ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు: ఈసారీ అంతే.. | EPFO Retains 8 25 Percent Interest Rate on PF Deposits for 2024 25 | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు: ఈసారీ 8.25 శాతమే..

Published Fri, Feb 28 2025 12:39 PM | Last Updated on Fri, Feb 28 2025 3:12 PM

EPFO Retains 8 25 Percent Interest Rate on PF Deposits for 2024 25

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై.. వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్దారించింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత.. ఈ వడ్డీ రేటు ఏడు కోట్లకు పైగా చందాదారులకు జమ అవుతుంది.

2022-23లో ఈ వడ్డీ 8.15 శాతంగా ఉండేది. అయితే దీనిని 2023-24లో 8.25 శాతానికి పెంచారు. 2018-19లో ఈ రేటు 8.65గా ఉండేది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు ఏకంగా 8.1 శాతానికి పడిపోయింది. ఇప్పుడు గత ఏడాది మాదిరిగానే 8.25 శాతం వద్దనే కొనసాగుతుందని ప్రకటించారు.

ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా?
ఉమాంగ్ యాప్: ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. మీ ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోండి. ఆ తరువాత EPF పాస్‌బుక్, క్లెయిమ్‌లు, బ్యాలెన్స్ చెక్‌ వంటి సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ పోర్టల్: EPFO ​​అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి, "మెంబర్ పాస్‌బుక్" విభాగానికి వెళ్లి, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

మిస్డ్ కాల్: మీ UAN-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వండం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి ధరలు: కొనడానికి ఇదే మంచి ఛాన్స్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement