
హాజరవనున్న 12 మంది సీఎంలు, కేంద్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీఎంలకు ఆహా్వనాలు
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రుల్లో యోగి (ఉత్తరప్రదేశ్), నితీశ్ కుమార్ (బిహార్), పుష్కర్ ధామి (ఉత్తరాఖండ్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్‌గఢ్ ), ఏక్‌నాథ్ షిండే (మహారాష్ట్ర), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), నయాబ్ సైనీ (హరియాణా), ప్రమోద్ సావంత్ (గోవా), ప్రేమ్ సింగ్ తమంగ్ (సిక్కిం), మాణిక్ సాహా (త్రిపుర) ఉన్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment