లక్నో: దేశంలో సాధారణ ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల పర్వంలో పలువురు నేతలు ప్రజలకు వినోదం పంచుతుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఒక నేత నామినేషన్ దాఖలుకు గడువు మించిపోతున్నా ప్రచార కార్యక్రమంలో పాల్గొని చివరి నిమిషంలో పరుగందుకున్నారు.
దాదాపు 100 మీటర్ల దూరం పరుగులు పెట్టి చివరకు గడువు లోపల నామినేషన్ ఫైల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ డేరియా నియోజకవర్గంలో గురువారం జరిగింది. ఇక్కడి బీజేపీ అభ్యర్థి త్రిపాఠి తన నామినేషన్‌కు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య హాజరయ్యారు.
దీంతో ఆ ప్రోగ్రామ్ బిజీలో ఉండిపోయి తన నామినేషన్‌నే రిస్కులో పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే చివరి 15 నిమిషాల్లో ఎలాగోలా పరుగెత్తి నామినేషన్ ఫైల్ చేయగలిగారు. 54 ఏళ్ల త్రిపాఠి తన కాలేజీ రోజుల్లో మంచి రన్నర్‌గా పేరుతెచ్చుకున్నారు. అది ప్రస్తుత ఎన్నికల్లో ఇలా ఆయనకు కలిసి రావడం విశేషం. ‘ఐఐటీలో చదివే రోజుల్లో నేను మంచి రన్నర్‌ను అది ఇప్పుడు నాకు గడువులోపల నామినేషన్ వేసేందుకు కలిసి వచ్చింది’అని త్రిపాఠి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment