EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ స్కీమ్. చాలా మంది ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తాన్ని ఇందులో దాచుకుంటారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల తరఫున కొంత మొత్తాన్ని జమ చేస్తాయి.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు డిపాజిట్లకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిపై ఈపీఎఫ్‌వో ఏటా వడ్డీని చెల్లిస్తుంది.
వడ్డీ ఎంతొస్తుందో తెలుసుకోండి..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ప్రకారం.. ఈ ఏడాది జూలై-ఆగస్టు నాటికి అన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. ఈ నేపథ్యంలో మీ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటును ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.. మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష, రూ.3 లక్షలు, రూ.5 లక్షల డిపాజిట్లు ఉంటే ఎంత రాబడి వస్తుందో ఇక్కడ తెలియజేస్తున్నాం..
వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి ఇది 8.25 శాతంగా ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అంటే ప్రస్తుత సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వారి ఖాతాలపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష ఉంటే దానిపై 8.25 శాతం వడ్డీ పొందితే ఏడాదికి మీ వడ్డీ రూ.8,250 అవుతుంది.అదే రూ.3 లక్షలు ఉన్నట్లయితే రూ.24,500 వడ్డీ వస్తుంది. ఒక వేళ రూ.5 లక్షలు ఉంటే మీకు వచ్చే వడ్డీ రూ.41,250 అవుతుంది.
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
⇒ ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
⇒ ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి
⇒ ఈ-పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
⇒ ఇది మిమ్మల్ని మరొక స్క్రీన్‌కు తీసుకువెళుతుంది. ఇక్కడ మీ యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.
⇒ విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, పాస్‌బుక్ కోసం మెంబర్ ఐడీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
⇒ పాస్‌బుక్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో లభిస్తుంది. నిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment