సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. శాసనసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు.. అవంతి శ్రీనివాస్ (భీమిలీ), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (పుట్టపర్తి), జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల) రిటైర్డ్ ఐజీ ఇక్భాల్ (హిందూపురం), రెడ్డి శాంతి (పాతపట్నం), పిరియా సాయిరాజ్ (ఇచ్చాపురం), వి.కళావతి (పాలకొండ), డాక్టర్ సీదిరి అప్పలరాజు (పలాస), తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (రాప్తాడు), వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), పుష్పశ్రీ వాణి (కురుపాం), అంజాద్ బాషా (కడప-అసెంబ్లీ), బుర్రా మధుసూదన్ యాదవ్ (కనిగిరి), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), కొట్టగొల్లి భాగ్యలక్ష్మి (పాడేరు), డాక్టర్ బాబ్జి (పాలకొల్లు), ఆళ్ల రామకృష్ణా రెడ్డి (మంగళగిరి), నంబూరి శంకర్రావు (పెదకూరపాడు) ఏపీ శాసనసభ స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. విజయవాడ లోక్‌సభ స్థానానికి పొట్లూరి వర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment