పార్టీలో చేరిన గ్రామస్తులతో టీఆర్‌ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబు
సాక్షి,వేములవాడ: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత నాలుగున్నర ఏళ్ల సుపరిపాలనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న సారు.. కేసీఆర్ సారు.. ఆయన సర్కారు అన్నట్లు ప్రజలు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని టీఆర్‌ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబు అన్నారు. ఈ నెల 7న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ మేరకు శుక్రవారం అర్బన్ మండలంలోని చీర్లవంచ, గుర్రంవానిపల్లి, గ్రామాలతోపాటు తన నివాసంలో చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ప్రతిభ యూత్ సభ్యులు, కోనరావుపేట మండలానికి మర్తనపేట గ్రామానికి చెందిన హమాలీ సంఘం, వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామ అంబేడ్కర్ యూత్‌క్లబ్ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, ముంపు గ్రామాలను ఆదుకునేందుకు పరిశ్రమల స్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారంతా రమేశ్‌బాబు గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment