నియోజకవర్గ ప్రజలను పరిరక్షిస్తా
వయనాడ్‌లో ప్రచారసభలో ప్రియాంకాగాంధీ
వయనాడ్(కేరళ): కేరళలో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యరి్థగా బరిలో దిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. పిల్లల ఆలనాపాలనా తల్లి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా చూస్తుందో అదేరీతిలో తాను పౌరుల బాగోగులను పట్టించుకుంటానని ప్రియాంక వ్యాఖ్యానించారు. మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలాంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అకంపదం, పొథుకల్లు పట్టణాల్లో ప్రియాంక ప్రసంగించారు.
‘‘గెలిపించి నాకొక అవకాశం ఇస్తే మీ సమస్యలపై ఒక్క పార్లమెంట్‌లోనేకాదు వేర్వేరు సందర్భాల్లో ప్రతి ఒక్క భిన్న వేదికపై పోరాడతా. గతంలో గెలిపించిన రాహుల్‌పై వయనాడ్ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నన్ను గెలిపిస్తే నా కుటుంబానికి ఇంత మద్దతుగా ఉన్న మీకందరికీ సాయపడతా’’అని ఓటర్లునుద్దేశించి అన్నారు. ‘‘మోదీ ప్రభు త్వం సాయం అందక వయనాడ్‌లోని కొండలు, గ్రామీణ ప్రాంత రైతులు, చిరువ్యాపారులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలే ఇందుకు కారణం’’అని అన్నారు. వయనాడ్ స్థానానికి నవంబర్ 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment