ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: పీఎఫ్ అకౌంట్ నుంచి తరచుగా డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త. తరచుగా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేస్తే.. పదవీవిరమణ సమయంలో భారీగా నష్టపోతారట. సుమారు 35 లక్షల రూపాయల వరకు కోల్పోతారట. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) ప్రకారం కరోనా కాలంలో చాలామంది అభ్యర్థులు తన పీఎఫ్ డబ్బులను భారీగా విత్ డ్రా చేసుకున్నారు. సుమారు 7.1 మిలియన్ల కన్నా ఎక్కువ పీఎఫ్ అకౌంట్లు క్లోస్ అయ్యాయి. దీనిపట్ల ఈపీఎఫ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యవసరం అయితే తప్ప పీఎఫ్ డబ్బులను డ్రా చేయవద్దని సూచిస్తోంది ఈఫీఎఫ్‌ఓ.
కారణం ఏంటంటే ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ అకౌంట్ మీద 8.5 శాతం వడ్డీ వస్తుంది. చిన్నమొత్తాల మీద ఇచ్చే ఇంట్రెస్ట్‌తో పోల్చితే.. ఇదే అత్యధికం. 8.5 ఇంట్రెస్ట్ లభిస్తుండటంతో చాలా మంది జనాలు తమ వాలంటరీ రిటైర్మెంట్ డబ్బులను ఈపీఎఫ్ అకౌంట్‌లోనే పొదుపు చేస్తున్నారు. ఈ ఖాతాలో ఎంత ఎక్కువ పొదుపు చేస్తే.. అంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
ఈ సందర్భంగా ఈపీఎఫ్‌ఓ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏకే శుక్లా మాట్లాడుతూ.. ‘‘మీకు ఇప్పుడు 30 ఏళ్లు ఉన్నాయనుకొండి.. మరో 30 ఏళ్లు ఉద్యోగంలో ఉంటారు. ఈ క్రమంలో మీరు పీఎఫ్ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు విత్ డ్రా చేశారనుకుందాం. అది మీ పదవీవిమరణ సమయంలో లభించే మొత్తం మీద భారీ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మీరు డ్రా చేసే 1 లక్ష రూపాయలు.. ఈపీఎఫ్ కాలుక్యులేటర్ ప్రకారం ఈ మొత్తం పదవీ విమరణ కాలానికి 11.55 లక్షలతో సమానం అన్నమాట. ఈ లెక్కన మీరు పీఎఫ్ ఖాతా నుంచి మధ్యమధ్యలో సుమారు 3 లక్షల రూపాయలు డ్రా చేశారనుకొండి.. ఇది మీ పదవీవిరమణ సమయంలో లభించే మొత్తంలో భారీ కోతకు దారి తీస్తుంది. ఈ లెక్కన పదవీవిరమణ సమయంలో మీరు 35 లక్షల రూపాయల వరకు కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక వీలైనంత తక్కువ సార్లు డ్రా చేస్తే మంచిది’’ అని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment