EPF interest rate
-
వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?
స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్)పై సమకూరే పన్ను రహిత వడ్డీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వీపీఎఫ్‌పై సమకూరే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచితే మరింత మందికి మేలు జరుగుతుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యంలోని స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్) ద్వారా ఉద్యోగులు తమ డబ్బుపై అదనంగా వడ్డీ సమకూర్చుకోవచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఒకే వడ్డీరేటు ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వీపీఎఫ్‌లో జమ చేసే నగదుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు.వీపీఎఫ్ గురించి కొన్ని విషయాలుఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యానికి లేఖ అందించాల్సి ఉంటుంది. కచ్చితంగా అందరు ఉద్యోగులు ఈ పథకంలో చేరాల్సిన నిబంధనేమీ లేదు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, కొన్ని బ్యాంకులు అందించే ఎఫ్డీ వడ్డీ కంటే మెరుగైన వడ్డీ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. భవిషత్తు అవసరాల కోసం మెరుగైన వడ్డీ కావాలని భావించే ఉద్యోగులు ఇందులో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారు తమ ప్రాథమిక జీతంలో కట్ అవుతున్న 12 శాతం ఈపీఎప్ కంటే అధికంగా జమ చేసుకునే వీలుంది.ఇదీ చదవండి: ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’ఏటా జమ చేసే మొత్తం రూ.1.5 లక్షల వరకు ఉంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ 8.15 శాతంగా ఉంది. ఇదే వడ్డీ వీపీఎఫ్‌కు వర్తిస్తుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత, లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలు, విద్య, వివాహాలు..వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. -
బిగ్ న్యూస్.. ఊహించినదాని కంటే ఎక్కువగా పీఎఫ్ వడ్డీ రేటు
వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) బిగ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ నిధులపై వడ్డీ రేటును ఊహించిదానికి మించి పెంచింది. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2023-24లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలకు 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించినట్లు వార్తా సంస్థ పీటీఐ తాజాగా నివేదించింది. గత సంవత్సరం మార్చి 28న ఈపీఎఫ్‌వో 2022-23 కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలకు 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. అంతకుముందు 2022 ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతం వడ్డీ జమ చేసింది. "ఈరోజు జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 235వ సమావేశం 2023-24లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. దేశ శ్రామిక శక్తికి సామాజిక భద్రతను పటిష్టం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీని నెరవేర్చడానికి ఈ చర్య ఒక మందడుగు” అని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటును సమీక్షిస్తారు. సీబీటీ సిఫార్సు చేసిన రేటును పరిగణనలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది వడ్డీ రేటును తెలియజేస్తుంది. The 235th meeting of Central Board of Trustees, EPFO, today has recommended 8.25 per cent as rate of interest on Employees' Provident Fund deposits for 2023-24. The move is a step towards fulfilling PM Shri @narendramodi ji’s guarantee of strengthening social security for… pic.twitter.com/z8OzHrdz1P — Bhupender Yadav (@byadavbjp) February 10, 2024 -
40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..?
న్యూఢిల్లీ: మధ్య తరగతి వేతన జీవికి భారీ నిరాశ. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటు 8.5 నుంచి ఏకంగా 8.1 శాతానికి తగ్గుతోంది. ఇది దాదాపు 6 కోట్ల మంది సభ్యులపై ప్రభావం చూపనుంది. మార్చి 31తో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ శనివారం నిర్ణయించింది. 4 దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు! 1977–78లో 8 శాతముండగా తర్వాత ఏటా కనీసం 8.25, ఆపైనే ఉంటూ వచ్చింది. రూ.76,768 కోట్ల అంచనా ఆదాయం ఆధారంగా తాజాగా వడ్డీని నిర్ణయించారు. దీపావళి నాటికి సభ్యుల ఖాతాల్లో కొత్త వడ్డీ జమవుతుంది. ప్రావిడెంట్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఇతర చిన్న పొదుపు పథకాలతో సమానంగా 8 శాతం కంటే తగ్గించాలని కేంద్ర కార్మిక శాఖపై ఆర్థిక శాఖ కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేటు 4 నుంచి 7.6 శాతం మధ్య ఉంది. రుణం, ఈక్విటీ నుండి వచ్చే ఆదాయాలను బట్టి వడ్డీ చెల్లింపును లెక్కిస్తారు. కరోనా దెబ్బ ఈపీఎఫ్వోఆదాయాన్ని కరోనా దెబ్బతీసింది. కోవిడ్ నేపథ్యంలో అధిక ఉపసంహరణలు, తక్కువ విరాళాలను ఈపీఎఫ్‌వో ఎదుర్కొంది. 2021 డిసెంబర్ 31 నాటికి అడ్వాన్స్ సౌకర్యం కింద రూ.14,310.21 కోట్లు అందించి 56.79 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. దీంతో 2019–20 చెల్లింపులు ఆలస్యమయ్యాయి. వడ్డీనీ రెండు వాయిదాలలో చెల్లించారు. 2021–22లో ఈపీఎఫ్వోరూ.3,500 కోట్ల లోటు నమోదు చేసింది. ఈపీఎఫ్‌వో కార్పస్ 13 శాతం పెరిగినా వడ్డీ ఆదాయం 8 శాతమే పెరిగినట్టు సమాచారం. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందనేందుకు వడ్డీ రేటు తగ్గడం నిదర్శనమని సీబీటీ సభ్యుడు ఏకే పద్మనాభన్ అన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ దృష్ట్యా సామాజిక భద్రతతో కూడిన పెట్టుబడి సమతుల్యతను కొనసాగించడం తమ ప్రాధాన్యత అని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. जिस प्रकार की अंतरराष्ट्रीय परिस्थिति और equity बाज़ार की स्थिति बनी है, उसमें निवेश के साथ सामाजिक सुरक्षा को भी रखना है। हम बहुत हाई रिस्क वाले इंस्ट्रुमेंट को नहीं ले सकते है। वो मार्केट करने के लिए हम लोग नहीं है, हम मार्केट की एक स्थायित्व, सामाजिक सुरक्षा के लिए है। pic.twitter.com/b9P6FAEZKn — Bhupender Yadav (@byadavbjp) March 12, 2022 చదవండి: ఉద్యోగులకు బిగ్‌షాక్.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
తరచుగా పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే రూ. 35 లక్షలు నష్టపోయినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: పీఎఫ్ అకౌంట్ నుంచి తరచుగా డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త. తరచుగా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేస్తే.. పదవీవిరమణ సమయంలో భారీగా నష్టపోతారట. సుమారు 35 లక్షల రూపాయల వరకు కోల్పోతారట. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ప్రకారం కరోనా కాలంలో చాలామంది అభ్యర్థులు తన పీఎఫ్ డబ్బులను భారీగా విత్ డ్రా చేసుకున్నారు. సుమారు 7.1 మిలియన్ల కన్నా ఎక్కువ పీఎఫ్ అకౌంట్లు క్లోస్ అయ్యాయి. దీనిపట్ల ఈపీఎఫ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యవసరం అయితే తప్ప పీఎఫ్ డబ్బులను డ్రా చేయవద్దని సూచిస్తోంది ఈఫీఎఫ్ఓ. కారణం ఏంటంటే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ అకౌంట్ మీద 8.5 శాతం వడ్డీ వస్తుంది. చిన్నమొత్తాల మీద ఇచ్చే ఇంట్రెస్ట్‌తో పోల్చితే.. ఇదే అత్యధికం. 8.5 ఇంట్రెస్ట్ లభిస్తుండటంతో చాలా మంది జనాలు తమ వాలంటరీ రిటైర్మెంట్ డబ్బులను ఈపీఎఫ్ అకౌంట్లోనే పొదుపు చేస్తున్నారు. ఈ ఖాతాలో ఎంత ఎక్కువ పొదుపు చేస్తే.. అంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏకే శుక్లా మాట్లాడుతూ.. ‘‘మీకు ఇప్పుడు 30 ఏళ్లు ఉన్నాయనుకొండి.. మరో 30 ఏళ్లు ఉద్యోగంలో ఉంటారు. ఈ క్రమంలో మీరు పీఎఫ్ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు విత్ డ్రా చేశారనుకుందాం. అది మీ పదవీవిమరణ సమయంలో లభించే మొత్తం మీద భారీ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మీరు డ్రా చేసే 1 లక్ష రూపాయలు.. ఈపీఎఫ్ కాలుక్యులేటర్ ప్రకారం ఈ మొత్తం పదవీ విమరణ కాలానికి 11.55 లక్షలతో సమానం అన్నమాట. ఈ లెక్కన మీరు పీఎఫ్ ఖాతా నుంచి మధ్యమధ్యలో సుమారు 3 లక్షల రూపాయలు డ్రా చేశారనుకొండి.. ఇది మీ పదవీవిరమణ సమయంలో లభించే మొత్తంలో భారీ కోతకు దారి తీస్తుంది. ఈ లెక్కన పదవీవిరమణ సమయంలో మీరు 35 లక్షల రూపాయల వరకు కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక వీలైనంత తక్కువ సార్లు డ్రా చేస్తే మంచిది’’ అని సూచిస్తున్నారు. -
ఈపీఎఫ్ వడ్డీరేట్లకు ఆమోదం
-
ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు పెంపు
8.7 నుంచి 8.8 శాతానికి న్యూఢిల్లీ: ఈపీఎఫ్ వడ్డీరేట్లపై దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం దిగొచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై వడ్డీ రేటును 8.8 శాతానికి పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్‌పై మార్చి నుంచి మూడుసార్లు తన నిర్ణయాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌పై పన్ను విధించాలని బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం..నిరసనల నేపథ్యంలో విరమించుకుంది. ఎంప్లాయిర్ వాటా నిధులను 58 ఏళ్ల తర్వాతే ఉద్యోగి పొందేలాతీసుకున్న నిర్ణయాన్నీ మార్చుకుంది. తాజాగా ఈపీఎఫ్‌పై 8.7 శాతమే వడ్డీ చెల్లిస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.8 శాతం వడ్డీ ఇవ్వడానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారని, తక్షణం దీనిపై నోటిఫికేషన విడుదల చేస్తామని కార్మిక మంత్రి దత్తాత్రేయ తెలిపారు. 2015-16కు పీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించగా ఆర్థిక శాఖ తిరస్కరించడంతో చివరకు 8.7శాతంగా గానే నిర్ణయించారు. దీనిపై కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒత్తిడి పెరగడంతో కేంద్రం నిర్ణయం మార్చుకుంది. ఈపీఎఫ్ఓ ఆదాయంపై తాజా సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. గతేడాది మిగులు నిధుల్ని వాడుకునేందుకు వీలుందని తెలియడంతో వడ్డీ రేటు పెంచారని, పూర్తి గణాంకాల్ని పరిగణనలోకి తీసుకుని ఖాతాదారుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్నాయి తమ శుక్రవారం సమ్మె విజయవంతమైన కార్మిక సంఘాలు చెప్పాయి.