స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్)పై సమకూరే పన్ను రహిత వడ్డీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వీపీఎఫ్‌పై సమకూరే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచితే మరింత మందికి మేలు జరుగుతుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ఆధ్వర్యంలోని స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్) ద్వారా ఉద్యోగులు తమ డబ్బుపై అదనంగా వడ్డీ సమకూర్చుకోవచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఒకే వడ్డీరేటు ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వీపీఎఫ్‌లో జమ చేసే నగదుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు.
వీపీఎఫ్ గురించి కొన్ని విషయాలు
ఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యానికి లేఖ అందించాల్సి ఉంటుంది.
కచ్చితంగా అందరు ఉద్యోగులు ఈ పథకంలో చేరాల్సిన నిబంధనేమీ లేదు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, కొన్ని బ్యాంకులు అందించే ఎఫ్‌డీ వడ్డీ కంటే మెరుగైన వడ్డీ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. భవిషత్తు అవసరాల కోసం మెరుగైన వడ్డీ కావాలని భావించే ఉద్యోగులు ఇందులో చేరవచ్చు.
ఈ పథకంలో చేరిన వారు తమ ప్రాథమిక జీతంలో కట్ అవుతున్న 12 శాతం ఈపీఎప్ కంటే అధికంగా జమ చేసుకునే వీలుంది.
ఇదీ చదవండి: ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’
ఏటా జమ చేసే మొత్తం రూ.1.5 లక్షల వరకు ఉంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ 8.15 శాతంగా ఉంది. ఇదే వడ్డీ వీపీఎఫ్‌కు వర్తిస్తుంది.
ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత, లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలు, విద్య, వివాహాలు..వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment