ఢిల్లీ: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అర్ధరాత్రి వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా, ఆకస్మిక ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.
ఇక, రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ..‘వయనాడ్‌లో విషాదకర ఘటన జరిగింది. వరదల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని నేను సందర్శించాను. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది ఆచూకీ తెలియలేదు. వారి మృతదేహాలు కూడా దొరకలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి.
Wayanad is facing a terrible tragedy, and I urge the Union government to take the following actions:
1. Support a comprehensive rehabilitation package for the affected communities
2. Enhance the compensation for bereaved families
3. Declare the Wayanad landslides a 'National… pic.twitter.com/TFy0IF0ZIU— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2024
వరదల కారణంగా వయనాడ్‌లో కీలక రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి, బాధితులకు పునరావాసాన్ని కల్పించాలి. ప్రకృతి విపత్తు సంక్షోభ సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో వయనాడ్‌లో సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులను ప్రశంసించారు. ఆపదలో అండగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment