రిటైర్ మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఎఫ్‌ఓ గత ఏడాది డిసెంబర్ 31 తేదీన ఒక కీలక ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా గతంలో తెలిపింది. అయితే అప్పటి నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా అసౌకర్యానికి గురి అవుతున్నారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా చందాదారులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన సంస్థ పట్టించుకోవడం లేదు అని వారు వాపోతున్నారు.
సబ్‌స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్‌లో బోలెడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ గంటల కొద్దీ పని చేయడం లేదు. ఒకవేళ వెబ్‌సైట్ ఓపెన్ అయినా.. కనెక్షన్ ప్రాబ్లం అని మెసేజ్ రావడంతో ఈపీఎఫ్‌ఓ సబ్‌స్క్రైబర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలుపుతున్నారు. ప్రతి దశను పూర్తి చేయడానికి కనీసం ఒక రోజు పడుతున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను అందరికీ అందుబాటులోకి తేవడానికి ఈపీఎఫ్‌ఓ సబ్‌స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్ తప్పనిసరి చేసింది. ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఖాతా బ్యాలన్స్ వివరాలు కనిపించకపోవడంతో పాటు ఈపీఎఫ్ ఖాతాలో నగదును కూడా విత్ డ్రా చేయలేరు. ఒకవేళ ఈపీఎఫ్‌ఓలో సభ్యులుగా ఉన్నవారికి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే.. వారి మీద ఆధారపడిన వారికి పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఈ-నామినేషన్ తప్పనిసరి.
(చదవండి: సామాన్యులను కలవర పెడుతున్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర!)
Comments
Please login to add a commentAdd a comment