కాల్పెట్టా నగరంలో భారీ రోడ్ షో
వయనాడ్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని స్పష్టికరణ
వయనాడ్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం రాత్రి కేరళకు చేరుకున్న ప్రియాంక బుధవారం వయనాడ్ జిల్లా కేంద్రమైన కాల్పెట్టా నగరంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన జన వాహినిని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు. మొదటిసారిగా 1989లో 17 ఏళ్ల వయసులో తన తండ్రి రాజీవ్ గాం«దీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నానని తెలిపారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నేతల కోసం ప్రచారం చేశానని వెల్లడించారు.
తన విజయం కోసం తాను ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఉద్ఘాటించారు. వయనాడ్‌లో పోటీ చేసే అవకాశం కలి్పంచిన మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు. ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు. వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా, గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మొత్తం ప్రపంచమంతా తన సోదరుడు రాహుల్ గాం«దీకి వ్యతిరేకంగా మారిన సమయంలో వయనాడ్ ప్రజలు మాత్రం ఆయనకు అండగా నిలిచారని చెప్పారు. తన కుటుంబమంతా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. వయనాడ్‌ను విడిచి వెళ్తున్నందుకు రాహుల్ బాధపడుతున్నారని వెల్లడించారు. రాహుల్‌కు, ప్రజలకు బంధాన్ని తాను మరింత బలోపేతం చేస్తానన్నారు.
వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు: రాహుల్
తన చెల్లెలు ప్రియాంక బాగోగుల మీరే చూసుకోవాలి అంటూ వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇచి్చనట్లుగానే తన సోదరికి సైతం ఇవ్వాలన్నారు. వయనాడ్‌కు తాను అనధికారిక ఎంపీనని, ప్రియాంక అధికారిక ఎంపీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్‌లో వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు ఉంటారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ప్రియాంకా గాం«దీని ఆశీర్వదించాలని వయనాడ్ ఓటర్లను కోరారు. రోడ్ షో అనంతరం ప్రియాంకా గాంధీ వయనాడ్ కలెక్టరేట్‌కు చేరుకొని, నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు. నామినేషన్ తర్వాత ప్రియాంక, రాహుల్ పుత్తుమల శ్మశాన వాటికను సందర్శించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులరి్పంచారు.
ప్రియాంక గాంధీ ఆస్తులు రూ.12 కోట్లు
తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ను బుధవారం ఎన్నికల అధికారికి సమరి్పంచారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు ఉందని తెలియజేశారు.
అలాగే రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లుగా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సొంతంగా కొన్న ఇంటి విలువను రూ.5.63 కోట్లుగా ప్రస్తావించారు. అలాగే రూ.15.75 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రియాంకా గాం«దీపై గతంలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అటవీ శాఖ నుంచి ఆమెకు నోటీసు అందింది. భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్‌లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment