Nomination Filing
-
ప్రియాంక నామినేషన్
వయనాడ్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం రాత్రి కేరళకు చేరుకున్న ప్రియాంక బుధవారం వయనాడ్ జిల్లా కేంద్రమైన కాల్పెట్టా నగరంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన జన వాహినిని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు. మొదటిసారిగా 1989లో 17 ఏళ్ల వయసులో తన తండ్రి రాజీవ్ గాం«దీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నానని తెలిపారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నేతల కోసం ప్రచారం చేశానని వెల్లడించారు. తన విజయం కోసం తాను ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఉద్ఘాటించారు. వయనాడ్‌లో పోటీ చేసే అవకాశం కలి్పంచిన మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు. ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు. వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా, గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మొత్తం ప్రపంచమంతా తన సోదరుడు రాహుల్ గాం«దీకి వ్యతిరేకంగా మారిన సమయంలో వయనాడ్ ప్రజలు మాత్రం ఆయనకు అండగా నిలిచారని చెప్పారు. తన కుటుంబమంతా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. వయనాడ్‌ను విడిచి వెళ్తున్నందుకు రాహుల్ బాధపడుతున్నారని వెల్లడించారు. రాహుల్‌కు, ప్రజలకు బంధాన్ని తాను మరింత బలోపేతం చేస్తానన్నారు. వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు: రాహుల్ తన చెల్లెలు ప్రియాంక బాగోగుల మీరే చూసుకోవాలి అంటూ వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇచి్చనట్లుగానే తన సోదరికి సైతం ఇవ్వాలన్నారు. వయనాడ్‌కు తాను అనధికారిక ఎంపీనని, ప్రియాంక అధికారిక ఎంపీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్లో వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు ఉంటారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ప్రియాంకా గాం«దీని ఆశీర్వదించాలని వయనాడ్ ఓటర్లను కోరారు. రోడ్ షో అనంతరం ప్రియాంకా గాంధీ వయనాడ్ కలెక్టరేట్‌కు చేరుకొని, నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు. నామినేషన్ తర్వాత ప్రియాంక, రాహుల్ పుత్తుమల శ్మశాన వాటికను సందర్శించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులరి్పంచారు. ప్రియాంక గాంధీ ఆస్తులు రూ.12 కోట్లు తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ను బుధవారం ఎన్నికల అధికారికి సమరి్పంచారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు. అలాగే రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లుగా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సొంతంగా కొన్న ఇంటి విలువను రూ.5.63 కోట్లుగా ప్రస్తావించారు. అలాగే రూ.15.75 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రియాంకా గాం«దీపై గతంలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటవీ శాఖ నుంచి ఆమెకు నోటీసు అందింది. భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎంలకు ఆహా్వనాలు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రుల్లో యోగి (ఉత్తరప్రదేశ్), నితీశ్ కుమార్ (బిహార్), పుష్కర్ ధామి (ఉత్తరాఖండ్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్‌గఢ్ ), ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), నయాబ్ సైనీ (హరియాణా), ప్రమోద్ సావంత్ (గోవా), ప్రేమ్ సింగ్ తమంగ్ (సిక్కిం), మాణిక్ సాహా (త్రిపుర) ఉన్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. -
నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
లక్నో: దేశంలో సాధారణ ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల పర్వంలో పలువురు నేతలు ప్రజలకు వినోదం పంచుతుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఒక నేత నామినేషన్ దాఖలుకు గడువు మించిపోతున్నా ప్రచార కార్యక్రమంలో పాల్గొని చివరి నిమిషంలో పరుగందుకున్నారు.దాదాపు 100 మీటర్ల దూరం పరుగులు పెట్టి చివరకు గడువు లోపల నామినేషన్ ఫైల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ డేరియా నియోజకవర్గంలో గురువారం జరిగింది. ఇక్కడి బీజేపీ అభ్యర్థి త్రిపాఠి తన నామినేషన్‌కు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య హాజరయ్యారు. దీంతో ఆ ప్రోగ్రామ్ బిజీలో ఉండిపోయి తన నామినేషన్నే రిస్కులో పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే చివరి 15 నిమిషాల్లో ఎలాగోలా పరుగెత్తి నామినేషన్ ఫైల్ చేయగలిగారు. 54 ఏళ్ల త్రిపాఠి తన కాలేజీ రోజుల్లో మంచి రన్నర్‌గా పేరుతెచ్చుకున్నారు. అది ప్రస్తుత ఎన్నికల్లో ఇలా ఆయనకు కలిసి రావడం విశేషం. ‘ఐఐటీలో చదివే రోజుల్లో నేను మంచి రన్నర్‌ను అది ఇప్పుడు నాకు గడువులోపల నామినేషన్ వేసేందుకు కలిసి వచ్చింది’అని త్రిపాఠి చెప్పారు. -
నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు
ముంబయి: లోక్‌సభ ఎన్నికల ఐదో దశకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శివసేన (యూటీబీ) నాయకులు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ సహా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు సోమవారం ముంబైలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. అరవింద్ సావంత్ ముంబై సౌత్ నుంచి, అనిల్ దేశాయ్ ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు.సావంత్ తన నామినేషన్ ఫారమ్‌తో పాటు అఫిడవిట్ ద్వారా తన సంపద సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. అరవింద్ సావంత్ భార్య అనుయా అరవింద్ సావంత్ పేరిట ఉన్న ఆస్తుల సమాచారాన్ని కూడా అఫిడవిట్లో ప్రస్తావించారు.అఫిడవిట్ ప్రకారం.. అరవింద్ సావంత్ వద్ద ప్రస్తుతం రూ.135000 నగదు ఉందని, అతని భార్య వద్ద రూ.60000 ఉందని వెల్లడించారు. సావంత్ వద్ద 251.070 గ్రాముల బంగారం, 3000 గ్రాముల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. సావంత్ భార్య వద్ద 509.10 గ్రాముల బంగారం, 8000 గ్రాముల వెండి ఉందని వెల్లడించారు. అరవింద్ సావంత్ ఆస్తి మొత్తం రూ.2 కోట్ల 13 లక్షల 91 వేల 322. భార్య పేరు మీద 2 కోట్ల 26 లక్షల 65 వేల 869 రూపాయల ఆస్తులున్నట్లు వివరించారు.ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న శివసేన నేత రాహుల్ షెవాలే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ముంబై సౌత్ నుంచి డాక్టర్ మయూరి సంతోష్ షిండే, సబీహా బానో సహా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ముంబైలోని ఆరు స్థానాలకు మే 20న ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి చివరి రోజు మే 3.मुंबई दक्षिण मध्य लोकसभा मतदारसंघातील महाविकास आघाडीचे अधिकृत उमेदवार अनिल देसाई ह्यांनी त्यांचा उमेदवारी अर्ज दाखल केला. ह्यावेळी युवासेनाप्रमुख शिवसेना नेते आमदार आदित्य ठाकरे, शिवसेना उपनेत्या खासदार प्रियंका चतुर्वेदी, खासदार चंद्रकांत हंडोरे, आमदार प्रकाश फातर्पेकर, शिवसेना… pic.twitter.com/wXwI2MDs8k— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) April 29, 2024 -
పులివెందుల నా ప్రాణం.. శత్రువులతో చేతులు కలిపిన నా చెల్లెమ్మలు.. సీఎం జగన్ డైనమిక్ ప్రసంగం (ఫొటోలు)
-
నామినేషన్‌కు ముందు సర్వమత ప్రార్థనల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
సంగారెడ్డి: పటాన్చెరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత.. కార్యకర్తల్లో న్యూ జోష్..
-
వారికి ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉంటుంది. కేసీఆర్‌ను కాదని ఇతర పారీ్టలకు ఓట్లు వేయొద్దు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే రాష్ట్రం పదేళ్లు తిరిగి వెనుకకు పోతుంది’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేటలో నామినేషన్ వేశారు. అంతకుముందు హరీశ్‌రావు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ అనంతరం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణను ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారని చెప్పారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్‌పై కొందరు నాయకులు సంచలనాల కోసం నోరుపారేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 1.80 లక్షల ఉద్యోగాలు కలి్పంచామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పారీ్టకి రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా రాదని, డక్ ఔట్ అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేట నియోజకవర్గానికి 7వ సారి నామినేషన్ వేశానని చెప్పారు. -
రేపే నామినేషన్లు వేయనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు(నవంబర్ 9, గురువారం) నామినేషన్లు వేయనున్నారు. రేపు ఒక్కరోజులోనే ఆయన పోటీచేయబోయే గజ్వేల్, కామారెడ్డిల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు. ఆపై సాయంత్రం కామారెడ్డిలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇదీ కేసీఆర్ షెడ్యూల్... ఉదయం 10:45కు ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి గజ్వేల్‌కు హెలికాప్టర్లో బయలుదేరతారు. 10:55కు గజ్వేల్ టౌన్లో ల్యాండ్ అవుతారు. 11 నుంచి 12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. తర్వాత తిరిగి ఫాంహౌజ్ చేరుకుని లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 1:40కి కామారెడ్డికి బయలుదేరతారు. మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్య కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4నుంచి 5 మధ్య కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
ఉమ్మడి వరంగల్‌లో నామినేషన్ దాఖలుకు ముమ్మర ఏర్పాట్లు
-
అఫిడవిట్లో అలసత్వం వద్దు
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్‌ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.135 ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్లో పేర్కొనలేదు. పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు వనమా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పత్రికా ప్రకటనలు అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు. బీ ఫామ్ అందుకోగానే బీ ఫామ్ అందుకోవడమే ఆలస్యం నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. -
వద్దిరాజు నామినేషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఉపఎన్నిక స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి కుటుంబసభ్యులు, పలువురు రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి వచ్చిన వద్దిరాజు శాసనసభ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారికి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకుని అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్ తదితరులు వద్దిరాజును అభినందించారు. ఈ నెల 20న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, దాస్యం వినయ్‌భాస్కర్, వివేకానంద, జీవన్‌రెడ్డి, నన్నపునేని నరేంద ర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లోని లాన్ లో తెలంగాణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో వద్దిరాజుకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. హైదరాబాద్‌లోని మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవనాన్ని జూన్ 9న కేసీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. -
e-nomination: చందాదారులకు చుక్కలు చూపిస్తున్న ఈపీఎఫ్ఓ వెబ్సైట్..!
రిటైర్ మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఎఫ్ఓ గత ఏడాది డిసెంబర్ 31 తేదీన ఒక కీలక ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా గతంలో తెలిపింది. అయితే అప్పటి నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా అసౌకర్యానికి గురి అవుతున్నారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా చందాదారులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన సంస్థ పట్టించుకోవడం లేదు అని వారు వాపోతున్నారు. సబ్స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్లో బోలెడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్‌వో వెబ్సైట్ గంటల కొద్దీ పని చేయడం లేదు. ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ అయినా.. కనెక్షన్ ప్రాబ్లం అని మెసేజ్ రావడంతో ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలుపుతున్నారు. ప్రతి దశను పూర్తి చేయడానికి కనీసం ఒక రోజు పడుతున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను అందరికీ అందుబాటులోకి తేవడానికి ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్ తప్పనిసరి చేసింది. ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఖాతా బ్యాలన్స్ వివరాలు కనిపించకపోవడంతో పాటు ఈపీఎఫ్ ఖాతాలో నగదును కూడా విత్ డ్రా చేయలేరు. ఒకవేళ ఈపీఎఫ్ఓలో సభ్యులుగా ఉన్నవారికి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే.. వారి మీద ఆధారపడిన వారికి పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఈ-నామినేషన్ తప్పనిసరి. (చదవండి: సామాన్యులను కలవర పెడుతున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర!) -
UP: మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు విడుదల చేశాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జగరనుంది. తొలి విడతలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో ఉన్న 58 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు పోలింగ్ జరనుంది. -
నేడు గురుమూర్తి నామినేషన్
-
నేడు గురుమూర్తి నామినేషన్
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం. గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు ఉ.9.30 గంటలకు నామినేషన్ పత్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలి నేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, గౌతమ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానులు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
బిడ్డగా ఆశీర్వదిస్తామంటేనే నామినేషన్ వేస్తా: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నందిగ్రామ్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. బుధవారం తాను నామినేషన్ వేయాలనుకుంటున్నానని, మీరు వద్దంటే తాను నామినేషన్ వేయబోనని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను మీ బిడ్డగా పరిగణించి మరోసారి ఆశీర్వదిస్తామంటేనే నామినేషన్ దాఖలు చేస్తానని ఆమె ప్రజలనుద్దేశంచి మాట్లాడారు. కాగా, దీదీ ప్రతిసారీ పోటీ చేసే భవానీపూర్‌ను కాదని ఈసారి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం(మార్చి 10న) నామినేషన్ దాఖలు చేయాలని ఆమె నిర్ణయించుకుంది. నామినేషన్ దాఖలుకు ఒక్కరోజు ముందు ఆమె నియోజకవర్గంలో పర్యటించి అక్కడి ప్రజలను ఉద్దేశించి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నీ తానై ముందుకు నడిపిస్తోంది. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తనవంతు కృషి చేస్తున్నారు. -
ముగిసిన జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. చివరిరోజు కావడంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల గడువు ముగిసేసరికి గ్రేటర్‌లోని మొత్తం 150 వార్డులకు (డివిజన్లకు)గాను 1,932 మంది అభ్యర్థులు 2,602 నామినేషన్లు సమర్పించారు. వారిలో ఇండిపెండెంట్ల నుంచే 650 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 1,412 మంది 1,937 నామినేషన్లు దాఖలు చేశారు. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలతో అట్టహాసంగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోనేరు కోనప్ప, రాములు నాయక్, కాలేరు వెంకటేశ్, హరిప్రియానాయక్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా పార్టీల్లో టికెట్లు దక్కనివారు సైతం రెబెల్స్‌గా బరిలోకి దిగారు. మొత్తం వార్డుల్లో అత్యధికంగా గోషామహల్ నుంచి 36 నామినేషన్లు దాఖలవగా అత్యల్పంగా టోలిచౌకి నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులు.. 150 అభ్యర్థులు : 1,932 మొత్తం నామినేషన్లు : 2,602 పార్టీల వారీగా దాఖలైన నామినేషన్లు బీజేపీ : 571 టీఆర్ఎస్ : 557 కాంగ్రెస్ : 372 టీడీపీ : 206 ఎంఐఎం : 78 సీపీఐ / సీపీఎం : 22/21 -
నేటితో నామినేషన్ల దాఖలుకు తెర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగుస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత నామినేషన్లను స్వీకరించరు. మంగళవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనలో నిబంధనల మేరకు దాఖలైన నామినేషన్లను ఆమోదిస్తారు. నిబంధనల మేరకు లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. కాగా, నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ముగుస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజక వర్గాలకు 50 మంది సాధారణ పరిశీలకులను, పార్లమెంట్ స్థానాలకు ఒకరు చొప్పున పరిశీలకులను నియమించింది. మరోవైపు రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణకు 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు మూడు లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. భద్రతా చర్యల కోసం పెద్ద ఎత్తున కేంద్ర సాయుధ బలగాలనూ మోహరించనున్నారు. బరిలో నిలిచిన పార్టీల పరిస్థితి ఇదీ.. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఆ పార్టీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది. ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతోంది. ఇక అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా అన్ని స్థానాల్లో పోటీ పడుతోంది. అయితే గెలుపుకోసం అన్ని రకాల అడ్డదారి ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తోను, మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీతోనూ లోపాయికారీ అవగాహన కుదుర్చుకుంది. ఆ మేరకే ఆయా పార్టీలు అభ్యర్థులను బరిలో నిలుపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు, అలాగే పవన్ కల్యాణ్ అభ్యర్థులకు కూడా ఎన్నికల ఇం‘ధనాన్ని’ చంద్రబాబే సమకూరుస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో కలసి పనిచేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విడిగా పోటీ చేస్తున్నప్పటికీ అధికార టీడీపీతో లోపాయికారీగా అవగాహనతోనే ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలబెట్టారు. మరోవైపు కేఏ పాల్ చేత కూడా ప్రజాశాంతి పార్టీ పేరుతో అన్ని స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు పోటీ చేయిస్తుండడం గమనార్హం. తద్వారా వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చాలనే ఎత్తుగడ వేశారు. ఇదిలా ఉంటే.. మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా ఒంటరిగానే బరిలో నిలుస్తోంది. -
భారీగా పెరిగిన చంద్రబాబు, లోకేష్ ఆస్తులు
-
భారీగా పెరిగిన చంద్రబాబు, లోకేష్ ఆస్తులు
సాక్షి, చిత్తూరు : కుప్పం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు తరఫున స్థానిక టీడీపీ నేతలు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో చంద్రబాబు తన మొత్తం ఆస్తుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ మొత్తం ఆస్తుల్లో స్థిర ఆస్తి విలువ రూ. 19 కోట్ల 96 లక్షలు, చరాస్తుల విలువ 47 లక్షల 38 వేల రూపాయలని తెలిపారు. ఇక తన సతీమణి నారా భువనేశ్వరి చరాస్తుల విలువ రూ. 574 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు.. స్థిరాస్తుల విలువ 95 కోట్ల రూపాయలని వెల్లడించారు. కాగా 2014 ఎన్నికల సందర్భంగా.. చంద్రబాబు తన ఆస్తి విలువను 176 కోట్ల రూపాయలుగా చూపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదేళ్లలో ఏకంగా ఆయన ఆస్తి విలువ 700 కోట్ల రూపాయలకు చేరడం గమనార్హం. మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆస్తులు కూడా భారీగానే పెరిగాయి. మొత్తం ఆస్తి రూ. 375 కోట్లు.. సాక్షి, గుంటూరు : మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ కూడా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తి విలువ సుమారు రూ. 375 కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ 253 కోట్ల 68 లక్షల రూపాయలుగా పేర్కొన్న లోకేష్... స్థిరాస్తుల విలువ 66 కోట్ల 78 లక్షలని వెల్లడించారు. రాజకీయ నాయకుడిగా సమాజ సేవకు అంకితమైన తనకు కేవలం ఈ కారణంగా వచ్చే జీతభత్యాలే ఆదాయ వనరు అని పేర్కొన్నారు. ఇక తన సతీమణి నారా బ్రాహ్మణి వ్యాపారవేత్త అని పేర్కొన్న లోకేష్..ఆమె స్తిరాస్థుల విలువ రూ. 18.74 కోట్లని, చరాస్తుల విలువ రూ. 14 కోట్ల 40 లక్షలు అని వెల్లడించారు. తన కుమారుడు దేవాన్ష్ స్థిరాస్తుల విలువ 16.17 కోట్ల రూపాయలు, చరాస్తుల విలువ రూ. 3.88 కోట్లని లోకేష్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. -
జోరుగా నామినేషన్లు..!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. శాసనసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు.. అవంతి శ్రీనివాస్ (భీమిలీ), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (పుట్టపర్తి), జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల) రిటైర్డ్ ఐజీ ఇక్భాల్ (హిందూపురం), రెడ్డి శాంతి (పాతపట్నం), పిరియా సాయిరాజ్ (ఇచ్చాపురం), వి.కళావతి (పాలకొండ), డాక్టర్ సీదిరి అప్పలరాజు (పలాస), తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (రాప్తాడు), వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), పుష్పశ్రీ వాణి (కురుపాం), అంజాద్ బాషా (కడప-అసెంబ్లీ), బుర్రా మధుసూదన్ యాదవ్ (కనిగిరి), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), కొట్టగొల్లి భాగ్యలక్ష్మి (పాడేరు), డాక్టర్ బాబ్జి (పాలకొల్లు), ఆళ్ల రామకృష్ణా రెడ్డి (మంగళగిరి), నంబూరి శంకర్రావు (పెదకూరపాడు) ఏపీ శాసనసభ స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. విజయవాడ లోక్‌సభ స్థానానికి పొట్లూరి వర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. -
కరీంనగర్: తొలిరోజు ఏడు నామినేషన్లు
సాక్షి, కరీంనగర్: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేడి మొదలయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు తొలిరోజు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఏడు నామినేషన్లలో మూడు అధికార టీఆర్ఎస్ అభ్యర్ధులవే. కోరుట్లలో టీఆర్ఎస్ ఆభ్యర్ధిగా కల్వకుంట్ల విద్యాసాగరరావు, ఆయన సతీమణి సరోజినీ దేవి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ధర్మపురిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేయగా మంథనిలో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు తరపున ఆయన సతీమణి పుట్టా శైలజ నామినేషన్ వేశారు. రామగుండంలో బీజేపీ అభ్యర్థిగా బల్మూరి వనిత నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్లో బిఎల్ఎఫ్ అభ్యర్థిగా వసీం అహ్మద్ నామినేషన్ వేయగా, జగిత్యాలలో డాక్టర్ సత్యనారాయణ మూర్తి పిరమిడ్ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
అనుగ్రహం.....ఉండాలి మరి..
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్) : రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 12వ తేదీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఈ మేరకు ఇప్పటికే టికెట్లు ఖరారైన టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు మహాకూటమి నుంచి తప్పక టికెట్ లభిస్తుందని భావిస్తున్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా సోమవారం నుంచి జరగనున్న నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా నామినేషన్ల దాఖలకు ఎనిమిది రోజుల సమయం ఉండగా.. ఇందులో తమ పేరు, జాతకం ప్రకారం ఏ రోజు నామినేషన్ దాఖలు చేస్తే మంచిదనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం తమకు నమ్మకస్తులైన వారే కాకుండా ప్రముఖ జ్యోతిష్యులు, పండితులను ఆశ్రయిస్తున్నారు. గ్రహాలు అనుకూలిస్తేనే రాజయోగం సిద్ధిస్తుందనే నమ్మకం ఉన్న ఆశావహులు జ్యోతిష్యులను కలుస్తూ పేరుబలాలపై అంచనాలు వేసుకుంటున్నారు. నాలుగే మంచివి.. నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్న 12వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో కేవలం నాలుగు మంచి ముహూర్తాలే ఉన్నాయని పలువురు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నాలుగు ముహూర్తాల్లో మొదటి ప్రాధాన్యతగా ఈనెల 14వ తేదీ బుధవారం సప్తమి శ్రవణా నక్షత్రం బాగుంటుందని పలువురు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఇక రెండో ప్రాధాన్యత 17న శనివారం దశమి, మూడో ప్రాధాన్యత 18 ఆదివారం, చివరి ముహూర్తంగా 19వ తేదీ సోమవారం ద్వాదశిని గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు తమను ఆశ్రయించిన అభ్యర్థులందరికీ ఈ నాలుగు ముహూర్తాలనే సూచించినట్లు పలువురు పండితులు తెలిపారు. మంచి అనేది చూసుకోవాలి ఏ పని చేసినా మంచి అనేది చూసుకుని ముందుకు సాగాలి. ఇది అనాదిగా పెద్దలు మనకు నేర్పిన సంప్రదాయం. మంచి అనేది ఆలోచించుకుని చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అందుకే నామినేషన్లకు కూడా మంచి ముహూర్తాలు, దైవానుగ్రహం కోరుకోవాలి. దైవబలంతో పాటు పెద్దల ఆశీర్వాదం కూడా అవసరమే. ఇది మంచి సంప్రదాయం. – ఓరుగంటి సంపత్‌కుమార్ శర్మ, బ్రాహ్మణ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, నాగర్‌కర్నూల్ దైవబలమూ కలిసి రావాలి నామినేషన్లకు మంచి ముహూర్తాలు చూసుకోవడం ఎంత ముఖ్యమో రాజకీయ రణరంగంలో దైవబలం సంపాదించుకోవడం అంతకంటే ముఖ్యం. అభ్యర్థులందరూ జాతకరీత్యా దైవజ్ఞులను సంప్రదించి తమ గ్రహస్థితిలో ఉచ్చ, నీచ స్థానాలు చూసుకుని పరిహార మార్గాలు పాటించాలి. పరిహార మార్గాల ద్వారానే దైవ బలం చేకూరుతుంది. – జ్యోషి సత్యనారాయణ శర్మ. వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఉంద్యాల ముహూర్తం ముఖ్యం కాదు రాజకీయ రణరంగంలో ముందుకు వెళ్లాలనుకునే వారికి తిథి ప్రామాణికం కాదు. రాజకీయాలకు గురుబలం, శనిబలం, రాహు బలం బాగుండాలి. అమావాస్య నాడు పుట్టిన వారు కూడా రాజ్యాన్ని ఏలుతున్నారు కదా? ముహూర్తం కంటే జాతకంలోని దశలు, గ్రహస్థితులను సరిచూసుకోవాలి. అదే సరైనది. – ఓరుగంటి నాగరాజ శర్మ, సిద్ధాంతి, పంచాంగకర్త, వనపర్తి విశ్వాసానికి సంబంధించినది జాతకమనేది వారి వారి విశ్వాసాలకు సంబంధించిన విషయం. ఇందులో నాస్తిక వాదానిక తావు లేదు. శాస్త్రాలన్ని నూటికి నూరు శాతం సరైనవే. ఏ శాస్త్రమైనా వారి కోణాల్లో సరైనదేనేనని చెప్పాలి. మంచి పనితో పాటు జీవితాన్ని మలుపు తిప్పే కార్యాన్ని ప్రారంభించేటప్పుడు జాతక రీత్యా ముందుకు వెళ్లడం ఆమోదయోగ్యమనే చెప్పాలి. రాజకీయాలకు రాహుగ్రహాలకు తప్పక ప్రాధాన్యం ఉంటుంది. – జ్యోషి గోపాలశర్మ, బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర సభ్యుడు