
మెత్తబడ్డ రెబల్స్
నామినేటెడ్ పదవులతో ఎర
టీడీపీకి తప్పనున్న బెడద
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు మెత్తబడ్డారు. పార్టీ అధినేత ద్వారా మంత్రులు ఈయనకు నామినేటెడ్ పదవుల ఎర చూపారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సజావుగానే సాగే సూచనలు కన్పిస్తున్నా యి. బుధవారం కన్నబాబురాజుతో పాటు టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయు డ్ని జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు.
అప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా మంత్రి గంటా శ్రీనివాస రావులు ఉండగా, వారి సమక్షంలోనే బాబుతో సమావేశమయ్యారు. కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా ఇప్పించాలని కన్నబాబురాజు కోరగా..తప్పకుండా చూద్దాం..అని బాబూ చెప్పుకొచ్చారు. గవిరెడ్డికి కూడా న్యాయం చేస్తామని బాబు హామీ ఇవ్వడంతో దీంతో బయట కొచ్చిన కన్నబాబురాజు మీడియా ఎదుట నామినేషన్ ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. సాక్షితో ఫోన్‌లో మాట్లాడుతూ ఎమ్మెల్సీ సీటు ఎందుకు ఇవ్వలేకపోయారో బాబుచెప్పలేకపోయారని..నామినేటెడ్ పదవి ఇస్తానని మాత్రమే హామీ ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలతో చర్చించి ఉపసంహరణపై గురువారం నిర్ణయానికి వస్తానన్నారు.
గవిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో బీసీలకు అన్యాయం జరుగుతుందని..అన్ని పదవులు ఓసీలకే కట్టబెడుతున్నారని..75 శాతానికి పైగా ఉన్న బీసీలకు మాత్రం న్యాయం చేయాలని బాబు దృష్టికి తీసుకెళ్లగా..తప్పక చేస్తానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. మంగళవారం జరిగిన స్క్రూట్నీలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వల్లూరి జయప్రకాష్‌బాబు నామినేషన్‌ను జిల్లా రిటర్నింగ్ అధికారి జే.నివాస్ తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరక సమయం ఉందని ఆర్వో నివాస్ ప్రకటించారు.