపత్తులో వందలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారని అన్నారు. ప్రకృతి విలయంలో వాళ్ల కలలన్నీ కల్లలైపోయాయని అన్నారు. ఈ దుఃఖ సమయంలో మీకు అండగా ఉంటామని బాధితులకు చెప్పినట్లు తెలిపారు. #WATCH | Kerala: Wayanad landslide: Prime Minister Narendra Modi says "I have been taking information about the landslide since the time I got to know about the incident. All the agencies of the Central Govt who could have helped in the disaster were mobilised immediately. This… pic.twitter.com/k1ZhFreScZ— ANI (@ANI) August 10, 2024 ‘ఈ రోజు నేను రిలీఫ్ క్యాంపులో బాధితులను స్వయంగా కలిశాను. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించాను. వారు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు. వయనాడ్ విలయంలో చిక్కకున్న వారికి అండగా నిలవాలి. అంతా కలిసి పనిచేస్తేనే బాధితులకు అ అండగా ఉండగలం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అంతా కలిసి పనిచేయాలి. ఆప్తులను కోల్పోయిన వారికి అండగా నిలుద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నష్టం అంచనాలు పంపిన వెంటనే ప్రకృతి విపత్తు సాయం అందిస్తాం#WATCH | Kerala | Wayanad landslide: Prime Minister Narendra Modi says "I had a conversation with CM Pinarayi Vijayan the morning when the incident took place and assured him that we will provide assistance and try to reach the spot as soon as possible. NDRF, SDRF, Army, Police,… pic.twitter.com/CaLZnnDbhO— ANI (@ANI) August 10, 2024సంఘటన జరిగిన రోజు ఉదయం నేను సిఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. మేము సహాయం అందజేస్తామని, వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాను. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. సైన్యం, పోలీసులు, వైద్యులు, ప్రతి ఒక్కరూ బాధితులకు వీలైనంత త్వరగా సహాయం చేయడానికి ప్రయత్నించారు. మృతుల కుటుంబీకులు ఒంటరిగా లేరని నేను హామీ ఇస్తున్నాను. వారికి మేము అండగా ఉన్నాం. కేరళ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం వారికి సాయం చేస్తోంది. ’ అని తెలిపారు. -
వయనాడ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
నేడు వయనాడ్ లో మోదీ పర్యటన..
-
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మోదీ సందర్శించారు. అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.#WATCH | Kerala: Prime Minister Narendra Modi visits the landslide-affected area in Wayanad. He is being briefed about the evacuation efforts. Governor Arif Mohammed Khan and Union Minister Suresh Gopi are also present. (Source: DD News) pic.twitter.com/rANSwzCcVz— ANI (@ANI) August 10, 2024 కేరళలో కొండచరియలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ ప్రాంతంలో ప్రధాని మోదీ శనివారం(ఆగస్టు10) పర్యటిస్తున్నారు. పర్యటన కోసం కేరళలోని కన్నూర్ విమానాశ్రయానికి ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని చేరుకున్నారు. ఇక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్లో వయనాడ్ వెళ్లి ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని పరిశీలించారు. Kerala: Prime Minister Narendra Modi arrives at Kannur Airport; received by Governor Arif Mohammed Khan and CM Pinarayi VijayanPM Modi will visit Wayanad to review relief and rehabilitation efforts(Pics source: CMO) pic.twitter.com/sfbP5lm0HU— ANI (@ANI) August 10, 2024 -
రేపు వయనాడ్‌కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(శనివారం) వయనాడ్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోదీ. అనంతరం, బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలను కూడా సందర్శించనున్నారు.కాగా, కేరళలోని వయనాడ్‌లో సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రేపు వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీ రేపు ఉదయం 11 గంటలకు కేరళలోని కన్నూరుకు చేరుకుంటారు. వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేస్తారు. అలాగే, మధ్యాహ్నం 12:15 గంటలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం, బాధితులను, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కలుస్తారు. ఇదే సమయంలో వయనాడ్‌లో జరుగుతున్న పునరావాస పనులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తారు. కాగా, బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని కూడా ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అక్కడ జరిగిన పరిణామం, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి అధికారులు వివరించనున్నారు. ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 400 మందికిపైగా ప్రజలు మృతిచెందగా.. మరో 200 మంది ఆచూకీ లభించలేదు. ఇక, గురువారంతో వయనాడ్‌లో సహాయక చర్యలు ముగిశాయి. భారత సైన్యం కూడా వయనాడ్ నుంచి వెళ్లిపోయింది. మరోవైపు.. వయనాడ్ విపత్తను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు మోదీ.. వయనాడ్‌కు వస్తున్న సందర్భంగా జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా? లేదా? అనే అంశంపై చర్చ నడుస్తోంది. -
రేపు వయనాడ్‌కు ప్రధాని మోదీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ఈనెల 10న ప్రధాని మోదీ పర్యటించనున్నారని సీఎం పినరయి విజయన్ చెప్పారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వందలాదిమంది చనిపోవడం తెల్సిందే. బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటిస్తారని విజయన్ వివరించారు. ఈ దుర్ఘటనలో బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని సీఎం విజయన్ చెప్పారు. తమ వినతి మేరకు 9 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ అంగీకరించిందన్నారు. ఈ కమిటీ విపత్తు తీవ్రతను అంచనా వేసి, నివేదిక ఇస్తుందన్నారు. ఈ దుర్ఘటనలో 131 మంది వరకు గల్లంతైనట్లు గుర్తించామన్నారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ ప్రధాని మోదీ వయనాడ్‌లో పర్యటనకు రానుండటం గమనార్హం. -
వీడియో: వయనాడ్‌లో జవాన్లకు వీడ్కోలు.. కన్నీరుపెట్టిన బాధితులు
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా 400 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఇంకా 152 మంది ఆచూకీ దొరకలేదు. ఇక ఈ విపత్తు చోటుచేసుకున్న నాటి నుంచి దాదాపు 10 రోజుల పాటు భారత ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది. నేటితో సహాయక చర్యలు ముగియడంతో వయనాడ్ ప్రజలు.. జవాన్లకు వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.కాగా, వయనాడ్‌లో ప్రకృతి విపత్తు జరిగిన నాటి నుంచి ఆర్మీ సహా సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మన ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే, వరదల్లో చిక్కుకున్న వారిని సహాసోపేతంగా కాపాడారు. ఎంతో తక్కువ సమయంలో వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలు అందుకున్నారు. వయనాడ్ ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యయప్రయాసలకు ఓడ్చి బాధితులకు బాసటగా నిలిచారు.అయితే, నేటితో సహాయక చర్యలు ముగియడంతో జవాను తిరుగు పయనం అయ్యారు. ఈ సందర్భంగా జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వయనాడ్ ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. జవాన్లు వెళ్తుండగా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. #WayanadLandslide Watch | Emotional send-off to #IndianArmy personnel from people of all walks of life at #Wayanad.Grateful for our brave heroes who risked everything during the landslide #RescueOps.Your courage & sacrifice won't be forgotten…#WeCare🇮🇳@giridhararamane pic.twitter.com/u2csEIo5r7— PRO Defence Kochi (@DefencePROkochi) August 8, 2024 -
కేరళకు మెగాస్టార్.. సీఎంకు కోటి రూపాయల చెక్!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళలోని వయనాడ్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. తాజాగా చెక్‌ను అందజేశారు. త్రివేండ్రం వెళ్లిన మెగాస్టార్ కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసి చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వయనాడ్ ఘటనపై చిరంజీవి ఆరా తీశారు. బాధితులకు అందిస్తోన్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మరణించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో సోషయో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. #TFNReels: Megastar @KChiruTweets lands in Trivendra, Kerala to handover ₹1 cr cheque to Kerala CM. ❤#Chiranjeevi #RamCharan #WayanadLanslide #TeluguFilmNagar pic.twitter.com/tP0S4TBEOQ— Telugu FilmNagar (@telugufilmnagar) August 8, 2024 -
413కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య
కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఈ భారీ విపత్తుకు బలయినవారి సంఖ్య 413కి చేరింది. ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది. వారి కోసం 10వ రోజు(గురువారం)కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.కేంద్ర అధికారుల బృందం నేతృత్వంలో రక్షణ ఏజెన్సీలకు చెందిన వెయ్యిమందికిపైగా సభ్యులు గురువారం తెల్లవారుజాము నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా వయనాడ్, మలప్పురం జిల్లాలోని చలియార్ నది గుండా వెళ్లే ప్రాంతాల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నది నుండి మృతదేహాలను, శరీరభాగాలను వెలికితీసి తొలుత వాటిని డీఎన్ఏ పరీక్షకు పంపి, అనంతరం వాటిని గుర్తిస్తున్నారు.ఆ తరువాత ఆ మృతదేహాలను ఖననం చేస్తున్నారు. ఆనంతరం ఆయా సమాధుల ముందు నంబర్ల రాసి, డీఎన్ ఏ రిపోర్టు ఆధారంగా బంధీకులకు అధికారులు తెలియజేస్తున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో వందకుపైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా, 10వేలమందికిపైగా బాధితులు వీటిలో ఆశ్రయం పొందుతున్నారు. బాధితులకు మూడు దశల్లో పునరావాసం కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. -
10న ప్రధాని మోదీ వయనాడ్ సందర్శన
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. కేరళలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న వయనాడ్‌లో పర్యటించనున్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్‌లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం కేరళలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో 10వ రోజు(గురువారం) కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న అవశేషాలను వెలికితీసేందుకు పెద్ద సంఖ్యలో స్నిఫర్ డాగ్‌లను మోహరించారు. ఐఎఎఫ్ హెలికాప్టర్లు చలియార్ నది వెంబడి ప్రాంతాలలో ప్రత్యేక శోధన బృందాలను ల్యాండ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలోని బాధితులకు తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పునరావాసం మూడు దశల్లో జరుగుతుందని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. -
కేరళ విలయానికి క్వారీలే కారణం
మూడేళ్ల క్రితం కొంకణ్ ప్రాంతంలోనే ప్రస్తుతం వయనాడ్‌లో చోటు చేసుకున్నట్లు కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢ్ జిల్లా తాలియే ప్రాంతంలో ఏకంగా 124 మంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రాంతంలోనూ రాతి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు కొనసాగుతున్న విషయాన్ని గమనించాలి. కాగా భారీ వర్షాల కారణంగానే తాజాగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయనీ, ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయి 350కి పైగా ప్రాణాలు పోయాయనీ ప్రభుత్వం నమ్మబలకవచ్చు; కానీ టూరిస్టు రిసార్టుల కోసం నేలను చదును చేయడం, లాటరైట్ రాయి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టడం ఈ విధ్వంసానికి దారి తీసిన అసలు కారణాలు అనడంలో సందేహం లేదు.పశ్చిమ కనుమల్లో రాతి తవ్వకాలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ క్వారీయింగ్కూ,కొండచరియలు విరిగిపడేందుకూ మధ్య దగ్గరి సంబంధాలున్నాయని తెలిసినా... పట్టించుకోకపోవడమే జూలై 30న కేరళలోని వయనాడ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి కారణమైంది. భారీ వర్షాల కారణంగానే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయనీ, ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయి 350కి పైగా ప్రాణాలు పోయాయనీ ప్రభుత్వం నమ్మబలకవచ్చు; కానీ టూరిస్టు రిసార్టుల కోసం నేలను చదును చేయడం, సరస్సులను నేలమట్టం చేస్తూ లాటరైట్ రాయి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టడం ఈ విధ్వంసానికి దారితీసిన అసలు కారణాలు అనడంలో సందేహం అవసరం లేదు. ఆరు గంటల వాన అరగంటలోనే!అయితే ఒక్క విషయం. భారీ వర్షాలకు కూడా లాటరైట్ రాయి తవ్వకాలే కారణమయ్యాయా? అవుననే చెప్పాలి. ఎందుకంటే భారత్‌లో భవన నిర్మాణం, గనులు, రాతి తవ్వకాలు, రోబో శాండ్ కోసం రాయిని పొడిలా మార్చడం వంటి అన్నింటి కారణంగా ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఏరోసాల్స్ (దుమ్ము, ధూళిల కారణంగా గాల్లోకి చేరే అతి సూక్ష్మ కణాలు) గాల్లోకి చేరుతున్నాయి. వాహన కాలుష్యం, థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు వాడకం కూడా ఈ ఏరోసాల్ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. గాల్లోని నీటి ఆవిరికి ఈ ఏరోసాల్స్ తోడైనప్పుడు ఆవిరి ఘనీభవించడం మొదలవుతుంది. అది కాస్తా ముందు చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఒకదానితో ఒకటి చేరడం ద్వారా నీటి బిందువుల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా అతితక్కువ సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయి. అందుకే ఆరు గంటల సమయం జల్లుగా కురవాల్సిన వాన కాస్తా అరగంటలో కుమ్మరించిపోతోంది. పశ్చిమ కనుమలకు సంబంధించిననంతవరకూ కొంకణ్ ప్రాంతం చాలా కీలకమైంది. మహారాష్ట్రలోని ఈ ప్రాంతంతోపాటు పక్కనే ఉండే దక్కన్ పీఠభూమి ప్రాంతంలోనూ 2021 జూన్ 22న అతి తక్కువ కాలంలోనే అతిభారీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలోని ఎత్తయిన ప్రాంతాల్లో నివసించే వారు కూడా అంత తక్కువ కాలంలో అంత ఎక్కువ వాన కురవడం గతంలో ఎప్పుడూ లేదని చెబుతారు. అదే ఏడాది అక్టోబరులో కేరళ ప్రాంతంలో విలయం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళలో 2018 ఆగస్టులో కురిసిన అతిభారీ వర్షాలు, తద్వారా ఏర్పడ్డ వరద పరిస్థితి వందేళ్ల రికార్డుగా నమోదైన విషయం తెలిసిందే. ఈ వరదల్లో దాదాపు 483 మంది ప్రాణాలు కోల్పోగా, 140 మంది కనిపించకుండా పోయారు. కేరళలోని చాలక్కుడిలోని ప్రఖ్యాత రివర్ రీసెర్చ్ సెంటర్ 2018 నాటి వరదలపై పూర్తిస్థాయిలో అధ్య యనం చేసింది. చాలక్కుడి నదీ బేసిన్ లో చాలా రిజర్వాయర్లు ఉండగా... 2018లో మే నెలలోనే క్యాచ్మెంట్ ఏరియాలో మంచి వర్షాలు కురిశాయి. జూన్ , జూలైలలో ఒకట్రెండు భారీ వర్షాలూ నమో దయ్యాయి. రుతుపవనాలు ఇంకా చురుకుగా ఉండగానే డ్యామ్‌లన్నీ వేగంగా నిండిపోవడం మొదలైంది. ఈ తరుణంలో మరిన్ని వర్షాలు కురిస్తే వరదలు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018లో జూలై 17 నుంచే రివర్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు, చాల క్కుడి రివర్ ప్రొటెక్షన్ ఫోరమ్ వాళ్లు వరదల నుంచి ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు విఫలయత్నం చేశారు. డ్యామ్‌లలోని నీరు దశల వారీగా నిదానంగా వదలాలనీ, తద్వారా వరద ముప్పును కొంత వరకూ తగ్గించవచ్చుననీ వీరు సూచించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఒకవేళ ఈ సూచనలు పాటించి ఉంటే డ్యామ్ గరిష్ఠ మట్టాన్ని చేరకుండా రెండు మీటర్ల మేర తక్కువ స్థాయిలోనే నీటిని నిలుపుకునే వారు. తద్వారా ప్రమాద తీవ్రత తగ్గేది. భారీ వర్షాల్లోనూ క్వారీ తవ్వకాలు!మూడేళ్ల క్రితం కొంకణ్ ప్రాంతంలోనే ప్రస్తుతం వయనాడ్‌లో చోటు చేసుకున్నట్లు కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢ్ జిల్లా తాలియే ప్రాంతంలో ఏకంగా 124 మంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రాంతంలోనూ రాతి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు, రహదారి నిర్మాణం కోసం అడవుల నరికి వేత విచ్చలవిడిగా కొనసాగుతున్న విషయం ప్రస్తావనార్హం. 2021 జూన్ – జూలైలో మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదు కాగా అక్టోబరు 16న కేరళలోని కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో అదే తరహా విపత్తు సంభవించింది. మహారాష్ట్ర మాదిరిగానే కేరళలోనూ రాతి క్వారీల తవ్వకం వంటివే విపత్తులకు కారణమయ్యాయి. కేరళలోని ప్లాప్పల్లీ, కొట్టా యంలోని కూటిక్కల్లు బాగా దెబ్బతిన్నాయి. ఇక్కడ దాదాపు పదేళ్లుగా రాతి క్వారీలు జోరుగా సాగుతున్నాయి. వీటి నిలిపివేతకు పెద్ద ఎత్తున ఉద్యమమూ నడుస్తోంది. అయినా క్వారీ నిర్వాహకులు పట్టించుకోలేదు. అక్టోబరు 16న కూటిక్కల్‌లో కొండచెరియలు విరిగి పడే సమయంలోనూ రాతి క్వారీలు పని చేస్తూనే ఉన్నాయి. విపత్తు సంభవించినప్పుడు క్వారీలు ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారిక సమాచా రంలో కేవలం మూడు రాతి క్వారీల పేర్లు ఉన్నప్పటికీ ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా కనీసం 17 క్వారీలను గుర్తించారు. కేరళ మొత్తమ్మీద ప్రస్తుతం దాదాపు ఆరు వేల వరకూ క్వారీలు నడుస్తు న్నట్లు తెలుస్తోంది. 2018 వరదల తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 223 రాతి క్వారీలకు అనుమతివ్వడం గమనార్హం.నిలిపివేత నిర్ణయంపై రాజకీయాలుకూటిక్కల్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోని కడ నాడ్‌లో రాతి క్వారీల సమస్యను అధిగమించేందుకు ఒక ప్రయత్నం జరిగింది. 2008లో కడనాడ్ పంచాయతీ అధ్యక్షుడు మజు పుతెని కందం బయో డైవర్సిటీ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. పంచా యతీలోని పదమూడు వార్డులకు చెందిన నిపుణులు, కార్యకర్తలు ఈ కమిటీ కార్యకలాపాలను నిర్వహించేవారు. రైతులు, సభ్యులందరి నుంచి సమాచారం సేకరించిన మజు పుతెనికందం బృందం పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ ఒకదాన్ని సిద్ధం చేసింది. జీవ వైవిధ్యభరిత మైన పెరుమ్ కన్ను ప్రాంతంలో రాతి క్వారీయింగ్ సరికాదని గుర్తించిన ఈ కమిటీ క్వారీయింగ్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. కేరళ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. 2012లో కేరళ హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి క్వారీ నిలిపివేత నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఈ విషయంలో కొన్ని దుష్టశక్తుల ప్రవేశం వెంటనే జరిగి పోయింది. కడనాడ్ ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించిందని... దాంతో రైతులు, ప్రజలు అటవీ అధికారుల పెత్తనంలో బతకాల్సి వస్తుందని తప్పుడు ఆరోపణలు వ్యాప్తిలోకి తెచ్చింది. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే, అటవీ శాఖ కూడా ఈ దుష్ట శక్తులతో కుమ్మక్కైపోవడం. పర్యావరణ పరిరక్షణ పేరు చెప్పి వీరు ప్రజలను వేధించడం కూడా వాస్తవమే. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో కడనాడ్ పంచాయతీ రాతి క్వారీల తవ్వకాలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం కాస్తా నిర్వీర్యమై పోయింది. పంచాయతీ తన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. అయితే సరైన దిశలో వేసిన ఈ తొలి అడుగు మరిన్ని ముందడుగులకు ప్రారంభం కావాలని ఆశిద్దాం!మాధవ్ గాడ్గిల్ వ్యాసకర్త పర్యావరణవేత్త, ‘సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్’ వ్యవస్థాపకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
వయనాడ్ బాధితులకు భారీ విరాళం
కేరళలోని వయనాడ్ వరద బాధితులకు రెండు కోట్ల రూపాయలు భారీ విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్. ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదల వల్ల భారీ ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. సర్వస్వం కోల్పోయిన వారికి చేయూతనిచ్చేందుకు పలువురు నటీనటులు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ రెండు కోట్ల రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఇలాంటి కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలి. వారికి మనమంతా అండగా ఉండాలి’’ అని ప్రభాస్ కోరారు. -
వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్
ఢిల్లీ: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అర్ధరాత్రి వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా, ఆకస్మిక ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.ఇక, రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ..‘వయనాడ్‌లో విషాదకర ఘటన జరిగింది. వరదల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని నేను సందర్శించాను. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది ఆచూకీ తెలియలేదు. వారి మృతదేహాలు కూడా దొరకలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. Wayanad is facing a terrible tragedy, and I urge the Union government to take the following actions:1. Support a comprehensive rehabilitation package for the affected communities2. Enhance the compensation for bereaved families3. Declare the Wayanad landslides a 'National… pic.twitter.com/TFy0IF0ZIU— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2024 వరదల కారణంగా వయనాడ్‌లో కీలక రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి, బాధితులకు పునరావాసాన్ని కల్పించాలి. ప్రకృతి విపత్తు సంక్షోభ సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో వయనాడ్‌లో సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులను ప్రశంసించారు. ఆపదలో అండగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా అభినందించారు. -
వయనాడ్ విషాదం : ఇదో కన్నీటి వ్యథ!
కేరళ వయనాడ్ విషాద దృశ్యాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక విషాద కథనాలు, హృదయవిదారక అంశాలు ప్రకృతి సృష్టించిన ప్రకోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. వయనాడులో విధ్వంసం తరువాత.. ఒక తల్లి కోతి తను కన్నపిల్లను కాపాడుతున్న విధానం కంటతడిపెట్టిస్తోంది. ఎంతైనా అమ్మ అమ్మే అంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో రెండు కోతి పిల్లలు బురదలో భయంతో వణుకుతూ బిక్కు బిక్కు మంటూ ఒకదాన్ని ఒకటి పట్టుకుని కూర్చుని ఉండటాన్ని చూడొచ్చు. దీనిని గమనించిన వ్యక్తి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. #KeralaDisaster #WayanadLandslide pic.twitter.com/pILH3hM8pq— Harish R.Menon (@27stories_) August 6, 2024కాగా కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయానికి దాదాపు 400 వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. -
వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?
డార్లింగ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. రీసెంట్గా కేరళలోని వయనాడ్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే వీళ్లని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, చిరంజీవి-రామ్ చరణ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రభాస్ చేరారు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోని కొట్ట చంపారు)కేరళ వరద బాధితుల కోసం అల్లు అర్జున్ రూ.25 లక్షలు ఇవ్వగా.. చిరంజీవి-రామ్ చరణ్ కలిపి రూ.కోటి రూపాయలు అందించారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రూ.2 కోట్ల రూపాయల్ని కేరళ సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కి ఇచ్చారు. దీంతో డార్లింగ్ హీరోని అందరూ మెచ్చుకుంటున్నారు.దక్షిణాది నుంచి సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాజిల్, రష్మిక, నయనతార తదితరులు లక్షల రూపాయలు విరాళాలుగా ప్రకటించారు. అయితే తెలుగు నుంచి ఇప్పటివరకు బన్నీ, చిరు-చరణ్, ప్రభాస్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన యాక్టర్స్ కూడా ఎంతో కొంత విరాళమిస్తే బాగుంటుందని నెటిజన్స్ అంటున్నారు.(ఇదీ చదవండి: నయనతార కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలోకి) -
వయనాడ్ వారియర్స్: స్త్రీని కాబట్టి వెనక్కు తగ్గాలా?
ప్రమాదం జరిగినప్పుడు స్త్రీలను అక్కడకు వెళ్లనివ్వరు. చాలామంది స్త్రీలు తమ భర్త, కొడుకులను సహాయానికి పంపడానికి సంశయిస్తారు. కాని వయనాడ్ వరద బీభత్సం సంభవించినప్పుడు ఒక అంగన్వాడి టీచర్ రక్షణ దళాలతో సమానంగా రంగంలో దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. ‘ఇంత దారుణ పరిస్థితిలో అందరూ ఉంటే స్త్రీని కాబట్టి నేను వెనక్కు తగ్గాలా?’ అని ప్రశ్నించిందామె.వయనాడ్‌లోని చిన్న పల్లె ముప్పైనాడ్. అక్కడ అంగన్వాడి టీచర్‌గా పని చేస్తోంది 36 ఏళ్ల విజయకుమారి. జూలై 30 తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్ కాల్ అందుకుంది. వాళ్ల పల్లె నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరల్‌మలను వరద చుట్టుముట్టిందని అందరూ ప్రమాదంలో ఉన్నారని. ఆమె అంగన్వాడి టీచర్. ప్రమాదస్థలంలో ఆమెకు ఏ విధమైన విధులు లేవు ఒక ఉద్యోగిగా. ఒక పౌరురాలిగా ఎలాంటి నిర్బంధం లేదు సేవకు. కాని ఆమె ఆగలేక΄ోయింది. వెంటనే బయల్దేరడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయట భారీ వర్షం. హోరు గాలి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అయినా సరే తన టూ వీలర్ తీసి చూరల్మలకు బయలుదేరింది. తెల్లవారుజాము ఐదు అవుతుండగా అక్కడకు చేరుకుంది.కాని అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను అవాక్కు చేసింది. తనకు బాగా పరిచయమైనప్రాంతం, జనావాసం ఇప్పుడు కేవలం బురదదిబ్బ. ఎవరు ఏమయ్యారో తెలియదు. సహాయ బృందాలు వచ్చి అప్పుడప్పుడే సహాయక చర్యలు మొదలెట్టాయి. విజయకుమారి ఏమీ ఆలోచించలేదు. వెంటనే రంగంలో దిగింది. వారికి తనను పరిచయం చేసుకుని అగ్నిమాపక బృందం వారి షూస్, ఇనుపటోపి పెట్టుకుని రంగంలో దిగింది. ఆ తర్వాత ఆమె చేసినదంతా ఎవరూ చేయలేనంత సేవ. ‘నా ఎదురుగా మహా విపత్తు.ప్రాణంపోయిన వారు ఎందరో. ఇలాంటి సందర్భంలో స్రీగా వెనక్కు తగ్గాలా? అనిపించింది. కాని మనిషిగా ముందుకే వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సహాయక చర్యల్లో పాల్గొన్నాను. తెల్లవారుజాము 5 నుంచి 8 లోపు ఎన్నో మృతదేహాలను వెలికి తీసి రవాణా చేయడంలో సాయ పడ్డాను’ అందామె.పనికి వచ్చిన కరాటే..విజయకుమారికిపోలీసు కావాలని చిన్నప్పటి నుంచి కోరిక.పోలీసు కావాలని కరాటే నేర్చుకొని బ్రౌన్ బెల్ట్ వరకూ వెళ్లింది. అంతేకాదు పరీక్షలు రాసిపోలీస్గా సెలెక్ట్ అయ్యింది కూడా. కాని వాళ్ల నాన్నకు ఆమె ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అపాయింట్మెంట్ లెటర్ చింపేశాడు. ఆమె అంగన్వాడి టీచర్‌గా మిగలాల్సి వచ్చింది. పోలీస్ కావాలని నేను తీసుకున్న కరాటే శిక్షణ, చేసిన ఎక్సర్సైజులు నాకు ఈ సమయంలో తోడు వచ్చాయి. రక్షణ దళాలతో సమానంగా నేను కష్టపడ్డాను. మనిషికి మనిషి సాయం చేయాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఈ సమయంలో ఎందరో స్త్రీలు దుఃఖంతో స్పృహ త΄్పారు. సహాయక బృందాల్లో అందరూ మగవారే ఉంటారు. వారు ఓదార్చలేరు. కాని నేను స్త్రీని కావడం వల్ల వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చగలిగాను. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు ఉండాలి స్త్రీల కోసం’ అంటుంది విజయకుమారి. ఆమె సేవలను అందరూ మెచ్చుకుంటున్నారు. -
వయనాడ్ వారియర్స్: ఈ తల్లి ఒక అద్భుతం!
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్‌లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్‌లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్‌ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది. -
వయనాడ్ పర్యటనలో మోహన్ లాల్, రవి.. ఆర్మీ రిటైర్డ్ అధికారి ఫిర్యాదు
కేరళలోని వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌తో పాటు రిటైర్డ్ మేజర్, నటుడు A. K. రవీంద్రన్ పాల్గొన్న విషయం తెలిసిందే. వయనాడ్ పర్యటన సందర్భంగా యూనిఫాం దుర్వినియోగం చేసినందుకు మేజర్ రవిపై మరో రిటైర్డ్ అధికారి ఫిర్యాదు చేశారు.విపత్తు బారిన పడిన వాయనాడ్ ప్రాంత పర్యటనలో ఆర్మీ యూనిఫాం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సినీ దర్శకుడు, మేజర్ రవి ఎదుర్కొంటున్నారు. ఆర్మీ రిటైర్డ్ అధికారి అరుణ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సైన్యంలో పదవీ విరమణ పొందిన తర్వాత ఎవరూ కూడా మళ్లీ సైనిక యూనిఫామ్ ధరించడం నిషేధం. డిఫెన్స్ సర్వీస్ నిబంధనలను మేజర్ రవి ఉల్లంఘించారని ఆరుణ్ ఆరోపించారు. వాస్తవంగా రవీంద్రన్ ఇండియన్ ఆర్మీలో అత్యున్నత స్థానంలో పనిచేసి మేజర్ ర్యాంక్ వరకు చేరుకుని ఆపై రిటైర్డ్ అయ్యారు.అయితే, ఆర్మీ దుస్తులు ధరించి ఫోటోలు తీయడం ఆపై వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి చర్యలకు మేజర్ రవి పాల్పడ్డారని అరుణ్ విమర్శించారు. ఇలాంటి పనులు చేయడం వల్ల సైనిక యూనిఫామ్ సమగ్రతను దెబ్బతినడంతో పాటు తీవ్రమైన భద్రతా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన నెటిజన్ల నుంచి కూడా విస్తృతమైన ఎదురుదెబ్బకు దారితీసింది, నెట్టింట కూడా మేజర్ రవి తీరును ఖండించారు.మేజర్ రవి, నటుడు మోహన్‌లాల్‌తో కలిసి వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సందర్శించారు. విపత్తులో తీవ్రంగా దెబ్బతిన్న స్థానిక పాఠశాలను పునర్నిర్మించడానికి సహాయం చేస్తానని చెప్పి ఆ పని చేసినందుకు ఆయన్ను అందరూ అభినందించారు. కానీ, ఒక విషాదం-బాధిత ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఈ విమర్శలకు దారితీసింది. మేజర్ రవి సినిమా రంగంలో కూడా పనిచేశారు. దర్శకుడగా మాత్రమే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో మెప్పించారు. అలా ఆయనకు ఆర్మీ, సినిమా రంగాల్లో సత్తా చాటారు. -
ఆమె గొంతుక.. మన గుండెల్లో..!
‘దయచేసి మమ్మల్ని రక్షించండి’ వణుకుతున్న గొంతుతో సహాయం కోసం నీతూ జోజో చేసిన ఆర్తనాదం కొందరి ప్రాణాలను రక్షించగలిగింది. వయనాడ్‌లో జూలై 30 వరదల సందర్భంగా సహాయం కోసం మొదట వచ్చిన ఫోన్ కాల్ నీతూ జోజోదే. ఆ కాల్ రికార్డ్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తన కుటుంబమే కాదు ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా సురక్షితంగా ఉండేలా ప్రయత్నిస్తున్న క్రమంలోప్రాణాలు కోల్పోయింది నీతూ జోజో...కేరళ వరదల (2018)పై గత సంవత్సరం వచ్చిన మలయాళ చిత్రం ‘2018’లో వరద బీభత్సం, చావుకు బతుకుకు మధ్య ఊగిసలాడిన బాధితుల దృశ్యాలు, వరద అనే అష్టదిగ్బంధనంలో కూరుకుపోయిన ఇండ్లు... ఒళ్లు జలదరింప చేసే దృశ్యాలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడు వాటికి మించిన దృశ్యాలు వయనాడ్‌లో కనిపిస్తున్నాయి. ‘2018’ సినిమాలో ఇతరులను రక్షించాలని తపించిన వారిని ఉద్దేశించి ‘ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ అనే పెద్ద అక్షరాలు తెరమీద కనిపిస్తాయి. అలాంటి ఒక హీరో నీతూ జోజో.నీతు వయనాడ్‌లోని మూపెన్స్ మెడికల్ కాలేజీలో నర్స్. ‘కొండచరియలు విరిగిపడ్డాయి. నేను ఇక్కడ పాఠశాల వెనకాల నివసిస్తున్నాను. దయచేసి మాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపగలరా. మీకు ఫోన్ చేయడానికి ముందు నేను చాలామందికి ఫోన్ చేశాను’ అంటూ వెప్పడి గ్రామం నుంచి మూపెన్ మెడికల్ కాలేజీకి ఫోన్ చేసింది నీతు.సిబ్బంది ఆమె నుంచి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని సహాయ బృందాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సమీపంలో నివసిస్తున్న ఏడు కుటుంబాలు తన ఇంట్లో ఆశ్రయం పొందారని, శిథిలాల మధ్య చిక్కుకుపోయిన తమ ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని ఫోన్లో చెప్పింది నీతు.‘ఆమె చాలా ఆందోళన, బాధతో ఫోన్ చేసింది. నేను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. ఆసుపత్రి నుంచి మా అంబులెన్స్ నీతు ఉంటున్నప్రాంతానికి బయలుదేరింది’ అంటుంది మూపెన్స్ మెడికల్ కాలేజీ డీజీఎం షనవాస్ పల్లియాల్.అయితే చెట్లు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయింది. అంబులెన్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. దీంతో నీతూకు ధైర్యం చెప్పడానికి అంబులెన్స్ డ్రైవర్, ఇతర సిబ్బంది నాన్‌స్టాప్‌గా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రెండోసారి కొండ చరియలు విరిగిపడిన తరువాత ఫోన్ కనెక్షన్ కట్ అయింది. రోడ్లు బ్లాక్ కావడం, చూరలమాల వంతెన కొట్టుకుపోవడం వల్ల సహాయ సిబ్బంది నీతూ దగ్గరకు చేరుకోలేకపోయారు. భర్త, బిడ్డ, అత్త , ఇరుగు పొరుగు వారుప్రాణాలతో బయటపడినప్పటికీ నీతూ చనిపోయింది.‘నేను నీతూకు ఫోన్ చేసినప్పుడు తాము మృత్యువు నుంచి తప్పించుకున్నామనే ధైర్యం ఆమె గొంతులో వినిపించింది. నీతూకు ధైర్యం ఇవ్వగలిగాం గానీ దురదృష్టవశాత్తు రక్షించలేకపోయాం’ అంటుంది షనవాస్ పల్లియాల్. ఆరోజు అర్ధరాత్రి దాటిన తరువాత... నెప్పడి గ్రామంలోని నీతు ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. నీరు ఇంట్లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైంది. ఇరుగు పొరుగు వారిని అలర్ట్ చేసింది. ఒకవైపు తమను రక్షించమని ఫోన్ చేస్తూనే, మరోవైపు తన ఇంటి వారిని, పొరుగువారిని సురక్షితప్రాంతానికి తీసుకువెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది.అయితే తెల్లవారుజామున నాలుగు గంటలప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడడంతో మృత్యువు చెంతకు వచ్చింది. ఇక ఎంతమాత్రం తప్పించుకోలేని పరిస్థితి. నీతూతో పాటు ముగ్గురిప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి.‘మా ఇంట్లో ఉంటే సురక్షితం అని మమ్మల్ని తీసుకువెళ్లడమే కాదు. మాకు ధైర్యం చెప్పింది. ఇలా అవుతుందని అనుకోలేదు’ అని నీతును గుర్తు తెచ్చుకుంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది పొరుగింటి మహిళ.‘నీతూ ఫోన్ కాల్ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. చిన్న చిన్న గాయాలతో బయటపడుతుంది అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆమెను నిర్జీవంగా చూడాల్సి వచ్చింది’ శోకతప్త హృదయంతో అంటుంది నీతూతో కలిసి మూపెన్స్ మెడికల్ కాలేజీలో పనిచేసిన ఉద్యోగి.బీభత్సాలు జరిగినప్పుడు తమప్రాణాలు అడ్డేసి ఇతరులప్రాణాలు కాపాడేవారు ఉంటారు. నీతు జోసెఫ్‌ను వయనాడ్ ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు. -
వయనాడ్ : ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడిన ‘దేవుడు’ మాయం!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకుంది. సర్వం కోల్పోయిన అభాగ్య జనం బిక్కుబిక్కు మంటున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే, తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంతోమంది బాధితులను రక్షించిన యువకుడు మరిన్ని ప్రయత్నాల్లో ఉండగానే కనిపించకుండా పోవడం ఆందోళన రేపుతోంది. దీంతో మా సూపర్ హీరో, మా రక్షకుడు, మా దేవుడు ఏమయ్యాడు అంటూ స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడటంతో స్థానిక కుర్రాడు ప్రజీష్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. తనజీపులో రెండుసార్లు ప్రమాదకరమైన కొండ మార్గం గుండా వెళ్లి కొంతమందిని ప్రాణాలతో కాపాడాడు. ఈ క్రమంలోనే మూడో సారి వెళ్లి కనిపించకుండా పోయాడు. మరోవైపు చూరల్మల వద్ద పాడైపోయిన అతని జీప్ కనిపించింది. దీంతో మరింత ఆందోళన రేపింది. వరద నీరు , బురద , దొర్లి పడిన భారీ బండరాళ్ల మధ్య ఎక్కడ చిక్కుకుపోయాడో అని బాధపడుతున్నారు. పలుమార్లు తమ కష్టనష్టాల్లో తోడుగా నిలిచి "సూపర్ హీరో"గా పేరుతెచ్చుకున్న తమ ప్రజీష్ క్షేమంగా తిరిగి రావాలంటూ బరువెక్కిన హృదయంతో, కన్నీటితో ఆ దేవుడ్ని వేడుకుంటున్నారు.కొండపైకి వెళ్లవద్దని ఎంత హెచ్చరించినా, అక్కడ ఎంతోమంది చిక్కుకుపోయారు, వాళ్లని రక్షించాలన్న ప్రయత్నాల్లో అవన్నీ పట్టించుకోలేదని ప్రజీష్ స్నేహితులు తెలిపారు. ముండక్కై కుగ్రామంలో కొండ చరియలు విరిగిపడటం గురించి విన్న తర్వాత, ప్రజీష్ రెండుసార్లు కొండపైకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన చాలా మందిని రక్షించాడని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లబోతుండగా మరో ఫోన్ కాల్ రావడంతో మళ్లీ కొండపైకి వెళ్లాడు. ఈసారి మాత్రం తిరిగి రాలేదని వాపోతున్నారు.పెళ్లి, చావైనా మొదటి నుంచి చివరి వరకూ అండగా ఉండేవాడని, గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉండేవాడు, తలలో నాలుకలో ఉండేవాడు, అందరికీ ఇష్టమైన వ్యక్ అంటూ తి మరో గ్రామస్థుడు గుర్తు చేసుకున్నారు. "ప్రజీష్ మా భూమికి సూపర్ హీరో.. కానీ ఇప్పుడు అతడే కనిపించడం లేదు" అని ఒక గ్రామస్థుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఏ క్షణానఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని వణికిపో తున్నారు.ఇదీ చదవండి : వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్ -
వయనాడ్ విషాదానికి ఇదీ ఓ కారణమే..!
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తూంటారు.అంటే దేవుడి సొంత దేశం అని! మరి...దేవుడు తన సొంత దేశాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు?వయనాడ్‌లో అంత విలయం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది?ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దేవుడు కాదు.. మనిషే!ఎందుకంటే జూలై 30న కురిసిన కుంభవృష్టి... పల్లెలకు పల్లెలు కొట్టుకుపోవడం...మానవ చర్యల ఫలితంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావమే మరి!!దేవుడి ప్రస్తావన ఎలాగూ తీసుకొచ్చాం కాబట్టి.. కాసేపు రామరాజ్యంలోకి వెళదాం. అప్పట్లో నెలకు రెండు వానలు ఎంచక్కా కురిసేవని, ఏటా బంగారు పంటలు పండేవని.. ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లే వారని పురాణ గాధలు చెబుతాయి. అయితే ఇప్పుడు రాముడు లేడు కానీ.. ప్రకృతిని చెరబడుతున్న రావణాసులు మాత్రం ఎందరో. అభివృద్ది పేరుతో ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీయడం, విద్యుత్తు, తదితరాల కోసం పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వినయోగం పుణ్యమా అని ఇప్పుడు వాతావరణ మార్పులు మనల్ని కబళించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్‌లో కురిసిన కుంభవృష్టి... ఢిల్లీ, ముబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాలను ముంచెత్తిన వరదలు అన్నీ ప్రకృతి ప్రకోపానికి మచ్చుతునకలే. మరో తాజా ఉదాహరణ వయనాడ్ విలయం!. ఇంతకీ జూలై 30 తేదీన వయనాడ్ ప్రాంతంలో ఏం జరిగింది? అప్పటివరకూ వర్షాభావాన్ని అనుభవిస్తున్న ఆ ప్రాంతం కేవలం ఒకే ఒక్క రోజులో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకు ఎక్కింది. మంచిదే కదా? అనుకునేరు. అతితక్కువ సమయంలో ఎక్కువ వానలు కురవడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మేఘాల నుంచి జారిపడే చినుకులను ఒడిసిపట్టేందుకు.. సురక్షితంగా సముద్రం వరకూ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు అంటే... నదులు, చెరువులు భూమ్మీద లేవు మరి! ఫలితంగానే ఆ విపరీతమైన కుంభవృష్టికి కొండ సైతం కుదేలైంది. మట్టి, బురద, రాళ్లు వేగంగా లోయ ప్రాంతంలోకి వచ్చేసి పల్లెలను మింగేశాయి.ఏటా నైరుతి రుతుపవనాల రాక కేరళతోనే మొదలవుతుంది మనకు తెలుసు. జూన్‌తో మొదలై సెప్టెంబరు వరకూ ఉండే నైరుతి రుతుపవన కాలంలో వయనాడ్ ప్రాంతంలో సగటు వర్షపాతం 2,464.7 మిల్లీమీటర్లు (మి.మి). అయితే గత ఏడాది రుతు పవనాల వైఫల్యం కారణంగా ఇక్కడ 55 శాతం తక్కువ వర్షం నమోదైంది. అంతేకాదు... 128 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాభావ పరిస్థితులను కేరళ రాష్ట్రం మొత్తం ఎదుర్కొంది. ఈ రాష్ట్రంలోనే ఉన్న వయనాడ్‌లో ఈ ఏడాది జూన్ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో సుమారు సాధారణ వర్షపాతం (574.8 మి.మి) కంటే 42 శాతం తక్కువగా 244.4 మి.మి వర్షం మాత్రమే కురిసింది. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసినా అది సాధారణం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. జూలై 29న నమోదైన తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సగటు వర్షపాతమైన 32.9 మిల్లీమీటర్లలో నాలుగో వంతు కంటే కొంచెం ఎక్కువ. కానీ జూలై 30న పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. సాధారణ 23.9 మిల్లీమీటర్ల స్థానంలో ఏకంగా 141.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. వయనాడ్ ప్రాంతంలోని వియత్రిలోనైతే ఇది పది రెట్లు ఎక్కువ. అలాగే మనటోడిలో 200 మి.మిలు, అంబాలవయ్యల్లో 140 మి.మి. కుపాడిలో 122 మి.మి.ల వర్షం కురిసినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. అంటే.. నాలుగు నెలల్లో కురవాల్సిన వానలో ఒకే రోజు దాదాపుగా ఆరు నుంచి పది శాతం కురిసేసిందన్నమాట!. జూలై 10 నుంచి జూలై 30 వరకూ కురిసిన వాన కూడా సగటు వర్షపాతంలో 28 శాతం వరకూ ఉండటం గమనార్హం. కర్బన ఉద్గారాల కారణంగా భూగోళం వేడెక్కుతోందని.. పరిస్థితిని అదుపు చేయకుంటే.. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయని శాస్త్రవేత్తలు ఏళ్లుగా చేస్తున్న హెచ్చరికలు నిజమేనని మరోసారి రుజువైనట్లు వయనాడ్ ఉదంతం స్పష్టం చేస్తోంది. -
వయనాడ్ : అంతులేని విషాదంలో ఆనంద క్షణాలు, వైరల్ వీడియో
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం పెను విషాదాన్ని సృష్టించింది. కుటుంబాలకు కుటుంబాలు నాశనమై పోయాయి. సొంతవారు, పొరుగువారు ఇలా సర్వం పోగొట్టుకుని గుండెలవిలసేలా కొందరు రోదిస్తోంటే, తోడును, ఉన్నగూడును కోల్పోయి మరికొంతమంది బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి సంబంధించిన విషాద కథనాలు, ఫోటోలు మనల్ని కలచివేస్తున్నాయి. ఇంతటి విషాదంలోనూ మనసుకు స్వాంతన కలిగించే కథనాలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వయనాడ్‌లో విషాదంలో మనుషులతో పాటు అనేక మూగజీవాలు అతలాకుతలమైపోయాయి. పెంపుడు జంతువులు తమ వాళ్లు ఎక్కడ, ఎలా ఉన్నారో, ఎటు పోవాలో తెలియక అల్లాడిపోయాయి. అలా తమ యజమాని కోసం విశ్వాసానికి మారుపేరైన ఒక కుక్క ఆశగా ఎదురు చూసింది. కళ్లు కాయలు కాచేలా ఆరు రోజులపాటు వెదికింది. ఇక కనిపించవా అమ్మా అన్నట్టు కంట నీరు పెట్టుకుంది. చివరికి దాని ఎదురు చూపు ఫలించింది. ఆనందమైన ఆ క్షణాలు రానేవచ్చాయి. అంతే.. ఆనందంతో ఎగిరి గంతేసింది. యజమానిని చూసిన ఆనందంతో ప్రేమతో తోక ఊపుకుంటూ, ఆమెను చుట్టేసుకుంది. కళ్లు చెమర్చే ఈ దృశ్యాలు నెట్టింట్ వైరల్‌గా మారాయి. -
వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన మారణహోమానికి దారి తీసింది. వరుసగా ఏడో రోజుకూడా ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన అనేక హృదయ విదారక దృశ్యాలు, కథనాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో తొలి విపత్తు కాల్ చేసిన మహిళ కాల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయనాడ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేసే మహిళ ఫోన్ కాల్, ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె పడ్డ తపన పలువురి గుండెల్ని పిండేస్తోంది.వివరాలను పరిశీలిస్తే..జూలై 30న జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నీతూ జోజో అనే మహిళ తొలుత స్పందించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రాణాలకే ప్రమాదం.. రక్షించండి! అంటూ కాల్ చేశారు. డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ సిబ్బందికి కాల్ రికార్డింగ్‌లో నీతూ, "చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మేం పాఠశాల వెనుక ఉంటున్నాం, దయచేసి మాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా పంపగలరా?" అని చాలా ఆందోళనతో వేడుకున్నారు. ఇంటిచుట్టూ నీరే ఉందని తెలిపారు. అంతేకాదు తమతోపాటు ఏడు కుటుంబాలవారు తన ఇంట్లో ఆశ్రయం పొందారని తెలిపింది. అయితే తాము దారిలో ఉన్నామని, కంగారు పడొద్దని రెస్క్యూ టీమ్‌లు తమ ఆమెకు ధైర్యం చెప్పాయి. కానీ వారు వెళ్లేసరికే ఆలస్యం జరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట. రాత్రికి రాత్రే దూసుకొచ్చిన నదీ ప్రళయఘోష బెడ్రూంకి చేరడంతో ఆమెకు మెలకువ వచ్చింది. చూరల్‌మలలోని హైస్కూల్ రోడ్డులోని ఆమె ఇంట్లోకి నీళ్లొచ్చాయి. ఎటు చూసిన కొట్టుకొస్తున్న వాహనాలు, కుప్పకూలిన శిథిలాలు, మట్టి,బురద భయంకరంగా కనిపించాయి. మెప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో ఫ్రంట్ ఆఫీస్‌లో పనిచేసే నీతులో ఆందోళన మొదలైంది. వెంటనే తన భర్త జోజో జోసెఫ్‌ను నిద్ర లేపారు. ఇంతలోనే సమీపంలోని ఏడు కుటుంబాల ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. వారికి కొండపైకి ఎత్తైన ఆమె ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. దీంతో 1.30 గంటలకు ఆసుపత్రికి ఫోన్ చేసింది. మళ్లీ 2.18 గంటలకు ఆమె మళ్లీ తన ఆసుపత్రికి ఫోన్ చేసింది. కొన్ని నిమిషాలకే ఆమె ఇంట్లోని వంటగది కొట్టుకుపోయింది. నీతూ మాత్రం సాయం కోసం ఎదురుచూస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త జోజో, వారి ఐదేళ్ల కుమారుడు, మిగిలిన రెండు గదుల్లో ఉన్న జోజో తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్, మరొక సిబ్బంది ఆమెతో నిరంతరం ఫోన్లో టచ్‌లో ఉన్నారు కానీ, చెట్లు నేలకొరగడంతో రోడ్డు మార్గం స్థంభించిపోయింది. దీంతో రక్షణ బృందాలు చేరుకోలేకపోయాయి. వీళ్లు వెళుతున్న క్రమంలోనే రెండో కొండచరియలు విరిగిపడటంతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. చూరల్మల వంతెన కొట్టుకు పోయింది. అంబులెన్స్‌లు, ఇతర రెస్క్యూ సిబ్బంది నీతు వద్దకు చేరుకోలేకపోయింది. ఐదు రోజుల తర్వాత నీతు మృతదేహం చలియార్లో లభ్యమైంది. నీతు ధరించిన ఆభరణాలను బట్టి బంధువులు ఆమెను గుర్తించారు.కాగా జూలై 30న వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో 360 మందికి పైగా మరణించారు ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకీ కోసం అధునాతన రాడార్లు, డ్రోన్లు, భారీ యంత్రాలను ద్వారా రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను వేగవంతం చేశాయి. -
వయనాడ్ : తవ్వే కొద్ది బయటపడుతున్న మృతదేహాలు
తిరువనంతపురం : వయనాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్ ఏడో రోజు సోమవారం (ఆగస్ట్5న)ముమ్మరంగా కొనసాగుతుంది.👉కొద్ది సేపటి క్రితమే కాంతన్‌పరా వద్ద చిక్కుకున్న 18 మంది సహాయక సిబ్బందిని హెలికాఫ్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.👉 వాయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నది 40కిలోమీటర్ల మేర సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. 👉మొత్తం 1500మంది ఫైర్‌ఫోర్స్ సిబ్బంది, వాలంటీలర్లు సంయుక్తంగా కలిసి ముందక్కైలో సహాయచర్యల్ని కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో తవ్వే కొద్దీ శవాలు వెలుగులోకి వస్తున్నాయి. 👉ఇక ఆదివారం వరకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆరుజోన్లుగా విభజించిన ఆర్మీ, నేవీ, ఫారెస్ట్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు బాధితుల జాడ కోసం క్షుణ్ణంగా పరిశీలించారు. ఇవ్వాళ సైతం సహాయక చర్యల్ని ప్రారంభించినట్లు చెప్పారు. 👉వాయనాడ్‌లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సహాయక శిబిరాలు నిర్వహిస్తున్న పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి.👉రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. ఇప్పటికే 387మృత దేహాలు వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం శిధిలాల కింద వెతుకుతున్నారు. అయితే ఘటన జరిగి ఆరురోజులు కావడంతో ప్రాణాలతో బయటపడడం కష్టమేనని అంటున్నారు స్థానికులు. దాదాపూ 200మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది.👉ఆర్మీ,ఎన్డీఆర్ఎఫ్,కేరళ పోలీసులు,ఫైర్,రెస్క్యూ డిపార్ట్మెంట్లు గాలింపులు చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్నిపర్ డాగ్స్ డోన్స్‌ద్వారా గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు.👉కొండచరియల బీభత్సం పదుల సంఖ్యలో కుటుంబాలను బలితీసుకుంది. తమవారి ఆచూకి లభించకపోతుందా అని చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ జరుపుతున్న ప్రాంతాల్లో చూస్తున్న ఎదురుచూపులు ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్నాయి. Wayanad landslides: Rescue operations enter 7th day, death toll at 308Read @ANI Story | https://t.co/YAuUVbwTj4#Kerala #Wayanad #Landslides pic.twitter.com/zj7HQAO2QO— ANI Digital (@ani_digital) August 5, 2024 -
Wayanad landslide: వయనాడ్ విలయానికి... ఉమ్మడి కుటుంబం బలి!
వయనాడ్: అప్పటిదాకా ఇంటినిండా 16 మంది సభ్యుల సందడితో కళకళలాడిన ఆ ఉమ్మడి కుటుంబం ఒక్కసారిగా కళతప్పింది. కొండల మీదుగా దూసుకొచ్చిన ప్రకృతి ప్రళయం కుటుంబాన్ని అమాంతం మింగేసింది. చూరల్మల కుగ్రామంలో ఆ ఉమ్మడి కుటుంబంలో 42 ఏళ్ల మన్సూర్ ఒక్కడే మిగిలాడు. విపత్తు రోజున ఊళ్లో లేకపోవడంతో బతికిపోయాడు. తన ఇంట్లో 16 మందిని కొండలు కబళించాయంటూ విలపిస్తున్నాడు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విలయానికి బలైన వారి సంఖ్య 221కి చేరినట్టు కేరళ ఆదివారం ప్రకటించింది. వాస్తవ సంఖ్య 370 దాటినట్టు స్థానిక మీడియా చెబుతోంది. జీవనదిలో నిర్జీవ దేహాలు వయనాడ్ తదితర తీరవాసులకు జీవనాడిగా పేరొందిన చలియార్ నది ఇప్పుడు విలయానికి గుర్తుగా మారింది. కొండచరియలకు బలైన వారి మృతదేహాలు ఆరు రోజులైనా ఇంకా నది ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి! ఘటనాస్థలి మీదుగా 40 కి.మీ.ల పొడవునా తీరం వెంట గాలింపు కొనసాగుతోంది.సైన్యానికి సెల్యూట్.. బాలుడి లేఖ వయనాడ్‌లో అన్వేషణ, సహాయక పనుల్లో సైన్యం కృషిని రాయన్ అనే స్థానిక చిన్నారిని కదలించింది. ‘మీరు నిజంగా గ్రేట్’ అంటూ మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆరీ్మకి లేఖ రాశాడు. ‘‘ధ్వంసమైన నా వయనాడ్‌లో బాధితులను ఆర్మీ కాపాడుతున్న తీరు చూసి గర్వపడుతున్నా. మీ ఆకలిని కేవలం బిస్కెట్లతో చంపుకుంటూ శరవేగంగా బ్రిడ్జి కట్టడం టీవీలో చూశా. నేను కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తా’’ అని పేర్కొన్నాడు. ‘‘నువ్వు ఆర్మీ యూనిఫాంలో మాతో కలిసి పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ ఆర్మీ అతనికి తిరుగు లేఖ రాసింది! -
కేరళకు విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్
కేరళలోని వయనాడ్‌లో ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి వందల మంది మరణించిన సంగతి తెలిసిందే! ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు తొలి రోజు నుంచే ఆర్మీ రంగంలోకి దిగింది. కానీ, చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కనీస అవసరాల కోసం అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందకు సౌత్ ఇండియా సినిమా హీరోలు ఒక్కోక్కరిగా ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ మొదటగా రూ. 25 లక్షలు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ భారీ విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు.గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వల్ల వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యానని చిరంజీవి పేర్కొన్నారు. వారికి అండగా నిలిచేందుకు తమ వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1 కోటి విరాళం అందిస్తున్నట్లు చిరంజీవి, చరణ్ పేర్కొన్నారు. జల ప్రళయం వల్ల నష్టపోయి బాధలో ఉన్న వారందరూ త్వరగా కోలుకోవాలని, ఆ శక్తి దేవుడు వారికి అందించాలని ప్రార్థస్తున్నట్లు తన ఎక్స్ పేజీలో మెగాస్టార్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేరళకు వచ్చిన విరాళాలలో మోహన్ లాల్ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ అందించిన మొత్తమే అత్యధికమని చెప్పవచ్చు. మోహన్ లాల్ రూ. 3 కోట్లు ప్రకటించారు.Deeply distressed by the devastation and loss of hundreds of precious lives in Kerala due to nature’s fury in the last few days. My heart goes out to the victims of the Wayanad tragedy. Charan and I together are contributing Rs 1 Crore to the Kerala CM Relief Fund as a token of…— Chiranjeevi Konidela (@KChiruTweets) August 4, 2024 -
‘సాహో సీత’.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
కేరళ వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే.. దేశంలోని సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోపై ప్రశంసల వర్షం కురిపించారు.మేజర్ సీతా అశోక్ షెల్కే ఫోటోను షేర్ చేస్తూ ఆమెను వయనాడ్ వండర్ఫుల్ ఉమెన్ అంటూ కొనియాడారు.మాకు డీసీ సూపర్ హీరోలు అవసరం లేదు. ఎందుకంటే మాకు నిజజీవితంలో మేజర్ సీతా అశోక్ షెల్కేలాంటి వారు ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. The WonderWoman of Wayanad. No need for DC Super Heroes. We have them in real life out here…💪🏽💪🏽💪🏽 pic.twitter.com/DWslH6nKln— anand mahindra (@anandmahindra) August 3, 2024 ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కో ఎవరు?భయంకరమైన విషాదాన్ని నింపిన వయనాడ్‌లో బాధితుల్ని రక్షించేందుకు రికార్డ్ సమయంలో తాత్కాలిక వంతెనల నిర్మాణం సీత ఆధ్వర్యంలోనే జరిగింది. వయనాడ్‌లో ముందక్కై, చురాల్‌మల్‌లను కలుపుతూ ప్రతికూల వాతావరణంలో తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం జులై 31 రాత్రి 9గంటలకు ప్రారంభించి.. మర్నాడు సాయంత్రం 5.30గంటలకల్లా వంతెన పూర్తి చేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను త్వరగా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కొండచరియలు విరిగిపడి శిధిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం మరింత సులభమైంది. అందుకే దేశ ప్రజలు ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోను అభినందనలతో ముంచెత్తుతున్నారు. If possible, don’t destroy this bridge once a more permanent structure is restored. It should serve as a symbol of our pride in our army and the sense of security we derive from our soldiers. https://t.co/ZwNJZR4xbw— anand mahindra (@anandmahindra) August 4, 2024 -
కేరళకు అల్లు అర్జున్ విరాళం.. సాయం అందించిన తొలి తెలుగు హీరో
కేరళలో భారీ వర్షాలతో వయనాడ్ ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి. భవిష్యత్‌లో ఎప్పుడు కోరుకుంటారో చెప్పలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. జులై 29 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలు చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ సాయం చేసి అండగా నిలిచారు. అయితే, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ విరాళం అందించారు. టాలీవుడ్ నుంచి కేరళకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మొదటి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం.కేరళలోని విపత్తు గురించి అల్లు అర్జున్ ఇలా ట్వీట్ చేశారు. 'వాయనాడ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నన్ను చాలా బాధించింది. కేరళ ప్రజలు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను పంచారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు నా మద్దతుగా కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారి క్షేమం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత, బలంగా నిలబడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.సూర్య, జ్యోతిక, కార్తీ ఫ్యామిలీ రూ. 50 లక్షలు... విక్రమ్ రూ. 20 లక్షలు, మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు,ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు రూ.25 లక్షలు, రష్మిక మందన్నా రూ. 10 లక్షలు, కమల్ హాసన్ రూ.25 లక్షలు, నయనతార దంపతులు రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.I am deeply saddened by the recent landslide in Wayanad. Kerala has always given me so much love, and I want to do my bit by donating ₹25 lakh to the Kerala CM Relief Fund to support the rehabilitation work. Praying for your safety and strength . @CMOKerala— Allu Arjun (@alluarjun) August 4, 2024 -
వయనాడ్ విషాదం.. వివాదంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. దీంతో దైవ భూమి కేరళ ఇప్పుడు మరుభూమిలా మారింది. అటవీ, కొండ ప్రాంతమైన వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో తాజా మరణాలు ఆదివారం (ఆగస్ట్4) ఉదయం 10.30 గంటల సమయానికి 357కి చేరుకున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.మరోవైపు కొండ చరియలు విరుచుకుపడడంతో సర్వం కోల్పోయి, తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య సహాయం కొనసాగుతుంది. వారికి అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు నేరుగా సహాయ కేంద్రాలను సందర్శిస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కావాల్సిన నిత్య సరాల్ని తీరుస్తున్నారు.మండక్కై జంక్షన్, చూరాల్మల ప్రాంతాలు భవనాలు, బురద నిందిన వీధులు, రాళ్లతో మృత్యు దిబ్బులుగా మారాయి. ఆ రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిపోక ముందు సుమారు 450 నుంచి 500 పైగా ఇళ్లుండేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. భారీ రాళ్లే దర్శనమిస్తున్నాయి. భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మురం చేస్తున్నాయి. 1300 మందికి పైగా ఆర్మీ జవానులు జాడ తెలియని వారికోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో కేరళ రాజధాని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ వయనాడ్ బాధితుల్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా వారికి కావాల్సిన బెడ్ షీట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజా ప్రతినిధులందరూ వయనాడ్‌కు సహాయం చేయాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.ఇదే విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వయనాడ్ విషాదంపై మరపురాని రోజు కొన్ని జ్ఞాపకాలు అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై వివాదం నెలకొంది.Some memories of a memorable day in Wayanad pic.twitter.com/h4XEmQo66WFor all the trolls: definition of “memorable”: Something that is memorable is worth remembering or likely to be remembered, because it is special or unforgettable. Thats all i meant. https://t.co/63gkYvEohv— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024 ఇలాంటి విషాదాన్ని వివరించినందుకు ఆయన మెమరబుల్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని బీజేపీ నేతలతో సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణిస్తే జ్ఞాపకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.శశి థరూర్‌కి విపత్తులు, మరణాలు చిరస్మరణీయం చెప్పడం సిగ్గుగా ఉందని మరో యూజర్ ట్వీట్ చేశారు. బీజేపీ ఐటి సెల్ చీఫ్ ,బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా..‘శశి థరూర్ మరణాలు, విపత్తులు చిరస్మరణీయం’ అని ట్వీట్ చేశారు.Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b— Amit Malviya (@amitmalviya) August 3, 2024ఈ ట్వీట్ వివాదంపై శశిథరూర్ మరో ట్వీట్ చేశారు. ట్రోలర్స్ అందరికి అంటూ మెమొరిబుల్‌పై నా ఉద్ద్యేశ్యం వేరే ఉంది. పలు సందర్భాలలో ఊహించని సంఘటనల్ని, విషాదాల్ని గుర్తుచేసుకునే విధంగా నిలుస్తుందని అర్థం అంటూ వివరణిచ్చారు. -
వయనాడ్‌లో కొత్త ట్విస్ట్.. వారికి బాధితుల ఇండ్లే టార్గెట్
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్యలో 357కు చేరింది. మరో 200 మంది బాధితులు కనిపించడం లేదు. మరోవైపు.. వయనాడ్ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. బాధితుల వదిలేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు.వివరాల ప్రకారం.. వయనాడ్ ప్రాంతంలో బాధితులు కొంత మంది తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారి ఇళ్లలో సామాగ్రి, కొన్ని విలువైన వస్తువులు అక్కడే ఉండిపోయాయి. ఈ క్రమంలో వారి నివాసాలను దొంగలు టార్గెట్ చేశారు. రాత్రి సమయంలో దొంగలు అక్కడికి చేరుకుని వారి నివాసాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, తాజాగా కొందరు బాధితులు వారి ఇళ్లకు వెళ్లి చూడగా సామాగ్రి లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలని బాధిత ప్రజలు అధికారులను కోరారు. BREAKING NEWS Wayanad landslide survivors say abandoned homes are being looted. pic.twitter.com/3jR9p3bJCk— Bharat Spectrum (@BharatSpectrum) August 3, 2024 ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..‘కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన సమయంలో మా భద్రత కోసం మేము మా ఇళ్లను విడిచిపెట్టాము. కానీ ఆ తర్వాత మా ఇంటికి వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసేందుకు ఇక్కడికి వచ్చాం. మేము తిరిగి వచ్చినప్పుడు, తలుపులు పగలగొట్టి తెరిచి ఉండడాన్ని చూసి ఆందోళనకు గురయ్యాం. మా ఇళ్లలోని సామాగ్రిని ఎత్తుకెళ్లారు. విలువైన వస్తువులను కూడా దొంగతనం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం మేము ఉంటున్న రిసార్టులోకి గదిని కూడా దొంగలు టార్గెట్ చేశారు. మా దుస్తులను, డబ్బులను దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక, బాధితుల ఫిర్యాదుతో చూరల్మల, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గస్తీ చేపట్టారు. పోలీసుల అనుమతి లేకుండా రాత్రి వేళల్లో విపత్తు ప్రాంతాల్లోకి లేదా బాధితుల ఇళ్లలోకి ప్రవేశించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసుల అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ, మరేదైనా ప్రభావిత ప్రాంతాల్లోకి లేదా ఇళ్లలోకి ప్రవేశించడానికి ఎవరినీ అనుమతించరు అని పోలీసు శాఖ పేర్కొంది.