
ప్రియాంకాగాంధీ విమర్శ
వయనాడ్: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శలను పెంచారు. ఆదివారం నైకెట్టి, సుల్తాన్ బతేరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారర్యాలీల్లో గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ ఇక్కడున్న పెద్దవాళ్లలో చాలా మందికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాగా తెలిసే ఉంటుంది. గిరిజనులతో ఆమెకు ఎంతో అనుబంధం ఉండేది.
ఇక్కడి భూమి, అడవులు, నేల, నీరుతో గిరిజనులు అవినాభావ సంబంధం ఉంది. పేదల అభ్యున్నతి కోసమే అటవీ చట్టం, గ్రామీణ ఉపాధ హామీ పథకం, విద్యాహక్కుచట్టం తెచ్చాం. అదే బీజేపీ నేతలు సొంతవాళ్లనే పట్టించుకుంటూ గిరిజనులను, జనాలను గాలికొదిలేసింది. అసలు బీజేపీ నేతలు ప్రజలతో బంధాన్ని ఏనాడో తెంచుకున్నారు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.