సాక్షి, కరీంనగర్: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేడి మొదలయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు తొలిరోజు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఏడు నామినేషన్లలో మూడు అధికార టీఆర్‌ఎస్ అభ్యర్ధులవే. కోరుట్లలో టీఆర్‌ఎస్ ఆభ్యర్ధిగా కల్వకుంట్ల విద్యాసాగరరావు, ఆయన సతీమణి సరోజినీ దేవి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ధర్మపురిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేయగా మంథనిలో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు తరపున ఆయన సతీమణి పుట్టా శైలజ నామినేషన్ వేశారు. రామగుండంలో బీజేపీ అభ్యర్థిగా బల్మూరి వనిత నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్‌లో బిఎల్ఎఫ్ అభ్యర్థిగా వసీం అహ్మద్ నామినేషన్ వేయగా, జగిత్యాలలో డాక్టర్ సత్యనారాయణ మూర్తి పిరమిడ్ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment