
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు విడుదల చేశాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జగరనుంది. తొలి విడతలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో ఉన్న 58 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు పోలింగ్ జరనుంది.